సాక్షి, హైదరాబాద్ : ఉమ్మడి హైకోర్టుకు గురువారం నుంచి జూన్ 1వ తేదీ వరకు వేసవి సెలవులు ప్రకటించారు. తిరిగి జూన్ 4న హైకోర్టు కార్యకలాపాలు పూర్తిస్థాయిలో ప్రారంభమవుతాయి. ఈ సెలవుల్లో అత్యవసర కేసులను విచారించేందుకు వెకేషన్ కోర్టులను ఏర్పాటుచేశారు. ఈ మేరకు రిజిస్ట్రార్ జనరల్ సీహెచ్ మానవేంద్రనాథ్‌రాయ్ బుధవారం ఓ ప్రకటనలో పేర్కొన్నారు. మొత్తం రెండు దశల్లో ఈ వెకేషన్ కోర్టులు పనిచేస్తాయి. మొదటి దశ వెకేషన్ కోర్టు 10, 17వ తేదీల్లో ఉంటుంది.
అత్యవసర కేసులను దాఖలు చేయాలనుకునే వారు ఈ నెల 8న దాఖలు చేయాల్సి ఉంటుంది. వాటిపై 10వ తేదీన కోర్టు విచారణ జరుపుతుంది. అలాగే 15న దాఖలు చేసే కేసులను 17న విచారిస్తారు. మొదటి దశ వెకేషన్ కోర్టులకు న్యాయమూర్తులు జస్టిస్ ఉప్మాక దుర్గాప్రసాదరావు, జస్టిస్ తాళ్లూరి సునీల్ చౌదరి, జస్టిస్ అభినంద్‌కుమార్ షావిలి నేతృత్వం వహిస్తారు. ఇందులో జస్టిస్ దుర్గాప్రసాదరావు, జస్టిస్ అభినంద్‌కుమార్‌లు ధర్మాసనంగా, జస్టిస్ సునీల్‌చౌదరి సింగిల్ జడ్జిగా కేసులను విచారిస్తారు.
24, 31వ తేదీల్లో రెండో దశ వెకేషన్ కోర్టు..
ఇక రెండో దశ వెకేషన్ కోర్టు 24, 31వ తేదీల్లో ఉంటుంది. అత్యవసర కేసులను దాఖలు చేయాలనుకునే వారు 22, 29వ తేదీల్లో చేసుకోవాలి. 22న దాఖలైన కేసులను 24న, 29న దాఖలైన కేసులను 31న విచారించడం జరుగుతుంది. ఈ రెండో దశ వెకేషన్ కోర్టులకు జస్టిస్ ఎస్.వి.భట్, జస్టిస్ జె.ఉమాదేవి, జస్టిస్ షమీమ్ అక్తర్‌లు నేతృత్వం వహిస్తారు. జస్టిస్ భట్, జస్టిస్ ఉమాదేవిలు ధర్మాసనంగా కేసులను విచారిస్తే, జస్టిస్ షమీమ్ అక్తర్ సింగిల్‌జడ్జిగా కేసులను విచారిస్తారు.
హైకోర్టుకు వేసవి సెలవులు
Published Thu, May 3 2018 1:25 AM | Last Updated on Thu, May 3 2018 8:24 AM
Advertisement
Comments
Please login to add a commentAdd a comment