సాక్షి, అమరావతి: రాష్ట్ర సాంకేతిక విద్య శిక్షణ మండలి (ఎస్‌బీటీఈటీ) ఆధ్వర్యంలో ఇంజినీరింగ్ డిప్లొమాలో వివిధ కోర్సుల్లో ప్రవేశం కోసం పాలిటెక్నిక్ ఉమ్మడి ప్రవేశ పరీక్ష (పాలిసెట్–2020) ఆదివారం(27) జరగనుంది. ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు పరీక్ష నిర్వహిస్తున్నట్టు సాంకేతిక విద్యాశాఖ ప్రత్యేక కమిషనర్ ఎం.ఎం నాయక్ శుక్రవారం ఓ ప్రకటనలో తెలిపారు.
► రాష్ట్ర వ్యాప్తంగా 388 కేంద్రాల్లో జరగనున్న ఈ పరీక్షకు 88,484 మంది అభ్యర్థులు హాజరుకానున్నారు. కోవిడ్–19 నిబంధనలను అనుసరించి అన్ని ఏర్పాట్లు పూర్తిచేశారు.
► అభ్యర్థులు హాల్ టికెట్‌తో పాటు పెన్ను, పెన్సిల్ తెచ్చుకోవాలి. తప్పనిసరిగా మాస్క్, గ్లౌజ్ ధరించాలి. శానిటైజర్, వాటర్ బాటిల్ తెచ్చుకోవచ్చు.
► అభ్యర్థుల శరీర ఉష్ణోగ్రతను పరిశీలించాక పరీక్ష కేంద్రాల్లోకి అనుమతిస్తారు.
► కరోనా లక్షణాలుండే విద్యార్థుల కోసం ప్రత్యేక గదిని ఏర్పాటు చేయనున్నారు.
► విద్యార్థి కోవిడ్–19 సెల్ఫ్ డిక్లరేషన్‌ను నింపి సమర్పించాల్సి ఉంటుంది. హాల్ టికెట్, డిక్లరేషన్ ఫారాలను ‘హెచ్‌టీటీపీఎస్//పీఓఎల్‌వైసీఈటీఏపీ.ఎన్‌ఐసీ.ఐఎన్’ ద్వారా డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.
రేపే ఏపీ పాలిసెట్
Published Sat, Sep 26 2020 5:08 AM | Last Updated on Sat, Sep 26 2020 5:08 AM
Advertisement
Comments
Please login to add a commentAdd a comment