
సాక్షి, అమరావతి: హైకోర్టుతో పాటు కింది కోర్టులు, ట్రిబ్యునళ్లు జారీ చేసిన మధ్యంతర ఉత్తర్వులన్నింటినీ కరోనా పరిస్థితుల నేపథ్యంలో నెల రోజులపాటు హైకోర్టు పొడిగించింది. ఈ మేరకు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ప్రశాంత్‌కుమార్ మిశ్రా, న్యాయమూర్తి జస్టిస్ నైనాల జయసూర్యలతో కూడిన ధర్మాసనం బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది.
ఈ వ్యవహారాన్ని న్యాయస్థానం సుమోటోగా తీసుకొని బుధవారం విచారణ జరిపింది. కరోనా కేసులు, ఒమిక్రాన్ వేరియంట్ తీవ్రతను దృష్టిలో పెట్టుకున్న న్యాయస్థానం.. న్యాయవాదులు, కక్షిదారుల సౌకర్యార్థం బుధవారం నాటికి అమలులో ఉన్న మధ్యంతర ఉత్తర్వులన్నింటినీ పొడిగిస్తున్నట్లు తెలిపింది. తదుపరి విచారణను ఫిబ్రవరి 21కి వాయిదా వేసింది.
Comments
Please login to add a commentAdd a comment