ప్రభుత్వ ఉన్నత పాఠశాలల ప్రధానోపాధ్యాయులు, బోధనేతర సిబ్బంది వేసవి సెలవుల్లోనూ పాఠశాలల్లో అందుబాటులో ఉండాలని ఏపీ పాఠశాల విద్యాశాఖ ఉత్తర్వులు జారీ చేసింది.
గుంటూరు: ప్రభుత్వ ఉన్నత పాఠశాలల ప్రధానోపాధ్యాయులు, బోధనేతర సిబ్బంది వేసవి సెలవుల్లోనూ పాఠశాలల్లో అందుబాటులో ఉండాలని ఏపీ పాఠశాల విద్యాశాఖ ఉత్తర్వులు జారీ చేసింది. పదో తరగతి పరీక్షల ఫలితాలు విడుదలైనందున బడుల్లోనే ఉండి విద్యార్థులకు అవసరమైన ధ్రువపత్రాలు జారీ చేయటం, పరీక్షల్లో తప్పిన వారికి సప్లిమెంటరీ పరీక్షలకు ఫీజుల వసూలు, హాల్ టికెట్ల జారీ వంటి విధులను నిర్వహించాలని పేర్కొంది. ఈ ఉత్తర్వులు ప్రభుత్వ, జెడ్పీ, మున్సిపల్, ఎయిడెడ్, సాంఘిక సంక్షేమ గురుకుల, కేజీబీవీ ఉన్నత పాఠశాలలకు వర్తిస్తాయి.