
సాక్షి, అమరావతి: కరోనా తీవ్రత దృష్ట్యా హైకోర్టుతో పాటు దిగువ కోర్టులకు వేసవి సెలవులను నాలుగు రోజుల ముందే ఇవ్వాలని హైకోర్టు నిర్ణయం తీసుకుంది. హైకోర్టుకు ఈ నెల 10వ తేదీ నుంచి జూన్ 11వ తేదీ వరకు వేసవి సెలవులను ప్రకటించింది. వాస్తవానికి హైకోర్టు అధికారిక క్యాలెండర్ ప్రకారం ఈనెల 14 నుంచి జూన్ 11 వరకు వేసవి సెలవులు ఇవ్వాల్సి ఉంది. అయితే అక్టోబర్ 23తో పాటు సెలవు దినాలుగా ప్రకటించిన నవంబర్ 3, 5 తేదీలను పని దినాలుగా ప్రకటించింది.
ఇదే సమయంలో జిల్లా కోర్టులు, సీనియర్ సివిల్ జడ్జి కోర్టులకు ఈ నెల 10 నుంచి జూన్ 8 వరకు సెలవులు ప్రకటించారు. జూనియర్ సివిల్ జడ్జి కోర్టులకు ఈ నెల 17 నుంచి జూన్ 8 వరకు సెలవులు ఇచ్చారు. ఈ మేరకు హైకోర్టు రిజిస్ట్రార్ జనరల్ ఉత్తర్వులు జారీ చేశారు.
Comments
Please login to add a commentAdd a comment