హైదరాబాద్:తెలంగాణ పాలీసెట్-2015 కోడ్ ను ఆదివారం ఉదయం మంత్రి కడియ శ్రీహరి విడుదల చేశారు.సచివాలయంలోని తన చాంబర్ లో మంత్రి పాలీసెట్ కోడ్ ను విడుదల చేశారు. ఈరోజు ఉదయం 11 గం.ల నుంచి ఒంటి గంట వరకూ పాలీసెట్ పరీక్ష జరుగనుంది.రాష్ట్ర వ్యాప్తంగా 248 కేంద్రాల్లో లక్షా 200 మంది విద్యార్థులు పాలీసెట్ పరీక్షకు హాజరుకానున్నారు.రాష్ట్రంలోని పాలిటెక్నిక్ కళాశాలల్లోని మొత్తం 60, 920 సీట్లు ఉన్నాయి.
జూన్ 10 వ తేదీన పాలీసెట్ పరీక్షా ఫలితాలను విడుదల చేయనున్నారు. జూలై 8వ తేదీ నుంచి పాలిటెక్నిక్ తరగతులు ఆరంభం కానున్నాయి.