సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో అన్ని యాజమాన్యాల్లోని పాఠశాలలు వేసవి సెలవుల అనంతరం జూలై 5వ తేదీ నుంచి పునః ప్రారంభంకాను న్నాయి. పాఠశాలలను జూలై 4 నుంచి ప్రారంభించాలని పాఠశాల విద్యాశాఖ ఇంతకు ముందు ఉత్తర్వులు జారీచేసింది.
అయితే ప్రధాని మోదీ జూలై 4న రాష్ట్రంలో వివిధ కార్యక్రమాల్లో పాల్గొనడానికి వస్తున్నారు. ప్రధాని పర్యటనలో సీఎం వైఎస్ జగన్ కూడా పాల్గొంటున్నందున పాఠశాలల పునః ప్రారంభాన్ని మరుసటి రోజుకు వాయిదా వేశారు.
పాఠశాలల ప్రారంభం రోజున జగనన్న విద్యా కానుకను సీఎం విద్యార్థులకు అందించనున్నారని, అందుకను గుణంగా స్కూళ్లను 5వ తేదీ నుంచి ప్రారంభించనున్నామని పాఠశాల విద్యాశాఖ కమిషనర్ సురేష్‌కుమార్ తెలిపారు. (క్లిక్: పేదల చదువుకు చంద్రబాబే అడ్డంకి)
Comments
Please login to add a commentAdd a comment