
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని పాఠశాలలకు ఈ నెల 13 నుంచి విద్యాశాఖ వేసవి సెలవులు ప్రకటించింది. ఈనెల 12న చివరి పనిదినం కావడంతో ప్రతి ఉపాధ్యాయుడు విధులకు తప్పక హాజరు కావాలని విద్యా శాఖ ఉన్నతాధికారి ఒకరు పేర్కొన్నారు.
పాఠశాలలు తిరిగి జూన్ 1న ప్రారంభమవుతాయన్నారు. జూన్ 2న తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా పాఠశాలల్లో వేడుకలు నిర్వహించాలని నిర్ణయించింది. వాస్తవానికి ఏప్రిల్ 23న పాఠశాలలకు చివరి పనిదినం కాగా, జూన్ 12న తిరిగి ప్రారంభమయ్యేవి. అయితే ఆవిర్భావ వేడుకల కోసమే ప్రభుత్వం వేసవి సెలవులను ఏప్రిల్ 13 నుంచి మే 31 వరకు ఇచ్చి, జూన్ 1 నుంచి ప్రారంభించేలా చర్యలు చేపట్టింది.