సాక్షి, హైదరాబాద్: టెన్త్ ఉత్తీర్ణులకు ఇంజనీరింగ్, నాన్–ఇంజనీరింగ్, అగ్రికల్చర్, వెటర్నరీ, హార్టీ కల్చర్ కోర్సుల్లో ప్రవేశానికి నిర్వహించిన పాలిసెట్–2022 ఫలితాలు బుధవారం వెలువడనున్నాయి. సాంకేతిక విద్య కమిషనర్ నవీన్ మిట్టల్ ఫలితాలను ప్రకటిస్తారని స్టేట్ బోర్డ్ ఆఫ్ టెక్నికల్ ఎడ్యుకేషన్, ట్రైనింగ్ విభాగం కార్యదర్శి డాక్టర్‘‘ సి.శ్రీనాథ్ తెలిపారు.
ఉదయం 10.30 ఫలితాలు వెలువడతాయని, వెంటనే ఆన్‌లైన్‌లో అందుబాటులో ఉంచుతామని ఆయన వెల్లడించారు. గత నెల 30న రాష్ట్రవ్యాప్తంగా 365 కేంద్రాల్లో పాలిసెట్ పరీక్ష జరిగింది. మొత్తం 1,13,979 మంది దరఖాస్తు చేసుకోగా, 1,04,432 (91.62 శాతం)మంది పరీక్షకు హాజరయ్యారు. పాలిసెట్ ఫలితాలు ‘సాక్షి’ వెబ్‌సైట్ www. sakshieducation.com లో అందుబాటులో ఉంటాయి. వెబ్‌సైట్‌కు లాగిన అయి, డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.
Comments
Please login to add a commentAdd a comment