AP Government Announced Summer Holidays To All Schools In The State From 1st May 2023 - Sakshi
Sakshi News home page

ఏపీలో మే 1 నుంచి స్కూళ్లకు వేసవి సెలవులు.. జూన్‌ 12 నుంచి రీఓపెన్‌

Published Wed, Apr 26 2023 9:53 AM | Last Updated on Wed, Apr 26 2023 10:15 AM

AP Govt Announces Summer Holidays 2023 Dates - Sakshi

సాక్షి, విజయవాడ: ఆంధ్రప్రదేశ్‌లో విద్యాసంస్థలకు వేసవి సెలవుల తేదీలపై విద్యాశాఖ స్పష్టత ఇచ్చింది. ఏప్రిల్‌ 30వ తేదీని ఈ అకడమిక్‌ ఇయర్‌ చివరి తేదీగా ప్రకటించిన విద్యాశాఖ..  మే 1 నుంచి జూన్‌ 11వ తేదీ దాకా పాఠశాలలకి వేసవి సెలవులు ఇవ్వనున్నట్లు పేర్కొంది. 

విద్యాశాఖ ఉత్తర్వుల ప్రకారం.. తిరిగి జూన్ 12వ తేదీ సోమవారం పాఠశాలలు వచ్చే అకడమిక్‌ ఇయర్‌కుగానూ పునఃప్రారంభం అవుతాయి. ఈ మేరకు విద్యాశాఖ కమిషనర్‌ సురేష్‌ కుమార్‌ మంగళవారం నాడు ఉత్తర్వులు జారీ చేశారు. రాష్ట్రంలోని ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలలన్నింటికీ ఈ ఉత్తర్వులు వర్తిస్తాయని తెలిపారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement