పిల్లల పండక్కి పయనం
నేటి నుంచి జూన్ 12 వరకు అంటే 51 రోజులపాటు పిల్లలకు పండగే పండగ. ఆడుకోవచ్చు.. పాడుకోవచ్చు.. ఎప్పుడైనా నిద్రపోవచ్చు.. ఎంతకైనా లేవచ్చు. ఊర్లకెళ్లవచ్చు.. ఊరికే ఉండవచ్చు.. ఇలా ఇష్టమొచ్చింది ఏది చేసినా పెద్దలు పెద్దగా పట్టించుకోరు. మహా అంటే జాగ్రత్త కోసం కొన్ని కండీషన్లు పెడతారు. అందుకే పిల్లలకు వేసవి సెలవులంటే పండగే పండగ. ఇలాంటి పండుగను ఎంజాయ్ చేసేందుకు విద్యార్థులు శనివారం తమ సొంతూళ్లకు పయనమయ్యారు. సహచరులకు, స్నేహితులకు వీడ్కోలు పలికి లగేజీలు సర్దుకుని సంబరంగా బస్టాండుకు చేరుకున్నారు. ఊర్లకు వెళ్లేవారు అధిక సంఖ్యలో ఉండటంతో సీట్ల కోసం వెంపర్లాడారు. దొరకనివారు ఫుట్‌బోర్డుపైనే నిలబడి వెళ్లిపోయారు. స్థానికంగా నివాసమున్న వారు అప్పుడే ఆటపాటల్లో మునిగిపోయారు.
- సాక్షి ఫొటోగ్రాఫర్