సాక్షి,హైదరాబాద్: సంక్షేమ గురుకుల పాఠశాలల్లో ఐదోతరగతి ప్రవేశాల కోసం నిర్వహించిన టీజీసెట్–22 ప్రవేశ పరీక్ష ఫలితాలు విడుదలయ్యాయి. గురుకుల విద్యా సంస్థల పనితీరుపై మంత్రి కొప్పుల ఈశ్వర్ శనివారం తన కార్యాలయంలో సమీక్ష నిర్వహించారు. అనంతరం ఆన్‌లైన్‌లో ప్రవేశ పరీక్ష ఫలితాలను విడుదల చేశారు. ఈ ఫలితాలను టీఎస్‌డబ్ల్యూఆర్‌ఈఐఎస్, టీటీడబ్ల్యూఆర్‌ఈఐఎస్, ఎంజేపీటీబీసీడబ్ల్యూఆర్ ఈఐఎస్, టీఆర్‌ఈఐఎస్ సొసైటీల వెబ్‌సైట్లలో అందుబాటులో ఉంచారు.
ఈ నాలుగు సొసైటీల పరిధిలో ఐదో తరగతికి 48,440 సీట్లు ఉన్నాయి. వీటి భర్తీకి టీజీసెట్–22 నిర్వహించారు. మార్కుల ఆధారంగా అభ్యర్థులకు ప్రాధాన్యత ప్రకారం సీట్లు కేటాయించారు. ఈ పరీక్ష కోసం మొత్తంగా 1,47,324మంది విద్యార్థులు దరఖాస్తు చేసుకుని పరీక్ష రాశారు.
‘సహజ’ఉత్పత్తులను సరఫరా చేయండి
రాష్ట్రంలోని గురుకుల విద్యాసంస్థలు, సంక్షేమహాస్టళ్లకు ‘సహజ’ఉత్పత్తులు సరఫరా చేయాలని కొప్పుల ఈశ్వర్ సూచించారు. జగిత్యాల, పెద్దపల్లి జిల్లాలకు చెందిన స్వయం సహాయకసంఘాలు సంయుక్తంగా ఏర్పాటు చేసిన ‘సహజ’ద్వారా నిత్యావసరాలతోపాటు సబ్బులు, షాంపూలు, తలనూనెలు, కాస్మెటిక్స్‌ను ఉత్పత్తి చేస్తున్నారని వీటిని పరిశీలించి అన్ని గురుకులాలు, హాస్టళ్లకు సరఫరా చేసే అంశాన్ని పరిశీలించాలని సొసైటీ కార్యదర్శులకు ఆదేశించారు.
Comments
Please login to add a commentAdd a comment