తాటిచెట్లపాలెం(విశాఖ ఉత్తర): వేసవి రద్దీ దృష్ట్యా ఈస్ట్ కోస్ట్ రైల్వే పలు మార్గాల్లో ప్రత్యేక రైళ్లను నడపనున్నట్లు సీనియర్ డివిజనల్ కమర్షియల్ మేనేజర్ జి.సునీల్‌కుమార్ తెలిపారు. రద్దీ రూట్లలో రెగ్యులర్ రైళ్లకు అవసరాన్ని బట్టి అదనపు కోచ్‌లను, బెర్త్‌లను జత చేయనున్నట్లు చెప్పారు. దేశంలోని పలు ఇతర ప్రాంతాలకు కూడా పలు స్పెషల్ రైళ్లు నడపాలని యోచిస్తున్నట్లు పేర్కొన్నారు.
విశాఖపట్నం–కిరండూల్ (08512)వయా కోరాపుట్ ప్రత్యేక చార్జీల రైలు
విశాఖపట్నంలో ప్రతీ రోజు రాత్రి 10.15 గంటలకు బయలుదేరే విశాఖపట్నం–కోరాపుట్ ప్రత్యేక చార్జీలతో నడిచే ఎక్స్‌ప్రెస్ మరుసటి రోజు ఉదయం 10 గంటలకు కిరండూల్ చేరుకుంటుంది. ఈ రైలు జూన్ 30 వరకు పొడిగించబడింది. తిరుగు ప్రయాణంలో 08511 ప్రతీ రోజు సాయంత్రం 3గంటలకు కిరండూల్‌లో బయలుదేరి తెల్లవారు 3 గంటలకు విశాఖపట్నం చేరుకుంటుంది. ఈ రైలు జూలై 1 వరకు పొడిగించబడింది.
విశాఖపట్నం–సికింద్రాబాద్ ప్రత్యేక చార్జీల రైలు
విశాఖపట్నం–సికింద్రాబాద్(08501) వీక్లీ స్పెషల్ ఫేర్ రైలు ప్రతీ మంగళవారం రాత్రి 11గంటలకు విశాఖపట్నం లో బయలుదేరి మరుసటి రోజు మధ్యాహ్నం 12 గంట లకు సికింద్రాబాద్ చేరుకుంటుంది. జూన్ 26 వరకు ఈ రైలు నడుస్తుంది. తిరుగు ప్రయాణంలో 08502 ప్రతీ బుధవారం సాయంత్రం 4.30 గంటలకు సికింద్రాబాద్‌లో బయలుదేరి మరుసటి రోజు ఉదయం 4.50 గంటలకు విశాఖపట్నం చేరుకుంటుంది. ఈ రైలు జూన్ 27 వరకు నడుస్తుంది.
విశాఖపట్నం–తిరుపతి ప్రత్యేక చార్జీల రైలు
విశాఖపట్నం–తిరుపతి(08573)వీక్లీ స్పెషల్ ఫేర్ రైలు ప్రతీ సోమవారం రాత్రి 10.55 గంటలకు విశాఖపట్నంలో బయలుదేరి మరుసటిరోజు మధ్యాహ్నం 1.25 గంటలకు తిరుపతి చేరుకుంటుంది. ఈ రైలు జూన్ 25 వరకు నడుస్తుంది. తిరుగు ప్రయాణంలో(08574)ప్రతీ మంగళవారం సాయంత్రం 3.30గంటలకు తిరుపతిలో బయలుదేరి మరుసటిరోజు ఉదయం 6.50 గంటలకు విశాఖపట్నం చేరుకుంటుంది. ఈ రైలు జూన్ 26 వరకు నడుస్తుంది.
కాచిగూడ–విశాఖపట్నం–తిరుపతి స్పెషల్ ట్రైన్
కాచిగూడ–విశాఖపట్నం(07016)స్పెషల్ రైలు ప్రతీ మంగళవారం సాయంత్రం 6.45 గంటలకు కాచిగూడలో బయలుదేరి మరుసటి రోజు ఉదయం 7.50 గంటలకు విశాఖపట్నం చేరుకుంటుంది. ఈ ప్రత్యేక రైలు జూన్ 26 వరకు నడుస్తుంది. తిరుగు ప్రయాణంలో 07479 విశాఖపట్నం నుంచి తిరుపతికి ప్రతీ బుధవారం రాత్రి 7.05గంటలకు బయలుదేరి మరుసటిరోజు ఉదయం 9.25 గంటలకు తిరుపతి చేరుకుంటుంది. జూన్ 27 వరకు ఈ స్పెషల్ రైలు నడుస్తుంది.
తిరుపతి–విశాఖపట్నం ఏసీ స్పెషల్
తిరుపతి–విశాఖపట్నం(07487)వీక్లీ ఏసీ స్పెషల్ రైలు ప్రతీ ఆదివారం రాత్రి 10.30 గంటలకు తిరుపతిలో బయలుదేరి మరుసటిరోజు ఉదయం 10.45 గంటలకు విశాఖపట్నం చేరుకుంటుంది. జూన్ 24 వరకు ఈ స్పెషల్ ట్రైన్ నడుస్తుంది. తిరుగు ప్రయాణంలో 07488 విశాఖపట్నంలో ప్రతీ సోమవారం రాత్రి 7.20 గంటలకు బయలుదేరి మరుసటిరోజు ఉదయం 8.10గంటలకు తిరుపతి చేరుకుంటుంది. జూన్ 25వ తేదీ వరకు ఈ రైలు నడుస్తుంది.
యశ్వంత్‌పూర్–విశాఖపట్నం తత్కాల్ స్పెషల్ ట్రైన్
యశ్వంత్‌పూర్–విశాఖపట్నం(06579) వీక్లీ తత్కాల్ స్పెషల్ ట్రైన్ ప్రతీ శుక్రవారం సాయంత్రం 6.35 గంటలకు యశ్వంత్‌పూర్‌లో బయలుదేరి మరుసటి రోజు మధ్యాహ్నం 2.35 గంటలకు విశాఖపట్నం చేరుకుంటుంది. ఏప్రిల్ 6వ తేదీ నుంచి మే 25వ తేదీ వరకు ఈ ట్రైన్ నడుస్తుంది. తిరుగుప్రయాణంలో 06580 ప్రతీ ఆదివారం మధ్యాహ్నం 1.45 గంటలకు విశాఖపట్పంలో బయలుదేరి మరుసటి రోజు ఉదయం 9.05గంటలకు యశ్వంత్‌పూర్ చేరుకుంటుంది. ఈ రైలు మే 27వ తేదీ వరకు నడుస్తుంది.
సికింద్రాబాద్ –గౌహతి స్పెషల్
సికింద్రాబాద్–గౌహతి(07149)వీక్లీ స్పెషల్ ప్రతీ గురువారం ఉదయం 7.30 గంటలకు సికింద్రాబాద్‌లో బయలుదేరి ఆదివారం ఉదయం 8.45 గంటలకు గౌహతి చేరుకుంటుంది. ఏప్రిల్ 6వ తేదీ నుంచి జూన్ 29 వరకు ఈ రైలు నడుస్తుంది. తిరుగు ప్రయాణంలో (07150)గౌహతిలో ప్రతీ సోమవారం ఉదయం 5.25గంటలకు బయలుదేరి బుధవారం ఉదయం 9.15గంటలకు సికింద్రాబాద్ చేరుకుంటుంది. ఈ రైలు జూలై 2వ తేదీ వరకు నడుస్తుంది.
సంబల్‌పూర్–బాన్సువాడ(బెంగళూరు)(08301)
వీక్లీ స్పెషల్ ప్రత్యేక రైలు ప్రతీ బుధవారం ఉదయం 9.30 గంటలకు సంబల్‌పూర్‌లో బయలుదేరి మరుసటి రోజు సాయంత్రం 4.40 గంటలకు బాన్సువాడ చేరుకుంటుంది. ఈ రైలు జూన్ 27 వరకు నడుస్తుంది. తిరుగు ప్రయాణంలో (08302) బాన్సువాడలో ప్రతీ గురువారం మధ్యరాత్రి తెల్లవారు శుక్రవారం 12.30గంటలకు బయలుదేరి మరుసటి రోజు శనివారం ఉదయం 6.35గంటలకు సంబల్‌పూర్ చేరుకుంటుంది. ఈ రైలు ఏప్రిల్ 6 నుంచి జూన్ 29 వరకు నడుస్తుంది.
Comments
Please login to add a commentAdd a comment