హైదరాబాద్: లాసెట్-2014 ప్రవేశ పరీక్ష నేడు జరగనుంది. ప్రశ్నాపత్నం కోడ్ ను ఉన్నత విద్యామండలి చైర్మన్ ఎంపిక చేశారు. మూడేళ్ల లాసెట్ కు యమున ఎస్ -2 ప్రశ్నాపత్రం, ఐదేళ్ల లాసెట్ కు వెంకటాద్రి ఎస్-1 ప్రశ్నాప్రతం ఎంపిక చేసినట్టు ప్రకటించారు.
తిరుపతి, కడప, అనంతపురం, కర్నూలు, హైదరాబాద్, నల్లగొండ, వరంగల్, నిజామాబాద్, నెల్లూరు, గుంటూరు, విజయవాడ, కరీంనగర్, రాజమండ్రి, విశాఖపట్నం, శ్రీకాకుళం పట్టణాల్లో లాసెట్ ప్రవేశ పరీక్ష ఆదివారం ఉదయం 10 నుంచి 11.30 గంటల మధ్య జరుగుతుంది. అలాగే పీజీ లా ప్రవేశ పరీక్ష ఆదివారం మధ్యాహ్నం 2.30 నుంచి సాయంత్రం 4 గంటల మధ్య తిరుపతి, హైదరాబాద్, వరంగల్, విశాఖపట్నంలో నిర్వహించనున్నారు.
లాసెట్ ప్రవేశ పరీక్ష ప్రశ్నాప్రతాల ఎంపిక
Published Sun, Jun 8 2014 8:05 AM | Last Updated on Wed, Sep 5 2018 8:36 PM
Advertisement
Advertisement