సాక్షి, అమరావతి బ్యూరో: పాలిటెక్నిక్ కోర్సుల్లో ప్రవేశాల కోసం ఉద్దేశించిన పాలిసెట్–19 కౌన్సెలింగ్ మే 24 నుంచి మే 29 వరకు జరగనుంది. మే 24న 1 నుంచి 8,000 వరకు, మే 25న 8,001 నుంచి 25,000 వరకు, మే 26న 25,001 నుంచి 45,000 వరకు, మే 27న 45,001 నుంచి 65,000 వరకు, మే 28న 65,001 నుంచి 87,000 వరకు, మే 29న 87,001 నుంచి చివరి ర్యాంక్ వరకు కౌన్సెలింగ్ జరగనుంది. రాష్ట్ర వ్యాప్తంగా 37 కేంద్రాలలో కౌన్సెలింగ్ ప్రక్రియ నిర్వహించనున్నారు.
సర్టిఫికెట్ల వెరిఫికేషన్ కోసం విద్యార్థులు తమ పాలిసెట్ ర్యాంకు కార్డు, పాలిసెట్ హాల్‌టికెట్, 10వ తరగతి హాల్‌టికెట్, 10వ తరగతి మార్కుల లిస్టు(నెట్ కాపి), 4 నుంచి 10వ తరగతి వరకూ స్టడీ సర్టిఫికెట్, నివాస, కుల, ఆదాయ/రేషన్‌కార్డు ధ్రువీకరణ పత్రాలు, ఆధార్ కార్డు (విద్యార్థి, వారి తల్లితండ్రులది)లను తీసుకెళ్లాలి. ఒరిజినల్ సర్టిఫికెట్లతో పాటు రెండు సెట్ల జిరాక్స్‌సెట్లను తీసుకువెళ్లాలి. దివ్యాంగ, స్పోర్ట్స్ అండ్ గేమ్స్, ఎన్‌సీసీ, ఆంగ్లో ఇండియన్స్ విద్యార్థులు వారికి ప్రత్యేకంగా కేటాయించిన మూడు ప్రభుత్వ పాల్‌టెక్నిక్ కళాశాలల్లో మాత్రమే సర్టిఫికెట్ల వెరిఫికేషన్ చేయించుకోవాల్సి ఉంటుంది. విజయవాడ, తిరుపతి, విశాఖపట్నంలోని కేంద్రాలలో ఏదైనా ఒక కేంద్రానికి వెళ్లవచ్చు.
వెబ్ ఆప్షన్ల నమోదు తేదీలు...
అర్హత సాధించిన విద్యార్థులు సర్టిఫికెట్ల వెరిఫికేషన్ తరువాత మే 27, 28 తేదీల్లో 1–45,000 ర్యాంకు వరకూ, మే 29, 30 తేదీల్లో 45,000 నుంచి చివరి ర్యాంకు వరకు వెబ్ ఆప్షన్లు ఇవ్వవచ్చు మే 31 ఆప్షన్లు ఇవ్వటానికి చివరి రోజు, ఆప్షన్లలో మార్పులు కావాలంటే ఆ రోజు చేసుకోవచ్చు. సీట్ల కేటాయింపు జూన్ 2న ఉంటుంది. ఫీజు ఎస్సీ, ఎస్టీ విద్యార్థులకు రూ. 400, బీసీలు, ఓసీలకు రూ.700 గా నిర్ణయించారు. విద్యార్థుల సందేహాల నివృత్తికి ఫోన్‌నెం. 6301112473ను, వెబ్‌సైట్‌లో హెచ్‌టీటీపీఎస్ ఏపీపీఓఎల్‌వైసీఈటి.ఎన్‌ఐసి.ఐఎన్‌లను వినియోగించుకోవచ్చు.
Comments
Please login to add a commentAdd a comment