Summer holidays
-
Mann Ki Baat: వేసవి సెలవులు.. నీటి సంరక్షణపై ప్రధాని మోదీ సందేశం
న్యూఢిల్లీ: ప్రధాని మోదీ ఈరోజు(ఆదివారం) ‘మన్ కీ బాత్’(Mann Ki Baat) 120వ ఎపిసోడ్లో ప్రజలతో వివిధ అంశాలపై సంభాషించారు.‘ఈ రోజు నుంచి చైత్ర నవరాత్రులు ప్రారంభమవుతున్నాయి. భారతీయ నూతన సంవత్సరం కూడా ఈ రోజే మొదలువుతుంది. ఈ రోజు మొదలుకొని రాబోయే కొద్ది రోజుల్లో మన దేశంలోని వివిధ రాష్ట్రాల్లో పలు ఉత్సవాలు జరగనున్నాయి. ఈ పండుగల సందర్భంగా దేశ ప్రజలకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను’ అని ప్రధాని మోదీ పేర్కొన్నారు.వేసవి సెలవులు సద్వినియోగం చేసుకోండి‘పరీక్షల సమయంలో వాటి గురించి చర్చించాను. త్వరలో వేసవి సెలవులు రాబోతున్నాయి. పిల్లలు వాటి కోసం వేచి చూస్తున్నారు. కొత్త అభిరుచులను మెరుగుపరుచుకునేందుకు తగిన సమయం ఇది. వేసవి సెలవుల కోసం రూపొందించిన ‘మై క్యాలెండర్’చిన్నారులకు ఎంతగానో ఉపకరిస్తుంది. అంబేద్కర్ జయంతి నాడు జరిగే పాదయాత్రలో పాల్గొనడం ద్వారా, మీరంతా రాజ్యాంగ విలువల గురించిన సమాచారాన్ని అందరికీ తెలియజేయగలుగుతారు’ అని మోదీ పేర్కొన్నారునీటిని పొదుపుగా వాడండి‘నీటి పొదుపు ప్రచారం వేసవి కాలంలోనే ముమ్మరంగా జరుగుతుంది. మనకు లభించిన సహజ వనరులను తదుపరి తరానికి అందించడం మన బాధ్యత. దేశంలో గత ఏడెనిమిదేళ్లలో కొత్తగా నిర్మించిన ట్యాంకులు, చెరువులు, ఇతర నీటి నిల్వల నిర్మాణాల ద్వారా నీటిని సంరక్షించారు. ఈ విషయంలో అందరూ ఇప్పటి నుండే ఒక ప్రణాళికను రూపొందించుకోవాలి. మీ ఇంటి ముందు ఒక కుండలో చల్లటి నీటిని అందరికీ అందుబాటులో ఉంచండి’ అని ప్రధాని మోదీ అభ్యర్థించారు.ప్రతిభచాటిన పారా గేమ్స్ ఆటగాళ్లు ఇటీవల ముగిసిన ఖేలో ఇండియా పారా గేమ్స్(Khelo India Para Games)లో ఆటగాళ్లు తమ ప్రతిభతో అందరినీ ఆశ్చర్యపరిచారు. ఈసారి ఎక్కువ మంది ఆటగాళ్లు పాల్గొన్నారు. వారిని అభినందిస్తున్నాను. దివ్యాంగ క్రీడాకారులు 18 జాతీయ రికార్డులను కూడా సృష్టించారు. మన దేశీయ ఆటలు ఇప్పుడు ప్రాచుర్యం పొందుతున్నాయి. ఢిల్లీలో జరిగిన ఫిట్ ఇండియా కార్నివాల్లో వివిధ ప్రాంతాల నుండి సుమారు 25 వేల మంది పాల్గొన్నారు. వారందరి లక్ష్యం ఒక్కటే ‘ఫిట్‌గా ఉండటం.. ఫిట్నెస్ గురించి అందరికీ అవగాహన కల్పించడం’ అని ప్రధాని పేర్కొన్నారు.సవాల్‌గా మారిన వస్త్ర వ్యర్థాలుదేశంలో వస్త్ర వ్యర్థాలు కొత్త సవాలుగా మారాయి. మనం పాత దుస్తులను పారవేసినప్పుడు వాటిలో ఒక శాతం మాత్రమే రీసైకిల్ అవుతుంది. ప్రపంచంలో అత్యధిక వస్త్ర వ్యర్థాలు ఉత్పత్తి అయ్యే మూడవ దేశం భారత్.ఈ సవాలును ఎదుర్కొనేందుకు పలు ప్రయత్నాలు జరుగుతున్నాయి. వివిధ స్టార్టప్‌లు పాత బట్టలు, బూట్లు, చెప్పులను రీసైక్లింగ్ చేసి ఉపయోగకరంగా మారుస్తున్నాయని ప్రధాని తెలిపారు.యోగా దినోత్సవానికి ఏర్పాట్లుయోగా దినోత్సవానికి ఇక కొద్ది రోజులు మాత్రమే ఉంది. యోగాను జీవితంలో భాగంగా చేసుకోవాలి. ప్రపంచ మానవాళికి భారత్ ఇచ్చిన బహుమతి యోగా. ఇది భవిష్యత్ తరానికి ఉపయోగపడుతుంది. యోగా సాయంతో ప్రపంచాన్ని ఆరోగ్యవంతంగా తీర్చిదిద్దేందుకు ప్రయత్నిద్దాం. నేడు పెద్ద సంఖ్యలో యువత యోగాను అభ్యసిస్తున్నారు. అలాగే ఆయుర్వేదాన్ని కూడా ఆశ్రయిస్తున్నారని ప్రధాని పేర్కొన్నారు. ఇది కూడా చదవండి: పుతిన్ కారులో భారీ పేలుడు.. జెలెన్స్కీ భవిష్యవాణి నిజమేనా? -
బడిగంట మోగింది
సాక్షి, సిటీబ్యూరో: కొత్త విద్యా సంవత్సరం ఆరంభమైంది. వేసవి సెలవుల అనంతరం పాఠశాలలు తెరుచుకున్నాయి. బడి గంటలు గణగణ మోగాయి. ఇంటివద్ద ఆటపాటలతో సరదాగా గడిపిన పిల్లలు మళ్లీ బడిబాట పట్టారు. బుధవారం ఉదయం నుంచే రోడ్లపై సందడి కనిపించింది. విద్యాసంస్థలు గల ప్రాంతాల్లో వాహనాల రాకపోకలు ఆగుతూ, సాగుతూ ముందుకు సాగాయి. తొలి రోజు కావడంతో తల్లిదండ్రులు తమ పిల్లలను స్కూల్ వరకు దిగబెట్టారు.సర్కారు బడుల బలోపేతానికి కృషిపేద పిల్లలకు నాణ్యమైన విద్యను అందించేందుకు డీఎస్సీ ద్వారా ఉపాధ్యాయుల పోస్టులను భర్తీ చేసి ప్రభుత్వ పాఠశాలలను బలోపేతం చేస్తామని జిల్లా ఇన్చార్జి మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. బుధవారం పాఠశాలల పునః ప్రారంభం సందర్భంగా ఆలియా ప్రభుత్వ మోడల్ పాఠశాలలో జరిగిన కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని విద్యార్థులకు పాఠ్య పుస్తకాలు, యూనిఫాంలను అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తమ ప్రభుత్వం విద్యకు అత్యంత ప్రాధాన్యమిస్తోందన్నారు. కార్యక్రమంలో గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్, అదనపు కలెక్టర్ పాటిల్ హేమంత్ కేశవ్, డిప్యూటీ మేయర్ మోతే శ్రీలతా శోభన్ రెడ్డి, గన్‌ఫౌండ్రి కార్పొరేటర్ సురేఖ ఓం ప్రకాష్, డీఈఓ రోహిణి, ఆర్డీఓ మహిపాల్, డిప్యూటీ డీఈఓ వెంకటేశ్వర్లు, ప్రధానోపాధ్యాయుడు డాక్టర్ విశ్వనాథం గుప్తా పాల్గొన్నారు. -
మోగనున్న బడిగంట.. నేటి నుంచి పాఠశాలల పునఃప్రారంభం
సాక్షి, అమరావతి: వేసవి సెలవుల అనంతరం రాష్ట్రంలోని పాఠశాలలు గురువారం తెరుచుకోనున్నాయి. దీంతో 2024–25 విద్యా సంవత్సరం ప్రారంభం కానుంది. రాష్ట్రంలో మొత్తం 62,023 పాఠశాలలు ఉండగా.. వీటిలో ప్రభుత్వ యాజమాన్యంలో 44,954 పాఠశాలలు, ప్రైవేటు యాజమాన్యంలో 15,784, ఎయిడెడ్‌లో మరో 1,225 పాఠశాలలు ఉన్నాయి. కేంద్ర ప్రభుత్వ ఆదీనంలో మరో 60 పాఠశాలలు ఉన్నాయి. కేంద్ర పాఠశాలలు మినహా మిగిలినవి నేడు (గురువారం) ప్రారంభమవుతాయి. ఇక కేంద్రీయ విద్యాలయాలు ఈ నెల 21న, నవోదయ విద్యాలయాలు 30న ప్రారంభం కానున్నాయి. వాస్తవానికి బుధవారమే బడులు తెరుచుకోవాల్సి ఉండగా.. చంద్రబాబు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తుండటంతో పాఠశాలల పునఃప్రారంభం షెడ్యూల్‌ను అధికారులు గురువారానికి మార్చారు. బడులు ప్రారంభమవుతున్న నేపథ్యంలో విద్యార్థులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా జాగ్రత్తలు తీసుకోవాలని ఉన్నతాధికారులు ఆదేశాలు జారీ చేశారు. టాయిలెట్లను పరిశుభ్రంగా ఉంచడంతో పాటు పీఎం–పోషణ్ గోరుముద్ద (మధ్యాహ్న భోజనం)ను సైతం అదే రోజు విద్యార్థులకు అందించాలన్నారు. ప్రస్తుతానికి గతేడాది వరకు అనుసరించిన విధానంలోనే విద్యార్థులకు భోజనం అందించనున్నారు. కొత్త విద్యాశాఖ మంత్రి బాధ్యతలు తీసుకున్నాక తదుపరి చర్యలు చేపట్టాలని అధికారులు యోచిస్తున్నారు. కాగా, ఇప్పటికే ప్రైవేటు పాఠశాలల్లో ప్రవేశాలు పూర్తవగా, ప్రభుత్వ పాఠశాలల్లో కొనసాగుతున్నాయి.20 తర్వాతే విద్యార్థులకు పుస్తకాలు, కిట్లు రాష్ట్రంలోని ప్రభుత్వ, ఎయిడెడ్ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థులకు గత విద్యా సంవత్సరం వరకు పాఠ్యపుస్తకాలు, నోటు పుస్తకాలతో పాటు విద్యా కానుక కిట్లను పాఠశాల తెరిచిన మొదటిరోజే అందజేశారు. ప్రతి విద్యార్థికి ఉచితంగా ద్విభాషా పాఠ్య పుస్తకాలు (ఇంగ్లిష్ –తెలుగు) నోట్ బుక్స్, వర్క్ బుక్స్, కుట్టు కూలితో 3 జతల యూనిఫామ్ క్లాత్, జత బూట్లు, రెండు జతల సాక్సులు, బెల్టు, స్కూలు బ్యాగుతో పాటు ఆరో తరగతి విద్యార్థులకు ఆక్స్ఫర్డ్ ఇంగ్లిష్–తెలుగు డిక్షనరీ, ఒకటో తరగతి పిల్లలకు పిక్టోరియల్ డిక్షనరీతో కూడిన కిట్‌ను ఇచ్చేవారు. 2024–25 విద్యా సంవత్సరానికి కూడా 36 లక్షల మంది విద్యార్థులకు గతేడాది మాదిరిగానే రూ.1,042.53 కోట్ల ఖర్చుతో స్టూడెంట్ కిట్లను అందించేందుకు అధికారులు ఏర్పాట్లు చేశారు. అయితే, సరఫరాదార్ల నుంచి పూర్తిస్థాయిలో వస్తువులు స్టాక్ పాయింట్లకు చేరలేదు. దీంతో వీటిని ఈనెల 20 తర్వాతే విద్యార్థులకు అందించే అవకాశం ఉంది. కాగా, ఏటా విద్యా సంవత్సరం ప్రారంభానికి ముందు నూతన విద్యా సంవత్సరం కేలండర్‌ను పాఠశాల విద్యాశాఖ ప్రకటించేది. అయితే, ఈసారి 1,000 ప్రభుత్వ సీబీఎస్ఈ స్కూళ్లు కూడా ఉండడంతో ఈ విద్యార్థులకు ఇబ్బంది లేకుండా సీబీఎస్ఈ అధికారులతో కలిసి రాష్ట్ర విద్యా పరిశోధన, శిక్షణ మండలి (ఎస్సీఈఆర్టీ) అధికారులు నూతన కేలండర్‌ను రూపొందిస్తున్నారు. దీంతో మరో వారం రోజుల్లో విద్యా కేలండర్పై స్పష్టత వచ్చే అవకాశం ఉంది. -
'సెలవులు'! ఒక మరపురాని జ్ఞాపకంగా రీచార్జ్‌గా చేసుకోండిలా..!
వేసవి అంటే వేడి.. ఉక్కపోత.. పచ్చళ్లు.. అప్పడాలు, వడియాలు, మల్లెపూలు, మామిడిపళ్లు! కానీ తూనీగల్లాంటి పిల్లలకు మాత్రం వేసవంటే అచ్చంగా సెలవులడ్లు.. స్కూలు, హోమ్‌వర్క్, క్రమశిక్షణ నుంచి కొంతకాలం ఆటవిడుపు. ఇంతకాలం వారంలో వచ్చే ఒక ఆదివారం లేదా రెండవ శనివారంతో కలసి వచ్చే రెండురోజుల సెలవులతో సరిపెట్టుకున్న పిల్లలకు దాదాపు నలభై అయిదు రోజుల సెలవులు ఎంత సంబరం కలిగించే విషయమో కదా!. సెలవల్ని చక్కగా ప్లాన్ చేసుకుంటే ఎండా తప్పించుకోవచ్చు. మన విలువైన సెలవుల కాలాన్ని సద్వినియోగమూ చేసుకోవచ్చు. అందుకే ఈ సెలవుల్ని మరుసటి ఏడాదికి ఒక మరపురాని జ్ఞాపకంగా, మళ్లీ రొటీన్లో పడేందుకు ఒక రీచార్జ్‌గా ఎలా వినియోగించుకోవాలో తెలుసుకుందాం.సుమారు ఇరవై ముప్పై ఏళ్ల కిందటి వరకు ‘వేసవి సెలవులు’ ఎంత గొప్పగా ఉండేవనీ! పిల్లలూ పెద్దలూ కూడా వేయికళ్లతో ఎదురు చూసేలా ఉండేవి. ఎండాకాలం సెలవుల్లో గ్రామీణ ప్రాంతం వారు పట్టణాలకు, పట్టణాల వారు గ్రామీణ ప్రాంతాల్లో ఉండే అమ్మమ్మ, నాయనమ్మలు ఇతర బంధువుల ఇళ్లకు వెళ్లేవారు. ఇందులో భాగంగా రకరకాల శుభకార్యాలలో ఉత్సాహంగా పాల్గొనేవారు. ఒక ప్రాంతంలోని వారు మరో ప్రాంతానికి వెళ్లడం ద్వారా ఆయా ప్రాంతాల పద్ధతులు, అలవాట్లు, సంస్కృతీ సంప్రదాయాలను తెలుసుకునే వీలుంటుంది. దాని ద్వారా పిల్లల్లో అనుభవ జ్ఞానం కలుగుతుంది. వీటన్నింటినీ ఆనాటి పిల్లలు ఎటువంటి నిర్బంధమూ లేని స్వేచ్ఛాపూరితమైన వాతావరణంలో హాయిగా ఆస్వాదించేవారు. ఆటపాటల విషయంలో కూడా నాటి వేసవి సెలవుల తీరే వేరు. ఊరి చివరి చెరువులు, బావుల్లో ఈత కొట్టడం, కోతికొమ్మచ్చి ఆడటం, సీమ చింతకాయలు, బాదం కాయలు ఏరుకుని తినడం, మామిడి తోటలలో చెట్లకు కాసిన కాయలకు రాళ్లేసి కొట్టడం, రాలిన కాయలను కోసుకుని ఉప్పూకారం అద్దుకుని తినడం, తాటిముంజెలను జుర్రడం, ఆనక ఆ తాటిబుర్రలను బండిలా తయారు చేసుకుని ఈడ్చుకుంటూ వీధుల వెంబడి తిర గడం.. ఇవిగాక ఆరుబయట కబడ్డీ, క్రికెట్, నేలా బండాలాంటి ఆటలు హాయిగా ఆడుకోవడం. వీటన్నింటి వల్లా మానసిక ఉల్లాసంతో పాటు చక్కటి శారీరక వ్యాయామమూ లభించేది. దాంతో కరకరలాడే ఆకలి పుట్టి, చద్దన్నాలనీ, చింతకాయపచ్చళ్లనీ చూడకుండా పెద్దవాళ్లు పెట్టినదంతా వద్దనకుండా కడుపునిండా తిని సెలవులు అయిపోయి తిరిగి స్కూళ్లు, కాలేజీలు తెరిచేసరికి నిగనిగలాడుతూ నున్నగా తయారయేవాళ్లు. ఆటలేగాక ఆయా కాలాలలో లభించే మామిడి, పనస, ఈత, జామ వంటి పళ్లు స్వయంగా సేకరించుకుని అందరూ కలసి కాకెంగిలి చేసుకుని కబుర్లు చెప్పుకుంటూ తినడంలో కూడా చెప్పలేని అనుభూతి, ఆనంద ఆరోగ్యాలు సొంతమయ్యేవి.ఇక రాత్రివేళ ఆరుబయట అందరూ కూర్చుని రోజంతా చేసిన అల్లరిపనులు నెమరువేసుకుంటూ కలసి అన్నాలు తినడం, ఆ తరువాత డాబాల మీదనో ఆరు బయట మంచాల మీదో పిల్లలంతా కబుర్లాడుకోవడంతో పాటు తాతయ్యలు, మావయ్యలు, అత్తయ్యలు, అమ్మమ్మ నాన్నమ్మలు చెప్పే కథలు వింటూ నిద్రపోయేవారు. నాటి పిల్లలు భేదాభిప్రాయాలు, అరమరికలూ లేకుండా కలసిమెలసి ఉండేవారు. ఒకవేళ ఏమన్నా చిన్నా చితకా తేడాలు, మాట పట్టింపుల్లాంటివి వచ్చినా పెద్దలు వెంటనే బుజ్జగించి బుద్ధి చెప్పేవారు. ఆచరణతో జీవించే నాటి తరం పెద్దలంటే పిల్లలకు భయంతో కూడిన గౌరవం ఉండేది. ఒక చక్కని దృక్పథంతో భయభక్తులతో ‘పరిధులు గల స్వేచ్ఛ’తో పరమానంద భరితమైన బాల్యం అనుభవించేవారు ఆనాటి పిల్లలు. ఒక్క మాటలో చెప్పాలంటే నాటి వేసవి సెలవులు కేవలం ‘ఆటవిడుపు వినోదాలకే’ కాకుండా విలువైన నైతిక భావాలు నింపే రోజులుగా కూడా చెప్పవచ్చు. మరి ఇప్పుడు..?ఇప్పుడు నానమ్మలు, అమ్మమ్మలు, ఇతర పెద్దలూ దాదాపు కనిపించడం లేదు. అన్నిచోట్లా దాదాపు న్యూక్లియర్ కుటుంబాలే! పిల్లలకు సుద్దులు చెప్పవలసిన తాతలూ, బామ్మలూ వంటి పెద్దలు వృద్ధాశ్రమాలలో మూలుగుతున్నారు. ఈ పరిస్థితులలో వాళ్లకు కథలూ కాకరకాయలూ చెప్పేవారే ఉండరు కాబట్టి, కనీసం వాళ్లు ఆడియో కథలైనా వినేలా ఏర్పాటు చేయాలి. ఎందుకంటే కథలు చక్కటి ఊహాకల్పనకు, తద్వారా సృజనకు ప్రాణం పోస్తాయి. ఎందుకూ పనికిరారనుకున్న రాజుగారి కుమారులు విష్ణుశర్మ చెప్పిన పంచతంత్ర కథల ద్వారానే ప్రయోజకులయ్యారని మనం చదువుకున్నాం. అందువల్ల వీలయినంత వరకు ఏదో ఒకలా వారి చేత పుస్తకాలు చదివించడం లేదా కథలు వినేలా చేయడం మంచిది. పిల్లలూ.. ఊరికెళుతున్నారా? వేసవైతే పల్లెకు వెళ్తుంటారు చాలామంది. సాధారణంగా పల్లెటూరి వాతావరణానికి, పట్నాలు, నగరాల వాతావరణం, జీవనశైలికీ చాలా తేడా ఉంటుంది. పట్టణాలూ, నగరాలూ రాత్రిళ్లు ఆలస్యంగా నిద్రపోయి, ఆలస్యంగానే నిద్ర లేస్తుంటాయి. గ్రామీణ వాతావరణం మాత్రం అందుకు విరుద్ధం. రాత్రిపూట తొందరగా పడుకుని, తెల్లవారు ఝాముకల్లా నిద్రలేచి.. పొలం పనులు, ఇంటిపనులు చేసుకుంటారు. మీరు పల్లెటూళ్లకు వెళితే అక్కడా బద్ధకంగా బారెడు పొద్దెక్కాక లేవద్దు. వీలయినంత తొందరగా నిద్రలేవండి. పొలం పనులకు పెద్దలు వెళ్తుంటారు కదా. వారితోబాటు మీరూ వెళ్లండి. వాళ్లు చేసే పనులు శ్రద్ధగా చూడండి. దుక్కి దున్నడం, పొలాలకు నీళ్లు పట్టడం, కలుపు తీయడం, ఇలా అన్ని పనులనూ గమనించండి. మీరు వెళ్లే దారిలో ఏయే పంటలున్నాయో, మొక్కలున్నాయో, చెట్లున్నాయో.. ఏ పంటకు ఎంతకాలం పడుతుందో, ఏ మొక్కకు ఏయే పూలూ, పండ్లు వస్తాయో తెలుసుకోండి.చెట్ల ఆకులను, కొమ్మలను పరిశీలించండి. వాటి పై ఏయే పక్షులున్నాయో చూడండి. వాటి కూతలను అనుకరించండి. మీరు చూసిన వాటి వివరాలన్నీ ఇంటికొచ్చాక ఒక డైరీలోనో, నోట్బుక్లోనో రాయండి. పక్షి రెక్కలెలా ఉన్నాయో, ఏయే రంగులలో ఉన్నాయో రాసుకోండి, వీలయితే వాటి బొమ్మలనూ వేయండి. చెట్ల పేర్లు, వాటి ఆకుల ఆకారం, వాటి సైజు వివరంగా రాయండి.ఇంట్లో పనులను, వంట చేసే పద్ధతిని గమనించండి. మీ సందేహాలను పెద్దవాళ్లనడిగి తీర్చుకోండి. ఆ వివరాలన్నీ నోట్ చేసుకోండి. పెద్దల సమక్షంలో ఆ పనులన్నింటినీ ప్రయత్నించండి. అన్నం తిన్న తరువాత కాసేపు పడుకుని సాయంత్రం బయటికెళ్లి కొత్త స్నేహాలను కలుపుకోండి. కొత్త కొత్త ఆటలను నేర్చుకోండి. అమ్మమ్మ, నానమ్మ, తాతయ్య, అత్తమామల చేత కథలు చెప్పించుకుని వినండి. పాటలు పాడే వాళ్ళను పాడమనండి. వాటన్నింటినీ నేర్చుకోండి. అన్నీ పుస్తకంలోకి ఎక్కించడం మాత్రం మరవకండి. మిగిలిన సమయాల్లో దొరికిన పుస్తకమల్లా చదవండి. మీ తోటివాళ్లతో మీరు చూసిన సినిమా, ఊళ్ళ విశేషాలను పంచుకోండి. వాళ్ళ విషయాలనూ అడిగి తెలుసుకోండి. దూరంగా ఉన్న స్నేహితులకి ఈ విషయాలతో ఉత్తరాలు రాయండి. మీరు చదివిన, విన్న కథలను, అలాగే సినిమాలనూ ఇతరులకు చెప్పండి. సొంత భాషలో వాటిని తిరిగి రాయండి. అలా చేస్తే మీరు విన్న, కన్న విషయాలను బాగా అర్థం చేసుకోగలుగుతారు. అలాగే సూటిగా స్పష్టంగా, క్లుప్తంగా విషయాలను చెప్పడం అలవడు తుంది. భాష, భావప్రకటనల మీద పట్టు వస్తుంది. ఆసక్తి, తెలుసుకోవాలి, నేర్చుకోవాలనే తపన పెరుగుతుంది. బొమ్మలు వేయగలిగిన వాళ్ళు.. సెలవుల్లో చూసిన విశేషాలను బొమ్మలుగా వేయండి, కథలు రాయండి.పెద్దలూ.. ఇలా చేయండి!బోధనా మాధ్యమాలు మాతృభాషేతరం కావడం వల్ల పిల్లలు వ్యక్తిత్వ వికాసానికి అవసరమైన ‘అమ్మ భాషలోని బాల సాహిత్య’ సొగసులను ప్రత్యక్షంగా అందుకోలేక ఎంతో నష్టపోతున్నారు. విలువైన చదువులు విద్యార్థులకు సార్థకత చేకూర్చాలంటే చదువు అనే ప్రధాన పంటలో అంతర్గత పంటగా ఉండాల్సిన ‘నైతిక విద్యా విలువలు’ భావిపౌరులకు అత్యవసరంగా అందించాలి. అందులో ప్రధానం పుస్తక పఠనం. దాన్ని అలవర్చడానికి వేసవి సెలవులను మించిన వేదిక లేదు. అందుకే పెద్ద పెద్ద వాళ్ల ఆత్మకథలు, నీతి కథలు వంటివి పిల్లల చేత చదివించండి. వాళ్లు ఏం అర్థం చేసుకున్నారో సమీక్షలు రాయమనండి. లేదంటే వినిపించమనండి. అలా వినిపిస్తున్నప్పుడు వాటిని రికార్డ్ చేసి ఒక పాడ్‌కాస్ట్ చానెల్‌ను క్రియేట్ చేయండి. మీ కుటుంబ సభ్యులు, స్నేహితులు ఉన్న వాట్సాప్ గ్రూప్స్‌లో షేర్ చేయండి. తద్వారా వచ్చిన ప్రశంసలు పిల్లల్లో కొత్త ఆసక్తిని, ఉత్సాహాన్ని నింపుతాయి. వాళ్ల ఆలోచనా శక్తి, ఊహాశక్తి మెరుగవుతుంది. సైన్స్ మీద ఆసక్తి ఉన్న పిల్లల చేత సైన్స్ ప్రయోగాలు చేయించండి. తెలుగు, ఇంగ్లిష్ భాషల పదసంపదను పెంచుకునేలా వాళ్ల చేత పజిళ్లు నింపించండి. తార్కిక జ్ఞానం కోసం సుడోకు లాంటివి పూర్తి చేయించండి. పర్యావరణ స్పృహ కోసం వాళ్లు ప్రకృతికి దగ్గరగా ఉండేలా చూడండి. జంతువులతో పక్షులతో సమయాన్ని గడిపేలా ప్లాన్ చేయండి. టెర్రస్ మీద లేదా పెరట్లో కూరగాయలు, ఆకుకూరలు, పూలమొక్కల పెంపకం వంటి విషయాల్లో మెలకువలు నేర్పించండి. అలాగే పిల్లల్లో సృజనాత్మకతను వెలికితీసే సమయం వేసవి సెలవులే! సంగీతం, డాన్స్, పెయింటింగ్, డ్రాయింగ్ నేర్పించడం, కుట్లు, అల్లికలు, కాగితాలతో బొమ్మల తయారీ(ఓరిగామి), ఎండిన ఆకులు, క్లాత్‌తో బొమ్మలు చేయించండి. వీటివల్ల పిల్లల్లో సృజనతోపాటు మానసిక వికాసం కలుగుతుంది.ప్రాక్టికల్‌గా జీవించడంజీవితంలో ఎదగడానికి చదువు ఒక ఆసరా మాత్రమే! దాంతోపాటు తెలుసుకోవలసిన ప్రాక్టికల్ పాఠాలు చాలా ఉంటాయి. 13 ఏళ్లు నిండిన పిల్లలు తమ చుట్టూ జరుగుతున్న అనేక విషయాలను తెలుసుకునేందుకు అర్హులు అవుతారు. ముఖ్యంగా ఆర్థిక విషయాల గురించి వాళ్లకు చెప్పవచ్చు. జీవితాన్ని బ్యాలెన్స్ చేసుకోవడానికి ఆర్థిక క్రమశిక్షణ ఎంత అవసరమో చెప్పాలి. డబ్బు విలువ, పొదుపు అవసరాల గురించి తెలియజేయాలి. ఆర్థిక లావాదేవీలను ఆధునిక టెక్నాలజీ ఎంత మేడ్ ఈజీ చేసినా బ్యాంకు, దాని పనితీరు గురించి పిల్లలకు ప్రాక్టికల్‌గా చూపించాలి. అందుకే బ్యాంకుకు వెళ్లేటప్పుడు పిల్లలనూ తీసుకెళ్లాలి. అక్కడ డబ్బు ఎలా డిపాజిట్ చేస్తారు, ఎలా విత్ డ్రా చేస్తారు. చెక్ బుక్ అంటే ఏంటి, డీడీ ఎలా తీస్తారు.. వంటి ప్రాథమికాంశాలను చూపించాలి. పిల్లల పేరిట ఇచ్చే బ్యాంక్ అకౌంట్స్ వివరాలను తెలుసుకుని వాటిని ఓపెన్ చేయించి, ఎలా ఆపరేట్ చేయాలో నేర్పిస్తే మంచిది. పోస్ట్ ఆఫీస్ సేవింగ్స్‌బ్యాంక్ తర్వాత తిరిగి ఆ స్థాయిలో సేవలు అందిస్తున్నది పోస్టాఫీసులే! కాబట్టి పిల్లలను పోస్టాఫీసుకూ తీసుకువెళ్లి అక్కడి పని విధానంపైనా అవగాహన కలిగించాలి. అలాగే పోస్టాఫీసులో ఉండే పొదుపు పథకాల గురించి తెలియజెబుతూ వారికి అక్కడ పొదుపు ఖాతా తెరిచి, వారంతట వారే తమ పాకెట్ మనీని తమ ఖాతాలో జమ చేసుకునేలా చేయాలి.అన్ని పనులూ.. అందరికీఇంకో విషయం.. పిల్లలకు ఆడ, మగ తేడా లేకుండా అందరికీ ఇంటి పని, వంటపని నేర్పించవలసిన బాధ్యత తల్లిదండ్రులదే! వారిని గారాబం చేయడంతోపాటు పనులపై అవగాహన కూడా కలిగించడం అవసరం. తద్వారా భవిష్యత్తులో ఎక్కడికి వెళ్లినా ఏ పని కోసమూ ఎవరిమీదా ఆధారపడకుండా స్వతంత్రంగా చేసుకోగలుగుతారు. దానివల్ల వారిలో ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. ఆటవిడుపుపిల్లలు ఎంత ఆడుకుంటే అంత ఉల్లాసం కలుగుతుంది. అందుకే వారిని బాగా ఆడుకునేలా చేయాలి. ఇండోర్ గేమ్స్ ద్వారా కేవలం మాన సికోల్లాసమే కలిగితే, ఔట్‌డోర్ గేమ్స్ వల్ల శారీరక ఉల్లాసం కూడా చేకూరుతుంది. ఆటలాడిన పిల్లలు మంచి తిండి తిని బలంగా తయారవుతారు. శారీరక బలం వల్ల వారిలో ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. చెట్టుకు చెంబుడు నీళ్లు.. పిట్టకు చారెడు గింజలుపిల్లలకు భూతదయ అంటే ఏమిటో తెలియజెప్పాలి. ఎండుతున్న చెట్లకు కాసిని నీళ్లు పోయడం, ఆహారం, నీళ్లు సంపాదించుకునే ఓపిక లేక రెక్కలు వేలాడేసి ప్రాణాలు కోల్పోయే అల్ప జీవుల కోసం కాసిని గింజలూ, నీళ్లూ అందించేలా అలవాటు చేయడం వల్ల వారిలో హెల్పింగ్ నేచర్ పెరుగుతుంది. ఫ్యామిలీ బడ్జెట్‌పై అవగాహనపిల్లలకు కుటుంబ ఖర్చుల విషయం తెలియడం ఇష్టపడరు చాలామంది తల్లిదండ్రులు. ఆర్థికంగా తమకు ఎంత కష్టం ఉన్నా, దానిని పిల్లలకు తెలియనివ్వకుండా జాగ్రత్త పడతారు. దానివల్ల భవిష్యత్తులో తల్లిదండ్రులతోపాటు పిల్లలు కూడా చాలా ఇబ్బంది పడతారు. అందువల్ల కుటుంబ అవసరాలకు ఎంత ఖర్చవుతుంది, తమకు ఎంత ఆదాయం వస్తుంది అనే రెండు అంశాలనూ బేరీజు వేసుకుని దానిని సమతుల్యం చేయడం ఎలాగో వారికి నేర్పించాలి. అందుకు ఈ వేసవి సెలవులనే ఆసరా చేసుకోవడం బెటర్. నేటి వేసవి ‘శిక్ష’ణ కార్యక్రమాలుకాలంతో పాటు వస్తున్న మార్పుల్లో భాగంగా గత పదేళ్లుగా వేసవి సెలవుల్లోనూ మార్పులొచ్చి పడ్డాయి. లక్షణాలతోపాటు లక్ష్యాలు మారిపోతున్నాయి. అప్పట్లో వేసవి సెలవులు పిల్లలకు ఉత్సాహాన్ని, ఉల్లాసాన్నీ ఇస్తే ఇటీవలి కాలంలో వస్తున్న వేసవి సెలవులు మొక్కుబడి ‘శిక్ష’ణల సెలవులుగా తయారయ్యి ‘సమ్మర్ కోచింగ్’ పేరుతో వేసవి సెలవులు సైతం పాఠశాలల పనిదినాలను తలపింపజేస్తున్నాయి.పిల్లల అభిప్రాయాలను, ఆకాంక్షలనూ ఏమాత్రం పట్టించుకోకుండా తమ ఆలోచనా విధానాన్ని, ఆకాంక్షలను, పిల్లల బంగారు బాల్యానికి బలంగా రుద్ది, ‘వేసవి శిక్ష’ణా కార్యక్రమాలకు అంకితం చేసేస్తున్నారు కొందరు తల్లిదండ్రులు. దాంతో పిల్లలు యాంత్రిక జీవనవిధానానికి అలవాటు పడి, సెలవులను కూడా క్షణం తీరికలేకుండా గడపవలసి వస్తోంది. సమ్మర్ కోచింగ్ పేరుతో ఏమాత్రం శారీరక శ్రమలేని ఆటలు, కేవలం ఇళ్లకే పరిమితమైన, బుర్రలు వేడెక్కే కంప్యూటర్ గేమ్స్.. అవి కూడా వినోదం కోసం కాక పరీక్షల్లో మార్కుల గుడ్లు పెట్టేందుకు మాత్రమే పనికి వచ్చేలా ఉంటున్నాయి. ఫలితంగా ఆటల ద్వారా రావాల్సిన ఐక్యతాభావం స్థానంలో గెలుపే లక్ష్యం అన్న అనారోగ్యకరమైన పోటీ కనిపిస్తోంది. దీనికి పూర్తి బాధ్యత తల్లిదండ్రులదే! పిల్లల బాల్యాన్ని లాగేసుకునే హక్కు ఎవరికీ లేదు, ఉండదు. ఎలా ఉండాలో... ఎలా ఉండకూడదో నేర్పించాలిఆత్మస్థైర్యాన్ని పెంచుకోవడంతో పాటు సమాజంలో ఎలా ఉండాలో, ఎలా ఉండకూడదో కూడా పిల్లలకు అవగాహన కలిగించాలి. పిల్లలు విద్యాపరంగా అత్యున్నత స్థాయిలో ఉండాలి అని ఎలా అశిస్తున్నారో అలాగే సామాజికంగా మంచి వ్యక్తులుగా తీర్చిదిద్దాలని భావించాలి. మన భావి తరానికి కావాల్సింది గొప్ప వ్యక్తులే కాదు, మంచి వ్యక్తులు కూడా. మానవత్వం నిండిన మనుషులు అత్యవసరం, చదువులు మార్కుల కోసమే కాదు పిల్లల్లోని ప్రవర్తనా మార్పుల కోసం కూడా అని గుర్తించాలి. ఈ కాలపు వేసవి సెలవులు సాయపడాలని కోరుకుందాం. ∙డి.వి.ఆర్ భాస్కర్ -
నేటి నుంచి స్కూళ్లకు వేసవి సెలవులు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని అన్ని పాఠశాలలకు బుధవారం నుంచి వేసవి సెలవులు ప్రారంభం కానున్నాయి. ఈ నెల 24 నుంచి జూన్ 11 వరకు అన్ని రకాల మేనేజ్మెంట్ల పరిధిలోని స్కూళ్లకు సెలవులు ఇస్తున్నట్లు పాఠశాల విద్యాశాఖ అధికారులు ప్రకటించారు. వేసవి సెలవుల్లో క్లాసులు నిర్వహిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. జూన్ 12న పాఠశాలలు పునః ప్రారంభం కానున్నాయి. ఈ విద్యాసంవత్సరంలో స్కూళ్లకు మంగళవారమే చివరి పనిదినంగా ఉంది. ఈ సందర్భంగా మంగళవారం ఇటీవల ముగిసిన సమ్మెటివ్ అసెస్మెంట్–2 పరీక్షల ఫలితాలను స్కూళ్లలో ప్రకటించారు. -
‘సెలవుల్లో సరదాగా–2024’
సాక్షి, అమరావతి: వేసవి సెలవుల్లో విద్యార్థులు తమ సమయాన్ని సద్వినియోగం చేసుకునేలా ‘సెలవుల్లో సరదాగా–2024’ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్టు పాఠశాల విద్యాశాఖ కమిషనర్ ఎస్.సురేశ్ కుమార్ తెలిపారు. శుక్రవారం ఆర్జేడీలు, డీఈవోలు, సమగ్ర శిక్షా ఏపీసీలతో ఆయన వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా తరగతుల వారీగా అమలు చేయాల్సిన కార్యక్రమాల మార్గదర్శకాలను విడుదల చేశారు. అనంతరం కమిషనర్ మాట్లాడుతూ.. విద్యార్థుల్లో కొత్త నైపుణ్యాలు, విజ్ఞానాన్ని పెంపొందించడంతో పాటు క్రీడలు, వృత్తి నైపుణ్యం, సృజనాత్మక కళలపై దృష్టి సారించేలా ప్రోత్సహించాలని సూచించారు. విద్యార్థుల కోసం వేసవి కోచింగ్ క్యాంపులు నిర్వహించాలని పీఈటీలను కోరారు. విద్యార్థుల్లో పఠనాసక్తిని పెంపొందించడానికి ఉపాధ్యాయులు, ప్రధానోపాధ్యాయులు, డైట్ ప్రిన్సిపాళ్లతో ‘వుయ్ లవ్ రీడింగ్’ పోటీలను నిర్వహించాలన్నారు. వివిధ స్వచ్ఛంద సంస్థలు, విద్యా సంస్థలు, స్థానిక కమ్యూనిటీ సంస్థల సహకారంతో ఈ వేసవి కార్యక్రమాలను చేపట్టాలని సూచించారు. -
Summer Holidays: ఏపీ బడులకు 24 నుంచి వేసవి సెలవులు
-
ఏపీ బడులకు ఈ 24 నుంచి వేసవి సెలవులు
ఎన్టీఆర్, సాక్షి: ఆంధ్రప్రదేశ్‌లో బడులకు వేసవి సెలవులపై అధికారిక ప్రకటన వెలువడింది. ఈ నెల 24 నుండి ఏపీలో స్కూళ్లకు సెలవులు ఇస్తున్నట్లు విద్యాశాఖ ప్రకటించింది. జూన్ 11 వరకు వేసవి సెలవులుగా ప్రకటించిన విద్యా శాఖ.. వచ్చే అకడమిక్ ఇయర్ కోసం జూన్ 12న తిరిగి స్కూల్స్ తెరుచుకుంటాయని స్కూళ్ల విభాగం కార్యదర్శి సురేష్‌కుమార్ పేరిట విడుదల చేసిన ఉత్తర్వుల్లో పేర్కొంది. -
విద్యార్థులే కానీ... వేసవి సెలవులు లేవు
వేసవి వస్తే విద్యార్థులు రిలాక్స్ అవుతారు. వేసవి సెలవులను ఆస్వాదిస్తారు. కానీ.. ఈ విద్యార్థులకు మాత్రం వేసవి సెలవులు లేవు. కాలేజీలకు వెళుతున్నారు. ఎందుకంటే వీళ్లు రియల్ స్టూడెంట్స్ కాదు.. రీల్ స్టూడెంట్స్. కొందరు స్టార్స్ ప్రస్తుతం స్టూడెంట్స్‌గా నటిస్తున్నారు. షూటింగ్ సెట్స్‌లో క్లాసులకు హాజరు అవుతున్నవారు కొందరైతే.. ప్రిపరేషన్ స్టూడెంట్స్ మరికొందరు. ఈ విద్యార్థుల గురించి తెలుసుకుందాం. ► కెరీర్లో పలు చిత్రాల్లో కాలేజ్ స్టూడెంట్‌గా నటించారు హీరో సూర్య. కానీ ఐదు పదుల వయసుకి చేరువ అవుతున్న టైమ్‌లో కూడా కాలేజ్‌కి వెళ్లెందుకు రెడీ అవుతున్నారు. ‘సూరరై ΄ోట్రు’ వంటి హిట్ ఫిల్మ్ తర్వాత హీరో సూర్య, దర్శకురాలు సుధ కొంగర కాంబినేషన్లో ఓ పీరియాడికల్ యాక్షన్ డ్రామా తెరకెక్కనుంది. స్టూడెంట్ నుంచి గ్యాంగ్‌స్టర్‌గా మారే ఓ వ్యక్తి జీవితం నేపథ్యంలో ఈ చిత్రం ఉంటుందట. స్టూడెంట్ రోల్ కోసం ప్రస్తుతం సూర్య బరువు తగ్గుతున్నారని సమాచారం. 2డీ ఎంటర్టైన్మెంట్స్ నిర్మించనున్న ఈ చిత్రం షూటింగ్ త్వరలో ఆరంభం కానుంది. ►కాలేజీ స్టూడెంట్ రోల్ హీరోయిన్ రష్మికా మందన్నాకు బాగా కలిసి వస్తుందని చె΄÷్పచ్చు. ఆ మాటకొస్తే... నటిగా రష్మికా మందన్నా కెరీర్ మొదలైంది కన్నడ హిట్ క్యాంపస్ డ్రామా ‘కిర్రిక్ పార్టీ’ సినిమాతోనే. అంతేకాదు...రష్మికా మందన్నా తెలుగు ఎంట్రీ మూవీ ‘ఛలో’లోనూ, రెండో మూవీ ‘గీత గోవిందం’లోనూ ఆమెది కాలేజీ స్టూడెంట్ రోల్. ఇలా కాలేజీ స్టూడెంట్‌గా రష్మికా మందన్నా చేసిన సినిమాలన్నీ దాదాపు సూపర్ హిట్స్. తాజాగా ఈ కోవలో రష్మికా మందన్నా చేస్తున్న చిత్రం ‘ది గాళ్‌ఫ్రెండ్’. ఈ చిత్రంలో రష్మికా మందన్నా పీజీ గ్రాడ్యుయేట్ స్టూడెంట్ రోల్లో కనిపిస్తారని తెలిసింది. ఆమె బాయ్ ఫ్రెండ్‌గా దీక్షిత్ శెట్టి నటిస్తున్నారు. ఓ కాలేజీ స్టూడెంట్ తన ప్రేమను నెగ్గించుకునే క్రమంలో పడిన సంఘర్షణ నేపథ్యంతో ఈ సినిమా ఉంటుందట. ఆల్రెడీ ఈ సినిమా చిత్రీకరణ మొదలైంది. ‘చి..ల..సౌ’తో దర్శకుడిగా తొలి సినిమాతోనే హిట్ కొట్టిన రాహుల్ రవీంద్రన్ ‘ది గాళ్ ఫ్రెండ్’ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు. అల్లు అరవింద్ సమర్పణలో ధీరజ్ మొగిలినేని, విద్యా కొప్పినీడి నిర్మిస్తున్న ఈ చిత్రం ఈ ఏడాదే రిలీజయ్యే చాన్స్ ఉంది. ► కాలేజీలో ఓ ఫెయిల్యూర్ స్టూడెంట్‌గా తెరపై శ్రీ విష్ణు కనిపించిన ప్రతిసారీ ఆయనకు మంచి పేరు వచ్చింది. ‘నీదీ నాది ఒకే కథ’, ‘బ్రోచేవారెవరురా’ వంటి సినిమాల్లో శ్రీ విష్ణు స్టూడెంట్‌గా నటించారు. మళ్లీ ఈ తరహా పాత్రలో శ్రీవిష్ణు హీరోగా నటించిన చిత్రం ‘ఓం భీమ్ బుష్’. శ్రీవిష్ణుతో పాటు ఈ చిత్రంలో రాహుల్ రవీంద్రన్, ప్రియదర్శి ఇతర లీడ్ రోల్స్ చేశారు. ఓ యూనివర్సిటీలోని ముగ్గురు పీహెచ్డీ స్కాలర్స్ జీవితాలు ఓ ఘటనతో సడన్‌గా ఏ విధంగా మలుపు తిరిగాయి? అనే కోణంలో ఈ చిత్రం ఉంటుంది. ఈ సినిమా ఫస్టాఫ్‌లో కాలేజీ సీన్స్ ఉంటాయి. శ్రీ హర్ష కొనుగంటి దర్శకత్వంలో వి సెల్యూలాయిడ్, సునీల్ బలుసు నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 22న విడుదల కానుంది. స్టూడెంట్‌గా ఇన్నాళ్లూ సెట్లో బిజీగా ఉన్న శ్రీవిష్ణు ఇప్పుడు ఈ చిత్రం ప్రమోషన్స్‌తో బిజీగా ఉంటున్నారు. ► ‘ఏవండీ.. (మృణాల్ ఠాకూర్).. రామచంద్రా.. (చిన్న వాయిస్‌తో విజయ్ దేవరకొండ).. నేను కాలేజ్‌కి వెళ్లాలి.. కొంచెం దించేస్తారా? (మృణాల్ ఠాకూర్),.. ఒక లీటర్ పెట్రోల్ కొట్టిస్తే దించేస్తా..’ (విజయ్ దేవరకొండ)...‘ఫ్యామిలీస్టార్’ సినిమాలోని డైలాగ్ ఇది. సో.. ఈ చిత్రంలో మృణాల్ ఠాకూర్ కొన్ని సన్నివేశాల్లో కాలేజ్‌కి వెళతారని కన్ఫార్మ్ చేసుకోవచ్చు. ‘గీత గోవిందం’ వంటి హిట్ ఫిల్మ్ తర్వాత హీరో విజయ్ దేవరకొండ, దర్శకుడు పరశురామ్ కాంబినేషన్లో రూ΄÷ందుతున్న ఫ్యామిలీ ఎంటర్టైనర్ మూవీ ఇది. బాలీలో ఓ పాట చిత్రీకరిస్తే ఈ చిత్రం షూటింగ్ మొత్తం పూర్తవుతుంది. ‘దిల్’ రాజు, శిరీష్ నిర్మిస్తున్న ఈ చిత్రం ఏప్రిల్ 5న విడుదల కానుంది. ► ‘ఇగై’ సినిమా కోసం లా పాయింట్స్ చెబుతున్నారు అంజలి. ఎందుకంటే ఈ సినిమాలో అంజలి లా స్టూడెంట్. అశోక్ వేలాయుదం దర్శకత్వంలో రూ΄÷ందుతున్న ఈ ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్ సినిమాలో మెయిన్ లీడ్ రోల్ చేస్తున్నారు అంజలి. చిత్రీకరణ ్రపారంభమైంది. ఈ చిత్రాన్ని తమిళ, తెలుగు భాషల్లో రిలీజ్ చేయాలనుకుంటున్నారు. ఈ నటీనటులే కాక.. మరికొందరు కూడా కాలేజీ స్టూడెంట్ రోల్స్ చేస్తున్నారు. -
అయ్యో.. బిడ్డలారా..
ఓదెల/వీణవంక/జమ్మికుంట: వేసవి సెలవుల కోసం బంధువుల ఇంటికి వెళ్లిన ఇద్దరు చిన్నారులు మానేరువాగులో మునిగి మృత్యువాత పడడం స్థానికంగా విషాదం నింపింది. వీణవంక మండలం కొండపాక చెక్‌డ్యాం, పెద్దపల్లి జిల్లా ఓదెల మండలం పోత్కపల్లి చెక్‌డ్యాం సమీపంలో చోటుచేసుకున్న ఈ ఘటనలో మూడు గ్రామాల ప్రజలను కలచివేసింది. జమ్మికుంట మండలం తనుగులకు చెందిన జూపాక అశోక్, భాగ్యలక్ష్మి కూతురు సింధు, సాత్విక్ (13)సంతానం. అదే గ్రామానికి చెందిన కాసర్ల సునీల్, వందనకు కూతురు నిత్య(12) కుమారుడు ధామన్ సంతానం. వేసవి సెలవుల కోసం మూడు రోజుల క్రితం కొండపాకలోని సంపత్ ఇంటికి వెళ్లారు. బుధవారం ఉదయం కొండపాక శివారులోని చెక్‌డ్యాంలో స్నానం చేద్దామని వెళ్లారు. నిత్య, సాత్విక్ ప్రమాదవశాత్తు నీటిలో మునిగారు. చదువులో ఇద్దరూ ముందంజ.. సాత్విక్ తనుగుల ప్రభుత్వ పాఠశాలలో ఐదో తరగతి చదివి ఆరో తరగతి కోసం ఇటీవల జరిగిన సోషల్ వెల్ఫేర్ పరీక్షలో ఉత్తీర్ణత సాధించాడు. నిత్య హుజూరాబాద్‌లోని బీసీ వెల్ఫేర్‌లో ఏడో తరగతి చదువుతోది. ఇద్దరూ చదువులో చురుగ్గా ఉండేవాళ్లని కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరయ్యారు. తహసీల్దార్ రాజయ్య, ఎస్సై శేఖర్‌రెడ్డి, బ్లూకోల్ట్స్ సిబ్బంది రాజబాబు చిన్నారుల మృతదేహాలను బయటకు తీసేందుకు కృషి చేశారు. జమ్మికుంట మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ తుమ్మేటి సమ్మిరెడ్డి మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఎమ్మెల్యే ఈటల రాజేందర్ సంతాపం సాత్విక్, నిత్య మృతి చెందడంపై హుజూరాబాద్ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలను ఆదుకుంటామని తెలిపారు. సర్వాయి పాపన్న మోకు దెబ్బ గౌడ సంఘం రాష్ట్ర వ్యవస్థాపక అధ్యక్షుడు జక్కే వీరస్వామిగౌడ్, సర్పంచ్ చిలుముల వసంత, ఎంపీటీసీ వాసాల నిరోష తదితరులు సంతాపం తెలిపారు. డేంజర్‌గా జోన్‌గా మానేరు పొత్కపల్లి వద్ద మానేరు వాగు డేంజర్‌జోన్‌గా మారింది. నెల రోజుల క్రితం ఇక్కడే ఓ చిన్నారి కూడా ఈతకోసం వెళ్లి ప్రాణాలు కోల్పోయాడు. తాజాగా ఇద్దరు చనిపోయారు. పొత్కపల్లి మానేరు చుట్టు గ్రామాలైన వీణవంక, కోర్కల్, కొండపాక, మడక, కనగర్తి, మల్లారెడ్డిపల్లె, కల్లుపల్లె ప్రజలు మానేరులో ఈత కొట్టేందుకు వస్తుంటారు. మానేరులో చెక్‌డ్యాంల నిర్మాణాల కోసం ఈ ప్రాంతంలో ఇసుక తవ్వకాలతో లోతైన గోతులు ఏర్పడ్డాయి. అవి నీటితో నిండిపోవడంతో చిన్నారులకు లోతు తెలియక మునిగిపోతున్నారు. మే 22న జీలకుంటలో జరిగిన భూలక్ష్మి ఉత్సవాలకు వచ్చిన వరంగల్ జిల్లా టేకుమట్ల మండలం వెన్నంపల్లి గ్రామానికి చెందిన పింగిళి సదాశివరెడ్డి(24) ఇక్కడే మృతిచెందాడు. నెల తిరగకముందే సాత్విక్, నిత్య మానేరులో మునిగి మృతిచెందారు. ప్రమాదాలు జరగకుండా మానేరు చుట్టూ రక్షణ ఏర్పాటు చేయాలని ఈ ప్రాంతవాసులు కోరుతున్నారు. -
వేసవి సెలవుల పొడిగింపు
సాక్షి, చైన్నె: గత విద్యా సంవత్సరం చివరిలో పబ్లిక్ పరీక్షలు ముగిసినానంతరం రాష్ట్రంలో ఏప్రిల్ 28వ తేదీ నుంచి వేసవి సెలవులు ప్రకటించిన విషయం తెలిసిందే. ముందుగా నిర్ణయించిన మేరకు జూన్ 1వ తేదీ 8 నుంచి 12వ తరగతి వరకు పాఠశాలలను తెరిచేందుకు చర్యలు తీసుకున్నారు. అయితే, ఎండల ప్రభావం ఏ మాత్రం తగ్గని దృష్ట్యా, వేసవి సెలవులను జూన్ 7వ తేదీ వరకు పొడిగించారు. అయితే, అనేక ప్రైవేటు పాఠశాలలు ప్రభుత్వ ఉత్తర్వులను రాష్ట్రంలో ఖాతరు చేయలేదు. ముందుగా నిర్ణయించినట్టుగా జూన్ ఒకటో తేదీనే పాఠశాలలను రీ ఓపెన్ చేశారు. ఈ సమాచారంతో విద్యాశాఖ అధికారుల ఆగ్రహానికి ప్రైవేటు పాఠశాలలు గురి కావాల్సి వచ్చింది. చివరకు పాఠశాలల పునఃప్రారంభించాల్సిన తేదీ జూన్ 7 అని తెలియజేసే బోర్డులు అన్ని పాఠశాలల ముందూ ప్రత్యక్షమయ్యాయి. అయితే, రాష్ట్రంలో ఎండ వేడిమి ఏమాత్రం తగ్గలేదు. అనేక జిల్లాలో ఆదివారం, సోమవారం 108 ఫారిన్ హిట్ డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. దీంతో పాఠశాలల ప్రారంభ తేదీని మార్చాలనే డిమాండ్ తెర మీదకు వచ్చింది. విద్యార్థులు క్షేమం కోసం.. నైరుతి రుతు పవనాలు కేరళ తీరాన్ని తాకేందుకు మరింత సమయం పట్టే అవకాశాలు ఉన్నట్లు ఇటీవల వాతావరణ కేంద్రం ప్రకటించింది. అంత వరకు రాష్ట్రంలో అనేక జిల్లాలో ఎండ వేడమి అధికంగానే ఉంటుందని వివరించారు. దీంతో విద్యా శాఖమంత్రి అన్బిల్ మహేశ్ నేతృత్వంలోని అధికారుల బృందం సోమవారం ఉదయం సచివాలయంలో సీఎం స్టాలిన్‌ను కలిశారు. రాష్ట్రంలో ఎండల ప్రభావం గురించి వివరించారు. పాఠశాలలను ఇప్పుడు తెరిచిన పక్షంలో విద్యార్థుల ఆరోగ్యంపై ప్రభావం పడే అవకాశం ఉందని, సెలవులను పొడిగించాలని సీఎంను కోరారు. సీఎం స్టాలిన్ ఆమోదించడంతో మరో వారం పాటు సెలవులను పొడిగిస్తూ విద్యా శాఖ మంత్రి అన్భిల్ మహేశ్ ఉత్తర్వులు ఇచ్చారు. ఆ మేరకు 6 నుంచి 12వ తరగతికి ఈనెల 12వ తేదీ పాఠశాలలు పునః ప్రారంభం కానున్నాయి. అలాగే 1 నుంచి 5వ తరగతి విద్యార్థులకు ఈనెల 14వ తేదీన పాఠశాలలు తెరుస్తారు. 2023–24 విద్యా సంవత్సరం ప్రారంభం రోజు నుంచే విద్యార్థులకు ఉచిత పుస్తకాల పంపిణీకి చర్యలు తీసుకున్నారు. ఇందుకు సంబంధించిన ఏర్పాట్లను ఐఏఎస్ అధికారి గజలక్ష్మి నేతృత్వంలోని బృందం సిద్ధం చేసింది. ఇక, ప్రేవేటు విద్యాసంస్థలకు తీవ్ర హెచ్చరికలు చేశారు. ముందుగానే పాఠశాలలను రీ ఓపెనింగ్ చేసిన పక్షంలో ఆయా యాజమాన్యాలపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఫిర్యాదులు వచ్చిన పక్షంలో సీజ్ చేయాల్సి ఉంటుందని పేర్కొన్నారు. విద్యార్థులు ఆరోగ్య సంరక్షణే ప్రభుత్వానికి ముఖ్యమని, అందుకే వేసవి సెలవులు వారం రోజులు పొడిగించాల్సి వచ్చిందని మంత్రి పేర్కొన్నారు. ఇదిలా ఉండగా తమిళనాడుతో పాటుగా పుదుచ్చేరిలోనూ సెలవులు పొడిగించారు. కేంద్ర పాలిత ప్రాంతం పుదుచ్చేరిలో ఈనెల 14వ తేదీ 1 నుంచి 12వ తరగతి వరకు పాఠశాలలు తెరచుకోనున్నాయి. కాగా, ఓ వైపు సెలవులు పొడిగించారో లేదో మరోవైపు చైన్నె, శివారు జిల్లాలో సాయంత్రం వాతావరణం పూర్తిగా మారింది. ఉరుములు మెరుపులతో సోమవారం కాసేపు వర్షం పడడం గమనార్హం. అలాగే, అరుప్పు కోట్టైలో వడగళ్ల వాన పడింది. ఈదురు గాలుల దెబ్బకు చెట్లు, విద్యుత్ స్తంభాలు నేలకొరిగాయి. అనుకున్నదే అయ్యింది.. సూర్యప్రతాపం కారణంగా వేసవి సెలవులను మరో వారం పాటు పొడిగించాలని రాష్ట్ర ప్రభుత్వం తాజాగా నిర్ణయించింది. ఈ మేరకు సోమవారం విద్యాశాఖ కీలక ప్రకటన జారీ చేసింది. ఇక ముందస్తుగా పాఠశాలలను తెరిచినా, ప్రత్యేక తరగతుల పేరిట విద్యార్థులను వేధించినా కఠిన చర్యలు తప్పవని ప్రైవేటు విద్యా సంస్థలకు ఉన్నతాధికారులు హెచ్చరికలు జారీ చేశారు. -
చల్ చల్ గుర్రం!
పిఠాపురం: గుర్రపు స్వారీ అనేది ఆటవిడుపు, సాహస క్రీడ. ప్రస్తుతం ఇది ట్రెండ్‌గా మారింది. యువతతో పాటు చిన్న పిల్లలు కూడా గుర్రపు స్వారీ నేర్చుకునేందుకు ఆసక్తి చూపుతున్నారు. తల్లిదండ్రులు సైతం తమ పిల్లలకు హార్స్ రైడింగ్‌లో శిక్షణ ఇప్పించి.. వారు గుర్రాలపై స్వారీ చేస్తుంటే.. చూసి ముచ్చటపడుతున్నారు. యువత, చిన్నారుల తల్లిదండ్రుల ఆసక్తికి అనుగుణంగా హార్స్ రైడింగ్ ట్రైనింగ్ సెంటర్లు వెలుస్తున్నాయి. ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలో సుమారు 100 మంది 250 గుర్రాల వరకూ పెంచుతున్నారంటే.. గుర్రపు స్వారీపై యువత ఆసక్తి ఏంటో ఇట్టే అర్థం చేసుకోవచ్చు. కాకినాడ, రాజమహేంద్రవరం తదితర ప్రాంతాల్లో గుర్రపు స్వారీ శిక్షణ కేంద్రాలు వెలిశాయి. గతంలో గుర్రపు స్వారీ నేర్చుకోవాలంటే పెద్ద పెద్ద నగరాలకు వెళ్లాల్సి వచ్చేది. ప్రస్తుతం ఓ మోస్తరు పట్టణాల్లోనూ శిక్షణ కేంద్రాలు వెలుస్తున్నాయి. వేసవి కావడంతో యువతతో పాటు చిన్నారులు కూడా గుర్రపు స్వారీ నేర్చుకునేందుకు ఆసక్తి కనబరుస్తున్నారు. మానసిక వికాసానికి, శారీరక ఆరోగ్యానికి మేలు గుర్రపు స్వారీ అనేది పలు మానసిక, శారీరక సమస్యలకు సంజీవనిలా పనిచేస్తుంది. పోలియో, పక్షవాతం, మెదడు, వెన్నెముక సమస్యలు, వినికిడి లోపాలు, భావవ్యక్తీకరణ, స్థిమితం కోల్పోవడం వంటి వాటికి చక్కటి చికిత్సగా పనిచేస్తుంది. ముఖ్యంగా మానసిక వికాసం లోపించిన పిల్లలకు మంచి ఫలితాలనిస్తుందని నిపుణులు చెబుతున్నారు. పిల్లలు గుర్రపు స్వారీ చేయడం వల్ల వారి ఏకాగ్రత, ఆత్మవిశ్వాసం పెరుగుతాయి. గుర్రం కళ్లెం పట్టుకోవడం, నిటారుగా కూర్చోవడం, ఆశ్వాన్ని దూమికించడం, ఒకే లయలో ముందుకుసాగడం వంటి చర్యల వల్ల మెదడుకి, శరీరానికి మధ్య సమన్వయం ఏర్పడి మానసిక ఉత్తేజం కలుగుతుందని.. ఫలితంగా అనేక రుగ్మతలు వాటంతట అవే తగ్గిపోతాయని చెబుతున్నారు. గుర్రపు స్వారీకి అనువైన ప్రాంతంగా తీరం గుర్రపు స్వారీ అనేది సాహస క్రీడ. ప్రమాదాలకు ఎక్కువ అవకాశాలున్నాయి. అందుకే ఎలాంటి ప్రమాదాలు జరిగినా రైడర్‌కు ప్రమాదం జరగకుండా జాగ్రత్తలు తీసుకుంటాం. గట్టి నేలల్లో ప్రమాదాలకు ఎక్కువ అవకాశం ఉండటంతో ఇసుల నేలల్లోనే నేర్పాల్సి ఉంటుంది. దీని కోసం ప్రత్యేకంగా ఇసుకను తెచ్చి వేస్తుంటారు. అలాంటి పరిస్థితి లేకుండా తీర ప్రాంతాల్లో ఉన్న ఇసుక మేటలు గుర్రపు స్వారీలకు అనుకూలంగా ఉండటంతో కాకినాడ తీరం ప్రాంతంలో ఉన్న ఇసుక నేలల్లో గత నెల రోజులుగా గుర్రపు స్వారీ శిక్షణ ఇస్తున్నాము. రోజూ ఉదయం, సాయంత్రం రెండేసి గంటల చొప్పున నేర్పుతున్నాము. – కె.అనిల్‌రెడ్డి, గర్రపు స్వారీ శిక్షకుడు, కాకినాడ చాలా సరదాగా ఉంది.. మా నాన్న ఆడుకునేందుకు నాకు గుర్రపు బొమ్మ కొనిచ్చాడు. ఇది వద్దు.. నిజంగా గుర్రం మీద స్వారీ చేయాలని అడిగేవాడిని. అది ఇప్పుడు నిజమైంది. గుర్రంపై సవారీ చేయడం చాలా సరదాగా ఉంది. ముందు భయమేసినా రానురాను అలవాటైపోయింది. ఇప్పుడు ఏ భయం లేకుండా గుర్రంపై స్వారీ చేస్తున్నా. – ఆరుష్వర్మ, కాకినాడ చిన్ననాటి కల నేరవేరిందిలా.. ఎప్పటి నుంచో గుర్రపు స్వారీ చేయాలన్న కోరిక ఉండేది. శిక్షణ కేంద్రాలు అందుబాటులో లేకపోవడంతో ఇప్పటి వరకూ కుదరలేదు. కాకినాడ తీరంలో గుర్రపు స్వారీ శిక్షణ కేంద్రాన్ని ఏర్పాటు చేయడంతో ఆ కోరిక ఇలా తీరింది. గుర్రపు స్వారీ చేయడం చాలా ఆనందంగా ఉంది. శిక్షణ పొందిన గుర్రాలు కావడంతో ఎలాంటి ప్రమాదం లేకుండా నేర్చుకుంటున్నాను. – అభిషేక్, కాకినాడ -
శ్రీవారి ఆర్జిత సేవలు, వీఐపీ దర్శనాల్లో స్వల్ప మార్పులు
తిరుమల: వేసవి సెలవుల కారణంగా తిరుమలలో భక్తుల రద్దీ రోజురోజుకూ అనూహ్యంగా పెరుగుతోంది. సర్వదర్శనం భక్తులకు దాదాపు 30 నుంచి 40 గంటల సమయం పడుతోంది. శుక్ర, శని, ఆదివారాల్లో భక్తులు వేచి ఉండే సమయం ఇంకా ఎక్కువగా ఉంటోంది. ఈ నేపథ్యంలో సామాన్య భక్తుల సౌలభ్యం కోసం జూన్ 30వ తేదీ వరకు స్వామి వారి సేవలు, వీఐపీ దర్శనాల్లో స్వల్ప మార్పులు చేస్తున్నట్లు టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి శనివారం ఒక ప్రకటన విడుదల చేశారు. శుక్ర, శని, ఆదివారాల్లో సుప్రభాత సేవకు విచక్షణ కోటాను రద్దు చేశారు. తద్వారా 20 నిమిషాల సమయం ఆదా అవుతుంది. గురువారం తిరుప్పావడ సేవ ఏకాంతంగా నిర్వహించనున్నారు. తద్వారా 30 నిమిషాల సమయం ఆదా అవుతుంది. శుక్ర, శని, ఆదివారాల్లో వీఐపీ దర్శనాలకు సిఫార్సు లేఖలు స్వీకరించరు. కేవలం స్వయంగా వచ్చే వీఐపీలకు మాత్రమే బ్రేక్ దర్శనం కల్పించడం జరుగుతుంది. తద్వారా ప్రతిరోజు మూడు గంటల సమయం ఆదా అవుతుంది. క్యూలైన్లలో గంటల తరబడి కిలోమీటర్ల మేర వేచి ఉండే వేలాది మంది సామాన్య భక్తులకు ఈ నిర్ణయాల వల్ల త్వరితగతిన స్వామివారి దర్శనం లభిస్తుంది. 24న రూ.300 ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్ల కోటా విడుదల తిరుమలలో రూ.300 ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్లకు సంబంధించి జూలై, ఆగస్టు నెలల కోటాను ఈ నెల 24న ఉదయం 10 గంటలకు టీటీడీ ఆన్లైన్లో విడుదల చేయనుంది. భక్తులు ఈ విషయాన్ని గమనించి టీటీడీ వెబ్సైట్ https://tiru patibalaji.ap.gov.in లో దర్శన టికెట్లు బుక్ చేసుకోవాలని టీటీడీ కోరుతోంది. రికార్డు స్థాయిలో శ్రీవారిని దర్శించుకున్న భక్తులు తిరుమలలో శ్రీవారిని శుక్రవారం రికార్డు స్థాయిలో భక్తులు దర్శించుకున్నారు. శుక్రవారం అర్ధరాత్రికి 81,833 మంది దర్శించుకున్నారు. హుండీలో కానుకల రూపంలో రూ.3.31 కోట్లు సమర్పించారు. శనివారం తిరుమలలో భక్తుల రద్దీ పెరిగింది. 29 కంపార్ట్మెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. ఎలాంటి టికెట్లు లేని భక్తులు స్వామిని దర్శించుకునేందుకు 18 గంటల సమయం పడుతోంది. -
తిరుమలలో పెరిగిన భక్తుల రద్దీ.. 3 కిలోమీటర్ల మేర బారులు
తిరుమల: తిరుమలలో భక్తుల రద్దీ పెరిగింది. వేసవి సెలవుల కారణంగా వివిధ ప్రాంతాల నుంచి వస్తున్న భక్తులతో ఆలయ పరిసరాలు కిటకిటలాడుతున్నాయి. కలియుగ ప్రత్యక్ష దైవమైన వేంకటేశ్వర స్వామిని దర్శించుకునేందుకు పెద్ద సంఖ్యలో భక్తులు తరలివస్తున్నారు. దీంతో అన్నీ కంపార్ట్మెంట్లు,షెడ్లు కిక్కిరిపోయి.. దర్శనం కోసం మూడు కిలోమీటర్ల మేర క్యూలైన్లలో భక్తులు బారులు తీరారు. వైకుంఠం క్యూ కాంప్లెక్స్, నారాయణగిరి షెడ్లు కిక్కిరిసిపోయి.. శిలాతోరణం వరకు రెండు కిలోమీటర్ల పొడవున క్యూలైన్లో భక్తులు వేచి ఉన్నారు. టోకెన్ లేని భక్తులకు శ్రీవారి సర్వదర్శనానికి 36 గంటల సమయం పడుతున్నట్లు టీటీడీ అధికారులు తెలిపారు. ఈ నేపథ్యంలో భక్తులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా తాగునీరు, అన్నప్రసాదాలు అందించేలా అన్ని ఏర్పాట్లు చేశారు. పరిస్థితిని ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నట్లు తితిదే అధికారులు, భద్రతా సిబ్బంది తెలిపారు. నిన్న స్వామివారిని 77,436 మంది భక్తులు దర్శించుకోగా 38,980 మంది తలనీలాలు సమర్పించుకున్నారు. భక్తులు సమర్పించుకున్న కానుకల ద్వారా ఆలయ హుండీకి రూ. 3.77 కోట్లు ఆదాయం వచ్చిందని తెలిపారు. చదవండి: టెన్త్ టాపర్లకు సీఎం వైఎస్ జగన్ బొనాంజా.. శ్రీవారిని దర్శించుకున్న ప్రముఖులు తిరుమల శ్రీవారిని పలువురు ప్రముఖులు దర్శించుకున్నారు. ఉదయం విఐపీ దర్శన సమయంలో మాజీ మంత్రి సిద్దా రాఘవులు, ఎంపీ కోటగిరి శ్రీధర్, టీడీపీ ఎమ్మెల్సీ రాంగోపాల్ రెడ్డి, కర్ణాటక ఎమ్మెల్సీ టీ.ఏ. శరవణ, తెలంగాణ ఎమ్మెల్యే రాజేంద్ర రెడ్డి లు స్వామివారిని దర్శించుకొని మొక్కులు చెల్లించుకొన్నారు. అనంతరం ఆలయ అర్చకులు ఆశీర్వదించి తీర్ధప్రసాదాలు అందచేసారు. -
హైకోర్టుకు వేసవి సెలవులు
సాక్షి, అమరావతి: హైకోర్టుకు ఈనెల 15 నుంచి జూన్ 12 వరకు వేసవి సెలవులు ప్రకటించారు. హైకోర్టు కార్యకలాపాలు తిరిగి జూన్ 13న ప్రారంభమవుతాయి. ఈ సెలవుల్లో అత్యవసర కేసుల విచారణ నిమిత్తం వెకేషన్ కోర్టులు ఏర్పాటయ్యాయి. ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ప్రశాంత్‌కుమార్ మిశ్రా ఆదేశాల మేరకు వీటిని ఏర్పాటుచేశారు. రెండు దశల్లో ఈ వెకేషన్ కోర్టులు పనిచేస్తాయి. హైబ్రిడ్ (భౌతిక, ఆన్లైన్) విధానంలో కేసులను విచారిస్తారు. మొదటి దశ వెకేషన్ కోర్టులు మే 16 నుంచి 26 వరకు పనిచేస్తాయి. రెండో దశ కోర్టులు మే 27 నుంచి జూన్ 12 వరకు పనిచేస్తాయి. ఈ వెకేషన్ కోర్టుల్లో హెబియస్ కార్పస్ పిటిషన్లు, బెయిల్, ముందస్తు బెయిల్ పిటిషన్లు, సెలవులు పూర్తయ్యేంత వరకు వేచిచూడలేనటువంటి అత్యవసర వ్యాజ్యాలు మాత్రమే దాఖలు చేయాల్సి ఉంటుందని హైకోర్టు స్పష్టంచేసింది. అలాగే, సర్వీసు సంబంధిత కేసులు, ప్రజా ప్రయోజన వ్యాజ్యాలు, స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ చట్టానికి సంబంధించిన కేసులను అత్యవసరం అయితే తప్ప విచారించబోమని పేర్కొంది. అలాగే, సీఆర్పీసీ సెక్షన్ 482, అధికరణ 226 కింద ఎఫ్ఐఆర్లు, చార్జిషీట్లను కొట్టేయాలంటూ దాఖలుచేసే వ్యాజ్యాలను ఈ వేసవి సెలవుల్లో విచారించబోమని తెలిపింది. వెకేషన్ కోర్టుల్లో జడ్జిలు వీరే.. ఇక మొదటి దశ వెకేషన్ కోర్టులో న్యాయమూర్తులు జస్టిస్ బీఎస్ భానుమతి, జస్టిస్ ఏవీ రవీంద్రబాబు, జస్టిస్ గన్నమనేని రామకృష్ణ ప్రసాద్ ఉంటారు. ఇందులో జస్టిస్ భానుమతి, జస్టిస్ రవీంద్రబాబు ధర్మాసనంలో.. జస్టిస్ రామకృష్ణ ప్రసాద్ సింగిల్ జడ్జిగా కేసులను విచారిస్తారు. మొదటి వెకేషన్ కోర్టులో వ్యాజ్యాలు దాఖలు చేయాలనుకునే వారు మే 16వ తేదీన దాఖలు చేయాల్సి ఉంటుంది. ఈ వ్యాజ్యాలపై న్యాయమూర్తులు మే 18న విచారణ జరుపుతారు. అలాగే, మే 30న వ్యాజ్యాలు దాఖలు చేస్తే జూన్ 1న విచారణ ఉంటుంది. జూన్ 6న పిటిషన్లు దాఖలు చేస్తే వాటిపై న్యాయమూర్తులు జూన్ 8న విచారణ జరుపుతారు. రెండో వెకేషన్ కోర్టులో న్యాయమూర్తులు జస్టిస్ బొప్పూడి కృష్ణమోహన్, జస్టిస్ దుప్పల వెంకటరమణ, జస్టిస్ వి.గోపాలకృష్ణరావు ఉంటారు. ఇందులో జస్టిస్ కృష్ణమోహన్, జస్టిస్ గోపాలకృష్ణరావు ధర్మాసనంలో.. జస్టిస్ దుప్పల వెంకటరమణ సింగిల్ జడ్జిగా కేసులను విచారిస్తారు. జూన్ 8న విచారణ జరిపే ధర్మాసనానికి న్యాయమూర్తి జస్టిస్ నైనాల జయసూర్య నేతృత్వం వహిస్తారు. ఈ మేరకు హైకోర్టు రిజిస్ట్రార్ జనరల్ వై. లక్ష్మణరావు నోటిఫికేషన్ జారీచేశారు. -
సినిమాలు, వెబ్ సిరీస్ ప్రభావం.. అసలేంటి బింజ్ వాచింగ్?
అర్జున్ (21) ఒక ప్రైవేట్ ఇంజనీరింగ్ కళాశాలలో బీటెక్ చదువుతున్నాడు. గత కొద్ది రోజులుగా ఇంట్లో ఒంటరిగా ఉండటంతోపాటు తీవ్ర నిరాశ, ఆందోళనకు లోనవుతున్నాడు. ఇంట్లో ఎవరైనా తనతో మాట్లాడితే వారిని విసుక్కోవడం, కసిరికొట్టడం చేస్తున్నాడు. ఎక్కువ సమయం ఏదొక ఓటీటీలో వెబ్ సిరీస్, సినిమాలు చూస్తూ ఉండిపోతున్నాడు. దీంతో అర్జున్ను అతడి తండ్రి విజయవాడలోని మానసిక వైద్యుడి వద్దకు తీసుకుని వెళ్లాడు. వైద్యుడు లక్షణాలన్నీ అడిగి తెలుసుకుని రెండు, మూడు సిట్టింగ్‌ల అనంతరం అర్జున్.. ‘బింజ్ వాచింగ్ అడిక్షన్’తో బాధపడుతున్నట్టు తెలిపారు. ‘చదువుపై దృష్టి సారించలేకపోతున్నాను.. తొందరపాటు ఎక్కువగా ఉంటోంది.. ఒంటరిగా ఉండాలనిపిస్తోంది’.. అంటూ రమ్య అనే ఎంబీబీఎస్ విద్యార్థిని మానసిక వైద్యుడిని సంప్రదించింది. ‘నేను అటెన్షన్ డెఫిసిట్ హైపర్ యాక్టివిటీ డిజార్డర్ (ఏడీహెచ్‌డీ) సమస్యతో బాధపడుతున్నాను. ఈ సమస్య ఉన్నవారికి ఇచ్చే మిథైల్ఫేనిడేట్ మందును నాకు ఇవ్వండి’ అని డాక్టర్‌ను అడిగింది. తన సమస్యతోపాటు ఏ మందు ఇవ్వాలో కూడా చెప్పేస్తుండటంతో సందేహం వచ్చిన మానసిక వైద్యుడు కొంత లోతుగా ఆమెను పరిశీలించారు. ఈ క్రమంలో రమ్య.. ఏడీహెచ్‌డీ కంటెంట్‌తో వచ్చిన ఇంగ్లిష్ సినిమాలు, వెబ్ సిరీస్ ప్రభావంలో పడ్డట్టు వైద్యుడు గుర్తించారు. ఇలా అర్జున్, రమ్య తరహాలోనే ప్రస్తుతం కొందరు పిల్లలు, యువత, పెద్దలు.. బింజ్ వాచింగ్‌కు బానిసలై బాధపడుతున్నారు. ప్రస్తుత స్ట్రీమింగ్ యుగం నడుస్తున్న సంగతి తెలిసిందే. ఒక్క క్లిక్‌తో ఓటీటీ వేదికగా వివిధ భాషా చిత్రాలను, వెబ్ సిరీస్‌లను చూసే అవకాశం ఉంది. దీనికి తోడు చౌకగా అన్లిమిటెడ్ డేటా లభిస్తుండటంతో కావాల్సినంత వినోదం లభిస్తోంది. ఈ క్రమంలో అతిగా సినిమాలు, వెబ్‌సిరీస్, షోలు చూసే బింజ్ వాచింగ్ అనేది ప్రస్తుతం సర్వసాధారణమైపోయింది. ఇలా పగలు, రాత్రి తేడా లేకుండా ఓటీటీలకు అతుక్కుపోవడం మానసిక, శారీరక ఆరోగ్యంపై తీవ్ర దుష్ప్రభావాన్ని చూపుతోందని వైద్య నిపుణులు చెబుతున్నారు. – సాక్షి, అమరావతి భారతీయులు రోజుకు నాలుగు గంటలకు పైనే బింజ్ వాచింగ్‌కు కేటాయిస్తున్నట్టు జనవరిలో అమెజాన్ ప్రైమ్ ప్రకటించింది. తమ వినియోగదారుల్లో 61 శాతం మంది ఒకే సిట్టింగ్‌లో షో, వెబ్ సిరీస్‌లోని ఆరు ఎపిసోడ్లను క్రమం తప్పకుండా చూస్తున్నారని గతేడాది మరో దిగ్గజ ఓటీటీ సంస్థ.. నెట్‌ఫ్లిక్స్ పేర్కొంది. ఇలా ఓటీటీల్లో దేన్నైనా చూడటం ప్రారంభిస్తే ఆపకుండా వరుసగా ఒక సినిమా నుంచి మరో సినిమా, ఒక వెబ్ సిరీస్ నుంచి మరో వెబ్ సిరీస్ చూసేస్తున్నారు. ఇది క్రమంగా అడిక్టివ్ బిహేవియర్ (వ్యసనం)గా మారుతోందని మానసిక వైద్య నిపుణులు చెబుతున్నారు. ముఖ్యంగా పిల్లలు యాక్షన్ సీన్లు ఎక్కువగా ఉండే కొరియన్ వెబ్ సిరీస్, సినిమాలు చూడటానికి ఇష్టపడుతున్నారు. దీంతో వారు హింస వైపు ప్రేరేపితులయ్యే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. బింజ్ ఈటింగ్ కూడా.. సాధారణంగా ఏదైనా సినిమా, షో చూసేటప్పుడు చిరుతిళ్లు తినడానికి ఎక్కువ మంది ఇష్టపడతారు. ఈ క్రమంలో బింజ్ వాచింగ్ చేసేవారు బింజ్ ఈటింగ్ (ఎంత తింటున్నారో తెలియకుండా) చేసి ఊబకాయం బారినపడుతున్నారు. ముఖ్యంగా పిల్లలు చిప్స్, లేస్, కుర్ కురే వంటి ప్యాక్డ్ ఫుడ్‌ను ఎక్కువగా తీసుకోవడంతో ఊబకాయంతోపాటు గ్యాస్ట్రిక్ సమస్యలను కూడా ఎదుర్కొంటున్నట్టు వైద్యులు చెబుతున్నారు. బింజ్ వాచింగ్తో సమస్యలు.. ► ఒంటరిగా ఉండటం పెరుగుతుంది. అతిగా ఓటీటీల్లో వెబ్ సిరీస్‌లు, సినిమాలు చూస్తూ లౌకిక ప్రపంచం నుంచి దూరమవుతారు.. ఇతరులతో సంబంధాలు ఉండవు. ఫలితంగా కుటుంబం, స్నేహితుల నుంచి దూరమయ్యే ప్రమాదం ఉంది. ► వెబ్ సిరీస్‌లు, సినిమాలు చూసే క్రమంలో ఒకేసారి వాటిని పూర్తి చేయాలని అర్ధరాత్రి దాటిపోయినా నిద్రపోవడం లేదు. దీంతో నిద్రలేమి, చిరాకు, విసుగు వంటివి తలెత్తుతున్నాయి. ► మానసిక ఒత్తిడి, నిరాశ, ఆందోళన పెరుగుతున్నాయి. అతిగా స్క్రీన్‌ను చూడటం వల్ల కంటి చూపు సంబంధిత సమస్యలు కూడా వస్తున్నాయి. ► కొందరైతే వెబ్ సిరీసుల్లో లీనమైపోయి అందులో జరిగినట్టు తమ జీవితంలోనూ మార్పులు రావాలని ఊహించుకుంటూ సమస్యల బారినపడుతున్నారు. తల్లిదండ్రులు జాగ్రత్తలు పాటించాలి.. వేసవి సెలవుల్లో పిల్లలు సెల్ఫోన్లు, ట్యాబ్‌లకు బానిసలయ్యే ప్రమాదం ఉంది. కాబట్టి ఈ వేసవిలో పిల్లల భవిష్యత్‌కు దోహదపడేలా ఏదైన ఒక ఔట్‌డోర్ గేమ్, ఏదైనా భాషలో వారికి శిక్షణ ఇప్పించాలి. ప్రస్తుతం బింజ్ వాచింగ్ సమస్య అన్ని వయసుల వారిలోనూ ఉంటోంది. గతేడాది 20 మంది వరకు ఎంబీబీఎస్ విద్యార్థులు ఈ సమస్యతో బాధపడుతూ మా వద్దకు వచ్చారు. ఏ అలవాటు మితిమీరినా ముప్పు తప్పదు. – డాక్టర్ ఇండ్ల విశాల్ రెడ్డి, మానసిక వైద్యుడు, విజయవాడ -
తెలంగాణ హైకోర్టుకు వేసవి సెలవులు.. ఎప్పటి నుంచి ఎప్పటివరకంటే?
సాక్షి, హైదరాబాద్: మే 1 నుంచి జూన్ 2వ తేదీ వరకు తెలంగాణ హైకోర్టుకు వేసవి సెలవులు ప్రకటించారు. అత్యవసర కేసుల విచారణకు ప్రత్యేక బెంచ్ ఏర్పాటు చేశారు. ప్రతీ గురువారం కేసుల విచారణ ప్రత్యేక కోర్టు నిర్వహించనుంది. మే 4, 11, 18, 25, జూన్ 1వ తేదీన ప్రత్యేక కోర్టు నిర్వహించనున్నట్లు హైకోర్టు రిజిస్ట్రార్ ప్రకటించారు. చదవండి: కేసీఆర్ సర్కార్ సంచలన నిర్ణయం.. ప్రైవేటుకు ఓఆర్ఆర్! -
ఏపీలో మే 1 నుంచి స్కూళ్లకు వేసవి సెలవులు
సాక్షి, విజయవాడ: ఆంధ్రప్రదేశ్‌లో విద్యాసంస్థలకు వేసవి సెలవుల తేదీలపై విద్యాశాఖ స్పష్టత ఇచ్చింది. ఏప్రిల్ 30వ తేదీని ఈ అకడమిక్ ఇయర్ చివరి తేదీగా ప్రకటించిన విద్యాశాఖ.. మే 1 నుంచి జూన్ 11వ తేదీ దాకా పాఠశాలలకి వేసవి సెలవులు ఇవ్వనున్నట్లు పేర్కొంది. విద్యాశాఖ ఉత్తర్వుల ప్రకారం.. తిరిగి జూన్ 12వ తేదీ సోమవారం పాఠశాలలు వచ్చే అకడమిక్ ఇయర్కుగానూ పునఃప్రారంభం అవుతాయి. ఈ మేరకు విద్యాశాఖ కమిషనర్ సురేష్ కుమార్ మంగళవారం నాడు ఉత్తర్వులు జారీ చేశారు. రాష్ట్రంలోని ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలలన్నింటికీ ఈ ఉత్తర్వులు వర్తిస్తాయని తెలిపారు. -
Telangana: నేటి నుంచి బడులకు వేసవి సెలవులు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలకు మంగళవారం నుంచి వేసవి సెలవులు అమలవుతాయి. దీంతో అన్ని బడులూ జూన్ 11వరకు మూతపడి, 12న తిరిగి తెరుచుకోనున్నాయి. ఈ నేపథ్యంలో చివరి దినమైన సోమవారం పాఠశాలల్లో ఉపాధ్యాయులు పేరెంట్స్‌తో సమావేశం నిర్వహించారు. ఈసారి జిల్లా స్థాయిలో కంప్యూటరీకరించి ఆన్లైన్లో ఉంచిన ప్రోగ్రెస్ కార్డులను ఉపాధ్యాయులు డౌన్లోడ్ చేసి విద్యార్థులకు అందించారు. 1–9 విద్యార్థుల అన్ని స్థాయిల పరీక్షల మార్కులు, ఏడాది పొడవునా విద్యార్థి పురోగతి, నడవడికతో కూడిన అనేక అంశాలను అందులో పొందుపరిచారు. విద్యార్థి లోపాలు, అధిగమించాల్సిన అంశాలు, వేసవి సెలవుల్లో నేర్చుకోవాల్సిన విషయాలను ప్రోగ్రెస్ కార్డుల్లో సూచించారు. -
లగేజ్ సర్దేసుకుని లద్దాఖ్, మయూర్‌భంజ్‌కు ఛలో! ఆ రెండే ఎందుకంటారా?
న్యూఢిల్లీ: సమ్మర్ హాలీడేస్‌లో ఎక్కడికెవెళ్లాలి? పిల్లా పాపలతో కలిసి ఎక్కడికెళ్తే అన్నీ మర్చిపోయి హాయిగా ఎంజాయ్ చేస్తాం? పెద్దగా ఆలోచించకుండా లగేజ్ సర్దేసుకొని కశ్మీర్‌లోని లద్దాఖ్‌కో, ఒడిశాలో మయూర్‌భంజ్‌కు ప్రయాణమైపోవడమే! ఆ రెండే ఎందుకంటారా? ప్రఖ్యాత టైమ్ మ్యాగజైన్ ప్రపంచవ్యాప్తంగా అత్యంత అద్భుతమైన ప్రాంతాల జాబితా–2023లో మన దేశం నుంచి చోటు దక్కించుకున్న ప్రాంతాలు అవే మరి! అరుదైన పులులు, పురాతన ఆలయాలు, సాహసంతో కూడిన ప్రయాణం, ఆహా అనిపించే ఆహారం. ఇవన్నీ లద్దాఖ్, మయూర్భంజ్లకు 50 పర్యాటక ప్రాంతాలతో టైమ్స్ రూపొందించిన ఈ జాబితాలో చోటు కల్పించాయి. లద్దాఖ్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. అక్కడ అడుగు పెడితే స్వర్గమే తలవంచి భూమికి చేరిందా అనిపించక మానదు. ‘‘మంచుకొండలు, టిబెటన్ బౌద్ధ సంస్కృతి కనువిందు చేస్తాయి. అక్కడి వాతావరణాన్ని ఫీల్ అవడానికి పదేపదే లద్దాఖ్ వెళ్లాలి’’ అని టైమ్స్ కీర్తించింది. ‘‘ఇక మయూర్భంజ్ అంటే పచ్చదనం. సాంస్కృతిక వైభవం, పురాతన ఆలయాలు, కళాకృతులకు ఆలవాలం. ప్రపంచంలో నల్ల పులి సంచరించే ఏకైక ప్రాంతం’’ అంటూ కొనియాడింది. ఏటా ఏప్రిల్‌లో మయూర్‌భంజ్‌లో జరిగే ‘చౌ’ డ్యాన్స్ ఫెస్టివల్ అదనపు ఆకర్షణ. ఒడిశా సాంస్కృతిక వారసత్వంతో పాటు ఏకశిలా శాసనాలు గొప్పగా ఉంటాయని టైమ్స్ పేర్కొంది. జాబితాలో అత్యధిక శాతం అమెరికా ప్రాంతాలకే చోటు దక్కింది. టాంపా (ఫ్లోరిడా), విల్లామెట్ (ఓరెగాన్), టక్సాన్ (అరిజోనా), యోసెమైట్ నేషనల్ పార్క్ (కాలిఫోర్నియా) వంటివి వాటిలో ఉన్నాయి. -
ఎండల్లో హాయ్ హాయ్..అంటున్న స్టార్స్.. సమ్మర్ టార్గెట్‌గా భారీ సినిమాలు
వేసవి వస్తోందంటే సినిమాల సందడి ఏ స్థాయిలో ఉంటుందో ప్రత్యేకించి చెప్పక్కర్లేదు.పాఠశాలలు, కళాశాలలకు వేసవి సెలవులు కావడంతో విద్యార్థులు స్నేహితులతోనో, కుటుంబ సభ్యులతోనో సినిమాకి వెళుతుంటారు. మండే ఎండల్లో కూల్ కూల్‌గా ఏసీ థియేటర్లో కూర్చుని సినిమాని ఆస్వాదిస్తుంటారు. అందుకే సమ్మర్ టార్గెట్‌గా ఎక్కువ సినిమాలు సిల్వర్ స్క్రీన్‌కి వస్తుంటాయి. ఈ ఏప్రిల్‌లో తొమ్మిది సినిమాలకుపైగా ప్రేక్షకుల ముందుకు రానున్నాయి. అయితే ‘మే’కి మాత్రం ఇప్పటికి విడుదల తేదీ ఖరారైన సినిమా ఒకే ఒక్కటి ఉంది. నాగచైతన్య ‘కస్టడీ’ మే 12న విడుదల కానుంది. మరి.. ఏప్రిల్‌లో విడుదల కానున్న చిత్రాలపై ఓ లుక్కేద్దాం... ♦ ‘ధమాకా’ చిత్రంతో వంద కోట్ల క్లబ్లో చేరారు హీరో రవితేజ. దీంతో ఆయన నటిస్తున్న తర్వాతి సినిమా ‘రావణాసుర’పై ఇండస్ట్రీ వర్గాల్లో భారీ అంచనాలున్నాయి. సుధీర్ వర్మ దర్శకత్వంలో రవితేజ, అభిషేక్ నామా నిర్మిస్తున్న ఈ సినిమా ఏప్రిల్ 7న విడుదల కానుంది. స్టైలిష్ యాక్షన్ థ్రిల్లర్‌గా రూపొం దుతున్న ఈ సినిమాలో రవితేజ లాయర్పాత్రలో కనిపిస్తారు. అనూ ఇమ్మాన్యుయేల్, మేఘా ఆకాష్, ఫరియా అబ్దుల్లా, దక్షా నగార్కర్, పూజిత పొన్నాడ కథానాయికలుగా నటిస్తున్నారు. ♦ వైవిధ్యమైన కథలు, విలక్షణమైన నటనతో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు ‘అల్లరి’ నరేశ్. వినోదాత్మక చిత్రాలకు కేరాఫ్‌గా నిలిచిన ఆయన ‘నాంది’, ‘ఇట్లు మారేడుమిల్లి ప్రజానీకం’ వంటి చిత్రాల్లో సీరియస్ రోల్స్‌లో నటించారు. ప్రస్తుతం నరేశ్ నటిస్తున్న తాజా చిత్రం ‘ఉగ్రం’. విజయ్ కనకమేడల దర్శకత్వంలో ఎమోషనల్ యాక్షన్ మూవీగా తెరకెక్కుతున్న ఈ చిత్రంలో మిర్నా మీనన్ హీరోయిన్. సాహు గారపాటి, హరీష్ పెద్ది నిర్మిస్తున్న ఈ మూవీని ఏప్రిల్ 14న ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నట్లు ప్రకటించారు మేకర్స్. ♦ నటుడు, కొరియోగ్రాఫర్, డైరెక్టర్ రాఘవ లారెన్స్ హీరోగా నటించిన చిత్రం ‘రుద్రుడు’. ప్రియా భవానీ శంకర్ హీరోయిన్ . కదిరేశన్∙స్వీయ దర్శకత్వంలో ఫైవ్‌స్టార్ క్రియేషన్స్ ఎల్ఎల్పీ పతాకంపై రూపొం దిన ఈ తమిళ చిత్రం తెలుగు, కన్నడ, మలయాళంలోనూ విడుదల కానుంది. యాక్షన్ థ్రిల్లర్‌గా రూపొం దిన ఈ సినిమాని గత ఏడాది డిసెంబర్ 23న విడుదల చేస్తామని చిత్రయూనిట్ ప్రకటించినా వీఎఫ్ఎక్స్ పనులు ఆలస్యం కావడంతో రిలీజ్ కాలేదు. ఏప్రిల్ 14న విడుదల చేయనున్నట్లు కొత్త డేట్ ప్రకటించింది యూనిట్. ♦ సాయిధరమ్ తేజ్ హీరోగా నటిస్తున్న 15వ చిత్రం ‘విరూపాక్ష’. బైక్ ప్రమాదం నుంచి కోలుకున్న ఆయన ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్‌తో బిజీగా ఉన్నారు. కార్తీక్ దండు దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో సంయుక్తా మీనన్ హీరోయిన్గా నటిస్తున్నారు. శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర–సుకుమార్ రైటింగ్స్ బ్యానర్లపై బీవీఎస్‌ఎ న్ ప్రసాద్ నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని ఏప్రిల్ 21న విడుదల చేయనున్నట్లు చిత్రబృందం ప్రకటించింది. తెలుగు, తమిళ, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో ఈ చిత్రం రిలీజ్ కానుంది. 1990 నేపథ్యంలో ఫారెస్ట్ బేస్డ్ విలేజ్‌లో జరిగే కథాంశంతో ఈ మూవీ రూపొం దుతోందని సమాచారం. ♦ అఖిల్ అక్కినేని హీరోగా నటిస్తున్నపాన్ ఇండియా చిత్రం ‘ఏజెంట్’. సురేందర్ రెడ్డి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో సాక్షీ వైద్య కథానాయికగా చేస్తున్నారు. రామబ్రహ్మం సుంకర, అనిల్ సుంకర నిర్మిస్తున్న ఈ చిత్రం తెలుగు, హిందీ, తమిళం, కన్నడ, మలయాళ భాషల్లో ఏప్రిల్ 28న రిలీజ్ కానుంది. స్పై థ్రిల్లర్‌గా రూపొం దుతోన్న చిత్రమిది. ఈ మూవీ కోసం సిక్స్‌ప్యాక్ దేహం, పొడవాటి హెయిర్ స్టైల్‌తో స్టైలిష్‌గా మేకోవర్ అయ్యారు అఖిల్. ఫారిన్లో చిత్రీకరించే ఓ ఫైట్‌తో ఈ సినిమా షూటింగ్ పూర్తవుతుందని తెలిసింది. ♦ ప్రముఖ దర్శకుడు మణిరత్నం తెరకెక్కించిన హిస్టారికల్ మూవీ ‘పొన్నియిన్ సెల్వన్ (పీఎస్– 1)’. కల్కి కృష్ణమూర్తి రాసిన ‘పొన్నియిన్ సెల్వన్’ నవల ఆధారంగా ఈ సినిమాను తీశారు మణిరత్నం. తొమ్మిదో శతాబ్దం నాటి చోళ సామ్రాజ్యం నేపథ్యంలో ఈ సినిమా ఉంటుంది. విక్రమ్, కార్తీ, ‘జయం’ రవి, ఐశ్వర్యా రాయ్, త్రిష ప్రధానపాత్రల్లో నటించారు. లైకాప్రొ డక్షన్స్ , మద్రాస్ టాకీస్ నిర్మించిన ఈ చిత్రం తొలి భాగం ‘పీఎస్ 1’ గత ఏడాది సెప్టెంబర్ 30నపాన్ ఇండియా స్థాయిలో విడుదలైంది. తెలుగులో నిర్మాత ‘దిల్’ రాజు రిలీజ్ చేశారు. మలి భాగాన్ని ఏప్రిల్ 28న రిలీజ్ చేస్తున్నట్టు ప్రకటిస్తూ చిత్రయూనిట్ ఓ వీడియోను విడుదల చేసింది. ♦ తెలుగు చిత్ర పరిశ్రమకి ‘ఉప్పెన’లా దూసుకొచ్చారు పంజా వైష్ణవ్ తేజ్. ‘కొండపొలం, రంగరంగ వైభవంగా’ తర్వాత తన నాలుగో చిత్రాన్ని సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్లో చేస్తున్నారు వైష్ణవ్ తేజ్. శ్రీకాంత్ రెడ్డి దర్శకునిగా పరిచయమవుతున్న ఈ చిత్రంలో శ్రీలీల హీరోయిన్. నాగవంశీ, సాయి సౌజన్య నిర్మిస్తున్న ఈ చిత్రం గత ఏడాది జూన్ల్ ప్రారంభమైంది. తన కెరీర్లో తొలిసారి మాస్, యాక్షన్ మూవీ చేస్తున్నారు వైష్ణవ్ తేజ్. ఈ సినిమా ఏప్రిల్ 29న బాక్సాఫీస్ బరిలో నిలుస్తోంది. ∙ చిరంజీవి హీరోగా నటిస్తున్న తాజా చిత్రం ‘బోళా శంకర్’. మెహర్ రమేశ్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో తమన్నా హీరోయిన్గా నటిస్తుండగా చిరంజీవి చెల్లెలిపాత్రలో కీర్తీ సురేష్ నటిస్తున్నారు. క్రియేటివ్ కమర్షియల్స్, ఏకే ఎంటర్టైన్మెంట్ పతాకాలపై రామబ్రహ్మం సుంకర నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని ఏప్రిల్ 14న విడుదల చేయనున్నట్లు చిత్రయూనిట్ ప్రకటించింది. అయితే ఆ తర్వాత ఎలాంటి అప్డేట్ లేదు. మరి ముందుగా ప్రకటించినట్లు ఏప్రిల్ 14న ‘బోళా శంకర్’ రిలీజ్ అవుతుందా? మరో కొత్త డేట్‌ని అనౌన్స్ చేస్తారా? అనేది తెలియాలంటే వేచి చూడాలి. సమంత లీడ్ రోల్లో నటించినపాన్ ఇండియా చిత్రం ‘శాకుంతలం’. ప్రముఖ కవి కాళిదాసు రచించిన సంస్కృత నాటకం ‘అభిజ్ఞాన శాకుంతలం’ ఆధారంగా ఈ చిత్రాన్ని తెరకెక్కించారు డైరెక్టర్ గుణశేఖర్. శకుంతల, దుష్యంత మహారాజు అజరామరమైన ప్రేమకథను ఈ మూవీలో చూపిస్తున్నారు. ‘దిల్’ రాజు సమర్పణలో నీలిమ గుణ నిర్మించారు. ఈ సినిమా విడుదల ఇప్పటికే రెండు సార్లు వాయిదా పడి ఫైనల్‌గా ఏప్రిల్ 14న ప్రేక్షకుల ముందుకు వస్తోంది. తెలుగు, హిందీ, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో ఈ చిత్రం విడుదల కానుంది. -
Andhra Pradesh: రాష్ట్రవ్యాప్తంగా అన్ని పాఠశాలల్లో ‘గణగణ’
సాక్షి, అమరావతి: వేసవి సెలవుల అనంతరం రాష్ట్రవ్యాప్తంగా అన్ని పాఠశాలలు మంగళవారం నుంచి పునఃప్రారంభం కానున్నాయి. ఈ నేపథ్యంలో పాఠశాల విద్యాశాఖ స్కూల్ రెడీనెస్ కార్యక్రమాన్ని జూన్ 28నుంచే ఆరంభించింది. పాఠశాలల్లో పరిశుభ్రత, ఫర్నిచర్, మంచినీరు, మరుగుదొడ్ల సదుపాయాలతో పాటు మధ్యాహ్న భోజనం కోసం కిచెన్ షెడ్లు, వంట పరికరాలను సిద్ధం చేసింది. పాఠశాలలు తెరిచిన రోజే విద్యార్థులకు జగనన్న విద్యాకానుక అందించనున్నారు. బోధనా కార్యక్రమాలకు ఇబ్బంది కలగకుండా ఈ నెల 5వ తేదీనుంచి నెలాఖరు వరకు విద్యార్థులకు అందచేస్తారు. కొత్త విధానంలో స్కూళ్లు జాతీయ నూతన విద్యావిధానం ప్రకారం ప్రభుత్వ స్కూళ్లను పునర్వ్యవస్థీకరించి ఆరు రకాల విభాగాలుగా ప్రభుత్వం ఈ ఏడాది నుంచి ప్రారంభించనుంది. పునాది విద్యను బలోపేతం చేయడంలో భాగంగా ఫౌండేషన్ పాఠశాలలను ఏర్పాటు చేస్తున్న విషయం తెలిసిందే. స్కూళ్ల మెర్జింగ్, టీచర్ల సర్దుబాటు ప్రక్రియ దాదాపుగా ఒక కొలిక్కి వచ్చింది. విలీనమైన స్కూళ్లలో 3, 4, 5 తరగతుల విద్యార్ధులు సమీపంలోని ప్రీహైస్కూలు, హైస్కూళ్లలోకి వెళ్లనున్నారు. అక్కడ వారికి సబ్జెక్టు టీచర్లతో బోధనతో పాటు హైస్కూళ్లలోని ల్యాబ్‌లు, ఆటస్థలాలు, లైబ్రరీలు అందుబాటులోకి రానున్నాయి. వర్కింగ్ డేస్ 220 ఫౌండేషన్ స్కూళ్లు ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 3.30 వరకు పనిచేస్తాయి. గేమ్స్, రెమిడియల్ తరగతుల కోసం ఆప్షనల్ పీరియడ్‌ను 3.30 నుంచి 4.30 వరకు కొనసాగిస్తారు. హైస్కూళ్లు ఉదయం 9 నుంచి సాయంత్రం 4 వరకు పనిచేస్తాయి. ఆప్షనల్ పీరియడ్ సాయంత్రం 4 నుంచి 5 గంటల వరకు ఉంటుందని క్యాలెండర్లో పేర్కొన్నారు. ఈ విద్యాసంవత్సరంలో మొత్తం 220 రోజులు స్కూళ్ల పని దినాలుగా ఉంటాయి. దసరా, సంక్రాంతి, క్రిస్మస్ లాంటి సెలవులన్నీ కలిపి 80 రోజులు ఉంటాయి. సమ్మేటివ్, ఫార్మేటివ్, టెన్త్ ప్రీఫైనల్ పరీక్షల తాత్కాలిక తేదీలను కూడా పాఠశాల విద్యాశాఖ ప్రకటించింది. పెరుగుతున్న చేరికలు విద్యారంగానికి అత్యధిక ప్రాధాన్యమిస్తూ రాష్ట్ర ప్రభుత్వం పలు సంస్కరణలు చేపట్టిన సంగతి తెలిసిందే. మనబడి నాడు–నేడు కింద రూ.వేల కోట్లతో మౌలిక సదుపాయాలను కల్పిస్తోంది. జగనన్న విద్యాకానుక కింద విద్యార్ధుల చదువులకు అవసరమయ్యే వస్తువులను కిట్ల రూపంలో అందిస్తోంది. జగనన్న గోరుముద్ద ద్వారా రుచికరమైన, పోషక విలువలతో కూడిన ఆహారాన్ని సమకూరుస్తోంది. ఫలితంగా ప్రభుత్వ పాఠశాలల్లో చేరికలు ఏటా పెరుగుతున్నాయి. అందుకు అనుగుణంగా పాఠశాల విద్యాశాఖ ఏర్పాట్లు చేపట్టింది. పాఠశాలలను సిద్ధం చేయడంలో గ్రామ, వార్డు సచివాలయాల్లోని ఎడ్యుకేషన్ అసిస్టెంట్లను భాగస్వాముల్ని చేసింది. గోరుముద్ద, ఎంటీఎఫ్ నిర్వహణను గ్రామ, వార్డు సచివాలయాల్లో ఇతర సిబ్బందికి అప్పగించింది. అడ్మిషన్ల కోసం ఇంటింటి సందర్శన చేపట్టి ప్రభుత్వ పథకాలపై తల్లిదండ్రులకు అవగాహన కార్యక్రమాలను టీచర్లు నిర్వహిస్తున్నారు. 3, 4, 5 తరగతుల విలీనాన్ని అనుసరించి పిల్లల తరలింపు, టీచర్ల సర్దుబాటు బాధ్యతలను క్షేత్రస్థాయిలో ఆయా జిల్లాల కలెక్టర్ల ఆధ్వర్యంలో డీఈవోలు చర్యలు చేపట్టారు. ఇవీ 6 విభాగాలు శాటిలైట్ ఫౌండేషన్ స్కూళ్లు (పీపీ–1, పీపీ–2), ఫౌండేషన్ స్కూళ్లు (పీపీ–1, పీపీ–2, 1, 2వతరగతులు) ఫౌండేషన్ ప్లస్ స్కూళ్లు (పీపీ–1, పీపీ–2, 1 నుంచి 5వ తరగతివరకు) ప్రీ హైస్కూళ్లు (3వ తరగతి నుంచి 7, 8వ తరగతి వరకు) హైస్కూలు (3వ తరగతి నుంచి 10వ తరగతి వరకు) హైస్కూలు ప్లస్ (3వ తరగతి నుంచి 12వ తరగతి వరకు) -
AP: జూలై 5 నుంచి పాఠశాలల పునఃప్రారంభం
సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో అన్ని యాజమాన్యాల్లోని పాఠశాలలు వేసవి సెలవుల అనంతరం జూలై 5వ తేదీ నుంచి పునః ప్రారంభంకాను న్నాయి. పాఠశాలలను జూలై 4 నుంచి ప్రారంభించాలని పాఠశాల విద్యాశాఖ ఇంతకు ముందు ఉత్తర్వులు జారీచేసింది. అయితే ప్రధాని మోదీ జూలై 4న రాష్ట్రంలో వివిధ కార్యక్రమాల్లో పాల్గొనడానికి వస్తున్నారు. ప్రధాని పర్యటనలో సీఎం వైఎస్ జగన్ కూడా పాల్గొంటున్నందున పాఠశాలల పునః ప్రారంభాన్ని మరుసటి రోజుకు వాయిదా వేశారు. పాఠశాలల ప్రారంభం రోజున జగనన్న విద్యా కానుకను సీఎం విద్యార్థులకు అందించనున్నారని, అందుకను గుణంగా స్కూళ్లను 5వ తేదీ నుంచి ప్రారంభించనున్నామని పాఠశాల విద్యాశాఖ కమిషనర్ సురేష్‌కుమార్ తెలిపారు. (క్లిక్: పేదల చదువుకు చంద్రబాబే అడ్డంకి) -
వేసవి సెలవుల్లోనూ పిల్లలు నాలుగు గోడల మధ్యే ఉన్నారా?
ఎండకాలం సెలవుల్లో కూడా పిల్లలు నాలుగు గోడల మధ్య ఉన్నారా? వారికి మీరు పాదలేపనం పూయడం లేదనే అర్థం. వారి చేతికి కథల పుస్తకం ఇవ్వండి. అందులో రాకుమారుడు వద్దన్నా ఉత్తరం వైపుకు వెళతాడు. పిల్లలూ వెళతారు. రాక్షసుడు ఉన్న చోటుకు గండభేరుండ పక్షి మీద చేరుకుంటాడు. పిల్లలూ చేరుకుంటారు. తెలివైన కొడుక్కే రాజ్యం ఇస్తానని రాజు అంటే ఆ తెలివి పుస్తకం చదివే పిల్లలకూ వచ్చి జ్ఞానరాజ్యం దక్కుతుంది. వేసవి అంటే పిల్లలకు ఆటలు పాటలతోపాటు పుస్తకం కూడా. వారి చేతి నుంచి ఫోన్ లాక్కోండి. పుస్తకం ఇవ్వండి. ఇప్పటిలా పాడుకాలం కాదు. పూర్వం ఎండాకాలం సెలవులు ఎప్పుడొస్తాయా అని పిల్లలు కాచుక్కూచునేవారు. దేనికి? ఆడుకోవచ్చు. పాడుకోవచ్చు. కాని అసలు సంగతి కథలు ఎంత సేపైనా చదువుకోవచ్చు. అందుకే ఎదురుచూపు. పక్కింటి నుంచి, ఎదురింటి నుంచి, అద్దె పుస్తకాల షాపుల నుంచి చందమామ, బాలమిత్ర, బొమ్మరిల్లు, బుజ్జాయి, బాలజ్యోతి... ఇన్ని మేగజీన్లు... చాలక పాకెట్ సైజు పిల్లల నవలలు ‘మంత్రాల అవ్వ.. తంత్రాల తాత’, ‘భైరవ ద్వీపం’,‘కపాల మాంత్రికుడు’, ‘పేదరాశి పెద్దమ్మ’... ఇవన్నీ చదవడం... చాలనట్టు మేజిక్ ట్రిక్కుల పుస్తకాలు, లెక్కలతో చిక్కులు, సైన్లు ప్రయోగాలు, సూపర్‌మేన్.. స్పైడర్‌మేన్ కామిక్స్... వీటన్నింటిలో కూరుకుపోయేవారు... ఊహల లోకాల్లో తేలిపోయేవారు. వేసవి కాలం మండే ఎండల కాలం అందరికీ. పిల్లలకు మాత్రం కథలు చదివే కాలం. పుస్తకాల్లో మునిగే కాలం. సింద్బాద్... గలీవర్.. బాల్యంలో పుస్తకాలు చదివితే ఏమవుతుంది? సింద్బాద్.. గలీవర్ తెలుస్తారు. జీవితం అంటే ఉన్న చోటునే ఉండిపోవడం కాదని.. కదలాలని.. కొత్త ప్రపంచాలను చూడాలని... మనుషులను తెలుసుకోవాలని తెలుస్తుంది. అపాయాలు వచ్చినా విజయం వరిస్తుందనే ధైర్యం వస్తుంది. సింద్బాద్ సాహసాలు పిల్లల్ని ఉత్కంఠ రేపేలా చేస్తాయి. అతడు చేసిన సముద్ర యానాలలో ఎన్ని వింతలు. విడ్డూరాలు. సినిమా చూస్తే, గేమ్స్ చూస్తే వీలుకాని ఊహ, కల్పన చదవడం వల్ల పిల్లలకు వస్తుంది. వారి ఊహల్లో తామే సింద్బాద్లు అవుతారు. మత్స్యకన్యను చూస్తారు. రాకాసి సముద్రజీవితో తలపడతారు. ఇక గలీవర్ చేరుకునే లిల్లీపుట్ ల దేశం ఎంత వింత. చీమంత ఉన్నా వాళ్లు అందరూ కలిసి అపాయాన్ని ఎదుర్కొనాలని చూస్తారు. ఆ తర్వాత గలీవర్ మంచివాడని గ్రహిస్తారు. స్నేహితులను శత్రువులుగా పొరపడటం, శత్రువులను స్నేహితులుగా నమ్మడం ఈ పాఠాలు పిల్లలకు కథలే చెబుతాయి. అప్రమత్తం చేస్తాయి. సమయస్ఫూర్తి కథలు చదివితే సమయస్ఫూర్తి వస్తుంది. కఠినమైన సన్నివేశాలను కూడా సమయస్ఫూర్తితో దాటడం తెలుస్తుంది. మర్యాద రామన్న, బీర్బల్, తెనాలి రామలింగడు, షేక్ షిల్లీ, ముల్లా నసీరుద్దీన్, మర్యాద రామన్న వీరందరూ తమ కామన్సెన్స్ను ఉపయోగించే జటిల సమస్యలను ఛేదిస్తారు. పదహారు భాషలు తెలిసిన పండితుడు తన మాతృభాష కనిపెట్టమన్నప్పుడు తెనాలి రామలింగడు ఏం చేశాడు... ఒకే బిడ్డను ఇద్దరు తల్లులు నా బిడ్డంటే నా బిడ్డని కొట్లాడినప్పుడు మర్యాద రామన్న ఏం చేశాడు ఇవన్నీ పిల్లలకు తెలియాలి. అందుకు కథలు చదవాలి. ఇక చందమామలో చాలా కథలు పరీక్షలు పెడతాయి. ముగ్గురు వ్యక్తుల్లో ఎవరు తెలివైన వారైతే వారికి ఉద్యోగం, రాచకొలువు, సింహాసనం దక్కుతుందనుకుంటే సాధారణంగా మూడోవ్యక్తే గెలుస్తాడు. అతని తెలివి పిల్లలకు తెలుస్తుంది. నీతి– బతుకునీతి దేశదేశాల నీతి కథల భాండాగారం పిల్లల కోసం సిద్ధంగా ఉంది. మన పంచతంత్రం, అరేబియన్ నైట్స్, ఈసప్ కతలు... ఇవన్నీ నీతిగా బతకడం గురించి బతుకులో పాటించాల్సిన నీతి గురించి తెలియచేస్తాయి. బంగారు కడియం ఆశ చూపి గుటుక్కుమనిపించే పులులు, నమ్మించి మోసం చేసే గుంటనక్కలు జీవితంలో ఎదురుపడతాయని చెబుతూనే కలిసికట్టుగా ఉంటే వలను ఎగరేసుకుపోయి తప్పించుకోవచ్చని చెప్పే పావురాలను, వలను కొరికి ఉపయోగపడే స్నేహితులను చూపుతాయి. గుండె చెట్టు మీద ఉంది అని చావుతెలివి చూపి మొసలి నుంచి కాపాడుకునే కోతి పాఠం తక్కువది కాదు. నోర్మూసుకోవాల్సిన చోట నోరు మూసుకోకుండా తెరిచి ఆకాశం నుంచి కిందపడే తాబేలును చూసి ఎంతో నేర్చుకుంటారు. అత్యాశకు పోతే బంగారు గుడ్లు దక్కవని తెలుసుకుంటారు. రాకుమారుని వెంట ఎన్నో కతల్లో రాకుమారుడు సాహసాలు చేస్తాడు. పేదరాశి పెద్దవ్వ దగ్గర బస చేస్తే‘ఏ దిక్కయినా వెళ్లు కాని ఉత్తర దిక్కు మాత్రం వద్దు’ అంటుంది. రాకుమారుడు అటే వెళ్లి కష్టనష్టాలకు ఓర్చి విజయం సాధిస్తాడు. రిస్క్ అవతల కూడా అద్భుత విజయం ఉంటుంది అని ఈ కథలు చెబుతాయి. భట్టి విక్రమార్క కథలు తెగువను నేర్పిస్తాయి. ఎంతటి భయంకర మాంత్రికుణ్ణయినా ప్రాణం కనిపెట్టి తుద ముట్టించవచ్చని ఇతర కథలు చెబుతాయి. కథలు చదివిన వారి తెలివి, భాష, వకాబులరీ, ఉచ్ఛరణ... ఇవన్నీ కథలు చదవని వారి కంటే ఎక్కువ ఉన్నాయని అధ్యయనాలు చెబుతున్నాయి. స్కూళ్లు తెరిస్తే ఎలాగూ ఆ పాఠాల్లో పడక తప్పదు. నెల రోజులు దాదాపు చేతిలో ఉన్నాయి.పిల్లల్ని పుస్తకాల లోకంలోకి తోయండి. -
హైకోర్టుకు వేసవి సెలవులు
సాక్షి, అమరావతి: హైకోర్టుకు సోమవారం (9వ తేదీ) నుంచి జూన్ 10వ తేదీ వరకు వేసవి సెలవులు ప్రకటించారు. హైకోర్టు కార్యకలాపాలు తిరిగి జూన్ 13న ప్రారంభమవుతాయి. ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ప్రశాంత్ కుమార్ మిశ్రా ఆదేశాల మేరకు సెలవుల్లో అత్యవసర కేసుల విచారణకు వెకేషన్ కోర్టులు ఏర్పాటయ్యాయి. వెకేషన్ కోర్టుల్లో హెబియస్ కార్పస్ పిటిషన్లు, బెయిల్, ముందస్తు బెయిల్ పిటిషన్లు, సెలవులు పూర్తయ్యేంత వరకు వేచి చూడలేని అత్యవసర వ్యాజ్యాలు మాత్రమే దాఖలు చేయాలని హైకోర్టు స్పష్టంచేసింది. మొదటి దశ వెకేషన్ కోర్టులో న్యాయమూర్తులు జస్టిస్ కె.మన్మథరావు, జస్టిస్ తర్లాడ రాజశేఖర్, జస్టిస్ చీమలపాటి రవి ఉంటారు. ఇందులో జస్టిస్ మన్మథరావు, జస్టిస్ రాజశేఖర్ ధర్మాసనంలో, జస్టిస్ చీమలపాటి రవి సింగిల్ జడ్జిగా కేసులను విచారిస్తారు. రెండో వెకేషన్ కోర్టులో న్యాయమూర్తులు జస్టిస్ ఉప్మాక దుర్గాప్రసాదరావు, జస్టిస్ బొప్పూడి కృష్ణమోహన్, జస్టిస్ నిమ్మగడ్డ వెంకటేశ్వర్లు ఉంటారు. ఇందులో జస్టిస్ దుర్గా ప్రసాదరావు, జస్టిస్ కృష్ణమోహన్‌లు ధర్మాసనంలో, జస్టిస్ వెంకటేశ్వర్లు సింగిల్ జడ్జిగా కేసులను విచారిస్తారు. ఈ మేరకు హైకోర్టు రిజిస్ట్రార్ జనరల్ ఏవీ రవీంద్రబాబు నోటిఫికేషన్ జారీ చేశారు. -
Summer Tips: అల్పాహారంగా ఆవిరి కుడుములు, ఇడ్లీ తీసుకుంటే!
Summer Care- Tips In Telugu: చిన్నారులకు సెలవుల పండుగ వచ్చేసింది... టీచర్లకు కూడా కాస్త విరామం దొరికింది. కాకపోతే ఇంట్లో పెద్దవాళ్లే ఈ సిసింద్రీలతో వేగేదెలాగా... అని తలలు పట్టుకుని కూచుంటున్నారు. ఇంతకీ వేసవి అంటే మండే ఎండలూ, వడగాడ్పులేనా? చల్లటి తాటి ముంజలు, ఘుమ ఘుమలాడే మల్లెపూల పరిమళాలు, తియ్యటి మామిడి పళ్లు కాదా? ఇంకా సీమచింత కాయలు... కుండనీళ్ల చల్లదనం, సుగంధ పానీయాలు, చెరుకు రసాలు... ఊర్లు, టూర్లు... ఇవన్నీ కూడా వేసవి ఆనందాలే కదా! అందువల్ల ఎండలను తిట్టుకోవడం మాని ఎంజాయ్ చెయ్యండి. తగిన జాగ్రత్తలు తీసుకుంటే మే లోనూ వేసవి మేలుగానే అనిపిస్తుంది. సమ్మర్‌ను ఎలా గడిపితే బాగుంటుందో అవగాహన కోసం... నిప్పులు కక్కుతున్న సూరీడు పగలంతా ఎంత మండిపోతే మాత్రం.. భయపడేదెవరు? బండెడు హోమ్ వర్కు లేదు, ఇక కొన్ని రోజులపాటు సెలవులేనన్న భావనే.. చిన్నారుల్లో నూతనోత్తేజం కల్పించి ఉత్సాహంతో ఉరకలేయిస్తుంది. వాళ్ల పరుగులు, ఆటలు చూస్తుంటే పెద్దవాళ్లకు ఒక పక్క మురిపెంగానూ, మరోపక్క కాస్తంత గాభరాగానూ ఉంటుంది ఎండల నుంచి వీరిని కాపాడేదెలా అని... అయితే చిన్న జాగ్రత్తలతో సరైన ప్లానింగ్ ఉంటే అంత కంగారేమీ అక్కరలేదు. అప్పట్లో అయితే... వేసవి సెలవులు వస్తున్నాయంటే నెలరోజుల ముందునుంచే పల్లెపట్టుల్లోని పెద్దలు, ఇంటికి వచ్చే బంధువుల కోసం సరంజామా సిద్ధం చేసుకునేవారు. సెలవుల్లో అంతా కలుసుకోవడం, విభిన్న మనస్తత్వాలున్న వారంతా ఒక్కచోటకు చేరడం, ఇష్టాయిష్టాలు పక్కనపెట్టి కష్టసుఖాలు కలబోసుకోవడం, పెద్దలపై గౌరవంతో రాజీపడి సెలవులు గడిపేయడం లో మజాను మాటల్లో చెప్పలేం. పిల్లల ఆటల అల్లరి, వారిని కాపుకాయలేక పెద్దలు పడే అవస్థలు, తాతల ఆంక్షలు, చిన్నారులకు వత్తాసు పలికే అమ్మమ్మ, నానమ్మల మురిపాలు వేసవి ముచ్చట్లే. మండుటెండలు భయపెడుతూంటే మధ్యాహ్నపు వేళ పిల్లల్ని ఇంటిపట్టునే ఉండేట్లు చేయడంలో పెద్దలు తీసుకునే జాగ్రత్తలు వారిపై ఉండే మమతానురాగాలను వెల్లడిస్తాయి. కుండలో నీళ్లు, తరవాణి జలాలు దాహం తీర్చి, వడదెబ్బను ఢీకొట్టడంలో తిరుగులేనివే. ఎండలు తెచ్చే కష్టాలను వల్లెవేసి, వాటి పరిష్కారానికి చిట్కాలు చెప్పే పెద్దలు ఇప్పుడు తగ్గిపోయారు. వినే ఓపికా ఇప్పటి తరానికి లేదు. అలాగని ఈ మార్పును తప్పు బట్టలేం. ఆధునిక వైద్యం, మేలైన విధానాలు అందుబాటులోకి వచ్చాక చిట్కాలకు విలువ తగ్గింది. కానీ, చిట్కా వైద్యంలో అనురాగ బంధం కలగలసి పోవడంవల్ల ఆ రోజుల్లో చికిత్స బ్రహ్మాండమైన ఫలితాన్నిచ్చేది. సెలవుల్లో ఎక్కువమంది ఒకచోట చేరడం వల్ల విభిన్న మనస్తత్వాల గురించి తెలుసుకునే అవకాశం వస్తుంది. సమస్యలు, చికాకులు, సర్దుబాట్లు, మానవ సంబంధాల పట్ల అవగాహన కలిగేవి. అందరూ కలసి ఉండటానికి కొన్ని కుటుంబాలు సిద్ధమైతే ఎండలు ఎంత వేధించినా అంతా కలసి తీర్థయాత్రలు, విహార యాత్రలకు వెళ్లడం మరికొందరికి అలవాటు. ఆర్థికంగా ఉన్నా లేకపోయినా... అభిమానం ఉన్న కుటుంబాలన్నీ ఇలా వేసవిని వినోదంగా మార్చుకోవడం తెలుగుగడ్డపై కన్పించే వేడుక. కంప్యూటర్లలో గేమ్‌లు, వీడియో ఆటలు, ఫోన్ చాటింగ్‌లు, సోషల్ మీడియాలో ఊసులు కాలక్షేపం కలిగిస్తాయేగానీ అసలు ప్రపంచం ఎలా ఉంటుందో ప్రత్యక్షంగా తెలుసుకునే వెసులుబాటునివ్వవు. నలుగురితో కలవడం, నలుగురిలో నెగ్గుకురావడం ఈ ప్రపంచం నేర్పదు. అందుకే చిన్నారుల్లో మానసిక పరిపక్వత, మనోనిబ్బరం పెంచేందుకు ఒకప్పుడు సెలవులు ఉపయోగపడేవి. ఇప్పుడంత తీరిక వారికి చిక్కడం లేదు. లోకాన్ని అర్థం చేసుకునే నేర్పు పిల్లలకు కలగాలంటే వారు నలుగురిలోకి వెళ్లాలి. కుటుంబ బాంధవ్యాలు బలపడాలి. చదువుతోపాటు లోకజ్ఞానం ఉంటే ఆ చిన్నారి భవిష్యత్‌కు ఢోకా ఉండదు. ఇవి అవసరం... సెలవుల్లో యాత్రలు చేస్తే మంచిది. ఓ పార్కుకు వెళితే మొక్కల గురించి పిల్లలకు చెప్పాలి. ఓ జంతు ప్రదర్శనశాలకు వెళితే జంతువులు, పక్షులు, ఇతర జీవజాతులను ప్రత్యక్షంగా చూసిన అనుభవం వస్తుంది. పిల్లల్ని జూకు తీసుకువెళ్లాలి. మొక్కలకు నీళ్లుపోయడం, అవి పెరుగుతున్న విషయాన్ని వారికి వారుగా గుర్తించి చెప్పడంలో వాళ్లకి దొరికిన ఆనందం ఏ శిక్షణ శిబిరంలోనూ లభించదు. కొత్తకొత్త ప్రాంతాలకు తీసుకువెళితే ఆయా ప్రాంతాలపై అవగాహన కలుగుతుంది. అదే ఓ ప్లానెటోరియం కు తీసుకువెళితే కళ్లముందు ఖగోళం సాక్షాత్కరిస్తుంది. అక్కడ ఓ గంటసేపు ప్రదర్శన చూస్తే అంతరిక్షం, నక్షత్రాలు, గ్రహాలపై కనీస అవగాహన కలుగుతుంది. మానసిక, వ్యక్తిత్వ వికాస నిపుణులు చెప్పేది ఇదే. కొత్తవిద్యలు నేర్పించడం మంచిదే..కానీ ముందు మనసుకు చురుకుదనాన్ని ఇచ్చేదేమిటో కనిపెట్టి, అది పిల్లలకు అందించాలని చెబుతున్నారు. సృజనకు పదును ►చిన్నారులకు ఏం ఇష్టమో కనిపెట్టి వారికి అందులో అవకాశం కల్పించాలి. వారి అభినివేశాన్ని గమనించి సృజనకు పదునుపెట్టాలి. బొమ్మలు వేయడం, పాటలు పాడటం, ఆటలు ఆడటం, కథలు చెప్పడం, కథలు వినడం.., చిన్నచిన్న పక్షులు, జంతువులను పెంచడం వంటివి అలవాటు చేయాలి. పంటపొలాలు, నదులు, సాగరతీరాలకు తీసుకువెళితే పిల్లలకు కలిగే ఆనందం అదుర్సే కదా! ►పిల్లల ఇష్టాలను బట్టి వారికి ఆయా అంశాల్లో ప్రవేశం కల్పించాలి. వారిని స్వేచ్ఛగా వదిలేయాలి. అవసరమైనప్పుడు మాత్రమే జోక్యం చేసుకుని దారికి తెచ్చుకోవాలి. పిల్లలకు ఆటవిడుపునివ్వాలి. ►పిల్లల్లో ఆత్మవిశ్వాసం పెంపొందించే దిశగా తల్లిదండ్రులు చర్యలు తీసుకోవాలి. మహనీయుల జీవిత కథలు చెప్పి వారిలో స్ఫూర్తినింపాలి. నీతికథలు, శతకాలు బోధించాలి. సంస్కృతి, సంప్రదాయాల గొప్పతనం, పరిరక్షణకు తమ వంతు సహకారం అందించడం వంటి అంశాలను వివరించాలి. ఇతరులకు సాయం చేయడంలో ఉన్న ఆనందం గురించి అర్ధమయ్యేలా చెప్పాలి. తమ పనులు తామే చేసుకోవడం, పనుల్లో సాయపడటం, మొక్కల పెంపకం, క్విజ్ వంటి వాటిపై వారి దృష్టి మళ్లించాలి. ఇలా చేస్తే మండే మే ఎండలు కూడా ఎంతో మేలు చేస్తాయి. ఆహారం విషయంలో జాగ్రత్తలు ►వేసవిలో ఆయిల్ ఫుడ్స్ కి దూరంగా ఉండాలి. ►ఇంటి వంటలలో కూడా నూనె వాడకం తగ్గించాలి. ►ఆకుకూరలు ఎక్కువగా తీసుకోవాలి. మసాలా కూరలు తగ్గించాలి. ►అల్పాహారంగా ఆవిరి కుడుములు, ఇడ్లీ వంటివి తీసుకుంటే మేలు. ►కర్భుజా, పుచ్చకాయలు, ఈత కాయలు, తాటి ముంజలు వంటి సీజనల్ పండ్లు ఆరోగ్యానికి చాలా మంచిది. ►కాఫీ, టీ లకు బదులు రాగి జావ, కూల్ డ్రింకులు బదులుగా కొబ్బరి నీరు తాగాలి. ►పలచని మజ్జిగలో నిమ్మ రసం, ఉప్పు కలిపి పిల్లలు, పెద్దలు అందరు తాగితే ఆరోగ్యానికి చాలా మంచిది. ►వట్టి వేర్ల తెరలను తడిపి కిటికీలకు, గుమ్మాలకు కట్టుకుంటే వేడిని ఇంట్లోకి రానీయకుండా చల్లగా ఉంచుతుంది. ►పిల్లల చేత కంప్యూటర్ గేమ్స్ కాకుండా చదరంగం, క్యారమ్ బోర్డ్, పరమపద సోపాన పటం, ట్రేడ్, లూడో వంటివి ఆడించాలి. చదవండి👉🏾Barley Water Health Benefits: బార్లీ నీళ్లు.. అద్భుత ప్రయోజనాలు.. రోజూ గ్లాసుడు తాగారంటే! చదవండి👉🏾Oral Health Tips: నోటి దుర్వాసనకు చెక్! లవంగాలను తరచూ చప్పరిస్తున్నారా.. అయితే -
ఆంధ్రప్రదేశ్‌లో పాఠశాలలకు సెలవులు
సాక్షి, అమరావతి: రాష్ట్రంలోని అన్ని యాజమాన్యాల కింద ఉన్న పాఠశాలలకు శుక్రవారం నుంచి సెలవులు ప్రారంభం కానున్నాయి. టెన్త్ పరీక్షలు, విద్యార్థుల సమాధాన పత్రాల మూల్యాంకనం, ఇతర అకడమిక్ అంశాలకు సంబంధించిన కార్యకలాపాలు నిర్వహించాల్సి ఉన్నందున టీచర్లందరూ యథావిధిగా పాఠశాలలకు హాజరు కావాల్సి ఉంటుంది. టీచర్ల హాజరుతో పాఠశాలలు ఈనెల 20 వరకు కొనసాగించాలని పాఠశాల విద్యాశాఖ ఇంతకు ముందే సర్క్యులర్ జారీచేసిన సంగతి తెలిసిందే. ప్రాథమిక, ప్రాథమికోన్నత పాఠశాలలు ఉదయం 8 గంటల నుంచి 10.30 వరకు నిర్వహించాలని, పరీక్ష కేంద్రాలుగా ఉన్న పాఠశాలలను మధ్యాహ్నం 2 గంటల నుంచి 4.30 వరకు నిర్వహించాలని కమిషనర్ ఎస్.సురేష్‌కుమార్ సూచించారు. అలాగే 2021–22 విద్యాసంవత్సరంలో ఒక బేస్‌లైన్ టెస్టు, 3 ఫార్మేటివ్, 2 సమ్మేటివ్, ఒక ప్రీ ఫైనల్ పరీక్ష నిర్వహించారు. వీటితో పాటు విద్యార్థులలో పద సంపద, పరిజ్ఞానం పెంచేందుకు ‘లెర్న్ ఏ వర్డ్ ఏ డే’ పేరుతో బేస్‌లైన్ టెస్టు కూడా పెట్టారు. ఆ పరీక్షలకు సంబంధించి అన్ని జవాబు పత్రాలను మూల్యాంకనం పూర్తి చేసి పాఠశాల రిజిస్టర్లలో, ఆన్లైన్లో నమోదు చేయాలని కమిషనర్ సూచించారు. ఈనెల 13లోగా ఈ కార్యక్రమాన్ని పూర్తిచేయాలని పేర్కొన్నారు. వేసవి సెలవుల అనంతరం పాఠశాలలను జూలై 4వ తేదీనుంచి పునఃప్రారంభిస్తామని ఇంతకు ముందే కమిషనర్ ప్రకటించారు. -
పుస్తకాలు దానం చేయండి!
మే 5న ఆంధ్రప్రదేశ్‌లో విద్యా సంవత్సరం ముగుస్తుంది. ప్రతి ఏటా ఏప్రిల్ 23న విద్యాలయాలకి సెలవులు ఇస్తారు. కరోనా మహమ్మారి కారణంగా ఈ మే 5 వరకు పాఠశాలలు జరగనున్నాయి. సాధారణంగా సెలవులు వచ్చాయంటే విద్యార్థులకు ఎంతో ఆనందం కలుగుతుంది. అయితే పాఠశాల చివరి పనిరోజు వారు ఆనందంలో పాఠ్య పుస్తకాలు, నోటు పుస్తకాలు చించివేసి రహదార్లపై పడవేస్తుంటారు. ముఖ్యంగా ప్రయివేటు విద్యాలయాల్లో ఇటువంటి పరిస్థితి కనిపిస్తోంది. దీని వల్ల చెత్తాచెదారం పెరుగుతుంది. అసలే ప్లాస్టిక్, ఇతర వ్యర్థ పదార్థాలు డ్రైనేజీలలో నీరు నిల్వ ఉండి, దోమల పెరుగుదలకు కారణం అవుతున్నాయి. లక్షలాది మంది విద్యార్థులు ఒకే రోజు కాగితాలు చించివేయడం వల్ల, పారిశుద్ధ్య కార్మికులకి మరింత పనిభారం పెరుగుతుంది. నేల కాలుష్యం కూడా పెరుగుతుంది. సాధారణ ప్రజలకు కూడా అసౌకర్యంగా ఉంటుంది. (క్లిక్: అనుసంధాన భాషగా హిందీ అవసరం లేదా?) ఈ రోజు ఏ పోటీ పరీక్షల్లోనైనా ప్రాథమిక అంశాలను ఎక్కువగా అడుగుతున్నారు. చాలా మంది విద్యార్థులకు వీటిపై అవగాహన ఉండటం లేదు. ప్రాథమిక అంశాలు ఎక్కువగా కింది తరగతుల పుస్తకాలలోనే ఉంటాయి. పుస్తకాలను పారవేయకుండా వాటిని భద్రపరుచుకునేటట్లు తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు విద్యార్థులను ప్రోత్సహించాలి. వీలుంటే వేసవిలో వారి చేత పుస్తక పఠనం చేయించవచ్చు. అలాగే పాఠ్య పుస్తకాలు కొనుక్కోలేని పేద విద్యార్థులకు పుస్తకాలను వితరణ చేయవచ్చు. ఈ చిన్ని సాయమే వారికి పెద్ద చేయూత అవుతుంది. ఫలితంగా చిన్న వయసులోనే విద్యార్థుల్లో సామాజిక స్పృహ పెరుగుతుంది. – ఎం. రాంప్రదీప్, తిరువూరు -
రైళ్లకు సమ్మర్ రష్..!
సాక్షి, అమరావతి బ్యూరో: రైళ్లకు వేసవి తాకిడి మొదలైంది. మరికొద్ది రోజుల్లో స్కూళ్లు, కాలేజీలకు వేసవి సెలవులు ఇస్తుండడంతో ఇప్పట్నుంచే రిజర్వేషన్లు చేయించుకునే వారి సంఖ్య పెరుగుతోంది. దీంతో రానున్న నెలన్నర వరకు విజయవాడ మీదుగా రాకపోకలు సాగించే పలు రైళ్లలో బెర్త్‌లు ఫుల్ అయ్యాయి. వేసవి సెలవుల్లో పలువురు కుటుంబ సభ్యులతో స్వస్థలాలకు, బంధువుల ఊళ్లకు, విహార యాత్రలు, తీర్థ యాత్రలకు వెళ్తుంటారు. ఇతర రవాణా వ్యవస్థలకంటే రైలు ప్రయాణం చౌక కావడం, దూర ప్రాంతాలకు వెళ్లడానికి సౌకర్యవంతంగా ఉండటంతో ప్రయాణికులు ఎక్కువగా వీటినే ఎంచుకుంటారు. దీంతో వీటిలో బెర్తులకు ముందుగానే రిజర్వు చేయించుకుంటున్నారు. విజయవాడ జంక్షన్ మీదుగా 296 రైళ్లు రాకపోకలు సాగిస్తుంటాయి. వీటిలో డైలీ, వీక్లీ, బైవీక్లీ, ట్రైవీక్లీ రైళ్లు ఉన్నాయి. వీటితో పాటు విజయవాడ స్టేషన్ నుంచి 35 రైళ్లు వివిధ ప్రాంతాలకు వెళ్తుంటాయి. ఈ స్టేషన్ వరకు వచ్చి నిలిచిపోయే రైళ్లు మరో 23 ఉన్నాయి. వీటిలో దూరప్రాంతాలకు వెళ్లే రైళ్లలో చాలావరకు బెర్తులు వెయిట్ లిస్టులే దర్శనమిస్తున్నాయి. వేసవి నుంచి ఉపశమనం పొందడం కోసం ఎగువ మధ్య తరగతి ప్రయాణికులు ఏసీ బెర్తులకే ప్రాధాన్యమిస్తున్నారు. దీంతో స్లీపర్ క్లాస్‌కంటే ముందుగానే ఏసీ బెర్తులు ఫుల్ అవుతున్నాయి. ముఖ్యంగా థర్డ్ ఏసీకి డిమాండ్ అధికంగా ఉంది. విజయవాడ–విశాఖ రూట్‌కు డిమాండ్ విజయవాడ–హైదరాబాద్ రూటుకంటే విజయవాడ–విశాఖపట్నం వైపు ప్రయాణించే రైళ్లలో వెయిట్ లిస్టు సంఖ్య ఎక్కువగా ఉంది. విజయవాడ– సికింద్రాబాద్ మార్గంలో నడిచే కొన్ని రైళ్లలో రానున్న నెల, నెలన్నర వరకు బెర్తులు లభిస్తున్నా యి. విజయవాడ–విశాఖ మార్గంలో బెర్తులన్నీ అయిపోయి వెయిట్ లిస్టులు దర్శనమిస్తున్నాయి. మే 20వ తేదీకి విజయవాడ – విశాఖ మధ్య కోరమాండల్ స్లీపర్ వెయిట్ లిస్ట్ 17 కాగా థర్డ్ ఏసీ వెయిట్ లిస్ట్ 18 ఉంది. గోదావరి స్లీపర్ వెయిట్ లిస్ట్ 83కు చేరింది. మిగతా రైళ్లదీ ఇదే పరిస్థితి. వేసవికి ప్రత్యేక రైళ్లు వేసవి రద్దీని దృష్టిలో ఉంచుకుని రైల్వే శాఖ ప్రత్యేక రైళ్లను నడుపుతోంది. ఈ వేసవిలో విజయవాడ మీదుగా సుమారు 55 సమ్మర్ స్పెషల్ రైళ్లను అందుబాటులో ఉంచింది. ఇవి ప్రయాణికుల రద్దీని నియంత్రిస్తాయని అధికారులు చెబుతున్నారు. పరీక్షల అనంతరం.. ఈనెల 27 నుంచి మే 9 వరకు పదో తరగతి పరీక్షలు జరగనున్నాయి. ఇంటర్మీడియట్ పరీక్షలు మేలో ఉన్నాయి. ఈ పరీక్షల అనంతరం వేసవి సెలవులు ప్రారంభమవుతాయి. ప్రాథమిక, ప్రాథమికోన్నత పాఠశాలల పిల్లలకు సమ్మేటివ్ పరీక్షలు పూర్తి కాగానే వేసవి సెలవులు ఇస్తారు. అంటే మే మొదటి వారంలోనే వీరికి సెలవులు ప్రకటిస్తారు. ఇందుకు అనుగుణంగా తల్లిదండ్రులు వివిధ ప్రాంతాలకు వెళ్లేందుకు ముందస్తుగానే రైళ్లలో రిజర్వేషన్లు చేసుకుంటున్నారు. దీంతో రైళ్లలో బెర్తులు దొరకడంలేదు. ఇంటర్ సిటీ, పాసింజర్ రైళ్లు మినహా దూరప్రాంత రైళ్లలో వెయిట్ లిస్టు కొండవీటి చాంతాడంత కనిపిస్తోంది. -
6 నుంచి జూలై 3 వరకు స్కూళ్లకు వేసవి సెలవులు
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో మే 6 నుంచి జూలై 3 వరకు ప్రభుత్వం పాఠశాలలకు వేసవి సెలవులను ప్రకటించింది. జూలై 4న పాఠశాలలు తిరిగి ప్రారంభమవుతాయి. ఈ మేరకు పాఠశాల విద్యాశాఖ కమిషనర్ ఎస్.సురేష్ కుమార్ శనివారం ఉత్తర్వులు జారీ చేశారు. మే 4 లోగా 1–9 తరగతుల విద్యార్థులకు పరీక్షల నిర్వహణను పూర్తి చేయాలని ఆదేశించారు. ఆ తర్వాత టీచర్లు పరీక్షల మూల్యాంకనం పూర్తి చేయాలి. మే 5న ఇంగ్లిష్ లాంగ్వేజ్, వొకాబులరీపై విద్యార్థులకు బేస్‌లైన్ టెస్టు నిర్వహిస్తారు. ఆ తర్వాత మే 6 నుంచి జూలై 3 వరకు విద్యార్థులకు సెలవులు ఇచ్చినా పాఠశాలలు మే 20 వరకు కొనసాగనున్నాయి. టీచర్లు మే 20 వరకు విధులకు హాజరవ్వాలి. పదో తరగతి పరీక్షలు, మూల్యాంకనం, మార్కులు, ఇతర సమాచారం అప్లోడింగ్ తదితరాల దృష్ట్యా 20 వరకు స్కూళ్లు కొనసాగనున్నాయని కమిషనర్ వివరించారు. -
ఇంటర్ కాలేజీలకు వేసవి సెలవులు ఎప్పటినుంచీ అంటే..
సాక్షి, అమరావతి: జూనియర్ కళాశాలలు, కాంపోజిట్ డిగ్రీ కళాశాలలకు 2021–22 విద్యా సంవత్సరానికి వేసవి సెలవులు మే 25వ తేదీ నుంచి అమలవుతాయని ఇంటర్మీడియట్ విద్య కమిషనర్ ఎం.వి.శేషగిరిబాబు శనివారం ఒక ప్రకటన విడుదల చేశారు. జూన్ 19 వరకు ఈ సెలవులు ఉంటాయి. వేసవి సెలవుల తర్వాత జూన్ 20 నుంచి 2022–23 విద్యా సంవత్సరానికి కాలేజీలు ప్రారంభం అవుతాయి. కొన్ని కళాశాలలు వేసవి సెలవుల్లో కూడా పనిచేస్తూ తరగతులు నిర్వహిస్తున్నట్లు తమ దృష్టికి వచ్చిందని, అటువంటి కళాశాలలపై చర్యలు తీసుకుంటామని కమిషనర్ హెచ్చరించారు. అన్ని యాజమాన్యాలు ప్రైవేట్ అన్ఎయిడెడ్ జూనియర్ కాలేజీలకు 2021–22 వార్షిక క్యాలెండర్ ప్రకారం మే 25 నుంచి జూన్ 19 వరకు వేసవి సెలవుల కోసం జూనియర్ కాలేజీలు మూసివేయాల్సిందేనని స్పష్టం చేశారు. బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ ప్రకటించిన అడ్మిషన్ షెడ్యూల్‌కు అనుగుణంగా మాత్రమే అడ్మిషన్లు చేపట్టాలన్నారు. విద్యార్థులను బలవంతం చేయడానికి/ఒప్పించడానికి /ఆకర్షించడానికి ఏ కళాశాల కూడా అనవసరమైన ప్రచారాల్లో పాల్గొనకూడదని తెలిపారు. కాలేజీల మధ్య అనారోగ్యకరమైన పోటీని కలిగించే హోర్డింగ్‌లు, కరపత్రాలు, వాల్ రైటింగ్‌లు, ఎలక్ట్రానిక్ మీడియా, ప్రింట్ మీడియా మొదలైన వాటి ద్వారా ఎలాంటి ప్రకటనలు చేయకూడదన్నారు. అన్ఎయిడెడ్ జూనియర్ కాలేజీల ప్రిన్సిపాల్స్ అందరూ పబ్లిక్ పరీక్షలో పనితీరు లేదా విజయానికి ఎలాంటి హామీని ఇవ్వకూడదని ఆదేశించారు. నిబంధనలు ఉల్లంఘిస్తే చట్టం ప్రకారం చర్యలు తీసుకుంటామని స్పష్టీకరించారు. హాల్ టికెట్లు సిద్ధం రాష్ట్రంలో మార్చి 2022 ఇంటర్మీడియట్ పబ్లిక్ పరీక్షలకు (థియరీ) హాజరు కానున్న ప్రథమ, ద్వితీయ సంవత్సరాలకు సంబంధించిన విద్యార్థుల హాల్ టికెట్లు (జనరల్, ఒకేషనల్) ఆయా కళాశాలల ప్రిన్సిపాల్స్ (జ్ఞాన భూమి) లాగిన్‌లో అప్లోడ్ చేసినట్లు ఇంటర్మీడియట్ విద్య కమిషనర్ ఎం.వి.శేషగిరిబాబు శనివారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. విద్యార్థులు సంబంధిత కళాశాలల ప్రిన్సిపాళ్లను సంప్రదించి తమ హాల్ టికెట్లు పొందాలన్నారు. అన్ని జిల్లాల ప్రాంతీయ పర్యవేక్షణాధికారులు ఈ విషయాన్ని వారి జిల్లాల్లోని అన్ని కాలేజీల ప్రిన్సిపాళ్లకు తెలియజేయాలని ఆదేశించారు. -
తెలంగాణలో వేసవి సెలవులు ఎప్పటి నుంచంటే..!
సాక్షి, హైదరాబాద్: పాఠశాలలకు ఈ నెల 24 నుంచి వేసవి సెలవులు ఇవ్వనున్నారు. అయితే, టెన్త్ పరీక్షలు ముగిసేవరకూ పాక్షికంగా పాఠశాలలు తెరిచే ఉంటాయి. ఇందుకు సంబంధించిన విధివిధానాలు బుధ, గురువారాల్లో వెలువడే అవకాశ ముంది. 1 నుంచి 9 తరగతులకు ఎస్ఏ–2 పరీక్షలు, ప్రోగ్రెస్ రిపోర్టులు ఇవ్వడం ఈ నెల 23తో ముగుస్తాయి. టెన్త్ పరీక్షలు మే 23 నుంచి ప్రారంభమై జూన్ 1 వరకూ జరుగుతాయి. అప్పటివరకూ ఒక్కో సబ్జెక్టు టీచర్ హాజరై టెన్త్ విద్యార్థులకు పాఠాలు చెబుతారు. వారు పనిచేసిన ఈ దినాలను ఎర్న్డ్ లీవ్‌లుగా పరిగణిస్తారు. దీనిపై అధికారులు ఓ నిర్ణయానికి వచ్చారు. (చదవండి: రికార్డు స్థాయిలో యాదాద్రీశుడి ఆదాయం ) -
ఉత్తర భారతదేశ యాత్రకు ప్రత్యేక రైళ్లు
సాక్షి, అమరావతి/రైల్వేస్టేషన్ (విజయవాడ పశ్చిమ): ఉత్తర భారతదేశ యాత్రకు భారతీయ రైల్వే ప్రత్యేక రైళ్లను నడుపుతున్నట్లు ఐఆర్సీటీసీ సికింద్రాబాద్ డిప్యూటీ జనరల్ మేనేజర్ (టూరిజం) జీపీ కిషోర్‌సత్య తెలిపారు. బుధవారం విజయవాడలోని రైల్వే స్టేషన్లో విలేకరులతో మాట్లాడుతూ ‘మహాలయ పిండదాన్’ పేరుతో వారణాసి, ప్రయాగ్ సంగం, గయా ప్రాంతాలు చుట్టివచ్చేలా ఐదు రాత్రులు, ఆరు రోజుల ప్యాకేజీతో రైలును ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు. సికింద్రాబాద్ నుంచి సెప్టెంబర్ 15వ తేదీన ఈ రైలు బయలుదేరి..20వ తేదీ గమ్యస్థానానికి చేరుకుంటుందన్నారు. ప్రభుత్వ ఉద్యోగులకు ఎల్టీసీ సౌకర్యాన్ని వినియోగించుకోవచ్చని సూచించారు. ఏఎం మురళీకృష్ణతో కలిసి ప్యాకేజీ కరపత్రాలను ఆవిష్కరించారు. మాత వైష్ణోదేవి యాత్ర.. స్వదేశీ దర్శన్ పేరుతో ఆగ్రా, మధుర, వైష్ణోదేవి దర్శనం, అమృత్‌సర్‌లో పర్యటించేలా ప్రత్యేక రైలు ప్యాకేజీలను రూపొందించామని కిషోర్‌సత్య తెలిపారు. మే 27వ తేదీన తిరుపతి–రేణిగుంట నుంచి ప్రారంభమయ్యే ఈ రైలు జూన్ 3వ తేదీనమ గమ్య స్థానానికి చేరుకుంటుందన్నారు. హైదరాబాద్ నుంచి కేరళ, తమిళనాడు, ఉత్తరాఖాండ్, నేపాల్, తిరుపతికి విమాన ప్యాకేజీలను కూడా అందుబాటులో ఉంచామన్నారు. వివరాలకు ఐఆర్సీటీసీ టూరిజం వెబ్సైట్, 9701360675, 9701360701 నంబర్లలో సంప్రదించాలని కిషోర్‌సత్య సూచించారు. విజయవాడ మీదుగా 4 ప్రత్యేక రైళ్లు వేసవి సెలవుల్లో ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకుని విజయవాడ మీదుగా 4 ప్రత్యేక రైళ్లను నడపనున్నట్లు రైల్వే అధికారులు తెలిపారు. సికింద్రాబాద్–తిరుపతి (07433) ఈ నెల 15న రాత్రి 7.50 గంటలకు సికింద్రాబాద్‌లో బయలుదేరి, మరుసటి రోజు ఉదయం తిరుపతి చేరుకుంటుంది. తిరుగు ప్రయాణంలో ఈ రైలు (07434) ఈ నెల 16న రాత్రి 8.25 గంటలకు తిరుపతిలో బయలుదేరి, మరుసటి రోజు ఉదయం సికింద్రాబాద్ చేరుకుంటుంది. నాందేడ్–విశాఖపట్నం (07082) రైలు ఈ నెల 15న సాయంత్రం 4.35 గంటలకు నాందేడ్‌లో బయలుదేరి, మరుసటి రోజు ఉదయం 9.50 గంటలకు విశాఖపట్నం చేరుకుంటుంది. తిరుగు ప్రయాణంలో ఈ రైలు (07083) 17న సాయంత్రం 6.20 గంటలకు విశాఖలో బయలుదేరి, మరుసటి రోజు మధ్యాహ్నం 3.10 గంటలకు నాందేడ్ చేరుకుంటుంది. -
ఏప్రిల్ నుంచి ఒంటిపూట బడులు
సాక్షి, అమరావతి: రాష్ట్రంలోని పాఠశాలల్లో వచ్చే నెల మొదటి వారం నుంచి ఒంటిపూట తరగతులు నిర్వహించనున్నారు. ఈ విద్యా సంవత్సరంలో పాఠశాలల పని దినాలు తక్కువగా ఉన్నందున విద్యాశాఖ ఈ నిర్ణయానికి వచ్చినట్లు అధికార వర్గాలు తెలిపాయి. ఏటా జూన్ 12 నుంచి పాఠశాలలను తిరిగి తెరుస్తుండగా.. 2021–22 విద్యాసంవత్సరంలో కరోనా వల్ల ఆగస్ట్ మూడో వారం నుంచి ప్రారంభమైన విషయం తెలిసిందే. దీంతో పని దినాలు తగ్గాయి. ఈ పరిస్థితుల్లో కొన్ని సెలవు దినాల్లోనూ పాఠశాలలు పనిచేసేలా, కనీసం 180 పని దినాలు ఉండేలా క్యాలెండర్‌ను సర్దుబాటు చేసింది. అయితే, సిలబస్ ఇంకా పూర్తి కానందున ఒంటిపూట బడులను ఈ నెల నుంచి కాకుండా వచ్చే నెల మొదటి వారం నుంచి ప్రారంభించాలని విద్యాశాఖ భావిస్తోంది. మే నుంచి జూన్ వరకు వేసవి సెలవులు కాగా, పాఠశాలలను ఏప్రిల్ చివరి వరకు కొనసాగించి.. మే మొదటి వారం నుంచి వేసవి సెలవులు ప్రకటించనున్నారు. మేలో పదో తరగతి పరీక్షలు జరగనున్నందున ఉపాధ్యాయులు, సిబ్బంది ఆ విధులకు హాజరు కావాల్సి ఉంటుంది. పరీక్షలు ఆలస్యమవ్వనున్నందున సెలవులను జూన్ చివరి వరకు పొడిగించాలని అధికారులు భావిస్తున్నారు. జూన్ 12 నుంచి పాఠశాలలు ప్రారంభం కావలసి ఉన్నా ఈ విద్యా సంవత్సరంలో పాఠశాలలను జూలై మొదటి వారం నుంచి ప్రారంభించే అవకాశాలున్నాయని అధికారులు పేర్కొంటున్నారు. -
విద్యార్థులకు ఏపీ సర్కార్ గుడ్‌న్యూస్..
సాక్షి, అమరావతి: ప్రభుత్వ పాఠశాలల్లో 1నుంచి 10వ తరగతి విద్యార్థులకు మూడో విడత జగనన్న విద్యా కానుక కిట్లను వచ్చే విద్యా సంవత్సరం ప్రారంభంలోనే అందజేయాలని విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ అధికారులను ఆదేశించారు. ఇందుకు అవసరమైన టెండర్ల ప్రక్రియను త్వరగా పూర్తిచేసి ఏజెన్సీలకు వర్క్ ఆర్డర్లు జారీ చేయాలన్నారు. మంగళవారం సచివాలయంలో విద్యా శాఖ అధికారులతో సమీక్ష నిర్వహించారు. చదవండి: ఆర్జీవీకి మంత్రి పేర్ని నాని కౌంటర్ మంత్రి సురేష్ మాట్లాడుతూ వేసవి సెలవుల్లోనే విద్యాకానుక కిట్లు పాఠశాలలకు చేరేలా చర్యలు చేపట్టాలన్నారు. జగనన్న అమ్మ ఒడి, విద్యాదీవెన పథకాలకు అర్హుల జాబితాను సిద్ధం చేయాలని సూచించారు. నాడు–నేడు పథకం కింద పాఠశాలల్లో మౌలిక వసతుల మెరుగుదల, క్రీడా ప్రాంగణాల అభివృద్ధి పనుల పురోగతిపై ఆరా తీశారు. విద్యా సంస్కరణల్లో భాగంగా తీసుకొస్తున్న ఫౌండేషన్ స్కూళ్ల అమలుకు ప్రభుత్వ పాఠశాలలు, టీచర్ల మ్యాపింగ్, హైస్కూళ్లలో ఉపాధ్యాయుల భర్తీపై చర్చించారు. -
తెలంగాణలో స్కూళ్లకు వేసవి సెలవులు పొడిగింపు
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో ఈ నెల 20 వరకు స్కూళ్లకు వేసవి సెలవులను ప్రభుత్వం పొడిగించింది. ఈ మేరకు స్కూల్ ఎడ్యుకేషన్ డైరెక్టర్ ఉత్తర్వులు జారీ చేశారు. కాగా, ప్రస్తుతం తెలంగాణలో కరోనా కేసులు తగ్గుముఖం పడుతున్నాయి. ప్రభుత్వం.. కరోనా రెండో వేవ్ నియంత్రణ కోసం రాష్ట్రంలో విధించిన లాక్‌డౌన్‌ను పొడిగిస్తూ, పలు సడలింపులు ఇచ్చింది. ఈ నెల 19 వరకు లాక్డౌన్ అమలులో ఉంది. సాయంత్రం 6 గంటల నుంచి మరుసటి రోజు ఉదయం 6 గంటల వరకు లాక్డౌన్ అమలవుతోంది. ప్రస్తుత కరోనా పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని తెలంగాణ ప్రభుత్వం ఇంటర్ మీడియట్ రెండవ సంవత్సరం పరీక్షలను కూడా రద్దు చేసింది. మొదటి సంవత్సరం విద్యార్థులను సెకండ్ ఇయర్‌కు ప్రమోట్ చేసింది. ఈ మేరకు సోమవారం అధికారిక ఉత్తర్వులు జారీ చేసిన సంగతి తెలిసిందే. చదవండి: తెలంగాణ: మరో వారంలో ఇంటర్ ఫలితాలు నేను తెలంగాణ సంస్కృతిని కించపరచలేదు: హైపర్ ఆది -
10 నుంచి హైకోర్టుకు వేసవి సెలవులు
సాక్షి, అమరావతి: కరోనా తీవ్రత దృష్ట్యా హైకోర్టుతో పాటు దిగువ కోర్టులకు వేసవి సెలవులను నాలుగు రోజుల ముందే ఇవ్వాలని హైకోర్టు నిర్ణయం తీసుకుంది. హైకోర్టుకు ఈ నెల 10వ తేదీ నుంచి జూన్ 11వ తేదీ వరకు వేసవి సెలవులను ప్రకటించింది. వాస్తవానికి హైకోర్టు అధికారిక క్యాలెండర్ ప్రకారం ఈనెల 14 నుంచి జూన్ 11 వరకు వేసవి సెలవులు ఇవ్వాల్సి ఉంది. అయితే అక్టోబర్ 23తో పాటు సెలవు దినాలుగా ప్రకటించిన నవంబర్ 3, 5 తేదీలను పని దినాలుగా ప్రకటించింది. ఇదే సమయంలో జిల్లా కోర్టులు, సీనియర్ సివిల్ జడ్జి కోర్టులకు ఈ నెల 10 నుంచి జూన్ 8 వరకు సెలవులు ప్రకటించారు. జూనియర్ సివిల్ జడ్జి కోర్టులకు ఈ నెల 17 నుంచి జూన్ 8 వరకు సెలవులు ఇచ్చారు. ఈ మేరకు హైకోర్టు రిజిస్ట్రార్ జనరల్ ఉత్తర్వులు జారీ చేశారు. -
రేపట్నుంచి పాలిటెక్నిక్ కళాశాలలకు వేసవి సెలవులు
సాక్షి, హైదరాబాద్ : తెలంగాణలోని ప్రభుత్వ, ప్రైవేటు పాలిటెక్నిక్ కళాశాలలకు వేసవి సెలవులు వచ్చాయి. ఈ నెల 5వ తేదీ నుంచి వేసవి సెలవులు అని సాంకేతిక విద్యాశాఖ మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది. మే 31వ తేదీ వరకు వేసవి సెలవులు ఉంటాయని స్పష్టం చేసింది. సవరించిన అకడమిక్ షెడ్యూల్‌ను త్వరలోనే ప్రకటిస్తామని సాంకేతిక విద్యాశాఖ కమిషనర్ నవీన్ మిట్టల్ తెలిపారు. చదవండి: సంపూర్ణ లాక్‌డౌనే ఏకైక మార్గం: ఎయిమ్స్ డైరెక్టర్ చదవండి: వ్యాక్సిన్‌పై ప్రధానికి లేఖ రాయనున్న సీఎం -
‘పది’ విద్యార్థులకు సెలవులు: ఫోన్లో నిత్యం అందుబాటులో
సాక్షి, అమరావతి: కోవిడ్–19 ప్రభావంతో తీవ్రంగా నష్టపోయినవారిలో మొదటి వరుసలో పదోతరగతి విద్యార్థులు ఉంటారు. విద్యా సంవత్సరంలో సగం కరోనాతో పాఠశాలలు మూతపడ్డాయి. మిగతా సగం పూర్తవకముందే మరోసారి మహమ్మారి విరుచుకుపడటంతో ఉన్నపళంగా మే ఒకటో తేదీ నుంచి వేసవి సెలవులు ప్రకటించాల్సిన పరిస్థితి నెలకొంది. ఈ నేపథ్యంలో విద్యార్థులు ఎంతో జాగ్రత్తగా ఉండాల్సిన అవసరముంది. ఆదమరిస్తే ఫలితాలు తారుమారయ్యే ప్రమాదమున్నందున సెలవు రోజుల్లో విద్యార్థులు బడి లేదన్న భావనతో నిర్లక్ష్యంగా వ్యవహరించకుండా జాగ్రత్తగా చదువుకుంటేనే మంచి మార్కులు తెచ్చుకోగలుగుతారని ఉపాధ్యాయులు సలహా ఇస్తున్నారు. కరోనా విస్తృతంగా వ్యాప్తి చెందుతున్న నేపథ్యంలో విద్యార్థులు ఇంటిపట్టునే ఉండి మహమ్మారి బారిన పడకుండా జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. జిల్లా వ్యాప్తంగా ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలల్లో చదువుతున్న 61,589 మంది విద్యార్థులు పరీక్షల రాయటానికి సిద్ధంగా ఉన్నారు. కీలకమైన నెలలో సెలవులు... గతేడాది సెప్టెంబర్‌లో 9, 10 తరగతుల విద్యార్థులకు సందేహాల నివృత్తి కోసం పాఠశాలలు తెరచినా డిసెంబర్ నుంచే పూర్తి స్థాయిలో తరగతిలో పాఠాలు చెప్పగలిగే అవకాశం వచ్చింది. కరోనా కారణంగా కొంత సమయం కోల్పోవడంతో ప్రభుత్వం విద్యా సంవత్సరాన్ని కొంతమేరకు పొడిగించింది. సాధారణంగా మార్చి మూడో వారంలో ప్రారంభం కావాల్సిన పదో తరగతి పరీక్షలను ఈ ఏడాది జూన్ ఏడు నుంచి 16వ తేదీ మధ్య నిర్వహించడానికి షెడ్యూల్ విడుదల చేసింది. విద్యార్థులు పరీక్షలను ఎదుర్కోవడానికి కీలకమైన ఆఖరి నెల రోజులు కరోనా కారణంగా పాఠశాలలకు సెలవులు ప్రకటించాల్సి రావడంతో వారి చదువుపై తీవ్రంగా ప్రభావం చూపనుంది. పబ్లిక్ పరీక్షల ముందు సన్నాహక పరీక్షలు, సబ్జెక్టుల వారీగా విశ్లేషణ చేసుకోవడం, సందేహాలను నివృత్తి చేసుకోవాల్సిన సమయంలో సెలవులు విద్యార్థులకు ఇబ్బందికరమే అయినా దానిని సరైన ప్రణాళికతో అధిగమించాల్సిన అవసరముంది. అలసత్వం వహిస్తే అసలుకే మోసం.. వరుస సెలవులతో విద్యార్థుల్లో అలసత్వం, అశ్రద్ధ సహజంగానే ఏర్పడతాయి. సంవత్సరమంతా కష్టపడి చదివింది మర్చిపోయే ప్రమాదం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఏమాత్రం ఏమరుపాటు ప్రదర్శించినా పిల్లల్లో అలసత్వం వహించి అసలుకే మోసం వచ్చే ప్రమాదం ఉందంటున్నారు. పరీక్షల సమయంలో సాధారణంగా విద్యార్థులు చదివిన పాఠ్యాంశాలను పునశ్చరణ చేసుకుంటూ ఉంటారు. ప్రైవేట్ పాఠశాలల్లో అయితే ఉపాధ్యాయులు విద్యార్థులను రాత్రీపగలు పాఠశాలల్లోనే పుస్తకాలతో కుస్తీ పట్టిస్తారు. ఇప్పుడున్న పరిస్థితుల్లో విద్యార్థులకు అలాంటి అవకాశం లేదు. డిజిటల్ వేదికగా అందుబాటులో ఉపాధ్యాయులు.. సెలవుల కారణంగా విద్యార్థులు చదువులో వెనుకబడకుండా ఉండేందుకు ఉపాధ్యాయులు వాట్సాప్‌ను పూర్తిస్థాయిలో వినియోగించుకుంటున్నారు. విద్యార్థులు ఉపాధ్యాయులతో ఫోన్లో మాట్లాడి సందేహాలు నివృత్తి చేసుకుంటున్నారు. నమూనా ప్రశ్నపత్రాలను తయారు చేసి వాట్సాప్ గ్రూపుల్లో విద్యార్థులకు చేరవేస్తున్నారు. పలు పాఠ్యాంశాలకు చెందిన వీడియోలను షేర్ చేస్తున్నారు. అనుమానాలను నివృత్తి చేయడానికి ఉపాధ్యాయులు ఫోన్లో రికార్డ్ చేసి పిల్లల మొబైల్‌కు పంపుతున్నారు. ఈ సదుపాయాలను విద్యార్థులు పూర్తిస్థాయిలో సద్వినియోగం చేసుకోవాలని విద్యాశాఖ అధికారులు సూచిస్తున్నారు. సెలవులను పూర్తిస్థాయిలో వినియోగించుకుంటే సబ్జెక్టుల వారీగా విద్యార్థులు పట్టు సాధించవచ్చని ఉపాధ్యాయులు పేర్కొంటున్నారు. తల్లిదండ్రులు తగిన ఏర్పాట్లు చేయాలి... పిల్లల చదువుల కోసం తల్లిదండ్రులు ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. వారికి బలవర్థకమైన ఆహారం అందిస్తూనే కోవిడ్ బారిన పడకుండా కనిపెట్టుకోవాలని పేర్కొంటున్నారు. సందేహాలు నివృత్తి చేసుకునేలా పిల్లలను ప్రోత్సహించాలని సూచిస్తున్నారు. ఫోన్లో నిత్యం అందుబాటులో... పదో తరగతి విద్యార్థులతో పాటు వారి తల్లిదండ్రులూ అప్రమత్తంగా ఉండాలి. విద్యార్థులు అలసత్వం ప్రదర్శిస్తే ఫలితాలు తారుమారయ్యే ప్రమాదముంది. విద్యార్థులు ఒక్కో సబ్జెక్టుకు రోజులో కొంత సమయాన్ని కేటాయించేలా టైం టేబుల్ వేసుకుని రివిజన్ చేసుకోవాలి. ఉపా«ధ్యాయులందరం విద్యార్థులకు నిత్యం ఫోన్లో అందుబాటులో ఉంటున్నాం. వారికి సందేహం వస్తే ఫోన్ ద్వారా నివృత్తి చేస్తున్నాం. వాట్సాప్ గ్రూపులను ఏర్పాటు చేసి మోడల్ పేపర్లు, చార్టులను షేర్ చేస్తున్నాం. – సీహెచ్ సుమతి, గణిత ఉపాధ్యాయురాలు, జెడ్పీ హైస్కూల్, దొనపూడి, కొల్లూరు మండలం సెలవులను సద్వినియోగం చేసుకోవాలి విద్యార్థులు కరోనా బారిన పడకూడదన్న ఉద్దేశంతో ప్రభుత్వం వేసవి సెలవులను ప్రకటించింది. ఈ నెల రోజులను విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలి. ఉపాధ్యాయులు వాట్సాప్, ఫోన్ కాల్స్ ద్వారా నిత్యం విద్యార్థులకు అందుబాటులో ఉంటున్నారు. విద్యార్థులకు ఎంతో కీలకమైన ఈ నెలలో ఆలసత్వం వహిస్తే తీవ్రంగా నష్టపోతారు. జాగ్రత్తగా సబ్జెక్టుల వారీగా రివిజన్ చేసుకోవాలి. పిల్లలు చదువుకొనే వాతావరణాన్ని తల్లిదండ్రులు కల్పించాలి. విద్యార్థులు ఇంటిపట్టునే ఉంటూ కరోనా బారిన పడకుండా అవసరమైన జాగ్రత్తలు తీసుకోవాలి. – ఆర్ఎస్ గంగాభవానీ, డీఈఓ చదవండి: తిరుపతి ఉప ఎన్నికపై పిటిషన్ల కొట్టివేత -
జూన్ 11 వరకు స్కూళ్లకు వేసవి సెలవులు
సాక్షి, అమరావతి: రాష్ట్రంలోని అన్ని యాజమాన్యాల పరిధిలో ఉన్న పాఠశాలలకు జూన్ 11వ తేదీ వరకు వేసవి సెలవులు ప్రకటించారు. లాక్డౌన్ కారణంగా పాఠశాలలన్నిటినీ ఇప్పటికే మూసి ఉంచిన సంగతి తెలిసిందే. క్యాలెండర్ ఇయర్ ప్రకారం జూన్ 11 వరకు వేసవి సెలవులను పాఠశాల విద్యాశాఖ అధికారికంగా ప్రకటించింది. అయితే స్కూళ్లను ఆ తేదీ తరువాత మళ్లీ ఎప్పుడు తెరిచేది కోవిడ్–19 పరిస్థితిని అనుసరించి ప్రభుత్వం నుంచి వచ్చే ఆదేశాల ప్రకారం తేదీలను తరువాత ప్రకటిస్తామని పాఠశాల విద్యాశాఖ జాయింట్ డైరెక్టర్ బి.ప్రతాప్‌రెడ్డి శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు. -
బడి బండి.. భద్రత కరువండి!
సాక్షి, సిటీబ్యూరో: మరో 24 గంటల్లో బడి గంట మోగనుంది. బుధవారం స్కూళ్లు ప్రారంభం కానున్నాయి. దీంతో సర్వత్రా సందడి మొదలైంది. వేసవి సెలవుల్లో సరదాగా గడిపిన చిన్నారులు తిరిగి స్కూళ్లకు వెళ్లేందుకు సిద్ధమవుతున్నారు. కానీ పిల్లలను సురక్షితంగా స్కూళ్లకు తీసుకెళ్లి తిరిగి తీసుకురావాల్సిన బడి బస్సులు మాత్రం ఇంకా పూర్తిస్థాయిలో సిద్ధం కాలేదు. సామర్థ్యం లేని బస్సులు వేల సంఖ్యలో ఉన్నాయి. కాలం చెల్లినవి వందల్లో ఉన్నాయి. స్కూల్ యాజమాన్యాలు, నిర్వాహకుల బాధ్యతారాహిత్యం, ఆర్టీఏ నిర్లక్ష్యం ఫలితంగా పిల్లల భద్రతపై నీలినీడలు కమ్ముకున్నాయి. గత నెల 15వ తేదీనే స్కూల్ బస్సుల ఫిట్నెస్ గడువు ముగిసింది. తిరిగి పునరుద్ధరించుకునేందుకు కనీసం 20 రోజలకు పైగా గడువు ఉంది. కానీ చాలా స్కూళ్లు ఏమాత్రం పట్టనట్లుగా వ్యవహరించాయి. అదే సమయంలో కొన్ని ఆర్టీఏ కేంద్రాల పరిధిలో అధికారులు తీవ్ర నిర్లక్ష్యాన్ని ప్రదర్శించారు. హైదరాబాద్ జిల్లా పరిధిలో 2,321 స్కూల్ బస్సులు నమోదై ఉండగా... ఇప్పటి వరకు ఆర్టీఏ అధికారులు కేవలం 948 బస్సులకు ఫిట్నెస్ పరీక్షలు నిర్వహించి ధ్రువీకరించారు. 1,373 బస్సులు సామర్థ్యం లేనివే. ఈ ఒక్క జిల్లాలోనే 15 ఏళ్ల కాలపరిమితి ముగిసినవి 727 బస్సులు ఉన్నట్లు అధికారులు లెక్క తేల్చారు. మేడ్చల్, రంగారెడ్డి జిల్లాల్లోనూ ఫిట్నెస్ లేనివి, కాలం చెల్లిన బస్సులు పెద్ద సంఖ్యలోనే ఉన్నాయి. మొత్తంగా గ్రేటర్లో 13,082 స్కూల్, కాలేజీ బస్సులుంటే వాటిలో ఇప్పటి వరకు 8,574 బస్సులకు ఫిట్నెస్ నిర్వహించారు. ఇంకా 4508 బస్సులు ఫిట్నెస్ లేకుండా ఉన్నాయి. కాలం చెల్లిన బస్సులు 1424 వరకు ఉన్నాయి. ఇలాంటి కాలం చెల్లిన బస్సుల్లోనే కొన్ని స్కూళ్లు పిల్లలను తరలిస్తున్నాయి. స్కూల్ బస్సుల ఫిట్నెస్ కేవలం ప్రహసనంగా మారిందనేందుకు ఇదే నిదర్శనం. కదలిక లేని స్కూళ్లు... నిజానికి ఫిట్నెస్ గడువు ముగిసిన వెంటనే ఆర్టీఏ అధికారులను సంప్రదించడం స్కూళ్ల బాధ్యత. సుప్రీంకోర్టు మార్గదర్శకాల మేరకు పిల్లల భద్రతకు సంబంధించిన ప్రమాణాలకు అనుగుణంగా బస్సులను నిర్వహించాలి. ఫస్ట్ ఎయిడ్ బాక్సు, అగ్నిమాపక యంత్రం వంటి రక్షణ చర్యలతో పాటు బస్సుల నాణ్యత, సరైన సూచికలు, హెచ్చరిక బోర్డులు, స్కూల్ వివరాలు వంటివి అన్ని స్పష్టంగా ఏర్పాటు చేయాలి. బడి బస్సుల సామర్థ్యాన్ని పరీక్షించే సమయంలో మోటారు వాహన తనిఖీ ఇన్స్పెక్టర్ స్థాయికి ఏమాత్రం తగ్గని ఆర్టీఏ అధికారి ప్రతి బస్సును విధిగా పరీక్షించి దాని సామర్థ్యాన్ని నిర్ధారించాలి. బస్సు కొద్ది దూరం నడిపించి సంతృప్తి చెందిన తరువాతనే ఫిట్నెస్ సర్టిఫికెట్ ఇవ్వాలి. కానీ అందుకు విరద్ధంగా ఎలాంటి పరీక్షలు లేకుండానే ఫిట్నెస్ ధ్రువీకరిస్తున్నారు. కొన్ని చోట్ల కేవలం కానిస్టేబుళ్లు, హోంగార్డులే ఫిట్నెస్ పరీక్షలు నిర్వహించి ధ్రువీకరించడం గమనార్హం. మరోవైపు కొన్ని స్కూళ్ల నిర్వాహకులు కాలం చెల్లిన బస్సులనే పిల్లల తరలింపునకు వినియోగిస్తున్నారు. ఇలాంటి వాటిని తనిఖీ చేసి జప్తు చేయాల్సి ఉంది. కానీ ఆర్టీఏ అధికారులు మొక్కుబడిగా తనిఖీలు నిర్వహించడం వల్లనే నగరంలో ఈ బస్సులపై నియంత్రణ లేకుండా పోతోందనే విమర్శలున్నాయి. హడావుడిగా స్పీడ్ గవర్నెర్స్.. ఒకవైపు స్కూళ్లు తెరుచుకొనే గడువు ముంచుకొస్తుండగా మరోవైపు రవాణాశాఖ హడావుడిగా ఒక జీవోను వెలువరించింది. బడి బస్సుల భద్రతకు సంబంధించిన ఈ జీవో ప్రకారం ప్రతి బస్సు కు తప్పనిసరిగా వేగ నియంత్రణ పరికరాలైన స్పీడ్ గవర్నర్స్‌ను బిగించాలి. గంటకు 60 కిలోమీటర్ల కంటే వేగంగా వెళ్లకుండా ఇవి నియంత్రిస్తాయి. కానీ ఇప్పటికే 8 వేలకు పైగా బస్సులకు తనిఖీలు చేసి సర్టిఫికెట్లను ఇచ్చేశారు. తిరిగి ఆ బస్సులకు మరోసారి పరీక్షలు నిర్వహించడం, స్పీడ్ గవర్నర్స్ ఏర్పాటు చేసే విధంగా చర్యలు తీసుకోవడం ఆచరణ సాధ్యం కాని విషయం. ఇది అధికారులకు సైతం తెలిసిన సంగతే. 12 నుంచి స్పెషల్ డ్రైవ్... ఫిట్నెస్ లేని బస్సులపై ఈ నెల 12 నుంచి స్పెషల్ డ్రైవ్ నిర్వహించనున్నట్లు సంయుక్త రవాణా కమిషనర్ సి.రమేష్ తెలిపారు. గడువు ముగిసినా ఫిట్నెస్ ప్రక్రియ పూర్తి చేసుకోకుండా తిరిగితే చట్టపరమైన చర్యలు తీసుకోనున్నట్లు హెచ్చరించారు. నగరంలో మొత్తం స్కూల్ బస్సులు: 13,082 ఫిట్నెస్ పూర్తయినవి: 8,574 ఇంకా చేయాల్సినవి: 4,508 కాలం చెల్లిన బస్సులు: 1,424 -
నడి వేసవిలో ‘నారాయణ’
సాక్షి, అమరావతి బ్యూరో : నారాయణ కాలేజీల యాజమాన్యాలు బరితెగిస్తున్నాయి. ఒకవైపు మండుతున్న ఎండలతో ప్రజలు బెంబేలెత్తిపోతుంటే నిబంధనలకు విరుద్ధంగా తరగతులు నిర్వహిస్తూ విద్యార్థుల జీవితాలతో చెలగాటమాడుతున్నాయి. వేసవిలో సెలవులు ఇవ్వకుండా ఉక్కపోతలో విద్యార్థులను మగ్గబెడుతున్నాయి. తమ పిల్లలకు సెలవులు ఇవ్వాలని తల్లిదండ్రులు కోరుతున్నా యాజమాన్యాలు ఇసుమంతైనా లెక్కచేయడం లేదు. ఇష్టం ఉంటే ఇక్కడ చేర్పించండి లేదంటే.. వెళ్లిపోండి అన్న రీతిలో వ్యవహరిస్తున్నాయి. ఏసీ క్యాంపస్‌ల పేరుతో నిలువు దోపిడీ..! విజయవాడలోని కార్పొరేట్ కళాశాలలన్నీ అక్రమంగా తరగతులు నిర్వహిస్తున్నాయి. 10వ తరగతి ఫలితాలు వెలువడక ముందు నుంచే ఇంటర్ ఫస్టియర్ తరగతులు ప్రారంభించాయి. ఏసీ క్యాంపస్‌ల పేరుతో తల్లిదండ్రుల నుంచి రూ.లక్షల్లో ఫీజులు వసూలు చేస్తున్నారు. ఏసీలు పనిచేయకపోవడంతో వేసవిలో ఉక్కపోతకు విద్యార్థులు అల్లాడుతున్నారు. ఉదయం ఆరు గంటల నుంచి రాత్రి 10.30 గంటల వరకు ఏకధాటిగా తరగతులు నిర్వహిస్తూనే ఉన్నారు. టిఫిన్, లంచ్, డిన్నర్ చేయడానికి కేవలం 45 నిమిషాలు మాత్రమే సమయం ఇచ్చి మిగిలిన సమయమంతా తరగతుల్లో పాఠాలు బోధిస్తూ ఉండడంతో విద్యార్థులు తీవ్ర ఒత్తిడికి గురవుతున్నారు. దీనికితోడు హాస్టల్ పేరుతో మరో దోపిడీకి యాజమాన్యాలు తెరతీశాయి. నగరంలోని కార్పొరేట్ కళాశాలల్లో అధిక శాతం క్యాంపస్‌లు అనుమతిలేని భవనాల్లోనే కొనసాగుతున్నాయి. నివాసానికి అనుగుణంగా నిర్మించిన ఫ్లాట్లలో తరగతులు నిర్వహిస్తున్నాయి. సరైన భద్రతా ప్రమాణాలు పాటించిన దాఖలాలు ఎక్కడా కనిపించడంలేదు. నిబంధనలు పట్టవా..! నిబంధనల మేరకు ఇంటర్ తరగతులు జూన్ మొదటి వారం నుంచి ప్రారంభం కావాల్సి ఉంది. కానీ, నగరంలోని కార్పొరేట్ కాలేజీలు ఇప్పటికే తరగతులు ప్రారంభించాయి. ఉదయం 6 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు విద్యార్థులకు క్లాసులు చెబుతున్నారు. పరీక్షలు ముగియగానే కేవలం వారం రోజులు సెలవులు ఇచ్చి వెంటనే తరగతులు ప్రారంభించడంతో విద్యార్థులు మానసికంగా ఆందోళనకు గురవుతున్నారు. అలాగే పదో తరగతి ఫలితాలు ఈ నెల 14న విడుదలకాగా 10వ తరగతి పూర్తయిన పది రోజులకే కార్పొరేట్ కళాశాలలు ఫస్ట్ ఇయర్ తరగతులు ప్రారంభించాయి. వేసవిలో తరగతులు నిర్వహిస్తే చర్యలు తీసుకుంటామని అధికారులు చేస్తున్న హెచ్చరికలను కళాశాలల యాజమాన్యాలు పట్టించుకోవడం లేదు. ఆ రెండు క్యాంపస్లంటే దడ..! పెనమలూరు నియోజకవర్గం కానూరులోని నారాయణ ఎన్40 లేడీస్ క్యాంపస్, గొల్లపూడి నల్లకుంటలోని అయ్యప్ప క్యాంపస్‌లు నరకానికి నకళ్లుగా మారాయని విద్యార్థులు చెబుతున్నారు. ప్రత్యేక తరగతుల పేరుతో వేసవి సెలవులు ఇవ్వకుండా తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. లక్షల్లో ఫీజులు వసూలు చేస్తూ అనుమతుల్లేని భవనాల్లో తరగతులు నిర్వహిస్తూ తమ భవిష్యత్తుతో చెలగాటమాడుతున్నారని కన్నీటి పర్యంతమవుతున్నారు. అయితే ఇవన్నీ తెలిసినా సంబంధిత అధికారులు ఏ మాత్రం చర్యలు తీసుకోవడం లేదు. తెరచాటుగా లంచాలు ముట్టజెప్పడంతోనే మిన్నకుండిపోతున్నారని విద్యార్థి సంఘాలు ఆరోపిస్తున్నాయి. ఇప్పటికైనా ఉన్నతాధికారులు సంబంధిత కళాశాలలపై కఠిన చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేస్తున్నారు. -
ఎండకు టోపీ పెట్టేద్దాం..
సాక్షి సిటీబ్యూరో: ఎండాకాలంలో టూర్‌కు వెళుతున్నారా..?అయితే పలు జాగ్రత్తలు తీసుకొవాల్సిందే.. ఎందుకంటే నగరంలో ఎండలు మండిపోతున్నాయి. ఎండా కాలానికి.. పర్యాటకానికి అవినాభావ సంబంధం ఉంది. పిల్లలకు వేసవి సెలవులు రావడంతో పర్యటనలు మొదలవుతాయి. పుస్తకాలతో కుస్తీ పట్టిన చిన్నారులకు వేసవి సెలవులు ఎంతో ఊరట. అందుకే తల్లిదండ్రులు వేసవి సెలవులు వస్తున్నాయంటే.. ముందుగానే ప్రణాళికలు వేసుకుని పర్యటనలకు సిద్ధమవుతారు. ఇలా వెళ్తున్నవారు కాస్తా ఆలోచించకుండా.. మొండిగా వెళ్లిపోతే.. ఎవరికో ఒకరికి వడదెబ్బ తగలడం.. వారితో మిగతా వారంతా సతమతం కావడం జరుగుతుంది. ఎండ వేడిమి నుంచి తట్టుకోవడానికి నగర ప్రజలు రకరకాల ఉపశమన మర్గాలను ఎంచుకుంటారు. పిల్లల నుంచి పెద్దలు, యువతులు భానుడి కిరణాల భారి నుంచి రక్షించుకునేందుకు టోపీలను ధరించాల్సిందే. పిల్లలు మగవారు టోపీలు ధరిస్తే మహిళలకు మార్కెట్లో స్కార్ఫ్‌లు అందుబాటులో ఉన్నాయి. దేశీయ, విదేశీ డిజైన్లు.. నగరంలో దేశీయ టోపీలతో పాటు విదేశీ డిజైన్లతో టోపీలు అందుబాటులో ఉన్నాయి. ఇండోనేషియా, చైనా, బంగ్లాదేశ్‌తో పాటు కోలకత, ముంబైతో పాటు ఢిల్లీ నుంచి కూడా దేశీయ విదేశీ బ్రాండ్ టోపీలు నగరానికి దిగుమతి అవుతున్నాయి. విదేశీ డిజైన్ల టోపీలతో ఒకవైపు ఎండ నుంచి రక్షణ పొందుతూనే మరోవైపు స్టైయిలిష్‌గా కనబడవచ్చు. నగరంలోనూ టోలిచౌకి, మదీనా సర్కిల్లోని మహ్మద్ క్యాప్ మార్ట్ నిర్వహకులు ఇల్యాస్ బుకారీ అన్ని వయసుల వారికి అనువైన టోపీలను తయారు చేస్తున్నారు. వెరైటీ టోపీలు వందల సంఖ్యలో వివిధ రకాల టోపీలు మార్కెట్లో అందుబాటులో ఉన్నాయి. స్పోర్ట్స్ క్యాప్స్, గోల్ఫ్, కౌబాయి, రెబాక్, హిప్పొ, కాటన్, నైలాన్, కిట్క్యాట్లతో పాటు తోలుతో తయారు చేసిన వివిధ రకాల సైజుల్లో అందుబాటులో ఉన్నాయి. వీటితో పాటు ప్రస్తుతం మహిళలు, అమ్మాయిలు వినియోగిస్తున్న స్కార్ఫ్‌లను కూడా నూతన డిజైన్లలో తయారు చేస్తున్నారు. -
విడ్డూరం కాక ఇంకేంటి?
ప్రకాశం ,కందుకూరు రూరల్: ప్రభుత్వ పాఠశాలల్లో చదువుకునే విద్యార్థులకు వేసవి సెలవులు ఇచ్చారు. అంగన్వాడీ కేంద్రాలకు మాత్రం సెలవులు ప్రకటించ లేదు. ఆరేళ్ల పైబడిన వారు పాఠశాలలకు వెళ్తుంటారు. అంగన్వాడీ కేంద్రాల్లో మాత్రం ఆరేళ్లలోపు చిన్నారులు మాత్రమే ఉంటారు. వీరికి ఆటపాటలతో కూడిన విద్యను అందించాలి. పాఠశాలలకు వేసవి సెలవులు ఉన్నాయి గానీ అంగన్వాడీ చిన్నారులకు మాత్రం సెలవులు లేవు. దీనిపై ఐసీడీఎస్ అధికారుల వద్ద క్లారిటీ కూడా లేదు. ప్రస్తుతం కాస్తున్న తీవ్ర ఎండలకు చిన్నారులను కేంద్రాలకు పంపించేందుకు తల్లిదండ్రులు నిరాకరిస్తున్నారు. అయినా కేంద్రాల్లో తప్పకుండా పిల్లలు ఉండాలని ఐసీడీఎస్ అధికారులు కార్యకర్తలపై ఒత్తిడి చేస్తుండటంతో ఇటు తల్లిదండ్రులను ఒప్పించలేక అటు అధికారులకు చెప్పుకోలేక పలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఎండల్లో ఇళ్ల చుట్టూ తిరిగి పిల్లలను తీసుకొచ్చేందుకు నానా అవస్థలు పడుతున్నారు. అంతా గందరగోళం జిల్లాలో 25 ఐసీడీఎస్ ప్రాజెక్టులు ఉండగా వీటి కింద 2951 ప్రధాన, మినీ అంగన్వాడీ కేంద్రాలు ఉన్నాయి. వీటిల్లో పని చేసే కార్యకర్త, ఆయాలకు మాత్రం మే నెలలో సెలవులు ప్రకటించారు. అవి కూడా మే 1వ తేదీ నుంచి 15వ తేదీ వరకు ఆయాకు సెలవులు, 16 నుంచి 31వ తేదీ వరకు కార్యకర్తలకు సెలవులు ప్రకటించారు. కార్యకర్తల డ్యూటీలో ఉన్నప్పుడు చిన్నారులను కార్యకర్తలే ఇళ్లకు వెళ్లి కేంద్రాలకు తీసుకురావాలి. ఆయాలు డ్యూటీలో ఉన్నప్పుడు ఆయాలే పిల్లలను తీసురావాలి. పిల్లలను కేంద్రాలకు తీసుకొచ్చి మధ్యాహ్న భోజనం తయారు చేసి చిన్నారులకు పెట్టాలి. తీవ్ర వడగాడ్పులు, మండుటెండల్లో చిన్నారులను తీసుకొచ్చి భోజనం తయారు చేసి పెట్టాల్సి ఉండగా కార్యకర్తలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అంగన్వాడీ కేంద్రాలు ఎక్కువ శాతం ఇరుకు గదులు కావడంతో ఉక్కపోతకు అల్లాడిపోతున్నారు. అంగన్వాడీ కార్యకర్తలు, ఆయాలకు మే నెలలో చేరి పదిహేను రోజులు చొప్పున సెలవులు ప్రకటించారు. కానీ చిన్నారులకు మాత్రం సెలవులు ప్రకటించలేదు. ఎండలకు చిన్నారులను బయటకు పంపించొద్దని ఒక పక్క ప్రభుత్వ ఉన్నతాధికారులు ప్రకటనలు చేస్తూనే ఉన్నారు. 9 గంటలకు అంగన్వాడీ కేంద్రాలకు చిన్నారులను తీసుకొచ్చి 11 గంటల సమయంలో తిరిగి పిల్లలను ఇళ్లకు పంపించాలంటే ఇబ్బందిగా ఉంది. కార్యకర్తలు, ఆయాలు కొందరు పెద్ద వారు కూడా ఉన్నారు. వారూ ఎండలకు బయటకు రావాలంటే పలు ఆరోగ్య సమస్యలు ఎదుర్కొంటున్నారు. పిల్లలకు సెలవులు ప్రకటించక పోవడంపై తల్లిదండ్రుల నుంచి కూడా విమర్శలు ఎదురవుతున్నాయి. ఐసీడీఎస్ అధికారులు మాత్రం తప్పకుండా కేంద్రాలను నడిపించాలని తీవ్ర ఒత్తిడి చేస్తుండడంతో చేసేది ఏమీ లేక కార్యకర్తలు తల్లిదండ్రులను బతిమాలి.. బామాలి పిల్లలను కేంద్రాలకు తీసుకొస్తున్నారు. దీనిపై ఉన్నతాధికారులు స్పందించి కార్యకర్తలు, ఆయాలతో పాటు చిన్నారులకు పూర్తిగా వేసవి సెలవులు ప్రకటించాల్సిన అవసరం ఉంది. -
నెట్టింట్లో లెక్కలు!
సాక్షి,సిటీబ్యూరో: ఎండల తీవ్రత పెరిగింది. పిల్లలకు వేసవి సెలవులు కావడంతో వారు ఎక్కడికైనా బయటికి వెళ్లి ఆడుకోవాలని చూస్తుంటారు. ఇంతటి ఉష్ణోగ్రతల్లో వారు బయటికి వెళితే వడదెబ్బకు గురయ్యే ప్రమాదముంది. ఇప్పటి వరకు బడిలో గడిపిన వీరిని ఇంటి పట్టున కూర్చోపెట్టడం ఓ పట్టాన సాధ్యం కాదు. ఈ క్రమంలో వారికి లెక్కలపై ఆసక్తి, అనురక్తి కలిగించేందుకు ఇంటర్నెట్లో చక్కని అవకాశాలు ఉన్నాయి. కొన్ని వెబ్సైట్లు కేవలం పిల్లకు మేథమెటిక్స్‌ను అర్థవంతంగా నేర్పించేందుకు అనువుగా రూపొందించారు. వీటిని సెల్ఫోన్లో సైతం ఓపెన్ చేసి పిల్లలతో ప్రాక్టీస్ చేయించవచ్చు. అయితే, ఈ సైట్లలో కొన్ని ఉచిత సేవలు అందిస్తుంటే.. మరికొన్నింటికి డబ్బులు చెల్లించాలి. అయితే, చాలా వరకు వెబ్సైట్లు కొన్ని రోజులు ‘ఫ్రీట్రైల్’ కూడా అందిస్తున్నాయి. అలాంటి నెట్ వేదికల సమాచారమే ఈ కథనం. నిపుణులు ఏమంటున్నారంటే.. వేసవి సెలవుల్లో చిన్నారులకు వీలైనంత వరకు తమ కనుసన్నల్లో ఈ పేజీలు తెరిచే విధంగా తల్లిదండ్రులు పర్యవేక్షించాలి. వారికి తెలియని భావనలు విడమరచి చెప్పాలి. వేసవి సెలవుల్లో ఎండలో తిరగకుండా ఇలాంటి పాఠ్యాంశ సంబంధ విషయాలను నేర్చుకుంటే విద్యార్థికి మంచిది. తరగతి గదిలో మిగతా విద్యార్థుల కన్నా చురుగ్గా ఉంటూ ఉపాధ్యాయుడి మెప్పు పొందడం సహా విజ్ఞానం సంపాదిస్తారని చెబుతున్నారు. www.funbrain.com ఈ వెబ్ పేజీలో శోధిస్తే కనీసం 17 రకాల ఆటల ద్వారా లెక్కలు నేర్చుకోవచ్చు. చిన్న చిన్న కూడికలు తీసివేతలు, గుణకారాలు, భాగాహారాలు సహా పలు ఆటలను ఆసక్తికరంగా దృశ్యరూపకంగా ఈ సైట్లో పొందుపరిచారు. ఒకటి నుంచి ఎనిమిదో తరగతి వరకు చదివే విద్యార్థుల మానసిక స్థాయిని అంచనా వేసి వారి స్థాయికి తగ్గట్టు ఈ లెక్కలు ఉంటాయి. పిల్లలకు ఈ వెబ్‌సైట్‌ను పరిచయం చేస్తే వారు ఇంట్లోనే ఉండడంతో పాటు ఈ సెలవుల్లో కొత్తగా లెక్కలపై పట్టు సాధించేందుకు వీలుంది. www.coolmath.com ప్రాధమిక తరగతులు చదివే పిల్లలకు ఎంతో ఉపయుక్తంగా ఈ సైట్‌ను తీర్చిదిద్దారు. ఉన్నత తరగతుల్లో పాఠ్యపుస్తకాలలో తారసపడే పలు ఎక్కలను సంబంధించిన సమాచారం ఎంతో ఆసక్తిగా స్వయంగా ప్రాక్టీస్ చేస్తూ నేర్చుకునేలా లెక్కలు ఉన్నాయి. ఈ వెబ్‌పేజీలోకి వెళితే అనేకానేక ఆటలతో లెక్కలు నేర్చుకోవచ్చు. www.easymaths.org అబాకస్.. ఇటీవల బహుళ ప్రచారం పొంది చలామణిలో ఉన్న గణిత భావనల్లో ప్రప్రథమ స్థానంలో ఉంది. గణితానికి సంబంధించిన చతుర్విధ (కూడిక, తీసివేత, గుణకారం, భాగాహారం) ప్రక్రియలను సులువుగా, వేగంగా నేర్చుకోవడానికి అబాకస్ బాగా దోహదపడుతుంది. బాల్యం నుంచే నేర్పిస్తే భవిష్యత్‌లో గణితంతో ఆటలాడుకోవచ్చని పలువురు చాలామంది తల్లిదండ్రులు తమ పిల్లలకు నిపుణులతో అబాకస్ నేర్పిస్తున్నారు. ‘ఈజీ మాథ్స్’ వెబ్సైట్లో అలాంటి అబాకస్‌ను సులువుగా ఇంట్లోనే నేర్చుకోవచ్చు. www.figurethis.org జాతీయ గణిత ఉపాధ్యాయ మండలి నిర్వహిస్తున్న ఇంటర్నెట్ పేజీ ఇది. ఇందులో ‘ఫిగర్ దిస్’ అన్న ఆటతో పాటు కుటుంబాలు పాఠశాల, గణితం, కుటుంబాలు ఇంటిపని, ప్రోత్సాహం, గణితం సాహిత్యం, ఇతర వనరులు, అన్న ఆరు రకాల వివరాల పేజీలున్నాయి. ఈ పేజీలో పిల్లలతో పాటు పెద్దలకు కావాల్సిన సమాచారం పొందవచ్చు. www.mathscat.com చాలామంది విద్యార్థులకు లెక్కలంటే భయం ఉంటుంది. అయితే, ఈ వెబ్ పేజీలో గణితానికి సంబంధించి కావాల్సినంత సమాచారం పొందవచ్చు. ఇందులో లెక్కలు ప్రాజెక్టు రూపంలో ఉంటాయి. ప్రతి ప్రాజెక్టు వర్కుతో ఎంతో కొంత విజ్ఞానం పొందవచ్చు. అనేక సరదా ఆటలు ఆడుకోవచ్చు. తను పుట్టిన తేదీ ఆధారంగా వయసును గంటలు, నిమిషాలు.. సెకన్లు సహా తెలుసుకోవచ్చు. ఇలాంటి ఆటలు ఎన్నో ఈ పేజీలో పొందుపరిచారు. కొత్తకొత్త ఆలోచనలు సృజనాత్మకత ఆపాదించుకునే ప్రాజెక్టులు, ప్రయోగాలు ఎన్ని చేయవచ్చో వివరిస్తుంది. www.aaamath.com నేటి తల్లిదండ్రులు తమ పల్లలను మూడేళ్ల వయసులోనే అంగన్వాడీ కేంద్రానికో లేదా ప్లేస్కూల్కో పంపిస్తున్నారు. ఇలాంటి పిల్లలు కూడా చక్కని పాఠాలు కథలుగా అందిస్తుంది ఈ సైట్. ఎల్కేజీ నుంచి ఎనిమిదో తరగతి చదివే పిల్లలకు అర్థమయ్యే రీతిలో లెక్కలు పొందుపరిచారు. అభ్యాసం చేయడం, సమస్యను పరిష్కరించడం, అది సరైనదేనా కాదా అన్న మదింపు వెంటవెంటనే తెర మీద కనిపిస్తుంది. పిల్లలు కూడా ఎంతో ఆసక్తితో నేర్చుకునేలా ఉన్నాయి. -
నిరుపేద చిన్నారుల విమానయానం
పిల్లలకు వేలవి సెలవులు వచ్చాయంటే.. తల్లిదండ్రుల ఆర్థిక స్థాయిని బట్టి విహార యాత్రలకు ప్లాన్ చేస్తుంటారు. సంపన్నుల ఇళ్లల్లో ‘సింగపూర్‌కా, సిమ్లాకా’ అంటూ ఎంపిక చేస్తుంటే.. ‘అమ్మమ్మ ఇంటికా అత్త వాళ్ల ఊరికా’ అంటూ మధ్య తరగతి ఇళ్లలో ప్లాన్ వేస్తుంటారు. మరికొందరైతే వేసవి సెలవుల్ని సద్వినియోగం చేసుకోవడానికి సమ్మర్ క్యాంప్స్‌కి జై కొడతారు. అయితే వెకేషన్‌కు వెళ్లే డబ్బుల్లేక, సెలవులను గడిపేందుకు చుట్టాలూ, బంధువులూ లేక, వేసవి శిబిరాల వ్యయాన్ని భరించే స్తోమత లేని అనాథ/నిరుపేద పిల్లల పరిస్థితేంటి? వారికి మాత్రం కలలు ఉండవా? అంటే ఉంటాయి. మరి వాటిని నెరవేర్చేదెవరు..? ‘వారి కలను తీర్చడానికి మనమంతా లేమా!’ అంటూ నగరానికి చెందిన ఓ ఎన్జీఓ ప్రశ్నిస్తే నగరవాసులు ‘మేం ఉన్నామంటూ’ ముందుకొచ్చారు. బాలికలకలలకు రెక్కలు తొడిగారు. సాక్షి,సిటీబ్యూరో :‘ఆంటీవాళ్లు మాకు ఎంతో మరిచిపోలేని ఎక్స్పీరియన్స్ ఇచ్చారు. నేను లైఫ్‌లో మంచి పొజిషన్‌కి వచ్చాక మా సొంత డబ్బులతో వాళ్లని ఫారిన్‌కి తీసుకెళతా’ అంటూ చెప్పింది పద్మజ. అలా మాట్లాడుతున్న ఆ అమ్మాయిని సంతోషంగా చూస్తూ.. ‘అదే మాకు కావాలండీ. వాళ్లలో అలాంటి ఆత్మవిశ్వాసమే మేం కోరుకునేది’అని చెప్పారు రీనా. ‘టచ్ ఏ లైఫ్ ఫౌండేషన్’ తరఫున 20 మంది నిరుపేద విద్యార్థినుల వేసవి సెలవులను సద్వినియోగం చేసే క్రమంలో భాగంగా ఈ ఉచిత విమానయాన అనుభవాన్ని వారికి అందించామన్నారామె. మరికొన్ని అంశాల్లోనూ శిక్షణ ఈ సమ్మర్ క్యాంప్ ఇంకా కొనసాగుతూనే ఉంది. తాజాగా జూబ్లీహిల్స్‌లోని భరణి లే అవుట్లో ఉన్న కలినరీ లాంజ్‌లో ఈ బాలికలకు పాకశాస్త్ర తరగతులు ఉచితంగా ఏర్పాటు చేశారు. అప్పటికే అక్కడ శిక్షణ పొందుతున్న సీనియర్ స్టూడెంట్స్ వీరికి శిక్షణ ఇవ్వడం విశేషం. ‘నిరుపేద బాలికలైనా వీరి ఆలోచనా శక్తి అమోఘం. ఒక్క పూటలోనే రకరకాల వంటకాలపై వీరు ప్రాధమిక అవగాహన ఏర్పరచుకున్నారు. ఇలాంటి కార్యక్రమానికి చేయూతనివ్వడం మాకెంతో సంతృప్తినిచ్చింది’ అని కలినరీ లాంజ్ నిర్వాహకులు విభూతి, గోపి ఆనందంగా చెప్పారు. ఈ వేసవి మొత్తం ఈ బాలికలకు వైవిధ్యభరితమైన విజ్ఞాన వినోదాలను పంచాలనే క్రమంలో ఈ సమ్మర్ క్యాంప్ కొనసాగుతుందని ఫౌండేషన్ ప్రతినిదులు స్పష్టం చేశారు. విమాన విహారం.. సోషల్ సహకారం.. గత కొంత కాలంగా టచ్ ఏ లైఫ్ ఫౌండేషన్ సభ్యులు నగరంలోని రాధా కిషన్ బాలికా భవన్‌ను దత్తత తీసుకుని అక్కడి బాలికల బాగోగులు చూస్తున్నారు. వారికి చదువుతో పాటు అవసరమైనన సదుపాయాలు కల్పిస్తున్నారు. అయితే, అంతటితో ఆగిపోకుండా ఈసారి వేసవి సెలవుల్లో విభిన్న తరహా సమ్మర్ క్యాంప్‌ను డిజైన్ చేశారు. తొలిసారి 20 మంది బాలికలను బెంగళూరుకి విమానంలో తీసుకెళ్లాలని ప్లాన్ చేశారు. ‘ఒక్కో బాలికకు టికెట్‌కి వ్యయం రూ.4,500 అవుతుంది. మా ఆలోచనను సోషల్ మీడియాలో పోస్ట్ చేయగానే మంచి స్పందన వచ్చింది. సిటీలో నివసించే మా ఫేస్ బుక్ ఫ్రెండ్స్ తలో ఒకరు లేదా ఇద్దరు బాలికలకు స్పాన్సర్ చేస్తామంటూ ముందుకు వచ్చారు. బెంగళూరులో ఒక హోటల్ ఉచిత వసతి అందించారు. ఇలా ప్రతి ఒక్కరూ సహకరించడంతో ఈ బాలికల కల సాకారం చేయగలిగాం’ అని ఆనందంగా వివరించారు రీనా. డ్రీమ్ బిగ్.. అచీవ్ బిగ్ పెద్ద పెద్ద కలలు కనాలి.. అవి సాకారం చేసుకోవడానికి కష్టపడాలి.. అనే ఆలోచన వారికి ఇవ్వాలనేదే ఈ కార్యక్రమ ముఖ్యోద్దేశం. ఆ ఉద్దేశంతోనే సమ్మర్ క్యాంప్‌లో భాగంగా ఇరవై మంది బాలికల కలలకు రెక్కలు తొడుగుదామని భావించామంటున్నారు వీరు. నిరుపేద చిన్నారులు ఖరీదైన కలలు కనడానికి కూడా భయపడతారు. ఆ భయం వారి భవిష్యత్‌పై ప్రభావం చూపిస్తుంది. ఆశలను సజీవంగా ఉంచుకోవాలంటే వారికి అప్పుడప్పుడూ ఇలాంటి అనుభవాలు అందాలి అంటారు ఫౌండేషన్ సభ్యులు. సమ్మర్ క్యాంప్‌లో బెంగళూరుకి విమానంలో రాకపోకలు సాగించడం జీవితంలో ఎదగాలనే స్ఫూర్తిని తమకు ఇచ్చిందని దేవిక, జెస్సికా.. తదితర బాలికలు ‘సాక్షి’తో తమ సంతోషాన్ని పంచుకున్నారు. -
మార్కెట్లోకి తేలికపాటి స్కూల్ బ్యాగులు
సాక్షి,సిటీబ్యూరో: పిల్లలకు ప్రస్తుతం పరీక్షలు అయిపోయి స్కూళ్లకు వేసవి సెలవులు కొనసాగుతున్నాయి. మే నెల అంతా సెలవులే అయినా.. మళ్లీ స్కూళ్లు తెరిచేనాటికి వారికి పుస్తకాలు.. యూనిఫాంతో పాటు స్కూలు బ్యాగులు వంటివి సమకూర్చాలి. గతంలో బ్యాగ్ అంటే బియ్యం బస్తా అంత బరువుండేది. కానీ ప్రభుత్వం స్కూలు బ్యాగు విషయంలో కఠినమైన నిబంధనలు విధించడంతో ప్రస్తుతం మార్కెట్లో తేలికపాటి మెటీరియల్‌తో తయారు చేసిన బ్యాగులు అందుబాటులోకి వచ్చాయి. పిల్లల తరగతులకు అనుగుణంగా వీటిని రూపొందించారు. ప్రస్తుతం నగరంలో దేశీ బ్రాండ్లతో పాటు అంతర్జాతీయ బ్రాండెడ్ స్కూల్ బ్యాగ్‌లు అందుబాటులోకి వచ్చాయి. పిల్లల క్లాస్ స్థాయిని బట్టి వివిధ డిజైన్లతో పాటు తక్కువ బరువు గల స్కూల్ బ్యాగ్‌లను వివిధ కంపెనీల బ్యాగ్‌లు మార్కెట్లో ప్రవేశపెట్టాయి. ఇవి కేజీ స్థాయి నుంచి కాలేజీ విద్యార్థుల అవసరాలకు అనుగుణంగా రూపొందించారు. అందుకు అనుగుణంగా నగరంలోని ప్రాచీనమైన బ్యాగ్ విక్రయ కేంద్రం మదీనా సర్కిల్, టోలిచౌకీ, మదీనా సర్కిల్లోని మహ్మద్ క్యాప్ మార్ట్‌లో అతి తక్కువ బరువులతో బ్రాండెడ్ స్కూల్ బ్యాగులను అందుబాటులో ఉంచారు. ఈ నెల రోజులూ ‘బ్యాగ్ ఎగ్జిబిషన్ కమ్ సేల్’ కూడా ఏర్పాటు చేశారు. క్లాస్ ప్రకారం బ్యాగ్ బరువు కిండర్‌గార్టన్ (కేజీ) పిల్లలకు 100 గ్రాముల నుంచి మొదలు బ్యాగు బరువు ప్రారంభమవుతుంది. మూడో తరగతి, ఐదో తరగగతి, 8వ తరగతి, 10వ తరగతి, కాలేజీ విద్యార్థులకు కూడా తక్కువ బరువు గల బ్రాండెడ్ కంపెనీల బ్యాగ్‌లు అందుబాటులో ఉన్నాయి. ఇవి 150 గ్రాములు మొదలు 500 గ్రాముల లోపే ఉండడం విశేషం. పైగా వీటిని అత్యంత నాణ్యమైన, వర్షంలో తడవని (వాటర్ రెసిస్టెంట్) మెటీరియల్‌తో రూపొందించారు. అంతేకాదు.. ఎండను కూడా తట్టుకోవడం ఈ క్లాత్ ప్రత్యేకత. ఏడాది గ్యారంటీ.. గతంలో బరువుతో సంబంధం లేకుండా విచ్చలవిడిగా బ్యాగులు చేశారు. గతేడాది ప్రభుత్వ ఉత్తర్వులకు అనుగుణంగా తక్కువ బరువుతో స్కూల్ బ్యాగ్‌లను విద్యార్థుల సౌకర్యార్థం తయారు చేయిస్తున్నాం. దీంతో పాటు విదేశీ బ్రాండ్ కంపెనీల బ్యాగ్‌లను కూడా దిగుమతి చేసుకున్నాం. ప్రస్తుతం విద్యార్థులు, వారి తల్లిదండ్రులు బ్రాండెడ్ కంపెనీల లైట్ వెయిట్ స్కూల్ బ్యాగ్‌లు కొనేందుకే ఆసక్తి చూపుతున్నారు. బ్రాండెడ్ స్కూల్ బ్యాగ్‌లు ధరలు కూడా రూ.250 నుంచి రూ.1000 వరకు ధరల్లో ఉన్నాయి. బ్యాగ్‌లకు ఏడాది పాటు గ్యారెంటీ కూడా ఇస్తున్నాం.– ఇల్యాస్ బుకారీ, మహ్మద్ క్యాప్ మార్ట్ ఫారిన్ బ్యాగ్‌లపైనే క్రేజ్ విదేశాల్లో తయారయ్యే వివిధ రకాల స్కూల్ బ్యాగ్‌లు నగర మార్కెట్లో అందుబాటులో ఉన్నాయి.అమెరికన్ టూరిస్టర్, స్కైబ్యాగ్, ఎఫ్ గెయిర్, నైకీ, ప్యూమాతో పాటు స్వదేశీ కంపెనీలు కూడా లైట్ వెయిట్ బ్యాగ్‌లను తయారు చేసి మార్కెట్లోకి విడుదల చేశాయి. ఈ బ్యాగ్‌లు తక్కువ బరువుతో పాటు స్టయిల్‌గా, బుక్స్‌తో పాటు ఇతర వస్తువులు పెట్టుకోడానికి అనుకూలంగా ఉన్నాయి. ప్రస్తుతం పిల్లలు, కాలేజీ విద్యార్థులు ఇలాంటి బ్యాగ్‌లపై ఎక్కువ మక్కువ చూపుతున్నారు. -
వేసవిలో పదో తరగతి పాఠాల బోధన
తొమ్మిదో తరగతి వరకు చదివిన విద్యార్థులు 10వ తరగతికి వేరే పాఠశాలకు వెళ్లిపోకుండా కట్టడి చేయడానికి కార్పొరేట్ యాజమాన్యాలు వేసవి సెలవుల్లో పదో తరగతి సిలబస్ బోధించడం మొదలుపెట్టాయి. తద్వారా విద్యార్థులకు వేసవి సెలవులు లేకుండా పోయాయి. విద్యార్థుల తల్లిదండ్రులు ఎక్కడైనా విహార యాత్రకు వెళ్లడానికి కూడా వీలు లేకుండా కార్పొరేట్ స్కూళ్లు వ్యవహరిస్తున్నాయి. దీనిపై ఉన్నతాధికారులు చూసీచూడనట్లు వ్యవహరిస్తుండడం విమర్శలకు దారితీస్తోంది. తిరుపతి ఎడ్యుకేషన్ : ఉన్నత విద్యకు వారధి ఇంటర్. దీని తర్వాత ఇంజినీరింగ్, మెడిసిన్, ఇతర కోర్సుల్లో చేరేందుకు జేఈఈ, నీట్ వంటి పరీక్షలు రాయాల్సి ఉంటుంది. ఇదే సాకుగా ఇంటర్ బోర్డు నిబంధనలు పాటించకుండా కొన్ని ప్రైవేటు, కార్పొరేట్ జూనియర్ కళాశాలలు జేఈఈ, నీట్ వంటి ప్రవేశ పరీక్షలతో పాటు బ్రిడ్జి కోర్సుల్లో శిక్షణ ఇస్తున్నాయి. ఈ వింత పోకడ కాస్త స్కూళ్లకు పాకింది. వేసవిలో తరగతులు నిర్వహించకూడదన్న నిబంధనలను తుంగలో తొక్కి తరగతులు నిర్వహిస్తున్నాయి. తొమ్మిదో తరగతి ముగించుకున్న విద్యార్థులకు వేసవి సెలవుల్లో పదో తరగతి సిలబస్‌ను బోధిస్తున్నాయి. కార్పొరేట్ పాఠశాలలే కాకుండా సాధారణ పాఠశాలలు ఈ పంథాను అవలంబిస్తూ విద్యార్థుల హక్కులను కాలరాస్తున్నాయి. తిరుపతి నగరంలో దాదాపుగా 160 వరకు ప్రైవేటు, కార్పొరేట్ పాఠశాలలున్నాయి. పాఠశాలల మధ్య పోటీ పెరిగింది. ఈ పోటీని తట్టుకుని నిలబడేం దుకు కొన్ని పాఠశాలలు కొత్త పద్ధతులను అవలంబిస్తున్నాయి. పాఠశాల విద్యాశాఖ రూపొందించిన షెడ్యూల్ ప్రకా రం కాకుండా ముందస్తుగానే పదో తరగతిలో సిలబస్‌ను పూర్తి చేయించి, విద్యార్థులకు పునఃశ్చరణ తరగతులు నిర్వహిస్తున్నాయి. ఒక రకంగా ఇది విద్యార్థులకు మేలు చేకూరే అంశమే అయినప్పటికీ విద్యార్థుల హక్కులను కాలరాస్తూ వేసవిలో తరగతులు నిర్వహించడం సర్వత్రా విమర్శలకు దారితీస్తోంది. వేసవిలో పదో తరగతి సిలబస్ కార్పొరేట్ తరహాలో కొన్ని ప్రైవేటు పాఠశాలలు తొమ్మిదో తరగతి విద్యార్థులకు ఈ వేసవి సెలవుల్లో పదో తరగతి సిలబస్‌ను బోధిస్తున్నాయి. విద్యాశాఖ నిబంధనలకు ఇది విరుద్ధం. ఏప్రిల్ 23 నుంచి జూన్ 12వ తేదీ వరకు పాఠశాలలకు వేసవి సెలవులను ప్రకటిస్తూ విద్యాశాఖ ఉత్తర్వులు జారీ చేసింది. జూన్ 13న పునఃప్రారంభించాలి. ఈ నిబంధనలను కొన్ని పాఠశాలలు పాటించడం లేదు. చర్యలు తీసుకోవాల్సిన విద్యాశాఖాధికారులు చోద్యం చూస్తున్నారంటూ విద్యార్థి సంఘాలు ఆరోపిస్తున్నాయి. పదికి 10 జీపీఏ కోసమేనంటూ పోటీ ప్రపంచానికి దీటుగా రాణించాలంటే చదువు తప్పనిసరి అంటూ పాఠశాలల యాజమాన్యాలు తల్లిదండ్రులను బురిడీ కొట్టిస్తూ విద్యార్థులను వేసవి సెలవులకు దూరం చేస్తున్నాయి. పదో తరగతి ఫలితాల్లో పదికి 10 జీపీఏ సాధిం చాలంటే ఇప్పటి నుంచే చదవాలంటూ ఒత్తిడి తెస్తున్నాయి. దీనికోసం ప్రత్యేకంగా తరగతులు నిర్వహిస్తున్నాయి. తిరుపతిలోనే కొన్ని పాఠశాలలు సెలవులు ఇవ్వకుండా తొమ్మిదో తరగతి విద్యార్థులకు తరగతులు యథేచ్ఛగా నిర్వహిస్తున్నట్లు విద్యార్థి సంఘాలు ఆరోపిస్తున్నాయి. మార్కుల మాయలో ç తల్లిదండ్రులు సైతం అభ్యంతరం చెప్పకుండా ఊరకుంటున్నారు. తల్లిదండ్రుల ఆలోచనలో మార్పు రావాలని, లేకుంటే పిల్లల భవిష్యత్తుకు ఇబ్బంది కలిగించిన వారమవుతామని మేధావులు హెచ్చరిస్తున్నారు. హక్కులను కాలరాయొద్దు కొన్ని విద్యాసంస్థలు విద్యాశాఖ నిబంధనలను పాటించకుండా విద్యార్థుల హక్కులను కాలరాస్తున్నాయి. ఏడాది పొడవునా పుస్తకాలతో కుస్తీ పట్టిన పిల్లలకు వేసవి సెలవులు ఆటవిడుపునిస్తాయి. మానసికోల్లాసాన్ని కలిగి స్తాయి. ఒత్తిడి దూరమవుతుంది. అయితే మార్కుల పేరుతో వేసవి సెలవుల్లో తొమ్మిదో తరగతి ముగించుకున్న విద్యార్థులకు పదో తరగతి సిలబస్‌ను బోధిస్తున్నాయి. ఇప్పటికైనా తీరు మార్చుకోకుంటే ఊరుకోం.– వడిత్య శంకర్‌నాయక్, వ్యవస్థాపక జాతీయ అధ్యక్షుడు, జీవీఎస్ కఠిన చర్యలు తీసుకుంటాం విద్యాశాఖ ఉత్తర్వుల మేరకు ఏప్రిల్ 23 నుంచి జూన్ 12వ తేదీ వరకు వేసవి సెలవుల్లో ఎటువంటి తరగతులూ నిర్వహించకూడదు. ఇప్పటికే ఎంఈఓ, సీఆర్పీల ద్వారా వేసవిలో తరగతులు నిర్వహించకూడదంటూ అన్ని పాఠశాలలకు ఉత్తర్వులు జారీ చేశాం. నిబంధనలు అతిక్రమించి వేసవి తరగతులు నిర్వహిస్తే ఆయా పాఠశాలలపై శాఖాపరమైన చర్యలు తీసుకోవడానికి ఉన్నతాధికారులకు సిఫా రసు చేస్తాం. అవసరమైతే కఠిన చర్యలు తీసుకుంటాం. – సీ విజయేంద్రరావు, ఉప విద్యాశాఖాధికారి, తిరుపతి -
మాకు సెలవులు లేవా?
మండుటెండలో చిన్నారులతో కలిసి తల్లిదండ్రులు, పెద్దలు నడు స్తుంటే తాము ఎండ వేడిమిని భరించి అయినా సరే.. చిన్నారులకు నీడనిచ్చి తాము ఎండలోఅడుగులేస్తారు. కానీ ప్రస్తుతప్రభుత్వం ప్రతి ఏడాది పాఠశాలలకు సెలవులిచ్చి చిన్నారులుఉండే అంగన్వాడీ కేంద్రాలకుమాత్రం ససేమిరా అంటుండడంతో ఐదేళ్లలోపు వయసున్న పిల్లలుఅవస్థలు పడుతున్నారు. కడప కోటిరెడ్డిసర్కిల్ : జిల్లాలోని అంగన్వాడీ కేంద్రాల్లో చదివే పిల్లలకు ఈ ఏడాది కూడా వేసవి సెగ తప్పేట్టు లేదు. వేసవి కాలాన్ని దృష్టిలో పెట్టుకుని ప్రభుత్వం ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలకు 50 రోజులపాటు వేసవి సెలవులను ప్రకటించింది. ఈ విద్యా సంవత్సరం ఈనెల 23వ తేదీ ముగియడంతో 24వ తేదీ నుంచి పాఠశాలలకు వేసవి సెలవులను ప్రకటించారు. అయితే అంగన్వాడీ కేంద్రాలను మండుటెండలో సైతం నిర్వహిస్తుండడంతో చిన్నారులకు వేసవి సెగ తప్పదని ఆందోళన చెందుతున్నారు. జిల్లాలో 3621 అంగన్వాడీ కేంద్రాల్లో ఆరేళ్లలోపు వయసున్న 2.30 లక్షల మంది చిన్నారులు ప్రాథమిక విద్యను అభ్యసిస్తున్నారు. వర్తించని వేసవి సెలవులు ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలతో పోలిస్తే అంగన్వాడీ కేంద్రంలో పూర్వ ప్రాథమిక విద్యను అభ్యసిస్తున్న చిన్నారులంతా ఏడాది నుంచి ఐదేళ్లలోపు వయసున్న వారే. అంగన్వాడీ కేంద్రాలకు వేసవి సెలవులు ప్రకటించకుండా వేళల కుదింపుతో సరిపెట్టడం చిన్నారులకు అగ్ని పరీక్షగా మారిందని చిన్నారుల తల్లిదండ్రులు వాపోతున్నారు. వసతుల లేమి, అద్దె భవనాలు, మండుటెండలు చిన్నారులకు శాపంగా మారాయి. జిల్లాలో ఉన్న అంగన్వాడీ కేంద్రాలలో సగానికి పైగా కేంద్రాలకు సొంత భవనాలు లేవు. అరకొరగా ఉన్న ప్రభుత్వ భవనాల్లో వసతులు లేవు. వర్షాభావ పరిస్థితుల కారణంగా గత ఏడాది డిసెంబరు నుంచి ఎండలు అధికమయ్యాయి. అంగన్వాడీ కేంద్రాలలో ఫ్యాన్లు కూడా లేవు. అద్దె భవనాలకు తగినంత బాడుగ ప్రభుత్వం ఇవ్వకపోవడంతో గ్రామాలలో వసతులు లేని ఇరుకైన ఇళ్లల్లో కేంద్రాలను నిర్వహిస్తున్నారు. ఈ కేంద్రాలలో ఫ్యాన్లు అటుంచితే గాలి, వెలుతురు లేక చిన్నారుల కష్టాలు వర్ణణాతీతం. జిల్లాలో 40 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు నమోదవుతుండడంతో ఉదయం నుంచే భానుడి విశ్వరూపానికి చిన్నారులు విలవిల్లాడిపోతున్నారు. చిన్నారులతో చెలగాటం అంగన్వాడీ కేంద్రాలను ప్రతిరోజు ఉదయం 9 నుంచి సాయంత్రం 4 గంటల వరకు నిర్వహించాల్సి ఉంది. అయితే వేసవిని దృష్టిలో పెట్టుకుని ప్రభుత్వం పనివేళలను కుదించింది. ఈ ఏడాది మార్చి 18వ తేది నుంచి ఉదయం 8 నుంచి 11 గంటల వరకు కేంద్రాలను నిర్వహిస్తోంది. ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలకు 50 రోజుల వేసవి సెలవులు ఉండగా, ఐదేళ్లలోపు చిన్నారులు అంగన్వాడీ కేంద్రాలకు వెళ్లాల్సి ఉండడంతో చిన్నారుల తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సంబంధిత అధికారులు చర్యలు తీసుకుని అంగన్వాడీ కేంద్రాలకు వేసవి సెలవులు వర్తింపజేయాలని కోరుతున్నారు. వేసవి సెలవులు ఇవ్వాలి ప్రభుత్వ, ప్రైవేటు, ఎయిడెడ్ పాఠశాలలు, కళాశాలలతోపాటు అంగన్వాడీ కేంద్రాలకు వేసవి సెలవులు వర్తింపజేయాలి. ఐదేళ్లలోపు చిన్నారులు వేసవిలో అంగన్వాడీ కేంద్రాలకు వెళ్లాలంటే ఎండ తీవ్రతతో అల్లాడుతున్నారు. అధికారులు చర్యలు చేపట్టి పూర్వ ప్రాథమిక విద్యను అభ్యసిస్తున్న చిన్నారులకు వేసవి సెలవులు ఇవ్వాలి. – లక్ష్మిదేవి, జిల్లా కార్యదర్శి, ఏపీ అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ -
నేటి నుంచి హైకోర్టుకు వేసవి సెలవులు
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ హైకోర్టుకు మే 2వ తేది నుంచి మే 31వ తేది వరకు వేసవి సెలవులు ప్రకటించారు. అయితే అత్యవసర కేసుల్ని విచారణ జరిపేందుకు మాత్రం వెకేషన్ కోర్టులను ఏర్పాటు చేశారు. ఈ వెకేషన్ కోర్టులు రెండు విడతలోŠల్ పనిచేస్తాయి. మొదటి విడత వెకేషన్ కోర్టులో తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రాఘవేంద్రసింగ్ చౌహాన్, న్యాయమూర్తులు జస్టిస్ షమీమ్ అక్తర్, జస్టిస్ అభినంద్‌కుమార్ షావిలి ఉంటారు. మే 6న కేసులు ఫైల్ చేస్తే, వాటిని వెకే షన్ కోర్టులు 8వ తేదీన, 13న దాఖలు చేసే కేసులను 15న ఈ వెకేషన్ కోర్టులు విచారిస్తాయి ఇక రెండో విడత వెకేషన్ కోర్టులో న్యాయమూర్తులు జస్టిస్ ఎం.ఎస్.రామచంద్రరావు, జస్టిస్ ఎ.రాజశేఖర్‌రెడ్డి, జస్టిస్ చల్లా కోదండరామ్‌లు ఉం టారు. 20న దాఖలు చేసే కేసులను 22న, 27న దాఖ లు చేసే వాటిని 29న విచారణ జరుపుతారు. హెబియస్ కార్పస్‌లు, ముందస్తు బెయిల్స్, బెయిల్స్, ఇతర అత్యవసర కేసులను మాత్రమే వెకేషన్ కోర్టు ల్లో విచారణ చేపడతారని హైకోర్టు రిజిస్ట్రార్ జనరల్ వెంకటేశ్వర్‌రెడ్డి తెలిపారు. -
అంతా తూచ్..!
ప్రభుత్వ నిబంధనలు కార్పొరేట్ కళాశాలలకు పట్టడం లేదు. తమ దారి అడ్డదారి అన్నట్టుగా ఇష్టారాజ్యంగా యాజమాన్యాలు వ్యవహరిస్తున్నాయి. ఒక పక్క పదో తరగతి పరీక్ష ఫలితాలు రాకుండానే ఇంటర్ మొదటి సంవత్సరంలో ప్రవేశాలు నిర్వహిస్తున్నారు. ఐఐటీ, నీట్ ర్యాంకుల ఆశలు చూపిస్తూ విద్యార్థుల తల్లిదండ్రులను బుట్టలో వేసుకుంటున్నారు. వేసవి సెలవుల్లో తరగతులు నిర్వహించకూడదన్న నిబంధనలు ఉన్నా ఉత్తమ ఫలితాల పేరుతో కళాశాలను నిర్వహిస్తున్నారు. ఆటవిడుపు లేకుండా విద్యార్థులపై ఒత్తిడి పెంచుతున్నారు. విద్యార్థులకు ఇష్టం లేకున్నా బలవంతపు చదువులు రుద్ది వారిని మానసిక ప్రశాంతతకు దూరం చేస్తున్నారని పలువురు మండి పడుతున్నారు. ఇంత జరుగుతున్నా యాజమాన్యాలపై చర్యలు తీసుకోవాల్సిన ఇంటర్ బోర్డు అధికారులు మామూళ్ల మత్తులో మునిగి తేలుతున్నారు. తమ చేతులు తడిపితే ఎప్పుడైనా తరగతులు నిర్వహించుకోవచ్చంటూ సంకేతాలు పంపుతుండడం గమనార్హం. నెల్లూరు(టౌన్): జిల్లావ్యాప్తంగా మొత్తం 189 ప్రభుత్వ, కార్పొరేట్ జూనియర్ కళాశాలలు ఉన్నాయి. వాటిలో 58 ప్రభుత్వ, 15 ఎయిడెడ్, 116 కార్పొరేట్, ప్రైవేట్ జూనియర్ కళాశాలలు ఉన్నాయి. ఈ కళాశాలల్లో 58 వేల మందికి పైగా విద్యార్థులు ఇంటర్ చదువుతున్నారు. ఈ ఏడాది ఫిబ్రవరి 27వ తేదీ నుంచి మార్చి 18వ తేదీ వరకు ఇంటర్ పరీక్షలు జరిగాయి. అదే నెల 29వ తేదీ నుంచి జూనియర్ కళాశాలలకు వేసవి సెలవులు ప్రకటించారు. జూన్ 3వ తేదీన జూనియర్ కళాశాలలు ప్రారంభించాల్సిఉంది. అయితే కళాశాలల యాజమాన్యాలు ఉత్తీర్ణత శాతం, ర్యాంకుల పేరుతో విద్యార్థులను ఒత్తిడికి గురిచేస్తున్నాయి. ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా సెలవులతోపాటు పండగ రోజుల్లో తరగతులు నిర్వహిస్తున్నారు. నారాయణ, శ్రీచైతన్య, గాయిత్రి తదితర జూనియర్ కళాశాలలు వేసవి సెలవుల్లో ప్రత్యేక తరగతులు నిర్వహిస్తున్నాయి. వేసవి సెలవులు ఇచ్చి దాదాపు నెల రోజులు కావస్తున్నా ఇప్పటికీ తరగతులు నిర్వహిస్తుండడం గమనార్హం. ప్రథమ సంవత్సరం పూర్తి చేసుకున్న విద్యార్థులను ఇళ్లకు పంపకుండా కళాశాలల్లోనే ఉంచి తరగతులు నిర్వహిస్తున్నారు. ముందుగానే టాలెంట్ టెస్ట్ రాయాలంటూ విద్యార్థులను కళాశాలలకు పిలిపించి వారిని తమ కళాశాలలో చేరే విధంగా ప్రలోభాలకు గురిచేస్తున్నారు. తరగతుల నిర్వహణపై విద్యార్థి సంఘాల నాయకులు ప్రతిరోజూ ఏదో ఒక కళాశాలకు వెళ్లి యాజమాన్యాలను నిలదీస్తున్నారు. తరగతులను బహిష్కరించి విద్యార్థులను ఇళ్లకు పంపుతున్నారు. ఇంత జరుగుతున్నా ఇంటర్‌బోర్డు అధికారులు నిమ్మకునీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారు. యాజమాన్యాలు ఇచ్చే ముడుపులతో మిన్నకుంటున్నారన్న విమర్శలు వెలువెత్తుతున్నాయి. తరగతుల నిర్వహణపై ఫిర్యాదు చేసినా అధికారులు చర్యలు తీసుకునేందుకు వెనకడుగువేస్తున్నారని విద్యార్థి సంఘాల నాయకులు మండిపడుతున్నారు. ఒత్తిడికి గురవుతున్న విద్యార్థులు వేసవి సెలవుల్లో తరగతులు నిర్వహించడంతో విద్యార్థులు మానసిక ఒత్తిడికి గురవుతున్నారు. పబ్లిక్ పరీక్షలు రాసిన వెంటనే మళ్లీ తరగతులు అంటే విద్యార్థులు విముఖత కనబరుస్తున్నారు. కనీసం ఆటవిడుపు కూడా లేకుండా నిత్యం పుస్తకాలు పట్టుకోవడంపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఉదయం 6 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు పుస్తకాలతో విద్యార్థులను కుస్తీ పట్టిస్తున్నారు. ఒత్తిడికి తట్టుకోలేని విద్యార్థులు రకరకాల మానసిక ఆందోళనకు గురివుతున్నారు. భారీగా ఫీజులు ఇంటర్లో ప్రవేశం కోసం కార్పొరేట్ కళాశాలల యాజమాన్యాలు భారీగా ఫీజులు వసూలు చేస్తున్నాయి. ఐఐటీ, నీట్ల పేరుతో రూ.లక్ష నుంచి రూ.3.50 లక్షల వరకు ఫీజులు నిర్ణయించారు. వీటితోపాటు దుస్తులు, పుస్తకాలు, పరీక్ష ఫీజు, ఆన్లైన్లో పరీక్ష, మెయింటినెన్స్ల పేర్లతో దోపిడీకి పాల్పడుతున్నారు. అయితే తమ పిల్లలు సెటిల్ అవుతారన్న ఆశతో తల్లిదండ్రులు కూడా అడిగినంత ఫీజు చెల్లిస్తున్నారు. ఫీజులపై నియంత్రణ ఉన్నా ఆ దిశగా అధికారులు చర్యలు తీసుకోవడం లేదు. ఇప్పటికైనా కార్పొరేట్ ఆగడాలపై జిల్లా ఉన్నతాధికారులు చర్యలు తీసుకోవాలని విద్యావేత్తలు, విద్యార్థి సంఘాల నాయకులు డిమాండ్ చేస్తున్నారు. వేసవి సెలవుల్లో తరగతులు నిర్వహించకూడదు వేసవి సెలవుల్లో ఎలాంటి తరగతులు నిర్వహించకూడదు. ప్రధానంగా ద్వితీయ సంవత్సరానికి సంబంధించి ఇప్పటి నుంచే తరగతులు నిర్వహించకూడదు. విద్యార్థుల ప్రవేశాల కోసం ఎలాంటి టాలెంట్ టెస్ట్‌లు పెట్టకూడదు. కళాశాలలు జూన్ 3వ తేదీ నుంచి పునః ప్రారంభం కానున్నాయి. షెడ్యూల్ వచ్చే వరకు అడ్మిషన్లు చేపట్టకూడదు. అధిక ఫీజులు వసూలు చేయకూడదు. కళాశాల ఫీజుల వివరాలను నోటీసు బోర్డులో ఉంచాలి. ఈ నిబంధనలను అత్రికమించిన వారిపై చర్యలు తీసుకుంటాం. – ఎస్.సత్యనారాయణ, ఆర్ఐఓ -
దొంగల కాలం.. జరభద్రం
అనంతపురం సెంట్రల్ : వేసవి సెలవులు ప్రారంభమయ్యాయి. అందరూ పిల్లాపాపలతో సరదాగా గడిపేందుకు సొంతూళ్లకు, పర్యటక ప్రాంతాలకు వెళ్లేందుకు రెడీ అవుతున్నారు. వారం, పది, పదహైదు రోజులు గడపాలని ఆశ పడతారు. అలా వెళ్తున్న వారు జరభద్రంగా ఉండాలి. దొంగతనాలకు అనువైన సమయంగా నేరస్తులు వేసవి కాలన్ని ఎంచుకుంటారు. తాళం వేసిన ఇళ్లు కనిపిస్తే కన్నం వేసే ప్రమాదం ఉంది. మీ ఇంటిని సురక్షితంగా కాపాడుకోవాల్సిన బాధ్యత ఎంతైనా ఉంది. ప్రతి ఏటా దాదాపు రూ.8 కోట్ల వరకు ప్రజల ఆస్తులు దొంగల వశం అవుతున్నాయి. ఇందులో ఎక్కువశాతం వేసవి సెలవుల్లో జరుగుతున్నవే అధికం. దీనికి తోడు తాళం వేసిన ఇళ్లల్లోనే 90 శాతం దొంగతనాలు జరుగుతుండడం గమనార్హం. కావున తాళం వేసి ఊళ్ళకు వెళ్లే సమయంలో తగిన జాగ్రత్తలు అవసరం. సెలవుల్లో ఊరెళ్లేటప్పుడు... పిల్లలకు వేసవి సెలవులు వచ్చాయి. పిల్లలు ఎంజాయ్ చేసేందుకు వారి అమ్మమ్మ, నానమ్మ, బంధువుల ఊళ్లకు, పర్యాటక ప్రాంతాలకు వెళ్లేందుకు తల్లిదండ్రుల వద్ద మారం చేస్తున్నారు. తల్లిదండ్రులు కూడా వేసవి సెలవులు వస్తే పిల్లలను తీసుకొని అలా బయటకు పోదామని ప్లాన్ చేసుకుంటున్నారు. అయితే వీలున్నంత వరకు ఇంటి వద్ద ఒక మనిషి ఉండేలా ప్లాన్ చేసుకోవాలి. లేరన్న సమయంలో నమ్మకస్తులకు ఇంటి బాధ్యత అప్పగించాలి. ఎందుకంటే మనిషి ఇంట్లో ఉన్నట్లైతే సామాన్యంగా దొంగలు ప్రవేశించే అవకాశముండదు. లేనిపక్షంలో తాళం వేసినట్లు దొంగలకు కనిపించకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. ఇంట్లో నిరంతరం లైట్లు, టీవీ ఆన్‌లో ఉంచడం తదితర చిట్కాలు పాటించాలి. కాపలాగా కుక్కలను ఉంచుకోవడం కూడా ఉపయోగకరం. అజాగ్రత్త ప్రయాణం ప్రమాదకరం ఎక్కువశాతం మంది బస్సులు, రైళ్లలో ప్రయాణాలు చేస్తారు. ప్రయణాల్లో కూడా దొంగతనాలు ఎక్కువగా జరిగే ఆస్కారం ఉంది. ప్రయాణికుల మాదిరిగా బస్సుల్లో ఎక్కి బ్యాగులు మార్పిడి చేసి దిగిపోయే దొంగలు ఎక్కువ మంది ఉన్నారు. బస్సులు, రైళ్లు ఎక్కేటప్పుడు, దిగేటప్పుడు, ఆదమరిచి నిద్రపోయే సమయంలో చైన్‌స్నాచింగ్, పర్సు చోరీలు జరిగే అవకాశం ఉంది. ఉచిత సర్వీసును సద్వినియోగం చేసుకోండి లాక్డ్ హౌస్ మానిటరింగ్ సిస్టం యాప్ (ఎల్‌హెచ్‌ఎంఎస్) పూర్తిగా ఉచితం. చిన్న సమాచారం ఇస్తే చాలు ఎన్నిరోజులైనా వచ్చేంత వరకు ఆ ఇంటికి భద్రత కల్పిస్తాం. ఇలాంటి అవకాశాన్ని ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలి. అపోహలు వీడి ఈ రోజే యాప్‌ను ఇన్స్టాల్ చేసుకోవడంతో పాటు తప్పనిసరిగా ఊరెళ్లేటప్పుడు సమాచారం ఇవ్వాలి. ఎంతమంది ఇళ్లకైనా సీసీ కెమెరాలు అమర్చేందుకు పోలీసులు సిద్ధంగా ఉన్నారు. అలాగే ఇటీవల జరుగుతున్న దొంగతనాల్లో ఎక్కువశాతం తాళం వేసి ఊళ్లకు వెళ్లిన వారు, ఇంటిపైన పడుకున్న వారి ఇళ్లలో మాత్రమే దొంగతనాలు జరిగాయి. ప్రజలు తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. నేరాలు జరిగిన తర్వాత బాధపడే కన్నా ముందే జాగ్రత్తలు తీసుకోవడం మంచిది. – శ్రీనివాసులు, సీసీఎస్ డీఎస్పీ లాక్డ్హౌస్ మానిటరింగ్ సిస్టంతో దొంగతనాలకు చెక్ పోలీసు శాఖ అమలు చేస్తున్న లాక్డ్హౌస్ మానిటరింగ్ సిస్టం (ఎల్‌హెచ్‌ఎంఎస్) యాప్‌తో దొంగతనాలకు అడ్డుకట్ట వేసే అవకాశముంది. మీ ఇంటికి తాళం వేసి వెళ్తున్నట్లయితే, మీరు ఊరు వెళ్లి వచ్చే వరకు సీసీ కెమెరాల టెక్నాలజీ పర్యవేక్షణతో ఇంటిపై నిఘా ఉంచుతారు. ♦ ‘ఎల్‌హెచ్‌ఎంఎస్ ఏపీ పోలీస్’ యాప్‌లోకి వెళ్లి మీ వివరాలు, చిరునామా సెల్ నంబర్ వివరాలతో దరఖాస్తును భర్తీ చేస్తే ఆమోదిస్తూ రిజిస్ట్రేషన్ యూనిక్ ఐడీ ఇస్తారు. ♦ ఎప్పుడైనా ఇంటికి తాళం వేసి వెళ్తున్నట్లయితే యాప్‌లోని రిక్వెస్ట్ వాచ్‌లో ఫలానా రోజు నుంచి ఫలానా రోజు వరకు ఇంటికి తాళం వేసి వెళ్లున్నట్లు వివరాలు పేర్కొనాలి. ♦ ఫలానా రోజున ఇంట్లో ఉండటం లేదని పోలీసులకు ముందస్తు సమాచారం ఇవ్వాలి. ♦ అప్పుడు మీ ఇంటికి వచ్చి వైర్లెస్ మోషన్ కెమెరా (కెమెరా ముందు కదలికలు కనిపిస్తే రికార్డు చేసే కెమెరా)ను మోడమ్ (వైఫై)ను ఏర్పాటు చేస్తారు. ♦ అప్పటి నుంచి మీ ఇల్లు నిఘాలో ఉంటుంది. కెమెరాను పోలీసు కంట్రోల్ రూమ్, ఇంటి యజమాని మొబైల్‌కు అనుసంధానిస్తారు. ♦ కెమెరా ముందు ఏమైనా కదలికలు జరిగితే వెంటనే ఫొటోలు, వీడియోను రికార్డు చేసి కంట్రల్రూమ్కు పంపే సౌకర్యం ఉంటుంది. అలాగే కంట్రోల్ రూమ్‌లో సైరన్ మోగడం ద్వారా నిమిషాల్లో సదరు ఇంటికి పోలీసులు చేరుకుని దొంగలను పట్టుకుంటారు. -
రేపటి నుంచి వేసవి సెలవులు
అనంతపురం/కదిరి: పాఠశాలలకు రేపటి నుంచి వేసవి సెలవులు ప్రకటించారు. 2018–19 విద్యా సంవత్సరానికి మంగళవారం చివరి పనిదినం. ప్రభుత్వ, మండల పరిషత్, జిల్లా పరిషత్, ఎయిడెడ్, అన్ఎయిడెడ్ పాఠశాలల యాజమాన్యాలు ఈనెల 24 నుంచి వేసవి సెలవులు విధిగా పాటించాలని డీఈఓ జనార్దనాచార్యులు ఆదేశించారు. జూన్ 12న పాఠశాలలు పునః ప్రారంభం అవుతాయన్నారు. 24 నుంచి ఎట్టిపరిస్థితుల్లోనూ పాఠశాలలు నడపరాదని పేర్కొన్నారు. పదో తరగతి ప్రత్యేక తరగతులు, శిక్షణలు కూడా నిర్వహించరాదని సూచించారు. నిబంధనలు ఉల్లంఘించి తరగతులు నిర్వహిస్తే సంబంధిత పాఠశాలల యాజమాన్యాలపై చర్యలుంటాయని హెచ్చరించారు. ఇకపోతే జిల్లాలోని మొత్తం 63 మండాలాల్లో కేవలం 32 మండలాలను మాత్రమే ప్రభుత్వం కరువు ప్రాంతాలుగా ప్రకటించింది. దీంతో ఆయా మండలాల్లోని పాఠశాలల్లో చదివే పిల్లలకు మాత్రమే మధ్యాహ్న భోజనం వడ్డించాలని ప్రభుత్వ నిబంధనలు చెబుతున్నాయి. మధ్యాహ్న భోజనం అమలయ్యే మండలాలివే.. అనంతపురం, బెలుగుప్ప, బొమ్మనహాళ్, డీ.హీరేహాళ్, గుత్తి, గుంతకల్లు, కణేకల్లు, కూడేరు, పెద్దవడుగూరు, పెనుకొండ, పుట్లూరు, రామగిరి, రొద్దం, తాడిపత్రి, ఉరవకొండ, యాడికి, అమరాపురం, బ్రహ్మసముద్రం, చిలమత్తూరు, గాండ్లపెంట, గోరంట్ల, గుడిబండ, గుమ్మఘట్ట, కదిరి, కళ్యాణదుర్గం, కంబదూరు, కూడేరు, ఎన్పీ కుంట, పుట్టపర్తి, సోమందేపల్లి, శెట్టూరు, తనకల్లు మండలాలను మాత్రమే ప్రభుత్వం కరువు మండలాలుగా గుర్తిస్తూ జీఓ ఎంఎస్ నెం.2ను ఈ ఏడాది ఫిబ్రవరి 13న విడుదల చేసింది. ఈ కరువు మండలాల పరిధిలోని పాఠశాలల్లో మాత్రమే వేసవి సెలవుల్లో మధ్యాహ్న భోజన వసతి కల్పించాలని ప్రభుత్వం తాజాగా సోమవారం విడుదల చేసిన మార్గదర్శకాల్లో(ఆర్సీ నెం.2/27021) స్పష్టం చేసింది. సెలవుల్లో బడికెళ్లిన టీచర్‌కు ఏం లాభం? వేసవి సెలవుల్లో సంబంధిత పాఠశాల ప్రధానోపాధ్యాయుడు ప్రతిరోజూ పాఠశాలకు వెళ్లి పిల్లలకు మధ్యాహ్న భోజనాన్ని పర్యవేక్షించి దగ్గరుండి అందించినందుకు అదనంగా రూ.2 వేలు గౌరవవేతనం రూపంలో అందజేస్తారు. హెచ్ఎం బదులుగా అదే పాఠశాలలో పనిచేసే మిగిలిన ఒకరిద్దరు టీచర్లు సైతం రొటేషన్ పద్ధతిలో మధ్యాహ్న భోజన పర్యవేక్షించి, పిల్లలకు భోజన ఏర్పాట్లు చూసినందుకు వారికి కూడా ఈ గౌరవవేతనం వర్తిస్తుంది. అయితే పాఠశాల ప్రధానోపాధ్యాయుడు మాత్రం రోజూ మధ్యాహ్న భోజనానికి హాజరైన విద్యార్థుల వివరాలు యాప్ ద్వారా ఉన్నతాధికారులకు పంపించాల్సి ఉంటుంది. వాస్తవంగా ఉపాధ్యాయులు వేసవి సెలవులను వదులుకొని పాఠశాలకు హాజరై మధ్యాహ్న భోజనాన్ని పర్యవేక్షించినందుకు మెమో నెం.225780 ప్రకారం వేతనంతో కూడిన ఆర్జిత సెలవు(ఈఎల్) కూడా మంజూరు చేయాల్సి ఉంటుంది. కాకపోతే మధ్యాహ్న భోజనానికి సంబంధించి తాజాగా విడుదల చేసిన మార్గదర్శకాల్లో(ఆర్సీ నెం.2/27021) ఆ విషయమై స్పష్టత ఇవ్వకపోవడం గమనార్హం. -
చిన్నారులకు వేసవి సెగ!
కర్నూలు, కోవెలకుంట్ల: అంగన్వాడీ కేంద్రాల్లో పూర్వ ప్రాథమిక విద్యనభ్యసిస్తున్న చిన్నారులకు ఈ ఏడాది వేసవి సెగ తప్పడం లేదు. వేసవి కాలాన్ని దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వం ఏటా ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలలకు 50 రోజులపాటు సెలవులను ప్రకటిస్తోంది. ఈ విద్యా సంవత్సరం ఏప్రిల్ 23తో ముగియనుండటంతో 24 నుంచి పాఠశాలలకు వేసవి సెలవులు ఇవ్వనున్నారు. అంగన్వాడీ కేంద్రాలకు ఈ ఏడాది వేసవి సెలవులు వర్తింపచేయకుండా వారి జీవితాలతో సర్కార్ చెలగాటమాడుతోంది. మండుటెండల్లో సైతం కేంద్రాలను నిర్వహిస్తుండటంతో చిన్నారులకు వేసవి సెగ తప్పేలా లేకపోవడంతో వారి తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు. జిల్లాలోని 3,548 అంగన్వాడీ కేంద్రాల్లో ఆరేళ్లలోపు వయస్సున్న 3.35 లక్షల మంది చిన్నారులు పూర్వ ప్రాథమిక విద్యనభ్యసిస్తున్నారు. వర్తించని వేసవి సెలవులు ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలలతో పోలిస్తే అంగన్వాడీ కేంద్రంలో పూర్వ ప్రాథమిక విద్యనభ్యసిస్తున్న చిన్నారులంతా ఏడాది నుంచి ఆరేళ్లలోపు వయస్సు ఉన్న వారే. అంగన్వాడీ కేంద్రాలకు వేసవి సెలవులు ప్రకటించకుండా వేళల కుదింపుతో సరిపెట్టడంతో చిన్నారులకు వేసవికాలం అగ్ని పరీక్షగా మారింది. వసతుల లేమి, అద్దె భవనాలు, మండుటెండలు చిన్నారులకు శాపంగా మారాయి. జిల్లాలో ఉన్న అంగన్వాడీ కేంద్రాల్లో సగానికిపైగా కేంద్రాలకు సొంత భవనాలు లేవు. అరకొరగా ఉన్న ప్రభుత్వ భవనాల్లో వసతులు లేవు. వర్షాభావ పరిస్థితుల కారణంగా గత ఏడాది డిసెంబర్ నుంచే ఎండలు అధికమయ్యాయి. ఫ్యాన్లు కూడా లేని అంగన్వాడీ కేంద్రాలు జిల్లాలో కోకొల్లలు. ప్రభుత్వం అద్దె భవనాలకు తగినంత బాడుగ ఇవ్వకపోవడంతో గ్రామాల్లో వసతులు లేని ఇరుకైన ఇళ్లలో కేంద్రాలను నిర్వహిస్తున్నారు. ఈ కేంద్రాల్లో ఫ్యాన్లు అటుంచితే గాలి, వెలుతురు లేక చిన్నారుల బాధలు వర్ణణాతీతం. ఎండలు అధికం కావడంతో ప్రభుత్వ భవనాలతోపాటు అద్దె భవనాల్లో కొనసాగుతున్న కేంద్రాల్లో చిన్నారులు ఉక్కపోతతో అల్లాడిపోతున్నారు. జిల్లాలో 41 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు నమోదవుతుండటంతో ఉదయం 10 గంటల నుంచే భానుడి విశ్వరూపానికి చిన్నారులు విలవిల్లాడిపోతున్నారు. చిన్నారుల ప్రాణాలతో చెలగాటం అంగన్వాడీ కేంద్రాలను ప్రతి రోజు ఉదయం 9 నుంచి సాయంత్రం 4 గంటల వరకు నిర్వహించాల్సి ఉంది. అయితే వేసవి కాలాన్ని దృíష్టిలో ఉంచుకుని ప్రభుత్వం పనివేళలను కుదించింది. గత నెల 18వ తేదీ నుంచి ఉదయం 8 నుంచి 11 గంటల వరకు కేంద్రాలు నిర్వహిస్తోంది. అంగన్వాడీ కేంద్రాల్లో కార్యకర్తలు, ఆయాలతోపాటు మహాత్మాగాంధీ జాతీయ ఉపాధి హామీ పథకం, ఇతర కూలీ పనులకు వెళ్లే చిన్నారులు ఉంటే వారి తల్లిదండ్రులు ఇళ్లకు వచ్చే వరకు కేంద్రాల్లో ఉండేలా చర్యలు తీసుకున్నారు. ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలలకు 50 రోజులు వేసవి సెలవులు ఉండగా ఆరేళ్లలోపు చిన్నారులు అంగన్వాడీ కేంద్రాలకు వెళ్లాల్సి ఉండటంతో చిన్నారుల తల్లిదండ్రులు, అంగన్వాడీలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సంబంధిత అధికారులు చర్యలు తీసుకుని అంగన్వాడీ కేంద్రాలకు వేసవి సెలవులు వర్తిపంచేయాలని వారు కోరుతున్నారు. -
జూన్ నాటికి పాఠ్యపుస్తకాలు!
కర్నూలు సిటీ: ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు ఈ ఏడాది పాఠ్యపుస్తకాల కొరత లేకుండా జూన్ నాటికి స్కూల్ పాయింట్లకు చేర్చేందుకు విద్యా శాఖ కసరత్తు చేస్తోంది. మూడు, నాలుగేళ్లుగా విద్యా సంవత్సరం ప్రారంభమై.. నెలలు గడిచినా పూర్తి స్థాయి పాఠ్యపుస్తకాలు విద్యార్థులకు చేరలేదు. అరకొర పుస్తకాలతోనే చదువులు కొనసాగించారు. అయితే.. 2019–20 విద్యా సంవత్సరంలో అలాంటి ఇబ్బందులేవీ ఉండకూడదనే ఉద్దేశంతోనే విద్యాశాఖ ఈ ఏడాది జనవరి నుంచే పాఠ్యపుస్తకాలను సిద్ధం చేసే ప్రక్రియకు శ్రీకారం చుట్టింది. వేసవి సెలవులు ముగిసే నాటికే ప్రింటర్ల నుంచి జిల్లా కేంద్రానికి, ఇక్కడి నుంచి మండల విద్యా వనరుల కేంద్రాలకు(ఎంఆర్సీలు) పాఠ్య పుస్తకాలను చేర్చి, స్కూళ్లు పునఃప్రారంభమైన వెంటనే విద్యార్థులకు అందజేసే విధంగా చర్యలు చేపడుతోంది. జిల్లాకు చేరిన మొదటివిడత పుస్తకాలు మొదటి విడత పాఠ్య పుస్తకాలు మంగళవారం జిల్లాకు చేరాయి. 2వ తరగతి, 5వ తరగతి, పర్యావరణ విద్యకు సంబంధించిన పుస్తకాలు వచ్చాయి. మొత్తం 61,500 పుస్తకాలు జిల్లాకు చేరినట్లు విద్యాశాఖ వర్గాలు వెల్లడించాయి. 2019–20 విద్యా సంవత్సరం కొత్తగా ప్రైమరీ తరగతులలో పర్యావరణ విద్యను కూడా ప్రవేశ పెట్టనున్నారు. వీటికి సంబంధించిన పుస్తకాలు ఇప్పటికే ముద్రణ పూర్తయ్యింది. గతంలో కంటే మూడు నెలల ముందుగానే ముద్రణకు టెండర్లు పిలవడం, ప్రింటర్లు సైతం నిర్ధేశించిన సమయానికి ప్రింటింగ్ పూర్తి చేసి మొదటి విడత పుస్తకాలను జిల్లాలకు చేర్చుతున్నారు. కర్నూలు నగరంలోని పాఠ్యపుస్తకాల గోదామును ఆర్జేడీ ప్రతాప్‌రెడ్డి, డీఈఓ తాహెరా సుల్తానా మంగళవారం తనిఖీ చేశారు. జిల్లాలో 2018 డిసెంబరు యూడైస్ వివరాల ప్రకారం ప్రాథమిక స్కూళ్లు 2,422, ప్రాథమికోన్నత 932, ఉన్నత పాఠశాలలు 985, మొత్తంగా 4,339 పాఠశాలలు ఉన్నాయి. వీటిలో ప్రైమరీ విద్యార్థులు 2,62,069 మంది, అప్పర్ ప్రైమరీ 1,15,844 మంది, హైస్కూల్ విద్యార్థులు 2,87,659 మంది చదువుతున్నారు. ప్రభుత్వ యాజమాన్యాలు, ఎయిడెడ్ స్కూళ్లతో పాటు ఏపీ మోడల్ స్కూల్స్, కస్తూర్బా గాంధీ విద్యాలయాల్లో చదువుతున్న వారికి విద్యాశాఖ ఉచితంగానే పాఠ్య పుస్తకాలను అందజేస్తోంది. గతేడాది ఈ సమయానికి ముద్రణ ప్రక్రియనే మొదలుకాలేదు. ఆలస్యంగా పుస్తకాలు రావడంతో పాత పుస్తకాలతోనే చదువులు కొనసాగించాల్సి రావడంపై విద్యాశాఖ తీవ్ర విమర్శలు ఎదుర్కొంది. యూడైస్ ప్రకారం సరఫరా గతంలో ఎన్ని పుస్తకాలు కావాలో జిల్లా అధికారుల నుంచి వివరాలను తీసుకునేవారు. అయితే.. గత ఏడాది నుంచి విద్యాశాఖనే యూడైస్ ప్రకారం ఏయే జిల్లాకు ఎన్ని పాఠ్యపుస్తకాలు అవసరమో ఆన్లైన్లోని వివరాల ప్రకారం సరఫరా చేస్తోంది. ఈ ఏడాది మే 15 నాటికి 80 శాతం పుస్తకాలు ఎంఆర్సీలకు చేర్చాలని అధికారులు నిర్ణయించారు. కన్నడ మీడియం పుస్తకాలు మాత్రమే కొంత ఆలస్యమయ్యే అవకాశముంది. మొత్తం ఐదు విడతల్లో పుస్తకాలు రానున్నాయి. మొదటి విడత కింద 2,5 తరగతులకు చెందిన ఇంగ్లిష్, ఇంగ్లిష్ వర్క్‌బుక్స్, పర్యావరణ విద్యకు సంబంధించిన పుస్తకాలు వచ్చాయి. -
పర్యాటక ప్రయాణమెలా?
సాక్షి, సిటీబ్యూరో: వేసవి వచ్చేసింది. మరికొన్ని రోజుల్లో పిల్లలకు సెలవులు రానున్నాయి. వేసవి సెలవుల్లో పర్యాటక ప్రాంతాలు, సొంతూళ్లకు వెళ్లేందుకు నగరవాసులు ప్రణాళికలు సిద్ధం చేసుకుంటున్నారు. కానీ జంట నగరాల నుంచి వివిధ ప్రాంతాలకు వెళ్లే అన్ని రెగ్యులర్ రైళ్లలో మాత్రం ఇప్పటికే వెయిటింగ్ లిస్టు దర్శనమిస్తోంది. ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకొని పలు మార్గాల్లో ప్రత్యేక రైళ్లను ప్రకటించారు. కానీ వాటిలో హైదరాబాద్ నుంచి వెళ్లేవి తక్కువే. నగరం నుంచి పర్యాటక ప్రాంతాలకు, పుణ్యక్షేత్రాలకు వెళ్లాలనుకునే ప్రయాణికులకు మాత్రం ఇబ్బందులు తప్పని పరిస్థితి నెలకొంది. నగరం నుంచి ఏర్పాటు చేసిన ప్రత్యేక రైళ్లలో ఎక్కువ శాతం కాకినాడ, తిరుపతి, విజయవాడ, విశాఖలకు మాత్రమే అందుబాటులో ఉన్నాయి. ఉత్తరాదికి వెళ్లే రైళ్లు చాలా తక్కువ. అలాగే దక్షిణాది రాష్ట్రాల్లో పర్యటించేందుకు వెళ్లాలనుకున్నా కష్టమే. మరోవైపు ప్రత్యేక రైళ్లలో చాలా వరకు వీక్లీ ఎక్స్‌ప్రెస్‌లు. కొన్ని 15 రోజులకు ఒకసారి రాకపోకలు సాగించేవి ఉన్నాయి. ఈ రైళ్లకు అనుగుణంగా ప్రయాణించేవాళ్లకు మాత్రమే కొంత మేరకు ఊరట లభిస్తుంది. పైగా ప్రత్యేక రైళ్లలోనూ చాలా వరకు ఇప్పటికే బుక్ అయ్యాయి. మరిన్ని అదనపు రైళ్లు, అదనపు బెర్తులు, బోగీలు వేస్తే తప్ప ప్రయాణికుల డిమాండ్‌ను భర్తీ చేయడం సాధ్యం కాదు. ‘వెయిట్’ చేయాల్సిందే... సికింద్రాబాద్, నాంపల్లి, కాచిగూడ స్టేషన్ల నుంచి వివిధ ప్రాంతాలకు వెళ్లే రెగ్యులర్ రైళ్లన్నింటిలోనూ వెయిటింగ్ లిస్ట్ రోజురోజుకు పెరుగుతూనే ఉంది. కొన్ని రైళ్లలో 80 వరకు నమోదై ఉండగా, మరికొన్నింటిలో 100కు పైగా దాటిపోయింది. ఏప్రిల్, మే నెలల్లోనే ప్రయాణికుల రద్దీ అధికంగా ఉంటుంది. జూన్ మొదటి వారంలో తిరిగి నగరానికి చేరుకుంటారు. కానీ అన్ని రైళ్లలోనూ డిమాండ్ అనూహ్యంగా కనిపిస్తోంది. వేసవి రద్దీని దృష్టిలో ఉంచుకొని వివిధ మార్గాల్లో సుమారు 90 అదనపు రైళ్లను నడిపేందుకు దక్షిణమధ్య రైల్వే ప్రణాళికలను రూపొందించింది. మార్చి నుంచి జూన్ వరకు వారానికి ఒకసారి రాకపోకలు సాగించే విధంగా వీటిని నడుపుతారు. రెగ్యులర్ రైళ్లలో వెయిటింగ్‌ను దృష్టిలో ఉంచుకొని ప్రత్యేక రైళ్లలో వెళ్లాలనుకున్నా ఎప్పుడు బయలుదేరుతుందో తెలియని ట్రైన్ కోసం పడిగాపులు కాయాల్సిందే. ఢిల్లీకి కష్టమే... వేసవి సెలవుల దృష్ట్యా చాలామంది నగరవాసులు ఉత్తరాది పర్యటనకు ప్రాధాన్యమిస్తున్నారు. ముఖ్యంగా డిల్లీ కేంద్రంగా వివిధ ప్రాంతాలను సందర్శించేందుకు ఎక్కువ మంది ఆసక్తి చూపుతారు. కానీ హైదరాబాద్ నుంచి ఒక్క తెలంగాణ ఎక్స్‌ప్రెస్, దక్షిణ్ ఎక్స్‌ప్రెస్ మినహా ఇతర రైళ్లు లేవు. కొన్ని రైళ్లు మాత్రం ఏపీ నుంచి, బెంగళూర్ నుంచి సికింద్రాబాద్ మీదుగా రాకపోకలు సాగిస్తున్నాయి. ఈ రైళ్లలో చాలా వరకు వైజాగ్, విజయవాడ, బెంగళూర్లలోనే భర్తీ అవుతాయి. అలాగే సికింద్రాబాద్ నుంచి జైపూర్, పట్నాకు వెళ్లే రైళ్లు కూడా చాలా తక్కువ. సికింద్రాబాద్–పట్నా మధ్య భారీ ఎత్తున రాకపోకలు ఉంటాయి. అక్కడి నుంచి వచ్చి హైదరాబాద్‌లో ఉంటున్నవాళ్లు ఈ వేసవిలో సొంతూళ్లకు వెళ్లేందుకు ఆసక్తి చూపుతారు. కానీ అందుబాటులో ఉన్న రైలు మాత్రం ఒక్కటే. ఏదో విధంగా వెళ్లాలంటే కనీసం రెండు, మూడు రైళ్లు మారాల్సిందే. హైదరాబాద్ నుంచి ప్రయాణికుల డిమాండ్ అధికంగా ఉన్న మరో పుణ్యక్షేత్రం షిర్డీ. ఒకే ఒక్క రైలు సికింద్రాబాద్ నుంచి షిర్డీకి వెళ్తుంది. మరో ట్రైన్ కాకినాడ నుంచి బయలుదేరి సికింద్రాబాద్ మీదుగా వెళ్తుంది. ఇక కేరళలోని ప్రకృతి అందాలను తిలకించేందుకు శబరి ఎక్స్‌ప్రెస్ ఒక్కటే ఉంది. -
ఆ కుటుంబంపై విధి పంజా
ఆ కుటుంబాన్ని విధి పగబట్టింది. వారి సంతోషాన్ని చిదిమేసింది. ఏడాది క్రితం కుటుంబ పెద్ద ఆత్మహత్య చేసుకున్నాడు. ముగ్గురు పిల్లలకూ తల్లే దిక్కయింది. ఇంతలో మరో విషాదం ఆ కుటుంబాన్ని కుదిపేసింది. శుక్రవారం ఉదయం ఇద్దరు పిల్లల ప్రాణాలను మాయదారి గుంత పొట్టన బెట్టుకుంది. దీంతో కన్నతల్లి గుండెలవిసేలా రోదించింది. ఆమెకొచ్చిన కొండంత కష్టం చూసి గ్రామం గుండె బరువెక్కింది. యాదమరి: మరో నాలుగు రోజులు గడిస్తే వేసవి సెలవులు ముగిసేవి. ఆ పిల్లలు ఎంచక్కా పాఠశాలకు వెళ్లేవారు. సెలవులయిపోతున్నాయని ఐదుగురు పిల్లలు కల్వర్టు గుంత వద్దకు వెళ్లారు. లోతును అంచనా వేయలేని వయస్సు..చూస్తుండగానే ఇద్దరు పిల్లలు మునిగిపోయారు. ప్రాణాలు కోల్పోయిన ఇద్దరూ అక్కాచెల్లెళ్లు.. యాదమరి మండలం బొమ్మన్ చేనులో శుక్రవారం ఈ విషాద ఘటన జరిగింది. గ్రామానికి చెందిన దొరస్వామి, లతలకు ముగ్గురు సంతానం. వీరిలో ఇందు(13)యాదమరి ఉన్నత పాఠశాలలో ఏడో తరగతి, హరీష్ అతికారపల్లెలో ఐదో తరగతి, మోనిషా(7) మూడో తరగతి చదువుతున్నారు. బంధువు ఒకరు మృతి చెందడంతో శుక్రవారం ఉదయం లత బిడ్డలను ఇంట్లో ఉంచి తమిళనాడు వెళ్లింది. తల్లి లేదు కదా అని ముగ్గురు పిల్లలు, తమ మేనత్త పిల్లలిద్దరితో కలసి పంటపొలం సమీపాన కల్వర్టు గుంత వద్దకు వెళ్లారు. నీవానదిలో ఇటీవల వర్షపు నీరు ప్రవహిస్తుండడంతో గుంతలో నీరు ఎక్కువగా చేరింది. హరీష్, మరో పిల్లలు గట్టుపై నిల్చోని నీటిలో చేపలున్నాయోమోనని చూస్తున్నారు. ఇంతలో ఇందు..మోనిషా నీటి కుంటలో దిగారు. లోతుగా ఉండడంతో ఈత రాక మునిగిపోయారు. గట్టుపై ఉన్న పిల్లలు పైకి వస్తారని చూస్తున్నారు. వారెం తకూ రాకపోవడంతో వెంటనే కేకలు వేశారు. దగ్గర్లోని తెలిసిన వాళ్లకు, పశువుల కాపర్లకు విషయం చెప్పారు. వారు నీటిలోకి దిగి కొన ఊపిరితో ఉన్న చిన్నారులను బయటకు తీసుకొచ్చారు. చిత్తూరు ప్రభుత్వాసుపత్రికి తరలించారు. అప్పటికే ఇందు మృతి చెందగా కాసేపటికీ ఆమె చెల్లెలు మోనిషా కూడా ప్రాణం విడిచింది. ఒకే కుటుంబానికి చెందిన అక్కాచెల్లెళ్లు మృతి చెందడంతో గ్రామంలో విషాదం అలముకుంది. ఏడాదిలోనే రెండు దారుణాలు.. గతేడాది ఈ ఇంట ఓ విషాదం చోటుచేసుకుంది. దొరస్వామి తన తల్లి ఆరోగ్యం కోసం అప్పులు చేశారు. వ్యవసాయం కలిసిరాలేదు. చేసిన అప్పు తీరలేదు. తల్లి మరణించింది. మనోవేదన చెందిన దొరస్వామి గతేడాది మేలో ఆత్మహత్య చేసుకున్నాడు. ఏడాది తిరిగిన కొద్ది రోజులకే ఇద్దరు బిడ్డలు చనిపోవడం గ్రామస్తుల గుండెలను పిండేసింది. దొరస్వామి భార్యను ఓదార్చడం ఎవరితరమూ కాలేదు. ‘మూడు రోజుల్లో స్కూళ్లు తెరుస్తారని పుస్తకాలు కూడా తెచ్చాను. వాటిని చూసి ఎంతో సరదా పడ్డారు.. ఇంతలోనే శవాలయ్యారు’ అంటూ తల్లి కన్నీరుమున్నీరయింది. తహసీల్దార్ రెడ్డప్ప, ఎంఈ ఓ జయప్రకాష్, ఎంపీడీఓ గిరధర్ రెడ్డి సాయంత్రం గ్రామానికి వెళ్లి మృతుల తల్లిని ఓదార్చారు. -
వేసవి సెలవులే కొంపముంచాయి: బీజేపీ
లక్నో: తాజాగా దేశవ్యాప్తంగా వెలువడ్డ పలు నియోజకవర్గాల ఉప ఎన్నికల ఫలితాలు బీజేపీకి గట్టి షాక్‌నే ఇచ్చాయి. యూపీలో విపక్షాలు చేతులు కలపటంతో కీలకమైన కైరానా లోక్‌సభ స్థానాన్ని కోల్పోవటం, అదే సమయంలో మరో సిట్టింగ్ స్థానం నూర్పూర్ అసెంబ్లీ నియోజకవర్గంలో చిత్తుగా ఓడటం బీజేపీకి మింగుడుపడటం లేదు. అయితే ఈ ఓటమికి బీజేపీ నేతలు చేప్తున్న కారణాలు ఆసక్తికరంగా ఉంటున్నాయి. వేసవి సెలవులే తమ కొంప ముంచాయని పాడి పరిశ్రమల శాఖా మంత్రి లక్ష్మీ నారాయణ్ చౌదరి చెబుతున్నారు. ‘పార్టీ మద్ధతుదారులు, కార్యకర్తలు, ఓటర్లు అంతా వేసవి సెలవుల కారణంగా కుటుంబాలతోసహా ఊళ్లకు వెళ్లారు. వారిని ఇబ్బంది పెట్టకూడదని అధిష్ఠానం భావించింది. ఒకవేళ వారంతా అందుబాటులో ఉండి ఉంటే కైరానా, నూర్పూర్లో బీజేపీ అవలీలగా గెలిచి ఉండేది’ అని లక్ష్మీ నారాయణ్ అంటున్నారు. అయినా ఉప ఎన్నికలను.. సార్వత్రిక ఎన్నికలతో ముడిపెట్టడం ఎంత మాత్రం సమంజసం కాదని ఆయన అంటున్నారు. ఏది ఏమైనా వచ్చే ఎన్నికల్లో బీజేపీ సత్తా చాటి తీరుతుందని ఆయన చెబుతున్నారు. ఇదిలా ఉంటే పార్టీలోని అంతర్గత కలహాల వల్లే బీజేపీ ఓటమిని చవిచూడాల్సి వచ్చిందని హర్దోయి నియోజకవర్గం ఎమ్మెల్యే శ్యామ్ ప్రకాశ్ సంచలన వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో సీఎం యోగిపై ఆయన తీవ్ర వ్యాఖ్యలు చేశారు కూడా. -
నేటి నుంచి తెరుచుకోనున్న పాఠశాలలు
-
ఏడు కొండల సామీ.. కానరావేమయ్యా!
తిరుమలలో శ్రీవారి దర్శనం కొందరికే పరిమితమైంది. తోపులాట లేకుండా మంచి దర్శనం కల్పిస్తామని చెప్పి టైంస్లాట్ విధానాన్ని ప్రవేశపెట్టారు. కొత్త విధానాన్ని ప్రవేశపెట్టిన నాటి నుంచి నేటి వరకు శ్రీవారిని దర్శనం చేసుకునే వారి సంఖ్య గణనీయంగా పడిపోయింది. గతంలో లక్ష మందికిపైగా భక్తులు స్వామి వారిని దర్శనం చేసుకుంటుంటే, ప్రస్తుతం 50 నుంచి 80 వేలకు పరిమితమైంది. దీంతో వేలాది మంది భక్తులు రోజుల తరబడి వేచి ఉండలేక, గదులు దొరక్క తిరుమలలోని అఖిలాండం వద్ద కర్పూరం వెలిగించి, కొబ్బరికాయకొట్టి శ్రీవారికి నమస్కరించి వెనుదిరిగి వెళ్తున్న దారుణ పరిస్థితులు నెలకొన్నాయి. – సాక్షి, తిరుపతి వేసవి సెలవులు ముగుస్తుండడంతో వచ్చే నెల 11లోపు ఏడుకొండల వాడిని దర్శించుకునేందుకు వివిధ రాష్ట్రాల నుంచి పెద్ద ఎత్తున భక్తులు తిరుమలకు చేరుకుంటున్నారు. పదిరోజులుగా తిరుమల భక్తులతో కిటకిటలాడుతోంది. అయితే భక్తులకు సరిపడా గదులు అందుబాటులో లేవు. తిరుమలలో మొత్తం గదులు 6 వేలు, మఠాలు 16 వేలు అందుబాటులో ఉన్నాయి. రోజువారీ గదుల కేటాయింపు 500కి మించటం లేదు. దీంతో మఠాలు, గదులు నిండిపోగా, వేలాది మంది భక్తులు తిరుమలలోని షెడ్లు, చెట్లు, బస్టాండు ప్రాంతాల్లో సేదదీరుతున్నారు. మరికొందరు తిరుపతిలో ప్రైవేటు హోటళ్లలో గదులను అద్దెకు తీసుకుంటున్నారు. అవీ దొరకని వారు స్వామి దర్శనం చేసుకోకుండానే వెనుదిరుగుతున్నారు. అందని అన్నప్రసాదాలు అన్న ప్రసాదాలు కూడా భక్తులకు పూర్తిస్థాయిలో అందటం లేదని భక్తులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. టీటీడీ మాత్రం రోజుకు సుమారు 5 లక్షల మందికి అన్న ప్రసాదాలు అందజేస్తున్నట్లు చెబుతోంది. ఈ లెక్కన తిరుమలలో లక్షల మంది భక్తులు ఉండాలి. అయితే దర్శనం మాత్రం రోజుకి 50 వేల నుంచి 80 వేల మందికి మాత్రమే కల్పిస్తున్నారు. వారం రోజులుగా తిరుమలలో శ్రీవారి దర్శన సమయాలను పరిశీలిస్తే 36 గంటల నుంచి 58 గంటల సమయం పట్టేది. బుధవారం నాటికి 26 గంటలకు చేరింది. అధ్వానం.. టైంస్లాట్ తోపులాటలు నివారించేందుకు టీటీడీ గతనెల మొదటి వారంలో టైంస్లాట్‌ను అమలులోకి తెచ్చింది. దీని ప్రకారం కాలినడకన వెళ్లే భక్తులకు రోజుకు 20 వేల మందికి దివ్యదర్శనం టోకెట్లు ఇస్తున్నారు. తిరుపతి, తిరుమలలో మరో 60 వేల మంది భక్తులు సర్వదర్శనం చేసుకుంటున్నారు. సాంబశివరావు ఈవోగా ఉన్నప్పుడు రోజూ 1.05 లక్షల మంది భక్తులు శ్రీవారి దర్శనం చేసుకునేవారు. క్యూలైన్‌ను నిరంతరం కొనసాగించేవారు. బ్రేక్ దర్శనాలు ఉన్నా.. సర్వదర్శనానికి ఆటంకం కలిగేది కాదని టీటీడీ సిబ్బంది అభిప్రాయపడ్డారు. ప్రస్తుతం టైంస్లాట్ విధానం అమలులోకి వచ్చింది మొదలు రోజుకు 50 నుంచి 80 వేల మందికే శ్రీవారి దర్శనం కల్పిస్తున్నారు. క్యూలైన్‌పై పర్యవేక్షణ కొరవడిందనే ప్రచారం జరుగుతోంది. విచ్చలవిడిగా బ్రేక్‌దర్శనాలు ఇస్తూ.. సామాన్య భక్తులకు శ్రీవారి దర్శన భాగ్యానికి దూరం చేస్తున్నారని భక్తులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అంగప్రదక్షిణంపై ఆంక్షలు శ్రీవారి ఆలయంలో రోజూ నిర్వహించే అంగప్రదక్షిణం మొక్కులపై టీటీడీ ఆంక్షలు విధించింది. ఇది వరకు రోజుకు 750 మంది భక్తులు ఆంగప్రదక్షిణ చేసుకునేవారు. ప్రతి శుక్రవారం అర్ధరాత్రి దాటాక శనివారం వేకువజామున అంగప్రదక్షిణ చేసుకుని స్వామి వారిని దర్శించుకుని మొక్కులు తీర్చుకునేవారు. అయితే టీటీడీ తాజాగా ఒక భక్తుడు నెలలో ఒకసారి మాత్రమే అంగప్రదక్షిణకు రావాలన్న నిబంధన పెట్టారు. స్థానిక భక్తులు టీటీడీ తీరుపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. స్థానికులకు నెలలో రెండు పర్యాయాలు శ్రీవారి దర్శనాన్ని కల్పించాలన్న దశాబ్దాల డిమాండ్‌ను పక్కనపెట్టిన టీటీడీ.. స్వామి వారి అంగప్రదక్షిణ మొక్కుకూడా ఆంక్షలు విధించటమేమిటని భగ్గుమంటున్నారు. -
వెరయిటీగా పాత బంగారం
చూస్తుండగానే సమ్మర్ హాలిడేస్ అయిపోవచ్చాయి. సెలవల కోసం పిల్లలు ఎదురు చూసినన్ని రోజులు పట్టలేదు అయిపోవడానికి. మహా ఉంటే మరో వారం రోజులు... జూన్ మొదటికల్లా స్కూళ్లు తెరుస్తారు. ఆంధ్రలో అయితే, సెలవులు ఇవ్వడం కాస్త ఆలస్యం అయింది కాబట్టి, బళ్లు తెరవడం కూడా ఇంకో గుప్పెడు రోజుల తర్వాతే. అది సరే, స్కూల్ తెరిచేసరికే పిల్లలకు స్కూల్ బ్యాగ్, వాటర్ బాటిల్స్, లంచ్‌బాక్స్, యూనిఫారమ్, షూస్, టై, బెల్టు, బుక్స్ షాపింగ్‌తో పేరెంట్స్‌కు హడావుడి. కొత్తవి కొనక ఎలాగూ తప్పదు. పాతవాటినేం చేస్తారు మరి? అటకమీద పడేస్తారు. లేదంటే ఇంట్లోనే తర్వాత పుట్టిన పిల్లలకు అంటే తమ్ముళ్లకో, చెల్లెళ్లకో బలవంతాన ఇస్తారు. అంతేగా! మరింకేం చేస్తాం అంటారా? మధ్యతరగతి, ఎగువ మధ్యతరగతికి చెందిన వారే, చిన్నారులకు కావలసిన స్కూలు సరంజామా కొనడానికి కిందా మీదా అవుతుంటే, ఇళ్లలో పని చేసే వారి పరిస్థితి ఏంటి మరి? ఎప్పుడైనా ఆలోచించారా? కారు డ్రైవర్లు, పాలు పోసి పొట్టపోసుకునేవాళ్లు, ఆకుకూరలు, కూరగాయలు అమ్మే వాళ్లు, చెత్తబండి వాళ్ల పిల్లలు, పేపర్లు, పాలప్యాకెట్లు వేసి చదువుకునే వాళ్ల సంగతి ఏమిటి మరి? పిల్లల చదువుల దగ్గర మొదలు పెట్టి ఎక్కడికో వెళ్లిపోతున్నారేంటి అని తల పట్టుకుంటున్నారా? మరేం లేదు, మీ పిల్లల యూనిఫామ్స్, బుక్స్, స్కూల్ బ్యాగ్, వాటర్ బాటిల్, షూస్ వంటి వాటిలో బాగున్న వాటిని ఇంటిలో పని చేసేవారి పిల్లలకు ఇవ్వండి. వీలయితే, కొత్తవి కొనివ్వడం బెటర్. లేదంటే, చిన్న చిన్న చిరుగులు పడ్డవాటికి లేదా జిప్పులు పోయిన బ్యాగ్‌లకు చిన్నాచితకా రిపేర్లు చేయించి వాటిని కొనుక్కోలేని వారికి ఇవ్వండి. ఈ చిన్ని సాయమే వారిని పాఠశాలకు దూరం కాకుండా చేస్తుందేమో! స్టీలుసామాన్ల వారికో లేదా పెద్ద పెద్ద షాపింగ్ మాల్స్‌లో ఇచ్చేసి, వాళ్లు ఇచ్చే ఓచర్లు తెచ్చుకుని, వాటిని వదిలించుకోవడానికి అంతకు పది రెట్లు ఖర్చు చేసి, పర్సుకు చిల్లులు పెట్టుకోకండి. ఒకవేళ ఇతరులకు ఇచ్చేంత స్తోమత లేకపోతే, పాత వాటినే, కొద్ది మార్పులతో కొత్త వాటిలా తయారు చేసే ప్రయత్నం చేయండి లేదంటే, రీ సైక్లింగ్‌కు ఇవ్వండి. ఇదంతా ఎందుకంటే, ఒక వస్తువును తయారు చేయడానికి ఎంతో ఖర్చవుతుంది. దానిని పూర్తిగా వాడుకోకుండా మధ్యలోనే పారేసి, కొత్తవి కొంటూ పోతే, ఎంత చెత్త పేరుకు పోతుంది? తద్వారా పర్యావరణానికి ఎంతముప్పు? ప్రకృతిని ప్రేమించే వాళ్లయితే, బుర్రలకు కాస్త పదును పెట్టండి పాత వాటిని ఏం చేస్తే వాటిని పర్యావరణ హితంగా మలచుకోవచ్చో... నెట్లో సెర్చ్ చేస్తే బోలెడన్ని సైట్లు ... ఉపాయాలు... ట్రై చేయండి మరి! -
ఈ వేసవికి ఏసీలు లేనట్టే!
అన్నవరం సత్యదేవుడికి భక్తుల సంఖ్య పెరిగింది. ఆదాయం కూడా పెరిగింది. వేసవి సెలవులు కావడంతో సత్యదేవుని దర్శించేందుకు భక్తులు పెద్ద సంఖ్యలో వస్తున్నారు. రత్నగిరి అంతా కాంక్రీటు జంగిల్‌గా మారడం, కొత్తగా నిర్మించిన స్వామివారి ఆలయాన్ని గ్రానెట్స్తో నిర్మించడంతో ఆలయంలో వేడి విపరీతంగా పెరిగిపోతోంది. దీంతో ఆలయంలో ఉక్కపోత మరింత పెరిగిపోయింది. వేసవి ప్రారంభంలో ఆలయాన్ని ఏసీ చేయించేందుకు దేవస్థానం పాలకమండలి, అధికారులు చేసిన ప్రయత్నాలు సఫలం కాలేదు. భక్తులతోపాటు అర్చకులు కూడా ఉక్కపోతను తట్టుకోలేని పరిస్థితిలో ఉంటే.. అధికారులు మాత్రం ఇదేమీ పట్టించుకోవడం లేదు. అన్నవరం (ప్రత్తిపాడు): సత్యదేవుని ఆలయాన్ని ఏసీ చేసే పనులు నత్తనడకన సాగుతున్నాయి. గత మార్చి నుంచి స్వామివారి ఆలయాన్ని ఏసీ చేసే ప్రక్రియ కొనసాగుతోంది. వారానికో పని చొప్పున చేస్తున్నట్టు కనిపిస్తోంది. ఒకవైపు వేసవి ఎండ తీవ్రతకు ప్రధానాలయంలో ఉక్కబోత భరించలేక భక్తులు తీవ్ర ఇబ్బంది పడుతున్నారు. రోజుకు దాదాపు ఎనిమిది గంటలు ఆలయంలోనే ఉండి భక్తులకు సేవలందించే అర్చకస్వాముల పరిస్థితి దయనీయంగా తయారైంది. ప్రస్తుతం ఆలయంలోకి ఏసీ గొట్టాలు అమర్చే పనులు చేస్తున్నారు. గదులు ఇంకా నాలుగైదు రోజులు పనిచేస్తే తప్ప ఆలయం ఏసీ వేసే ప్రక్రియ కాదని భావిస్తున్నారు. వేసవి ప్రారంభానికి ముందే చేస్తామన్నారు ఈ ఏడాది వేసవి ప్రారంభానికి ముందే సత్యదేవుని ఆలయాన్ని ఏసీ చేయాలని ఫిబ్రవరి రెండో వారంలో రూ.7 లక్షల అంచనాతో టెండర్ పిలిచారు. రూ.6,14,900తో ఆలయంలో క్లోజ్డ్ ఏసీలు అమర్చేందుకు కాకినాడకు చెందిన నవ్యకళా ఎయిర్ కంట్రోల్ సిస్టమ్ సంస్థ టెండర్ దాఖలు చేసింది. ఈ మొత్తానికి జీఎస్టీ అదనం. మొత్తం రూ.ఏడు లక్షలు వరకూ అవుతుందని అంచనా వేశారు. మార్చి 11న పాలకమండలి ఈ టెండర్‌ను ఖరారు చేసింది. పనులు వెంటనే ప్రారంభించాలని ఈఓ జితేంద్ర ఆదేశాలిచ్చారు. ఏప్రిల్ 15న ఏసీ మెషీన్లను దేవస్థానానికి తీసుకువచ్చారు. వాటిని అదే నెలాఖరున ఆలయం వద్దకు చేర్చారు. ఈ నెల 4వ తేదీన ఆలయం శిఖరానికి చేర్చారు. 15వ తేదీ నుంచి మెషీన్ల నుంచి చల్లని గాలి లోపలకు వచ్చేందుకు గొట్టాలు అమర్చే పనులు ప్రారంభించారు. ఆలయం లోపల మాత్రం పైపులు లేకుండా ఆలయ కిటికీల ద్వారా చల్లని గాలి లోపలకు వచ్చేలా ఏర్పాట్లు చేస్తున్నారు. ఏసీ మెషీన్ల సామర్థ్యం ఎక్కువ అయినందున పావు గంటలోనే ఆలయం అంతా చల్లబడుతుందని అధికారులు చెబుతున్నారు. ఈ ఏడాది సగం వేసవికాలం అయిపోయింది. సాధ్యమైనంత త్వరగా ఏసీలు ఏర్పాటు చేస్తే బాగుంటుందని భక్తులు అంటున్నారు. -
విషాద యాత్ర
వారంతా చిన్నపాటి వ్యాపార లావాదేవీల్లో నిత్యం తలమునకలై ఉండేవారు. వేసవి సెలవులు రావడంతో సరదాగా విహారయాత్రకు కారులో బయలుదేరారు. కారు కాంచీపురం నుంచి కేరళ తేక్కడికి బయలుదేరింది. పెరంబలూరు నాలుగు రోడ్ల ప్రాంతంలో ఎదురుగా మరోకారు వచ్చి బలంగా ఢీకొంది. విహార యాత్రకు బయలుదేరిన ఒకే కుటుంబానికి చెందిన తొమ్మిది మంది అక్కడికక్కడే మృతిచెందారు. మృతుల్లో ఓ చిన్నారి ఉండడం చూపరులను కంటతడి పెట్టించింది. తమిళనాడు, కాంచీపురం: విహారయాత్రకు ఉల్లాసంగా కారులో బయలుదేరిన కుటుంబాన్ని గురువారం రాత్రి మృత్యువు ప్రమాదం రూపంలో కబళించింది. ఈ సంఘటన పెరంబలూరులో చోటుచేసుకుంది. ఇందులో కాంచీపురానికి చెందిన ఒకే కుటుంబీకులు తొమ్మిదిమంది మృతిచెందారు. వివరాలు ఇలా ఉన్నాయి.. పెరంబలూరు జిల్లా, పెరంబలూరు కల్యాణనగర్ ప్రాంతానికి చెందిన శక్తి శరవణన్ మాజీ సైనికుడు. ఇతను తిరుచ్చిలో తన స్నేహితుడి కారును తీసుకుని పెన్నాడంకు వ్యక్తిగత పనిపై గురువారం అర్ధరాత్రి బయలుదేరారు. ఈ కారు పెరంబలూరు నాలుగు రోడ్ల ప్రాంతంలో గురువారం అర్ధరాత్రి వస్తుండగా హఠాత్తుగా అదుపు తప్పి రోడ్డు మధ్యలో ఉన్న సెంటర్ మీడియన్‌ను స్వల్పంగా ఢీకొంది. తర్వాత కాంచీపురం నుంచి కేరళ తేక్కడికి విహారయాత్రకు వస్తున్న కారును ఢీకొంది. విహారయాత్రకు వస్తున్న కాంచీపురం కుటుంబీకుల కారు నుజ్జునుజ్జు అయ్యింది. వీరంతా కాంచీపురంలోని చిన్న కాంచీపురం తిరుమలై నగర్ పళనియప్పన్ వీధికి చెందిన వారు. వీరంతా శిథిలాల్లో చిక్కుకుని అక్కడికక్కడే మృతి చెందారు. దీంతో సమాచారం అందుకున్న పెరంబలూరు పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది సంఘటనా ప్రాంతానికి చేరుకుని కారులోని మృత దేహాలను చాలాసేపు శ్రమించి వెలికితీశారు. ఈ ప్రమాదంలో కారులో వస్తున్న కాంచీపురం వాసులు తొమ్మిది మందిమృతి చెందారు. వారి వివరాలు ఇలావున్నాయి. మోహన్ (39), భార్య లక్ష్మి (32), కుమార్తెలు పవిత్ర (13), నవిత (10), కుమారుడు వరదరాజన్ (05), మురళి (56), మేఘల (17), డ్రైవర్లు ప్రభాకరన్ (32), భూపతి (27) మృతి చెందారు. మృతి చెందిన మోహన్ ఎస్ఆర్ఎం సిల్క్స్ అండ్ గణేష్ శారీస్, ఎస్ఆర్ఎం ట్రావెల్స్ సంస్థలను నడుపుతున్నారు. మృతి చెందిన వారిలో మేఘల కాంచీపురంలో గల కళాశాలలో బీఎస్సీ రెండవ సంవత్సరం చదువుతోంది. ఒకే కుటుంబానికి చెందిన తొమ్మిదిమంది మృతి చెందిన సంఘటన కాంచీపురంలో తీవ్ర విషాదాన్ని నింపింది. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. -
వేసవి శిక్షణ
వేసవి సెలవుల్ని సద్వినియోగపరచండి. విద్యార్థులకు ఆటపాటలపై శిక్షణ ఇవ్వండి. పోటీలు నిర్వహించి బహుమతులు ప్రదానం చేయండి. మజ్జిగ.. తినుబండరాలు అందజేయండి.. అంటూ గ్రంథాలయాలకు ఆదేశాలు జారీ అయ్యాయి. సెలవులు గడిచిపోతున్నాయి. శిక్షణ శిబిరాలు సాగుతున్నాయి. గ్రంథాలయ నిర్వాహకుల జేబులు ఖాళీ అవుతున్నాయి. ఇంతవరకు పైసా కూడా ప్రభుత్వం విదల్చలేదు. రెండు నెలలుగా వేతనాల్లేక.. అప్పులతో శిబిరాలను నిర్వహించలేక గగ్గోలు పెడుతున్నా ప్రభుత్వానికి పట్టడం లేదు. జిల్లా వ్యాప్తంగా గ్రంథాలయ నిర్వాహకుల ఆవేదనకు అక్షర రూపమిది. రామభద్రపురం (బొబ్బిలి): వేసవి సెలవులు సద్వినియోగం కావాలన్న ఉద్దేశంతో ప్రభుత్వం ప్రతి గ్రంథాలయంలో వేసవి శిక్షణ శిబిరాలను ఏర్పాటు చేసింది. వీటిని ఏప్రిల్ 25 నుంచి జూన్ 7 వరకు 45 రోజుల పాటు నిర్వహిస్తారు. శిక్షణ శిబిరాల్లో 5 నుంచి 15 ఏళ్ల మధ్య వయసున్న విద్యార్థులు పాల్గొంటారు. రోజూ ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు నిర్వహిస్తారు. ప్రతిపాదనలే.. పైసల్లేవ్ శిబిరాల్లో విద్యార్థులతో పుస్తకాలు చదివించాలి. కథలు చెప్పించాలి. చిత్రలేఖనం, సంగీతం, నృత్యం, ఆటపాటలు, స్టేజి డ్రామాలకు శిక్షణ ఇప్పించాలి. అటలు, పాటలు, నృత్యం, కథల పోటీలు నిర్వహించాలి. విజేతలకు బహుమతులు ఇవ్వాలి. శిక్షణ పొందేవారికి మజ్జిగ, తినుబండారాలు ఇవ్వాలని ప్రభుత్వం సూచించింది. శిబిరాల నిర్వహణకు ఒక్కొక్క కేంద్ర గ్రంథాలయానికి రూ.25 వేలు, ద్వితీయ శ్రేణి గ్రంథాలయాలకు రూ.12 వేలు, తృతీయ శ్రేణి గ్రంథాలయాలకు రూ.10 వేలు, గ్రామీణ ప్రాంత గ్రంథాలయాలకు రూ.8 వేల చొప్పున నిర్వహణ ఖర్చులు ఇవ్వాలని నిర్ణయించినా ఇప్పటి వరకు పైసా కూడా మంజూరు చేయలేదు. దీంతో గ్రంథాలయ నిర్వహకులు సొంత నిధులు ఖర్చు పెట్టి శిబిరాలను నిర్వహించాల్సి వస్తోంది. రోజుకు రూ.300 నుంచి రూ.400 వరకు ఖర్చవుతోందని సిబ్బంది చెబుతున్నారు. రెండు నెలలుగా వేతనాల్లేవ్ జిల్లా వ్యాప్తంగా పౌర గ్రంథాలయ శాఖ ఆధ్వర్యంలో 42 శాఖా గ్రంథాలయాలను నిర్వహిస్తున్నారు. వీటిలో శాశ్వత సిబ్బంది 38 మంది, ఔట్ సోర్సింగ్ సిబ్బంది 12 మంది, తాత్కాలిక సిబ్బంది 9 మంది పనిచేస్తున్నారు. వీరందరికి మార్చి, ఏప్రిల్ వేతనాలు ఇంత వరకూ ఇవ్వకపోవడంతో కుటుంబ పోషణకు నానా పాట్లు పడుతున్నారు. విద్యుత్, పేపర్, స్వీపర్ ఖర్చులు కూడా రెండు నెలలుగా అందక పోవడంతో సొంత నిధులు వెచ్చించాల్సి వస్తోందని గ్రంథాలయ నిర్వాహకులు వాపోతున్నారు. అప్పులు చేస్తున్నాం ప్రభుత్వం గ్రంథాలయాల్లో వేసవి శిక్షణ శిబిరాల నిర్వహణకు నిధులు విడుదల చేయక పోవడంతో సొంత నిధులు ఖర్చు చేస్తున్నాం. రెండు నెలలుగా వేతనాలు, విద్యుత్, పేపర్ బిల్లులు చెల్లించలేదు. ప్రతి నెలా అప్పు చేయాలంటే ఇబ్బందిగా ఉంది. – కృష్ణమూర్తి, నిర్వాహకుడు,శాఖా గ్రంథాలయం -
వేకువజామున మూడింటిదాకా కేసుల విచారణ
ముంబై: వేసవి సెలవుల నేపథ్యంలో ముంబై హైకోర్టు జడ్జీలంతా సాయంత్రం ఐదింటికి విధులు ముగించుకుని ఇళ్లకు వెళ్లిపోగా ఒక్కరు మాత్రం తెల్లవారేదాకా కేసుల పరిష్కారంలో తలమునకలై ఉన్నారు. ఆయన.. జస్టిస్ షారుఖ్ జె కథావాలా..! జస్టిస్ కథావాలా శుక్రవారం ఉదయం 10 గంటలకు విధులకు హాజరై, శనివారం వేకువజాము 3.30 గంటల దాకా కోర్టులో ఉండి, అత్యవసర మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వాల్సిన దాదాపు 100 పిటిషన్లను విచారించారని జడ్జి ఒకరు చెప్పారు. గత వారం కూడా ఆయన అర్ధరాత్రి దాకా కేసులు విచారించారని చెప్పారు. ‘జస్టిస్ కథావాలా 3.30దాకా పనిచేసినా ఆయన ముఖంలో ఎలాంటి అలసటా కనిపించలేదు.ఆఖరుగా విచారించిన పిటిషన్లలో నాది కూడా ఒకటి. నా వాదనలను ఆయన చాలా ప్రశాంతంగా, ఓపిగ్గా విని ఉత్తర్వులు జారీ చేశారు’ అని న్యాయవాది ప్రవీణ్ సందాని చెప్పారు. తెల్లవారుజాము దాకా అత్యవసర ఉత్తర్వులను జారీ చేసి వెళ్లిన ఆయన.. తిరిగి శనివారం ఉదయం తన కార్యాలయానికి వచ్చి పెండింగ్ పనులు పూర్తి చేశారని చెప్పారు. మిగతా జడ్జీల కంటే గంట ముందుగా ప్రతిరోజూ ఆయన ఉదయం 10 గంటలకే కోర్టు విధులను ప్రారంభిస్తారు. కోర్టు వేళలు ముగిసేదాకా తన సీటులోనే ఉంటారని కోర్టు సిబ్బంది తెలిపారు. కాగా, ముంబై హైకోర్టుకు ఈనెల 7వ తేదీ నుంచి జూన్ 3వ తేదీ వరకు వేసవి సెలవులున్నాయి. -
వాణీవిలాస్..చూస్తే దిల్ఖుష్
అనంతపురం , మడకశిర : పిల్లలూ...వేసవి సెలవులను ఎంజాయ్ చేస్తున్నారా.. ఆ సెలవుల్లో పర్యాటక ప్రాంతానికి వెళ్దామని ప్లాన్ చేస్తున్నారా..? అయితే మడకశిర నియోజకవర్గ సరిహద్దుకు ఆనుకుని ఉన్న వాణీవిలాస్ జలాశయం(మారికణివె డ్యాం)ను కూడా మీ ప్లాన్‌లో చేర్చుకోండి. ఎందుకంటే ఈ డ్యాంకు ఈ డ్యాంకు 112 ఏళ్ల చరిత్ర ఉంది. చిత్రదుర్గ జిల్లా హిరియూర్ తాలూకా వాణీవిలాస్పురంలో రెండు కొండల మధ్య ఈ డ్యాంను నిర్మించారు. చునిలాల్తారాచంద్ దలాల్ ఈ డ్యాం నిర్మాణానికి డిజైన్ చేశారు. 1898లో ఈ డ్యాం నిర్మాణాన్ని ప్రారంభించి 1907లో పూర్తి చేశారు. ఈ డ్యాం నీటి నిల్వ సామర్థ్యం 135 అడుగులు. హిరియూరు, హొసదుర్గ తదితర తాలూకాలకు ఈ డ్యాం ద్వారా సాగునీరు వెళ్తుంది. ఈ డ్యాం కింద ఏటా వేలాది ఎకరాల భూములు సాగులోకి వస్తున్నాయి. డ్యాం కింది భాగాన మారెమ్మ దేవస్థానాన్ని ఏర్పాటు చేశారు. ఆలయంలో రోజూ పూజలు జరుగుతాయి. భక్తుల తాకిడి కూడా అధికంగా ఉంటుంది. కర్ణాటక ప్రభుత్వం ఈ డ్యాం సమీపంలో అత్యద్భుతమైన ఉద్యానవనాన్ని ఏర్పాటు చేసింది. డ్యాంకు వచ్చే సందర్శకులంతా ఈ ఉద్యానవనంలో సేదదీరుతుంటారు. వేసవిలోనూ నీటి ప్రవాహం.. మండు వేసవిలోనూ చల్లని వాతావరణం ఉండడంతో ఈ డ్యాంకు సందర్శకుల తాకిడి ఎక్కువగా ఉంటుంది. ఏపీలోని సరిహద్దు ప్రాంతాల వారితో పాటు బెంగళూరు, బళ్లారి, మైసూరు, తుమకూరు తదితర ప్రాంతాల సందర్శకులు ఈ డ్యాంను తిలకించడానికి ఎక్కువగా వస్తుంటారు. ప్రకృతి రమణీయతకు ఆలవాలమైన ఈ జలాశయం వద్ద ఎన్నో సినిమాలను చిత్రీకరించారు. ఎలా వెళ్లాలంటే.. ఈ డ్యాం చిత్రదుర్గ జిల్లా హిరియూర్‌కు 20 కి.మీ దూరంలో ఉంది. మడకశిరకు 100 కి.మీ దూరంలో ఉంటుంది. మడకశిర నుంచి అమరాపురం మీదుగా హిరియూర్‌కు చేరుకుంటే అక్కడి నుండి బస్సు సౌకర్యం ఉంది. హిరియూర్ నుంచి హొసదుర్గకు రోడ్డు మార్గాన వెళ్లాలి. అనంతపురం నుంచి కల్యాణదుర్గం, చెళ్ళకెర, హిరియూర్ మీదుగా కూడా ఈ డ్యాంకు చేరుకోవచ్చు. బస చేయడానికి గెస్ట్‌హౌస్ సౌకర్యం కూడా ఉంది. -
ఈతకు వెళ్తున్నారా.. అయితే ఇలా..
నిడమర్రు: పిల్లలు ఇంట్లో ఉండే సమయం ఇది. ఈ సెలవుల్లో ఏదో ఒక వ్యాపకం కల్పించేందుకు ఏదో ఒక వేసవి శిక్షణ శిబిరానికి తీసుకువెళ్తుంటాం. వీటిలో ఈత ముఖ్యమైంది. వేసవి ఉష్ణోగ్రతల నుంచి ఉపశమనం పొందాలంటే కొంచెంసేపు జలకాలాడటమే.. మరి ఈత కొలనులో/సముద్రంలో ఇతర ప్రాంతాల్లో ఈతకు వెళుతున్నప్పుడు తీసుకోవల్సిన జాగ్రత్తలు తెలుసుకుందాం. కళ్లు జాగ్రత్త ఈతకొలనులోని నీళ్లలో క్రిమిసంహారిణిగా పనిచేయడం కోసం క్లోరిన్ వంటి రసాయనాలు కలుపుతుంటారు. ఈ క్రిమిసంహారక రసాయనాలు కొందరి చర్మంపై దుష్ప్రభావాలు చూపే అవకాశం ఉంది. ఈత కొట్టే సమయంలో చాలామంది మునిగి ఈత కొడుతూ నీళ్లలోపల కళ్లు తెరుస్తుంటారు. దీనివల్ల పెద్దగా సమస్య లేకపోయినా.. ఒక్కోసారి నీళ్లను శుభ్రంగా ఉంచేందుకు వాడే క్లోరిన్ వంటి రసాయనాలు కళ్లలోకి వెళ్లడం వల్ల కళ్లు ఎర్రబడటం వంటి కంటి సమస్యలు రావచ్చు. అందువల్ల రసాయనాలు వాడిన నీళ్లలో ఈదులాడే సమయంలో ఆ నీళ్లు కంటిలోకి వెళ్లకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. లోదుస్తులు మార్చకపోతే.. పల్లెల్లోని బావులు, చెరువుల్లో కేవలం అండర్‌వేర్‌తో ఈత కొట్టేవారు చాలా సందర్భాల్లో ఈత పూర్తయ్యాక వెంటనే లోదుస్తులు మార్చరు. అనుకోకుండా ఈతకు వెళ్లడం లేదా మరే ఇతర కారణవల్లనో లోదుస్తులు మార్చకపోవడం వల్ల ఎలర్జీలు, బాహుమూల ప్రదేశాల్లో పొక్కులు వంటివి రావచ్చు. అందుకని ఈత పూర్తికాగానే లోదుస్తులు మార్చుకుని వెంటనే పొడిబట్టతో శరీర భాగాలను శుభ్రం చేసుకోవాలి. సముద్రపు నీటితో ఇబ్బందులు తీరప్రాంతాలకు దగ్గరగా ఉండేవారు ఈ సెలవుల్లో ప్రత్యేకంగా సముద్రస్నానం చేయడానికి వెళ్తుంటారు. సముద్రస్నానం తర్వాత మామూలు నీటితో వి«ధిగా స్నానం చేయాలి. మరికొందరిలో అప్పటికే చర్మంపై గాయాలుంటే వాటికి సముద్రపు ఉప్పు నీళ్లు తగలడం వల్ల అవి మరింత తీవ్రంగా మారే అవకాశం ఉంది. ఇతర సమస్యలు ఇలా.. కొందరిలో నేరుగా ఈతవల్ల కాకుండా ఈతకు సంబంధం ఉండే ఇతర సమస్యలు కూడా రావచ్చు. ఎక్కువసేపు ఈత కొట్టిన తర్వాత మన చర్మంపై సహజంగా ఉండే చమురు ఇంకి చర్మం పొడిబారుతుంది. ఒక్కోసారి నీళ్లలో ఎక్కువసేపు నానుతూ ఉండటం వల్ల శరీరంలోని లవణాలను కోల్పోయే ప్రమాదం ఉంటుంది. ఇలాంటప్పుడు చర్మం ముడతలు పడిపోయే అవకాశాలు ఉండవచ్చు. దీన్ని నివారించాలంటే ఈత పూర్తయిన వెంటనే చర్మానికి మాయిశ్చరైజర్లు రాయాలి. కొంతమందిలో ఈత వల్ల సైనసైటిస్ వంటి సమస్యలు రావచ్చు. అలాంటి సందర్భాల్లో డాక్టర్‌ను సంప్రదించాలి. మరిన్ని జాగ్రత్తలు ♦ ఈతకు వెళ్లే సమయంలో కొన్ని సాధారణ జాగ్రత్తలు తీసుకోవడం వల్ల అనేక సమస్యలను నివారించవచ్చు. అవి.. ♦ స్విమ్మింగ్‌పూల్‌లోకి వెళ్లకముందు, స్మిమ్మింగ్ పూర్తయ్యాక శుభ్రంగా తలస్నానం చేయాలి. ♦ తల తడవకుండా క్యాప్ పెట్టుకోవాలి. అలాగే చెవుల్లోకి నీళ్లు పోకుండా ఇయర్ ప్లగ్స్ పెట్టుకోవాలి. ♦ ఈతకొలను నీటిలో కలిపే క్లోరిన్ సరైన పాళ్లలో ఉండేలా జాగ్రత్త తీసుకోవాలి. ♦ ఈత సమయంలో శరీరానికి నేరుగా సూర్యకాంతి తగలకుండా జాగ్రత్త తీసుకోవాలి. అంటే బారెడు పొద్దిక్కిన తర్వాత ఈత కొలనులోకి దిగకూడదు. ♦ సూర్యరశ్మి నేరుగా తగిలేలా ఈదడం వల్ల అతినీల లోహిత కిరణాల కారణంగా చర్మంపై దద్దుర్లు రావచ్చు. ♦ ఈతను వ్యాయామంగా కొనసాగిస్తూ.. పుష్టికరమైన ఆహారం తీసుకోవాలి. పరిశుభ్రత పాటిస్తే మంచి ఫిట్నెస్ సాధ్యమవుతుంది. ఈత సమయంలో చెవుల జాగ్రత్తలు ఇలా స్విమ్మింగ్ పూల్స్‌లో ఈతకొట్టే సమయాల్లో నీళ్లు చెవుల్లోకి వెళ్లి చెవిపోటు వచ్చే అవకాశం ఉంది. దీన్ని నివారించడానికి వీలైతే ఇయర్ ప్లగ్స్ పెట్టుకోవాలి. చెవుల్లోకి నీరు చేరకుండా చూసుకుంటూ, ఈత పూర్తయ్యాక చెవులను పొడిబట్టతో శుభ్రం చేసుకోవాలి. స్విమ్మింగ్‌పూల్స్ వద్దవచ్చే ఆరోగ్య సమస్యలు ♦ ఫంగల్ ఇన్ఫెక్షన్: ఒక్కోసారి బట్టలు మార్చుకునే చోట్ల అపరిశుభ్రతవల్ల కూడా పాదాలకు ఫంగల్ ఇన్షెక్షన్ రావచ్చు. ఒక్కోసారి వార్ట్స్ (పులిపిరికాయలు) వంటివి కూడా రావచ్చు. అందుకే ఆ ప్రదేశాలు పరిశుభ్రంగా ఉంచాలి. ♦ నిత్యం స్విమ్మింగ్‌పూల్‌లోని నీటిలో ఈతకొట్టేవారి వెంట్రుకలు సహజ రంగును కోల్పోయి పేలవంగా అయ్యే అవకాశాలు ఎక్కువ. వెంట్రుకలను క్లోరిన్ రసాయనం బ్లీచ్ చేయడం వల్ల, ఎండ వల్ల ఇలా మారేందుకు అవకాశం ఎక్కువ. ♦ ఈతకొలనువల్ల అలర్జీ రావడం చాలామందిలో సాధారణంగా కనిపించే అంశం. ఈ అలర్జీవల్ల కొందరిలో బ్రాంకైటిస్, ఆస్తమా వంటి శ్వాసకోశ ఇబ్బందులు సైతం తలెత్తే అవకాశం ఉంది. అలాంటి ముందుగా వారు వైద్యులను సంప్రదించాలి. -
మ్యూజిక్ మ్యాజిక్
సమ్మర్ హాలిడేస్ స్కూల్ పిల్లలకే కాదు. అందరికీ వర్తిస్తుంది అంటున్నారు కోలీవుడ్ లవ్ బర్డ్స్ నయనతార, విఘ్నేశ్ శివన్. అన డమే కాదు క్విక్‌గా కొన్ని హాలిడేస్ కూడా తీసుకున్నారీ జంట. ఈ లవ్ కపుల్ వీలు దొరికినప్పుడల్లా హాలీడేకు వెళ్తుంటారన్న విషయం తెలిసిందే. మరి ఇప్పుడెక్కడకు వెళ్లారు అంటే.. మ్యూజిక్ ఫెస్టివల్‌కు. అమెరికాలోని కొచెల్లా మ్యూజిక్ ఫెస్టివల్‌కు. రాక్, పాప్, ఎలక్ట్రానిక్ ఇలా రకరకాల మ్యూజిక్, చాలా మంది ఆర్టిస్ట్స్ అందరూ కలిసి మ్యూజిక్ సంబరంగా జరుపుకుంటారు. ఆ సంగీతాన్ని ఎంజాయ్ చేయడానికి వారం రోజుల వెకేషన్‌కు వెళ్లారు విఘ్నేశ్, నయన్. ఈ ట్రిప్‌లోని ఫోటోలను ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేశారు విఘ్నేశ్. ఈ ట్రిప్ విశేషాలని వివరిస్తూ–‘ ‘కొచెల్లాలో అమేజింగ్ టైమ్ స్పెండ్ చేశాం. నా స్టార్ (నయనతార)తో చిన్న మ్యూజికల్ జర్నీ. గ్రేట్ ఎక్స్పీరియన్స్. స్టార్ సింగర్ బియాన్స్ పర్ఫార్మెన్స్ బెస్ట్ మూమెంట్స్ మాకు. చిన్న ట్రిప్‌తో సమ్మర్ వెకేషన్ ముగిసింది. ఇక బ్యాక్ టు వర్క్’’ అని పేర్కొన్నారు. -
హైకోర్టుకు వేసవి సెలవులు
సాక్షి, హైదరాబాద్ : ఉమ్మడి హైకోర్టుకు గురువారం నుంచి జూన్ 1వ తేదీ వరకు వేసవి సెలవులు ప్రకటించారు. తిరిగి జూన్ 4న హైకోర్టు కార్యకలాపాలు పూర్తిస్థాయిలో ప్రారంభమవుతాయి. ఈ సెలవుల్లో అత్యవసర కేసులను విచారించేందుకు వెకేషన్ కోర్టులను ఏర్పాటుచేశారు. ఈ మేరకు రిజిస్ట్రార్ జనరల్ సీహెచ్ మానవేంద్రనాథ్‌రాయ్ బుధవారం ఓ ప్రకటనలో పేర్కొన్నారు. మొత్తం రెండు దశల్లో ఈ వెకేషన్ కోర్టులు పనిచేస్తాయి. మొదటి దశ వెకేషన్ కోర్టు 10, 17వ తేదీల్లో ఉంటుంది. అత్యవసర కేసులను దాఖలు చేయాలనుకునే వారు ఈ నెల 8న దాఖలు చేయాల్సి ఉంటుంది. వాటిపై 10వ తేదీన కోర్టు విచారణ జరుపుతుంది. అలాగే 15న దాఖలు చేసే కేసులను 17న విచారిస్తారు. మొదటి దశ వెకేషన్ కోర్టులకు న్యాయమూర్తులు జస్టిస్ ఉప్మాక దుర్గాప్రసాదరావు, జస్టిస్ తాళ్లూరి సునీల్ చౌదరి, జస్టిస్ అభినంద్‌కుమార్ షావిలి నేతృత్వం వహిస్తారు. ఇందులో జస్టిస్ దుర్గాప్రసాదరావు, జస్టిస్ అభినంద్కుమార్లు ధర్మాసనంగా, జస్టిస్ సునీల్‌చౌదరి సింగిల్ జడ్జిగా కేసులను విచారిస్తారు. 24, 31వ తేదీల్లో రెండో దశ వెకేషన్ కోర్టు.. ఇక రెండో దశ వెకేషన్ కోర్టు 24, 31వ తేదీల్లో ఉంటుంది. అత్యవసర కేసులను దాఖలు చేయాలనుకునే వారు 22, 29వ తేదీల్లో చేసుకోవాలి. 22న దాఖలైన కేసులను 24న, 29న దాఖలైన కేసులను 31న విచారించడం జరుగుతుంది. ఈ రెండో దశ వెకేషన్ కోర్టులకు జస్టిస్ ఎస్.వి.భట్, జస్టిస్ జె.ఉమాదేవి, జస్టిస్ షమీమ్ అక్తర్‌లు నేతృత్వం వహిస్తారు. జస్టిస్ భట్, జస్టిస్ ఉమాదేవిలు ధర్మాసనంగా కేసులను విచారిస్తే, జస్టిస్ షమీమ్ అక్తర్ సింగిల్జడ్జిగా కేసులను విచారిస్తారు. -
స్నేహితుడిని కాపాడబోయి..
కొనకనమిట్ల: వేసవి సెలవులు కావడంతో స్నేహితులతో కలిసి సరదాగా ఈతకు వెళ్లి ఇంటర్ విద్యార్థి మృతి చెందాడు. ఈ సంఘటన మండలంలోని వద్దిమడుగు చెరువులో శుక్రవారం జరిగింది. వివరాలు.. మండలంలోని రేగుమానిపల్లి పంచాయతీ గుర్రాలమడుగు ఎస్సీ కాలనీకి చెందిన విడుదల విజయ్‌కుమార్ (17) మార్కాపురంలోని సాధన కాలేజీలో ఇటీవలే ఇంటర్ మొదటి సంవత్సరం పూర్తి చేశాడు. వేసవి సెలవులు కావడంతో ఇంటి వద్ద ఉంటున్న విజయ్‌కుమార్ తన స్నేహితులైన చందు, చిన్నీ, దేవసాయంతో కలిసి సైకిళ్లపై తమ గ్రామ సమీపంలోని వద్దిమడుగు చెరువుకు సరదాగా ఈత కొట్టేందుకు వెళ్లారు. నలుగురు సరదాగా ఈత కొట్టే సమయంలో వారిలో చిన్నీ ప్రమాదవశాత్తు నీటిలో మునగి పోతున్నాడు. గమనించిన విజయ్‌కుమార్ తన స్నేహితుడిని రక్షించే ప్రయత్నం చేశాడు. ఆ ప్రయత్నంలో స్నేహితుడు చిన్నీ ఒడ్డుకు రాగా విజయ్‌కుమార్ నీటిలో మునిగిపోయి మృతి చెందాడు. తోటి స్నేహితులు భయపడి గ్రామానికి వెళ్లి ‡జరిగిన విషయాన్ని బంధువులతో చెప్పారు. స్థానికులు వెళ్లి విజయ్‌కుమార్ మృతదేహాన్ని బయటకు తీసి ఇంటికి తీసుకెళ్లారు. చెరవులో ఇటీవల మట్టి తోలడంతో లోతు ఎక్కువగా ఉంది. ఇటీవల కురిసిన వర్షాలకు ఆ కుంటల్లో నీరు చేరింది. విద్యార్థి మృతి చెందటంతో గుర్రాలమడుగు ఎస్సీ కాలనీలో విషాద ఛాయలు అలుముకున్నాయి. ఒక్కగానొక్క కొడుకు కావడంతో మంచి చదువులు చదివించాలని ప్రైవేట్ కాలేజీలో చదిస్తున్నామని, ఇంతలో ఇలా జరిగిందేంది దేవుడా.. అంటూ విజయ్‌కుమార్ తల్లిదండ్రులు పెదకోటయ్య, కోటమ్మ దంపతులు భోరున విలపిస్తున్నారు. సమాచారం అందుకున్న వీఆర్ఓ జయప్రకాశ్, సర్పంచ్ గంటా రమణారెడ్డిలు విజయ్‌కుమార్ మృతదేహాన్ని పరిశీలించి వివరాలు సేకరించారు. విద్యార్థి మృతికి కారణాలు అడిగి తెలుసుకున్నారు. ఎస్ఐ బాలకృష్ణ ఆదేశాల మేరకు ఏఎస్ఐ మనోహర్ తన సిబ్బందితో గుర్రాలమడుగు ఎస్సీ కాలనీకి వెళ్లి వివరాలు తెలుసుకున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఏఎస్ఐ మనోహర్ తెలిపారు. -
సెలవుల్లేవ్
గుంటూరు ఎడ్యుకేషన్: ఇంటర్మీడియెట్ ప్రథమ సంవత్సర పరీక్షలు రాసిన విద్యార్థులకు జిల్లాలోని ప్రైవేటు, కార్పొరేట్ జూనియర్ కళాశాలలు అప్పడే సీనియర్ ఇంటర్ తరగతులను ప్రారంభించేశాయి. వేసవి సెలవుల్లో విద్యార్థులకు తరగతులు నిర్వహించరాదన్న బోర్డు ఉత్తర్వులను పట్టించుకోకుండా ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నాయి. వేసవి సెలవులను సరదాగా గడపాల్సిన సమయంలో ద్వితీయ సంవత్సర సిలబస్‌తో తరగతులను మొదలెట్టాయి. సప్లిమెంటరీ పరీక్షల పేరుతో యథేచ్ఛగా క్లాసులు నిర్వహిస్తున్నాయి. పరీక్షల హడావుడితో అలసిన విద్యార్థులు ఏడాది పొడవునా తరగతి గదులకు పరిమితమైన విద్యార్థులకు మానసిక విశ్రాంతి తప్పనిసరి. సెలవుల్లో వారు కొంత సేద తీరి ఊపిరి పీల్చుకుంటారు. సీనియర్ ఇంటర్ తరగతులతో విద్యార్థులు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. జిల్లాలోని ప్రైవేటు, కార్పొరేట్ జూనియర్ కళాశాలలు డే స్కాలర్‌తోపాటు హాస్టల్ క్యాంపస్‌లలో విద్యార్థులకు తరగతులు నిర్వహిస్తున్నాయి. గుంటూరు నగరంలోని చంద్రమౌళీనగర్‌తోపాటు శివారు గోరంట్ల, రెడ్డిపాలెం, పెద పలకలూరులో ఉన్న హాస్టళ్లలో యథేచ్ఛగా తరగతులు కొనసాగుతున్నాయి. కళాశాలల యాజమాన్యాలతో సమావేశం నిర్వహిస్తాం వేసవి సెలవుల్లో తరగతులు నిర్వహించరాదని కళాశాలల యాజమాన్యాలను స్పష్టంగా చెప్పాం. నిబంధనలకు విరుద్ధంగా తరగతులు నిర్వహిస్తున్న విషయమై విద్యార్థుల నుంచి ఫిర్యాదులు అందుతున్నాయి. దీనిపై త్వరలోనే యాజమాన్యాలతో సమావేశం నిర్వహిస్తాం. నిబంధనలు పాటించని యాజమాన్యాల తీరును ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి చర్యలు తీసుకుంటాం. -
మనసు దోచుకుంటున్న స్కూల్ లెటర్
చెన్నై : విద్య వ్యాపారంగా మారిన నేటికాలంలో ఎప్పుడూ మార్కులు.. ర్యాంకులు..అంటూ విద్యార్థుల వెంటపడే పాఠశాల, కళాశాల గురించే మనం విన్నాం. కొన్ని పాఠశాలలైతే సెలవుల్లోనూ విద్యార్థులకు హోం వర్క్ ఇస్తాయి. అయితే అందుకు భిన్నంగా ఓ పాఠశాల యాజమాన్యం విద్యార్థుల తల్లిదండ్రులకు పంపిన లేఖ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. సెలవుల్లో మనకు ఇష్టమైన వారితో గడుపుతూ సెలవులను ఆస్వాదించాలంటూ నెటిజన్ల మనసు దోచుకుంటోంది. చెన్నైలోని అన్నై వయోలెట్ మెట్రిక్ స్కూల్ వేసవి సెలవుల్లో భాగంగా హాలిడే అసైన్మెంట్ పేరిట తల్లిదండ్రులకు ఓ లేఖ పంపింది. హాలిడే అసైన్మెంట్ ఇదే.. తల్లిదండ్రులు రోజుకు రెండుసార్లు తమ పిల్లలతో కలిసి భోజనం చేయాలి. అంతేకాదు వారికి రైతుల కష్టం విలువ కూడా తెలియజెప్పుతూ ఆహారం వృధా చేయకూడదనే విషయాన్ని అర్థమయ్యేట్లు చెప్పాలి. బామ్మాతాతయ్యలతో, ఇరుగుపొరుగు వారితో బంధం పెంచుకొనేలా వారిని ప్రోత్సహించాలి. మొక్కలు నాటడం, జంతువులతో ఆడుకోవడం వంటి అలవాట్లను నేర్పించాలంటూ.. ఇలాంటి ఇంకెన్నో మంచి విషయాలతో లేఖను నింపారు. ఆ రోజులు వేరు.. స్కూలు ప్రిన్సిపల్ లిదియా దైవసహాయం మాట్లాడుతూ.. ‘మా చిన్నతనంలో సెలవులంటే ఎగిరి గంతేసేవాళ్లం. ఆటపాటలతో హాయిగా గడిపే వాళ్లం. కానీ ప్రస్తుత పరిస్థితుల్లో చదువే లోకంగా విద్యార్థులు ఒత్తిడికి గురవుతున్నారు. తల్లిదండ్రులు కూడా సంపాదనలో మునిగిపోయి పిల్లలతో సమయం గడపలేకపోతున్నారు. అందుకే ఈసారి మేము ఇలా ప్లాన్ చేశామంటూ’ వివరించారు. -
ఒక్క టికెట్..24 గంటలు..
సాక్షి, సిటీబ్యూరో:నగరమంతా విస్తృతంగా పర్యటించాలనుకుంటున్నారా.. చారిత్రక ప్రదేశాలు, పర్యాటక కేంద్రాలు, పార్కులు, ఆలయాలు సందర్శించాలనుకుంటున్నారా.. అయితే నో ప్రాబ్లమ్. అందుకోసం కేవలం ఒకే ఒక్క బస్సు టికెట్ చాలు. సిటీలో ఎక్కడి నుంచి ఎక్కడికైనా నిశ్చింతగా ప్రయాణం చేయొచ్చు. అందుబాటులో ఉన్న ఏ బస్సులో అయినా వెళ్లవచ్చు. ఆ ఒక్క టికెట్‌తో 24 గంటల పాటు సిటీ బస్సుల్లో ప్రయాణం చేసే అవకాశం లభిస్తుంది. అదే ‘ట్రావెల్–24’.(టీ–24). గ్రేటర్ ఆర్టీసీ ప్రవేశపెట్టిన 24 గంటల టికెట్. పర్యాటకులు, సందర్శకుల కోసం ప్రవేశపెట్టిన దీనికి అనూహ్యమైన ఆదరణ లభిస్తోంది. లక్షలాది మంది పర్యాటకులు, సందర్శకులు ఈ టికెట్‌ను వినియోగిస్తున్నారు. ప్రస్తుత వేసవి సెలవుల దృష్ట్యా దీని వినియోగం మరింత పెరిగే అవకాశం ఉన్నట్లు ఆర్టీసీ అంచనా వేస్తోంది. నగరానికి కొత్తగా వచ్చేవాళ్లు, ఒకే రోజుకు ఎక్కువ ప్రాంతాల్లో పర్యటించాలనుకొనే ప్రయాణికులకు టీ–24 ఎంతో ప్రయోజనకరం. ప్రయాణ ఖర్చులను ఆదా చేసేందుకు దీంతో అవకాశం లభిస్తుంది. టూరిస్ట్ ఫ్రెండ్లీ.. అంతర్జాతీయ స్థాయి హంగులతో అభివృద్ధి చెందుతున్న హైదరాబాద్‌కు వచ్చే దేశీయ, విదేశీ పర్యాటకుల సంఖ్య సైతం క్రమంగా పెరుగుతోంది. చార్మినార్, గోల్కొండ కోట, టూంబ్స్, జూపార్కు, బిర్లామందిర్, బిర్లా సైన్స్ ప్లానెటోరియం వంటి చారిత్రక ప్రాంతాలతో పాటు, పార్కులు, వివిధ పర్యాటక స్థలాలను వీక్షించేందుకు తెలుగు రాష్ట్రాల నుంచే కాకుండా కర్ణాటక, తమిళనాడు, మహారాష్ట్ర, గుజరాత్, తదితర రాష్ట్రాల నుంచి ఏటా 8.5 కోట్ల మంది నగరానికి వస్తున్నారు. ప్రతి రోజు సుమారు 2.45 లక్షల మంది సందర్శిస్తున్నారు. అలాగే మరో 2.5 లక్షల మంది విదేశీ పర్యాటకులు ఏటా నగరాన్ని సందర్శిస్తున్నారు. విదేశీ టూరిస్టులు ఆర్టీసీ టీ–24 టికెట్లను పెద్దగా వినియోగించడం లేదు. కానీ వివిధ రాష్ట్రాల నుంచి వచ్చే పర్యాటకులు మాత్రం వీటిని విస్తృతంగా వినియోగిస్తున్నట్లు ఆర్టీసీ అంచనా వేసింది. దీంతో ఈ ఏడాది ఈ టికెట్లను వినియోగించే వారి సంఖ్య 20 లక్షలు దాటిపోయింది. కేవలం పర్యాటకులు, సందర్శకులే కాకుండా నగర వాసులు కూడా టీ–24 టిక్కెట్లను బాగా వినియోగించుకుంటున్నారు. మరోవైపు వీటి వినియోగం కోసం ఆర్టీసీ చేపట్టిన ప్రచారం, సిబ్బందికి అందజేసే ప్రోత్సాహకాలు కూడా సత్ఫలితాలను ఇచ్చినట్లు ఆర్టీసీ గ్రేటర్ హైదరాబాద్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ పురుషోత్తమ్ నాయక్ తెలిపారు. ఆదరణ అదరహో.. ఈ టిక్కెట్లు ప్రయాణికులకు బహుళ ప్రయోజనాన్ని అందజేయడమే కాకుండా ఆర్టీసీకి సైతం గణనీయమైన ఆదాయాన్ని తెచ్చిపెడుతున్నాయి. ప్రతి రోజు సుమారు 5,000 టికెట్లను విక్రయిస్తున్నారు. 2016లో 19,59,134 మంది వీటిని వినియోగించగా, ఆ ఏడాది ఆర్టీసీకి రూ.15.60 కోట్ల ఆదాయం లభించింది. గత ఏడాది 20,24,711మంది కొనుగోలు చేశారు. ఆర్టీసీ రూ.16.20 కోట్ల ఆదాయం సముపార్జించింది. టీ–24 వినియోగదారుల సంఖ్య ఏడాది కాలంలోనే 65,577కి పెరిగింది. ఈ వేసవిలో మరో లక్ష మందికిపైగా వినియోగించే అవకాశం ఉంది. ఏ బస్సుకైనా సరే.. నగరంలో సుమారు 3,850 బస్సులు ప్రయాణికులకు రవాణా సదుపాయాన్ని అందజేస్తున్నాయి. ఏసీ, నాన్ఏసీ కేటగిరీలలో టీ–24 టిక్కెట్లను అందజేస్తున్నారు. ఎయిర్‌పోర్టు, హైటెక్‌సిటీ, ఐటీ కారిడార్లకు రాకపోకలు సాగించే సుమారు 150 బస్సుల్లో వినియోగించే టీ–24 టికెట్లు రూ.160కి లభిస్తాయి. ఈ టికెట్‌తో ప్రయాణికులు ఏసీ బస్సులతో పాటు ఎక్స్‌ప్రెస్, ఆర్డినరీ బస్సుల్లోనూ ప్రయాణం చేయవచ్చు. రూ.80కే రోజంతా ప్రయాణం చేసే మరో టీ–24 టికెట్ ఆర్డినరీ, మెట్రో ఎక్స్‌ప్రెస్ బస్సులకు వర్తిస్తుంది. ఏసీ బస్సులు మినహా అన్ని బస్సుల్లో వీటిని అనుమతిస్తారు. డ్యూటీ కండక్టర్ల వద్ద ట్రావెల్–24 టికెట్లు లభిస్తాయి. టిక్కెట్ తీసుకున్న సమయం నుంచి 24 గంటల పాటు ఇది చెల్లుబాటులో ఉంటుంది. -
సామాన్య భక్తులకే ప్రాధాన్యం
సాక్షి, తిరుమల: వేసవి సెలవుల రద్దీ దృష్ట్యా సర్వదర్శనం క్యూ ద్వారా తిరుమల శ్రీవారిని దర్శించుకునే సామాన్య భక్తులకే తొలి ప్రాధాన్యం కల్పించాలని టీటీడీ నిర్ణయించింది. శుక్ర, శని, ఆదివారాల్లో వీఐపీల సిఫారసు టికెట్లను కుదించి ప్రొటోకాల్ ప్రముఖులకే కేటాయించనున్నారు. ఇంటర్నెట్లో జారీ చేసే రూ.300 టికెట్లు, గదులు తగ్గించి తిరుమలకు చేరుకున్న భక్తులకు ప్రాధాన్యం ఇవ్వ నున్నారు. వేసవిలో పాఠశాలలు, కళాశాలలకు సెలవులు కావటంతో ఏప్రిల్ మూడోవారం నుంచి జూన్ మూడోవారం వరకు శ్రీవారి దర్శనం కోసం తిరుమల వచ్చే భక్తుల సంఖ్య ఏటా పెరుగుతోంది. ఈసారీ భక్తుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని టీటీడీ ఈవో అనిల్‌కుమార్ సింఘాల్, జేఈవో కేఎస్ శ్రీనివాసరాజు అంచనా వేసి పలు నిర్ణయాలు తీసుకున్నారు. వీఐపీ టికెట్ల జారీలో ఎల్ 1 (హారతి, తీర్థం, శఠారి), ఎల్ 2 (హారతి) దర్శనాలు అమలు చేసి ఎల్ 3 రద్దు చేయనున్నారు. ఆన్లైన్ టికెట్లు, గదుల బుకింగ్ తగ్గింపు శుక్ర, శని, ఆదివారాల్లో సామాన్య భక్తులు ఇబ్బంది పడకుండా ఉండేందుకు ఇంటర్నెట్ ద్వారా కేటా యించే రూ.300 టికెట్లను సుమారు 10 నుంచి 12 వేలకే పరిమితం చేయాలని భావిస్తున్నారు. ఆన్లైన్ బుకింగ్‌లో గదుల కోటాను 2 వేల నుంచి సుమారు వెయ్యికి తగ్గించనున్నారు. భక్తుల రద్దీని బట్టి అవసరం మేరకు కోటాను విడుదల చేయనున్నారు. అలాగే రూ.50 ధరతో అదనంగా పొందేందుకు రోజుకు కనీసం 50 వేల నుంచి లక్ష వరకు లడ్డూలు అందుబాటులో ఉంచే చర్యలు చేపట్టారు. సామాన్య భక్తులకు ఇబ్బందులు రానివ్వం వేసవి సెలవుల్లో తిరుమలకు పోటెత్తే భక్తులకు అనుగుణంగా బస, స్వామి దర్శనంతోపాటు ఇతర ఏర్పాట్లు పూర్తి చేశాం. ఇప్పటికే ఆయా విభాగాలు ముందస్తు చర్యలు తీసుకున్నాయి. సామాన్య భక్తులకు స్వామివారి దర్శనంలో ఇబ్బందులు తలెత్తకుండా అవసరాన్ని బట్టి మార్పులు చేర్పులు చేస్తాం. – జేఈవో కేఎస్ శ్రీనివాసరాజు భక్తులకు అల్పాహారంలో కొబ్బరిచట్నీ తిరుమలలో శ్రీవేంకటేశ్వరస్వామివారి భక్తులకు శనివారం ఉప్మా, పొంగలి, వర్మీసెల్లీ ఉప్మాతోపాటు కొబ్బరిచట్నీ వితరణ చేశారు. జేఈవో కేఎస్ శ్రీనివాసరాజు రెండో వైకుంఠం క్యూ కాంప్లెక్స్‌లో వేచి ఉన్న భక్తులకు వీటిని పంపిణీ చేశారు. ఇకపై నిత్యం 5 వేల ప్రసాదాల చొప్పున పంపిణీ చేయాలని అన్నప్రసాదం విభాగం ప్రత్యేకాధికారి వేణుగోపాల్, జీవీఎల్ఎన్ శాస్త్రిని ఆదేశించారు. -
బడికిక బైబై!
కొత్తగూడెం: వేసవి సెలవులొచ్చేశాయ్.. విద్యార్థులు ఇంటి బాట పట్టారు. 2017–18 విద్యా సంవత్సరం గురువారంతో ముగిసింది. దీంతో విద్యార్థులు ఉల్లాసంగా.. ఉత్సాహంగా.. కేరింతలతో స్నేహితులకు, స్కూళ్లకు టాటా చెబుతూ ఇళ్లకు వెళ్లారు. ప్రభుత్వ, సంక్షేమ పాఠశాలలతో పాటు జిల్లాలోని అన్ని ప్రైవేట్ పాఠశాలలు గురువారం నుంచి మే 31 వరకు సెలవులు ప్రకటించాయి. గతంలో జూన్ 12,13 తేదీలలో బడులు తిరిగి ప్రారంభమయ్యేవి. అయితే తెలంగాణ వచ్చాక జూన్ 2న రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం ఉండటంతో వేడుకలకు ఇబ్బందిగా మారింది. అన్ని ప్రభుత్వ కార్యాలయాలతో పాటు ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలల్లోనూఉత్సవాలను ఘనంగా నిర్వహించేందుకు వీలుగా జూన్ 1నే పాఠశాలలు తెరుస్తున్నారు. వేసవి తరగతులకు అడ్డుకట్ట పడేనా.. జిల్లాలోని కొన్ని ప్రైవేట్ పాఠశాలలు పదో తరగతి విద్యార్థులకు ముందస్తుగానే బోధన సాగిస్తున్నాయనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. వేసవి సెలవుల్లో తరగతులను నిర్వహించరాదని పాఠశాలలు, కళాశాలలకు ప్రభుత్వం ఆదేశాలు జారీ చేస్తున్నా పట్టించుకోకుండా ర్యాంకుల కోసం పది, ఇంటర్ విద్యార్థులను వేసవిలోనే ఇబ్బందులకు గురి చేస్తున్నాయి. దీంతో వారు మానసికంగా, శారీరకంగా తీవ్ర అలసటకు గురవుతూ అనారోగ్యం పాలవుతున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో జిల్లా విద్యాశాఖ అధికారులు వేసవి తరగతులకు అడ్డుకట్ట వేస్తారో.. లేదో వేచి చూడాలి. గత ఏడాది ఆశించిన ఫలితాలేవీ..? జిల్లాలో 2017–18 విద్యా సంవత్సరంలో ఆశించిన ఫలితాలు రాలేదు. ప్రధానంగా జిల్లాలో డీఈవోగా పనిచేసి ఉద్యోగ విరమణ చేసిన హయగ్రీవాచారి అనంతరం అత్యధిక కాలం ఇన్చార్జ్ డీఈవోల పాలన కొనసాగటంతో జిల్లాలో విద్యాశాఖ పనితీరు అగమ్యగోచరంగా మారింది. జిల్లాకు ఇన్చార్జి డీఈవోగా ఉన్న వాసంతికి జనవరి తర్వాత పూర్తి స్థాయి బాధ్యతలు అప్పగించారు. అప్పటికే పదో తరగతి పరీక్షల సిలబస్ పూర్తి కావడంతో ఉపాధ్యాయుల పనితీరు, విద్యార్థుపై పర్యవేక్షణ లోపించింది. దీంతో అప్పటి వరకు నిర్వహించిన పరీక్షల ఫలితాలు ఘోరంగా వచ్చాయి. ప్రధానంగా విద్యార్థుల్లో వెనుకబడిన కనీస అభ్యసన సామర్థ్యాల కార్యక్రమం త్రీఆర్స్, నేషనల్ ఎచీవ్మెంట్ సర్వే పరీక్షల ఫలితాలు సైతం ఈ నిజాలను బహిర్గతం చేశాయి. ఉపాధ్యాయుల సమస్యలు సైతం ఎక్కడివక్కడే పేరుకుపోయాయి. ఈ పరిస్థితుల నేపథ్యంలోనే పదో తరగతి పరీక్షలు పూర్తయ్యాయి. అయితే విద్యా సంవత్సరం చివరిలో బాధ్యతలు స్వీకరించిన డీఈవో వాసంతి.. పరీక్షలను పకడ్బందీగా నిర్వహించినప్పటికీ ఫలితాల సాధనలో ఏ మేరకు సఫలీకృతులు అవుతారో వేచి చూడాలి. వేసవిలో తరగతులను నిర్వహిస్తే కఠిన చర్యలు నిబంధనలకు విరుద్ధంగా వేసవి సెలవుల్లో తరగతులను నిర్వహిస్తే ఆయా యాజమాన్యాలపై కఠిన చర్యలు తీసుకుంటాం. వేసవి సెలవులు విద్యార్థులకు సద్వినియోగం అయ్యేలా తల్లిదండ్రులు కృషి చేయాలి. తొర్రూరులోని కస్తూర్బా పాఠశాలలో సమ్మర్ క్యాంపులో పలు కో కరిక్యులర్ అంశాలపై శిక్షణ ఇస్తున్నాం. ఆసక్తి గల విద్యార్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి. విద్యార్థుల్లో సైన్సు, సాంకేతిక ఆలోచనను రేకిత్తించే ‘ఇన్స్పైర్’కు పలు రకాల ప్రయోగాలను సిద్ధం చేసుకోవాలి. జిల్లాలో గుర్తింపు లేని ప్రైవేట్ పాఠశాలలపై కేసులు నమోదు చేయనున్నాం. ప్రతి పాఠశాలకు ప్రభుత్వ గుర్తింపు తప్పనిసరి. – డి.వాసంతి,జిల్లా విద్యాశాఖాధికారిణి -
బడులకు 13 నుంచి వేసవి సెలవులు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని పాఠశాలలకు ఈ నెల 13 నుంచి విద్యాశాఖ వేసవి సెలవులు ప్రకటించింది. ఈనెల 12న చివరి పనిదినం కావడంతో ప్రతి ఉపాధ్యాయుడు విధులకు తప్పక హాజరు కావాలని విద్యా శాఖ ఉన్నతాధికారి ఒకరు పేర్కొన్నారు. పాఠశాలలు తిరిగి జూన్ 1న ప్రారంభమవుతాయన్నారు. జూన్ 2న తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా పాఠశాలల్లో వేడుకలు నిర్వహించాలని నిర్ణయించింది. వాస్తవానికి ఏప్రిల్ 23న పాఠశాలలకు చివరి పనిదినం కాగా, జూన్ 12న తిరిగి ప్రారంభమయ్యేవి. అయితే ఆవిర్భావ వేడుకల కోసమే ప్రభుత్వం వేసవి సెలవులను ఏప్రిల్ 13 నుంచి మే 31 వరకు ఇచ్చి, జూన్ 1 నుంచి ప్రారంభించేలా చర్యలు చేపట్టింది. -
షరా మామూలే!
సాక్షి,సిటీబ్యూరో: వేసవి సెలవుల్లోనూ పలు కార్పొరేట్ ఇంటర్మీడియట్ కాలేజీలు గుట్టుచప్పుడు కాకుండా పాఠాలు బోధిస్తున్నాయి. పొటీ పరీక్షలకు ప్రిపేరవుతున్న సెకండియర్ విద్యార్థులను సాకుగా చూపించి ఫస్టియర్ విద్యార్థులకు తరగతులు నిర్వహిస్తున్నాయి. ఈ అంశంపై ఇప్పటికే ఇంటర్మీడియట్ బోర్డుకు ఫిర్యాదులు వెల్లువెత్తుతున్నాయి. తనిఖీ చేసిన అధికారులు ఇప్పటికే ఆయా కాలేజీలకు షోకాజు నోటీసులు అందజేయడం విశేషం. హైదరాబాద్ జిల్లా ఇంటర్మీడియట్ బోర్డు పరిధిలో 323 ఇంటర్మీడియట్ కాలేజీలు ఉన్నాయి. అధికారులు ఇటీవల 27 కాలేజీల్లో తనిఖీ చేసి వీటిలో నిబంధనలను ఉల్లంఘించి తరగతులు నిర్వహిస్తున్న 12 కాలేజీలకు నోటీసులు జారీ చేశారు. రంగారెడ్డి జిల్లా పరిధిలో 200పైగా ఉన్న కాలేజీలు ఉండగా, వీటిలో 20 కాలేజీలకు నోటీసులు ఇచ్చారు. అధికారులు నోటీసులు ఇచ్చిన తర్వాత రెండుమూడు రోజుల పాటు సెలవులు ప్రకటించి.. ఆ తర్వాత షరామా మూలుగా తరగతులు నిర్వహిస్తుండటంపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. నిజానికి ఇప్పటికే సెకండియర్ పూర్తై.. ఎంసెట్, జేఈఈ, నీట్ వంటి పోటీ పరీక్షలకు హాజరు కాబోతున్న విద్యార్థులకు ప్రత్యేక తరగతులు నిర్వహించుకునేందుకు విద్యాశాఖ అనుమతి ఇచ్చింది. దీన్ని ఆసరాగా తీసుకున్న కొన్ని కాలేజీలు ఇటీవలే ఇంటర్ ఫస్టియర్ పూర్తి చేసుకున్న విద్యార్థులకూ గుట్టుచప్పుడు కాకుండా పాఠాలు బోధిస్తున్నాయి. ఎప్పటికప్పుడు ఆయా కాలేజీల్లో తనిఖీలు నిర్వహించి ఒత్తిడి నుంచి విద్యార్థులకు విముక్తి కల్పించాల్సిన అధికారులు అటువైపు వెళ్లడానికి కూడా వెనుకాడుతున్నారు. ఫలితాలు రాకముందే ప్రవేశాలు.. టెన్త్ ఫలితాలు ఇంకా వెలువడక ముందే నగరంలోని పలు కార్పొరేట్ ఇంటర్మీడియట్ కాలేజీలు ఫస్టియర్ అడ్మిషన్ల పక్రియను అప్పుడే చేపట్టాయి. ప్రభుత్వ గురుకులాల్లో ఇంటర్మీడియట్ తరగతులను కూడా కొనసాగిస్తుండటంతో ప్రైవేటులో సీట్లు భారీగా మిగిలిపోయే అవకాశం లేకపోలేదు. ఈ అంశాన్ని ముందే పసిగట్టిన పలు యాజమాన్యాలు ఆయా కాలేజీల్లో పని చేస్తున్న అధ్యాపకులకు టార్గెట్లు ఇచ్చాయి. అడ్మిషన్ల కోసం ప్రత్యేకంగా పీఆర్ఓలను నియమించుకున్నాయి. వీరంతా బస్తీల్లో పర్యటించి ఇటీవల టెన్త్ పరీక్ష రాసిన విద్యార్థుల వివరాలను సేకరించే పనిలో నిమగ్నమయ్యారు. ఉదయం, సాయంత్రం ఇదే పనిలో ఉంటున్నారు. టెన్త్ ఫలితాలు వెలువడిన తర్వాత యాజమాన్యాలు ఫీజులు పెంచే అవకాశం ఉందని, ప్రస్తుతం అడ్మిషన్ చేసుకున్న వారికి ఫీ జులో 20 నుంచి 30 శాతం రాయితీ కూడా ఇస్తుందని ప్రకటిస్తున్నారు. అంతేకాదు స్థానికంగా ఉన్న విద్యార్థులను ఆకర్షించేందుకు ఆయా కాలేజీ, హాస్టల్ భవనాలను అందగా తీర్చిదిద్దుతుండటం విశేషం. తరగతులు నిర్వహిస్తే చర్యలు తప్పవు వేసవి సెలవుల్లో ఫస్టియర్ విద్యార్థులకు తరగతులు నిర్వహించే యాజమాన్యాల పట్ల కఠినంగా వ్యవహరిస్తాం. హైదరాబాద్ జిల్లాల్లో ఇప్పటికే 12 కాలేజీలకు నోటీసులు కూడా ఇచ్చాం. రెండోసారి పట్టుబడిన కాలేజీలను ఎట్టిపరిస్థితుల్లో వదిలిపెట్టం. అంతేకాదు జూనియర్ కళాశాలల్లో ప్రవేశాల కోసం దళారులకు, వాటిలో పనిచేసే ఉద్యోగులకు ముందస్తుగా డబ్బులు కట్టి మోసపోవద్దు. ప్రవేశాలకు ఇంకా చాలా సమయం ఉంది. ఇంటర్ కళాశాలల్లో ప్రవేశాల కోసం రాష్ట్ర ప్రభుత్వం ఆన్లైన్ విధానాన్ని అందుబాటులోకి తీసుకురానుంది. 2018–19 విద్యాసంవత్సరం నుంచి ఈ విధానం అమలులోకి తీసుకొచ్చేందుకు అధికారులు కసరత్తు చేస్తున్నారు. కళాశాలల్లోని వసతులు, సౌకర్యాలు గుర్తించి అన్నీ సక్రమంగా ఉన్న వాటికే గుర్తింపు ఇవ్వనున్నారు. ఈ జాబితాను ఆన్లైన్లో పొందుపరిచే ప్రయత్నాలు సాగుతున్నాయి. ఏ కళాశాలలో ఎలాంటి వసతులున్నాయి.. అనుమతి తీసుకున్న భవనం.. తరగతి గదులు..అధ్యాపకుల అర్హ తలు.. తదితర సమగ్ర సమాచారాన్ని ఆ వెబ్సైట్లో పొందుపరుస్తారు. వీటిని విద్యార్థుల తల్లిదండ్రులు సమగ్రంగా పరిశీలించి ప్రవేశాలు చేసుకుంటే మంచిది. – జయప్రద, డీఐఈఓ -
వేసవి ప్రత్యేక రైళ్లు
తాటిచెట్లపాలెం(విశాఖ ఉత్తర): వేసవి రద్దీ దృష్ట్యా ఈస్ట్ కోస్ట్ రైల్వే పలు మార్గాల్లో ప్రత్యేక రైళ్లను నడపనున్నట్లు సీనియర్ డివిజనల్ కమర్షియల్ మేనేజర్ జి.సునీల్‌కుమార్ తెలిపారు. రద్దీ రూట్లలో రెగ్యులర్ రైళ్లకు అవసరాన్ని బట్టి అదనపు కోచ్‌లను, బెర్త్‌లను జత చేయనున్నట్లు చెప్పారు. దేశంలోని పలు ఇతర ప్రాంతాలకు కూడా పలు స్పెషల్ రైళ్లు నడపాలని యోచిస్తున్నట్లు పేర్కొన్నారు. విశాఖపట్నం–కిరండూల్ (08512)వయా కోరాపుట్ ప్రత్యేక చార్జీల రైలు విశాఖపట్నంలో ప్రతీ రోజు రాత్రి 10.15 గంటలకు బయలుదేరే విశాఖపట్నం–కోరాపుట్ ప్రత్యేక చార్జీలతో నడిచే ఎక్స్‌ప్రెస్ మరుసటి రోజు ఉదయం 10 గంటలకు కిరండూల్ చేరుకుంటుంది. ఈ రైలు జూన్ 30 వరకు పొడిగించబడింది. తిరుగు ప్రయాణంలో 08511 ప్రతీ రోజు సాయంత్రం 3గంటలకు కిరండూల్‌లో బయలుదేరి తెల్లవారు 3 గంటలకు విశాఖపట్నం చేరుకుంటుంది. ఈ రైలు జూలై 1 వరకు పొడిగించబడింది. విశాఖపట్నం–సికింద్రాబాద్ ప్రత్యేక చార్జీల రైలు విశాఖపట్నం–సికింద్రాబాద్(08501) వీక్లీ స్పెషల్ ఫేర్ రైలు ప్రతీ మంగళవారం రాత్రి 11గంటలకు విశాఖపట్నం లో బయలుదేరి మరుసటి రోజు మధ్యాహ్నం 12 గంట లకు సికింద్రాబాద్ చేరుకుంటుంది. జూన్ 26 వరకు ఈ రైలు నడుస్తుంది. తిరుగు ప్రయాణంలో 08502 ప్రతీ బుధవారం సాయంత్రం 4.30 గంటలకు సికింద్రాబాద్‌లో బయలుదేరి మరుసటి రోజు ఉదయం 4.50 గంటలకు విశాఖపట్నం చేరుకుంటుంది. ఈ రైలు జూన్ 27 వరకు నడుస్తుంది. విశాఖపట్నం–తిరుపతి ప్రత్యేక చార్జీల రైలు విశాఖపట్నం–తిరుపతి(08573)వీక్లీ స్పెషల్ ఫేర్ రైలు ప్రతీ సోమవారం రాత్రి 10.55 గంటలకు విశాఖపట్నంలో బయలుదేరి మరుసటిరోజు మధ్యాహ్నం 1.25 గంటలకు తిరుపతి చేరుకుంటుంది. ఈ రైలు జూన్ 25 వరకు నడుస్తుంది. తిరుగు ప్రయాణంలో(08574)ప్రతీ మంగళవారం సాయంత్రం 3.30గంటలకు తిరుపతిలో బయలుదేరి మరుసటిరోజు ఉదయం 6.50 గంటలకు విశాఖపట్నం చేరుకుంటుంది. ఈ రైలు జూన్ 26 వరకు నడుస్తుంది. కాచిగూడ–విశాఖపట్నం–తిరుపతి స్పెషల్ ట్రైన్ కాచిగూడ–విశాఖపట్నం(07016)స్పెషల్ రైలు ప్రతీ మంగళవారం సాయంత్రం 6.45 గంటలకు కాచిగూడలో బయలుదేరి మరుసటి రోజు ఉదయం 7.50 గంటలకు విశాఖపట్నం చేరుకుంటుంది. ఈ ప్రత్యేక రైలు జూన్ 26 వరకు నడుస్తుంది. తిరుగు ప్రయాణంలో 07479 విశాఖపట్నం నుంచి తిరుపతికి ప్రతీ బుధవారం రాత్రి 7.05గంటలకు బయలుదేరి మరుసటిరోజు ఉదయం 9.25 గంటలకు తిరుపతి చేరుకుంటుంది. జూన్ 27 వరకు ఈ స్పెషల్ రైలు నడుస్తుంది. తిరుపతి–విశాఖపట్నం ఏసీ స్పెషల్ తిరుపతి–విశాఖపట్నం(07487)వీక్లీ ఏసీ స్పెషల్ రైలు ప్రతీ ఆదివారం రాత్రి 10.30 గంటలకు తిరుపతిలో బయలుదేరి మరుసటిరోజు ఉదయం 10.45 గంటలకు విశాఖపట్నం చేరుకుంటుంది. జూన్ 24 వరకు ఈ స్పెషల్ ట్రైన్ నడుస్తుంది. తిరుగు ప్రయాణంలో 07488 విశాఖపట్నంలో ప్రతీ సోమవారం రాత్రి 7.20 గంటలకు బయలుదేరి మరుసటిరోజు ఉదయం 8.10గంటలకు తిరుపతి చేరుకుంటుంది. జూన్ 25వ తేదీ వరకు ఈ రైలు నడుస్తుంది. యశ్వంత్‌పూర్–విశాఖపట్నం తత్కాల్ స్పెషల్ ట్రైన్ యశ్వంత్‌పూర్–విశాఖపట్నం(06579) వీక్లీ తత్కాల్ స్పెషల్ ట్రైన్ ప్రతీ శుక్రవారం సాయంత్రం 6.35 గంటలకు యశ్వంత్‌పూర్‌లో బయలుదేరి మరుసటి రోజు మధ్యాహ్నం 2.35 గంటలకు విశాఖపట్నం చేరుకుంటుంది. ఏప్రిల్ 6వ తేదీ నుంచి మే 25వ తేదీ వరకు ఈ ట్రైన్ నడుస్తుంది. తిరుగుప్రయాణంలో 06580 ప్రతీ ఆదివారం మధ్యాహ్నం 1.45 గంటలకు విశాఖపట్పంలో బయలుదేరి మరుసటి రోజు ఉదయం 9.05గంటలకు యశ్వంత్‌పూర్ చేరుకుంటుంది. ఈ రైలు మే 27వ తేదీ వరకు నడుస్తుంది. సికింద్రాబాద్ –గౌహతి స్పెషల్ సికింద్రాబాద్–గౌహతి(07149)వీక్లీ స్పెషల్ ప్రతీ గురువారం ఉదయం 7.30 గంటలకు సికింద్రాబాద్‌లో బయలుదేరి ఆదివారం ఉదయం 8.45 గంటలకు గౌహతి చేరుకుంటుంది. ఏప్రిల్ 6వ తేదీ నుంచి జూన్ 29 వరకు ఈ రైలు నడుస్తుంది. తిరుగు ప్రయాణంలో (07150)గౌహతిలో ప్రతీ సోమవారం ఉదయం 5.25గంటలకు బయలుదేరి బుధవారం ఉదయం 9.15గంటలకు సికింద్రాబాద్ చేరుకుంటుంది. ఈ రైలు జూలై 2వ తేదీ వరకు నడుస్తుంది. సంబల్పూర్–బాన్సువాడ(బెంగళూరు)(08301) వీక్లీ స్పెషల్ ప్రత్యేక రైలు ప్రతీ బుధవారం ఉదయం 9.30 గంటలకు సంబల్పూర్లో బయలుదేరి మరుసటి రోజు సాయంత్రం 4.40 గంటలకు బాన్సువాడ చేరుకుంటుంది. ఈ రైలు జూన్ 27 వరకు నడుస్తుంది. తిరుగు ప్రయాణంలో (08302) బాన్సువాడలో ప్రతీ గురువారం మధ్యరాత్రి తెల్లవారు శుక్రవారం 12.30గంటలకు బయలుదేరి మరుసటి రోజు శనివారం ఉదయం 6.35గంటలకు సంబల్పూర్ చేరుకుంటుంది. ఈ రైలు ఏప్రిల్ 6 నుంచి జూన్ 29 వరకు నడుస్తుంది. -
వేసవి చోరీల అడ్డుకట్టకు ప్రత్యేక చర్యలు
అనకాపల్లి టౌన్: వేసవిలో జరిగే దొంగతనాలకు అడ్డు కట్టవేసేందుకు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నట్టు అడిషినల్ క్రైం ఎస్పీఎన్.జె.రాజ్‌కుమార్ తెలిపారు. స్థానిక పోలీస్ గెస్ట్‌హౌస్‌లో బుధవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. వేసవి సెలవుల్లో తీర్థయాత్రలకు వెళ్లే కుటుంబాలు దగ్గరలో ఉన్న పోలీస్‌స్టేషన్‌కు సమాచారం అందజేస్తే ఒక రోజు ముందుగా వారికి గృహాలకు ఉచితంగా లాక్డ్ హౌసింగ్ మానిటర్ సిస్టమ్(ఎల్‌హెచ్‌ఎంఎస్)ను ఏర్పాటు చేస్తామని తెలిపారు.గృహాలకు తాళాలు వేసి మేడపై నిద్రించేవారు అప్రమత్తంగా ఉండాలని ఆయన సూచించారు. అనకాపల్లి పట్టణ పరిధిలో రాత్రి వేళ గస్తీకి ఆరు బృందాలను ఏర్పాటు చేసినట్టు చెప్పారు. నర్సీపట్నం, చోడవరం, యలమంచిలి, పాయకరావుపేట, బుచ్చియ్యపేట మండలాల్లో ప్రత్యేకంగా రెండు బృందాలు ఏర్పాటు చేసినట్టు తెలిపారు. రూరల్ ప్రాంతంలో రెండు బృందాలను ఇప్పటికే ఏర్పాటు చేశామన్నారు. అనుమానిత వ్యక్తులు సంచరిస్తే స్థానిక పోలీసుల దృష్టికి తీసుకెళ్లాలని కోరారు. పశ్చిమగోదావరి జిల్లా ఏలూరులో జరిగిన చోరీ కేసులో ఎల్‌హెచ్‌ఎంఎస్ ద్వారా ఆరు నిమిషాల్లో దొంగను పట్టుకున్నట్టు ఆయన చెప్పారు. ఇప్పటికే ఈ విషయమై కరపత్రాలు పంపిణీ చేసినట్టు ఆయన తెలిపారు. ప్రధాన రహదారులు, బ్యాంక్‌లు, ముఖ్యమైన ప్రాంతాల్లో సీసీ కెమోరాల ద్వారా నిఘా కట్టుదిట్టం చేసినట్టు చెప్పారు. జిల్లాలో ఈ ఏడాది నేరాలు తగ్గించేందకు ప్రత్యేక చర్యలు తీసుకున్నట్టు చెప్పారు. ఈ సమావేశంలో క్రైం డీఎస్పీ అలియాస్ సాగర్, డీఎస్పీ కె.వెంకటరమణ, పట్టణ సీఐ మురళీరావు, రూరల్ సీఐ రామచంద్రరావు, ఎస్ఐలు వి.శ్రీనివా సరావు, అల్లు వెం కటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. -
సెలవుల్లోనూ బడికి...
రామభద్రపురం: చదువులో వెనుకబడిన విద్యార్థులకు వేసవి సెలవుల్లేవు. వీరందరినీ ఉన్నత శ్రేణి విద్యార్థులుగా తీర్చిదిద్దేందుకు ప్రభుత్వం ‘జ్ఞానధార’ అనే కార్యక్రమాన్ని విద్యాశాఖ చేపట్టింది. ఇందులో భాగంగా మే ఒకటో తేదీ నుంచి కొత్తగా ఐదు, తొమ్మిది తరగతులకు చెందిన 44,061 మంది విద్యార్థులకు రెసిడెన్షియల్ విద్యాప్రమాణాలతో బోధన సాగించనున్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల విద్యా ప్రమాణాలు తెలుసుకొనేందుకు 2017 నవంబర్‌లో జాతీయ విద్యా పరిశోదన శిక్షణా సంస్థ (ఎన్సీఈఆర్టీ) నేషనల్ ఎచీవ్మెంట్ సర్వే చేపట్టింది. ఈ సర్వేలో ప్రభుత్వ పాఠశాలల్లో ప్రాథమిక, మాధ్యమిక స్థాయిలో విద్యార్ధులకు నాణ్యమైన విద్యాబోధన అందడం లేదని నిర్ధారించారు. ఈ నేపథ్యంలో విద్యా సామర్థ్యం తక్కువగా ఉన్న 5,9వ తరగతి విద్యార్థులకు వేసవిలో ప్రత్యేక శిక్షణ ఇచ్చేందుకు ఎన్సీఈఆర్టీ, విద్యాశాఖ సంకల్పించాయి. వేసవి సెలవుల్లో వీరిని హాస్టళ్లలో ఉంచి నిష్ణాతులైన ఉపాధ్యాయులతో శిక్షణ ఇప్పిస్తారు. జిల్లాలో ప్రభుత్వ పాఠశాలలు 2650 ఉండగా వాటిలో 5వ తరగతి 21,926 మంది, 9వ తరగతి 22,135 మంది విద్యార్థులు చదువుతున్నారు. వీరిలో ఐదో తరగతి విద్యార్థులు సుమారు 45 నుంచి 50 శాతం.. 9వ తరగతి విద్యార్థులు 40 నుంచి 45 శాతం మంది చదువులో బాగా వెనుకబడి ఉన్నట్లు గుర్తించారు. అలాగే ఈ విద్యాసంవత్సరంలో జరిగిన సమ్మెటివ్ ఎసెస్మెంట్(ఎస్ఏ–1) పరీక్షల్లో 5, 9 తరగతుల్లో కనీస అభ్యసనా సామర్థ్యాలు చేరుకోలేని విద్యార్థులను గుర్తించి వారికి మే ఒకటి నుంచి నిష్ణాతులైన ఉపాధ్యాయులచే శిక్షణ ఇప్పిస్తారు. యోగాతో పాటు ఆహారం.. జ్ఞానధార కార్యక్రమంలో భాగంగా విద్యార్థులకు మధ్యాహ్న భోజనంతో పాటు అల్పాహారం అందజేయనున్నారు. అలాగే యోగా కూడా నేర్పిస్తారు. మధ్యాహ్నం మూడు నుంచి నాలుగు గంటల వరకు హోంవర్క్.. 4.15 గంటల నుంచి హ్యాండ్ రైటింగ్, డ్రాయింగ్, క్రాఫ్ట్, పెయింటింగ్ వంటి అంశాల్లో శిక్షణ ఉంటుంది. సాయంత్రం ఆరున్నర నుంచి ఏడున్నర గంటల వరకు లఘుచిత్రాల ప్రదర్శన.. రాత్రి 8.30 గంటల నుంచి 9.30 వరకు సాంస్కృతిక కార్యక్రమాలు ఉంటాయి. డిజిటల్ తరగతులు, వారాంతపు ఎసెస్మెంట్పరీక్షలు, గ్రాండ్ టెస్ట్‌తో పాటు వేల్యుయేషన్ చేపట్టేలా ప్రణాళికలు రూపొందిస్తున్నారు. సఫలీకృతమవుతుందా..? ఏప్రిల్‌లో పరీక్షలు ముగిసిన వెంటనే విద్యార్థులంతా వేసవి సరదాలో ఉంటారు. అలాంటి సమయంలో శిక్షణ తరగతులు విజయవంతమవుతాయా అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఉపాధ్యాయులు ముందు చెప్పకపోవడం వల్లే విద్యార్థులు చదువులో వెనుకబడి ఉన్నారని.. ఈ సారి కూడా బాగా చెబుతారనే నమ్మకం ఏంటని పలువురు ప్రశ్నిస్తున్నారు. ఇదిలా ఉంటే ఉపాధ్యాయులు మాత్రం ‘జ్ఞానధార’ వల్ల మంచి ఫలితాలు వస్తాయని చెబుతున్నారు. పర్యవేక్షించేదివీరే.. జిల్లా స్థాయిలో డీఈఓ, డీవైఈఓ, ఎస్ఎస్ఏ పీవో, ఏఎంఓ, సీఎంఓ, ఎంఈఓలు, హెచ్ఎంలు, ఎస్ఎంసీ సభ్యులతో కూడిన ప్రత్యేక బృందాలు కార్యక్రమాలను పర్యవేక్షిస్తాయి. సీఆర్పీలు ప్రతి రోజూ సాయంత్రం 5 గంటల నుంచి మరుసటి రోజు ఉదయం 8 వరకు విద్యార్థులతోనే ఉంటారు. సామర్థ్యం పెరుగుతుంది.. ‘జ్ఞానధార’ కార్యక్రమం పూర్తిగా ఉపాధ్యాయుల పర్యవేక్షణలో జరుగుతుంది. నిష్ణాతులచే తరగతులు నిర్వహించనన్న నేపథ్యంలో విద్యార్థుల సామర్థ్యం మెరుగుపడుతుంది. విద్యార్థులను తరగతులకు పంపించే బాధ్యత తల్లిదండ్రులదే.– జి. నాగమణి, డీఈఓ, విజయనగరం -
ప్రత్యేక శిక్షణపై గరం..గరం
కర్నూలు సిటీ:సంస్కరణల పేరుతో ముందస్తు ప్రణాళికలు లేకుండా రాష్ట్ర విద్యాశాఖ తీసుకున్న నిర్ణయాలపై ఉపాధ్యాయ సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. ప్రభుత్వ పాఠశాలల్లో ప్రస్తుతం ఐదు, తొమ్మిది తరగతి విద్యార్థులకు పరీక్షలు పూర్తయిన వెంటనే జ్ఞానధార పేరుతో వేసవి సెలవుల్లో ప్రత్యేక శిక్షణ ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. అయితే రోజురోజుకు ఎండలు తీవ్రమవుతున్న నేపథ్యంలో అటు ఉపాధ్యాయులు, ఇటు విద్యార్థులు ఆందోళనకు గురవుతున్నారు. రాయలసీమ జిల్లాలో 45 డిగ్రీ సెల్సియస్ ఉష్ణోగ్రత నమోదు అయ్యే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. ప్రభుత్వం సైతం వేసవి ఎండలను దృష్టిలో పెట్టుకొని ప్రజలు జాగ్రత్తలు తీసుకోవాల్సిన సూచనలు కూడా చేసింది. అయితే విద్యాశాఖ మాత్రం ఈ విషయాన్ని విస్మరిస్తూ జ్ఞానధార కార్యక్రమాన్ని చేపట్టేందుకు సిద్ధమవుతుండటాన్ని ఉపాధ్యా య సంఘాలు తీవ్ర విమర్శలు చేస్తున్నాయి. జ్ఞానధారపై కసరత్తు ఏదీ.. జిల్లాలో ప్రాథమిక పాఠశాలలు 2283, ప్రాథమికొన్నత పాఠశాలలు 932, ఉన్నత పాఠశాలలు 898 ఉన్నాయి. వీటిలో మొత్తం 6,41,530 మంది విద్యార్థులు ఉన్నారు. వీరిలో 50,442 మంది పదవ తరగతి విద్యార్థులు పోను, ఇక మిగిలిన 5,91,088 మంది విద్యార్థులు 1నుంచి 9వ తరగతి వరకు చదువుతున్నారు. ప్రైవేటు, కార్పొరేట్ స్కూళ్లలో చదువుతున్న విద్యార్థులకు విద్యా సంవత్సరం ముగియక ముందే పై తరగతి పాఠ్యంశాలు బోధించడంతో మంచి ఫలితాలు వస్తున్నాయని, ప్రభుత్వ స్కూళ్లలో కూడా ఇదే విధానాన్ని అమలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. అయితే జ్ఞానధార కార్యక్రమాన్ని అమలు చేసేందుకు ఎలాంటి కసరత్తు చేయకపోవడం, మార్గదర్శకాలను రూపొందించక పోవడంతో ఉపాధ్యాయులు అమోమయానికి గురవుతున్నారు. జ్ఞానధార కింద ఇప్పటి వరకు నిష్ణాతులైన ఉపాధ్యాయుల ఎంపికకు చర్యలు తీసుకోలేదు. ఏ స్థాయి విద్యార్థులకు శిక్షణ అవసరమో కూడా ఇప్పటి వరకు ప్రకటించలేదు. అంతేకాకుండా గత ఏడాది సవరణాతమ్మకమైన బోధన తరగతులు నిర్వహించిన ఉపాధ్యాయులకు ఎలాంటి వేతనం ఇవ్వలేదు. ఈ నేపథ్యంలో ఏడాదంతా చదివిన విద్యార్థులు ఈ వేసవి శిక్షణపై దృష్టి సారించకపోతే ప్రభుత్వ నిధులు బూడిదలో పోసిన పన్నీరే అవుతుంది. హాస్టల్ వసతి కల్పన జ్ఞానధార కార్యక్రమంలో భాగంగా ఆదర్శ, కస్తూర్బా స్కూళ్లతో పాటు గురుకుల పాఠశాలల్లో హాస్టల్ వసతితో కూడిన శిక్షణను మే 1వ తేదీ నుంచి ఇవ్వనున్నారు. ఈ శిక్షణలో విద్యార్థులతో తల్లిదండ్రులు సాయంత్రం 4 గంటల నుంచి 6 గంటల వరకు మాట్లాడేందుకు మాత్రమే అవకాశం ఇస్తారు. శిక్షణ అనంతరం విద్యార్థులకు సర్టిఫికెట్లను అందజేయనున్నారు. ఇందుకు డీఈఓ, సర్వశిక్ష అభియాన్, ప్రభుత్వ డైట్ కాలేజీ డీసీఈబీలు సమన్వయంతో తయారు చేసిన ప్రణాళిక ప్రకారమే శిక్షణ ఇవ్వనున్నారు. విద్యార్థుల ఆరోగ్యంపై ప్రభావం ప్రభుత్వ పాఠశాలల్లో 5, 9 తరగతి విద్యార్థుల్లో సామర్థ్యాల పెంపునకు వేసవి శిక్షణ తరగతులు విద్యార్థుల ఆరోగ్యంపై ప్రభావం చూపనుంది. విద్యాశాఖ ముందస్తు కసరత్తు లేకుండా తీసుకున్న నిర్ణయంతో అందరికీ ఇబ్బందులు తప్పవు. ఈ విషయంపై ప్రభుత్వం పునరాలోచించాలి. : వి.కరుణానిధిమూర్తి, పీఆర్టీయూ జిల్లా అధ్యక్షుడు విద్యా సంవత్సర ప్రారంభంలోనే శిక్షణ ఇవ్వాలి విద్యార్థులు పై తరగతుల్లో ప్రతిభ చూపేలా గతంలో జూన్‌లో సన్నద్ధత తరగతులు నిర్వహించే వారు. అయితే విద్యా సంస్కరణలో భాగంగా 5, 9 తరగతులకు చెందిన విద్యార్థులకు ఈ ఏడాది మే నెలలో శిక్షణ ఇవ్వాల ని తీసుకున్న నిర్ణయం సరైంది కాదు. వేసవి ఎండల తీవ్రత ఎక్కువగా ఉండడంతో విద్యార్థులు, ఉపాధ్యాయులు అవస్థలు ఎదుర్కొవాల్సి వస్తుంది. – రంగన్న ఏపీటీఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి -
ఈత.. కడుపుకోత
వేసవికాలం.. ఉక్కపోత నుంచి ఉపశమనం పొందాలన్నా.. స్నేహితులతో సరదాగా గడపాలన్నా ఈత ఒకటే మార్గం.. ఈ నేపథ్యంలో ఎంతోమంది విద్యార్థులు, పెద్దవారు సైతం బావులు, కాల్వలు, చెరువుల్లో సేదతీరుతూ కనిపిస్తుంటారు.. అయితే కొంత మంది ఈత రాకపోయినా.. ఎలా కొట్టాలో తెలియకపోయినా ఈ తపడుతూ ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్నారు.. ప్రతియేటా పదుల సంఖ్యలో ఈతకు వెళ్లి మృత్యువాత పడుతున్నారు.. ఈ క్రమంలో ఇ టు తల్లిదండ్రులు గాని.. అటు ప్రభుత్వ యంత్రాంగం గాని వీరిపై ప్రత్యేక దృష్టిసారించలేకపోతున్నారు.. ఫలితంగా తల్లిదండ్రులకు కడుపుకోత మిగిల్చుతున్నారు.. మహబూబ్‌నగర్ క్రైం : వేసవి సెలవుల్లో పిల్లలు.. పెద్దలు ఈత నేర్చుకోవడానికి ఆసక్తి చూపుతారు. మండు వేసవిలో ఎండవేడిమి నుంచి ఉపశమనానికి.. సెలవుల సరదాతో కాలక్షేపం కోసం ఈతకు వెళ్లడం అందరికీ అభిరుచిగా మారుతోంది. అలాంటిది ఈత రాక ఏటా పదుల సంఖ్యలో మృత్యువాత పడుతున్నారు. కనీసం అవసరమైన స్విమ్మింగ్ పూల్స్ లేకపోవడంతో ప్రమాదాలకు కారణమవుతుంది. భౌగోళికంగా చూస్తే ఉమ్మడి జిల్లాలో వాగులు, వంకలు, నదులు, బావులు, కాల్వలకు కొదువ లేదు. జిల్లాకేంద్రంతో పాటు ఇతర పట్టణాలు, గ్రామీణ ప్రాంతాల్లో ఈత సరదాను తీర్చుకునేందుకు బావులకు వెళ్తుంటా రు. పట్టణంలో కంటే గ్రామీణ ప్రాంతా ల్లోని విద్యార్థులు, యువకులు ఆయా ప్రాంతాల్లో ఉండే బావులు, కుం టలు, చెరువులు, కాల్వలను అధికంగా ఆశ్రయిస్తున్నారు. చాలామందికి ఈత కొట్టడం ఎలాగో తెలియక ప్రమాదాల ను కొని తెచ్చుకుంటున్నారు. రక్షణ చర్యల్లేక ఈత మాటున నిండు ప్రాణాలను పోగొట్టుకుని కన్నవారికి కడుపుకో త మిగులుస్తున్నారు. వేసవిలో బాలలు, యువకులు జిల్లాలో ఈతకు వెళ్తూ నీటిలో మునిగి మృత్యువాత పడుతున్న సంఘటనలు ఏటా పెరుగుతున్నాయి. నీటిలోతు, ఈత కొట్టే పద్ధతులు తెలియక అందులో మునిగిపోతుండగా రక్షణ చర్యలు కరువయ్యాయి. రక్షించడం ఇలా.. ప్రత్యక్ష పద్ధతి ద్వారా నీటిలో మునిగిపోతున్న వ్యక్తిని రక్షించే వీలుంటుంది. అయితే రక్షించబోయే వ్యక్తికి ఈత రావడంతోపాటు ధైర్యం కలిగి ఉండాలి. నీటిలో మునుగుతున్న వ్యక్తి వెనుక నుంచి వెళ్లి అతని వెంట్రుకలు, అండర్వేర్, మొలతాడు వంటి వాటిలో ఏదో ఒకటి పట్టుకొని ఒడ్డుకు తీసుకురావాలి. పరోక్ష పద్ధతి.. ఈ పద్దతి ద్వారా ఈత వచ్చిన వారితోపాటు రాని వారు కూడా నీటిలో మునుగుతున్న వారిని రక్షించవచ్చు. రక్షించే వారు నీటిలోకి దిగకుండా ఒడ్డున ఉండే ప్రమాదంలో చిక్కుకున్న వారికి ఆసరాగా ఒడ్డునుంచే దేన్నైనా పట్టుకునేలా అందించాలి. దగ్గరగా ఉంటే కర్ర, టవల్, ప్యాంట్ వంటివి అందించాలి. దూరంగా ఉంటే తాడు, పొడవాటి కర్రను అందించి ఒడ్డుకు చేర్చాలి. నీటిపై తేలియాడే పరికరాలను నీటిలోకి విసిరి వేయాలి. ప్రథమ చికిత్స ముఖ్యం.. నీటిలో ప్రమాదానికి గురైన వ్యక్తిని ఒడ్డుకు చేర్చగానే అతన్ని వెల్లకిలా పడుకోబెట్టాలి. అవసరమైతే నోట్లో నోరు పెట్టి శ్వాసను ఊదుతూ కృత్రిమ శ్వాస అందించాలి. ఛాతిపై చేతులతో ఒత్తాలి. దీంతో శ్వాస పెరుగుతుంది. ప్రథమ చికిత్స చేస్తూనే వెంటనే సమీపంలోని ఆస్పత్రికి తీసుకెళ్లి వైద్యులకు చూపించాలి. జాగ్రత్తలు అవసరం.. ఈత కొలనులోకి నేర్చుకునేందుకు వెళ్తున్నప్పుడు అక్కడ సుశిక్షితులైన కోచ్‌లు, ఇతర సిబ్బంది రక్షణ చర్యలు ఉన్నాయో లేదో చర్యలు ఉన్నాయో లేదో పెద్దలు పరిశీలించాల్సిన తర్వాతే పిల్లలను పంపించాలి. చెరువులు, కాల్వల్లో, ఈతకు వెళ్తున్నప్పుడు బాలల వెంట పెద్దవారు తప్పక వెళ్లాలి. కొత్త ప్రదేశంలో బావులు, కాల్వలు, చెరువుల్లో ఈత కొట్టే ముందు కర్ర సాయంతో లోతును పరిశీలించాలి. ఈత రాని వారు దాన్ని నేర్చుకునేందుకు ట్యూబ్‌లు, ఇతర పరికరాలను ఉపయోగించి పూర్తిగా ఈత కొట్టడం వచ్చాకే లోతుకు వెళ్లాలి. సెలవులు కాబట్టి పిల్లలు బయటికి వెళ్లి చాలా సమయం అయితే వారి వారి తల్లిదండ్రులు పిల్లల సమాచారంపై వాకబు చేసుకుని చూసుకోవాల్సిన అవసరం ఉంటుంది. విహార యాత్రలు, తీర్థయాత్రలకు వెళ్లినప్పుడు స్నానం ఆచరించాలే తప్ప అక్కడి వాటిల్లోకి వెళ్లి ఈత కొట్టడం చేయవద్దు. మట్టిని లోతుగా తవ్విన ప్రాంతాల్లో నిలిచిన నీటిలో లోతు తెలియదు. కాబట్టి ఇలాంటి వాటిల్లో ఈతకు సాహసం చేయరాదు. జిల్లాలో కృష్ణ, జూరాల, కోయిల్‌సాగర్, ఇతర ప్రాంతాలకు వెళ్లినప్పుడు అక్కడ చాలా జాగ్రత్తగా ఉండాలి. గ్రామీణ ప్రాంతాల్లో సెలవులు గడపడానికి వచ్చిన పిల్లలు ఈతకు వెళ్లినప్పుడు వారి వెంట పెద్దవారు తప్పకుండా ఉండాలి. ఇవీ ప్రమాద ఘటనలు.. కందూరు రామలింగేశ్వర ఆలయ కోనేరులో ఈ నెల 8న ఈత రాక నీటలో మునిగి మహబూబ్‌నగర్ జిల్లాకేంద్రంలోని ఏనుగొండకు చెందిన రవికుమార్, పవన్‌కుమార్, ఆంజనేయులు అనే అన్నదమ్ములు మృత్యువాతపడ్డారు. ఈ నెల 15న గద్వాల మండలం జమ్మిచేడ్కు చెందిన జశ్వంత్ బావిలో నీట మునిగి మృతిచెందాడు. ఈ నెల 18న ధన్వాడ ఎస్సీ హాస్టల్లో పదో తరగతి చదువుతున్న నరేష్కుమార్ బావిలో గల్లంతు అయితే మరసటి రోజు ఉదయం మృతదేహాన్ని వెలికితీశారు. -
‘సమ్మర్’ టీచర్లకు నిరాశ
ఆత్మకూరు(పరకాల) : జిల్లాలో 678 ప్రభుత్వ పాఠశాలలు ఉన్నాయి. గత ఏడాది వేసవి సెలవుల్లో స్కూల్‌కు ఒకరి చొప్పున ప్రభుత్వ ఉపాధ్యాయులు మధ్యాహ్న భోజన నిర్వహణ విధులకు హాజరయ్యారు. ఇందుకుగాను స్కూల్‌అసిస్టెంట్, హెచ్ఎం క్యాడర్ స్థాయి వారికి రోజుకు రూ.300, ఎస్జీటీలకు రూ.225 చొప్పున చెల్లిస్తామని ప్రభుత్వం ప్రకటించింది. ఏడాది గడుస్తున్నా గౌరవ వేతనం, పీపీఎల్(సంపాదిత సెలవులు) జాడలేదు. మళ్లీ ఎండాకాలం సెలవులు వస్తున్నాయి. ఇప్పటి వరకు హానరోరియం అందించకపోగా తాజాగా గౌరవ వేతనంలో భారీగా కోత పెడుతూ విద్యాశాఖ కమిషనర్ కిషన్ నుంచి ఉత్తర్వులు జారీ అయ్యాయి. రూ.300లకు బదులు రూ.25, రూ.225కు బదులు రూ.18.75 చెల్లించనున్నట్లు ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. దీంతో ఉపాధ్యాయులు ఒక్కసారిగా ఖంగుతిన్నారు. ఇదెక్కడి అన్యాయమని ప్రశ్నిస్తున్నారు. మొదట ప్రకటించిన విధంగా హానరోరియమ్‌తో పాటు పీపీఎల్ సెలవులు మంజూరుచేస్తూ తిరిగి ఉత్తర్వులను జారీచేయాలని డిమాండ్ చేస్తున్నారు. -
ఈ వేసవికి మరింత రద్దీ
రానున్న వేసవి సెలవుల్లో తిరుమలలో ఏర్పాట్లపై టీటీడీ ప్రణాళికలు సిద్ధం చేసింది. రద్దీని తట్టుకుని భక్తులకు సంతృప్తికరసేవలందించాలని కసరత్తు ప్రారంభమైంది. ఆలయంలో శ్రీవేంకటేశ్వర స్వామి వారి దర్శనం, బస, కల్యాణకట్ట, లడ్డూ , అన్నప్రసాదాల పంపిణీకి తొలి ప్రాధాన్యత ఇవ్వాలని సంకల్పించింది. వేసవిలో అన్ని విభాగాలు సమష్టిగా పనిచేయాలనిటీటీడీ ఉన్నతాధికారులు నిర్ణయించారు. సాక్షి, తిరుమల: వస్తున్న వేసవి సెలవుల సందర్భంగా భక్తుల రద్దీ అధికంగా ఉండే అవకాశం ఉంద ని టీటీడీ అంచనా వేసింది. ఏప్రి ల్ రెండో వారం నుంచి మే, జూన్ నెలల్లో శ్రీవారి దర్శనం కోసం భక్తులు అధిక సంఖ్యలో తరలివస్తారని గతానుభవం..గణాంకాలు చెబుతున్నాయి. ఈ ఏడాది ఈ సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని టీటీడీ ఈఓ అనిల్‌కుమార్ సింఘాల్, జేఈఓ కేఎస్ శ్రీనివాసరాజు భావిస్తున్నారు. ఆ మేరకు ఏర్పాట్లు చేయాలని ఇప్పటికే సంబంధిత అధికారులకు ఆదేశాలిచ్చారు. గత వేసవిలో మాత్రమే రోజుకు 77 వేల నుంచి 81 వేల మంది భక్తులు దర్శించుకున్నట్టు గణాంకాలు చెబుతున్నాయి. ఈసారి అంతకంటే ఎక్కువ స్థాయిలోనే వచ్చే అవకాశం ఉంది. ఈ సారి తోపులాటల్లేని దర్శనం కల్పించాలని ఉన్నతాధికారులు యోచిస్తున్నారు. వైకుంఠం క్యూ కాంప్లెక్స్‌లోని కంపార్ట్మెంట్ల నుంచి వెలుపల వచ్చిన భక్తులకు ఆలస్యం లేకుండా గంటలోపే స్వామి దర్శనం కలిగేలా ఇప్పటికే ఏర్పాట్లు చేశారు. ఏర్పాట్లపై వైకుం ఠం, ఆలయ అధికారులతో పలు సందర్భాలు సమీక్షించారు. ఈసారి వేసవిలో టైం స్లాట్ సర్వదర్శనం అమలు టీటీటీడీ కొత్తగా రూ.300 టికెట్లు, కాలిబాట భక్తుల తరహాలోనే సర్వదర్శనానికి టైంస్లాట్ విధానం అమలు చేయనుంది. మార్చి రెండోవారం నుంచి అమల్లోకి తీసుకొచ్చేందుకు ఏర్పాట్లు ముమ్మరంగా సాగుతున్నాయి. ఇదే సందర్భంలో కంపార్ట్మెంట్లలోకి వచ్చే భక్తులకు పాత వి«ధానంలోనూ సర్వదర్శనం కల్పించనుంది. ఏకకాలంలో అన్ని రకాల దర్శనాల అమలు విషయంలో పక్కా ప్రణాళికలు సిద్ధం చేసింది. బస, కల్యాణకట్ట, లడ్డూ, అన్నప్రసాదంపై వితరణకు ప్రాధాన్యం ♦ తొలుత సులభంగా గదులు లభించే చర్యలు చేపట్టారు. తిరుమలకొండ మీద ఉండే సుమారు 7 నుంచి 8 వేల గదులు భక్తులకు ల భించేలా చేపట్టారు. గత ఏడాది గదుల వినియోగ శాతం 110 నుంచి 120 శాతానికి పెరిగింది. ♦ యాత్రిసదన్లలో కూడా సౌకర్యాలు రెట్టింపు చేసి వేసవి సెలవుల్లో మరింత మంది వినియోగించుకునేలా ముందస్తు చర్యలు చేపట్టారు. ♦ తలనీలాల వద్ద ఆలస్య నివారణ చర్యలు పెంచారు. ప్రధాన కల్యాణకట్టతోపాటు మినీ కల్యాణకట్టల్లో కూడా త్వరగా భక్తులకు తలనీలాలు సమర్పించుకునే చర్యలు చేపట్టారు. టీటీడీ నాయీబ్రాహ్మణులతోపాటు పీస్ రేట్ కార్మికులతోపాటు మరో 930 మంది శ్రీవారి కల్యాణకట్ట సేవకుల సేవల్ని వినియోగించుకునే ఏర్పాట్లు చేశారు. ♦ వెలుపల వచ్చిన భక్తులు సులభంగా లడ్డూ ప్రసాదం పొందేలా అన్ని కౌంటర్లు వినియోగంలోకి తీసుకొచ్చారు. ♦ ఇప్పటికే నడిచి వచ్చే భక్తుడికి ఐదు, సర్వదర్శనం భక్తుడికి నాలుగు, రూ.300 టికెట్ల భక్తుడికి నాలుగు చొప్పున ఇస్తున్నారు. రద్దీ రోజుల్లోనూ ఈ విధానాన్ని మరింత పక్కాగా అమలు చేయాలని భావిస్తున్నారు. ♦ ఆలయం వెలుపల రూ.50 చొప్పున అదనపు లడ్డూలు విక్రయించే చర్యలు పక్కాగా చేపట్టనున్నారు. ప్రస్తుతం రోజుకు 30 వేలు ఇస్తుండగా, వేసవిలో ఈ సంఖ్య 50 వేలకు తగ్గకుండా సరఫరా చేయనున్నారు. ♦ టీటీడీ ఈఓ అనిల్‌కుమార్ సింఘాల్, జేఈఓ శ్రీనివా సరాజు భక్తుల ఏర్పాట్ల విషయాన్ని క్షేత్ర స్థాయిలో పరిశీలిస్తున్నారు. సందర్శించిన భక్తుల సంఖ్య 2016 ఏప్రిల్‌లో 20.5 లక్షలు 2017 ఏప్రిల్‌లో 22.10 లక్షలు 2016 మేలో 25.82 లక్షలు 2016 మేలో 26.55 లక్షలు 2016 జూన్‌లో 24.97 లక్షలు 2017 జూన్‌లో 25.77 లక్షలు -
ఏప్రిల్ 13 నుంచే వేసవి సెలవులు
జూన్ 1న పాఠశాలలు పునః ప్రారంభం - పాఠశాల విద్యా కేలండర్ జారీ - 2018 ఫిబ్రవరి 28లోగా టెన్త్ ప్రీఫైనల్ పరీక్షలు పూర్తి - వచ్చే నెల 20 నుంచి అక్టోబరు 4 వరకు దసరా సెలవులు - ఉన్నత పాఠశాలల్లో ఆప్షనల్ హాలిడేల వినియోగంపై నిబంధనలు సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో పాఠశాల విద్యా కేలండర్ జారీ అయింది. పాఠశాలల్లో వచ్చే ఏడాది నుంచి జూన్ 2వ తేదీన తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవాన్ని నిర్వహించేలా కొత్తగా అకడమిక్ కేలండర్‌ను ప్రభుత్వం ఖరారు చేసింది. ఈ మేరకు విద్యాశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రంజీవ్ ఆర్ ఆచార్య మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు. ఈ కేలండర్ ప్రకారం.. 2017–18 విద్యా సంవత్సరం వచ్చే ఏడాది ఏప్రిల్ 12వ తేదీతో ముగుస్తుంది. ఏప్రిల్ 13 నుంచి మే 31వ తేదీ వరకు వేసవి సెలవులు ఉంటాయి. జూన్ 1న పాఠశాలలు తిరిగి ప్రారంభమవుతాయి. ఇక కేలండర్ ప్రకారం పదో తరగతి విద్యార్థులకు జనవరి 31వ తేదీలోగా పాఠ్యాంశాల బోధన పూర్తి చేసి.. రివిజన్ ప్రారంభించాలి. ఫిబ్రవరి 28లోగా ప్రీఫైనల్ పరీక్షలు నిర్వహించాలి. ఒకటి నుంచి 9వ తరగతి వరకు సిలబస్‌ను ఫిబ్రవరి 28వ తేదీలోగా పూర్తి చేయాలి. విద్యా కేలండర్లోని ప్రధాన అంశాలు ► ఉన్నత పాఠశాలలు ఆప్షనల్ హాలిడేస్ వినియోగించుకునే విషయంలో నిబంధనలు పాటించాలి. గతంలో మాదిరిగా టీచర్లంతా ఆప్షనల్ హాలిడేస్ తీసుకుని.. పాఠశాలకు సెలవు ఇవ్వడానికి వీల్లేదు. ప్రధానోపాధ్యాయుడు గరిష్టంగా పాఠశాలలోని 30 శాతం మంది టీచర్లకే ఆప్షనల్ హాలిడేస్‌ను మం జూరు చేయాలి. మిగతా వారితో పాఠశాలను కొనసాగించాలి. ప్రాథమిక, ప్రాథమికోన్నత పాఠశాలలకు మాత్రం గతంలో తరహాలో పాఠశాలకు సెలవు ఇవ్వొచ్చు. ► అక్టోబర్‌లో జాతీయ క్రీడలు ప్రారంభం కానున్న నేపథ్యంలో... సెప్టెంబర్ 2లోగా మండల, డివిజన్ స్థాయి, సెప్టెంబర్ 20లోగా జిల్లా స్థాయి గేమ్స్ పూర్తి చేయాలి. అక్టోబర్ 4వ తేదీలోగా రాష్ట్ర స్థాయిలో గేమ్స్ పూర్తి చేసి.. జాతీయ స్థాయికి ఎంపికైన టీములను పంపించాలి. ► పాఠశాల వార్షిక దినోత్సవాన్ని జనవరి/ఫిబ్రవరిలో, బాలసభను ప్రతి నెల 4వ శనివారం, మాస్ డ్రిల్/యోగాను ప్రతి నెల మొదటి, మూడో శనివారం నిర్వహించాలి. సెలవులివీ.. 20–9–2017 నుంచి 4–10–2017 వరకు దసరా సెలవులు 24–12–2017 నుంచి 28–12–2017 వరకు మిషనరీ స్కూళ్లకు క్రిస్మస్ సెలవులు 12–1–2018 నుంచి 16–1–2018 వరకు మిషనరీ స్కూళ్లు మినహా ఇతర పాఠశాలలకు సంక్రాంతి సెలవులు డిజిటల్ తరగతుల షెడ్యూల్ ఇదీ.. 10వ తరగతి : ఉదయం 10:30 నుంచి 11:15 గంటల వరకు 9వ తరగతి : ఉదయం 11:30 నుంచి 12:15 వరకు 8వ తరగతి : మధ్యాహ్నం 2 నుంచి 2:45 వరకు 7వ తరగతి : 2:45 నుంచి 3:30 వరకు 6వ తరగతి : 3:40 నుంచి 4:20 వరకు పాఠశాలల వేళలు ఉన్నత పాఠశాలలు: ఉదయం 9:30 నుంచి సాయంత్రం 4:45 గంటల వరకు. హైదరాబాద్ జంట నగరాల్లో ఉదయం 8:45 నుంచి సాయంత్రం 4 వరకు. ప్రాథమికోన్నత పాఠశాలలు: ఉదయం 9 నుంచి సాయంత్రం 4:15 వరకు. హైదరాబాద్ జంట నగరాల్లో ఉదయం 8:45 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు. ప్రాథమిక పాఠశాలలు: ఉదయం 9 నుంచి సాయంత్రం 4 వరకు. హైదరాబాద్ జంట నగరాల్లో ఉదయం 8:45 నుంచి సాయంత్రం 3:45 వరకు. పరీక్షల షెడ్యూలు ఇలా.. 31–7–2017లోగా: ఫార్మేటివ్ అసెస్మెంట్–1 19–9–2017లోగా: ఫార్మేటివ్ అసెస్మెంట్–2 23–10–2017 నుంచి 28–10–2017 వరకు: సమ్మేటివ్ అసెస్మెంట్–1 30–11–2017లోగా: ఫార్మేటివ్ అసెస్మెంట్–3 31–1–2018లోగా: టెన్త్ విద్యార్థులకు ఫార్మేటివ్ అసెస్మెంట్–4 28–2–2018లోగా: ఒకటో తరగతి నుంచి 9వ తరగతి వరకు ఫార్మేటివ్ అసెస్మెంట్–4 2–4–2018 నుంచి 9–4–2018 వరకు: సమ్మేటివ్ అసెస్మెంట్–2 10–4–2018న: జవాబు పత్రాల అందజేత 11–4–2018న: తల్లిదండ్రులతో సమావేశం, ప్రోగ్రెస్ కార్డుల అందజేత (పదోతరగతి వారికి 28–2–2018లోగా ప్రీఫైనల్ పరీక్షలు.. మార్చి మొదటి వారంలో వార్షిక పరీక్షలు) -
అతిథి పాత్రలో సీఎం..
బెంగళూరు: రాజకీయాల్లో తీరిక లేకుండా గడిపే ముఖ్యమంత్రి సిద్ధరామయ్య అప్పుడప్పుడు ఆటవిడుపుగా సినిమాలు చూస్తుంటారు. ఈసారి రాజకీయాల నుంచి ఉపశమనం పొందేందుకు కొత్తగా తెరకెక్కుతున్న కన్నడ చిత్రంలో అతిథి పాత్రలో కనిపించనున్నారు. కవితా లంకేశ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సమ్మర్ హాలిడేస్ అనే చిన్న పిల్లల చిత్రంలో సీఎం పది నిమిషాల నిడివి కలిగిన అతిథి పాత్రకు అంగీకరించారు. గిరిజనుల సమస్యలపై ఉద్యమాలు చేసే పిల్లలకు సహాయం చేసే ముఖ్యమంత్రి పాత్రలో సిద్ధారామయ్య కనిపించనుండడం విశేషం. అదే విధంగా కన్నడ సినీ నటుడు రమేశ్ నేతృత్వంలో ఓ ప్రైవేటు కన్నడ ఛానల్లో ప్రసారమవుతున్న వీకెండ్ విత్ రమేశ్ కార్యక్రమంలో కూడా సీఎం ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. నగరంలో అబ్బయ్య నాయుడు స్టూడియోలో ఉదయం 11 గంటల నుంచి సాయంత్రం నాలుగు గంటల వరకు షూటింగ్ సాగింది. బెంగళూరు నగరాభివృద్ధి మంత్రి కే.జే. జార్జ్ సీఎంతో పాటు స్టూడియోకు వచ్చారు. ఈ సందర్భంగా స్టూడియో చుట్టుపక్కల పటిష్టమైన పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు. -
సిటీ బిజీ
నేటి నుంచి పాఠశాలల పునఃప్రారంభం ►విద్యార్థుల కోసం ముస్తాబైన స్కూళ్లు ►పిల్లలను స్కూళ్లకు పంపేందుకు సన్నాహాలు ►కొనుగోళ్లతో బిజీగా మారిన బుక్ షాపులు.. ►ప్రభుత్వ స్కూళ్లకు అందని యూనిఫారాలు ►రేపటి నుంచి 17 వరకు బడిబాట ►మారాం చేస్తే దండించొద్దు.. ►పుస్తకాల బరువుతో ఆరోగ్యం జాగ్రత్త సిటీబ్యూరో: సుదీర్ఘమైన వేసవి సెలవుల తర్వాత నగరంలో సోమవారం నుంచి స్కూళ్లు పునఃప్రారంభమవుతున్నాయి. దీంతో విద్యార్థులను ఆకర్షించేందుకు యాజమాన్యాలు పాఠశాలలను ముస్తాబు చేశాయి. స్కూల్ క్యాంపస్‌లో అహ్లదకరమైన వాతారవణం కల్పించాయి. పిల్లలను తిరిగి స్కూళ్లకు పంపేందుకు తల్లిదండ్రులు ఏర్పాట్లు చేస్తున్నారు. వేసవి సెలవుల్లో ఆటపాటలకు అలవాటు పడ్డవారు స్కూలుకు వెళ్లేందుకు ఇబ్బంది పడుతుంటారు. వీరికి నచ్చజెప్పే ప్రయత్నం చేయాలే కానీ దండించడం వల్ల నష్టాలే అధికంగా ఉంటాయని మానసిన వైద్యనిపుణులు హెచ్చరిస్తున్నారు. భయంతో కాకుండా ఇష్టంతో స్కూలుకు వెళ్లే పరిస్థితి ఇంట్లో కల్పించాల్సిన బాధ్యత తల్లిదండ్రులపై ఉందంటున్నారు. ఇదిలా ఉంటే హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్ జిల్లాల్లోని ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థులకు ఇప్పటి వరకు యూనిఫారాలు అందలేదు. నేటితో విద్యా సంవత్సరం ప్రారంభమవుతున్నా.. ఇప్పటి వరకు క్లాత్ కూడా రాలేదు. దీంతో ‘ప్రభుత్వ’ విద్యార్థులు ఈసారి కూడా పాత యూనిఫారాలతోనే స్కూళ్లకు వెళ్లాల్సి వస్తుంది. వెన్ను వంగకుండా చూడండి ఆటలతో అలసిపోయిన చిన్నారుల శరీరం బండెడు పుస్తకాల బరువుతో నీరసిస్తోంది. నిటారుగా, దృఢంగా, ఆరోగ్యంగా పెరగాల్సిన వెన్నుపూస.. పది, పది హేనేళ్లకే వంకర్లు పోతోంది. కిండర్ గార్డెన్‌లోనే కేజీల బరువు మోయలేని భారంగా మారింది. చిల్డ్రన్ స్కూల్ బ్యాగ్స్ యాక్ట్–2006 ప్రకారం.. ఒక విద్యార్థి తన మొత్తం శరీర బరువులో 10 శాతానికి మించి బరువు మోయకూడదు. కానీ నగరంలో నూటికి 90 శాతం మంది తమ బరువు కంటే ఎక్కువగా పుస్తకాల బరువును మోస్తున్నారు. తద్వారా చిన్న వయసులోనే అనేక మంది పిల్లలు వెన్నునొప్పి బారిన పడుతున్నారు. గ్రేటర్‌లోని చిన్నారుల్లోని ప్రతి వందమందిలో 20 మంది వెన్నునొప్పితో బాధపడుతున్నట్లు వైద్యలు అభిప్రాయపడున్నారు. సాధ్యమైనంత వరకు పిల్లల భుజాలపై తక్కువ బరువు ఉండేలా చూడాలని స్పష్టం చేస్తున్నారు. రేపటి నుంచి రెండో విడత బడిబాట ఫ్రొఫెసర్ జయశంకర్ బడిబాట రెండో విడత కార్యక్రమాన్ని ఈనెల 13 నుంచి 17 వరకు నిర్వహించనున్నారు. ఇందులో భాగంగా ప్రభుత్వ పాఠశాలల ఉపాధ్యాయులు విధిగా ఆయా ప్రాంతాల్లోని బస్తీలు, కాలనీల్లో ఇంటింటికి వెళ్లి ఆరు నుంచి 14 ఏళ్ల పిల్లలను గుర్తించాలి. ఇప్పటికే బడిలో చేరి మధ్యలో మానేసిన పిల్లలతో పాటు ఇప్పటి వరకు బడిలో అడుగుపెట్టని వారిని తల్లిదండ్రులను ఒప్పించి వారిని పాఠశాలలో చేర్పించాలి. ప్రభుత్వ పాఠశాలల అభివృద్ధి కమిటీలతో సమావేశమై సమస్యలు, మౌలిక సదుపాయాలపై చర్చించాలి. ప్రజాప్రతినిధులు, అధికారులతో కేవలం ప్రధానోపాధ్యాయులు మాత్రమే వెళ్లాలి. ‘మన ఊరు–మన బడిబాట’ సర్వే, పిల్లల ఆరోగ్య పరీక్షలు, బాలికల విద్య–ఆవశ్యకత, స్వచ్ఛ పాఠశాల/హరితహారం తదిరత కార్యక్రమాలు చేపట్టాల్సి ఉంది. పిల్లలకు నచ్చజెప్పాలి పిల్లలు అంతా ఒకే విధంగా ఉండరు. మార్కుల్లో వెనుకబడిన వారే కాదు.. తెలివైన విద్యార్థులు కూడా సెలవులు ముగిశాక తిరిగి స్కూలుకు వెళ్లడానికి ఇబ్బంది పడుతుంటారు. ఇలాంటి సమయంలో తల్లిదండ్రులు వారిని ఒత్తిడి చేయకుండా నచ్చజెప్పాలి. ప్రభుత్వ స్కూళ్లలో చదివి ఉన్నత స్థితికి చేరుకున్నవారి గురించి చెప్పి ఆ దిశగా ప్రోత్సహించాలి. – రమేష్, డీఈఓ, హైదరాబాద్ అమ్మతో కలిసి బడికి... చిన్నప్పుడు బడి ఎప్పుడు తెరుస్తారా అని ఎదురుచూసేవాడిని. అమ్మ ఆదిలక్ష్మి వేలుపట్టుకొని ఉత్సాహంగా బడికి వెళ్లేవాడిని. ఒక్కోసారి మా తాత సుబ్బిరెడ్డి గారు బడికి తీసుకెళ్లేవారు. చిన్నప్పటి నుంచే చదువుకోవాలన్న ఆసక్తి బాగా ఉండేది. లెక్కలు, ఇంగ్లిష్ సబ్జెక్టులంటే బాగా ఇష్టం. – ఎన్వీఎస్రెడ్డి, హైదరాబాద్ మెట్రో రైలు ప్రాజెక్టు ఎండీ సున్నితంగా వ్యవహరించాలి పిల్లలు స్కూలు వాతావరణానికి అలవాటు పడేదాకా టీచర్లు వారితో సున్నితంగా వ్యవహరించాలి. తొలిరోజే బండెడు హోంవర్కు ఇచ్చి బెదరగొట్టొదు. సాధ్యమైనంత వరకు అహ్లదకరమైన వాతావరణం కల్పించాలి. పిల్లల విషయంలో తల్లిదండ్రులు జాగ్రత్త వహించాలి. టీవీ, సెల్‌ఫోన్‌కు దూరంగా ఉంచాలి. త్వరగా నిద్రపుచ్చి ఉదయం త్వరగా నిద్రలేచే విధంగా చూడాలి. – డాక్టర్ కళ్యాణ్‌చక్రవర్తి, మానసిక నిపుణుడు పై తరగతికి వెళ్తున్నామనే... చిన్నప్పుడు తొలిసారిగా మా నాన్న చేతివేలు పట్టుకుని స్కూలుకు వెళ్లాను. వేసవి సెలవులు ముగిసిన తర్వాత స్కూలుకు వెళ్లడం కొంత ఇబ్బందిగా అనిపించినా.. పై తరగతులకు వెళ్తున్నామనే సంతోషం ఉండేది. సీనియర్ల నుంచి సెకండ్ హ్యాండ్ పుస్తకాలు కొనడడం, వాటికి కవర్లు వేయడం, భద్రంగా సర్దుకోవడం మంచి అనుభూతిని ఇచ్చేంది. ఉపాధ్యాయులు, విద్యార్థులకు మధ్య అవినాభావ సంబంధం ఉండేది. – ప్రొఫెసర్ రామచంద్రం, ఓయూ వీసీ -
12 నుంచి మళ్లీ బడులు
సాక్షి, హైదరాబాద్: వేసవి సెలవులు ముగించుకొని ఈనెల 12వ తేదీ నుంచి బడులు ప్రారంభం కాబోతున్నాయి. క్షేత్ర స్థాయిలో ఇందుకు అవసరమైన అన్ని ఏర్పాట్లు చేయాలని జిల్లా విద్యా శాఖ అధికారులను పాఠశాల విద్యా డైరెక్టర్ ఆదేశించారు. అలాగే ఈనెల 13వ తేదీ నుంచి 17వ తేదీ వరకు బడిబాట నిర్వహణకు అవసరమైన అన్ని చర్యలు చేపట్టాలని సూచించారు. ఈ మేరకు అకాడమిక్ క్యాలెండర్‌ను కూడా ఖరారు చేసినట్లు తెలిసింది. బడిబాటలో ప్రధానంగా బడిబయట ఉన్న పిల్లలను స్కూళ్లలో చేర్పించాలని విద్యాశాఖ సూచించింది. ఐదో తరగతి, ఏడో తరగతి, 8వ తరగతి పూర్తి చేసుకున్న విద్యార్థులు పైతరగతుల్లో చేరేలా అవసరమైన అన్ని చర్యలు ప్రధానోపాధ్యాయులు చేపట్టాలని పేర్కొంది. ఇంగ్లిషు మీడియం విషయంలో జిల్లాల్లో కలెక్టర్లు అవసరాలను బట్టి నిర్ణయం తీసుకోవాలని పేర్కొంది. బడిబాట పర్యవేక్షణకు డైరెక్టరేట్ నుంచి సీనియర్ అధికారులను వివిధ జిల్లాలకు ఇన్ఛార్జిలుగా నియమించారు. -
ఈతపై అప్రమత్తత.. లేకుంటే గుండెకోత
చిత్తూరు ఎడ్యుకేషన్/తిరుపతి మంగళం: బయట భానుడు ఉగ్రరూపం.. ఇంట్లో ఉంటే ఉక్కపోత.. పైగా వేసవి సెలవులు. దీంతో ఎండ నుంచి ఉపశమనం కోసం యువకులు, విద్యార్థులు చెరువులను, స్విమింగ్ పూళ్లను ఆశ్రయిస్తున్నారు. అయితే ఈత సరదా వారి ప్రాణాలను తీస్తోంది. చెరువుల్లో, స్విమింగ్ పూళ్లలో, కుంటల్లో లోతును అంచనా వేయలేక మృత్యువాత పడుతున్నారు. ఈ వేసవిలో జిల్లా వ్యాప్తంగా సుమారు 30 మంది ఇప్పటి వరకు చనిపోయారు. అయినా అధికారుల్లో చలనం రావడం లేదు. చెరువుల వద్ద కనీసం హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేయడం లేదు. ప్రమాదాల నివారణ ఇలా.. చిన్నారులు ఈత నేర్చుకోవడానికి చెరువులు, వాగులు, కాలువలు, కుంటల్లోకి వెళ్తామంటే తల్లిదండ్రులు అనుమతించకూడదు. తల్లిదండ్రుల పర్యవేక్షణలోనే పిల్లలకు ఈత నేర్పాలి. స్నేహితులు, బంధువులు, ఇతరులతో ఈతకు పంపకూడదు. ప్రాక్టీసు లేకుండా స్విమ్మింగ్ పూల్‌లో దూకకూడదు. ఒంటరిగా ఈతకు వెళ్లకూడదు. నీటి అడుగు భాగంలోకి వెళ్లి మట్టిని తీసుకురావడం వంటి çపనులు చేయకూడదు. స్విమ్మింగ్ పూళ్లలో సురక్షితుడైన ఈతగాడి ఆధ్వర్యంలోనే ఈత నేర్చుకోవాలి. పిల్లల వెంట తప్పకుండా పెద్దలు ఉండాలి. తీర్థయాత్రలకు, ఇతర ప్రదేశాలకు వెళ్లినప్పుడు ఈత వచ్చినప్పటికీ నీటి లోపలికి పిల్లలను పంపకూడదు. వీటిని పాటిస్తే మంచిది.. ఈత కొట్టేటప్పుడు శరీర నిర్మాణానికి అనువైన స్విమ్మింగ్ సూట్ వేసుకోవాలి. తల వెంట్రుకలు తడవకుండా మాస్క్ ధరించాలి. వాతావరణానికి అనుకూలంగా డార్క్, క్లియర్ కళ్లజోళ్లను వాడాలి. చెవిలోకి నీరు వెళ్లి ఇన్ఫెక్షన్ కాకుండా సిలికాన్ ఇయర్ ఫ్లగ్స్ను వాడాలి. నీటిలో తడవడం వల్ల చర్మ సంబంధిత వ్యాధులు రాకుండా వాజిలిన్ వంటిది పూయాలి. ముఖాన్ని పైకి ఉంచి ఈదాలి. ఊపిరీ పీల్చుకునేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి. తీసుకోవాల్సిన జాగ్రత్తలు. ⇒దూకేటప్పుడు కాళ్లు మొదట నీళ్లను తాకేలా చూసుకోవాలి. డైవింగ్ చేయవద్దు. తలకిందులుగా దూకొద్దు. ⇒క్వారీ గుంతల అడుగుభాగంలో బండలు, రాళ్లు ఉంటాయి. లోతును ముందుగానే అంచనా వేయకపోతే ప్రమాదం. ⇒ఈతలో ఎంతటి నిపుణుడైనా ఇతరులు మునిగిపోతున్నప్పుడు వారిని రక్షించేందుకు నీళ్లలోకి దూకొద్దు. కర్రలు, తాడు, ఇతర పరికరాలను ఉపయోగించాలి. ⇒ఒకే సారి ఇద్దరు, ముగ్గురిని రక్షించకూడదు. ఎంతటి గజ ఈతగాడైనా సరే వారితోపాటే మునిగిపోయే ప్రమాదం ఉంది. ∙అరగంట కంటే ఎక్కువ సేపు ఈత కొట్టకూడదు. గంటల కొద్దీ ఈదడం వల్ల ఊపిరాడదు. నీటిలో మునిగిన వారిని రక్షించే విధానం ఆకస్మికంగా నీటిలో ఎవరైనా మునిగిపోతే వారిని రెండు పద్ధతుల్లో రక్షించవచ్చని నిపుణులు చెబుతున్నారు. అందులో ప్రత్యక్ష పద్ధతి మొదటిది. ఈ పద్ధతిలో రక్షించే వారికి ఈత వచ్చి ఉండాలి. మునిగిపోతున్న వ్యక్తి వెనుక నుంచి మాత్రమే వెళ్లాలి. మునిగిపోతున్న వ్యక్తి మొలతాడు లేదా జట్టు పట్టుకుని బయటకు తీసుకురావాలి. రెండవది పరోక్ష పద్ధతిః ఈ పద్ధతిలో ఈతరాని వారు కూడా రక్షించవచ్చు. ఒడ్డుకు దగ్గరగా ఉండే కర్ర, టవల్, ప్యాంట్లను వారికి అందించి బయటకు లాగాలి. బుర్రకాయ, థర్మాకోల్, మూతబిగించిన నీటి క్యాన్ వంటి నీటిపై తేలే వస్తువులను బాధితుడి వద్దకు చేర్చాలి. అవగాహన అవసరం.. ఈతకు వెళ్లే వారికి చెరువులు, కుంటలు, స్విమింగ్ పూళ్లలో నీటి మట్టంపై అవగాహన ఉండాలి. నీటిలో సంభవించే ప్రమాదాల బారి న నుంచి బయటపడేందుకు అవసరమైన మెళకువలను కూడా నేర్చుకోవా లి. అలా కాకుండా నీళ్లు చూడగానే లోతు ఎంత ఉందని తెలుసుకోకుండా దూకడం వల్లే ఎక్కువమంది ప్రాణాలు కోల్పోతున్నారు. – బి.చక్రవర్తి (ఆది), స్విమ్మింగ్ కోచ్ -
టూరుకు 'ప్లాన్' చేశారా?
ప్రణాళిక ఉంటే ఖర్చు తక్కువలోనే పర్యటన ► ముందు నుంచే సన్నద్ధం కావటం తప్పనిసరి ► అప్పటికప్పుడు నిర్ణయించుకుంటే ఖర్చులెక్కువే ► రవాణా, వసతి, ఇతర ఖర్చులన్నీ ఆన్లైన్లో లభ్యం ► అందుకు తగ్గట్టు ప్లాన్ చేసుకుంటే పర్యటన సక్సెస్ సెలవులొచ్చేశాయి. రోజూ కాసేపు స్కూలుకు వెళ్లి... ఆ తరవాత ఇంటికొచ్చి హోమ్‌వర్కుల వంటివి చేసే పిల్లలు... రోజంతా ఇంట్లో ఉంటే భరించటం కష్టమే. అందుకే సెలవులకు ఊళ్లకు పంపిస్తుంటారు. కానీ ఇప్పుడంతా ఎండలమయం. ఎక్కడికి పంపించాలన్నా చాలా కష్టం. పోనీ సమ్మర్ క్యాంపుల్లో చేరిస్తే... అవి గంటా రెండు గంటల కన్నా ఎక్కువసేపు లేవు. ఇవన్నీ పక్కనబెడితే... పిల్లలే కాదు, ఇంట్లో వాళ్లు కూడా వేసవిలో ఏదో ఒక చల్లని ప్రాంతానికి విహారయాత్రకు తీసుకెళ్లమంటుంటారు. ఒకవేళ వాళ్లు అడగకపోయినా కూడా వేసవిలో ఏదైనా టూర్‌కు వెళ్లాలని చాలామంది ప్లాన్ చేస్తుంటారు. అయితే... అనుకున్న వెంటనే ఏదో ఒక ఆపరేటర్‌ను సంప్రతించటం, తాము వెళ్లాలనుకున్న ప్రాంతం కనక తమ బడ్జెట్లో లేకపోతే బాధపడటం... చివరకు తమ బడ్జెట్లో ఏది ఉందో చూసుకుని, ఆ ప్రాంతానికి వెళ్లటం చేస్తుంటారు. నిజానికి కాస్తంత ముందే ప్లాన్ చేసుకుని... దాని ప్రకారం అడుగులు వేస్తే తక్కువ బడ్జెట్లోనే అనుకున్న టూర్ సాధ్యమవుతుంది. ఆ వివరాలన్నీ తెలియజేసేదే ఈ ప్రత్యేక కథనం... వేసవి సెలవుల్లో యాత్రలకు వెళ్లాలని ముందుగానే చాలామంది ఫిక్స్ అవుతారు. కానీ ఎక్కడికి వెళ్లాలో, కచ్చితంగా ఏఏ తేదీల్లో వెళ్లాలో నిర్ణయించుకోరు. వీటిపై చివరి నిమిషంలో నిర్ణయాలు తీసుకోవటం వల్ల ఖర్చులు తడిసిమోపెడవుతాయి. ముందుగానే ప్లాన్ చేసుకోకపోవడం వల్ల అనుకున్నంత ఎంజాయ్మెంట్ కూడా ఉండకపోవచ్చు. అందుకే ఎక్కడికి వెళ్లాలన్నది ముందుగానే డిసైడ్ అవ్వాలి. పర్యటన కొంచెం ఎక్కువ రోజులుపాటు ఉండాలనుకుంటే అందుకు ఎంత బడ్జెట్ కావాలి? తామెంత కేటాయించగలరు? వంటివన్నీ చూసుకోవాలి. ఎందుకంటే నలుగురు సభ్యులున్న కుటుంబం రూ.50,000 బడ్జెట్‌తో కశ్మీర్ సహా ఉత్తర భారతాన్ని చుట్టొద్దామనుకుంటే సాధ్యం కాకపోవచ్చు. అలాగే, ఇదే బడ్జెట్‌తో సింగపూర్ వెళ్లాలనుకున్నా అసాధ్యమే. కాకపోతే విమానాల బదులు రైలు ప్రయాణాన్ని ఎంచుకుని... కశ్మీర్ బదులు ఊటీ, కులుమనాలీ వంటి ప్రాంతానికి వెళ్లిరావాలనుకుంటే... ఇదే బడ్జెట్‌తో మరీ లగ్జరీకి పోకుండా టూర్ పూర్తిచేయొచ్చు. ధరల గురించి పూర్తి సమాచారం ఇపుడు ఆన్లైన్లో దాదాపు అన్ని రకాల సమాచారమూ అందుబాటులో ఉంటోంది. కాబట్టి ఏ ప్రాంతానికి వెళ్లాలనుకున్నారో అక్కడ వసతి, ఆహార ఖర్చులు, వెళ్లి వచ్చేందుకు అయ్యే రవాణా ఖర్చుల గురించి ముందుగానే పూర్తిస్థాయిలో ఓ అంచనాకు రావచ్చు. ఇలా బయల్దేరిన దగ్గర్నుంచి, తిరిగి వచ్చే వరకు అయ్యే వ్యయాలను ఓ జాబితాగా రాసుకోవడం వల్ల ఎంత మేర ఖర్చవుతుందీ తెలిసిపోతుంది. దీనికి ఓ పది శాతం అదనంగా కలుపుకోవాలి. ఊహించని ఖర్చులు, చివరి నిమిషంలో టూర్ పొడిగించుకోవడం వంటి అంశాలే దీనికి కారణం. క్రెడిట్ కార్డు వాడకుంటేనే బెటర్... పర్యటనల సమయంలో క్రెడిట్ కార్డు వాడకాన్ని తగ్గించుకుంటే మంచిది. ముందుగానే పర్యటనకు ప్లాన్ చేసుకోవడం అదనపు వ్యయాలకు కళ్లెం వేయాలనే కదా!!. కానీ, కొందరికి తమ దగ్గర క్రెడిట్ కార్డు ఉంటే ఎంత ఖర్చు చేస్తున్నామనేది లెక్క ఉండదు. అందుకే క్రెడిట్ కార్డు వాడకాన్ని తగ్గించాలి. క్రెడిట్ కార్డు బిల్లులపై నెలకు 2 నుంచి 3 రూపాయల వడ్డీని బ్యాంకులు వసూలు చేస్తున్నాయి. మరో విషయం విదేశీ పర్యటనల సమయంలో క్రెడిట్ కార్డును వాడితే విదేశీ లావాదేవీల రుసుము చెల్లించుకోవాలి. ఇది లావాదేవీ విలువపై 3%గా ఉంటుంది. ట్రావెల్ ఇన్సూరెన్స్ తప్పనిసరి పర్యటన ఎక్కడికైనా ట్రావెల్ ఇన్సూరెన్స్ పాలసీతో రక్షణ కల్పించుకోవడం ఎంతో అవసరం. విదేశీ పర్యటనల్లో స్వదేశంలో తీసుకున్న హెల్త్ పాలసీ అక్కరకు రాదు. అదే ట్రావెల్ ఇన్సూరెన్స్ పాలసీ అయితే ఊహించని ఆరోగ్య అత్యవసర పరిస్థితుల్లోను, ప్రమాదాల కారణంగా తలెత్తే వైద్య చికిత్సలకు ఆసరాగా నిలుస్తుంది. హాస్పిటల్లో అయ్యే వ్యయాలతో పాటు, అవుట్ పేషెంట్ చికిత్సలకూ ఇది ఉపయోగపడుతుంది. అదేకాక... లగేజీ మిస్సయినా, పాస్‌పోర్ట్ పోగొట్టుకున్నా, ట్రిప్ ఆలస్యమైనా, పర్యటన రద్దు కావడం వల్ల అయ్యే వ్యయాలను కూడా పాలసీ భరిస్తుంది. ఆస్తులు, వ్యక్తిగత నష్టాలకు థర్డ్ పార్టీ కవరేజీ కూడా ఉంటుంది. ఇంకా దంత సంబంధ చికిత్సలకు, ప్రమాదాల్లో మరణిస్తే స్వదేశానికి తరలించేందుకు అయ్యే ఖర్చులను భరించే పాలసీలూ ఉన్నాయి. ఇన్ని విధాల రక్షణనిస్తున్న ట్రావెల్ ఇన్సూరెన్స్‌ను బడ్జెట్లో భాగం చేసుకోవడం మంచిది. తొలిసారి.. ప్యాకేజ్ టూరే బెటర్ పర్యాటక సంస్థలు వివిధ రకాల ప్రాంతాలకు టూర్ ప్యాకేజీలను ఇపుడు చౌకగానే అందిస్తున్నాయి. వీటిని ఎంపిక చేసుకోవడం వల్ల తోడుగా ఇతర పర్యాటకులు ఉంటారు. అలాగే, ఆయా ప్రాంతాల గురించి తెలియజేసే గైడ్లు కూడా వెంట ఉంటారు. పర్యటన పరిమితంగా ఉండాలని, తక్కువ ఖర్చులోనే పూర్తి చేసుకోవాలని అనుకునే వారికి ఈ ప్యాకేజీలు అనుకూలం. అయితే ఎక్కువ సమయం పాటు, అదే ప్రాంతంలోని అన్ని విశేషాలనూ చూసేందుకు అవకాశం ఉండదు. మొదటిసారి విదేశీ పర్యటనలకు వెళ్లేవారికి ఇవి అనువైనవి. స్వయంగానూ ప్లాన్ చేసుకోవచ్చు ఒకవేళ తగిన సమయం, బడ్జెట్, అవగాహన ఉంటే కనక స్వయంగానూ ప్లాన్ చేసుకోవచ్చు. కాకపోతే తెలియని కొత్త ప్రాంతాల సందర్శనకు వెళుతుంటే మాత్రం ముందుగానే తగినంత సమాచారాన్ని రాబట్టుకుని అందుకు తగిన విధంగా ప్లాన్ చేసుకోవాలి. ప్రముఖ పర్యాటక ప్రదేశాలకు రవాణా సదుపాయాలు చక్కగా ఉంటాయి. ధరలు కూడా అందుబాటులో ఉంటాయి. అదే అంతగా ప్రాచుర్యంలో లేని వాటిని ఎంచుకుంటే బడ్జెట్ ఎక్కువ అవుతుందన్న విషయాన్ని గుర్తుంచుకోవాలి. -
పిల్లల పండక్కి పయనం
నేటి నుంచి జూన్ 12 వరకు అంటే 51 రోజులపాటు పిల్లలకు పండగే పండగ. ఆడుకోవచ్చు.. పాడుకోవచ్చు.. ఎప్పుడైనా నిద్రపోవచ్చు.. ఎంతకైనా లేవచ్చు. ఊర్లకెళ్లవచ్చు.. ఊరికే ఉండవచ్చు.. ఇలా ఇష్టమొచ్చింది ఏది చేసినా పెద్దలు పెద్దగా పట్టించుకోరు. మహా అంటే జాగ్రత్త కోసం కొన్ని కండీషన్లు పెడతారు. అందుకే పిల్లలకు వేసవి సెలవులంటే పండగే పండగ. ఇలాంటి పండుగను ఎంజాయ్ చేసేందుకు విద్యార్థులు శనివారం తమ సొంతూళ్లకు పయనమయ్యారు. సహచరులకు, స్నేహితులకు వీడ్కోలు పలికి లగేజీలు సర్దుకుని సంబరంగా బస్టాండుకు చేరుకున్నారు. ఊర్లకు వెళ్లేవారు అధిక సంఖ్యలో ఉండటంతో సీట్ల కోసం వెంపర్లాడారు. దొరకనివారు ఫుట్‌బోర్డుపైనే నిలబడి వెళ్లిపోయారు. స్థానికంగా నివాసమున్న వారు అప్పుడే ఆటపాటల్లో మునిగిపోయారు. - సాక్షి ఫొటోగ్రాఫర్ -
రేపటి నుంచి వేసవి సెలవులు
అనంతపురం ఎడ్యుకేషన్ : అన్ని యాజమాన్యాల కింద పని చేస్తున్న పాఠశాలలకు ప్రభుత్వం ఈ నెల 23 నుంచి జూన్ 12 వరకు వేసవి సెలవులు ప్రకటించినట్లు డీఈఓ లక్ష్మీనారాయణ తెలిపారు. ఇదిలాఉండగా ఎప్పుడూ లేనివిధంగా ఈసారి దాదాపు నెల రోజుల ముందే సిలబస్ పూర్తికాకపోయినా అన్ని తరగతులకు వార్షిక పరీక్షలు నిర్వహించి మమ అనిపించారు. ఆ తర్వాత మార్చి 28 నుంచి రెమిడియల్ టీచింగ్ నిర్వహించాలని ప్రభుత్వం ప్రకటించింది. అయితే అమలులో చేతులెత్తేసింది. చాలా స్కూళ్లలో కనీసం 50 శాతం మంది కూడా పిల్లలు రావడం లేదు. -
రేపటి నుంచే వేసవి సెలవులు
హైదరాబాద్: రాష్ట్రంలో ఎండల తీవ్రత రోజురోజుకూ పెరుగుతున్న నేపథ్యంలో అన్ని పాఠశాలలకు రేపటి నుంచి ( ఏప్రిల్ 14) వేసవి సెలవులు ప్రకటించారు. షెడ్యూల్ ప్రకారం మరోవారం స్కూల్స్ నిర్వహించాల్సి ఉన్నా.. మండుతున్న ఎండల కారణంగా వారం రోజుల ముందే సమ్మర్ హాలిడేస్ ఇచ్చేసింది తెలంగాణ ప్రభుత్వం. ఏప్రిల్ 15 (శనివారం) నుంచి షెడ్యూల్ ఉన్నా శుక్రవారం గుడ్ ఫ్రైడే సందర్భంగా.. ఓ రోజు ముందు నుంచే స్కూల్స్ బంద్ కానున్నాయి. వేసవి సెలవుల అనంతరం తిరిగి జూన్ 5వ తేదీ నుంచి తరగతుల వారీగా స్కూల్స్ ప్రారంభం కానున్నాయి. కనీసంగా 45 రోజులుగా వేసవి సెలవులు ఇవ్వాలని తెలంగాణ విద్యాశాఖ ఆదేశించింది. -
పరీక్షల తరువాత...
ముందు కష్టాలొచ్చి, తరువాత సుఖాలొస్తాయని నాకు చిన్నప్పుడే తెలుసు. పరీక్షలు రాస్తేనే కదా ఎండాకాలం సెలవలొచ్చేది. పరీక్షలొస్తే ప్రాణం మీది కొచ్చినట్టే. అదేం కర్మో మనం చదవకుండా వదిలేసిన ప్రశ్నలే పరీక్షల్లో అడుగుతారు. కాపీ కొడదామంటే అదీ కష్టమే. ఏ ప్రశ్నకి ఏది జవాబో తెలియాలి కదా! ఏమి రాసినా పరీక్షలు ఏదో ఒకరోజు అయిపోతాయి. తరువాత సెలవులొస్తాయి. లాస్ట్ పరీక్ష రాసిన రోజు కాళ్ళు భూమ్మీద ఆనవు. ఆరోజు సాయంత్రం సినిమా చూడడం మన జన్మహక్కు. పరీక్షలు రాసిరాసి అలసిపోయి వుంటామని నమ్మడం వల్ల ఇంట్లో కూడా ఉదారంగా డబ్బులిచ్చేవాళ్ళు (అంటే టికెట్ కాకుండా ఎగస్ట్రాగా పావలా). పిల్లకాయల టేస్ట్‌కి అనుగుణంగా ఆరోజు థియేటర్ వాళ్లు కూడా సినిమాలు మార్చేవాళ్ళు. ఒకదానిలో జ్వాలాదీప రహస్యం, ఇంకోటి ఒకనారి – వంద తుపాకులు. కత్తియుద్ధమా, తుపాకీ కాల్పులా... ఇది డిసైడ్ చేసుకోవడానికి కొంచెం టైం పట్టేది. గ్రూప్ డిస్కషన్ చేసుకుని చివరికి జ్వాలాదీప రహస్యానికి వెళ్ళేవాళ్లం. జానపదాల్లో వున్న సౌలభ్యం ఏమంటే మంత్రతంత్రాలుంటాయి. మంత్ర శక్తులపై అప్పటికే అపారమైన నమ్మకం. (సినిమాల్లో ఎప్పుడూ మాంత్రికుడు ఓడిపోతాడని తెలిసినా ఒక దశలో నేను అదే కెరీర్‌గా ఎంచుకున్నాను. ఇప్పటి పిల్లలకి పుట్టినప్పటి నుంచి ఐఐటీ ఫౌండేషన్ వేయడం వల్ల వాళ్ళకి యంత్రాలే తప్ప మంత్రాలు తెలియవు.) ఓ పదిమంది గుంపుగా కలసి థియేటర్‌కి వెళ్ళేవాళ్ళం. దారిలో కుక్కల భయం. అవి మమ్మల్ని చూసి బృందగానం చేస్తూ వెంట పడేవి. వేగంగా పరుగెత్తి థియేటర్‌కి చేరుకునేవాళ్ళం. చెనిక్కాయలు, బఠాణీలు, బర్ఫీలు ఇలా ఎవరి అభిరుచి మేరకు వాళ్ళు జేబులు నింపుకుని కాంతారావు కత్తియుద్ధాన్ని కళ్ళారా చూసి వచ్చేవాళ్ళం. మరుసటిరోజు నుంచి ఏం చేయాలనే ప్రణాళికా రచన కూడా థియేటర్లోనే జరిగేది. కొంతమంది అదృష్టవంతులు వూళ్ళకి వెళ్ళేవాళ్లు. దురదృష్టవంతులు ట్యూషన్లకి వెళ్ళేవాళ్ళు. మిగిలినవాళ్ళం ఈతకి వెళ్ళేవాళ్ళం. నీళ్ళని చూస్తే ఆనందం, మునిగేకొద్దీ సంబరం. బావిలోనుండి బయటకొస్తే భయంకరమైన ఆకలి. పచ్చిమామిడికాయల్ని కూడా పళ్ళు పులిసిపోయేలా తినేవాళ్ళం. ఈతకి వెళ్ళినట్టు ఇంట్లో తెలిస్తే ఈతబెత్తం విరిగేది. ఈత రానివాళ్ళు మాతోపాటు వచ్చి మునిగిపోతారని భయం. చెప్పులు లేకపోయినా భగభగ మండే ఎండలు మమ్మల్ని ఏం చేసేవి కావు. తెల్లారేసరికి పక్షుల్లాగా వూరిమీద పడితే మళ్ళీ ఎప్పుడో ఇల్లు చేరేది. పుల్లఐస్, తాటిముంజెలు, కర్బూజ, పుచ్చకాయ ముక్కలు చల్లటి చూపుతో పలకరించేవి. ఎక్కడ చూసినా చెట్లు, కన్నతల్లుల్లా ఆదరించేవి.గతం ఎప్పుడూ సంతోషంగానే వుంటుంది. వర్తమానంతోనే సమస్య. చదువుతోపాటు పరీక్షలు ముగుస్తాయని అనుకుంటాం కానీ, అసలైన అగ్నిపరీక్షలు ఆ తరువాతే వస్తాయి. పరీక్షల తరువాత పరీక్షలు. సెలవులు మాత్రం వుండవు. – జి.ఆర్. మహర్షి -
సెలవులకు ‘సెలవు’
ఈసారి కీలకమైన కేసుల విచారణ కోసం వేసవి సెలవులను త్యాగం చేయాలని నిర్ణయించడం ద్వారా సుప్రీంకోర్టు కొత్త చరిత్రకు శ్రీకారం చుట్టింది. దాదాపు 50 రోజులుండే వేసవి సెలవు దినాల్లో అత్యవసర కేసుల పరిశీలన కోసం రెండు ధర్మాసనాలు పనిచేయడం ఎప్పటినుంచో ఉన్నదే. ఈ ధర్మాసనాల్లో ఉండే నలుగురు న్యాయమూర్తులు తప్ప మిగిలినవారు వేసవి సెలవులు వినియోగించుకుంటారు. సాధారణ కేసులు మాత్రం వేసవి సెలవులు పూర్తయ్యాకే విచారణకొస్తాయి. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ జేఎస్ ఖేహార్ ఈసారి అలాంటి సమస్య లేకుండా చూశారు. ఈ నిర్ణయం పర్యవసానంగా ప్రస్తుతం ఉన్న 28మంది న్యాయ మూర్తుల్లో 19మంది వేసవిలో పనిచేస్తారు. అంతేకాదు... అవసరమని భావిస్తే వారు శని, ఆదివారాల్లో కూడా కేసులు వింటారు. ఇది అసాధారణమనే చెప్పాలి. జస్టిస్ ఖేహార్ నిర్ణయం మింగుడు పడనివారూ ఉన్నారు. ముఖ్యంగా సీనియర్ న్యాయవాదులు దీన్ని అంగీకరించడం లేదు. వేసవి సెలవుల్లో పనిచేయడంపై వారి కుండే అభ్యంతరం సంగతలా ఉంచి రాజ్యాంగపరంగా అత్యంత కీలకమైన మూడు కేసుల్ని వేర్వేరు ధర్మాసనాలు సమాంతరంగా వినడమేమిటని కూడా వారు ప్రశ్నిస్తు న్నారు. ఇందులో తలాక్ పద్ధతిలో విడాకులివ్వడం, బహుభార్యత్వం తదితర అంశాలకు సంబంధించిన కేసు ఒకటి కాగా, భారత పౌరులు పంపుకునే వాట్సాప్ సందేశాలను ఫేస్బుక్ తెలుసుకోవడం పౌరుల వ్యక్తిగత గోప్యతకు భంగం కలి గించడమా కాదా అనేది మరో కేసు. మూడోది– దేశంలో చట్టవిరుద్ధంగా ఉంటున్న వారికి ఇక్కడ సంతానం కలిగితే ఆ పుట్టినవారికి పౌరసత్వం ఇవ్వొచ్చునా లేదా అనేది. మూడు ధర్మాసనాలూ వేర్వేరుచోట్ల ఏకకాలంలో ఈ కేసుల్ని విచారిస్తుంటే సహజంగానే సీనియర్ న్యాయవాదులకు అది సమస్య అవుతుంది. వారు ఏదో ఒక కేసులో మాత్రమే తమ వాదనలు వినిపించగలుగుతారు. అందుకే అటార్నీ జనరల్ ముకుల్ రోహత్గీ సైతం ఇలా సమాంతరంగా మూడు కేసులనూ విచారించడాన్ని వ్యతిరేకిస్తున్నారు. చివరకు ఈ అంశంలో ప్రధాన న్యాయమూర్తి ఏ నిర్ణయం తీసు కుంటారన్న సంగతలా ఉంచి కేసుల విచారణ కోసం వేసవి సెలవుల్ని తగ్గించు కోవడమన్నది అసాధారణం. న్యాయస్థానాల్లో కేసులు ఏళ్లకొద్దీ పెండింగ్ పడుతున్నాయన్న ఆదుర్దా ఎప్పటి నుంచో ఉన్నదే. సమస్య తీవ్రంగా ఉన్నా న్యాయస్థానాలు తమ సెలవు దినాలను తగ్గించుకోవడంలేదని తరచు విమర్శలు రావడం... వాటిని న్యాయమూర్తులు పెద్దగా పట్టించుకోకపోవడం కూడా మామూలే. ఎవరి వరకో ఎందుకు... ప్రధాని నరేంద్ర మోదీ నిరుడు హైకోర్టు ప్రధాన న్యాయమూర్తుల సదస్సులో సుదీర్ఘ కాలం సెలవులు తీసుకునే విధానాన్ని ప్రశ్నించారు. లక్షలాది కేసులు పెండింగ్ పడుతున్నా యని వాపోయే న్యాయస్థానాలు సెలవుల్ని తగ్గించుకునే ఆలోచన చేయాలని హితవు పలికారు. జస్టిస్ ఖేహార్‌కు ముందు పనిచేసిన జస్టిస్ టీఎస్ ఠాకూర్ వేసవిలో కొన్ని హైకోర్టులు పనిచేసేలా చూడగలిగారు గానీ సీనియర్ న్యాయ వాదులనుంచి వ్యతిరేకత రావడంతో సుప్రీంకోర్టులో ఆ విధానాన్ని ప్రవేశపెట్టలేక పోయారు. జస్టిస్ ఖేహార్ మాత్రం ఇందుకు భిన్నంగా వారి అభ్యంతరాలను బేఖా తరు చేస్తున్నట్టే కనబడుతోంది. మన దేశంలో విద్యాసంస్థలు తప్ప మిగిలినవన్నీ వేసవిలో యధావిధిగా పని చేస్తాయి. కానీ న్యాయస్థానాలు ఇందుకు భిన్నం. బ్రిటిష్ పాలనాకాలంలో ఉన్న సెలవుల సంప్రదాయాన్ని అవి విడనాడలేదు. సుప్రీంకోర్టుకు వేసవి సెలవులొక్కటే కాదు... హోలీ, దీపావళి, దసరాలకు వారం చొప్పున సెలవులుంటాయి. వివిధ వర్గాల నుంచి విమర్శలు వెల్లువెత్తడంతో 2014లో అప్పటి సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఆర్ఎం లోధా పది వారాలుండే వేసవి సెలవుల్ని ఏడు వారా లకు తగ్గించారు. ఇది కూడా విమర్శకులను సంతృప్తిపరచలేకపోయింది. ప్రభుత్వ కార్యాలయాలన్నీ వేసవిలో పనిచేస్తున్నప్పుడు సుప్రీంకోర్టుకు మాత్రం ఈ వెసులు బాటు ఎందుకన్నదే వారి ప్రశ్న. ఉన్నత న్యాయస్థానాలకు ఇప్పుడున్న సెలవుల్లో 10 నుంచి 15 రోజులు కోత పెట్టాలని 2009లో లా కమిషన్ నివేదిక కూడా సూచిం చింది. సుప్రీంకోర్టుకు మాత్రమే కాదు... ఇతర కోర్టులకు కూడా సెలవులు బాగానే ఉన్నాయి. హైకోర్టులు ఏడాదికి 210 రోజులు, కింది కోర్టులు ఏడాదికి 245 రోజులు పనిచేస్తాయి. అయితే ఉన్నత న్యాయస్థానాలకు సెలవులుండటం సబబేనని చెబు తున్నవారి వాదనలు వేరేలా ఉన్నాయి. పేరుకు సెలవులు తీసుకున్నట్టే ఉంటుం దిగానీ తాము విచారిస్తున్న కేసులకు సంబంధించి న్యాయమూర్తులు అనేక అంశా లను అధ్యయనం చేయవలసి వస్తుందని, దేశంలోనూ, విదేశాల్లోనూ గతంలో వెలు వడిన తీర్పుల్లోని పలు విషయాలను కూలంకషంగా పరిశీలించవలసి ఉంటుందని వారంటారు. సెలవుల్లేకుంటే ఇలా నిశిత పరిశీలన సాధ్యపడదన్నది వారి వాదన. సెలవుల మాటెలా ఉన్నా న్యాయస్థానాల్లో కేసులు ఏళ్ల తరబడి పెండింగ్‌లో పడిపోతున్నాయన్నది నిజం. న్యాయమూర్తుల సంఖ్య తగినంతగా ఉంటే, వారు పరిష్కరించాల్సిన కేసుల సంఖ్య తక్కువుంటే ‘సెలవుల సమస్య’ కూడా తీరే అవకాశం ఉంటుంది. మన దేశంలో పది లక్షలమందికి సగటున పది మంది న్యాయమూర్తులుంటే అమెరికాలో ఈ సంఖ్య 107! పైగా అక్కడి న్యాయమూర్తులు ఏడాదికి పరిష్కరించే కేసులు 81 అయితే... మన దేశంలో 2,600! జనాభాకు తగి నట్టు న్యాయమూర్తుల సంఖ్య పెంచాల్సి ఉండగా ఉన్న ఖాళీలను భర్తీ చేయడమే మహద్భాగ్యమన్నట్టు మారింది. సుప్రీంకోర్టులో 60,000 కేసులు పెండింగ్‌లో ఉండగా, హైకోర్టుల్లో దాదాపు 39 లక్షల కేసులు అతీగతీ లేకుండా ఉంటున్నాయి. కింది కోర్టుల్లో మరింత భయానక స్థితి. అక్కడ దాదాపు 3.5 కోట్ల కేసులు తేలాల్సి ఉంది. కేసుల జాప్యం వల్ల బాధితులవుతున్నవారు సామాన్య పౌరులే గనుక వారి ప్రయోజనాల పరిరక్షణను దృష్టిలో ఉంచుకునే దేనిపైన అయినా నిర్ణయం తీసు కోవాలి. ఆ దిశగా మరిన్ని మెరుగైన చర్యలు తీసుకోవడానికి సుప్రీంకోర్టు తాజా నిర్ణయం దోహదపడితే మంచిదే. -
ఒంటిపూట లేనట్లే..!
► అకడమిక్ క్యాలెండర్లో ఫుల్‌టైం నిర్వహణకు ఆదేశం ► నిర్ణయం సరికాదంటున్నఉపాధ్యాయులు ► ప్రభుత్వ ఆదేశాలు పాటించాలంటున్న అధికారులు సిరిసిల్ల ఎడ్యుకేషన్ : పాఠశాలలకు ఏటా వేసవిసెలవులు ప్రకటించడం పరిపాటి. ఆ ఆనవాయితీకి టీఆర్ఎస్ ప్రభుత్వం ముగింపు పలికింది. ఒంటిపూట సెలవును రద్దు చేసి మార్చి నుంచే తరగతులు ప్రారంభించాలని ఆదేశాలు జారీ చేసింది. 2017–18 విద్యాసంవత్సరాన్ని మార్చి 21 నుంచే ప్రారంభించాలని ఈనెల రెండున హైదరాబాద్‌లో నిర్వహించిన సమావేశంలో విద్యాశాఖ ఉన్నతాధికారులు నిర్ణయించారు. పాఠశాలలో నిర్వహించే కార్యక్రమాలు, విధివిధానాలు ఖరారు చేశారు. ఉపాధ్యాయుల్లో వ్యతిరేకత ఎండకాలంలోనూ రెండుపూటల బడి ఉంటుందన్న ప్రభుత్వ నిబంధనను ఉపాధ్యాయులు వ్యతిరేకిస్తున్నారు. ఫిబ్రవరిలోనే ఎండలు మండుతున్నాయని, పెద్దలు సైతం ఇంట్లో సేదతీరుతున్నారని, ఇక పిల్లలు ఎలా బడికి వస్తారని పలువురు ప్రశ్నిస్తున్నారు. గతంలో వెనక్కి తగ్గిన సర్కారు గతేడాది ఒంటిపూట బడికి అవకాశం లేదంటూ ఎస్ఇఆర్టీ నిర్ణయాన్ని అమలు చేయాలని విద్యాశాఖ నిర్ణయించిన విషయం తెల్సిందే. సర్కారు ఆదేశాలతో ఉపాధ్యాయులు పాఠశాలకు వచ్చినా విద్యార్థుల హాజరు తగ్గిపోయింది. దీంతో ఉన్నతాధికారులు మళ్లీ ఒంటిపూట బడిని కొనసాగించారు. ఈ క్రమంలో ఎప్పటిమాదిరిగానే ఒంటిపూట బడి కొనసాగించాలని ఉపాధ్యాయులు కోరుతున్నారు. నూతన విద్యాసంవత్సరం పనివేళలివే.. ఫిబ్రవరి 2 తేదీన హైదరాబాద్‌లోని ఎస్సిఇఆర్టీలో విద్యాశాఖ డైరెక్టర్, అడిషనల్ డైరెక్టర్స్ సమావేశం నిర్వహించారు. 2017–18 విద్యాసంవత్సరాన్ని మార్చి 21 నుంచి ఏప్రిల్ 22 వరకు నిర్వహించాలని నిర్ణయించా రు. దీనిలో ప్రైమరీ, అప్సర్ ప్రైమరీ, ఉన్నత పాఠశాలలో విద్యార్థులకు పాఠశాల నిర్వహణ సమయాలను ప్రస్తుత పనివేళలనే పాటించాలని తెలిపారు. దీని ఆధారంగా ప్రాథమిక పాఠశాలలను ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 4 వరకు నిర్వహించాలని, ప్రాథమికోన్నత పాఠశాలలకు ఉదయం 9 నుంచి 4.15 గంటల వరకు, ఉన్నత పాఠశాలలకు 9.30 గంటల నుంచి సాయంకాలం 5 గంటల వరకు నిర్వహించేలా సమయసారిణి ఉంది. దీనిని అమలు చేయడం కష్టమని ఉపాధ్యాయులు ఇప్పటికే చర్చించకుంటున్నారు. వేళల మార్పు మా పరిధి కాదు పాఠశాలల పనివేళలు నిర్ణయం రాష్ట్రస్థాయిలో జరుగుతోంది. దీనిని అమలు పరచడంలో ఏదేని సమస్యలు వస్తే దానిని ఉన్నతాధికారులకు వివరిస్తాం. వారి ఆదేశానుసారం ముందుకు సాగుతాం. – రాధాకిషన్, డీఈవో గత అనుభవాలు తెలుసుకోవాలి వేసవిలో రెండుపూటల బడి సరైన నిర్ణయం కాదు. గత విద్యాసంవత్సరం ఇలాగే చేశారు. కానీ తల్లిదండ్రులు, విద్యార్థుల నుంచి విమర్శలు వచ్చాయి. అప్పుడు సెలవు ఇచ్చారు. మళ్లీ అదే దారి లో వెళ్లడం సరికాదు. – బి.నారాయణ, ఎస్టీయూ జిల్లా కార్యదర్శి వడదెబ్బకు బలవుతారు ఫిబ్రవరిలోనే ఎండలు అధిమవుతున్నాయి. మార్చి, ఏప్రిల్‌లో విద్యార్థులు తరగతులకు రావాలంటేనే భయపడతారు. వాళ్లు ఇంటికెళ్లేవరకు భయమే. వడదెబ్బ తగిలితే బలయ్యేది ఉపాధ్యాయులే. దీనిని ఆలోచన చేయాలి. – ఏ.సుధాకర్, ఉపాధ్యాయుడు -
నోటిమాటతోనే మూసివేతలు
ముందస్తు నోటీసుల్లేవు.. హైకోర్టు ఉత్తర్వులూ పట్టవు పెద్ద స్కూళ్లను వదిలి.. మాపై ప్రతాపమా? ఇది కోర్టు ధిక్కారమే.. ట్యుటోరియల్స్ నిర్వాహకుల ఆందోళన వేసవి సెలవులన్నాళ్లు మీనమేషాలు లెక్కించి.. తీరా పాఠశాలలు తెరిచే రోజు గుర్తింపు పేరుతో తనఖీలు.. సీజ్లంటూ హడావుడి చేస్తున్న అధికార యంత్రాంగం ఆ ముసుగులో ట్యుటోరియల్స్‌పై ప్రతాపం చూపుతోంది. పెద్ద స్కూళ్లు.. కార్పొరేట్ సంస్థలు గుర్తింపు లేకుండానే యథేచ్ఛగా ఫీజుల దోపిడీకి.. క్లాసుల నిర్వహణకు పాల్పడుతుంటే నోటీసులతో సరిపుచ్చుతున్న సర్కారు.. చిన్న స్కూళ్లు.. పొట్టకూటి కోసం ట్యుటోరియల్ కేంద్రాలు నడుపుకొంటున్న వారిని ఏటా పాఠశాలలు తెరిచే సమయంలో వేధిస్తోంది. ట్యుటోరియల్స్ నడుపుకోవచ్చన్న హైకోర్టు ఉత్తర్వులను సైతం బేఖాతరు చేస్తున్న అధికారుల తీరుపై ట్యుటోరియల్స్ నిర్వాహకులు అసంతృప్తి, ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. విశాఖపట్నం:హైకోర్టు ఆదేశాలున్నా తమ పాఠశాలలను మూసివేస్తున్నారంటూ ఏపీ ప్రైవే టు ట్యుటోరియల్ స్కూల్స్ అసోసియేషన్ ఆందోళన వ్యక్తం చేస్తోం ది. తమ ట్యుటోరియల్స్‌ను నడుపుకోవడానికి అనుమతులున్నా విద్యాశాఖ, టాస్క్ఫోర్సు అధికారులు సీజ్ చేస్తున్నారని అసోసియేషన్ సభ్యు లు ఆవేదన చెందుతున్నారు. ఏపీ ఎడ్యుకేషనల్ యాక్ట్ 1982 సెక్షన్ 2(47) ప్రకా రం ట్యూటోరియల్స్ స్కూళ్లను నడుపుకోవడానికి 2010లో హైకోర్టు అనుమతించిందని అసోసియేషన్ సభ్యులు మంగళవారం ‘సాక్షి’కి చెప్పారు. ఈ మేరకు వీరు సాక్షి కార్యాలయానికి వచ్చి తమ ఆవేదన వెళ్లబోసుకున్నారు. తామంతా పెద్దపెద్ద భవనాల్లో కాకుండా ఇళ్లలోనే స్కూళ్లను నడుపుకుంటున్నామన్నారు. అందువల్ల తమను స్కూళ్ల మాదిరిగా గుర్తించడం లేదన్నారు. అయితే ఏటా విద్యాశాఖాధికారులు పాఠశాలలు తెరిచే సమయంలో వేధింపులకు గురిచేస్తున్నారని, హైకోర్టు ఉత్తర్వులతో మళ్లీ వెనక్కి తగ్గుతున్నారని తెలిపారు. ఈ ఏడాది కూడా గుర్తింపు లేని ప్రైవేటు స్కూళ్లను సీజ్ చేస్తున్న నేపథ్యంలో గత రెండు రోజులుగా తమ ట్యుటోరియల్స్‌ను కూడా మూసివేస్తున్నారని ఆరోపించారు. ఇది కోర్టు ధిక్కారమే అవుతుందన్నారు. పైగా నెలన్నర రోజుల క్రితం తేదీతో నోటీసులు ఇప్పుడే ఇచ్చి.. ఆ వెంటనే మూసివేస్తున్నారని ఆరోపించారు. ఒక్కో ట్యూటోరియల్ స్కూల్లో 100 నుంచి 150 మంది పిల్లలు చదువుతున్నారని చెప్పారు. విద్యాశాఖ అధికారుల చర్యతో తమ స్కూళ్లలో చదువుతున్న పిల్లలతోపాటు తాము, టీచర్లు కూడా వీధిన పడతామని, పిల్లలు కూడా వెనక్కి వెళ్లిపోయే ప్రమాదం కూడా ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. నగరంలోని 110 ట్యూటోరియల్స్ భవిష్యత్ ప్రమాదంలో పడిందన్నారు. అతి తక్కువ ఫీజులతో పేద, మధ్య తరగతికి చెందిన పిల్లలకు నాణ్యమైన విద్యాబోధన అందిస్తున్నామని తెలిపారు. తమ ట్యూటోరియల్స్కు రిజిస్ట్రేషన్ చేయించుకోవడానికి సిద్ధంగా ఉన్నామన్నారు. రిజిస్ట్రేషన్‌కు అవకాశమివ్వాలి తెలంగాణ రాష్ట్రంలో మాదిరిగా ట్యూటోరియల్స్కు రిజిస్ట్రేషన్ చేయించుకునే అవకాశం ఇవ్వాలి. అసంఘటిత రంగంలో ఉన్న వారి పిల్లలకు ఇంగ్లిష్ మీడియం కోరికను మా ట్యుటోరియల్స్ తీరుస్తున్నాయి. సేవాభావంతో మంచి విద్య అందిస్తున్నాం. చట్టవ్యతిరేకంగా కాకుండా హైకోర్టు ఆదేశాల మేరకు మేమంతా ట్యూటోరియల్స్‌ను నడుపుతున్నాం. - స్వరూప్, హన్నా ట్యూటోరియల్స్, ఆదర్శనగర్ ట్యుటోరియల్స్‌తో ఉపాధి పొందుతున్నాం.. ట్యుటోరియల్స్ పెట్టి పిల్లలకు విద్యనందిస్తూ మేం కూడా ఉపాధి పొందుతున్నాం. మా ట్యుటోరియల్స్ నడపడానికి హైకోర్టు ఆదేశాలున్నా ఏటా విద్యాశాఖాధికారులు వేధిస్తున్నారు. గుర్తింపు లేదంటూ సీజ్ చేసిన మా ట్యుటోరియల్స్‌ను తక్షణమే తెరవాలి. అడ్మిషన్ల వేళ ఇలా హడావుడి చేసి మమ్మలను ఇబ్బంది పెట్టడం అన్యాయం. దీనిపై మేమంతా కోర్టును ఆశ్రయిస్తాం. -ఎం.డి.ఆలీఖాన్, శ్రీరాం ట్యుటోరియల్స్, ఊర్వశి జంక్షన్ తక్కువ ఫీజులతో విద్యనందిస్తున్నాం.. మా దగ్గర చదివే పిల్లలకు తక్కువ ఫీజులతోనే విద్యను అందిస్తున్నాం. 100 శాతం మంచి ఫలితాలే సాధిస్తున్నాం. చట్టప్రకారమే మా స్కూళ్లను నడుపుతున్నాం. మేం గుర్తింపు పొందని స్కూళ్ల జాబితాలోకి రాము. కానీ మాకు ముందస్తు నోటీసులైనా ఇవ్వకుండానే మా ట్యూటోరియల్స్‌ను మూసేస్తున్నారు. దీనివల్ల మా వద్ద చదివే పిల్లల తల్లిదండ్రులకు మా స్కూళ్లపై అనుమానం కలుగుతుంది. -కె.లక్ష్మి, శ్రీవిఘ్నేశ్వరా ట్యూటోరియల్స్, పెయిందొరపేట -
సర్కారీ స్కూళ్లా? లేక మద్యం షాపా?
విరిగిన గేట్లు...ఊడిన తలుపులు బడి ఆవరణలో మద్యం సీసాలు.. సిగరెట్ పీకలు అపరిశుభ్రంగా మరుగుదొడ్లు, మూత్రశాలలు స్వీపర్లుగా మారిన చిన్నారులు సర్కారు బడుల్లో ‘తొలి రోజు’ దృశ్యాలివే... సాక్షి విజిట్‌లో వెలుగుచూసిన సమస్యలు... సిటీబ్యూరో: విరిగిన గేట్లు.. ఊడిన తలుపులు.. కంపుకొడుతున్న మరుగుదొడ్లు, మూత్రశాలలు.. చెత్తా చెదారంతో నిండుకున్న ఆవరణాలు.. దుమ్ము పట్టిన బెంచీలు. వేసవి సెలవుల తర్వాత కొండత ఆశతో సర్కారు బడి గడప తొక్కిన విద్యార్థులకు తొలి రోజు ఎదురైన స్వాగత తోరణాలవి. విద్యా సంవత్సరం మారినా.. సమస్యలు మాత్రం అలాగే ఉన్నాయి. వేసవిలో మరమ్మతులు చేపట్టాల్సిన అధికార యంత్రాంగం మిన్నకుండిపోవడంతో.. విద్యార్థులు అవస్థలు పడ్డారు. చివరకు తరగతి గదులూ ఊడ్చేనాథుడు లేక.. విద్యార్థులే చీపుర్లు చేతబట్టిన దృశ్యాలు కనిపించడం విచారకరం. మరోపక్క ప్రైవేటు పాఠశాలలు కొత్త హంగులు, ఆహ్లాదకర వాతావరణాన్ని కల్పించాయి. ‘వెల్కమ్ బ్యాక్ టు స్కూల్’ అంటూ సాదరంగా విద్యార్థులను ఆహ్వానించాయి. ఇందుకు భిన్నంగా సర్కారు బడులు.. సమస్యలతో వెక్కిరించడంతో విద్యార్థులకు నిట్టూర్పే మిగిలింది. జంట జిల్లాలలోని ప్రభుత్వ పాఠశాలల్లో సోమవారం నిర్వహించిన ‘సాక్షి’ విజిట్‌లో పలు సమస్యలు వెలుగుచూశాయి.... స్వచ్ఛ స్ఫూర్తి ఏది..? ప్రొఫెసర్ జయశంకర్ బడిబాట కార్యక్రమంలో భాగంగా ఈనెల 11న తేదీన ‘స్వచ్ఛ పాఠశాల’ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఇది తూతూమంత్రంగా కొనసాగిందనడానికి సోమవారం బడుల్లో కనిపించిన దృశ్యాలే సాక్ష్యం. సింహభాగం పాఠశాలల్లో స్వచ్ఛ స్ఫూర్తి కనిపించలేదు. తరగతి గదుల్లో చెత్తాచెదారం పేరుకపోయింది. బెంచీలు దుమ్ముపట్టి ఉండడంతో విద్యార్థులే తుడుచుకుని సర్దుకపోయారు. చివరకు కొన్ని బడుల్లో పిల్లలే గంట మోగించారు. మరోపక్క మూత్రశాలలు, మరుగుదొడ్లు అపరిశుభ్రతకు చిరునామాగా నిలవడంతో.. ఆరుబయటి బాట పట్టారు. విద్యార్థుల సంఖ్యకు అనుగుణంగా బెంచీలు లేకపోవడంతో.. నేలపై కూర్చున్నారు. తరగతి గదుల కొరతతో.. నాలుగైదు తరగతుల విద్యార్థులు ఒకే గదిలో గడిపారు. కొన్ని బడుల్లో రూ. లక్షలు ఖర్చుచేసి ఏర్పాటు చేసిన వాటర్ ఫిల్టర్లు చెడిపోయినా.. బాగుచేయలేదు. పలు పాఠశాలలు అసాంఘిక కార్యక లాపాలకు అడ్డాలుగా మారినా.. అధికారులు ఏం చేయలేక పోతున్నారు. బలపం పట్టిన చిన్నారులు.. అన్ని సర్కారు బడుల్లో సామూహిక అక్షరాభ్యాసం చేపట్టారు. కొన్ని స్కూళ్లలో అనూహ్య స్పందన రాగా.. మరికొన్నింటిలో విద్యార్థుల జాడ కరువైంది. పెద్ద ఎత్తున ప్రజాప్రతినిధులు, విద్యాశాఖాధికారులు దగ్గరుండి విద్యార్థులతో అక్షరాలు దిద్దించారు. ఈనెల 7 నుంచి 12వ తేదీ వరకు హైదరాబాద్ జిల్లాలో 4,923 మంది చిన్నారులు కొత్తగా బడిబాట పట్టారు. 13వ తేదీన ఒక్కరోజే 2,645 మంది తమ పేర్లను నమోదు చేయడం విశేషం. ఇక తొలిరోజు దాదాపు అన్ని పాఠశాలల్లో ఉచిత పాఠ్యపుస్తకాలు అందచేశారు. ఇది కాస్త సంతోషించాల్సిన విషయంగా చెప్పొచ్చు. మద్యం సీసాలు.. సిగరెట్ పీకలు అంబర్‌పేట/నాగోలు: గోల్నాక గంగానరగ్లోని ఉన్నత పాఠశాలలో అసాంఘిక కార్యకలాపాలకు అడ్డాగా మారింది. దీంతో చేసేదేమీలేక విద్యార్థులు సర్దుకుపోవాల్సి వచ్చింది. మద్యం బాటిళ్లు, కాల్చిన సిగరేట్ పీకలు మొదటి అంతస్తు మెట్లపై దర్శనమిచ్చాయి. ఇక్కడే ఉన్న ప్రాథమిక పాఠశాల ముందు ప్రమాదకరంగా ట్రాన్స్ఫార్మర్ దర్శనమివగా.. మరో ప్రాథమిక పాఠశాల ముందు చెత్త డంపింగ్‌యార్డు ఉంది. అలాగే సీపీఎల్ బాయ్స్ ఉన్నత పాఠశాలలో గతేడాది అదనపు భవనం కోసం తవ్విన గుంతలు ఇప్పటికి అలాగే ఉండడంతో విద్యార్థులు బిక్కుబిక్కుమంటూ పాఠశాలలకు హజరయ్యారు. నాగోలు డివిజన్ ఫతుల్లాగూడలో సరైన ప్రహారీ లేకపోవడంతో ప్రభుత్వ పాఠశాల మందుబాబులకు పానశాలగా మారింది. పాఠశాలకు వెళ్లిన పిల్లలకు మద్యం సీసాలు కనిపించడంతో అవాక్కయ్యారు. -
మళ్లీ బడికి
నేటి నుంచి పాఠశాలలు పునఃప్రారంభం ఏ ఏటికాయేడు కలగా మిగులుతున్న వసతుల కల్పన డీఎస్సీ నియామకాలు పూర్తయినా ప్రగతి శూన్యం యూనిఫాం పంపిణీపై నిర్ణయం తీసుకోని ప్రభుత్వం వచ్చినా స్కూళ్లకు చేరని 21లక్షల పాఠ్య పుస్తకాలు గుంటూరు ఎడ్యుకేషన్ : వేసవి సెలవుల అనంతరం పాఠశాలలు సోమవారం నుంచి పునఃప్రారంభమవుతున్నాయి. సెలవులను సరదాగా గడిపిన విద్యార్థులు పుస్తకాలు చేతపుచ్చుకుని తిరిగి పాఠశాలకు వెళ్లాల్సిన సమయం ఇది. ప్రభుత్వం పాఠశాలలను అభివృద్ధి పర్చేందుకు కోట్లాది రూపాయలు ఖర్చు చేస్తున్నామని చెబుతున్నా, క్షేత్రస్థాయిలో పరిస్థితులు అందుకు భిన్నంగా ఉన్నాయి. విద్యార్థులకు సరిపడా తరగతి గదులు, బెంచీలు, సురక్షిత తాగునీరు, మరుగుదొడ్లు కల్పన ఏ ఏటికాయేడు కలగానే మిగిలి పోతోంది. డీఎస్సీ-2014 నియామకాల ద్వారా జిల్లాలో ఉపాధ్యాయుల కొరత తీరుతుందని భావించినా అది సఫలీకృతం కాలేదు. 671 మంది సెకండరీ గ్రేడ్ టీచర్లలో 322 మందికి పాఠశాలల్లో ఖాళీలు లేవని పోస్టింగ్స్ కల్పించకపోవడం అవరోధంగా మారింది. పాఠశాలలు తెరిచిన రోజునే విద్యార్థులకు పాఠ్య పుస్తకాలు పంపిణీ చేస్తామని చెప్పిన ప్రభుత్వం దానిని ఎంత వరకు నెరవేర్చుతుందనేది అనుమానమే. జిల్లాలోని ప్రభుత్వ, గుర్తింపు పొందిన పాఠశాలల్లో చదువుతున్న 6.50 లక్షల మంది విద్యార్థులకు అవసరమైన 26,37,753 పాఠ్య పుస్తకాల్లో జిల్లాకు 21 లక్షలు వచ్చాయి. మిగిలిన పుస్తకాలు ఎప్పటికి వస్తాయో తెలియని పరిస్థితి ఏర్పడింది. వచ్చిన పాఠ్య పుస్తకాలు ఇప్పటి వరకు పాఠశాలలకు చేరలేదు. ప్రభుత్వ, జెడ్పీ, మున్సిపల్ పాఠశాలల్లో ఒకటి నుంచి 8వ తరగతి వరకు చదువుతున్న 2.50 లక్షల మంది విద్యార్థులకు ఒక్కొక్కరికీ రెండు జతల ఉచిత యూనిఫాం పంపిణీ గతి తప్పింది. గత విద్యా సంవత్సరంలో ఇవ్వాల్సిన యూనిఫాంను చివర్లో ఇచ్చిన ప్రభుత్వం ప్రస్తుత విద్యా సంవత్సరానికి సంబంధించి ఇప్పటి వరకు ప్రణాళిక సిద్ధం చేయలేదు. పాఠశాలల్లో మరుగుదొడ్ల నిర్మాణం అధ్వానంగా మారింది. నిర్వహణకు కేటాయించిన నిధులను ప్రభుత్వం పక్క దారి పట్టించింది. సురక్షిత తాగునీటి కల్పనలో ప్రగతి శూన్యంగా ఉంది. జిల్లాలోని 400 ప్రభుత్వ, జెడ్పీ ఉన్నత పాఠశాలల్లో దాతల సహకారంతో ఏర్పాటు చేసిన ఆర్వో ప్లాంట్లు మినహా, 3600 ప్రాథమిక, ప్రాథమికోన్నత పాఠశాలల్లో తాగునీటి సరఫరాకు చేపట్టిన చర్యలు శూన్యం. నూతన తరగతి గదుల నిర్మాణాలు చేపట్టడంలో ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోంది. జిల్లాలోని 300 పాఠశాలల్లో చేపట్టిన అదనపు తరగతి గదుల నిర్మాణాలు నత్తనడకన సాగుతున్నాయి. 641 కిచెన్ షెడ్లు నిర్మించాలనే లక్ష్యానికి ఒక్కటీ పూర్తి కాలేదు. -
ఆటలకు టాటా..బడిబాట
నేడు పాఠశాలలు పున:ప్రారంభం బడి గడప తొక్కనున్న 15 లక్షల మంది విద్యార్థులు పంపిణీకి సిద్ధంగా ఉచిత పుస్తకాలు సర్కారు స్కూళ్లలో సమస్యలతో స్వాగతం వేసవి సెలవులు ముగిశాయి..బడి గంట మోగింది. ఆట పాటలు...విహార యాత్రలకు ఫుల్స్టాప్ పెట్టి విద్యార్థులు సోమవారం నుంచి బడిబాట పట్టనున్నారు. దాదాపు 50 రోజులపాటు రిలాక్స్‌గా ఉన్న తల్లిదండ్రులు ఇక పిల్లల విద్యాభ్యాస హడావుడిలో మునిగితేలనున్నారు. కొత్త విద్యాసంవత్సరానికి వెల్కం చెప్పేందుకు పాఠశాలలు, కళాశాలలు సన్నద్ధమయ్యాయి. ప్రైవేట్ స్కూళ్ల మాట అటుంచితే..సర్కార్ యథావిధిగా సమస్యల మధ్యే మళ్లీ తెరుచుకోబోతున్నాయి. - సాక్షి సిటీబ్యూరో సిటీబ్యూరో: ఇన్నాళ్లు ఆట పాటలు, తాత, అమ్మమ్మ, నానమ్మలతో హాయిగా గడిపిన విద్యార్థులు బడిబాట పట్టేందుకు సన్నద్ధం అవుతున్నారు. వేసవి సెలవుల తర్వాత పుస్తకాలతో కుస్తీ పట్టేందుకు అడుగులు వేస్తున్నారు. సోమవారంతో అడుగిడుతున్న కొత్త విద్యా సంవత్సరంలో ఎప్పటిలాగే అన్ని పాఠశాలలు పున:ప్రారంభం కానున్నాయి. గ్రేటర్ పరిధిలో ప్రభుత్వ, ప్రైవేటు స్కూళ్లకు చెందిన దాదాపు 15 లక్షల మంది బడి గడప తొక్కనున్నట్లు అంచనా. నాలుగైదు రోజుల క్రితమే కొన్ని ప్రైవేటు స్కూళ్లు పునఃప్రారంభించగా.. మిగిలినవి 13న తెరచుకోనున్నాయి. సమస్యల లోగిళ్లలో సర్కారు స్కూళ్లు హైదరాబాద్ జిల్లాలో 688, రంగారెడ్డి జిల్లాలో 2,250 ప్రభుత్వ ప్రాథమిక, ప్రాథమికోన్నత, ఉన్నత పాఠశాలలు ఉన్నాయి. వీటిలో అధిక శాతం పాఠశాలల్లో ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్న చందంగా సమస్యలు పేరుకపోయాయి. మరుగుదొడ్లు, మూత్రశాలలకు మరమ్మతులు చేపట్టడంలో ప్రభుత్వం విఫలమైందని ఆరోపణలు వస్తున్నాయి. మరికొన్ని బడుల్లో సౌకర్యాలు ఉన్నా వినియోగించుకోవడానికి నీటి కొరత సమస్యగా మారింది. నీరు లేకపోవడంతో ఇవి అలంకారప్రాయంగా మారి శిథిలావస్థకు చేరుకుంటున్నాయి. చాలా పాఠశాలలకు ప్రహరీలు, మౌలిక వసతులు కరువయ్యాయి. వేసవిలో ఈ పనులు చేపట్టాల్సి ఉండగా.. ఒక్క అడుగూ ముందుకు పడలేదు. నాలుగు రోజుల క్రితం చేపట్టిన బడిబాట కార్యక్రమంలో భాగంగా తూతూమంత్రంగా పనులు చేశారు. ఇవి తాత్కాలికమే. ఏడాదంతా వీటి నిర్వహణ ఏంటన్న ప్రశ్నకు అధికారుల వద్ద సమాధానం లేదు. తాగునీటి వసతికి నోచుకోని స్కూళ్లు వందల సంఖ్యలో ఉన్నాయి. పాఠశాలల్లో తరగతి గదులను ఊడ్చే వారే కరువయ్యారు. స్వీపర్లు లేకపోవడంతో ఎక్కడి చెత్త అక్కడే అన్నట్లుగా బడులు దర్శనమిస్తున్నాయి. నైట్ వాచ్మెన్లూ దిక్కులేరు. ఈ క్రమంలో నూతన విద్యా సంవత్సరంలో బడుల్లో అడుగుపెట్టే విద్యార్థులకు ఎప్పటిలాగే సమస్యలు స్వాగతం పలకనున్నాయి. పుస్తకాలు సిద్ధం.. హైదరాబాద్ జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలలకు 13.52 లక్షలు, రంగారెడ్డి అర్బన్ ప్రాంతంలోని స్కూళ్లకు 11.02 లక్షల ఉచిత పాఠ్య పుస్తకాలు ఈ విద్యాసంవత్సరానికి అవసరం. ఈ మొత్తం 24.54 లక్షల పుస్తకాల్లో దాదాపు 23 లక్షల పుస్తకాలు ప్రస్తుతం అందుబాటులో ఉన్నాయి. వీటిని ఇప్పటికే ఆయా స్కూళ్లకు చేర్చారు. వీటిని పాఠశాలలు పునఃప్రారంభమైన రోజు నుంచే విద్యార్థులకు అందజేస్తామని అధికారులు చెప్పారు. మరో పక్క ప్రైవేటు పాఠశాలల విద్యార్థుల కోసం నిర్దేశిత ధరతో పాఠ్య పుస్తకాలను అధీకృత దుకాణాలకు ప్రభుత్వం పంపిణీ చేసింది. ఆథరైజ్డ్ దుకాణాలు మాత్రమే వీటిని ఎమ్మార్పీ ధరలకు విక్రయించాల్సి ఉంటుంది. మరింత ప్రణాళికాబద్ధంగా.. విద్యా సంవత్సరం ప్రారంభం నుంచి మరింత ప్రణాళికాబ్ధంగా, పకడ్బందీగా ముందుకు వెళ్లేందుకు సమాయత్తం అవుతున్నామని హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల డీఈఓలు సోమిరెడ్డి, రమేష్‌లు వెల్లడించారు. 90 శాతానికి పైగా పుస్తకాలు బడులకు చేరాయని తెలిపారు. తొలిసారి బడికి ఇలా..... బడి వయసు రాకముందే.... అందరూ బడికి వెళ్లే తొలిరోజు భయపడితే...నేను మాత్రం బడి వయసు రాకముందే స్కూళ్లో అడుగుపెట్టా. ఏడ్చి మరీ అక్కతో కలిసి పాఠశాలకు వెళ్లా. 3 వ తరగతి నుంచి పీజీ వరకు...కేవలం ఎనిమిది రోజులే క్లాస్‌లకు గైర్హాజరయ్యా. చదువంటే నాకు అంత ఇష్టం మరి... -డాక్టర్ జనార్దన్‌రెడ్డి, జీహెచ్ఎంసీ కమిషనర్ అమ్మతో కలిసి వెళ్లా... చిన్నప్పుడు...మొదటిసారి అమ్మతో కలిసి స్కూల్కెళ్లా. బడికి వెళ్లేందుకు నేను ఎప్పుడూ భయపడలేదు. మా ఇంట్లో ఎక్కువగా స్టడీ బేస్డ్ చర్చలు జరిగేవి. మా ఫ్యామిలీలో అందరూ విద్యావంతులు కావడంతో నాకు ఎడ్యుకేషన్‌పైన మొదటి నుంచీ ఆసక్తి పెరిగింది... - రాహుల్ బొజ్జా, హైదరాబాద్ జిల్లా కలెక్టర్ -
ఈ-పాఠశాలతో కాలేజీకి గుర్తింపు!
♦ విద్యా సంస్థలకు యూజీసీ, న్యాక్, ఎన్సీఆర్టీ వంటి గుర్తింపు సేవలు ♦ అడ్మిషన్లు, పరీక్షలు, ఫలితాలు కూడా అందిస్తున్న స్టార్టప్ ♦ 400లకు పైగా విద్యా సంస్థలకు సేవలు 2 నెలల్లో యూఎస్, సింగపూర్, ♦ దక్షిణాసియాలకు విస్తరణ సాక్షి, హైదరాబాద్: వేసవి సెలవులు ముగిసి.. స్కూళ్లు, కాలేజీలు తెరిచే సమయం వచ్చేసింది. ఏ తల్లిదండ్రులైనా తమ పిల్లాడిని కాలేజీలో చేర్పించాలంటే ముందుగా చూసేది టీచర్లెవరు? గత విద్యా సంవత్సరంలో ఎన్ని ర్యాంకులొచ్చాయి? ఎంత మంది పాసయ్యారు? కాలేజీకి ఏ గ్రేడుందని!! దీన్లో ర్యాంకులు.. మార్కులనేవి టీచర్ల బోధన, విద్యార్థుల ప్రతిభ బట్టి ఉంటాయి. మరి కాలేజీగ్రేడ్ల సంగతేంటి? అంటే యూజీసీ, న్యాక్, ఎన్బీఏ, ఏఎంబీఏ, ఎన్సీఆర్టీ వంటి సంస్థలిచ్చే గ్రేడ్లు పొందేదెలా? నిజానికి వీటి గుర్తింపు పొందాలంటే చాతాండతం పని ఉంటుంది. కళాశాల సెల్ఫ్ స్టడీ రిపోర్ట్ (ఎస్ఎస్ఆర్) నుంచి మొదలుపెడితే ఉపాధ్యాయుల ప్రతిభ, విభాగాల సంఖ్య, ఫీజులు, గత రెండేళ్ల ఫలితాలు, బడ్జెట్, విద్యార్థుల ఫీడ్‌బ్యాక్, సంస్థ మాస్టర్‌ప్లాన్, ఆడిటర్ రిపోర్ట్ వంటి బోలెడంత సమాచారాన్ని అందించాల్సి ఉంటుంది. అందుకే చాలా విద్యా సంస్థలు వీటికి దూరంగా ఉంటాయి. దీన్నే వ్యాపార అవకాశంగా మార్చుకుంది ‘ఈ-పాఠశాల’! ఈ స్టార్టప్ అందించే సేవల వివరాలు సంస్థ కో-ఫౌండర్ సుమన్ నంది మాటల్లోనే... రూ.10 లక్షల పెట్టుబడితో బెంగళూరు కేంద్రంగా 2014లో ‘ఈ-పాఠశాల’ను ఆరంభించాం. క్లౌడ్ ఆధారంగా పనిచేసే ఈఆర్పీ సొల్యూషనే మా ప్రత్యేకత. అంటే గ్రేడ్ల కోసం మాన్యువల్ ప్రాసెస్ అవసరం లేకుండా టెక్నాలజీ ద్వారా పరిష్కారం చూపిస్తామన్నమాట. అడ్మిషన్ నుంచి ఆలూమినీ వరకూ..: విద్యా సంస్థలకు గ్రేడ్లను అందించడమే కాక కళాశాల బోధనేతర సేవలు... అంటే విద్యార్థి అడ్మిషన్ నుంచి మొదలుపెడితే మెంటరింగ్, ప్రొఫైల్ మ్యాపింగ్, అకడమిక్ ప్రోగ్రెస్, ప్లేస్మెంట్, ఫీడ్‌బ్యాక్, అలూమినీ వరకూ ప్రతీ ఒక్కటీ చేసిపెడతాం. ఆన్లైన్లో సిలబస్, పరీక్షలు, ఫలితాలూ ప్రకటిస్తాం. బోధనేతర సేవల్లో మా ప్రత్యేకత ఏంటంటే.. కళాశాలలో అందరికీ ప్రత్యేకంగా ఒక డాష్‌బోర్డ్‌ను ఇస్తాం. అంటే ప్రిన్సిపల్, ఉపాధ్యాయులు, విద్యార్థి ఇలా ఒక్కో బోర్డ్ ఉంటుందన్నమాట. ఇందులో ప్రిన్సిపల్ డాష్‌బోర్డ్‌లో అడ్మిషన్లు, ప్లానింగ్, ఫీజులు, హాజరు శాతం, పరీక్షలు, గుర్తింపు.. వివరాలుంటాయి. ఉపాధ్యాయుల బోర్డ్‌లో.. డె డ్లైన్ ఐక్యూఏసీ, రికార్డ్‌లు ఉంటాయి. విద్యార్థుల బోర్డ్‌లో పరీక్షల తేదీలు, ఫలితాలు, ఫీజులు వంటివి ఉంటాయి. తల్లిదండ్రులకు ఎస్ఎంఎస్లు..: ప్రెడిక్టివ్ అనలిటిక్స్ విధానం ద్వారా ఒకో విద్యార్థి ఏ అంశంలో వెనకబడ్డాడో బేరీజు వేస్తాం. ఒకో విభాగంలో వాళ్ల ప్రదర్శన ఎలా ఉందో కొలతలు తీస్తాం. ఆ సమాచారాన్ని తల్లిదండ్రులు, టీచర్ల ముందు పెడతాం. దీనికి తోడు పిల్లల ప్రవర్తన, పరీక్షల టైం టేబుల్, ఇతర ముఖ్య విషయాలకు సంబంధించిన ప్రతి అంశాన్నీ ఎప్పటికప్పుడు తల్లిదండ్రులకు ఎస్ఎంఎస్, ఈమెయిళ్ల రూపంలో అందిస్తాం. ధరలు రూ.50 వేల నుంచి..: ఈ-పాఠశాల ఏం చేస్తుందంటే.. ఆయా సంస్థలు వాటి ప్రమాణాలేంటి? ఉత్తమమైన గ్రేడ్లు పొందేందుకు ఎలాంటి ఏర్పాట్లు చేయాలో 360 డిగ్రీల్లో సూచనలిస్తాం. అంటే కళాశాల క్వాలిటీ, ఎక్కడ వసతులు బాగాలేవో.. ఏం చేయాలో సూచిస్తాం. బడ్జెట్, ఆడిటింగ్ రిపోర్టుల్లో ఉన్న తేడాలను గుర్తించి సరిదిద్దుతాం కూడా. ఇవి రూ.50 వేల నుంచి 5 లక్షల వరకు ఉంటాయి. 400లకు పైగా కాలేజీలకు..: ఇప్పటివరకు 400లకు పైగా కాలేజీలు మా సేవలు వినియోగించుకుంటున్నాయి. హైదరాబాద్ నుంచి 12 ఉన్నాయి. ఇప్పటివరకు పలువురు ప్రైవేట్ ఇన్వెస్టర్ల నుంచి రెండు రౌండ్లలో నిధులను సమీకరించాం. వీటి సాయంతో వచ్చే రెండునెలల్లో అమెరికా, సింగపూర్, దక్షిణాసియా ప్రాంతాలకు విస్తరిస్తాం. అద్భుతమైన స్టార్టప్‌ల గురించి అందరికీ తెలియజేయాలనుకుంటే startups@sakshi.com కు మెయిల్ చేయండి... -
విరామం విహారం
కాస్త ముందుగానే ఎండలు తగ్గుముఖం పట్టే అవకాశం కనిపిస్తోంది. కనీసం ఈ నెలలో అయినా వేసవి సెలవులు ఆస్వాదించే అవకాశం భానుడు కల్పిస్తే సద్వినియోగం చేసుకోవాల్సిందే. రొటీన్ మూడ్ నుంచి బయటపడటానికి టూర్ వేసేయాల్సిందే....ఇలా అనుకుంటుంటే మీ వీకెండ్ టూర్ లిస్ట్‌లో చేర్చాల్సిన మరో డెస్టినేషన్ కరీంనగర్ జిల్లాలోని రామగిరి ఖిల్లా. - హన్మకొండ కల్చరల్ చరిత్రకు సాక్ష్యం... రత్నగర్భగా పేరొందిన ఈ కోట కాకతీయుల కాలంలో సైనిక స్థావరంగా ఉండేది. కాకతీయులు, బహుమనీ సుల్తానులు, కులీ కుతుబ్‌షాహీలు దీనిని పాలించిన దాఖలాలున్నాయి. దీని గురించి పురాణాల్లో సైతం ప్రస్తావించినట్లు చరిత్రకారులు చెబుతుంటారు. రామయణ మహాకావ్యంలో, కాళిదాసు మేఘసందేశంలోనూ దీని ప్రస్తావన ఉందంటారు. 4 ప్రవేశ ద్వారాలు, 4 కోట గోడలతో నిర్మించిన పటిష్టమైన ఈ దుర్గంలో 3 ప్రాకారాలు ఇప్పటికీ చూడొచ్చు. కొండ మీద ఉన్న ఈ కోటకు చేరుకోవడానికి కష్టపడాల్సిందే. ట్రెక్కింగ్ చేస్తూ పైకి ఎక్కి చూస్తే మానేరు, గోదావరిలో కలిసే అద్భుత దృశ్యం కనువిందు చేస్తుంది. కనుచూపు మేర రమ్యమైన పరిసరాలు... కోట వైభవాన్ని లీలగా గుర్తు చేస్తూ నాటి వైభవం సాక్షిగా నేడో కొత్త ప్రపంచంలోకి వచ్చినట్లు అనిపిస్తుంది. సీతారామలక్ష్మణులు వనవాస సమయంలో ఇక్కడికి వచ్చారనే నమ్మకం తో భక్తులు ఈ ప్రదేశానికి వస్తుంటా రు. రాముడు ప్రతిష్టించిన లింగం, శ్రీసీతారాముల పాద ముద్రలుగా చెప్పే అడుగుల ముద్రలు కోట ఆవరణలో కనిపిస్తాయి. సీతమ్మ కొలను, రామపాదాలు, సీతారాముల ఆల యం, చిన్న జలపాతం.. ఇలా ఈ కోటలో విశేషాలెన్నో. అక్కడ మిగిలి ఉన్న అవశేషాలను బట్టి కొన్ని భవనా లు, బురుజులు, మసీదులు, సమాధు లు, ప్రతాపరుద్రుని కోట, అశ్వగజశాలలుగా పోల్చుకోవచ్చు. జైలు, భోజనశాల, రహస్యమార్గాలు, ఫిరంగులు కూడా కనిపిస్తాయి. ఈ కోటలో తోపుబావి, నల్లకయ్యబావి, పసరుబావి, హరిబావి, అచ్చమ్మబావి, అమ్మగారిబావి ఇలా అనేక బావులు, కొలనుల నెలవు ఈ ప్రదేశం. అనేక బురుజులు, ఆలయాలు, ప్రవేశద్వారాలున్న ఈ రామగిరి కోటకు టూరిస్టులు మాత్రమే కాకుండా స్థానికులు కూడా తరచూ పిక్నిక్కి వస్తుంటారు. వన మూలికల వేదిక ఆయుర్వేద వన మూలికలకు నిలయంగా ఈ ప్రదేశానికి పేరు. అందుకే టూరిస్టులు, స్థానికులు, సాహసికులే కాదు ఆయుర్వేద వైద్యులు, బోటనీ విద్యార్థులు కూడా తరచూ సందర్శిస్తుంటారు. అయితే చీకట్లో ఈ ప్రాంతానికి వెళ్లటం శ్రేయస్కరం కాదు. హైదరాబాద్‌కు 215 కి.మీ దూరంలో ఉందీ ఖిల్లా. కరీంనగర్ జిల్లా పెద్దపల్లి, మంథని దారిలో బేగంపేట గ్రామ పరిసరాల్లో ఈ కోట ఉంది. -
విదేశాల్లో శ్రీవారి వైభవోత్సవాలకు కార్యాచరణ
♦ అధికారులతో సమీక్షలో టీటీడీ ♦ తిరుపతి జేఈవో పోలా భాస్కర్ తిరుపతి అర్బన్/తిరుమల: తిరుమల శ్రీవారి వైభవాన్ని విశ్వవ్యాప్తం చేసే క్రమంలో భాగంగా శ్రీవేంకటేశ్వర స్వామివారి వైభవోత్సవాలను విదేశాల్లో నిర్వహించేందుకు కార్యాచరణ ప్రణాళిక రూపొందిస్తున్నామని టీటీడీ తిరుపతి జేఈవో పోలా భాస్కర్ వెల్లడించారు. శనివారం అధికారులతో ఆయన సమీక్షించారు. ఈ సందర్భంగా జేఈవో మాట్లాడుతూ విదేశాల్లో ఎప్పుడు స్వామివారి వైభవోత్సవాలను నిర్వహించినా వారాంతంలో రెండురోజుల పాటు నిర్వహించేలా ప్రణాళికలు తయారు చేయాలన్నారు. వైభవోత్సవాల్లో భాగంగా ఏర్పాటు చేసే నమూనా ఆలయాల్లో శ్రీవారి మూలవిరాట్, ఉత్సవ మూర్తుల విగ్రహాలను నూతనంగా తయారు చేయాలని చీఫ్ ఇంజినీర్ చంద్రశేఖర్ రెడ్డికి జేఈవో సూచించారు. నిర్ధేశిత విభాగాల నుంచి 30 మంది సిబ్బందికి మించకుండా విదేశీ యాత్రకు సిద్ధంగా ఉండాలన్నారు. వెంకన్న దర్శనానికి 12 గంటలు వేసవి సెలవులతో తిరుమల భక్తులతో కిటకిటలాడుతోంది. శనివారం ఎక్కడ చూసినా భక్తుల సందడి కనిపించింది. సర్వదర్శనం కోసం వచ్చిన భక్తులతో రెండో వైకుంఠం క్యూకాంప్లెక్స్‌లో 31 కంపార్టుమెంట్లు నిండి వెలుపల కిలోమీటరు మేర క్యూ ఉంది. వీరికి 12 గంటల తర్వాత స్వామి దర్శనం లభిస్తోంది. కాలిబాట భక్తులకు 8 గంటల తర్వాత స్వామి దర్శనం కలగనుంది. -
2 నుంచి హైకోర్టుకు వేసవి సెలవులు
అత్యవసర కేసుల విచారణకు నాలుగు వెకేషన్ కోర్టులు సాక్షి, హైదరాబాద్: ఉమ్మడి హైకోర్టుకు మే 2 నుంచి 31 వరకు వేసవి సెలవులు ప్రకటించారు. ఈ సమయంలో అత్యవసర కేసుల విచారణకు నాలుగు వెకేషన్ కోర్టులు ఏర్పాటు చేశారు. మే 5, 12, 19, 26 తేదీల్లో ఈ వెకేషన్ కోర్టులు పనిచేస్తాయని రిజిస్ట్రార్ జనరల్ సి.హెచ్.మానవేంద్రనాథ్ ఓ ప్రకటనలో తెలిపారు. 5న న్యాయమూర్తులు జస్టిస్ ఎ.రాజశేఖరరెడ్డి, జస్టిస్ ఎ.శంకరనారాయణలతో కూడిన ధర్మాసనం, జస్టిస్ ఎం.సత్యనారాయణమూర్తి సింగిల్ జడ్జిగా కేసులను విచారిస్తారు. 12న న్యాయమూర్తులు జస్టిస్ పి.వి.సంజయ్‌కుమార్, జస్టిస్ ఎస్.వి.భట్‌లతో కూడిన ధర్మాసనం, జస్టిస్ సి.ప్రవీణ్‌కుమార్ సింగిల్ జడ్జిగా వ్యవహరిస్తారు. 19న జస్టిస్ పి.నవీన్‌రావు, జస్టిస్ ఎం.ఎస్.కె.జైశ్వాల్‌లతో కూడిన ధర్మాసనం, జస్టిస్ యు.దుర్గాప్రసాదరావు సింగిల్ జడ్జిగా కేసులు విచారిస్తారు. 26న జస్టిస్ ఎ.వి.శేషసాయి, జస్టిస్ ఎం.సీతారామ్మూర్తిలతో కూడిన ధర్మాసనం, జస్టిస్ బి.శివశంకరరావు సింగిల్ జడ్జిగా కేసులు విచారిస్తారు. అత్యవసర కేసులు దాఖలు చేయాలనుకునేవారు మే 3, 10, 17, 24 తేదీల్లో పిటిషన్లు దాఖలు చేసుకోవాల్సి ఉంటుంది. -
రక్తనిధి ఖాళీ..
► ఎండలు..వేసవి సెలవుల ఎఫెక్ట్ ► ఐపీఎం సహా అంతటా నిండుకున్న రక్తం నిల్వలు ► అత్యవసర పరిస్థితుల్లో రక్తం దొరక్క రోగులకు తప్పని ఇబ్బంది సాక్షి, సిటీబ్యూరో రక్త నిధి కేంద్రాల్లో రక్తం నిల్వలు నిండుకున్నాయి. ఆపదలో రక్తనిధి కేంద్రానికి వెళ్లిన వారికి నిరాశే ఎదురవుతోంది. సకాలంలో అవసరమైన బ్లడ్‌గ్రూప్ దొరక్క క్షతగాత్రులు, గర్భిణులు, తలసీమియా బాధితులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ప్రస్తుతం నగరంలో తీవ్రంగా ఉండటంతో త్వరగా నీరసించే ప్రమాదం ఉంది. దీనికి తోడు కళాశాలలకు వేసవి సెలవులు ప్రారంభం కావడంతో ఐపీఎం సహా రెడ్‌క్రాస్ సొసైటీ, వైఎంసీఏ, లయన్స్ క్లబ్ వంటి స్వచ్చంధ సంస్థలు రక్తదాన శిబిరాలు నిర్వహించిన ఆశించిన స్థాయిలో దాతలు ముందుకు రావడం లేదు. నారాయణగూడలోని ఐపీఎం సహా నగరంలోని అన్ని ప్రధాన ఆస్పత్రుల్లోని రక్తనిధి కేంద్రాల్లో రక్త నిల్వలు నిండుకోవడంతో రోగులు అవస్థలు పడుతున్నారు. క్షతగాత్రులకు ప్రాణగండం రోడ్డు ప్రమాదాల్లో తీవ్రంగా గాయపడిన వారిని చికిత్స కోసం ఉస్మానియా, గాంధీ, నిమ్స్, కేర్, యశోద, కామినేని, కిమ్స్ వంటి ఆసుపత్రులకు ఎక్కువగా తీసుకువస్తారు. పురిటి నొప్పులతో బాధపడుతున్న వారిని సుల్తాన్‌బజార్, పేట్లబురుజు ప్రసూతి ఆస్పత్రులకు తరలిస్తున్నారు. అధిక రక్తస్త్రావంతో బాధపడుతున్న వీరికి శస్త్రచికిత్సల సమయంలో రెండు నుంచి మూడు యూనిట్ల రక్తం అవసరమవుతోంది. అత్యవసర పరిస్థితుల్లో రక్తనిధి కేంద్రాలకు వెలితే స్టాకు లేదని తిప్పిపంపతున్నారు. ఒక వే ళ ఉన్నా..బాధితుని బంధువుల్లో ఎవరో ఒకరు ర క్తదానం చేస్తేకానీ అవసరమైన గ్రూపు రక్తాన్ని ఇవ్వబోమంటూ మెలిక పెడుతున్నారు. సకాలంలో రక్తం దొరకకపోవడంతో గాంధీ, ఉస్మానియా, నిలోఫర్ ఆస్పత్రుల్లో శస్త్రచికిత్సలు వాయిదా పడుతుండటం పరిస్థితి తీవ్రతకు అద్దం పడుతోంది. ప్రైవేటు బ్లడ్‌బ్యాంకులు దాతల నుంచి సేకరించిన రక్తంలో 30 శాతం ప్రభుత్వ ఆస్పత్రులకు సరఫరా చేయాలన్న నిబంధన ఉన్నా పట్టించుకోకపోగా, కొందరు ప్రైవేటు బ్లడ్‌బ్యాంకుల నిర్వాహకులు, కార్పొరేట్ ఆస్పత్రులు దాతల నుంచి సేకరించిన రక్తాన్ని రూ.1500-2500 వరకు విక్రయిస్తుండటం గమనార్హం. బాధితులకు అవస్థలు: అలీంబేగ్, సంయుక్త కార్యదర్శి, తలసీమియా అండ్ సికిల్ సెల్ సొసైటీ నగరంలో సుమారు మూడు వేల మంది తలసీమియా బాధితులు ఉన్నారు. వీరిలో ప్రతి ఒక్కరికీ ప్రతి 15-20 రోజులకోసారి రక్తం ఎక్కించాల్సి ఉంటుంది. రోజుకు 30-40 యూనిట్ల రక్తం అవసరం. రక్తదాన శిబిరాలు ఏర్పాటు చేస్తే..ఎండకు భయపడి ఎవరూ ముందుకు రావడం లేదు. రోగులకు రక్తం సరఫరా చేయడం మాకు చాలా కష్టంగా మారింది. గత్యంతరం లేక చాలా మంది తల్లిదండ్రులు తమ పిల్లల కోసం ప్రైవేటు బ్లడ్ బ్యాంకుల నుంచి రక్తాన్ని కొనుగోలు చేస్తున్నారు. -
కుమార్తెను రమ్మని చెప్పి వస్తుండగా...
తల్లి మృతి... కొత్తూరు : వేసవి సెలవులతో పాటు గ్రామంలో బంధువుల వివాహానికి పాఠశాలలో చదువుతున్న కుమార్తెను ఇంటికి పిలిచి తిరిగి వస్తుండగా మార్గమధ్యలో వివాహిత దుర్మరణం పాలైంది. భర్త మిన్నారావు, బంధువులు, పోలీసులు చెప్పిన వివరాలు...భామిని మండలం అత్తికొత్తూరుకు చెందిన తందాడ రమణమ్మ(35) పాతపట్నంలో చదువుతున్న తన కుమార్తె లావణ్యను ఇంటికి తీసుకువచ్చేందుకు అక్కడి వసతిగృహానికి శుక్రవారం వెళ్లింది. అక్కడి అధికారులు శనివారం పంపిస్తామని చెప్పడంతో రమణమ్మ తిరుగు ప్రయాణమైంది. మార్గమధ్యలో రమణమ్మ గ్రామానికి చెందిన ఇద్దరు వ్యక్తులు బైక్‌పై వస్తుండగా ఇంటికి వస్తానని చెప్పడంతో ఆ యువకులు ఆమెను కూడా బైక్‌పై ఎక్కించారు. బైక్‌పై వస్తుండగా బంకి గ్రామ సమీపంలో బైక్ పైనుంచి రమణమ్మ జారి పడడంతో అక్కడికక్కడే మృతి చెందింది. 108 వాహనంలో స్థానిక ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకురాగా అప్పటికే మృతి చెందినట్టు వైద్యాధికారిణి సునీత తెలిపారు. రమణమ్మకు భర్త మిన్నారావు, కుమార్తె లావణ్య, కుమారుడు సోమేశ్వరరావు ఉన్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నటుట హెచ్‌సీ సింహాచలం తెలిపారు. -
వేసవి సెలవుల్లోనూ మధ్యాహ్న భోజనం
* హైదరాబాద్ మినహా అన్ని జిల్లాల్లో అమలుకు సర్కారు నిర్ణయం * మండల, నియోజకవర్గ కేంద్రాల్లోనే గురుకుల పాఠశాలల ఏర్పాటు * జూన్ నుంచే రెసిడెన్షియల్ స్కూల్స్ ప్రారంభించేలా చర్యలు * విద్యా శాఖ ఉన్నతాధికారులతో సమీక్షలో డిప్యూటీ సీఎం కడియం సాక్షి, హైదరాబాద్: వేసవి సెలవుల్లోనూ ప్రభుత్వ పాఠశాలల్లో మధ్యాహ్న భోజనం అందించాలని సర్కారు నిర్ణయించింది. హైదరాబాద్ జిల్లా మినహా రాష్ట్రంలోని అన్ని జిల్లాలు, మండలాల్లో ఈ పథకాన్ని కొనసాగించాలని నిర్ణయించినట్లు ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి వెల్లడించారు. మధ్యాహ్న భోజన పథకం అమలు, రెసిడెన్షియల్ స్కూళ్ల ఏర్పాటు అంశాలపై సచివాలయంలో శనివారం వివిధ శాఖల ఉన్నతాధికారులతో ఆయన సమీక్షించారు. ఎస్సీ అభివృద్ధి శాఖ మంత్రి జగదీశ్వర్‌రెడ్డి, గిరిజన సంక్షేమ శాఖ మంత్రి చందూలాల్ సమీక్షలో పాల్గొన్నారు. అనంతరం సమీక్ష వివరాలను కడియం వివరించారు. కరువు పరిస్థితులు నెలకొన్న ప్రాంతాల్లోని ప్రభుత్వ పాఠశాలల్లో 1 నుంచి 8వ తరగతుల విద్యార్థులకు మాత్రమే మధ్యాహ్న భోజన పథకాన్ని మరో 42 రోజుల పాటు కొనసాగించాలని కేంద్రం సూచించినట్లు చెప్పారు. అయితే ప్రకటించిన 231 కరువు మండలాలతో అన్ని ప్రాంతాల్లోనూ ఈ పథకాన్ని అమలు చేయాలని, 9, 10 తరగతుల విద్యార్థులకు కూడా అందించాలని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు ఆదేశించినట్లు తెలిపారు. సెలవు రోజుల్లో ఈ పథకం అమలు, బాధ్యతల అప్పగింతపై ఈ నెల 18న అన్ని జిల్లాల కలెక్టర్లతో జరగనున్న వీడియో కాన్ఫరెన్స్‌లో నిర్ణయిస్తామన్నారు. సెలవు రోజుల్లో ఉదయం 9 గంటలకు విద్యార్థులు బడికి వస్తే గంట పాటు ఆటపాటలు గానీ, తరగతులు గానీ నిర్వహించి, 10 గంటలకు భోజనం పెట్టి 11 గంటల్లోపు ఇళ్లకు పంపేలా ప్రణాళికలు రూపొందించినట్లు తెలిపారు. మండల కేంద్రాల్లో రెసిడెన్షియల్ స్కూళ్లు కేజీ టు పీజీ ఉచిత విద్య అమల్లో భాగంగా ఎస్సీ, ఎస్టీ, బీసీ విద్యార్థుల కోసం రాష్ట్రంలో 250 గురుకుల (రెసిడెన్షియల్) పాఠశాలలను ప్రభుత్వం ఏర్పాటు చేయబోతోందని కడియం శ్రీహరి చెప్పారు. ప్రభుత్వం ఏర్పాటు చేయనున్న రెసిడెన్షియల్ స్కూల్స్ మండల లేదా నియోజకవర్గ కేంద్రాల్లోనే ఉండేలా చర్యలు చేపట్టామన్నారు. ప్రస్తుతం పాఠశాలలు ఉన్న ప్రాంతంలో కాకుండా ఎస్సీ, ఎస్టీ, బీసీ జనాభా ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో ఈ స్కూళ్లను ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. ఈ నెల 20న ఆయా శాఖల అధికారులతో జరిగే సమావేశంలో పాఠశాలలు ఏర్పాటు చేసే ప్రాంతాలపై తుది నిర్ణయం తీసుకుంటామన్నారు. ఒక్కో గురుకుల పాఠశాలకు రూ.22కోట్లు వెచ్చించనున్నామని, ఏ ప్రాంతంలోనైనా ప్రభుత్వ స్థలం లేకపోయినట్లయితే పాఠశాల కోసం ఐదెకరాల భూమిని కొనుగోలు చేస్తామన్నారు. ఒక్కో పాఠశాలకు 640 మంది చొప్పున మొత్తం 1.60 లక్షల మంది విద్యార్థులకు ఇంగ్లిష్ మీడియంలో 5 నుంచి 12వ తరగతి వరకు చదువుకునే అవకాశం లభిస్తుందన్నారు. రెసిడెన్షియల్ పాఠశాలలను 2016-17 విద్యా సంవత్సరం నుంచే ప్రారంభిస్తామన్నారు. తొలి ఏడాది 5 నుంచి 8 తరగతులు, రెండో సంవత్సరం 9, 10, మూడో సంవత్సరంలో ఇంటర్మీడియట్ తరగతులు ప్రారంభమవుతాయన్నారు. నియోజకవర్గ కేంద్రాల్లో ఏర్పాటు చేయనున్న డిగ్రీ కాలేజీల్లోనూ తొలి ఏడాది ఫస్టియర్‌ను ప్రారంభించి మూడేళ్లలో పూర్తిస్థాయిలో నిర్వహించేలా చర్యలు చేపట్టామన్నారు. -
వేసవి సెలవుల్లోనూ మధ్యాహ్న భోజనం
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలో వేసవి సెలవుల్లోనూ విద్యార్థులకు మధ్యాహ్న భోజనం పథకం అందిస్తున్నట్లు డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి తెలిపారు. హైదరాబాద్‌లో శనివారం ఆయన మాట్లాడుతూ...ఒకటి నుంచి పదో తరగతి వరకు ఉన్న విద్యార్థులకు మధ్యాహ్న భోజనం ఇస్తున్నామన్నారు. దీనిపై ఈ నెల 18న కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించనున్నట్లు కడియం చెప్పారు. పెరుగుతున్న ఎండల దృష్ట్యా నేటి నుంచి తెలంగాణ వ్యాప్తంగా స్కూల్ విద్యార్థులకు వేసవి సెలవులు ప్రకటించిన విషయం తెలిసిందే. -
రేపటి నుంచే స్కూళ్లకు వేసవి సెలవులు
ఎండల తీవ్రత దృష్ట్యా తెలంగాణ సర్కార్ నిర్ణయం సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో ఎండల తీవ్రత రోజురోజుకూ పెరుగుతున్న నేపథ్యంలో అన్ని ప్రభుత్వ, ప్రైవేటు, ఎయిడెడ్ పాఠశాలలకు శనివారం (16వ తేదీ) నుంచి జూన్ 12 వరకు వేసవి సెలవులుగా ప్రభుత్వం ప్రకటించింది. ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి అధ్యక్షతన గురువారం సాయంత్రం జరిగిన సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. షెడ్యూల్ ప్రకారం ఈనెల 24 నుంచి సెలవులు ప్రారంభం కావాల్సి ఉన్నా ఎండల తీవ్రత వల్ల ముందే సెలవులివ్వాలని నిర్ణయించినట్లు కడియం తెలిపారు. జూన్ 13న తిరిగి పాఠశాలలు ప్రారంభమవుతాయని వివరించారు. సెలవులు పాటించని పాఠశాలలపై కఠిన చర్యలు చేపడతామని కడియం హెచ్చరించారు. -
వారం ముందే పిల్లలకు పండుగ!
హైదరాబాద్: ఓవైపు ఎండలు ధుమధుమలాడిపోతుండటంతో స్కూలు పిల్లలకు ముందుగానే సెలవులు వచ్చేశాయ్. మండిపోతున్న ఎండలకు ఆపసోపలు పడుతూ.. బరువైన బ్యాగులు మోస్తూ కష్టాలు పడుతూ పాఠశాలలకు వెళుతున్న విద్యార్థులకు తెలంగాణ ప్రభుత్వం కాస్త ఉపశమనం కలిగించింది. ఎండలు, వడగాడ్పుల నేపథ్యంలో వారం ముందుగానే వేసవి సెలువులు ప్రకటించింది. వారం రోజులు ముందుగానే తెలంగాణ రాష్ట్రంలోని స్కూళ్లకు వేసవి సెలవులు ఇవ్వనున్నారు. ఈ నెల 24 కు బదులు 16వ తేదీ నుంచే రాష్ట్రంలోని పాఠశాలలకు సెలవులిచ్చేయమని ఉన్నతాధికారులు గురువారం ఆదేశాలు జారీ చేశారు. రాష్ట్రంలో ప్రచండంగా వీస్తున్న వడగాల్పుల దృష్ట్యా విపత్తు నిర్వహణ సంస్థ సూచనల మేరకు విద్యాశాఖ అధికారులు ఈ నిర్ణయం తీసుకున్నారు. వచ్చే విద్యా సంవత్సరానికి సంబంధించి జూన్ 13వ తేదీన తిరిగి పాఠశాలల ప్రారంభం కానున్నాయి. -
వారం ముందే వేసవి సెలవులు?
ఎండల తీవ్రత నేపథ్యంలో సర్కారు యోచన సాక్షి, హైదరాబాద్: రోజు రోజుకూ ఎండల తీవ్రత పెరుగుతున్న నేపథ్యంలో... రాష్ట్రంలోని పాఠశాలలకు వారం రోజుల ముందే వేసవి సెలవులు ప్రకటించే దిశగా రాష్ట్ర ప్రభుత్వం యోచిస్తోంది. ఆయా జిల్లాల్లో పరిస్థితిని బట్టి ఈ సెలవులపై నిర్ణయం తీసుకునేలా కలెక్టర్లకు అధికారం ఇవ్వాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఇటీవల ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజీవ్‌శర్మ ఆధ్వర్యంలో జరిగిన సమావేశంలోనూ ఈ అంశం చర్చకు వచ్చింది. ఉపాధ్యాయ సంఘాలు కూడా ఈనెల 10వ తేదీ నుంచే పాఠశాలలకు వేసవి సెలవులు ప్రకటించాలని కోరుతున్నాయి. దీనిపై ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరికి, విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి రంజీవ్ ఆర్ ఆచార్యకు వినతి పత్రాలు అందజేశాయి. ఈ నేపథ్యంలో వారం ముందే సెలవులు ప్రకటిస్తే బాగుంటుందన్న దిశగా చర్చ జరిగినట్లు తెలిసింది. అయితే రాష్ట్రవ్యాప్తంగా అన్ని పాఠశాలలకు ఒకేసారి వేసవి సెలవులు ప్రకటించాలా, లేక ఆయా జిల్లాల్లో పరిస్థితులను బట్టి జిల్లాల పరిధిలో సెలవులు ప్రకటించేలా చర్యలు చేపట్టాలా? అన్న అంశం తెరపైకి వచ్చింది. జిల్లాల పరిధిలో సెలవులను ప్రకటించే అధికారాన్ని కలెక్టర్లకు ఇవ్వాలని ఆలోచిస్తున్నట్లు తెలుస్తోంది. మొత్తానికి రెండు మూడు రోజుల్లో దీనిపై అధికారికంగా నిర్ణయం వెలువడే అవకాశముంది. ఈనెల 14న అంబేడ్కర్ జయంతి, 15న శ్రీరామనవమి సందర్భంగా సెలవులు వచ్చాయి. దీంతో శనివారం దీనిపై నిర్ణయం వెలువడే అవకాశం ఉంది. పాత షెడ్యూల్ ప్రకారం 23వ తేదీ వరకు పాఠశాలలు నడుస్తాయి. ముందే సెలవులు ఇస్తే.. ఈ సోమవారం లేదా మంగళవారం నుంచే వేసవి సెలవులు అమల్లోకి వస్తాయి. మధ్యాహ్న భోజనం పెట్టేదెవరు? రాష్ట్రంలో 231 కరువు మండలాల్లోని ప్రభుత్వ పాఠశాలల్లో వేసవి సెలవుల్లోనూ మధ్యాహ్న భోజనం పెట్టాలని ప్రభుత్వం ఇదివరకే నిర్ణయించింది. అయితే వేసవి సెలవుల్లో ఉపాధ్యాయులెవరూ బడులకు రారు. దీంతో విద్యార్థులకు పెట్టే భోజనం పర్యవేక్షణ ఎవరు చూడాలన్న దానిపై విద్యాశాఖ తర్జన భర్జన పడుతోంది. ఉపాధ్యాయులను పాఠశాలలకు రప్పించి మధ్యాహ్న భోజనంతోపాటు ఇతర పాఠశాల అభివృద్ధి కార్యక్రమాలను చేయించాలా, లేక క్లస్టర్ రిసోర్స్ పర్సన్లతో చేయించాలా, లేక గ్రామ పంచాయతీలకే అప్పగించాలా? అన్న అంశాలపై ఆలోచనలు చేస్తోంది. టీచర్లను వేసవి సెలవుల్లో పాఠశాలల్లో పనిచేయిస్తే వారికి పనిచేసినన్ని రోజులు సంపాదిత సెలవులు (ఎర్న్డ్ లీవ్స్) ఇవ్వాల్సి వస్తుంది. రాష్ట్రంలోని 1.25 లక్షల మంది టీచర్లకు అలా ఇవ్వాలంటే ఒక్క నెలకే దాదాపు రూ.300 కోట్ల వరకు వెచ్చించాల్సి వస్తుంది. అది ప్రభుత్వానికి భారమయ్యే నేపథ్యంలో.. ఏం చేయాలన్న అంశంపై విద్యాశాఖ తర్జనభర్జన పడుతోంది. -
ఆట, పాటలకే ప్రాధాన్యం
ఎండాకాలం సెలవులు వస్తున్నాయంటే చాలు. ఎంతో సంతోషంగా ఉండేది. సెలవుల్లో అమ్మా నాన్నలతో కలిసి దేశంలోని పర్యాటక ప్రాంతాలు తిరిగేవాళ్లం. 5 నుంచి పదో తరగతి చదివే వరకు భరతనాట్యం, వీణ, కర్ణాటక సంగీతం నేర్చుకున్నా. వీడియో గేమ్స్‌తో ఎంజాయ్ చేశా. కొన్ని రోజులు అమ్మమ్మ వాళ్ల దగ్గరికి వెళ్లి అక్కడ వ్యవసాయ పొలాలు చూశా. నేను తొమ్మిదో తరగతి పూర్తికాగానే ఉత్సాహంతో సెలవుల్లోనే పదో తరగతి పుస్తకాలు చదివా. వేసవి సెలవులను ఎంతో సంతోషంగా గడిపాను. - తాండూరు ఏఎస్పీ చందనదీప్తి... ఈ ఫొటోలో భరతనాట్యం చేస్తున్న బాలికను గుర్తుపట్టారా? అదేనండీ.. తాండూరు ఏఎస్పీ చందనదీప్తి. వేసవి సెలవుల్లో తన చిన్ననాటి అనుభవాలను బుధవారం ‘సాక్షి’తో పంచుకుంది. వేసవి సెలవులు వచ్చాయంటే పర్యాటక స్థలాలను సందర్శించడంతో పాటు భరతనాట్యం, వీణ, కర్ణాటక సంగీతం నేర్చుకునే దానిని. వీడియో గేమ్స్ ఆడుతూ ఎంజాయ్ చేశా. కొన్ని రోజులు అమ్మమ్మ ఇంటికి వెళ్లి, అక్కడ వ్యవసాయ పొలాలను చూడడం, అక్కడే ఆడుకునేందుకు ఇష్టపడేదాన్ని. అమ్మమ్మ రోజూ రామాయణం, భారతం గురించి చెబుతుంటే ఎంతో ఆసక్తిగా వినేదాన్ని. నాన్న గనుల శాఖలో ఉద్యోగం చేసేవారు. ఉద్యోగం రీత్యా తను చిత్తూరు, నల్గొండ తదితర జిల్లాలో పనిచేశారు. దీంతో అక్కడే నా బాల్యం కొనసాగింది. అక్కడి స్నేహితులతో కలిసి వేసవి సెలవుల్లో షటిల్, క్రికెట్ ఆడా. ఇంకా తెలుగు, ఇంగ్లిష్‌లో పద్యాలు కూడా రాశా. బాల్యం ఓ తీపి గుర్తు. చిన్నప్పుడు స్నేహితులతో కలిసి ఆడుకోవడం ఓ మరిచిపోలేని అనుభూతి. -
37 ప్రైవేట్ కళాశాలలకు నోటీసులు
సాక్షి,సిటీబ్యూరో: ప్రభుత్వ నిబంధనలకు వ్యతి రేకంగా వేసవి సెలవుల్లో తరగతులు నిర్వహిస్తున్న ప్రైవేట్ కళాశాలలకు అధికారులు నోటీసులు జారీ చేశారు. హైదరాబాద్ జిల్లాలో ఐదు టాస్క్ ఫోర్స్ బృందాలు 12,13 తేదీల్లో దాడు లు నిర్వహించారు. సెలవుల్లో తరగతులు నిర్వహిస్తున్న 37 కళాశాలల్లో తనిఖీలు నిర్వహించి షోకాజ్ నోటీసులు జారీ చేశారు. నోటీసులు అందుకున్న జాబితాలో పలు ప్రముఖ కళాశాలలు ఉన్నాయి. మెహిదీపట్నం తార్నాక, సంతోష్‌నగర్, న్యూనల్లకుంట, నల్లకుంటలోని నారాయణ జూనియర్ కళాశాలలు, డీడీ కాలనీ,ఎస్ఆర్నగర్, సైదాబాద్ల్లోని శ్రీచైతన్య, బర్కత్‌పురా,చార్మినార్‌లలోని గాయత్రీ, లక్డీకాపూల్‌లో తపస్వీ, మలక్‌పేట్‌లో ఎంఎస్, సైదాబాద్‌లో శ్రీనివాస, హిమాయత్‌నగర్‌లో గురు, సంతోష్‌నగర్‌లో గౌతమి, ఎస్ఆర్నగర్లో సీఎంఎస్ థామస్ జూనియర్ కళాశాలలకు నోటీసులు జారీచేసినట్టు అధికార వర్గాలు తెలిపాయి. -
సమ్మర్ సెలవులు లేదా వేసవి హాలిడేస్...
సరదా సంసారం ప్రశాంతంగా ఆ మధ్యాహ్నాన్ని తెలుగులో డబ్ చేసిన హాలీవుడ్ సినిమా చూస్తూ అర్థవంతం చేద్దామనుకుంటూ ఉండగా ‘కిచక్’ అని సౌండ్ వచ్చింది. ‘కాదు... అది పచక్’ అని మా ఆవిడ ఆ తర్వాత వాదించిందిగాని మొత్తం మీద సౌండైతే వచ్చింది. నా పై ప్రాణాలు పైనే పోయాయి. ‘ఏమండీ... ఈ ఎల్లో సరిపోతుందా’ అంది మా ఆవిడ నా దగ్గరకు వచ్చి కలిపిన శనగపిండిని చూపిస్తూ. ఆమెనే ఆరాధనగా చూశాను. ఎవరైనా ఉప్పు సరిపోయిందా పచ్చి మిర్చి సరిపోయిందా అని అడుగుతారు. ఎల్లో సరిపోయిందా అని అడగడం ఏ భర్తకైనా అరుదుగా దొరికే ఆనందబాష్పకణం. ‘ఇప్పుడు ఈ రిస్క్ ఎందుకు పెట్టుకున్నావ్ చెప్పూ’ అన్నాను. ‘అదేమిటండీ... పిల్లలకు సెలవులు కదా. ఆడుకుంటున్నారు. కాసేపటికి సాయంత్రమవుతుంది. చిరుతిండి ఏదైనా అడిగితే ఏం పెట్టను? అందుకని మసాలా వడలు చేద్దామనుకుంటున్నాను. ఏడో క్లాస్‌లో ఒకసారి అమ్మమ్మ చేస్తుంటే చూశాను. అప్పుడు తను పొయ్యి మీద బాండిల్ పెట్టి వీటిని చేసిన గుర్తు’... ‘చేశాక నాకు పెట్టవు కదూ. దొంగ... చెప్పు... పెట్టవు కదూ’... ‘భలేవారే. మొదటి వడ మీరే తినాలి. ఈ హార్లిక్స్ సీసా ఎక్కడుందో’ ‘ఏమిటి... పిండిలో హార్లిక్స్ కలుపుతావా?’ ‘భలేవారే. నాకు ఆ మాత్రం తెలియదా. అందులో సోడా ఉప్పు దాచేనండీ’... కిచెన్‌లోకి వెళ్లిపోయింది. ప్రశాంతంగా ఆ మధ్యాహ్నాన్ని తెలుగులో డబ్ చేసిన హాలీవుడ్ సినిమా చూస్తూ అర్థవంతం చేద్దామనుకుంటూ ఉండగా ‘కిచక్’ అని సౌండ్ వచ్చింది. ‘కాదు... అది పచక్’ అని మా ఆవిడ ఆ తర్వాత వాదించిందిగాని మొత్తం మీద సౌండైతే వచ్చింది. నా పై ప్రాణాలు పైనే పోయాయి. ఎందుకంటే అలాంటి లలితమైన సౌండ్లు మా చిన్నాడే చేస్తాడు. పరిగెత్తుకుంటూ చిల్డ్రన్స్ బెడ్రూమ్లోకి వెళ్లాను. ల్యాప్‌టాప్‌లో నుంచి తేలికపాటి పొగ వస్తోంది. వాడు విజయం సాధించినట్టుగా గంభీరంగా నవ్వుతున్నాడు. పెద్దాడు బిక్కముఖం వేసుకొని చూస్తున్నాడు. ఫ్లాష్‌కట్: ల్యాప్‌టాప్ ఓపెన్ చేసి ‘మోటూ పత్లూ’ పెద్దాడు చూస్తున్నాడు. కాదు ‘షౌన్ ద షీప్’ చూడాలని చిన్నాడు ముచ్చటపడ్డాడు. పెద్దాడు వినలేదు. చిన్నాడు ఎర్రగడ్డలో కొన్న బ్లూ కలర్ ప్లాస్టిక్ బ్యాట్ తీసుకొని ల్యాప్‌టాప్ మీద పట్టుదలగా ‘పుటుక్’మని కొట్టాడు. యూకు ట్యూబ్ పోయింది. నా సెన్సెక్స్ పతనమయ్యింది. మా ఆవిడ ఏం అనలేదు. నా వైపు చూసి ‘అప్పుడే చెప్పాను. అనుభవించండి’ అంది. ‘ఏదో నా తప్పులా మాట్లాడుతున్నావ్?’ ‘మీ తప్పు కాదా. పెద్దాణ్ణి చూడండి ఎంత బుద్ధిగా ఉంటాడో! ఎందుకు?.. వాడి కాన్పు మా పుట్టింట్లో అయ్యింది కాబట్టి. రెండో కాన్పు కూడా మా పుట్టింట్లోనే చేద్దామండీ పిల్లలు బుద్ధిగా ఉంటారంటే విన్నారా? ఊహూ.. మా ఊళ్లో మా ఫ్యామిలీ డాక్టర్ భానుకట్ల విజయతోనే చేయించాలన్నారు. ఇప్పుడేమైంది? విజయ్ మాల్యాలాగా తయారయ్యాడు. మీ ఇళ్లల్లో పిల్లలంతా అంతేగా... కింగ్‌కాంగ్ వర్సెస్ గాడ్జిల్లా’ ‘శారదా’... ‘శంకర్ శాస్త్రీ’... ఆ అరుపుకు బిక్క చచ్చాను. ‘ఏం... మీకేనా గొంతు. మాకు లేదా. మేం మాత్రం మిరియాల పాలు తాగడం లేదా. మీరు ఎంత పెద్దగా అరిచినా వాస్తవం వాస్తవమే. మీ అన్నయ్య పిల్లలు, చెల్లెలి పిల్లలు, తమ్ముడి పిల్లలు... హవ్వ.. హవ్వ... దేశీయ స్టెంట్ కంపెనీలన్నీ మీ పేరు చెప్పుకునే కదండీ బతుకుతున్నాయి. వీళ్ల అల్లరికే కదా మీ ఊళ్లో నిక్షేపంలా ఉన్నవాళ్లంతా గుండెకి ఒక స్టెంటు రెండు స్టెంట్లూ వేసుకొని తిరుగుతున్నారు.’... లాభం లేదు ఎదురుదాడి చేయాల్సిందే.‘ఆ మాటకొస్తే మీవాళ్ల పిల్లలు మాత్రం తక్కువా? మొన్న మీ ఊరి పేరు పేపర్లో వేశారు చూళ్లేదా? మీ ఊళ్లోకి ఒక్క కోతి కూడా రావడం లేదని విడ్డూరంగా రాశారు. మీ కొండముచ్చులుండగా కోతులెందుకొస్తాయ్? వాటి సేఫ్టీ అవి చూసుకోవూ’ ‘మాటలు నేర్చిన యాంకర్ వాట్సప్ అంటే థమ్సప్ అదంట. అలా ఉంది మీరు మాట్లాడటం’ ‘ఖుదా మెహర్బాన్తో గధా పహిల్వాన్.. అలా ఉంది నువ్వు చెప్పడం’... ‘నాకు హిందీ రాదని ఆ భాషలో వాగకండి’.. ‘ఇంకా వాగుతాను. పోవే ఖాందన్.. ఘరోండా... జ్యోతీ బనేగీ జ్వాలా.. ఖూన్ కా రిష్తా’.... అవన్నీ ఏవో భారీ బూతు తిట్లు అనుకుని చిన్న పామునైనా పెద్ద కర్రతోనే కొట్టాలని మా ఆవిడ ఆ ఏర్పాట్లలోకి వెళ్లింది. ఈలోపు హాల్లో నుంచి మళ్లీ ఏవో మృదువైన శబ్దాలు రావడం మొదలెట్టాయి. పరిగెత్తి చూశాను. వంశాంకురాలిద్దరూ టీవీ దగ్గర ఉన్నారు. స్టార్ మూవీస్ చూడాలని పెద్దాడు.. డిస్నీ ఎక్స్‌డి చూడాలని చిన్నాడు... సున్నితమైన చర్యలతో ఒకరి పై మరొకరు పై చేయి సాధించడానికి ప్రయత్నిస్తున్నారు. అమీర్‌పేట సర్దార్జీ షాపులో కొన్న టేబుల్ టెన్నిస్ బ్యాట్ చిన్నాడి చేతిలో సిద్ధంగా ఉంది... ‘శారదా’ పెద్దగా అరిచాను. ‘శంకరశాస్త్రి’... మా ఆవిడ జవాబిచ్చింది.ఇక ఈ వేసవి హాలిడేస్ జాలీ జాలీగా గడవబోతున్నందుకు ఎంతో రొమాంచితంగా అనిపించింది. - భా.బా (భార్యా బాధితుడు) తాజా కలం: గీతాకారుడిలా సెలవిస్తున్నాడు... పార్థా! డాబర్ వారి చాందీసోనా చవన్‌ప్రాశ్ రెండు పూటలా రెండు చెంచాలు పుచ్చుకొనుము. వీలైనచో పచ్చిపాలు తాగి బస్కీలు తీయుము. వేసవి సెలవుల్లో భార్యా పిల్లలను ఎదుర్కొనడానికి నాకు తెలిసినది చెప్పాను. నీకు తెలిసినదుంటే నాకు తెలియజేయుము. -
ఎవరు నీవారు... ఎవరు నావారు...
సరదా సంసారం ఆ సాయంత్రం మా ఆవిడ నేను అడక్కుండానే ఐస్ వాటర్ తెచ్చిచ్చింది. ‘ఎందుకు?’ అన్నాను. ‘మిమ్మల్ని ఐస్ చేయడానికి’ అంది గోముగా. తెలుగు వీక్లీ నవలల్లో చదవడం తప్ప ఈ గోముగా అనే ఎక్స్ప్రెషన్ను పెళ్లయ్యేదాకా ఎరగను. పెళ్లయ్యాక.. ఇదిగో... ఏవైనా పనులు సాధించుకోవాలంటే మా ఆవిడ నుంచి ఈ ఎక్స్‌ప్రెషనే వస్తుంటుంది. ‘చెప్పు’ అన్నాను. ‘రమణి వస్తానంది’ అంది. ‘రమణి ఎవరు?’ అన్నాను. ‘శేఖర్ కూడా ఫోన్ చేశాడు. టికెట్లు ఆల్రెడీ బుక్ చేసుకున్నారట. పింకీ, బుజ్జీ అయితే యమా హుషారుగా ఉన్నారట. ఇక టామీ అయితే తోక ఊపుతూనే ఉందట’ ‘ఎవరీ దొంగల ముఠా?’ ‘అంతేలేండీ మా వాళ్లనేసరికి దొంగల ముఠా. మీ వాళ్లేమో ఎస్.పి.రంజిత్ కుమార్ వారసులు’... ‘సంగతి ఏడు’ ‘ఏడ్చినా ఎనిమిదించినా ఈ వేసవి సెలవలకు మా చెల్లెలు బావ పిల్లలు కుక్క టామీ వస్తానని ఫిక్స్ అయ్యారు. నేను కూడా అయ్యాను. కనుక మీరు కూడా కావాల్సిందేనని అవక తప్పదని అవనని మొండికేస్తే తగు ప్రత్యామ్నాయాలు గదిలోకి తీసుకెళ్లి వీలైనంత సామరస్యంగా చూపుతానని ఆ విధంగా మనవి చేస్తున్నాను’... నేను కోపంగా చూడటానికి ప్రయత్నించాను. ముక్కు ఎర్రగయ్యింది తప్ప కళ్లు ఎర్రగా కాలేదు. ‘ఈ వేసవికి నావాళ్లను పిలుస్తానని చెప్పాను కదా. మా అన్నయ్య వదిన పిల్లలూ, మా అత్త కొడుకు కన్నబాబు వాడి ఉత్తరాది భార్య చున్నీబాయ్, మా చెల్లెలు సుగుణమణి’.... నేను చెప్తూనే ఉన్నాను... మా ఆవిడ విసవిసా వెళ్లి గుప్పెడు బియ్యం తెచ్చి నిలబడింది. ‘నా మాట వినకపోయారో ఈ బియ్యం తిని చస్తా’... ‘బియ్యం తింటే చస్తారా ఎవరైనా?’ నవ్వాను. ‘పిచ్చి మొగుడా... ఇవి బియ్యం అనుకుంటున్నావా. మన ప్రభుత్వాల అప్రమత్తత వల్ల కల్తీవ్యాపారులకు నూకలు కలిపే వీలులేక పట్టుబడతామన్న భయంతో అసలు బియ్యమే లేకుండా అల్యుమినియం, క్రోమియం, కాడ్మియం, ఘోరేనియం... తీగలను బియ్యంలా కట్ చేసి తయారు చేసిన కృత్రిమ బియ్యం. వీటి ప్రత్యేకత ఏమంటే తిన్నాక ఏ కార్పొరేట్ హాస్పిటల్‌కు తీసుకెళ్లినా ఏడు లక్షలా అరవై ఎనిమిది వేల బిల్లు చేయిస్తే తప్ప ఒంట్లో నుంచి బయటకు రావు. అదీగాక బోనస్‌గా తమతో పాటు తిన్న శాల్తీని కూడా పట్టుకుపోతాయి. బోలో... ఖావూ క్యా’... హిందీలో బెదిరించింది. నేను దీనంగా చూశాను. ‘అంటే ఈ దేశంలో ఏ మగాడికైనా వేసవి సెలవల్లో తన వాళ్లను పిలుచుకుని నాలుగు రోజులు ఉంచుకునే భాగ్యం లేదా’ ‘ఎందుకండీ అంతంత కఠినమైన మాటలు అంటారు. విన్నవాళ్లు నేనెంత కఠినాత్మురాలినో అని ఆడిపోసుకోడానికా? పద్నాలుగేళ్ల క్రితమే కదా మీ వాళ్లు వచ్చిపోయారు. అప్పుడు నేను వాళ్లను బాగా చూసుకోలేదా? ఆరు మామిడిపండ్లు తెప్పించి నెలంతా కోసి పెట్టలేదా? ఒక సినిమాకు తీసుకెళ్లి ఇంటర్వెల్లోనే లాక్కొచ్చేశానే? అంతకంటే బాగా ఎవరు చూసుకుంటారు? మనం మంచాల మీద పడుకొని వాళ్లను చాపల మీద పడుకోనివ్వలేదా? హెందుకండీ నన్ను అన్నేసి మాటలంటారు’... నేను ఈ సంభాషణా చాతుర్యాన్ని తట్టుకోలేక టీవీ వాల్యూమ్‌ని పెంచాను. ఆమె కన్నీళ్లు తుడుచుకుంటూ ‘సాయంత్రం వస్తూ ఐదు వేలు పెట్టి ఎక్స్ట్రా హార్డ్ డిస్క్ కొనండి. మా రమణికి నాగార్జున సినిమాలన్నీ ఇష్టం. అదొచ్చే సరికి హార్డ్ డిస్క్‌లో అన్నీ కాపీ చేసి రెడీగా పెట్టాలి’... ‘ఇప్పటికప్పుడు ఐదు వేలంటే’... ‘సర్లేండి... మీక్కూడా ఒకటీ రెండు ట్రాజెడీ సినిమాలు లోడ్ చేసి చూపిస్తాను. హ్యాపీయేనా’... ఇక దింపుడుకళ్లెం ఆశే మిగిలింది. ‘ఒక పని చేద్దామా... సెలవుల్లో సగం రోజులు మీ వాళ్లను, రమ్మని సగం రోజులు మావాళ్లని రమ్మందామా’ మా ఆవిడ మళ్లీ కన్నీరు మున్నీరైంది. సపోర్టివ్‌గా కొంచెం కాళ్లూ చేతులూ కొట్టుకోవడం మొదలెట్టింది. ‘ఊరుకో... ఊరుకో... ఇప్పుడేమైందని’ కంగారుగా అన్నాను. కొంచెం తమాయించుకుంటూ అంది. ‘మీకు తెలియదా అండీ?.. పెళ్లయిన తొలినాటి రాత్రే మీకు ప్రమాణం చేయలేదా నేనూ?... ఇవాళ్టి నుంచి నా వాళ్లంతా మీవాళ్లనీ... నా వాళ్లంతా నా వాళ్లేనని మీకు ప్రమాణం చేయలేదా... చెప్పండి... చెప్పం...డీ’.... మళ్లీ ఎక్కడ కాళ్లుచేతులు కొట్టుకుంటుందోనని ‘చెప్పావ్... చెప్పావ్’... ఒప్పుకున్నాను. అంతేకాదు... ఆమె కన్నీరుకు నేను మున్నీరవుతూ రాబోయే నావాళ్ల కోసం మటన్ తెచ్చి ఫ్రిజ్‌లో పెట్టడానికి స్కూటర్ తాళాలు అందుకున్నాను. - భా.బా (భార్యా బాధితుడు) తాజాకలం: గీతాకారుడు ఇలా సెలవిస్తున్నాడు... పార్థా... అత్తమామలను ఆదరింపుము. భార్య మాట చచ్చినట్టు విని బావమరిదికి శ్రీమంతుడు సైకిల్ కొనిపెట్టుము. మరదలి కుటుంబాన్ని స్టేషన్ నుంచి ఊబర్‌లో సలక్షణముగా తోడ్కొని రమ్ము. అప్పుడుగాని నీ ఊర్థ్వలోకముల సంగతి ఎటుల ఉన్నా గృహలోకము యందు మాత్రం తప్పక శాంతి చేకూరును. -
వేసవి సెలవుల్లోనూ.. మధ్యాహ్న భోజనం
► 19 కరువు మండలాల్లో అమలు ► 75,820 మంది విద్యార్థులకు లబ్ది కరీంనగర్ ఎడ్యుకేషన్ : జిల్లాలోని కరువు మండలాల్లో వేసవి సెలవుల్లోనూ పాఠశాలల్లో విద్యార్థులకు మధ్యాహ్న భోజన పథకాన్ని కొనసాగించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణరుుంచింది. జిల్లాలో 57 మండలాలుగా ఉండగా.. జిల్లా అధికార యంత్రాంగం 40 కరువు మండలాల జాబితాను ప్రభుత్వానికి నివేదించింది. రాష్ట్ర ప్రభుత్వం మెట్టప్రాంతాల్లోని 19 మండలాలను మాత్ర మే కరువు మండలాలుగా గుర్తించింది. ఈ మండలాల్లో 75,820 మంది విద్యార్థులు ప్రభుత్వ పాఠశాలల్లో చదువుకుంటున్నారు. వీరికి ఏప్రిల్ 24 నుంచి జూన్ 11 వరకు వేసవి సెలవుల్లో మధ్యాహ్నభోజనం అందించనున్నారు. ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా తీవ్రమైన కరువు పరిస్థితులు కమ్ముకున్నందున పల్లె జనాలు బతుకుదెరువు కోసం వలసబాట పడుతున్నారు. ఇప్పటికే చాలా గ్రామాల్లో చిన్న పిల్లలను ఇంట్లో ఉన్న వృద్ధుల వద్ద వదిలి జవసత్వాలు ఉన్నవాళ్లంతా వలసబాట పట్టారు. దీంతో పిల్లలు కలో గంజో తాగుతూ పాఠశాలలకు వస్తున్నారు. ఈ నేపథ్యంలో మధ్యాహ్న భోజనం కొంతవరకు వారి ఆకలి తీర్చనుంది. 42 రోజుల పాటు నిర్వహణ ఏప్రిల్ 24 నుంచి జూన్ 11 వరకు వేసవి సెలవులు కొనసాగనున్నాయి. అంటే 42 రోజుల పాటు ఆయా పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థులకు మధ్యాహ్న భోజన వసతి కల్పిస్తారు. అయితే వంట బాధ్యతలు ఎవరికి అప్పగించాలనే దానిపై ఇంకా స్పష్టత రాలేదు. వేసవి సెలవుల్లో టీచర్లు బడికి వచ్చే ఆవకాశం లేనందున విద్యావాలంటీర్లు లేదా అంగన్వాడీలకు నిర్వహణ బాధ్యతలు అప్పజెప్పే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. అలాగే ప్రస్తుతం వంట చేస్తున్న సిబ్బందితోనే వేసవి సెలవుల్లో వంటలు వండించే అవకాశాలున్నారుు. పర్యవేక్షణ బాధ్యత మాత్రం ప్రధానోపాధ్యాయులకు అప్పగించే అవకాశం ఉంది. -
ఊరు వెళుతున్నారా .. చెప్పేసి వెళ్లండి
మీరు వేసవి సెలవులకు ఊరెళుతున్నారా.. ఇళ్ళకు తాళాలు వేసి ఎక్కడికన్న ప్రయాణం అవుతున్నారా అయితే దొంగలుంటారు జాగ్రత్త. కనీస జాగ్రత్త చర్యలు తీసుకొని ఊరెళ్లడం మంచిదని పోలీసులు సూచిస్తున్నారు. సెలవుల్లో యాత్రలు, సొంత గ్రామాలకు వెళ్లేవారు తగు జాగ్రత్తలు పాటిస్తే దొంగతనాలను నివారించవచ్చని రాజేంద్రనగర్ పోలీసులు పేర్కొంటున్నారు. వేసవి సెలవుల్లో ఇంటికి తాళం వేసి ఊరెళ్లే ఇళ్లనే దొంగలు లక్ష్యం చేసుకొనే ప్రమాదం ఉంది. తాళం వేసి ఉన్న ఇంట్లో దొంగలు తెగబడి అంతా దోచుకెళతారు. ఎలాంటి అనుమానాస్పద వ్యక్తులు, వస్తువులు ఉన్నా తక్షణమే పోలీసులకు సమాచారం ఇవ్వాలని రాజేంద్రనగర్ పోలీస్‌స్టేషన్ ఇన్స్‌స్పెక్టర్ వి. ఉమేందర్ సూచిస్తున్నారు. పోలీసు సూచనలు, సలహాలు పాటిస్తే దొంగతనాలు జరగకుండా నివారించవచ్చని ఇందుకు ప్రజలు సహకరించాలని ఆయ విజ్ఞప్తి చేశారు. -
వేసవి సెలవుల్లోనూ మధ్యాహ్న భోజనం
♦ పేద విద్యార్థుల సంతోషం ♦ వేసవి సెలవుల్లోనూ మధ్యాహ్న భోజనం ♦ కరువు వేళ సర్కారు నిర్ణయంతో పేద పిల్లల సంతోషం ♦ జిల్లాలో 1.99 లక్షల విద్యార్థులకు ప్రయోజనం పాపన్నపేట/సిద్దిపేట: విద్యాబుద్ధులు నేర్పడంతో పాటు చదువు నేర్చే పిల్లల ఆకలిదప్పులు తీర్చే బాధ్యతను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు భుజానకెత్తుకున్నాయి. కరువు మండలాల్లో వలసల నివారించేందుకు, ఆహార భద్రత చట్టాన్ని పకడ్బందీగా అమలు చేసేందుకు వేసవి సెలవుల్లో పాఠశాల విద్యార్థులకు మధ్యాహ్న భోజన పథకాన్ని కొనసాగించాలని నిర్ణయించడం పేదల ఇంట ఆనందాన్ని నింపనున్నది. ఈ నిర్ణయం దరిమిలా మెదక్ జిల్లాలోని 2,365 ప్రభుత్వ పాఠశాలల్లో 1,99,570 మంది విద్యార్థులకు ప్రయోజనం కలగనుంది. ఆ భోజనమే కడుపు నింపుతోంది.. సర్కార్ బడుల్లో డ్రాపౌట్స్ సంఖ్యను తగ్గించేందుకు, పౌష్టికాహారాన్ని అందించేందుకు కేంద్ర ప్రభుత్వ సహకారంతో అప్పటి ముఖ్యమంత్రి దివంగత రాజశేఖరరెడ్డి కాలంలో 2008లో అన్ని తరగతులకు మధ్యాహ్న భోజన పథకం ప్రారంభించారు. ఈ లక్ష్య సాధన దిశగా ఈ పథకం సత్ఫలితాలనిచ్చింది. ప్రస్తుత ప్రభుత్వం వచ్చే విద్యాసంవత్సరం నుంచి ఇంటర్ విద్యార్థులకు కూడా మధ్యాహ్న భోజనాన్ని అందించేందుకు సన్నాహాలు చేస్తోంది. అయితే ప్రస్తుతం రాష్ర్ట వ్యాప్తంగా ఘోరమైన కరువు పరిస్థితులు కమ్ముకొన్నందున పల్లె జనాలు బతుకు దెరువు కోసం వలస బాట పడుతున్నారు. ఇప్పటికే చాలా గ్రామాల్లో చిన్న పిల్లలను, ముసలి వాళ్లను ఇళ్ల వద్ద వదిలి జవసత్వాలు ఉన్న వాళ్లంతా వలస బాట పట్టారు. దీంతో పిల్లలు కలో..గంజో తాగుతూ పాఠశాలల కు వస్తున్నారు. మధ్యాహ్న భోజనం కొంత వరకు వారి ఆకలి తీరుస్తుంది. సెలవుల్లోనూ అన్నం. సంతోషమే! ఏప్రిల్ 24 నుంచి పాఠశాలలకు వేసవి సెలవులు ఇస్తున్న నేపథ్యంలో పిల్లలు తల్లిదండ్రుల వెంట వలస వెళ్లే ప్రమాదముందని భావించిన సర్కార్ వేసవి సెలవుల్లో విద్యార్థులకు మధ్యాహ్న భోజనం అందించాలని తాజాగా నిర్ణయించింది. చదువు చెప్పడంతో పాటే బాధ్యత తీరిపోదని, పిల్లలకు ఆనందాన్ని, విజ్ఞానాన్ని పంచుతూనే పాఠశాలలను వేసవి విడుదుల్లా తయారు చేయాలని, ఈ దిశగా మధ్యాహ్న భోజనంతో పిల్లల కడుపు నింపాలని ప్రభుత్వం జిల్లా యంత్రాంగానికి ఉత్తర్వులు జారీ చేసింది. కరువు మండలాల్లో ఈ పథకాన్ని ప్రవేశపెట్టనున్నందున మెదక్ జిల్లాలోని 46 మండలాల్లో ఈ పథకం ద్వారా 1,99,570 మంది విద్యార్థులకు లబ్ధి కలగనుంది. 42 రోజుల పాటు లబ్ధి ఏప్రిల్ 24 నుంచి జూన్ 11 వరకు సెలవులు కొనసాగనున్నాయి. అంటే 42 రోజుల పాటు ఆయా పాఠశాలల్లో చదువుతున్న విద్యార్ధులకు మధ్యాహ్న భోజన వసతి కల్పిస్తారు. అయితే వంట బాధ్యతలు ఎవరికి అప్పగించాలనే దానిపై ఇంకా స్పష్టత ఏర్పడలేదు. వేసవి సెలవుల్లో టీచర్లు బడికి వచ్చే అవకాశం లేనందున విద్యా వలంటీర్లు లేదా అంగన్వాడీలకు నిర్వహణ బాధ్యతలు అప్పజెప్పే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది. అలాగే ప్రస్తుతం వంట చేస్తున్న సిబ్బందికే వంటలు వండే బాధ్యతలు అప్పగిస్తారని కూడా వినవస్తోంది. పర్యవేక్షణ బాధ్యత మాత్రం ప్రధానోపాధ్యాయులకు అప్పగించే అవకాశం ఉంది. ఈ విషయమై జిల్లా ఉపవిద్యాధికారి శ్యాంప్రసాద్‌రెడ్డిని సంప్రదించగా సాధారణంగా విద్యా సంవత్సరంలో పది నెలల పాటు వంట సిబ్బందికి వేతనాలు చెల్లిస్తుంటామని, సెలవుల్లో వంటచేస్తే అదనంగా చెల్లిస్తామన్నారు. నానమ్మ వద్దే ఉంటున్నా.. నాన్న రాములు చిన్నప్పుడే చనిపోయాడు. ఉన్న కుంటల పాటి భూమి కడుపు నింపడం లేదు. దీంతో అమ్మ సుజాత బతుకు దెరువుకు పట్నం వెళ్లింది. నానమ్మ కిష్టమ్మ వద్దే ఉండి చదువుకుంటున్నా. స్కూల్లో పెట్టే అన్నమే తిని ఆకలి తీర్చుకుంటున్నాను. - సురేష్, 9వ తరగతి, కొడుపాక వలసబాటలో అమ్మానాన్న.. పంటలు పండక బతుకుదెరువు కష్టమైంది. అమ్మనాన్నలు బాలమ్మ, కనకయ్య పట్నం వలస వెళ్లారు. అక్క వీణ, నేను కలిసి అమ్మమ్మ శ్యామమ్మ వద్ద ఉంటున్నాం. సెలవుల్లో అన్నం పెడితే మాకు ఆకలి సమస్య తీరినట్టే. - ప్రవీణ్, 9వ తరగతి, కొడుపాక సెలవుల్లో భోజనం సంతోషమే.. సెలవుల్లో భోజనం పెడితే మంచిదే. ఇక్కడ బతుకుదెరువు లేక మా అమ్మానాన్న వలసపోయారు. పిన్ని వంట చేసి పెడితే నేను, అక్క ధరణి ఇక్కడ ఉంటూ చదువుకుంటున్నాం. సెలవుల్లోనూ మధ్యాహ్న భోజనం వల్ల మా పిన్ని మా పోషణ భారం తగ్గుతుంది. - సాయిబాబ, 9వ తరగతి, కొడుపాక వలస తప్పింది.. అమ్మ పోచమ్మ, నాన్న మాణయ్య పట్నం వలస వెళ్లారు. తమ్ముడు దివాకర్, నేను కొడుపాక స్కూళ్లో చదువుకుంటున్నాం. నానమ్మ లక్ష్మికి చేతగాదు. ఒక పూట వంట జేస్తే మరో పూట కష్టం. అందుకే సెలవుల్లో పట్నం వెళ్దామనుకుంటున్నం. సెలవుల్లోనూ బడిలో భోజనం పెడతారని తెలిసింది. చాలా సంతోషం. - గూడెం శైలజ, 9వ తరగతి, గాజులగూడెం -
వేసవి సెలవుల్లో మధ్యాహ్న భోజనం!
- 231 కరువు మండలాల్లో అమలుకు విద్యాశాఖ నిర్ణయం - 11,331 పాఠశాలల్లో 9.54 లక్షల మంది విద్యార్థులు - వంటలు వండేవారున్నా.. పర్యవేక్షించే వారు లేరు - ప్రత్యామ్నాయాలపై ఆలోచనలు చేస్తున్న అధికారులు సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని కరువు మండలాల్లో ఉన్న 11,331 పాఠశాలలకు చెందిన విద్యార్థులకు వేసవి సెలవుల్లోనూ మధ్యాహ్న భోజనాన్ని అందించాలని విద్యాశాఖ నిర్ణయించింది. ఆహార భద్రతలో భాగంగా 231 కరువు మండలాల్లోని పాఠశాలలకు చెందిన 9,54,425 మంది విద్యార్థులకు మధ్యాహ్న భోజనం అందించేందుకు కసరత్తు చేస్తోంది. ఏప్రిల్ 24వ తేదీ నుంచి జూన్ 11వ తేదీ వరకు 42 రోజులపాటు అందించే మధ్యాహ్న భోజనానికి రూ.31.34 కోట్లు అవసరం అవుతాయని అంచనా వేసింది. అయితే వేసవి సెలవుల్లో టీచర్లు స్కూళ్లకు రారు కనుక ఆ సమయంలో మధ్యాహ్న భోజనం అమలు, పర్యవేక్షణ బాధ్యతలను ఎవరికి అప్పగించాలన్న విషయంలో విద్యాశాఖ తర్జనభర్జన పడుతోంది. ఇతర ప్రత్యామ్నాయాలపై ఆలోచనలు చేస్తోంది. ఆహార భద్రత చట్టం నిబంధనల ప్రకారం ప్రతి ఒక్కరికి ఆహారం అందించాల్సిన బాధ్యత ప్రభుత్వాలదే. ఇందులో భాగంగానే 0-5 ఏళ్ల వయస్సు వారికి సమగ్ర శిశు అభివృద్ధి పథకం (ఐసీడీఎస్) ద్వారా పౌష్టికాహారాన్ని అందిస్తుండగా, పాఠశాలల్లో మధ్యాహ్న భోజనం అమలు చేస్తున్నారు. అయితే వేసవి సెలవుల్లో స్కూళ్లు మూతపడనుండడంతో విద్యార్థులకు ఆహారం అందని పరిస్థితి ఏర్పడుతుంది. ముఖ్యంగా కరువు మండలాల్లో విద్యార్థులకు ఇబ్బందులు తలెత్తనున్నాయి. ఆయా మండలాల్లోని విద్యార్థులందరికీ వేసవి సెలవుల్లోనూ మధ్యాహ్న భోజనం అందించాలని విద్యాశాఖ నిర్ణయించింది. అమలులో అడ్డంకులపై దృష్టి సెలవుల్లో మధ్యాహ్న భోజనం అమలులో ఎదురయ్యే అడ్డంకులపై విద్యాశాఖ దృష్టిసారించింది. వంటచేసే కార్మికులకు కుకింగ్ చార్జీలు, గౌరవ వేతనాలను వేసవి సెలవుల్లో ఇవ్వడం లేదు. అయితే సెలవుల్లోనూ వేతనాలిస్తామనడంతో వారు వంట చేసి పెట్టేందుకు ఒప్పుకున్నారు. అయితే పర్యవేక్షణ బాధ్యతలను ఎవరికి అప్పగించాలన్నది తేలడం లేదు. సెలవుల్లో టీచర్లు స్కూలుకు రారు. ఒకవేళ రప్పించినా వారికి ఆర్జిత సెలవులు(ఈఎల్స్) ఇవ్వాల్సి వస్తుంది. ఇక పర్యవేక్షణ బాధ్యతలను విద్యా వలంటీర్లకు అప్పగించాలనుకున్నా అది సాధ్యమయ్యేలా కనిపించడం లేదు. క్లస్టర్ రీసోర్స్ పర్సన్లకు (సీఆర్సీ) అప్పజెబుదామంటే వారి సంఖ్య సరిపోదు. గతేడాది వేసవి శిక్షణ శిబిరాలు నిర్వహించిన వలంటీర్లకు బాధ్యతలు అప్పగిస్తే ఎలా ఉంటుం దన్న అంశాన్ని విద్యాశాఖ పరిశీలి స్తోంది. గ్రామ కార్యదర్శులకు లేదా స్థానికంగా ఉండే అంగన్వాడీ కార్యకర్తలకు బాధ్యతలు అప్పగించాలా? అన్న అంశాలను కూడా పరిశీలిస్తోంది. దీని పై వారం పది రోజుల్లో తుది నిర్ణయం ప్రకటించే అవకాశం ఉంది. -
దసరాకు 15 రోజులు సెలవులు
♦ సెప్టెంబరు 30 - అక్టోబరు 14 వరకు ♦ జనవరి 11-17 వరకు సంక్రాంతి సెలవులు ♦ ఏప్రిల్ 24-జూన్ 11 వరకు వేసవి సెలవులు ♦ మైనారిటీ స్కూళ్లకు డిసెంబరు 24- 31 ♦ వరకు క్రిస్మస్ సెలవులు ♦ 2015-16 వార్షిక కేలండర్ సిద్ధం ♦ స్కూళ్లకు అక్రెడిటేషన్, ర్యాంకులు సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని పాఠశాలలకు 2016-17 వార్షిక కేలండర్‌ను విద్యా శాఖ రూపొందించింది. వచ్చే విద్యా సంవత్సరాన్ని మార్చి 21 నుంచే ప్రారంభించాలని నిర్ణయించింది. ‘స్కూళ్లకు అక్రెడిటేషన్, ర్యాంకుల విధానముండాలి. ఒకే ఆవరణలో వేర్వేరుగా సెక్షన్లుగా కొనసాగుతున్న తెలుగు, ఇంగ్లిషు మీడియం స్కూళ్లను విడదీయాలి. ఇంగ్లిష్ మీడియం స్కూళ్లను వేరుగానే కొనసాగించాలి. ఇంగ్లిష్ మీడియంలో చదువుకున్న వారిని వాటిలోకి బదిలీ చేయాలి. ఏప్రిల్ 24 నుంచి జూన్ 12 వరకు వేసవి సెలవులిచ్చి జూన్ 13న స్కూళ్లను తిరిగి ప్రారంభించాలి. ఇంగ్లిషు మీడియం బోధించే టీచర్లకు వేసవి సెలవుల్లోనే ప్రత్యేక శిక్షణ కార్యక్రమాలు నిర్వహించాలి’ అని పేర్కొంది. ఈ కేలండర్పై పాఠశాల విద్యా డెరైక్టర్ కిషన్ గురువారం విద్యా శాఖ సీనియర్ అధికారులతో చర్చించారు. దీన్ని ఉపాధ్యాయ సంఘాలకు పంపారు. ఈ నెల 29లోగా సలహాలు, సూచనలు కోరారు. ఇదే కేలండర్ దాదాపుగా అమల్లోకి రానుంది. ప్రతి ప్రాథమిక పాఠశాలలోనూ ముగ్గురు టీచర్లు ‘హేతుబద్ధీకరణలో భాగంగా ఒక నివాస ప్రాంతంలో కిలోమీటరు పరిధిలో ఉన్న ప్రాథమిక పాఠశాలలను విలీనం చే సి ఒక స్కూల్‌నే కొనసాగించాలి. వాటిల్లో ముగ్గురు టీచర్లుండేలా చూడాలి. రాష్ట్రంలో ఇకపై ప్రాథమిక, ఉన్నత పాఠశాలల విధానమే ఉండాలి. ప్రాథమికోన్నత విధానం అక్కర్లేదు. ఆ పాఠశాలలను 3 కిలోమీటర్ల పరిధిలోని ఉన్నత పాఠశాలల్లో విలీనం చేయాలి. 4 కిలోమీటర్ల పరిధిలో కూడా ఉన్నత పాఠశాల లేకపోతే సదరు ప్రాథమికోన్నత పాఠశాలలనే ఉన్నత పాఠశాలలుగా అప్‌గ్రేడ్ చేయాలి. హైస్కూళ్లకు సంబంధించి హేతుబద్ధీకరణ సమయంలో చర్చించి నిర్ణయం తీసుకోవాలి. ప్రస్తుతం రాష్ట్రంలో ఒక్క విద్యార్థి లేని పాఠశాలు 407, పది మందిలోపే ఉన్నవి 992 ఉన్నాయి’ అని విద్యా వార్షిక ప్రణాళిక పేర్కొంది. పరీక్షలిలా... ♦ అన్ని సబ్జెక్టుల్లోనూ సిలబస్‌ను మార్చి 21-ఏప్రిల్ 23 వరకు ఒక విభాగం, జూన్ 13-2017 ఫిబ్రవరి 28 వరకు రెండో విభాగంగా విభజించారు ♦ ఫార్మేటివ్-1 పరీక్ష (ఎఫ్ఏ)లను జూలై 31లోగా, ఎఫ్ఏ-2ను సెప్టెంబరు 22లోగా, ఎస్ఏ-1 పరీక్షల్ని సెప్టెంబర్ 23-29 వరకు, ఎఫ్ఏ-3ని నవంబరు 30లోగా, ఎఫ్ఏ-4ను 2017 జనవరి 30లోగా నిర్వహించాలి. ♦ పది మినహా మిగతా తరగతులకు వార్షిక పరీక్ష (ఎస్ఏ-2)లను 2017 మార్చి 7 నుంచి 15 వరకు నిర్వహించాలి. ♦ పదో తరగతికి ఫిబ్రవరి 22-మార్చి 6 దాకా ప్రీ ఫైనల్ పరీక్షలుంటాయి. వార్షిక పరీక్షల తేదీని తర్వాత నిర్ణయిస్తారు. -
బడి ఒడిలో..
-
నేటి నుంచి పాఠశాలలు పునఃప్రారంభం
ప్రభుత్వ బడుల్లో సమస్యల స్వాగతం ఒంటిపూట బడులకు టాటా ఇక ఆరు నెలలు, వార్షిక పరీక్షలే.. వేసవి సెలవులు ఆనందంగా గడిపిన విద్యార్థులు మళ్లీ బడిబాట పట్టనున్నారు. శుక్రవారం నుంచి పాఠశాలలు పునఃప్రారంభం కానున్నారుు. బడిగంటలు గణ గణ గణ.. అంటూ మోగనున్నారుు. ప్రతీ ఏడాది మాదిరిగానే ప్రభుత్వ పాఠశాలలు విద్యార్థులకు సమస్యలతో స్వాగతం పలుకనున్నారుు. పాఠ్యపుస్తకాలు, యూనిఫామ్స్, అదనపు గదులు, మధ్యాహ్న భోజన వసతులు, మరుగుదొడ్లు, ఉపాధ్యాయులు, వలంటీర్ల కొరత వంటివి సవాళ్లుగా మారనున్నారుు. బడి గంట నేడు మోగనుంది. పాఠశాలల్లో వసతుల కల్పన గతంలో కన్నా కాస్త మెరుగైంది. కానీ ఈసారీ విద్యార్థులకు ఇంకా సమస్యలే స్వాగతం పలుకుతున్నారుు. ఎస్సెస్సీ ఫలితాల్లో సర్కారీ విద్యార్థులు మెరిసిన నేపథ్యంలో వసతులు కల్పనపై మరింత దృష్టిసారించాల్సిన అవసరం ఉంది. 88 శాతం పాఠ్యపుస్తకాల రాక జిల్లాకు గురువారం వరకు 88శాతం పాఠ్య పుస్తకాలు వచ్చాయి. 17 లక్షల16వేల 99 పాఠ్య పుస్తకాలకు జిల్లా విద్యాశాఖ ప్రతిపాదించగా 15 లక్షల 27వేల 50 పాఠ్య పుస్తకాలు జిల్లా కేంద్రానికి చేరుకున్నారుు. ఆయూ మండలాలకు 12,54,617 పాఠ్యపుస్తకాలు చేరుకున్నాయి. అక్కడ నుంచి స్కూల్ పాయింట్‌కు తీసుకెళ్తున్నారు. కొన్నిరకాల టైటిల్ పాఠ్య పుస్తకాలు స్కూల్ పాయింట్లకు చేరాల్సి ఉంది. రెండో విడతగా ఎంఈవోలు పాఠ్య పుస్తకాలు జిల్లా కేంద్రంలోని డిపో నుంచి తీసుకెళ్లాల్సి ఉంది. పాఠశాల తెరిచి రోజే గతేడాది పాఠ్యపుస్తకాలు అందించారు. కేజీబీవీ భవన నిర్మాణాల్లో పురోగతి జిల్లాలో 36 కొత్త కస్తూరిభా గాంధీ బాలికల విద్యాలయాలు( కేజీబీవీ)ల నిర్మాణాలల్లో ఎట్టకేలకు 33 భవనాలు నిర్మించారు. మరో మూడు భవనాలు అసంపూర్తిగా ఉన్నాయి. 45 కేజీబీవీలకు ప్రహరీల నిర్మాణాలకు నిధులు మంజూరు కాగా అందులో 29 పూర్తయ్యూరుు. మూడింటి పనులు ఇంకా ప్రారంభించనే లేదు. ఊరూరా టీచర్ల ప్రచారం ఈసారి బడిబాట కార్యక్రమంపై రాష్ట్ర విద్యాశాఖ నుంచి ఆదేశాలు రాలేదు. కాని ఊరూరా ఉపాధ్యాయులు ప్రచారం ముమ్మరం చేశారు. కరపత్రాలతో ప్రైవేటుకు దీటుగా ప్రచారం చేస్తున్నారు. హసన్‌పర్తి మండలం భీమారంలో డీఈవో వై. చంద్రమోహన్ సైతం అక్కడ హెచ్ఎం, ఉపాధ్యాయులతో కలిసి ఇంటింటి ప్రచారం చేపట్టారు. సర్కారీ సూళ్లలో చదివితే కల్పించే వసతులేంటో వివరిస్తున్నారు. ఎస్సెస్సీలో ఇటీవల వచ్చిన మెరుగైన ఫలితాలను ప్రస్తావిస్తున్నారు. ఇంగ్లిష్ మీడియంలోనూ బోధిస్తున్నామని చెబుతున్నారు. తగ్గిపోతున్న విద్యార్థుల సంఖ్య జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్య తగ్గిపోతుండగం ఆందోళన కలిగిస్తోంది. జిల్లాలో అసలే విద్యార్థులు లేని పాఠశాలలు 103 ఉండడం పరిస్థితి తీవ్రకు నిదర్శనం. 10వరకు విద్యార్థులున్న పాఠశాలలు 231 ఉన్నాయి. 20వరకు విద్యార్థులున్న పాఠశాలలు 542 ఉండగా, 30మంది విద్యార్థులున్న పాఠశాలలు 1175 ఉన్నాయి. 75 మంది విద్యార్థులున్న ఉన్నత పాఠశాలలు 22 వరకు ఉన్నాయి. ఏకోపాధ్యాయ పాఠశాలలు 292 ఉన్నాయి. కొన్నిచోట్ల విద్యార్థులున్నా టీచర్లు లేరు. అసంపూర్తిగా అదనపు గదులు జిల్లాలో సర్వశిక్షా అభియన్ ద్వారా 2014-2015లో 269 అదనపు తరగతి గదులు మంజూరు కాగా అందులో 12 గదులే పూర్తయ్యూరుు. 105 గదులు అసంపూర్తిగా ఉన్నారుు. 152 గదుల పనులు ఇంకా ప్రారంభించనే లేదు. నిధులు ఆలస్యంగా మంజూరు కావడం దీనికి కారణం. 2013-2014లో జిల్లాకు కేవలం 27 తరగతి గదులు మంజూరయ్యూరుు. అందులో 15 పూర్తికాగా 12 వివిధ దశల్లో ఉన్నారుు. రాష్ట్రీయ మాధ్యమిక శిక్షా అభియాన్ ఆధ్వర్యంలో హైస్కూళ్లలో మూడో దశలో145 అదనపు తరగతి గదుల నిర్మాణాలకు నిధులు మంజూరైనా పనులు ఊపందుకోలేదు. ఇప్పటివరకు 121 గ దుల నిర్మాణాలు ప్రారంభించగా రెండే పూర్తయ్యూరుు. సబ్జెక్టు టీచర్ల కొరత జిల్లాలోని ప్రభుత్వ, జెడ్పీఎస్ఎస్ హైస్కూళ్లలో సబ్జెక్టుల టీచర్ల కొరత ఉంది. సక్సెస్ హైస్కూళ్లులో 6వ తరగతి నుంచి పదో తరగతి వరకు ఇంగ్లిష్, తెలుగు మీడియంలు కొనసాగుతున్నాయి. ఎక్కువ శాతం హైస్కూళ్లలో అటెండర్లు, స్వీపర్లు, రికార్డు అసిస్టెంట్లు పోస్టులు భ ర్తీ చేయటం లేదు. హైస్కూళ్లలో చోరీలు కూడా జరిగాయి. కంప్యూటర్ విద్యకు ఇన్స్ట్రక్టర్లను నియమించటంలేదు. కంప్యూటర్లు నిరుపయోగంగా మారారుు. త్వరలో బదిలీలు, పదోన్నతులు త్వరలోనే ఉపాధ్యాయులకు రేషనలైజేషన్, బదిలీలు, పదోన్నతులు ప్రక్రియను చేపట్టబోతున్నారు. వేసవి సెలవుల్లో చేపట్టాలని ఉపాధ్యాయ సంఘాలు కోరినా ప్రభుత్వం జాప్యం చేసింది. జూన్ -జులైలో ఈ ప్రక్రియ చేపట్టబోతున్నారు. వంటకు తిప్పలు జిల్లాలో మరో 2,313 ప్రభుత్వ పాఠశాలల్లో కిచెన్షెడ్లకోసం జిల్లా విద్యాశాఖ ఇటీవల ప్రతిపాదనలు పంపింది. 2012లో జిల్లాలో 1166 కిచెన్‌షెడ్ల నిర్మాణాలకు నిధులు మంజూరు కాగా, నేటికి 486 కిచెన్షెడ్లు మాత్రమే పూర్తయ్యాయి. 387 వివిధ దశల్లో ఉన్నాయి. మిగితా నిర్మాణాలు పారంభించలేదు. ఒక్కో కిచెన్‌షెడ్‌కు రూ. 75వేలు మాత్రమే మంజూరవడంతో పనులకు ఎవరూ ముందుకు రాలేదు. ఇకపై 30 నుంచి 50 వరకు విద్యార్థులున్న పాఠశాలల కిచెన్‌షెడ్ల నిర్మాణాలకు రూ లక్ష, ఆపైన విద్యార్థులుంటే రూ 2.50 లక్షలు మంజూరు చేయనున్నారు. షెడ్లు లేక వర్షంలో వంట చేయడం ఇబ్బందే. మధ్యాహ్న భోజనం రేట్ల పెంపు ప్రభుత్వ పాఠశాలల్లో మధ్యాహ్న భోజనం వంట ఏజెన్సీలకు రేట్లు పెంచారు. పీఎస్‌లకు 25పైసలు, యూపీఎస్‌లు, హైస్కూళ్లకు 38పైసలు పెంచారు. పీఎస్‌లకు ఇకనుంచి రూ 4.60, యూపీఎస్, హైస్కూళ్లకు రూ 6.38 పైసలు ఇవ్వనున్నారు. జూన్ నెలకు 347 మెట్రిక్ టన్నుల సన్నబియ్యం కేటారుుంచారు. -
పాఠశాలల సిబ్బందికి సెలవులు లేవు
గుంటూరు: ప్రభుత్వ ఉన్నత పాఠశాలల ప్రధానోపాధ్యాయులు, బోధనేతర సిబ్బంది వేసవి సెలవుల్లోనూ పాఠశాలల్లో అందుబాటులో ఉండాలని ఏపీ పాఠశాల విద్యాశాఖ ఉత్తర్వులు జారీ చేసింది. పదో తరగతి పరీక్షల ఫలితాలు విడుదలైనందున బడుల్లోనే ఉండి విద్యార్థులకు అవసరమైన ధ్రువపత్రాలు జారీ చేయటం, పరీక్షల్లో తప్పిన వారికి సప్లిమెంటరీ పరీక్షలకు ఫీజుల వసూలు, హాల్ టికెట్ల జారీ వంటి విధులను నిర్వహించాలని పేర్కొంది. ఈ ఉత్తర్వులు ప్రభుత్వ, జెడ్పీ, మున్సిపల్, ఎయిడెడ్, సాంఘిక సంక్షేమ గురుకుల, కేజీబీవీ ఉన్నత పాఠశాలలకు వర్తిస్తాయి. -
వేసవి సెలవులకు తాతయ్య ఇంటికి వచ్చి....
కరీంనగర్ రాంనగర్‌కు చెందిన జువ్వాడి సుమన్‌రావు-సౌమ్య, యాచమనేని కిరణ్‌రావు-స్వప్న కుటుంబాలు హైదరాబాద్‌లో నివాసం ఉంటున్నాయి. సుమన్‌రావు దంపతులకు సౌమిత్, సాహెత్ కవల పిల్లలు. హైదరాబాద్‌లోని ఢిల్లీ పబ్లిక్ స్కూల్లో 3వ తరగతి చదువుతున్నారు. సుమన్‌రావు తోడల్లుడు యాచమనేని కిరణ్‌రావు దంపతుల పిల్లలు ప్రతీష్, ప్రద్యుమ్న సైతం హైదరాబాద్‌లోని ఓక్రిడ్జ్ ఇంటర్నేషనల్ స్కూల్లో చదువుతున్నారు. వేసవి సెలవుల కోసం తల్లిదండ్రులతో కలిసి నలుగురు పిల్లలు కరీంనగర్‌లోని తాతయ్య వెంకట్రామారావు ఇంటికి వచ్చారు. వీరికి స్థానిక సప్తగిరికాలనీకి చెందిన జోగినిపల్లి లక్ష్మణ్‌రావు కుమారుడు శివసాయి, దానబోయిన లక్ష్మయ్య (ప్రైవేటు కాలేజీలో లెక్చరర్) కుమారుడు సాయిశ్రీజన్, బోయినపల్లి రోహన్ మిత్రులు కావడంతో వీరంతా ప్రతిరోజూ క్రికెట్ ఆడేవారు. -
తిరుమలకు పోటెత్తిన భక్తులు
తిరుమల: తిరుమలలో రెండు రోజులుగా రికార్డు స్థాయిలో భక్తుల రద్దీ పెరిగింది. శనివారం 90,010 మందికి, ఆదివారం 90,662 మంది భక్తులకు గర్భాలయ మూల మూర్తి వేంకటేశ్వర స్వామివారిని దర్శించుకున్నారు. వేసవి సెలవులతో రద్దీ పెరిగింది. ఉన్నతాధికారులు సమన్వయంతో సర్వదర్శనం, కాలిబాట క్యూ, రూ. 300 ఆన్లైన్ టికెట్లు, ఆర్జిత సేవలు, వీఐపీ భక్తులు, వృద్ధులు, వికలాంగులు, చంటి బిడ్డ తల్లిదండ్రులు ఇలా అన్ని క్యూలను దశలవారీగా అమలు చేశారు. ఆలయంలో కూడా భక్తులకు త్వరగా దర్శనం కల్పించే చర్యలు తీసుకున్నారు. సోమవారం కొంత రద్దీ తగ్గి సాయంత్రం 6 గంటల వరకు 60,501 మంది భక్తులు శ్రీవారిని దర్శించుకున్నారు. ఆదివారం హుండీలో సమర్పించిన కానుకల్ని సోమవారం లెక్కించగా రూ. 2.80 కోట్ల ఆదాయం వచ్చింది. -
వేసవి అంటే ఎంతో ఇష్టం
కందిరీగ మూవీ ఫేం హీరోయిన్ అక్ష మంచిర్యాల రూరల్ : వేసవి అంటే చాలాఇష్టం. ప్రతి ఏడాది వేసవి సెలవులు ఎప్పుడొస్తాయాని ఎదురు చూ సేదాన్ని’’ అంటోంది కందిరీగ సినిమా హీరోయిన్ అక్ష. తూర్పు జిల్లా కేంద్రమైన మంచిర్యాలలోని ఓ బట్టల షాపింగ్ మాల్‌ను ప్రారంభించేందుకు గురువారం మంచిర్యాలకు విచ్చేసిన కందిరీగ ఫేం హీరోయిన్ అక్ష, సాక్షితో తన చిన్ననాటి అనుభూతులు, వేసవిలో తీసుకోవాల్సిన జాగ్రత్తలను వివరించారు. సాక్షి : మీరు పుట్టింది, పెరిగింది ఎక్కడ? అక్ష : ముంబయ్‌లో పుట్టి పెరిగాను, కామర్స్‌లో డిగ్రీ చేశాను. సాక్షి : ఏం చదివారు? అక్ష : కామర్స్‌లో డిగ్రీ చేశాను. సాక్షి :తెలుగులో మీ మొదటి సినిమా? అక్ష : యువత సాక్షి :ఇప్పటి వరకు ఎన్ని సినిమాలు చేశారు? అక్ష : తెలుగులో 8, మలయాళంలో 1, తమిళ్లో 1 చేశాను. సాక్షి :ప్రస్తుతం చేస్తున్న సినిమాలు? అక్ష : తమిళ్లో 2, తెలుగులో శ్రీకాంత్ హీరోగా ‘మెంటల్ పోలీస్’ అనే సినిమాల్లో నటిస్తున్నా. సాక్షి :సినిమాల్లోకి ఎలా వచ్చారు? అక్ష : 5వ తరగతి నుంచే నాకు యాడ్స్‌లో చేసే అవకాశాలు వచ్చాయి. 10వ తరగతిలో నేను చేసిన యాడ్ చూసి మలయాళ దర్శకుడు నాకు సినిమాల్లో అవకాశం ఇచ్చారు. సాక్షి :మీరు హీరోయిన్ కాకపోతే? అక్ష : సోషల్ వర్కర్‌గా ఉండేదాన్ని. సమాజ సేవ కోసం పాటు పడాలనే తపన నాలో ఉంది. సాక్షి : సమ్మర్ హాలీడేస్‌లో ఎలాగడిపేవారు ? అక్ష : ప్రతి ఏడాది వేసవి సెలవులు ఎప్పుడొస్తాయా అని ఎదురు చూసేదాన్ని. ఏడాదంతా చదువుతో బిజీగా ఉండి, వేసవికి సెలవులు ఇవ్వగానే బంధువుల ఇంటికి వెళ్లడం, తల్లిదండ్రులతో కలిసి హిల్ స్టేషన్‌కు వెళ్లడం అంటే ఎంతో ఇష్టం. ఎండలో వెళ్తే వడదెబ్బతో పాటు, ఇతర వ్యాధులు వస్తాయని స్కూల్లోనే మా టీచర్లు చెప్పేవారు. అందుకే ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు బయటకు వెళ్లకుండా, ఉదయం, సాయంత్రం వేళల్లో మాత్రమే బయటకు ఆడుకునేందుకు వెళ్లేవాళ్లం. సాక్షి : వేసవిలో చిన్నారులకు మీరిచ్చే సలహాలు ఏంటి? అక్ష : చిన్నవారైనా, పెద్దవారైనా ఎండ అందరికి ఒక్కటే. వీలైనంత వరకు ఎండలో బయటకు వెళ్లకుండా ఉంటే చాలా మంచిది. తప్పనిసరిగా వెళ్లాల్సి వస్తే, తలకు, కళ్లకు ఎండ తగలకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. తలకు క్యాప్, కళ్లకు కూలింగ్ గ్లాసెస్‌ను వాడాలి. ఎండకు మన శరీరం డీహైడ్రేషన్ అవుతుంటుంది. తప్పనిసరిగా ఎక్కువసార్లు నీటిని తాగుతూ ఉండాలి. దోస, ఖర్బూజ పండ్లలో నీరు ఉంటుంది. వీటిని ఎక్కువగా తీసుకుంటూ, కొబ్బరి బోండాలను తాగితే శరీరానికి కొత్త ఎనర్జీ వస్తుంది. చిన్నారులు మాత్రం ఆరుబయట ఎండలో ఆడుకోకుండా, ఇండోర్ గేమ్స్ ఆడేందుకే ఎక్కువగా సమయాన్ని కేటాయించాలి. స్విమ్మింగ్‌కు వెళ్లేవారు తప్పనిసరిగా తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. తల్లిదండ్రుల పర్యవేక్షణలో మాత్రమే ఈత కొట్టాలి. సాక్షి : యువతకు మీరిచ్చే సందేశం? అక్ష : ప్రస్తుతం యువత అన్ని రంగాల్లోనూ రాణిస్తున్నారు. తాము అనుకున్న లక్ష్యాన్ని చేరేందుకు ఎంతటి కష్టాన్నైనా తేలికగా తీసుకోవడం హర్షించదగినది. ఈ మార్పుతో యువతకు సందేశాలు ఇవ్వాల్సిన అవసరం లేకున్నా, అనుకున్న లక్ష్యాలను సాధించేందుకు కృషి, పట్టుదల తప్పనిసరిగా ఉండాలన్నది నా అభిప్రాయం. -
ఊ కొడుతున్నారా? ఉలిక్కిపడుతున్నారా?
కేరెంటింగ్ ఇంచుమించు అన్ని స్కూళ్లకూ వేసవి సెలవులు ఇచ్చేశారు. ఈ సెలవుల్లో పిల్లలు ఇంటి దగ్గరే ఉండి అల్లరి చేస్తుంటారు. వారి సెలవులను సద్వినియోగం చేసేందుకు చాలామంది తలిదండ్రులు వారిని సమ్మర్ కోచింగ్లోనో, స్విమ్మింగ్, డ్యాన్సింగ్, సింగింగ్ వంటి వాటిలో చేర్చి, చేతులు దులుపుకుంటారు. అయితే చిన్నారులకు కావలసింది తలిదండ్రుల సామీప్యం. వారిని దగ్గర కూర్చోబెట్టుకుని చక్కటి కథలు చెప్పడం వల్ల వారిలో ఊహాకల్పన, ఆలోచనాశక్తి అలవడతాయి. సృజనాత్మకత పెరుగుతుంది. ఒకవేళ మీకు కథలేమీ రాకపోతే, నేర్చుకోండి. లేకపోతే వారి నానమ్మలు, అమ్మమ్మలు, తాతల దగ్గరకో, ఇతర పెద్దవాళ్ల దగ్గరకో పంపండి. అంతేకానీ, వారిని వాళ్ల అల్లరి తప్పించుకోవడానికి దూరంగా పంపకండి. మా పిల్లలు కథలు వినడానికి సుతరామూ ఇష్టపడరు, అని పెదవి విరవకండి. అనగా అనగా అని మొదలు పెట్టి, వారికి ఆసక్తి కలిగించే కబుర్లే కథలుగా అల్లండి. కథలతో మొదలు పెట్టి, క్రమక్రమంగా పురాణాలు కూడా చెప్పండి. పురాణాలలోని పాత్రలు ఉన్నత విలువలతో, సమాజాన్ని ముందుకు నడిపించడంతో పాటు చక్కని సందేశాలనిస్తాయి. సత్యహరిశ్చంద్రుడు, శ్రీరాముడు వంటివారు ఎంత ఆపద వాటిల్లినా, ఎంతటి కష్టం ఎదురైనా సరే, తాము నమ్ముకున్న సత్యాన్ని ఆచరించడంలో వెనుకడుగు వేయని ఆ ధీరత్వం ముందు సర్వజగత్తు తలవంచడాన్ని వారికి చెప్పండి. ఇతర మతాలలోని కథలు కూడా నేర్పండి. వాటిలోని మంచిని కూడా గ్రహించేలా చేయండి. భగవద్గీతతో పాటు బైబిల్ కథలు కూడా చదివించండి. ఖొరాన్తోపాటు, కృష్ణుడి అల్లరి కూడా కళ్లకు కట్టండి. పురాణాలు, రామాయణ, భారతభాగవతాలు చదివితే చాలు అని మన పూర్వీకులు అనడంలోని ఉద్దేశ్యం వాటి ద్వారానే భవిష్యత్తుకు కావలసిన పాఠాలు నేర్చుకుంటారనే తప్ప మరోటి కాదు. -
ప్రత్యేక రైళ్లు నడపండి
- ముంబై నుంచి తెలుగు ప్రజల కోసం ఒక్క ప్రత్యేక రైలు లేదు - రైళ్లకు కనీసం అదనపు బోగీలైనా ఏర్పాటు చేయండి - మహారాష్ట్ర, తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలను కోరుతున్న తెలుగు ప్రజలు సాక్షి ముంబై: వేసవి సెలవుల దృష్ట్యా ప్రత్యేక రైళ్లు నడపాలని మహారాష్ట్ర తెలుగు ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. మహారాష్ట్రతో పాటు తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు ఈ విషయమై సానుకూలంగా స్పందించాలని కోరుతున్నారు. ఇందుకోసం తెలుగు రాష్ట్రాల ప్రజా ప్రతినిధులు దృషి చేయాలని డిమాండ్ చేస్తున్నారు. వేసవి సెలవుల్లో ముంబై నుంచి అనేక ప్రాంతాలకు ప్రత్యేక రైళ్లు నడుపుతున్నారని, తెలుగు ప్రజల కోసం ఒక్క రైలు కూడా నడపడంలేదని వాపోతున్నారు. బస్సుల్లో చార్జీలు రెట్టింపు ఉన్నాయని, రైళ్లలో స్వగ్రామాలకు వెళ్లేందుకు వేసవి రద్దీ కారణంగా టికెట్లు లభించడం లేదని అంటున్నారు. తత్కాల్ టికెట్ కోసం గంటలకొద్దీ క్యూ కట్టినా ప్రయోజనం ఉండటం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కేంద్ర రైల్వే శాఖ మంత్రి పవన్‌కుమార్ 2013-2014 రైల్వే బడ్జెట్లో ప్రకటించిన ముంబై (లోకామాన్యతిలక్ టర్మినస్) - నిజామాబాద్, ముంబై (లోకామాన్యతిలక్ టర్మినస్) - కాకినాడ రైళ్లను ప్రారంభించినప్పటికీ పెద్దగా ప్రయోజనం లేదని చెబుతున్నారు. నిజామాబాద్, హైదరాబాద్‌ల మీదుగా తెలుగు రాష్ట్రాల్లోని మిగతా ప్రాంతాలకు కూడా వేసవిలో ప్రత్యేక రైళ్లను నడపాలని కోరుతున్నారు. ప్రత్యేక రైళ్లు నడపటం కుదరకపోతే ప్రస్తుత రైళ్లకు అదనపు బోగీలైనా అమర్చాలని కోరుతున్నారు. తెలుగు ప్రజలకు ఒకే రైలు ముంబై, ఠాణే, భివండీ, కళ్యాణ్ తదితర చుట్టుపక్కల ప్రాంతాల్లో నివసించే కరీంనగర్, నిజామాబాద్, అదిలాబాద్ జిల్లాల తెలుగు ప్రజలకు ముంబై నుంచి ప్రతిరోజు నడిచే దేవగరి ఎక్స్‌ప్రెస్ మాత్రమే ఉంది. కొత్తగా లోనమాన్య తిలక్ (కుర్లా)-నిజామాబాద్‌ల మధ్య రైలు ప్రారంభించినప్పటికీ వారానికి ఒకసారి నడిపిస్తుండటంతో ప్రజలు దేవగిరికి మొగ్గుచూపుతున్నారు. అయితే వేసవి సెలవుల కారణంగా ఈ రైలులోనూ రద్దీ పెరిగింది. మరోవైపు దేవగిరిలో నాందేడ్ ప్రజలకు ప్రత్యేక కోటాను కల్పించారు. దీంతో ఏడాది పొడవునా రైళ్లో టికెట్ లభించడం కష్టసాధ్యంగా మారింది. కొత్తగా ప్రవేశపెట్టిన రైళ్లో కూడా ప్రస్తుతం అదే పరిస్థితి. దీంతో దేవగరి రైలుకు మరిన్ని బోగీలను అమర్చడంతోపాటు లోకమాన్య తిలక్-నిజామాబాద్ రైలును ప్రతి రోజు నడపాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. ముంబై నుంచి ఆ మార్గంలో వెళ్లే ఓ రైలును నిజామాబాద్ వరకు పొడగించాలని కోరుతున్నారు. నిజామాబాద్‌ల మీదుగా మన్మాడ్, నాగర్సోల్ వరకు నడుస్తున్న రైళ్లను ముంబై వరకు పొడగించాలని కూడా విజ్ఞప్తి చేస్తున్నారు. ఠాణేలో ఆపండి నిజామాబాద్, హైదరాబాద్, విశాఖపట్నం మీదుగా భువనేశ్వర్ వెళ్లే రైళ్లకు ఠాణేలో ఆపాలని తెలుగు ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. ముంబైతోపాటు ఠాణే చుట్టుపక్కల ప్రాంతాల్లో భారీ సంఖ్యలో తెలంగాణ రాష్ట్ర ప్రజలు, శ్రీకాకుళం, విజయనగరం జిల్లావాసులు నివసిస్తున్నారు. వీరు స్వగ్రామాలకు వెళ్లేందుకు ప్రస్తుతం కోణార్క్, విశాఖపట్నం, లోకమాన్య తిలక్-కాకినాడా ఎక్స్‌ప్రెస్‌లపై ఆధారపడుతున్నారు. వారానికి ఒకసారి నడిచే భావనగర్-కాకినాడా రైలు కూడా వయా కళ్యాణ్ వెళ్తోంది. ఎల్టీటీ-కాకినాడా రైలు వారానికి రెండు సార్లు నడుపుతున్నారు. అయితే ఈ రైళ్లు ఠాణేలో నిలపకపోవడంతో ప్రజలు లోకామాన్యతిలక్ టర్మినస్ లేదా, కళ్యాణ్ వరకు వెళ్లాల్సి వస్తోంది. -
సర్కార్ బడిని బతికించుకుందాం..
- భీమదేవరపల్లిలో ‘మన ఊరు-మన బడి’ - ఉచిత విద్య, ఆంగ్లంలోనే బోధన అంటూ.. - ప్రభుత్వ ఉపాధ్యాయుల వినూత్న ప్రచారం భీమదేవరపల్లి : వేసవి సెలవులు వచ్చాయంటే చాలు ప్రైవేట్ పాఠశాలల ఉపాధ్యాయులు కరపత్రాలు, వాల్‌పోస్టర్లతో గ్రామాల్లో తిరుగుతూ తమ పాఠశాలల్లో మీ పిల్లలను చేర్పించండంటూ ప్రచారం చేయడం సాధారణమే. కానీ ఇక్కడ ప్రభుత్వ ఉపాధ్యాయులు గ్రామాల్లో తిరుగుతూ సర్కారు పాఠశాలల పనితీరును వివరిస్తూ సీడీలు, కరపత్రాలు, పోస్టర్లు, ప్రచార రథాల ద్వారా మీ పిల్లలను మన పాఠశాలలో చేర్పించాలంటూ ఓ వినూత్న ప్రచారానికి తెరలేపారు. భీమదేవరపల్లిలో మొత్తం 43యూపీఎస్, పీఎస్, 12 జెడ్పీ పాఠశాలలున్నాయి. గతంలో ప్రతి తరగతిలో 40మందికి పైగా విద్యార్థులతో కళకళలాడేవి. ఒక్కో తరగతిలో విద్యార్థుల సంఖ్య ఎక్కువగా ఉండడంతో సెక్షన్లు సైతం ఉండేవి. క్రమక్రమంగా ప్రభుత్వ పాఠశాలలో కొరవడిన మౌలిక సదుపాయాలు, గ్రామీణ ప్రాంతాల్లో సైతం ఇంగ్లిష్ మీడియానికి పెరిగిన ఆధరణ తదితర కారణాల వల్ల విద్యార్థుల సంఖ్య గణనీయంగా తగ్గింది. మండలంలోని మక్త్యానాయక్, నరహరి, కొత్తపల్లి తండాలలో పీఎస్ పాఠశాలలను సైతం మూసి వేసి అక్కడి ఉపాధ్యాయులను డెప్యూటేషన్‌పై ఇతర పాఠశాలలకు పంపారు. మనుగడ కష్టమని భావించి... పెరుగుతున్న జనాభాకు అనుగుణంగా పాఠశాలల సంఖ్య పెరగాల్సిన నేటి రోజుల్లో కొత్త పాఠశాలల సంగతి దేవుడెరుగు, ఉన్న పాఠశాలలే మూతపడుతున్న తరుణంలో ఇక ప్రభుత్వ పాఠశాలల మనుగడ కష్టమనే అభిప్రాయానికొచ్చారు ఇక్కడి ఉపాధ్యాయ బృందం. ‘సర్కార్ బడిని బతి కించుకోవాలే...రేపటి సమాజానికి మార్గదర్శులం కావాలి’ అంటూ ఎంఈవో మారెపల్లి అర్జున్, ఉపాధ్యాయ సంఘా లు నిర్ణయించుకున్నారు. కార్యచరణను రూపొందించారు. ప్రత్యేక సమావేశాలు ప్రభుత్వ పాఠశాలలకు పునర్వైభవం తేవాలనే దృఢ సంకల్పంలోనుంచి ఉద్బవించేందే ‘మన ఊరు-మన బడి’ నినాదం. నెల క్రితం స్థానిక మండల పరిషత్ కార్యాలయం లో ఎంఈవో అర్జున్ అధ్యక్షతన ఉపాధ్యాయ సంఘాల నాయకులు, ఎంపీపీ సంగ సంపత్, ఎంపీడీవో వంగ నర్సిం హారెడ్డితో పాటుగా మండల స్థాయి అధికారులు, ప్రజాప్రతినిధులతో ప్రత్యేక సమావేశాన్ని నిర్వహించారు. అందరం కలిసికట్టుగా ఉద్యమిస్తే తప్పకుండా సత్ఫలితాలు వస్తాయంటూ సర్కారు బడిని బతికించుకునే బాధ్యత అందరిపై ఉందని ఏకగ్రీవ తీర్మాణం చేశారు. ఆంగ్లంలో బోధిస్తేనే తిరిగి ప్రభుత్వ పాఠశాలలు బలోపేతమవుతాయనే అభిప్రాయానికొచ్చారు. భాస్కర్‌రావు చేయూత కాగా ప్రతి పాఠశాలకు సైతం ఎల్ఈడీ ఇస్తానంటూ హామీ ఇచ్చిన మండలంలోని గట్లనర్సింగపూర్‌కు చెందిన కావేరీ సీడ్స్ అధినేత గుండావరపు భాస్కర్‌రావు ఇటీవలే 20ఎల్ఈడీలను బహూకరించారు. వినూత్న ప్రచారం కాగా ప్రభుత్వ పాఠశాలలో చేరండంటూ ఎంఈవో అర్జున్ ఆధ్వర్యంలో ప్రతి రోజు ఒక గ్రామాన్ని సందర్శిస్తున్నారు. గ్రామంలో సర్పంచ్, ఎంపీటీసీ వార్డుసభ్యులు, విద్యావేత్తలు తదితరుల భాగస్వామ్యంతో ర్యాలీ నిర్వహించి ప్రధా న కూడళ్ళ వద్ద సమావేశాలు నిర్వహిస్తున్నారు. ఇందుకుగాను ప్రత్యేకంగా ఓ ప్రచార రథాన్ని కేటాయించారు. పాటల ద్వారా గ్రామాల్లో ప్రచారాన్ని హోరెత్తిస్తున్నారు. ఆంగ్లంలోనే బోధన .. ఎం. అర్జున్, ఎంఈవో వచ్చే విద్యా సంవత్సరం నుంచి ప్రభుత్వ పాఠశాలలో ఎల్కేజీ, యూకేజీ విద్యావిధానాన్ని ప్రవేశపెడ్తున్నాం. ప్రైవేట్ కు ధీటుగా విద్యబోధన, వసతులు కల్పిస్తాం. ఉపాధ్యాయులు, ప్రజాప్రతినిధులు సహకారంతో మండలంలో ప్ర భుత్వ పాఠశాలల స్థితిగతులను మార్చి ముందుకెళ్తున్నాం. -
సిటీ అంతా ఫుల్‌జోష్
-
పాకెట్ మనీకి నిశ్‘చింత’!
వేసవి సెలవులిచ్చారు. గిరి బాలలు బడుల నుంచి ఇళ్లకు చేరారు. ఇంటి వద్ద ఆటపాటల్లో మునిగితేలుతున్నారు. చిరుతిళ్లు, అవసరమైన వస్తువులు కొనుక్కునేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. వీటికి పాకెట్ మనీ కావాలి. తల్లిదండ్రులను అడిగేకంటే వాటిని తామే సంపాదించుకుంటే ఎలా ఉంటుందని చక్కని ఆలోచన చేశారు. చింతచిగురు సేకరించి అమ్మితే పాకెట్‌మనీకి ఇబ్బంది ఉండదని యోచించారు. అనుకున్నదే తడవుగా ఆచరణలో పెట్టారు. ఉదయాన్నే నిద్రలేచి గ్రామాల్లోని చింతచెట్లు ఎక్కి లేత చింతచిగురు కోస్తున్నారు. దానిని సంచిలో వేసుకుని మండలకేంద్రానికి వచ్చి అక్కడి మెయిన్‌రోడ్ సెంటర్లో కుప్పలుగా పోసి ఒక్కో కుప్పను రూ.పదికి విక్రయిస్తున్నారు. ఇలా ప్రతిరోజూ ఒక్కొక్కరూ రూ.వంద నుంచి రూ.రెండు వందల వరకు సంపాదిస్తున్నారు. వాటిని తమ అవసరాలకు వినియోగిస్తున్నారు. కొందరు చింతచిగురుతోపాటు ముంజుకళ్లు కూడా సేకరించి విక్రయిస్తున్నారు. చిన్నారులు విక్రయించే చింతచిగురు ఎంతో లేతగా వుంటుందని, దీనిని పప్పు, మటన్, బోటీలో వేసుకుని వండుకుంటే ఎంతో రుచిగా ఉంటుందని కొనుగోలుదారులు చెబుతున్నారు. - చింతూరు -
నేటి నుంచి స్కూళ్లకు సెలవులు
జూన్ 12న తిరిగి ప్రారంభం హైదరాబాద్: రాష్ట్రంలోని పాఠశాలలకు ఈనెల 24 నుంచి వేసవి సెలవులు ప్రారంభం కానున్నాయి. వార్షిక పరీక్షలు ముగించుకొని చివరి పనిదినమైన గురువారం వివిధ పాఠశాలల్లో తల్లిదండ్రులతో సమావేశాలు నిర్వహించారు. విద్యాశాఖ ఇదివరకే ప్రకటించిన విద్యా వార్షిక కేలండర్ ప్రకారం ఈనెల 24 నుంచి జూన్ 11 వరకు వేసవి సెలవులు అమల్లోకి రానున్నాయి. జూన్ 12న తిరిగి పాఠశాలలు ప్రారంభం కానున్నాయి. ఈ నిబంధనలు రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ, ప్రైవేటు, ఎయిడెడ్ పాఠశాలలకు వర్తిస్తాయి. -
సెలవులిచ్చారోచ్...
అనంతపురం : ఏడాది పొడవునా పుస్తకాలతో కుస్తీ పట్టిన విద్యార్థులకు గురువారం వేసవి సెలవులు ప్రకటించడంతో హుషారుగా ఇళ్లకు బయలుదేరారు. ఈ వేసవిని ఎలా ఎంజాయ్ చేయాలో.. ఎక్కడెక్కడికి వెళ్లాలో... ఏ ఏ ఆటలు ఆడుకోవాలో... అని ఆలోచించుకుంటూ ఆనందంతో ప్రయాణమయ్యారు. విద్యా సంవత్సరం నేటితో ముగియడంతో ఇన్నాళ్లూ ఇంటికి దూరంగా ఉన్న విద్యార్థులు సొంత గూటికి వెళ్తున్న ఆనందం వాళ్ల కళ్లలో స్పష్టంగా కనిపిస్తోంది. చాలా రోజుల తర్వాత ఇంటికి వెళ్తుండటంతో విద్యార్థుల ఆనందానికి అవధులు లేకుండా పోయింది. అనంతపురం జిల్లాలోని పలు పాఠశాలల విద్యార్థులు గురువారం తరగతులు ముగించుకొని ఇంటికి వెళ్తున్న సమయంలో సాక్షి కెమెరా క్లిక్‌మనిపించింది. -
చూసి కొంటే... విమానయానం చౌకే
* కాస్తంత ప్లానింగ్‌తో డబ్బులు ఆదా * ఆఫర్లు, డిస్కౌంట్ల అసలు రహస్యమిదిగో.. వేసవి సెలవులు మొదలయ్యాయి. టూర్ ప్లాన్లు షురూ అవుతున్నాయి. అయితే ఎక్కడికెళ్లాలన్నా అన్నిటికన్నా ముఖ్యమైంది రవాణాయే. దూరాన్ని బట్టి రైలో, బస్సో, విమానమో ఎంచుకోవాల్సిందే. కాకపోతే కాస్త చల్లటి ప్రదేశాలంటే మనకు దూరమే కనుక రైలు కన్నా విమాన ప్రయాణానికే ఎక్కువ మంది మొగ్గుతుంటారు. చార్జీలెక్కువే కానీ... కాస్త ముందుగా ప్లాన్ చేసుకుంటే చౌకగానే దొరుకుతాయి. కొన్ని సందర్భాల్లో అయితే రైల్లో థర్డ్ క్లాస్ ఏసీ టికెట్ ధర కంటే తక్కువ రేటుకే కొన్ని విమానాల్లో విహరించే రోజులు వచ్చేశాయంటే అతిశయోక్తి కాదు. బడ్జెట్ ఎయిర్‌లైన్స్ పుణ్యమా అని సామాన్యునికీ విమానయానం అందుబాటులోకి వచ్చేసింది. కానీ చౌకగా టికెట్లు కావాలంటే కొంత ప్రణాళిక తప్పనిసరి. అదేంటి? ఏ సమయంలో టికెట్లు చౌకగా దొరుకుతాయి? అసలు విమాన టికెట్ల రహస్యమేంటి? ఆన్లైన్లో విమాన కంపెనీల వెబ్సైట్లో కొంటే లాభమా... లేక మధ్యవర్తుల (ఆగ్రిగేటర్ల) వద్ద కొంటే లాభమా? వారంలో ఏఏ రోజులైతే టికెట్లు చౌకగా దొరుకుతాయి? ఇవన్నీ వివరించేదే ఈ వారం ప్రాఫిట్ కథనం... హైదరాబాద్‌లో పనిచేసే తిరుమల్ సెలవులకి సొంతూరు వైజాగ్ వెళ్దామనుకున్నాడు. ఈ లోగా ఒక ఎయిర్‌లైన్ సంస్థ ప్రమోషనల్ ఆఫర్ కింద బేస్ ఫెయిర్‌కే టికెట్లు ప్రకటించటంతో ఒకసారి అదృష్టాన్ని పరీక్షించుకుందాం అనుకున్నాడు. ఆన్లైన్లో ఓపెన్ చేయగానే రూ.300కే ఒకవైపు టికెట్లు దొరకటంతో తన ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. రైల్లో స్లీపర్ క్లాస్ కంటే చౌకగా టికెట్లు దక్కించుకోవడమే కాకుండా... తొలిసారి కుటుంబమంతా విమాన ప్రయాణ అనుభూతిని సొంతం చేసుకున్నారు. విమాన టికెట్లు కొనుగోలు చేసేముందు నాలుగు విషయాలను దృష్టిలో పెట్టుకుంటే ఇలాంటి ఆఫర్లు మీకూ సొంతమవుతాయి. అవేంటంటే... ఆఫర్లు పరిమితమైన సీట్లకే ఎయిర్‌లైన్స్ సంస్థలు ప్రకటించే ఆఫర్లు చాలా కొద్ది సీట్లకు మాత్రమే వర్తిస్తాయి. సాధారణంగా నూటికి 2 నుంచి 5 సీట్లకు మాత్రమే ఈ డిస్కౌంట్ రేట్లకు లభిస్తాయి. ఉదాహరణకు 180 సీట్లున్న విమానాన్ని తీసుకుంటే ఆఫర్ పరిధిలో గరిష్టంగా 9 సీట్లకు మించి ఉండవు. అంటే ఈ ఆఫర్లు చాలా తక్కువ మందికి మాత్రమే లభిస్తాయి. అంతేకాదు ఈ టికెట్లను నేరుగా ఆ సంస్థకు చెందిన అధికారిక వెబ్సైట్ ద్వారానే బుక్ చేసుకోవాల్సి ఉంటుంది. అందుకని ఎపుడైనా ఆఫర్ గురించి తెలిస్తే వెంటనే సదరు కంపెనీ వెబ్సైట్ ఓపెన్ చేసి వెదకటం ఉత్తమం. తరవాత చూద్దాంలే అనుకుంటే... ఆఫర్ దొరకటం కష్టం. అయితే ఈ ఆఫర్ల పరిధిలోకి మీరు రాకపోయినా అంతగా ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. చౌక విమానయానానికి ఇంకా అనేక మార్గాలున్నాయి. అగ్రిగేటర్లను సంప్రదించండి ఈ ఆఫర్ల సమయాల్లో కాకుండా మిగిలిన సందర్భాల్లో చౌక టికెట్లను పొందాలంటే ట్రావెల్ అగ్రిగేటర్లను సంప్రదించటమే మేలు. మేక్ మై ట్రిప్, యాత్రా, ట్రావెల్గురు, గోఐబీబో, క్లియర్ ట్రిప్, వయా డాట్ కామ్ పేరుతో అనేక ఆన్లైన్ బుకింగ్ సంస్థలున్నాయి. ఈ సంస్థలతో విమానయాన సంస్థలు ముందే ఒప్పందాలు కుదుర్చుకుంటాయి. పెపైచ్చు ఈ ఆన్లైన్ ట్రావెల్ సంస్థలు విమానయాన సంస్థల దగ్గర నుంచి టికెట్లను ముందుగానే కొని బ్లాక్ చేసుకుంటాయి. కాబట్టి వీటికి టికెట్లు తక్కువ రేటుకే వస్తాయి. ఆ సంస్థ అమ్మే టికెట్లను బట్టి ఎయిర్‌లైన్ సంస్థలు వాటికి చౌకగా టికె ట్లివ్వటమే కాకుండా లాయల్టీలు, బోనస్‌లు కూడా ఇస్తుంటాయి. వ్యాపారం పెంచుకోవటానికి సదరు సంస్థలు ఆ ప్రయోజనాల్ని ప్రయాణికులకు బదలాయిస్తాయి. అందుకే నేరుగా విమానయాన కంపెనీ వెబ్సైట్ రేట్ల కంటే ఈ అగ్రిగేటర్ల దగ్గర టికెట్ ధరలు తక్కువగా ఉంటాయి. అందుకే టికెట్ తీసుకునేటప్పుడు మీరు ఎంచుకున్న గమ్యానికి ఏ ఆన్లైన్ ట్రావెల్ సంస్థ తక్కువ రేటును ఆఫర్ చేస్తోందో పరిశీలించడం మర్చిపోవద్దు. కొన్ని సందర్భాల్లో ఎయిర్‌లైన్స్‌కు సంబంధించిన వెబ్సైట్ ద్వారా సీట్లు లభించకపోయినా... ఈ అగ్రిగేటర్ల దగ్గర సీట్లు లభిస్తాయంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. ప్రస్తుతం ఇండియాలో 60 శాతానికిపైగా టికెట్లు ఆన్లైన్ టికెటింగ్ సంస్థల ద్వారానే జరుగుతున్నాయి. ఇప్పుడు చాలా అగ్రిగేటర్లు గరిష్టంగా 40% వరకు డిస్కౌంట్లను ఆఫర్ చేస్తున్నాయి. మరో ముఖ్యమైన అంశమేంటంటే విమాన టికెట్లు, హోటల్ బుకింగ్ కలిపి గనక చేస్తే కొన్ని ఆన్లైన్ ట్రావెల్ ఆగ్రిగేట్ సంస్థలు భారీ డిస్కౌంట్లు ఆఫర్ చేస్తున్నాయి. ముందస్తు బుకింగ్ సమయాన్ని బట్టి విడిగా విమానం టిక్కెట్, హోటల్ బుక్ చేస్తే అయ్యే చార్జీల కంటే ఇది 30-50% కూడా తక్కువకు లభిస్తుంటాయి. అందుకే ఈ ప్యాకేజీలు లభించినపుడు అవసరాన్ని బట్టి బుక్ చేసుకుంటేనే ఉత్తమం. ముందుగా బుక్ చేసుకోవాలి... రైల్వే టికెట్లు 120 రోజులు కంటే ముందుగా బుక్ చేసుకోవడానికి వీలుండదు. కానీ విమాన టికెట్ల అడ్వాన్స్ రిజర్వేషన్‌పై ఎటువంటి పరిమితి లేదు. సంవత్సరం ముందుగా టికెట్లు బుక్ చేసుకోవచ్చు. ముందుగా బుక్ చేసుకునే టికెట్లతో పోలిస్తే చివరి క్షణంలో బుక్ చేసుకునే టికెట్ల ధరలు రెట్టింపు స్థాయిలో ఉంటాయి. అందుకే చౌక విమానయానం కావాలంటే ముందస్తుగా టికెట్లను బుక్ చేసుకోవాల్సి ఉంటుంది. 90 రోజుల నుంచి ప్రయాణ తేదీ దగ్గర పడే కొద్ది టికెట్ల ధరలు వేగంగా పెరిగిపోతుంటాయనేది ట్రావెల్ వర్గాల మాట. ఈ ధరల పెరుగుదల కూడా బుకింగ్ అయిన టికెట్లను బట్టి ఆధారపడి ఉం టుంది. ఉదాహరణకు హైదరాబాద్ నుంచి ఢిల్లీకి చివర్లో టికెట్ తీసుకుంటే సగటున రూ.8,000 ఉంటుంది. కానీ 90-120 రోజుల ముందు విమానయాన సంస్థలు రూ. 1,000 నుంచి టికెట్ అమ్మ డం మొదలు పెడుతుంటాయి. అయితే ఈ ధరకు గరిష్టంగా 5% మించి టికెట్లు అమ్మవు. ఆ తర్వాత మరో 10% టికెట్లను రూ.2,000 ధర కు, ఆపైన రూ.3,000 ధరకు కొన్ని సీట్లను విక్రయించుకుంటూ పోతాయి. ప్రయాణ తేదీ దగ్గర పడే కొద్దీ టికెట్ ధర పెరగడానికి ఇదీ కారణం. - సాక్షి పర్సనల్ ఫైనాన్స్ విభాగం టైమ్ కూడా ముఖ్యమే విమాన టికెట్ ధరలను మీరు ప్రయాణించే వారం, సమయం కూడా నిర్దేశిస్తుంటాయి. సాధారణంగా వారం ప్రారంభంలో, వారాంతంలో అంటే ఆది, సోమ, శనివారాల్లో టికెట్ల ధరలు 25 శాతం అధికంగా ఉంటాయి. మిగిలిన రోజుల్లో మంగళవారం, బుధవారం, గురువారం తక్కువగా ఉంటాయి. కొన్ని రూట్లలో శుక్రవారం ధరలు ఎక్కువగా ఉంటాయి. లేకపోతే సాధారణ రేట్లకే లభిస్తాయి. అలాగే ఉదయం 6 గంటల నుంచి 9 గంటల మధ్యలో, సాయంత్రం 5-8 గంటల సమయాల్లో ప్రయాణించే విమానాలకు డిమాండ్ అధికంగా ఉంటుంది. దీంతో ఈ సమయంలో టికెట్ల ధరలు అధికంగా ఉంటాయి. -
బ్యూటీ బ్లూమ్
నగరంలో ఎందెందు వెతికినా అందందే అన్నట్టుగా అందాల పోటీలు హోరెత్తుతున్నాయి. సమ్మర్ హాలిడేస్ నేపథ్యంలో ఈవెంట్ల నిర్వాహకులు కొత్త కొత్త టైటిల్స్‌తో కాలేజీ యూత్‌ని ఊరిస్తున్నారు. అందివచ్చిన అవకాశాలను అందుకుంటూ సిటీ ఫ్యాషన్ వేదికపై సరికొత్త అందాలు వికసిస్తున్నాయి. - ఎస్.సత్యబాబు మోడలింగ్, టివి, షార్ట్ఫిలిమ్స్, సినిమా రంగాలకు ‘బ్యూటీ’ బ్యాంక్‌ను సమృద్ధిగా ఏర్పాటు చేసే క్రమంలో సిటీలో రకరకాల ఫ్యాషన్ పోటీలు ఊపందుకున్నాయి. ఒకప్పుడు బ్యూటీ కాంటెస్ట్ అంటే మిస్ ఇండియా ఒక్కటే. తర్వాత మిసెస్ ఇండియా, గ్లాడ్రాగ్స్, మిస్ సౌతిండియా, ఐయామ్షి, ఇండియన్ ప్రిన్సెస్.. ఇలా పలు రకాల బ్యూటీ హంట్స్ ఫ్యాషన్ పరేడ్ నిర్వహిస్తూ వస్తున్నాయి. ఈ పోటీల పుణ్యమా అని పిల్లలున్న శ్రీమతులు సైతం మతులు పోగొట్టే స్థాయిలో బ్యూటీ క్వీన్లుగా మారిపోతున్నారు. వేదిక ఏదైనా వేడుక అదే.. జాతీయస్థాయి పోటీలే స్ఫూర్తిగా కాలేజ్ క్యాంపస్, పబ్స్, క్లబ్స్, షాపింగ్‌మాల్స్‌లో సైతం బ్యూటీ కాంటెస్ట్‌లు సర్వసాధారణమయ్యాయి. ఒక రకంగా చెప్పాలంటే నగరంలో ఏ భారీస్థాయి ఈవెంట్ నిర్వహిస్తున్నా, ఏ తరహా కార్యక్రమం నిర్వహిస్తున్నా, అది గ్లామర్ రంగంతో ఎలాంటి సంబంధమూ లేనిదైనా సరే.. అందాల పోటీ అనివార్యం అవుతోంది. ఇటీవల విభిన్న ప్రాంతాల నుంచి వచ్చి నగరంలో నివసిస్తున్న ఇతర రాష్ట్రీయులు సైతం మిస్ గుజరాతీ, మిస్ పంజాబీ.. అంటూ కమ్యూనిటీ వైజ్ పోటీలకు తెరతీశారు. తాజాగా బంజారాహిల్స్ మెరిడియన్ స్కూల్లో నిర్వహించిన ఈవెంట్‌తో అందాల పోటీలు స్కూల్స్కూ విస్తరించినట్టయింది. అలాగే సికింద్రాబాద్ క్లబ్ నిర్వహించే ‘మే క్వీన్’ కాంటెస్ట్ ఇప్పటికే బాగా పాపులర్ కాగా మరిన్ని క్లబ్స్ ఈ పోటీలకు సై అంటున్నాయి. చూడచక్కగా ఉంటే చాలు... కనీసం 5.6 అడుగుల ఎత్తు, తీరైన ఫిజిక్, కలర్.. వగైరాలన్నీ ఉంటేనే ఒకప్పుడు ఈ పోటీలకు అర్హత లభించేది. దాంతో సిటీలో పార్టిసిపెంట్స్ దొరకక నిర్వాహకుల తలప్రాణం తోకకు వచ్చేది. అయితే పోటీల వెల్లువ కారణంగా చూడడానికి కాస్త బావున్నా సరే.. ‘మేము సైతం పోటీకి తయారే’ అంటూ రంగంలోకి దూకేస్తున్నారు అతివలు. దీంతో బ్యూటీ ఈవెంట్స్ నిర్వాహకులకు ఆ కొరత తీరిపోయింది. తక్కువ ఖర్చుతో ఎక్కువ ప్రచారం అందించే మార్గాలుగా వాణిజ్యపరంగానూ ఇవి లాభదాయకంగా మారాయి. పడతులూ...పారాహుషార్... అద్దం అబద్ధం చెప్పదేమో కానీ...అందాల కిరీటం అబద్ధం చెప్పొచ్చు. నగరంలో అందాల పోటీలు పెరుగుతున్నట్టే ఆ క్రేజ్‌ను ఏదో రకంగా ఉపయోగించుకోవాలి అనుకునేవారూ పెరుగుతున్నారు. క్యాంపస్‌లోనో కమ్యూనిటీ పరిధిలో జరిగే పోటీలైతే పర్లేదు కానీ.. పెద్దగా పరిచయం లేని వాటిలో పాల్గొనాలనుకునే అమ్మాయిలకు కొన్ని సూచనలు... ⇒ ఆత్మవిశ్వాసం పెంచుకునేందుకు ఇదొక మార్గం అన్నట్టుగా మాత్రమే పోటీలకు సిద్ధమవ్వాలి. ⇒ వీలైనంత వరకూ కుటుంబ సభ్యులను ఒప్పించి, వారితో చర్చించి మాత్రమే పాల్గొనాలి. ⇒ వేరే ప్రాంతాల నుంచి వచ్చి ఆకర్షణీయమైన టైటిల్స్‌తో చేసే ప్రచారాన్నో, వెబ్సైట్లో చెప్పుకుంటున్నవి చూసో నమ్మేయకండి. అనుభవజ్ఞుల సలహాలు తప్పనిసరి. ⇒ నిర్వాహకులు ఎవరు? సదరు పోటీ నిర్వహణకు అనుమతులు ఉన్నాయా? లేదా చెక్ చేసుకోవాలి. ⇒ నిర్వాహక సంస్థ గతచరిత్ర, వారికి ఉన్న అనుభవం తెలుసుకోవాలి ⇒ కాంటెస్ట్ నిర్వహణ సందర్భంగా గ్రూమింగ్ సెషన్ల కోసమంటూ నిర్వాహకులు దూరప్రాంతాలకు తీసుకెళ్లేటప్పుడు ముందస్తు జాగ్రత్తలు తప్పనిసరి. నిర్వహణ తీరుతెన్నులపై ఎటువంటి సందేహాలు తలెత్తినా ప్రశ్నించాలి. మౌనం వహించడం వల్ల లాభం కన్నా నష్టమే ఎక్కువ. ⇒ గెలిస్తే ఓకే. ఓడిపోయినంత మాత్రాన నష్టమూ లేదు. అయితే చదువు, తెలివితేటలూ ఉండీ మోసానికి గురైతే అది జీవితకాలం వెంటాడే చేదు జ్ఞాపకం అవుతుందనే విషయం మరచిపోకూడదు. టైటిల్ కోసం ఎటువంటి ప్రలోభాలకు గురికాకూడదు. -
ముందుగానే వేసవి సెలవులు?
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో పాఠశాలలు, కాలేజీలకు ఈసారి వేసవి సెలవులను ముందుగానే ప్రకటించాలని ప్రభుత్వ వర్గాలు ఆలోచన చేస్తున్నట్లు తెలిసింది. ఇప్పటివరకు ఉన్న షెడ్యూలు ప్రకారం పాఠశాలలకు ఏప్రిల్ 23 చివరి పనిదినం కాగా జూన్ 12న పాఠశాలలు తిరిగి ప్రారంభం అవుతాయి. అయితే దీనివల్ల రాష్ట్ర అవతరణదిన వేడుకలు నిర్వహించలేని పరిస్థితి ఏర్పడుతుందని, అందుకే ఏప్రిల్ 12 నుంచి మే చివరి వరకు వేసవి సెలవులను ఇవ్వాలని, జూన్ 1న పాఠశాలలను తిరిగి ప్రారంభించాలని యోచిస్తున్నట్లు తెలిసింది. అయితే అధికారికంగా నిర్ణయం తీసుకోలేదు. -
మోగిన బడి సమస్యల గంట
-
మొదటి రోజే ఎదురుచూపులు
నెల్లూరు(టౌన్): వేసవి సెలవులు ముగిశాయి. కాని ఎండలు మాత్రం తగ్గలేదు. షెడ్యూల్ ప్రకారం పాఠశాలలు గురువారం పునఃప్రారంభమయ్యాయి. మొదటిరోజు కావడంతో విద్యార్థుల హాజరు స్వల్పంగా ఉంది. అయితే అనేక పాఠశాలలకు విద్యార్థులు నిర్ణీత వేళకే వచ్చినా విద్యార్థులు మాత్రం సమయపాలన పాటించలేదు. చాలా చోట్ల ఉపాధ్యాయులు వచ్చేవరకు విద్యార్థులు గోడలమీద , రాళ్లగుట్టల మీద కూర్చొని ఎదురు చూడసాగారు. కొందరు ఆటపాటలతో గడిపారు. ఇక అనేక పాఠశాలల్లో అయితే పుస్తకాలను పక్కనపెట్టి చీపుర్లు పట్టి శుభ్రత పనిలో మునిగితేలారు. కొన్ని చోట్ల ఉపాధ్యాయులే ఈ పనులు చేయాలని పురమాయించడం గమనార్హం. నగరంలోని ఈఎస్‌ఆర్‌ఎం పాఠశాలకు విద్యార్థులు వచ్చినప్పటికి గదులు తాళాలు వేసి ఉన్నాయి. ఫత్తేఖాన్‌పేటలోని రామయ్యబడి కి వాచ్‌మన్ సకాలంలో తాళాలు తీసినప్పటికి ఉపాధ్యాయులు సకాలంలో రాక విద్యార్థులు పిట్టగోడమీద కూర్చొని ఉండటం కనిపించింది. కొంతమంది బెంచీలు సర్దుతూ కనిపించారు. ఈ పాఠశాల తలుపులు తెరుచుకోకముందే ఇస్కాన్ సంస్థ మధ్యాహ్న భోజనం పంపింది. ఆ భోజనం మధ్యాహ్నానికి ఎండ కారణంగా మెత్తబడిపోతుందని విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేశారు. సుంకుచెంగన్న మున్సిపల్ పాఠశాలవద్ద తెగిన విద్యుత్‌వైర్లు రోడ్డుమీద నుంచి పాఠశాల ఆవరణలో పడ్డాయి. విద్యార్థులే వాటిని పక్కకు తొలగించారు. సంతపేటలోని మోడల్ స్కూలులో కుళాయిల వద్ద మురుగు మడుగుకట్టింది. దుర్ఘందం వెదజల్లుతున్న ఆ ప్రాంతంలోనే విద్యార్థులు దాహం తీర్చుకుంటూ కనిపించారు. జిల్లాలోని అనేక పాఠశాలల్లోనూ ఇదే పరిస్థితులు నెలకొన్నాయి. 41 సెంటిగ్రేడ్ ఉష్ణోగ్రత నమోదుకావడంతో పలు చోట్ల విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. -
బడికి వేళాయె..
నేడు పాఠశాలల పునఃప్రారంభం - సర్కారు బడులకు సమస్యల స్వాగతం - వేధిస్తున్న ఉపాధ్యాయ పోస్టుల ఖాళీలు - పర్యవేక్షణకు ఎంఈవోలు కరువు - మూలపడిన కంప్యూటర్లు ఖమ్మం : వేసవి సెలవులు పూర్తయ్యాయి. గురువారం పాఠశాలలు పునఃప్రారంభం కానున్నాయి. దీంతో విద్యార్థులను పాఠశాలలకు పంపించేందుకు తల్లిదండ్రులు సిద్ధమవుతున్నారు. అయితే పుస్తకాలు, నోట్‌బుక్‌లకు పెరిగిన ధరలు వారిని బెంబేలెత్తిస్తున్నాయి. ఇక కోట్ల రూపాయలు వెచ్చించినా ప్రభుత్వ పాఠశాలల్లో సమస్యలు ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్న చందంగా ఉన్నాయి. నూతన విద్యా సంవత్సరానికి ఆ సమస్యలే స్వాగతం పలుకుతున్నాయి. వెంటాడుతున్న ఖాళీల కొరత... విద్యాశాఖను ఖాళీల కొరత వెంటాడుతోంది. జిల్లాలో ప్రాథమిక, ప్రాథమికోన్నత, ఉన్నత ప్రభుత్వ పాఠశాలలు 3,336 ఉండగా ఇందులో 1624 ఉపాధ్యాయ పోస్టులు ఖాళీగా ఉన్నాయి. వీటిలో 68 పాఠశాలలకు అసలు ఉపాధ్యాయులే లేరు. అక్కడ ఇతర పాఠశాలల నుంచి డిప్యూటేషన్‌పై ఉపాధ్యాయులను పంపిస్తున్నారు. ఇక 686 పాఠశాలల్లో ఒక్కో ఉపాధ్యాయుడు మాత్రమే ఉన్నారు. ఏ కారణంగానైనా ఆ టీచర్ బడికి రాకుంటే ఆరోజు అనధికారిక సెలవు ప్రకటించినట్లే. అలాగే జిల్లాలోని 46 మండలాలకు గాను 41 మండల విద్యాశాఖాధికారి పోస్టులు ఖాళీగా ఉన్నాయి. వీటిని భర్తీ చేయకపోవడంతో ఆయా మండలాల్లో ఉన్న సీనియర్ ప్రధానోపాధ్యాయులకు ఎంఈవోలుగా అదనపు బాధ్యతలు అప్పగించారు. అయితే అటు ప్రధానోపాధ్యాయుడి విధులు, ఇటు ఎంఈవో విధులలో ఏ ఒక్కటీ సక్రమంగా నిర్వహించలేక వారు ఇబ్బంది పడాల్సి వస్తోంది. జిల్లాలోని నాలుగు డిప్యూటీ ఈవోల పోస్టులు కూడా ఖాళీగానే ఉన్నాయి. దీంతో ఉపాధ్యాయులపై పర్యవేక్షణ కొరవడంతో పలు పాఠశాలల నిర్వహణ అస్తవ్యస్తంగా మారింది. పలు పాఠశాలల్లో స్వీపర్లు లేక, ఉన్నచోట వారికి సకాలంలో వేతనాలు అందక పోవడంతో పాఠశాలలు ఊడ్చడం, నీళ్లు తెచుకోవడం వంటి పనులు విద్యార్థులే చేయాల్సిన దుస్థితి నెలకొంది. వీటికి తోడు నిత్యం ఏదో సమస్యలతో ఉపాధ్యాయ సంఘాల ఆందోళన, దశాబ్దాల తరబడి కార్యాలయాల్లో తిష్టవేసిన వారు ఉన్నతాధికారులు చెప్పిన మాటలు వినకుండా వారి కోటరీని కొనసాగించడం, నకిలీ సర్టిఫికెట్లతో పదోన్నతి పొందారనే ఆరోపణలు ఎదుర్కొంటున్న ఇంగ్లిష్ ఉపాధ్యాయులపై కేసు నమోదు చేయడం వంటి కారణాలతో పాఠశాలల పనితీరు అధ్వానంగా మారింది. ఇకపోతే ఏజెన్సీ, నాన్ ఏజెన్సీ ప్రాంతాల్లో ఉపాధ్యాయుల పదోన్నతి గొడవలూ ఓ కొలిక్కి రాలేదు. వీటిని చక్కదిద్దేందుకే డీఈవో సమయం అంతా సరిపోతోంది. మరోవైపున పోలవరం ముంపునకు గురవుతున్న ఏడు మండలాల ఉపాధ్యాయుల, విద్యార్థుల భవితవ్యం అయోమయంగా మారింది. అక్కడి ఉపాధ్యాయులు తెలంగాణ రాష్ట్ర పరిధిలో పనిచేయాలా.. ఆంధ్రలోకి వెళ్లాలా అనేది ఇప్పటివరకూ తేల్చలేదు. సమస్యల వలయంలో సర్కారు బడులు... రాజీవ్ విద్యామిషన్, ఆర్ఎంఎస్ఏతోపాటు ఇతర పాఠశాల గ్రాంట్లు కోట్ల రూపాయలు వస్తున్నా ప్రభుత్వ పాఠశాలలు మాత్రం సమస్యలకు నిలయాలుగానే విరాజిల్లుతున్నాయి. 2012-13, 2013-14 విద్యా సంవత్సరంలో జిల్లాలో 1500 అదనపు తరగతి గదులు కావాలని జిల్లా అధికారులు ఉన్నతాధికారులను కోరారు. దీంతో జిల్లాకు రూ. 38.78 కోట్లు మంజూరయ్యాయి. వీటిలో ఇప్పటివరకు 1358 గదుల నిర్మాణ పనులు మాత్రమే ప్రారంభం కాగా, మిగిలిన వాటి పనులు నేటికీ మొదలు కాలేదు. ప్రభుత్వం నుంచి నిధులు విడుదలైనా సకాలంలో భవనాలు పూర్తి కాకపోవడంతో విద్యార్థులు ఇబ్బంది పడుతున్నారు. వీటికి తోడు ఈ విద్యా సంవత్సరానికి మరో 526 అదనపు గదుల నిర్మాణానికి నిధులు మంజూరు చేశారు. గతంలో మంజూరైన వాటినే పూర్తిచేయని అధికారులు కొత్తవాటి నిర్మాణానికి ఇంకెంత కాలం గడుపుతారోననే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అనేక చోట్ల భవనాలు లేక పూరిగుడిసెలలోనే తరగతులు నిర్వహించాల్సి వస్తోంది. ఇక పలు పాఠశాలల భవనాలు శిథిలావస్థకు చేరుకున్నాయి. కొన్నింటిలో తాగునీటి వసతి లేదు. మరికొన్ని పాఠశాలలకు విద్యుత్ సౌకర్యం లేక, కొన్ని చోట్ల బోధించేవారు లేక కంప్యూటర్లు మూలనపడ్డాయి. ఇలా అనేక ప్రాంతాలలో పాఠశాలల నిర్వహణ అస్తవ్యస్తంగా మారింది. మరి ఈ ఏడాదైనా విద్యాశాఖ గాడిన పడుతుందో.. లేదో వేచి చూడాల్సిందే. -
బడిబుడి అడుగులతో..
ఎప్పుడు లేచామో తెలీదు... ఎప్పుడు నిద్రించామో తెలీదు.. నిత్యం టీవీకే అతుక్కుపోవడం, ఆటాపాటలతో కాలక్షేపం చేయ డం.. లేదా బంధువుల ఇళ్లకు వె ళ్లడం.. ఇదీ నిన్నటి వరకు పాఠశాల చిన్నారులు చేసిన పను లు. ఇక నేడు పాఠశాలలు ప్రా రంభమవుతుండడంతో వాటికి స్వస్తి చెప్పాల్సిందే.. ఆదిలాబాద్‌టౌన్ : సెలవులకు సెలవులు వచ్చేశాయ్.. బుధవారంతో హాలీడేస్ ముగిశాయి. గురువారం పాఠశాలలు పునఃప్రారంభం కానున్నాయి. నెలన్నరపాటు పుస్తకాలకు స్వస్తి చెప్పిన విద్యార్థులు ఆటాపాటలతో గడిపారు. బంధువుల ఇళ్ల వద్ద సందడి చేశారు. కొండలు, కోనలు, గుట్టలు, ఆటలు, సినిమాలు మావే అని చిచ్చిర పిడుగులు సంతోషంగా గడిపారు. ఇలా గడిపిన వారంతా ఒక్కసారిగా పాఠశాల బాట పడుతున్నారు. మారం చేస్తారేమో...! నిన్నామొన్నటి వరకు జాలీగా తిరిగిన పిల్లలంతా ఒక్కసారిగా స్కూల్‌కు వెళ్లాలంటే మారం చేయడం సర్వసాధారణం. అందుకే తల్లిదండ్రులు వారిని మానసికంగా సిద్ధం చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఇక చిచ్చర పిడుగులంతా సందడికి సెలవు ఇవ్వాల్సిందే. ఇక బారెడు పొద్దెక్కేదాక నిద్రపోవడాలూ ఉండవు, అర్ధరాత్రి దాకా టీ‘వీక్షణాలూ’ ఉండవు. ఒక్కసారిగా టైమ్ టేబుల్ మారిపోతుంది. మరి చిన్నారులు వెంటనే ఈ మార్పుకు సై అనగలరా? 40 రోజులకు పైగా మూలన పడేసిన క్రమశిక్షణను అర్జంటుగా అలవరచుకోగలరా? కొంత ఇబ్బంది సర్వసాధారణమే. ఇప్పటివరకు తాము కోరుకున్న స్వేచ్ఛను అనుభవించిన తమను ఒకేసారి తరగతి గది అనే పంజరంలోకి పంపిస్తున్నారనే భావనతో ఉన్న చిన్నారులకు మైండ్‘సెట్’ను ట్యూన్ చేయడంలో తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు బాధ్యతగా వ్యవహరించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. స్వాగతం పలకనున్న సమస్యలు.. సరదాగా వేసవి సెలవులు పూర్తిచేసిన విద్యార్థులకు పాఠశాలలు మొదటి రోజే సమస్యలు స్వాగతం పలకనున్నాయి. ఉపాధ్యాయుల కొరత, చెట్ల కింద చదువులు, మరుగుదొడ్ల లేమి, తదితర సమస్యలు తప్పేలా లేవు. పాఠశాల మొదటి రోజే దుస్తులు పంపిణీ చేయాల్సి ఉండగా, ఇంకా పాఠశాలలకు చేరుకోలేదు. పాఠ్య పుస్తకాలు పూర్తిస్థాయిలో అందలేదు. పాలకులు, అధికారులు సమస్యలు పరిష్కరిస్తామని పదేపదే హామీ ఇస్తున్నా నెరవేరడం లేదు. దీంతో సర్కారు బడుల్లో చదువుతున్న విద్యార్థులకు ఇబ్బందులు తలెత్తుతున్నాయి. ఈ ఏడాది పదో తరగతి ఫలితాల్లో రాష్ట్రస్థాయిలో జిల్లా చివరి స్థానంలో నిలిచింది. ఉపాధ్యాయుల కొరత, తదితర సమస్యలతో పదో తరగతి ఫలితాలు పడిపోయాయి. ఈ విద్యా సంవత్సరంలోనైనా పదో తరగతి ఫలితాలు టాప్ 10గా ఉంటాయని ఆశిద్దాం. -
బడిబాట
నేటి నుంచి పాఠశాలలు పునఃప్రారంభం విద్యార్థులకు సమస్యల స్వాగతం నత్తనడకన తరగతి గదుల నిర్మాణం మౌలిక సమస్యలు యథాతధం వేధిస్తున్న ఉపాధ్యాయుల కొరత మోడల్ స్కూళ్లలోనూ ఇక్కట్లే.. ఆటపాటలతో వేసవి సెలవుల్లో ఉత్సాహంగా గడిపిన విద్యార్థులు నేటి నుంచి బడిమెట్లు ఎక్కబోతున్నారు. గురువారం నుంచి పాఠశాలలు పునఃప్రారంభం కానున్నాయి. అయితే విద్యార్థులకు మాత్రం పాఠశాలలు సమస్యలతో స్వాగతం పలకనున్నాయి. తరగతి గదుల కొరత, సబ్జెక్టు టీచర్లు లేకపోవడం మరుగుదొడ్లు, తాగునీటి సమస్యలు అలాగే ఉన్నాయి. ప్రభుత్వ పాఠశాలలపై ప్రభుత్వం ఏటా కోట్లాది రూపాయలు ఖర్చు చేస్తున్నా విద్యార్థుల సంఖ్య తగ్గుముఖం పడుతుండడం ఆందోళన కలిగిస్తోంది. ఆటపాటలకు సెలవు ప్రకటించిన విద్యార్థులు నేటి నుంచి బడిబాట పట్టనున్నారు. నెలన్నర విరామం తర్వాత గురువారం పాఠశాలలు పునః ప్రారంభం కానుండడంతో అందుకు సన్నద్ధమవుతున్నారు. ఎంతో ఉత్సాహంగా స్కూళ్లలో అడుగిడే విద్యార్థులకు ఈసారీ పలు సమస్యలు స్వాగతం పలకనున్నాయి. అయితే ఎన్నడూ లేనివిధంగా ఈసారి పాఠ్యపుస్తకాలు ముందే రావడం శుభపరిణామం. - విద్యారణ్యపురి వేసవి సెలవులు ముగిసి గురువారం నుంచి పాఠశాలలు పునఃప్రారంభం కాబోతుండడంతో పుస్తకాల మోతకు విద్యార్థులు సన్నద్ధమవుతున్నారు. బ్యాగులు, పుస్తకాలు సర్దుకునే పనిలో పడ్డారు. ఇప్పటికే కావాల్సినవన్నీ తల్లిదండ్రులు కొనిపెట్టారు. అయితే విద్యార్థులకు మాత్రం సమస్యల స్వాగతం తప్పేలా కనిపించడం లేదు. గతంతో పోలిస్తే ఇప్పుడు చాలా ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక వసతులు సమకూరాయి. అయితే అదనపు తరగతుల కొరత, సబ్జెక్టు టీచర్లు లేకపోవడం, మరుగుదొడ్లు, తాగునీటి సమస్యలు అలాగే ఉన్నాయి. ప్రభుత్వ పాఠశాలలపై ప్రభుత్వం ఏటా కోట్లాది రూపాయలు ఖర్చు చేస్తున్నా విద్యార్థుల సంఖ్య తగ్గుముఖం పడుతుండడం ఆందోళన కలిగిస్తోంది. గత విద్యాసంవత్సరంలో రేషనలైజేషన్‌లో 171 స్కూళ్లను మూసివేయడంతో సర్కారు బడులను పరిరక్షించుకోవాలనే తపన ఉపాధ్యాయుల్లో కొంత పెరిగింది. దీంతో జిల్లాలో చాలాచోట్ల ఉపాధ్యాయులు విస్తృతంగా ప్రచారం చేపట్టారు. పిల్లలను ప్రభు త్వ స్కూళ్లలోనే చేర్పించాలంటూ తల్లిదండ్రులను అభ్యర్థించారు. ప్రైవేటు స్కూళ్లకు దీటుగా విద్యాబోధన చేస్తామని, ఇంగ్లిష్ మీడియం కూడా అందుబాటులో ఉందంటూ విద్యార్థుల తల్లిదండ్రుల్లో భరోసా నింపే ప్రయత్నం చేశారు. వేధిస్తోన్న టీచర్ల కొరత చాలా పాఠశాలల్లో ఉపాధ్యాయుల కొరత వేధిస్తోంది. జిల్లాలో 14,400మందికి పైగా ఉపాధ్యాయులు పనిచేస్తున్నారు. ప్రధానంగా హైస్కూళ్లలో ఆరో తరగతి నుంచి పదో తరగతి వరకు ఇంగ్లిష్, తెలుగు మాధ్యమం ఉన్నాయి. అయితే రెండు సెక్షన్లకు అనుగుణంగా స్కూల్ అసిస్టెంట్లు లేరు. దీంతో తెలుగు,హిందీ,మ్యాథ్స్,ఇంగ్లిష్ తదితర స్కూల్ అసిస్టెంట్ల కొరత కూడా ఉంది. వీటిని త్వరితగతిన భర్తీచేయాల్సి ఉంది. ఇక స్వీపర్లు, అటెండర్లు, నైట్‌వాచ్‌మన్లు కూడా లేని స్కూళ్లు కూడా జిల్లాలో ఎక్కువ సంఖ్యలోనే ఉన్నాయి. కొన్ని స్కూళ్లలో జూనియర్ అసిస్టెంట్లు కూడా లేరు. మోడల్ స్కూళ్లలోనూ ఇక్కట్లే గతేడాది జిల్లాలో 29 మోడల్ స్కూళ్లు ప్రారంభమయ్యాయి. వీటిలోనూ చాలా సమస్యలు ఉన్నాయి. చాలా స్కూళ్ల భవన నిర్మాణ పనులు నెమ్మదిగా సాగుతున్నాయి. పది భవనాల్లో చిన్నచిన్న పనులు మిగిలిపోయాయి. చాలాచోట్ల రెండో అంతస్తు పనులు కొనసాగుతున్నాయి. గ్రౌండ్‌ఫ్లోర్ పూర్తయిన గదుల్లో క్లాసులు చెబుతున్నారు. బచ్చన్నపేట, ములుగు, ముస్త్యాల, చిలుకోడు, వంచనగిరి, కల్వల, కొడకండ్ల, నేరడ, మద్దూరు, మహబూబాబాద్, మరిపెడ, కొరికిశాల, బండారుపల్లి మోడల్స్కూళ్లలో తాగునీటి సౌకర్యం లేక విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారు. మరిపెడ, బండారుపల్లి, నర్మెట, గుర్తూరు, జఫర్‌గఢ్ స్కూళ్లలో టాయిలెట్ సౌకర్యం ఉన్నా నీటి కనెక్షన్ లేకపోవడంతో నిరుపయోగంగా ఉన్నాయి. రఘునాధపల్లిలో మోడల్‌స్కూల్ భవనం నిర్మాణంలో ఉండడంతో అక్కడి హైస్కూల్లోనే కొనసాగిస్తున్నారు. టీజీటీ,పీజీటీ పోస్టులు ఇంకా భర్తీ కాలేదు. మొత్తంగా 72 పీజీటీలు, 99 టీజీటీల పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఈ విద్యాసంవత్సరానికి ఆరో తరగతిలో ప్రవేశాలు పూర్తికాగా, ఇంటర్ ప్రథమ సంవత్సరంలో అడ్మిషన్లు జరగనున్నాయి. దేవరుప్పుల : ప్రభుత్వ పాఠశాలలకు ముందస్తుగా పుస్తకాలు అందజేసిన తరుణంలో విద్యార్థులను ఆకర్షించేందుకు బడిబాట చేపట్టకపోవడం తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఓ వైపు ప్రైవేటు పాఠశాలలు తమ విద్యార్థులు సాధించిన ఫలితాలను చూపెట్టి తల్లిదండ్రులను ఆకర్షించే పనిలో పడితే విద్యాశాఖ మాత్రం తమకు ఏమాత్రం పట్టనట్టు వ్యవహరిస్తోంది. ప్రతి ఏటా విద్యా సంవత్సరం ఆరంభానికి ముందే బడిబాట, విద్యా సంబరాల పేరిట గ్రామాల్లో ర్యాలీలు, అవగాహన కార్యక్రమాలు నిర్వహించేది. కానీ ఈసారి మాత్రం అటువంటి కార్యక్రమాలు చేపట్టకపోవడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. పిల్లలను చేర్చుకునేందుకు ప్రభుత్వ పాఠశాలలు ఎటువంటి కార్యక్రమాలు చేపట్టకపోవడం ప్రైవేటు పాఠశాలలకు కలిసి వస్తోంది. విస్తృత ప్రచారం చేస్తున్న ప్రైవేటు స్కూళ్లు తమ టార్గెట్లను పూర్తిచేసుకుంటున్నాయి. కొన్ని ప్రైవేటు స్కూళ్లు టెక్నో విద్య పేరిట విస్తృత ప్రచారం చేపట్టి విద్యార్థులను ఆకర్షించడంతో ప్రభుత్వ ఉపాధ్యాయుల్లో కలవరం మొదలైంది. బడిబాట ఆదేశాలు రాలేదు : ఎంఈఓ బడిబాట నిర్వహించాలని ప్రభుత్వం నుంచి తమకు ఎటువంటి ఆదేశాలు రాలేదని ఎంఈఓ మేకల రవికుమార్ తెలిపారు. కొన్ని గ్రామాల్లో ఇప్పటికే ప్రాథమిక స్థాయి విద్యార్థుల్లో ప్రమాణాలు పెంచేందుకు సీఆర్పీలతో ప్రత్యేక తరగతులు నిర్వహించినట్టు చెప్పారు. ఇదే సందర్భంలో ఇంటింటికీ తిరిగి బడిఈడు పిల్లల వివరాలు సేకరించినట్టు పేర్కొన్నారు. పీడిస్తున్న మరుగుదొడ్ల సమస్య ప్రభుత్వ పాఠశాలల్లో మరుగుదొడ్ల సమస్య విద్యార్థులను పట్టి పీడిస్తోంది. ప్రధానంగా బాలికలు పలు ఇబ్బందులకు గురవుతున్నారు. బాలికల డ్రాపవుట్‌కు ఇది కూడా ఓ కారణమని సర్వేలు చెబుతున్నాయి. అయినప్పటికీ మరుగుదొడ్ల నిర్మాణంలో ప్రభుత్వం అలసత్వం వీడడం లేదు. జిల్లాలోని 223 పాఠశాలల్లో మరుగుదొడ్లు అసలే లేవని రికార్డులు చెబుతున్నాయి. ఉన్నచోట నీటి సౌకర్యం లేక నిరుపయోగంగా మారుతున్నాయి. మరికొన్ని చోట్ల శిథిలమై పనికిరాకుండా పోయాయి. పాఠశాల నిర్వహణ గ్రాంటు నుంచి రూ.400-500 వరకు నిర్వహణకు వాడుకోవచ్చని అధికారులు చెబుతున్నా నిర్వహణకు అవి సరిపోకపోవడం లేదని ఉపాధ్యాయులు చెబుతున్నారు. ముందస్తుగానే పాఠ్యపుస్తకాలు బడులు తెరిచి నెలలు గడిచినా రాని పాఠ్యపుస్తకాలు ఈసారి ముందే వచ్చి రికార్డు సృష్టించాయి. ఏప్రిల్ చివరి వారం నాటికే చాలా స్కూళ్లకు పాఠ్యపుస్తకాలు చేరుకున్నాయి. ఇప్పటివరకు 98శాతం పాఠ్యపుస్తకాలు వచ్చాయి. జిల్లాకు 27,80,540 పాఠ్యపుస్తకాల అవసరం ఉండగా ఇప్పటి వరకు 27,37,24 పుస్తకాలు వచ్చాయి. జిల్లాకేంద్రం నుంచి మండలాల్లోని ఎంఆర్సీ భవనాలకు 24,99,509 పాఠ్యపుస్తకాలు చేరుకున్నాయి. కొన్నిచోట్ల స్కూల్పాయింట్లకు కూడా చేరుకున్నాయి. ఇంకా కేవలం 50వేల పుస్తకాలు మాత్రమే రావాల్సి ఉంది. ఈ ఏడాది ఏప్రిల్‌లో పాఠశాలల ముగింపు రోజునే పదో తరగతి విద్యార్థులకు పాఠ్యపుస్తకాలు అందజేయడం విశేషం. ఇక 1 నుంచి 9వ తరగతి విద్యార్థులకు పాఠశాలల ప్రారంభం రోజునే పుస్తకాలు పంపిణీ చేసేందుకు అధికారులు ప్రణాళికలు సిద్ధం చేశారు. -
బడికి వేళాయె!
నేడు పాఠశాలల పునఃప్రారంభం అరకొర సౌకర్యాలతో స్వాగతం 20.60 లక్షల పాఠ్యపుస్తకాలు సిద్ధం మారిన పదో తరగతి సిలబస్ పాఠశాలలకు వేసవి సెలవులు ముగిశాయి.. మరికొన్ని గంటల్లో బడిగంటలు మోగనున్నాయి.. ఇన్నాళ్లు ఎంచక్కా ఎంజాయ్ చేసిన చిన్నారులు ఆటపాటలకు టాటాచెప్పి బడిబాట పట్టనున్నారు. జిల్లాలో 3,300 ప్రభుత్వ, 1200 ప్రైవేటు పాఠశాలలు గురువారం ప్రారంభం కానున్నాయి. కొత్త పుస్తకాలు.. కొత్త బ్యాగులు.. కొత్త యూనిఫారాలు.. కొత్త స్నేహితులతో పిల్లల సంబరం.. వారిని పొద్దున్నే బడికి రెడీచేసి పంపడంలో తల్లిదండ్రుల హడావుడి.. ఇలాంటి బిజీబిజీ సన్నివేశాలు ప్రతి ఇంటా మళ్లీ కనిపిస్తాయి. వేసవి సెలవుల అనంతరం నగరంలోని అన్ని ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలు గురువారం నుంచిప్రారంభం కానున్నాయి. సుమారు 40 రోజులపాటు ఆటపాటలతో కాలక్షేపం చేసిన చిన్నారులంతా బడిబాట పట్టాల్సిన సమయం ఆసన్నమైంది. ఇప్పటికే కొత్త పుస్తకాలు, కొత్త యూనిఫారాలను సిద్ధం చేసుకున్న విద్యార్థులు కొత్త బ్యాగులతో స్కూళ్లల్లో అడుగు పెట్టేందుకు ఉవ్విళ్లూరుతున్నారు. చిన్నారులకు పాఠ్య పుస్తకాలు, బూట్లు, బ్యాగులు, యూనిఫారాల కొనుగోళ్లతో గత వారం రోజులుగా తల్లిదండ్రులు బిజీగా గడిపారు. నగరవ్యాప్తంగా 7.5 లక్షల మంది విద్యార్థులు పాఠశాలలకు వెళ్లేందుకు సిద్ధమవుతున్నారు. ఈ ఏడాది సుమారు 50 వేల మంది చిన్నారులు తొలిసారిగా బడుల్లోకి అడుగుపెడుతున్నారు. నూతన విద్యా సంవత్సరంలో కోటి ఆశలు, శతకోటి ఠమొదటిపేజీ తరువాయి ఆకాంక్షలతో బడిలో అడుగు పెడుతున్న చిన్నారులకు ఆల్ ది బెస్ట్. ముస్తాబైన స్కూళ్లు.. పాఠశాలలు పునఃప్రారంభమవుతున్న వేళ నగరంలో ప్రత్యేక వాతావరణం చోటుచేసుకుంది. షాపులన్నీ విద్యార్థులు, వారి తల్లిదండ్రులతో కళకళలాడుతున్నాయి. విద్యార్థులను, తల్లిదండ్రులను ఆకర్షించేం దుకు ప్రైవేటు, కార్పొరేట్ స్కూళ్లన్నీ ఇప్పటికే (తరగతి గదులు, పాఠశాల ప్రాంగణం) అలంకరించాయి. సర్కారు స్కూళ్లు మాత్రం పాత సమస్యలతోనే స్వాగతం పలుకనున్నాయి.పెరిగిన పుస్తకాల ధరలు పేపర్ ధర పెరిగిన దృష్ట్యా ఈ ఏడాది అన్ని రకాల పుస్తకాల ధరలు 5 నుంచి 10 శాతం పెరిగాయి. ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు పాఠ్యపుస్తకాలను ప్రభుత్వమే ఉచితంగానే పంపిణీ చేస్తుండగా, ప్రైవేటు, కార్పొరేట్ స్కూళ్లలో పుస్తకాల ధరలు ఆకాశాన్నంటుతున్నాయి. అంతేకాదు పలు ప్రైవేటు స్కూళ ్లలో అడ్మిషన్ తీసుకున్న విద్యార్థులందరూ పాఠ్యపుస్తకాలు, నోటు పుస్తకాలు తమ వద్దే కొనాలని యాజమాన్యాలు షరతులు పెట్టాయి. ఇప్పటికే 95 శాతం మంది విద్యార్థులు తమకు అవసరమైన పుస్తకాలు, ఇతర వస్తువులను కొనుగోలు చేశారు. ఈ ఏడాది కేవలం స్కూల్ విద్యార్థుల వల్ల సాధారణ మార్కెట్ (బ్యాగులు, బూట్లు, యూనిఫారమ్ తదితరాలన్నీ కలిపి)లో దాదాపు రూ.100 కోట్లకు పైగా వ్యాపారం జరిగినట్టు అంచనా. మధ్యతరగతి వర్గాల పిల్లలు చదువు‘కొంటున్నది’ఇలా.. తరగతి ట్యూషన్ ఫీజు ట్రాన్స్పోర్ట్ పుస్తకాలు అడ్మిషన్ ఫీజు నర్సరీ-యూకేజీ 18,000 7,500 2,500 10,000 1,2,3వ తరగతులకు 23,000 10,000 3,000 10,000 4,5వ తరగతులకు 28,000 12,000 3,400 15,000 6,7వ తరగతులకు 33,000 15,000 3,500 20,000 8,9వ తరగతులకు 38,000 15,000 4,000 20,000 10వ తరగతికి 42,000 15,000 4,000 20,000 నోట్: ఇవీకాక యూనిఫారాలు, షూ అండ్ సాక్స్, టై, లోగో, బెల్ట్‌ల ఖర్చు అదనం. -
వడివడిగా.. బడికి
నేటి నుంచి పాఠశాలల పునః ప్రారంభం స్కూళ్లను అలంకరించిన ప్రైవేట్, కార్పొరేట్ యాజమాన్యాలు సర్కార్ బడుల్లో మాత్రం సమస్యలే స్వాగతతోరణాలు కొనుగోళ్లతో కళకళలాడిన మార్కెట్లు సిటీబ్యూరో: వేసవి సెలవుల అనంతరం నగరంలోని అన్ని ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలు గురువారం నుంచి ప్రారంభం కానున్నాయి. సుమారు 40 రోజులపాటు ఆటపాటలతో కాలక్షేపం చేసిన చిన్నారులంతా బడిబాట పట్టాల్సిన సమయం ఆసన్నమైంది. ఇప్పటికే కొత్త పుస్తకాలు, కొత్త యూనిఫారాలను సిద్ధం చేసుకున్న విద్యార్థులు కొత్త బ్యాగులతో స్కూళ్లల్లో అడుగు పెట్టేందుకు ఉవ్విళ్లూరుతున్నారు. చిన్నారులకు పాఠ్య పుస్తకాలు, బూట్లు, బ్యాగులు, యూనిఫారాల కొనుగోళ్లతో గత వారం రోజులుగా తల్లిదండ్రులు బిజీగా గడిపారు. నగరవ్యాప్తంగా 7.5 లక్షల మంది విద్యార్థులు పాఠశాలలకు వెళ్లేందుకు సిద్ధమవుతున్నారు. ఈ ఏడాది సుమారు 50 వేల మంది చిన్నారులు తొలిసారిగా బడుల్లోకి అడుగుపెడుతున్నారు. నూతన విద్యా సంవత్సరంలో కోటి ఆశలు, శతకోటి ఠమొదటిపేజీ తరువాయి ఆకాంక్షలతో బడిలో అడుగు పెడుతున్న చిన్నారులకు ఆల్ ది బెస్ట్. ముస్తాబైన స్కూళ్లు.. పాఠశాలలు పునఃప్రారంభమవుతున్న వేళ నగరంలో ప్రత్యేక వాతావరణం చోటుచేసుకుంది. షాపులన్నీ విద్యార్థులు, వారి తల్లిదండ్రులతో కళకళలాడుతున్నాయి. విద్యార్థులను, తల్లిదండ్రులను ఆకర్షించేం దుకు ప్రైవేటు, కార్పొరేట్ స్కూళ్లన్నీ ఇప్పటికే (తరగతి గదులు, పాఠశాల ప్రాంగణం) అలంకరించాయి. సర్కారు స్కూళ్లు మాత్రం పాత సమస్యలతోనే స్వాగతం పలుకనున్నాయి. పెరిగిన పుస్తకాల ధరలు పేపర్ ధర పెరిగిన దృష్ట్యా ఈ ఏడాది అన్ని రకాల పుస్తకాల ధరలు 5 నుంచి 10 శాతం పెరిగాయి. ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు పాఠ్యపుస్తకాలను ప్రభుత్వమే ఉచితంగానే పంపిణీ చేస్తుండగా, ప్రైవేటు, కార్పొరేట్ స్కూళ్లలో పుస్తకాల ధరలు ఆకాశాన్నంటుతున్నాయి. అంతేకాదు పలు ప్రైవేటు స్కూళ ్లలో అడ్మిషన్ తీసుకున్న విద్యార్థులందరూ పాఠ్యపుస్తకాలు, నోటు పుస్తకాలు తమ వద్దే కొనాలని యాజమాన్యాలు షరతులు పెట్టాయి. ఇప్పటికే 95 శాతం మంది విద్యార్థులు తమకు అవసరమైన పుస్తకాలు, ఇతర వస్తువులను కొనుగోలు చేశారు. ఈ ఏడాది కేవలం స్కూల్ విద్యార్థుల వల్ల సాధారణ మార్కెట్ (బ్యాగులు, బూట్లు, యూనిఫారమ్ తదితరాలన్నీ కలిపి)లో దాదాపు రూ.100 కోట్లకు పైగా వ్యాపారం జరిగినట్టు అంచనా. మధ్యతరగతి వర్గాల పిల్లలు చదువు‘కొంటున్నది’ఇలా.. తరగతి ట్యూషన్ ఫీజు ట్రాన్స్పోర్ట్ పుస్తకాలు అడ్మిషన్ ఫీజు నర్సరీ-యూకేజీ 18,000 7,500 2,500 10,000 1,2,3వ తరగతులకు 23,000 10,000 3,000 10,000 4,5వ తరగతులకు 28,000 12,000 3,400 15,000 6,7వ తరగతులకు 33,000 15,000 3,500 20,000 8,9వ తరగతులకు 38,000 15,000 4,000 20,000 10వ తరగతికి 42,000 15,000 4,000 20,000 నోట్: ఇవీకాక యూనిఫారాలు, షూ అండ్ సాక్స్, టై, లోగో, బెల్ట్‌ల ఖర్చు అదనం. -
అమెరికాలో జలపాతంలో జారిపడి పొదిలి యువకుడి మృతి
పొదిలి, న్యూస్‌లైన్: వేసవి సెలవులను సరదాగా గడిపేందుకు వెళ్లిన ఓ యువకుడు జలపాతంలో జారిపడి మృతిచెందాడు. ఈ ఘటన అమెరికాలోని డెలావేర్ స్టేట్ విల్‌మిల్టన్ సిటీలో భారత కాలమానం ప్రకారం సోమవారం మధ్యాహ్నం జరిగింది. వివరాలు.. ప్రకాశం జిల్లా పొదిలికి చెందిన నారాయణరెడ్డి, సుజాతలు ఉద్యోగరీత్యా ఒమన్ దేశంలో నివాసం ఉంటున్నారు. వీరి కుమారుడు, చికాగోలో ఎమ్ఎస్ చేస్తున్న సందీప్‌రెడ్డి(22) వీకెండ్ సెలవులు గడిపేందుకు అతని బాబాయి శ్రీనివాసులరెడ్డి నివాసం ఉంటున్న డెలావేర్ స్టేట్‌లోని విల్‌మిల్టన్ సిటీకి వెళ్లాడు. సెలవుల్లో శ్రీనివాసరెడ్డి, అతని మిత్రులు, కుటుంబ సభ్యులతో కలసి సందీప్‌రెడ్డి ఆదివారం సాయంత్రం జలపాతం దగ్గరకు వెళ్లాడు. ప్రమాదవశాత్తు జలపాతంలో జారిపడిన సందీప్‌రెడ్డిని రక్షించేందుకు శ్రీనివాసరెడ్డి చేసిన ప్రయత్నాలు విఫలమయ్యాయి. కోమాలోకి వెళ్లిన సందీప్‌రెడ్డిని అక్కడి వైద్యశాలలో చేర్పించారు. చికిత్స పొందుతూ సోమవారం మధ్యాహ్నం మృతిచెందినట్లు కుటుంబ సభ్యులకు సమాచారం ఇచ్చారు. సందీప్‌రెడ్డి విజయవాడ కేఎల్ యూనివర్సిటీలో బీటెక్ చేసి ఎంఎస్ కోసం అమెరికా వెళ్లాడు. -
ప్రాణం తీసిన ‘మోపెడ్’
కరీంనగర్ క్రైం, న్యూస్‌లైన్ : వేసవి సెలవులు బంధువుల ఇంట్లో గడుపుదామని వచ్చిన ఐదుగురు చిన్నారులు డీర్ పార్క్‌కు వెళ్లి తిరిగి వస్తుండగా ప్రమాదానికి గురయ్యారు. వీరిలో ఇద్దరు మృ తి చెందగా ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. పోలీసుల కథనం ప్రకారం. నగరంలోని సప్తగిరికాలనీలో ఎండీ అహ్మద్ కుటుంబం నివాసం ఉంటోంది. ముంబాయికి చెందిన ఎండీ రియాజ్(12), హైదరాబాద్‌కు చెందిన సహబాజ్(9), సోహెల్(7) వారి తల్లిదండ్రులతో కలిసి అహ్మద్ ఇంటికి వచ్చారు. మంగళవారం మధ్యాహ్నం 2గంటల సమయంలో నగరానికి వచ్చిన చిన్నారులతోపాటు వీరి ఇంటికి సమీపంలో ఉండే అంశాల శ్రీకాంత్(20) కలిసి నగరంలోని డీర్‌పార్క్‌కు రెండు ద్విచక్రవాహనాలపై వెళ్లారు. ఒక వాహనంపై శ్రీకాంత్‌తోపాటు చిన్నారులు కూర్చోగా మరో వాహనంపై వీరి బంధువులు కూడా వెళ్లారు. అక్కడ సరదాగా గడిపిన వారు పార్క్ మూసిన తర్వాత బయటకు వచ్చారు. కాంత్ తన మోపెడ్(టీవీఎస్ ఎక్సైల్)పై రియాజ్, సహబాజ్, సోహె ల్, అహ్మద్ కుమారుడు ఆసీఫ్(10)లను తీసుకుని సిరి సిల్ల బైపాస్‌రోడ్డుపై సప్తగిరికాలనీకి బయల్దేరాడు. ఎదురుగా వస్తున్న లారీ, మోపెడ్ ఎదురెదురుగా ఢీకొట్టుకో వడంతో అంశాల శ్రీకాంత్(20) అక్కడిక్కడే మృతి చెం దాడు. మిగతావారు తీవ్రంగా గాయపడ్డారు. వెనకాలే వస్తున్న బంధువులు సోహెల్, రియాజ్, సహబాజ్, ఆసీఫ్‌లను ఆస్పత్రికి తరలిస్తుండగా సోెహ ల్ మార్గంమధ్యలోనే మృతి చెందాడు. ట్రాఫిక్ పోలీసులు సంఘటనస్థలానికి చేరుకుని శ్రీకాంత్ మృతదేహన్ని పోస్ట్‌మార్టం నిమిత్తం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ప్రమాదానికి అ తి వేగమే కారణమని ప్రత్యక్ష సాక్షులు పేర్కొన్నారు. ఐదుగురు కూర్చోవడంతో కంట్రోల్ కాలేదని వారు తెలిపారు. ఐదు నిమిషాల్లోనే ప్రమాదం.. శ్రీకాంత్ ఈ మధ్యే డీఎంఎల్టీ ప్రథమ సంవత్సరం పూర్తి చేశాడు. అహ్మద్ కుటుంబంతో పరిచయం ఉండడంతో శ్రీకాంత్‌తో కలిసి పిల్లలను పంపించారు. వీరి వెంట మరో కుటుంబం కూడా పార్క్‌కు వెళ్లింది. వారు ఒక వాహనంపై వస్తుండగా సోహెల్ వారితోపాటే వచ్చాడు. చివరి సమయంలో శ్రీకాంత్‌తో పాటు వెళ్తానని మారం చేయడంతో సోహెల్‌ను అతడి బండిపై కూర్చోబెట్టారు. పార్క్ నుంచి బయలుదేరిన సుమారు ఐదు నిమిషాల్లోనే ఈ ప్రమాదం జరిగింది. -
వేసవి బడులకు విశేష స్పందన
నాగిరెడ్డిపేట, న్యూస్‌లైన్ : ‘అందరూ చదవాలి..అందరూ ఎదగాలి’ అనే లక్ష్యసాధన దిశగా..ప్రభుత్వ పాఠశాలల్లో వెనుకబడిన విద్యార్థులను రాణించేలా చేయాలనే ఉద్దేశం తో వేసవి సెలవుల్లో ఆర్వీఎం అధికారులు అభ్యాస దీపికలను అందజేసి పాఠశాలల సముదాయాల్లోనే వేసవిబడులను ప్రారంభించారు. గ్రామాల్లో వేసవి తరగతులను సీఆర్పీలు నిర్వహిస్తున్నారు. 1 నుంచి 5వ తరగతి వరకు తెలుగు, ఆంగ్లం, గణితాల్లో విద్యార్థులలో కనీస సామర్థ్యాలను పెంపొందించాలనే ఆశయంతో ప్రభుత్వం ఈ తరగతులను ప్రారంభించింది. వేసవి సెలవుల్లో విద్యార్థులు అభ్యాసదీపికకు కొంతసమయం కేటాయించి ఆడుతూ, పా డుతూ ఆనందంతో అభ్యాసాలు, కృత్యాలు చేసే ఉపయోగకరంగా ఉండేవిధంగా కృషి చేస్తున్నారు. మం డలంలోని గోపాల్పేట కాంప్లెక్స్ పరిధిలో గల గోపాల్పేట, బొల్లారం కాంప్లెక్స్ పరిధిలోని బొ లా ్లరం ప్రాథమిక పాఠశాల, తాండూర్ కాంప్లెక్స్పరిధిలోని కిచ్చన్నపేట ప్రాథమిక పాఠశాల, మాల్తుమ్మెద కాం ప్లెక్స్ పరిధిలోని గోలిలింగాల ప్రాథమికొన్నత పాఠశాలలో వేసవి తరగతులు నిర్వహిస్తున్నారు. ప్రతిరోజు రెండు గంటలు ప్రతిరోజు ఉదయం 7.30 గంటల నుంచి 9.30గంటల వరకు తరగతులు నిర్వహిస్తున్నారు. 1-5వ తరగతిలో విద్యనభ్యసించే విద్యార్థుల్లో ‘సి’గ్రేడ్‌లో ఉన్న విద్యార్థులను గుర్తించి వారిలో కనీస సామర్థ్యాలను పెంపొందించడమే ఈ తరగతుల ముఖ్య ఉద్దేశం. ఈ నెల 10న జిల్లావ్యాప్తంగా పాఠశాలల కాంప్లెక్స్‌ల్లో సంబంధిత సీఆర్పీలు వేసవి బడులను ప్రారంభించారు. తెలుగులో వర్ణమాల-కృత్యాలు, సరళ, గుణింత, దిత్వాక్షర, సంయుక్తాక్షర పదాలు, చిన్న చిన్న వా క్యాలు, పొడుపుకథలు, సామెతలు, చిత్రకథ , ఎత్తుకుపై ఎ త్తు, కోతి-క్రికెట్ వంటి వాటిని వేసవి తరగతుల్లో సీఆర్పీలు గేయకథల రూపంలో విద్యార్థులకు బోధిస్తారు. ఆంగ్లంలో వర్క్‌బుక్, అల్ఫాబిట్ తదితర వాటిని విద్యార్థులకు నేర్పిస్తారు. గణితంలో సంఖ్యల గురించి తెలియజేయడం, కూడికలు, తీసివేతలు, గుణకారాలు, భాగహారాలు నేర్పిస్తారు. తల్లిదండ్రులకు సైతం పెరిగిన ఆసక్తి వేసవిబడులకు విద్యార్థులను పంపించేందుకు వారి తల్లిదండ్రులు సైతం ఆసక్తిని కనబరుస్తున్నారు. వేసవి సెలవుల్లో కేవలం ఉదయంపూట చల్లని వాతావరణంలో రెండుగంటలపాటు తరగతులు నిర్వహించడం వల్ల విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులు ఉండవని వారు పే ర్కొంటున్నారు. పాఠశాలలు పునఃప్రారంభమైన తరువాత వారు కింది తరగతుల్లో నేర్చుకున్న అంశాలను మర్చిపోతారని, అలాకాకుండా వేసవి తరగతులు నిర్వహించడం వల్ల విద్యార్థులకు పునశ్చరణ స్పష్టంగా ఉంటుందని అభిప్రాయ పడుతున్నారు. -
ఫొటోలు తీస్తూ.. బావిలో పడి వ్యక్తి మృతి
గోవర్ధనగిరి(రఘునాథపల్లి) న్యూస్‌లైన్ : ఫొటోలు తీయూలనే సరదా ఒకరి ప్రాణం తీసింది. కుమారుడు ఈత నేర్చుకుంటుండ గా ఫొటోలు తీస్తున్న ఓ వ్యక్తి ప్రమాదవశాత్తు బావిలో పడి మృతిచెందిన సంఘటన మండలంలోని గోవర్ధనగిరిలో గురువారం జరిగింది. కుటుంబ సభ్యుల కథనం ప్రకా రం.. సికింద్రాబాద్ లోని అడ్డగుట్టకు చెందిన బూర్గుల శ్రీనివాస్(34), సునీత దంపతులకు కుమారుడు, కూతురు ఉన్నారు. పిల్లలకు వేసవి సెలవులు కావడంతో ఇటీవల భార్యా పిల్లలను గోవర్ధనగిరిలోని అత్తారింటికి పంపాడు. వారిని తిరిగి తీసుకెళ్లేం దుకు అతడు బుధవారం రాత్రి గోవర్ధనగిరికి వచ్చాడు. ఉదయమే సంతోషంగా అందరితో కలిసి భోజనాలు చేసిన శ్రీనివాస్ సమీపంలోని కన్న వెంకటయ్య వ్యవసాయ బావిలో కుమారుడు మైఖేల్‌కు ఈత నేర్పేందుకు భార్య సునీత, కూతురు కరుణప్రియతో కలిసి వెళ్లాడు. అతడికి ఈత రానందున ఈత వచ్చిన భార్య కుమారుడికి ఈత నేర్పిస్తోంది. కూతురితో బావి గట్టుపై ఉండి బావిలో ఈత నేర్చుకుంటున్న దృశ్యాలను సరదాగా తన సెల్ కెమెరాలో బంధిస్తున్నాడు. ఈ క్రమంలో ప్రమాదవశాత్తు బండరారుు నుంచి కాలుజారి బావిలో పడ్డాడు. దీంతో ఆందోళనకు గురై భార్య వెంటనే తన చీర అందించబోగా దగ్గరకు రావొద్దంటూ అరుస్తూనే నీటిలో మునిగిపోయాడు. దీంతో ఆమె కేకలు వేయడంతో విన్న స్థానికులు పరుగున వచ్చి బావిలో మునిగిన శ్రీనివాస్‌ను బయటకు తీశారు. అప్పటికే శ్రీనివాస్ మృతిచెందగా కుటుంబ సభ్యుల రోదనలు మిన్నంటాయి. ఎస్సై సత్యనారాయణ కేసు దర్యాప్తు చేస్తున్నారు. అంత్యక్రియల కోసం మృతదేహాన్ని సికింద్రాబాద్ అడ్డగుట్టకు తీసుకెళ్లారు. -
శిక్షణ.. కాకూడదు శిక్ష
న్యూస్‌లైన్ , మంచిర్యాల సిటీ, వేసవి సెలవులు సద్వినియోగం చేసుకుంటే ఇటు విద్యార్థులు.. అటు యువత వివిధ శిక్షణలు తీసుకోవాలనుకుంటారు. ఇది శారీరక, మానసిక ఉల్లాసానికి, దృఢత్వానికి మంచిదే. అయితే జిల్లాలో ప్రస్తుతం 45 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదవుతోంది. ఇంత వేడిని తట్టుకుంటూ క్రీడా శిక్షణ పొందడం అంత సులువు కాదు. వేడిమితో శరీరంలోని నీటి శాతం తగ్గడంతో వడదెబ్బ తగలి అనారోగ్యానికి గురయ్యే అవకాశముంది. అందుకే ఆర్యోగాన్ని కాపాడుకునేందుకు పిల్లలు, విద్యార్థులు, యువత.. వారి తల్లిదండ్రులు, శిక్షకులు అందరూ తగు జాగ్రత్తలు పాటించాలి. అప్పుడు శిక్షణ శిక్షగా మారకుండా సాఫీగా సాగుతుంది. - వేసవిలో క్రీడా శిక్షణ.. ఆరోగ్యంపై ప్రభావం - జాగ్రత్తలు పాటిస్తే సరి.. లేకుంటే ఇబ్బందికరం దుస్తులు శిక్షణ పొందే క్రీడాకారులు మందం దుస్తులు ఉపయోగించరాదు. అప్పర్, లోయర్ దుస్తులు, కాటన్ దుస్తులు ఉపయోగించడం శరీరానికి మంచిది. ఒకరోజు వాడిన దుస్తులను మరుసటి రోజు వేసుకోరాదు. ప్రస్తుత ఉష్ణోగ్రతలకు ఏ రోజుకారోజు దుస్తులు ఉతికినవే ధరించాలి. వాతావరణం మారుమూల ప్రాంతాలు, అటవీ ప్రాంతాల్లో వాతావరణం కాస్త చల్లగా ఉన్నా మిగితా ప్రాంతాల్లో పగటి ఉష్ణోగ్రత సుమారు 45 డిగ్రీలు దాటి ఉంటోంది. రాత్రి సుమారు తొమ్మిది గంటల వరకు కూడా వాతావరణం వేడిగానే ఉంటోంది. ఇంతటి అత్యధిక వేడిలో ఆటలు ఆడటం, ఈత కొట్టడం, నృత్యం నేర్చుకోవాలంటే జాగ్రత్తలు కూడా అవసరమే. ఉదయం పదకొండు గంటల లోపు, సాయంత్రం ఐదు గంటల తరువాత క్రీడల్లో శిక్షణ తీసుకోవడం ఆరోగ్యానికి మేలు. ఉదయం శిక్షణ పొందిన వారు మధ్యాహ్నం కొద్దిసేపు నిద్రిస్తే శరీరానికి హాయి కలుగుతుంది. గ్లూకోజ్ గ్లూకోజ్ పొడిని నీటిలో కలుపుకొని తాగితే శరీరానికి అదనపు శక్తి సమకూరుతుంది. కొందరు తింటారు. ఇలా చేస్తే శరీరంలోని నీటి శాతం తగ్గిపోయి అనారోగ్య సమస్యలు తలెత్తుతాయి. గ్లాసెడు నీటిలో ఒక చెంచా పొడి కలిపి ఉదయం, సాయంత్రం తాగితే సరిపోతుంది. ఆహారం ఆకు కూరలు, కూరగాయలు, మజ్జిగ ప్రతిరోజు తీసుకోవడం మేలు. వీటితో పాటు నీటి శాతం ఎక్కువ ఉన్న పండ్లు, పండ్ల రసాలు తీసుకోవడం మరువరాదు. తాగునీరు ఉదయం పూట శిక్షణకు వెళ్లే క్రీడాకారులు తగినంత నీరు తాగాలి. వెంట తప్పనిసరిగా నీరు ఉండాలి. ఉదయం పూట అరటి పండు తింటే శరీరంలో విటమిన్ లోపం తలెత్తదు. శిక్షణ ముగిసే వరకు ప్రతి రోజు పుచ్చకాయ తినడం శరీరానికి చాలా మంచిది. దీనిలో 90 శాతం నీరు ఉంటుంది. సామర్థ్యాన్ని మించరాదు శరీరం శక్తి సామర్థాలకు మించి శిక్షణ పొందరాదు. సామర్థ్యానికి మించి సాధన చేయకుండ ఆటలో నైపుణ్యం పెంచుకోవాలి. పోటీ పడి అధిక బరువులు ఎత్తడం, ఎక్కువ దూరం పరుగెత్తడం, వ్యాయామం చేయడం వలన శరీరంలోని నీటి శాతం తగ్గి కోలుకోలేని స్థితికి చేరుకుంటాం. అతి వేగంగా ఆటలు ఆడి వెంటనే నీరు తాగడం శ్రేయస్కరం కాదు. నాట్యంలో శిక్షణ పొందే వారికి శ్రమ అధికంగా ఉంటుంది కాబట్టి నీటిని అధికంగా తీసుకోవడంతో పాటు, మజ్జిగ, నిమ్మరసం, కొబ్బరి నీరులో ఏదో ఒకటి తప్పనిసరిగా ప్రతి రోజూ ఉండాలి. చల్లని నీటితో స్నానం శిక్షణ పొందిన క్రీడాకారులు ఉదయం, సాయంత్రం చల్లని నీటితో స్నానం చేస్తే ఆరోగ్యానికి మంచిది. ఎండలో చల్లని నీటితో స్నానం చేయరాదు. నీడ వసతి ఉన్న చోటనే చల్లని నీటితో ఎక్కువ సేపు స్నానం చేయాలి. చెరువుల్లో ఎండ పూట ఈత కొట్టరాదు. ఉదయం పదకొండు, సాయంత్రం ఐదు గంటల తరువాత ఈత కొలనులో శిక్షణ పొందాలి. నిపుణుల సలహాలు పాటించాలి వేసవిలో వివిధ క్రీడల్లో శిక్షణ పొందడం మంచి అవకాశం. ఆరోగ్యాన్ని కాపాడుకుంటూ క్రీడల్లో నైపుణ్యం పెంచుకోవాలి. సాధన ఒకేసారి కాకుండా నెమ్మదిగా పెంచాలి. అధిక ఉష్ణోగ్రతలో సాధనను ఒకేసారి వేగవంతం చేయరాదు. శరీర సామర్థ్యం ఆసరాతోనే క్రీడల్లో శిక్షణ పొందాలి. బలహీన క్రీడాకారులు వేసవిలో శిక్షణకు దూరంగా ఉండటమే మేలు. ప్రవేశ పరీక్షలకు సన్నద్ధమయ్యే విద్యార్థులు శిక్షణలో నిపుణుల సలహాలు తప్పక పాటించాలి. - కనపర్తి రమేశ్, క్రీడా శిక్షకుడు -
తిరుమలకు పోటెత్తిన భక్తులు
శ్రీవారి దర్శనానికి 20 గంటలు గదుల కోసం గంటల కొద్దీ నిరీక్షణ తాగునీటి సమస్యపై జేఈవో సమీక్ష తిరుమల: పాఠశాలలు, కళాశాలలకు వేసవి సెలవులు ప్రారంభం కావడంతో తిరుమల భక్తులతో కిటకిటలాడుతోంది. ఎక్కడ చూసినా భక్తుల క్యూలే కనిపిస్తున్నాయి. వేకువజాము నుంచే దర్శన క్యూలలో జనం భారీగా బారులుతీరారు. సర్వదర్శనం కోసం మొత్తం 31కంపార్ట్మెంట్లలో భక్తులు నిండిపోయారు. వెలుపల రెండు కిలోమీటర్ల మేర స్వామి దర్శనం కోసం క్యూకట్టారు. వీరికి 20 గంటలు, 13 కంపార్ట్మెంట్లలో వేచి ఉన్న కాలిబాట భక్తులకు 14 గంటలు, రూ.300 టికెట్ల భక్తులకు ఆరుగంటల తర్వాత స్వామి దర్శనా నికి అనుమతించనున్నారు. రద్దీ పెరగటంతో గదుల కోసం భక్తులు కనీసం నాలుగైదు గంటలు నిరీక్షిం చారు. గదులు లభించని భక్తులు యాత్రి సదన్‌లో లాకర్లు పొందేందుకు కూడా నిరీక్షించక తప్పలేదు. తలనీలాలు సమర్పించుకునేందుకు ప్రధాన కల్యాణ కట్టతోపాటు మినీ కల్యాణ కట్టల్లో మూడు గంటలపాటు పడిగాపులు కాచారు. గదులు లభ్యంకాక చాలామంది ఆరుబైటే నిద్రించారు. శని వారం భక్తుల రద్దీ మరింత పెరిగే అవకాశం ఉంది. శుక్రవారం శ్రీవారి హుండీ ఆదాయం రూ.2.21 కోట్లు లభించింది. ప్రతి నీటిబొట్టునూ జాగ్రత్తగా వినియోగించాలి వేసవి సెలవుల్లో రద్దీ వల్ల తిరుమలలో భక్తులకు తాగునీటి సమస్య తలెత్తకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవడం కోసం జేఈవో కేఎస్. శ్రీనివాసరాజు ఇంజనీరింగ్ ఉన్నతాధికారులతో సమీక్షించారు. ప్రతినీటి బొట్టునూ జాగ్రత్తగా విని యోగించుకునేందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు. తిరుమలలోని జలాశయాల్లో ప్రస్తుతం 106రోజులకు సరిపడా తాగునీటి నిల్వలు ఉన్నాయన్నారు. ప్రత్యామ్నాయ చర్యలు తీసుకునేందుకు ప్రతి ఒక్క అధికారి సిద్ధంగా ఉండాలన్నారు. -
రేపటి నుంచే వేసవి సెలవులు
నేడు పాఠశాలలకు చివరి పనిదినం పునః ప్రారంభం కొత్త రాష్ట్రాల్లో హైదరాబాద్: రాష్ట్రంలో పాఠశాలలకు ఈ నెల 24వ తేదీ నుంచి వేసవి సెలవులు ప్రారంభం కానున్నారుు. బుధవారం పాఠశాలలకు చివరి పనిదినం. కాగా, పాఠశాలలు కొత్త రాష్ట్రాల్లో (తెలంగాణ, ఆంధ్రప్రదేశ్) పునఃప్రారంభం కానున్నారుు. ఇదిలాఉండగా, 7నుంచి పదో తరగతి చదివే విద్యార్థులకు విద్యాశాఖ వుుందుగానే పాఠ్యపుస్తకాల పంపిణీ చేపట్టింది. జిల్లాలకు పాఠ్య పుస్తకాల పంపిణీ పూర్తి కావచ్చిందని విద్యాశాఖ వర్గాలు తెలిపాయి. ప్రాథమికోన్నత, ఉన్నత తరగతుల విద్యార్థులు వేసవి సెలవుల్లో చదువుకునేలా ఏర్పాట్లు చేయాలనే లక్ష్యంతో చర్యలు చేపట్టినట్లు ప్రాథమిక విద్య ముఖ్య కార్యదర్శి పూనం మాలకొండయ్య తెలిపారు. 7, 8, 9, 10 తరగతుల విద్యార్థుల్లో ఇప్పటివరకు 70 శాతం వరకు విద్యార్థులకు పాఠ్య పుస్తకాలు పంపిణీ చేసినట్లు ఆమె పేర్కొన్నారు. హాస్టళ్లు, గురుకుల విద్యాలయాల్లో చదివే విద్యార్థులకు వుుందుగానే పుస్తకాలు పంపిణీ చేయుడం వల్ల ఉపయోగకరంగా ఉంటుందని పేర్కొన్నారు.