
సాక్షి, అమరావతి: ఈనెల 16 నుంచి పాఠశాలలు పునఃప్రారంభం అవుతాయని మంత్రి ఆదిమూలపు సురేష్ తెలిపారు. కోవిడ్ నిబంధనలు పాటించేలా అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నాం అన్నారు. 95శాతం మంది ఉపాధ్యాయులకు వ్యాక్సినేషన్ పూర్తయ్యిందని తెలిపారు. మిగిలిన వారికి కూడా త్వరితగతిన టీకాలు వేయాలని ఆదేశించామని మంత్రి సురేష్ తెలిపారు.