ఏడాది పొడవునా పుస్తకాలతో కుస్తీ పట్టిన విద్యార్థులకు గురువారం వేసవి సెలవులు ప్రకటించడంతో హుషారుగా ఇళ్లకు బయలుదేరారు.
అనంతపురం : ఏడాది పొడవునా పుస్తకాలతో కుస్తీ పట్టిన విద్యార్థులకు గురువారం వేసవి సెలవులు ప్రకటించడంతో హుషారుగా ఇళ్లకు బయలుదేరారు. ఈ వేసవిని ఎలా ఎంజాయ్ చేయాలో.. ఎక్కడెక్కడికి వెళ్లాలో... ఏ ఏ ఆటలు ఆడుకోవాలో... అని ఆలోచించుకుంటూ ఆనందంతో ప్రయాణమయ్యారు.
విద్యా సంవత్సరం నేటితో ముగియడంతో ఇన్నాళ్లూ ఇంటికి దూరంగా ఉన్న విద్యార్థులు సొంత గూటికి వెళ్తున్న ఆనందం వాళ్ల కళ్లలో స్పష్టంగా కనిపిస్తోంది. చాలా రోజుల తర్వాత ఇంటికి వెళ్తుండటంతో విద్యార్థుల ఆనందానికి అవధులు లేకుండా పోయింది. అనంతపురం జిల్లాలోని పలు పాఠశాలల విద్యార్థులు గురువారం తరగతులు ముగించుకొని ఇంటికి వెళ్తున్న సమయంలో సాక్షి కెమెరా క్లిక్మనిపించింది.