వేసవి అంటే ఎంతో ఇష్టం | sakshi chit chat with Aksha Pardasany | Sakshi
Sakshi News home page

వేసవి అంటే ఎంతో ఇష్టం

Published Fri, May 15 2015 4:57 AM | Last Updated on Mon, Aug 20 2018 8:20 PM

వేసవి అంటే ఎంతో ఇష్టం - Sakshi

వేసవి అంటే ఎంతో ఇష్టం

కందిరీగ మూవీ ఫేం హీరోయిన్ అక్ష
మంచిర్యాల రూరల్ : వేసవి అంటే చాలాఇష్టం. ప్రతి ఏడాది వేసవి సెలవులు ఎప్పుడొస్తాయాని ఎదురు చూ సేదాన్ని’’ అంటోంది కందిరీగ సినిమా హీరోయిన్ అక్ష. తూర్పు జిల్లా కేంద్రమైన మంచిర్యాలలోని ఓ బట్టల షాపింగ్ మాల్‌ను ప్రారంభించేందుకు గురువారం మంచిర్యాలకు విచ్చేసిన కందిరీగ ఫేం హీరోయిన్ అక్ష, సాక్షితో తన చిన్ననాటి అనుభూతులు, వేసవిలో తీసుకోవాల్సిన జాగ్రత్తలను వివరించారు.

సాక్షి : మీరు పుట్టింది, పెరిగింది ఎక్కడ?
అక్ష : ముంబయ్‌లో పుట్టి పెరిగాను, కామర్స్‌లో డిగ్రీ చేశాను.

సాక్షి : ఏం చదివారు?
అక్ష : కామర్స్‌లో డిగ్రీ చేశాను.
 
సాక్షి :తెలుగులో మీ మొదటి సినిమా?
అక్ష : యువత

సాక్షి :ఇప్పటి వరకు ఎన్ని సినిమాలు చేశారు?
అక్ష : తెలుగులో 8, మలయాళంలో 1, తమిళ్‌లో 1 చేశాను.

సాక్షి :ప్రస్తుతం చేస్తున్న సినిమాలు?
అక్ష : తమిళ్‌లో 2, తెలుగులో శ్రీకాంత్ హీరోగా ‘మెంటల్ పోలీస్’ అనే సినిమాల్లో నటిస్తున్నా.
 
సాక్షి :సినిమాల్లోకి ఎలా వచ్చారు?
అక్ష : 5వ తరగతి నుంచే నాకు యాడ్స్‌లో చేసే అవకాశాలు వచ్చాయి. 10వ తరగతిలో నేను చేసిన యాడ్ చూసి మలయాళ దర్శకుడు నాకు సినిమాల్లో అవకాశం ఇచ్చారు.
 
సాక్షి :మీరు హీరోయిన్ కాకపోతే?
అక్ష : సోషల్ వర్కర్‌గా ఉండేదాన్ని. సమాజ సేవ కోసం పాటు పడాలనే తపన నాలో ఉంది.
 
సాక్షి : సమ్మర్ హాలీడేస్‌లో ఎలాగడిపేవారు ?
అక్ష :
ప్రతి ఏడాది వేసవి సెలవులు ఎప్పుడొస్తాయా అని ఎదురు చూసేదాన్ని. ఏడాదంతా చదువుతో బిజీగా ఉండి, వేసవికి సెలవులు ఇవ్వగానే బంధువుల ఇంటికి వెళ్లడం, తల్లిదండ్రులతో కలిసి హిల్ స్టేషన్‌కు వెళ్లడం అంటే ఎంతో ఇష్టం. ఎండలో వెళ్తే వడదెబ్బతో పాటు, ఇతర వ్యాధులు వస్తాయని స్కూల్లోనే మా టీచర్లు చెప్పేవారు. అందుకే ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు బయటకు వెళ్లకుండా, ఉదయం, సాయంత్రం వేళల్లో మాత్రమే బయటకు ఆడుకునేందుకు వెళ్లేవాళ్లం.
 
సాక్షి : వేసవిలో చిన్నారులకు మీరిచ్చే సలహాలు ఏంటి?
అక్ష :
చిన్నవారైనా, పెద్దవారైనా ఎండ అందరికి ఒక్కటే. వీలైనంత వరకు ఎండలో బయటకు వెళ్లకుండా ఉంటే చాలా మంచిది. తప్పనిసరిగా వెళ్లాల్సి వస్తే, తలకు, కళ్లకు ఎండ తగలకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. తలకు క్యాప్, కళ్లకు కూలింగ్ గ్లాసెస్‌ను వాడాలి. ఎండకు మన శరీరం డీహైడ్రేషన్ అవుతుంటుంది. తప్పనిసరిగా ఎక్కువసార్లు నీటిని తాగుతూ ఉండాలి. దోస, ఖర్బూజ పండ్లలో నీరు ఉంటుంది. వీటిని ఎక్కువగా తీసుకుంటూ, కొబ్బరి బోండాలను తాగితే శరీరానికి కొత్త ఎనర్జీ వస్తుంది. చిన్నారులు మాత్రం ఆరుబయట ఎండలో ఆడుకోకుండా, ఇండోర్ గేమ్స్ ఆడేందుకే ఎక్కువగా సమయాన్ని కేటాయించాలి. స్విమ్మింగ్‌కు వెళ్లేవారు తప్పనిసరిగా తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. తల్లిదండ్రుల పర్యవేక్షణలో మాత్రమే ఈత కొట్టాలి.
 
సాక్షి : యువతకు మీరిచ్చే సందేశం?
అక్ష :
ప్రస్తుతం యువత అన్ని రంగాల్లోనూ రాణిస్తున్నారు. తాము అనుకున్న లక్ష్యాన్ని చేరేందుకు ఎంతటి కష్టాన్నైనా తేలికగా తీసుకోవడం హర్షించదగినది. ఈ మార్పుతో యువతకు సందేశాలు ఇవ్వాల్సిన అవసరం లేకున్నా, అనుకున్న లక్ష్యాలను సాధించేందుకు కృషి, పట్టుదల తప్పనిసరిగా ఉండాలన్నది నా అభిప్రాయం.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement