
సాక్షి, హైదరాబాద్ : తెలంగాణలోని ప్రభుత్వ, ప్రైవేటు పాలిటెక్నిక్ కళాశాలలకు వేసవి సెలవులు వచ్చాయి. ఈ నెల 5వ తేదీ నుంచి వేసవి సెలవులు అని సాంకేతిక విద్యాశాఖ మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది. మే 31వ తేదీ వరకు వేసవి సెలవులు ఉంటాయని స్పష్టం చేసింది. సవరించిన అకడమిక్ షెడ్యూల్‌ను త్వరలోనే ప్రకటిస్తామని సాంకేతిక విద్యాశాఖ కమిషనర్ నవీన్ మిట్టల్ తెలిపారు.
చదవండి: సంపూర్ణ లాక్‌డౌనే ఏకైక మార్గం: ఎయిమ్స్ డైరెక్టర్
చదవండి: వ్యాక్సిన్‌పై ప్రధానికి లేఖ రాయనున్న సీఎం