ఆగస్టు 16న పండుగలా కార్యక్రమాలు: మంత్రి సురేష్‌ | Adimulapu Suresh Said CM Jagan Decided To Reopen Schools On August 16th | Sakshi
Sakshi News home page

ఆగస్టు 16న పండుగలా కార్యక్రమాలు: మంత్రి సురేష్‌

Published Fri, Jul 23 2021 2:30 PM | Last Updated on Fri, Jul 23 2021 2:37 PM

Adimulapu Suresh Said CM Jagan Decided To Reopen Schools On August 16th - Sakshi

సాక్షి, అమరావతి: ఆగస్టు 16న స్కూళ్లు పునఃప్రారంభించాలని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి నిర్ణయించారని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్‌ అన్నారు. విద్యాశాఖకు సంబంధించిన నాడు-నేడు కార్యక్రమంపై సీఎం జగన్‌ శుక్రవారం సమీక్ష నిర్వహించారు. సమీక్ష అనంతరం మీడియాతో మంత్రి మాట్లాడుతూ ఆగస్టు 16న పండుగలా అనేక కార్యక్రమాలు నిర్వహిస్తామని వెల్లడించారు.

తొలి విడత నాడు-నేడు కింద 15 వేలకు పైగా స్కూళ్లను తీర్చిదిద్దామని పేర్కొన్నారు. రెండో దశ కింద 16వేల స్కూళ్ల పనులను ప్రారంభిస్తామని, విద్యాకానుక కిట్లు కూడా అందించబోతున్నామని తెలిపారు. ప్రీ ప్రైమరీ నుంచి ప్లస్ టూ వరకు మంచి విద్యావ్యవస్థను తీసుకొస్తున్నామన్నారు. ఆగస్టు 16న నూతన విద్యా విధానంపై సమగ్రంగా వివరిస్తామని పేర్కొన్నారు. చర్లందరికీ వ్యాక్సినేషన్ ప్రక్రియ పూర్తి చేశామని మంత్రి ఆదిమూలపు సురేష్‌ వెల్లడించారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement