కరీంనగర్ రాంనగర్‌కు చెందిన జువ్వాడి సుమన్‌రావు-సౌమ్య, యాచమనేని కిరణ్‌రావు-స్వప్న కుటుంబాలు హైదరాబాద్‌లో నివాసం ....
కరీంనగర్ రాంనగర్‌కు చెందిన జువ్వాడి సుమన్‌రావు-సౌమ్య, యాచమనేని కిరణ్‌రావు-స్వప్న కుటుంబాలు హైదరాబాద్‌లో నివాసం ఉంటున్నాయి. సుమన్‌రావు దంపతులకు సౌమిత్, సాహెత్ కవల పిల్లలు. హైదరాబాద్‌లోని ఢిల్లీ పబ్లిక్ స్కూల్‌లో 3వ తరగతి చదువుతున్నారు. సుమన్‌రావు తోడల్లుడు యాచమనేని కిరణ్‌రావు దంపతుల పిల్లలు ప్రతీష్, ప్రద్యుమ్న సైతం హైదరాబాద్‌లోని ఓక్రిడ్జ్ ఇంటర్నేషనల్ స్కూల్‌లో చదువుతున్నారు.
వేసవి సెలవుల కోసం తల్లిదండ్రులతో కలిసి నలుగురు పిల్లలు కరీంనగర్‌లోని తాతయ్య వెంకట్రామారావు ఇంటికి వచ్చారు. వీరికి స్థానిక సప్తగిరికాలనీకి చెందిన జోగినిపల్లి లక్ష్మణ్‌రావు కుమారుడు శివసాయి, దానబోయిన లక్ష్మయ్య (ప్రైవేటు కాలేజీలో లెక్చరర్) కుమారుడు సాయిశ్రీజన్, బోయినపల్లి రోహన్ మిత్రులు కావడంతో వీరంతా ప్రతిరోజూ క్రికెట్ ఆడేవారు.