తెలంగాణలో స్కూళ్లకు వేసవి సెలవులు పొడిగింపు | Extension Of Summer Holidays For Schools In Telangana | Sakshi
Sakshi News home page

తెలంగాణలో స్కూళ్లకు వేసవి సెలవులు పొడిగింపు

Published Tue, Jun 15 2021 8:14 PM | Last Updated on Wed, Jun 16 2021 1:32 AM

Extension Of Summer Holidays For Schools In Telangana - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: తెలంగాణలో ఈ నెల 20 వరకు స్కూళ్లకు వేసవి సెలవులను ప్రభుత్వం పొడిగించింది. ఈ మేరకు స్కూల్ ఎడ్యుకేషన్ డైరెక్టర్ ఉత్తర్వులు జారీ చేశారు. కాగా, ప్రస్తుతం తెలంగాణలో కరోనా కేసులు తగ్గుముఖం పడుతున్నాయి. ప్రభుత్వం.. కరోనా రెండో వేవ్‌ నియంత్రణ కోసం రాష్ట్రంలో విధించిన లాక్‌డౌన్‌ను పొడిగిస్తూ, పలు సడలింపులు ఇచ్చింది. ఈ నెల 19 వరకు లాక్‌డౌన్‌ అమలులో ఉంది. సాయంత్రం 6 గంటల నుంచి మరుసటి రోజు ఉదయం 6 గంటల వరకు  లాక్‌డౌన్‌ అమలవుతోంది.

ప్రస్తుత కరోనా పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని తెలంగాణ ప్రభుత్వం ఇంటర్‌ మీడియట్‌ రెండవ సంవత్సరం పరీక్షలను కూడా రద్దు చేసింది. మొదటి సంవత్సరం విద్యార్థులను సెకండ్‌ ఇయర్‌కు ప్రమోట్‌ చేసింది. ఈ మేరకు సోమవారం అధికారిక ఉత్తర్వులు జారీ చేసిన సంగతి తెలిసిందే.

చదవండి: తెలంగాణ: మరో వారంలో ఇంటర్‌ ఫలితాలు
నేను తెలంగాణ సంస్కృతిని కించపరచలేదు: హైపర్‌ ఆది

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement