హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలో వేసవి సెలవుల్లోనూ విద్యార్థులకు మధ్యాహ్న భోజనం పథకం అందిస్తున్నట్లు డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి తెలిపారు. హైదరాబాద్లో శనివారం ఆయన మాట్లాడుతూ...ఒకటి నుంచి పదో తరగతి వరకు ఉన్న విద్యార్థులకు మధ్యాహ్న భోజనం ఇస్తున్నామన్నారు. దీనిపై ఈ నెల 18న కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించనున్నట్లు కడియం చెప్పారు. పెరుగుతున్న ఎండల దృష్ట్యా నేటి నుంచి తెలంగాణ వ్యాప్తంగా స్కూల్ విద్యార్థులకు వేసవి సెలవులు ప్రకటించిన విషయం తెలిసిందే.