ఆగస్ట్‌ 16న స్కూళ్లు పునఃప్రారంభించేందుకు ఏర్పాట్లు: మంత్రి సురేష్‌ | Minister Suresh Said Arrangements Were Being Reopen Schools On August 16th | Sakshi
Sakshi News home page

ఆగస్ట్‌ 16న స్కూళ్లు పునఃప్రారంభించేందుకు ఏర్పాట్లు: మంత్రి సురేష్‌

Published Thu, Jul 29 2021 3:04 PM | Last Updated on Thu, Jul 29 2021 3:07 PM

Minister Suresh Said Arrangements Were Being Reopen Schools On August 16th - Sakshi

సాక్షి, అమరావతి: ఆగస్ట్‌ 16న స్కూళ్లు ప్రారంభించేందుకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నామని.. అదే రోజు జగనన్న విద్యాకానుక ఇస్తామని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్‌ వెల్లడించారు. గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ, విద్యాకానుకలో ఈసారి డిక్షనరీ కూడా ఇస్తున్నామన్నారు. 15వేల స్కూళ్లను నాడు-నేడు కింద అభివృద్ధి చేశామని పేర్కొన్నారు. మొదటి దశ నాడు-నేడును ప్రజలకు అంకితం చేస్తామన్నారు. అదే రోజు రెండో విడత నాడు-నేడు పనులను కూడా ప్రారంభిస్తామన్నారు. ఈలోపు టీచర్లందరికీ వ్యాక్సినేషన్ పూర్తిచేస్తామని మంత్రి సురేష్‌ పేర్కొన్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement