నేటి నుంచి పాఠశాలలు పునఃప్రారంభం | From today's schools Revitalization | Sakshi
Sakshi News home page

నేటి నుంచి పాఠశాలలు పునఃప్రారంభం

Published Fri, Jun 12 2015 12:40 AM | Last Updated on Sun, Sep 3 2017 3:35 AM

నేటి నుంచి పాఠశాలలు  పునఃప్రారంభం

నేటి నుంచి పాఠశాలలు పునఃప్రారంభం

ప్రభుత్వ బడుల్లో   సమస్యల స్వాగతం
ఒంటిపూట బడులకు టాటా
ఇక ఆరు నెలలు, వార్షిక పరీక్షలే..

 
వేసవి సెలవులు ఆనందంగా గడిపిన విద్యార్థులు మళ్లీ బడిబాట పట్టనున్నారు. శుక్రవారం నుంచి పాఠశాలలు పునఃప్రారంభం కానున్నారుు. బడిగంటలు గణ గణ గణ.. అంటూ మోగనున్నారుు. ప్రతీ ఏడాది మాదిరిగానే ప్రభుత్వ పాఠశాలలు విద్యార్థులకు సమస్యలతో స్వాగతం పలుకనున్నారుు. పాఠ్యపుస్తకాలు, యూనిఫామ్స్, అదనపు గదులు, మధ్యాహ్న  భోజన వసతులు, మరుగుదొడ్లు, ఉపాధ్యాయులు, వలంటీర్ల కొరత వంటివి  సవాళ్లుగా మారనున్నారుు.     
 
 బడి గంట నేడు మోగనుంది. పాఠశాలల్లో వసతుల కల్పన గతంలో కన్నా కాస్త మెరుగైంది. కానీ ఈసారీ విద్యార్థులకు ఇంకా సమస్యలే స్వాగతం  పలుకుతున్నారుు. ఎస్సెస్సీ ఫలితాల్లో సర్కారీ విద్యార్థులు మెరిసిన నేపథ్యంలో  వసతులు కల్పనపై మరింత
 దృష్టిసారించాల్సిన అవసరం ఉంది.
 
88 శాతం పాఠ్యపుస్తకాల రాక
 జిల్లాకు గురువారం వరకు 88శాతం పాఠ్య పుస్తకాలు వచ్చాయి. 17 లక్షల16వేల 99 పాఠ్య పుస్తకాలకు జిల్లా విద్యాశాఖ ప్రతిపాదించగా 15 లక్షల 27వేల 50 పాఠ్య పుస్తకాలు జిల్లా కేంద్రానికి చేరుకున్నారుు. ఆయూ మండలాలకు 12,54,617 పాఠ్యపుస్తకాలు చేరుకున్నాయి. అక్కడ నుంచి స్కూల్ పాయింట్‌కు తీసుకెళ్తున్నారు. కొన్నిరకాల టైటిల్ పాఠ్య పుస్తకాలు స్కూల్ పాయింట్లకు చేరాల్సి ఉంది. రెండో విడతగా ఎంఈవోలు పాఠ్య పుస్తకాలు జిల్లా కేంద్రంలోని డిపో నుంచి తీసుకెళ్లాల్సి ఉంది. పాఠశాల తెరిచి రోజే గతేడాది పాఠ్యపుస్తకాలు అందించారు.
 
 కేజీబీవీ భవన నిర్మాణాల్లో పురోగతి
జిల్లాలో 36 కొత్త కస్తూరిభా గాంధీ బాలికల విద్యాలయాలు( కేజీబీవీ)ల నిర్మాణాలల్లో ఎట్టకేలకు 33 భవనాలు నిర్మించారు. మరో మూడు భవనాలు అసంపూర్తిగా ఉన్నాయి. 45 కేజీబీవీలకు ప్రహరీల నిర్మాణాలకు నిధులు మంజూరు కాగా అందులో 29 పూర్తయ్యూరుు. మూడింటి పనులు ఇంకా ప్రారంభించనే లేదు.  
 
ఊరూరా టీచర్ల ప్రచారం
ఈసారి బడిబాట కార్యక్రమంపై రాష్ట్ర విద్యాశాఖ నుంచి ఆదేశాలు రాలేదు. కాని ఊరూరా ఉపాధ్యాయులు ప్రచారం ముమ్మరం చేశారు. కరపత్రాలతో ప్రైవేటుకు దీటుగా ప్రచారం చేస్తున్నారు. హసన్‌పర్తి మండలం భీమారంలో డీఈవో  వై. చంద్రమోహన్ సైతం అక్కడ హెచ్‌ఎం, ఉపాధ్యాయులతో కలిసి ఇంటింటి ప్రచారం చేపట్టారు. సర్కారీ సూళ్లలో చదివితే కల్పించే వసతులేంటో వివరిస్తున్నారు. ఎస్సెస్సీలో ఇటీవల వచ్చిన మెరుగైన ఫలితాలను ప్రస్తావిస్తున్నారు. ఇంగ్లిష్ మీడియంలోనూ బోధిస్తున్నామని చెబుతున్నారు.
 
తగ్గిపోతున్న విద్యార్థుల సంఖ్య
జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్య తగ్గిపోతుండగం ఆందోళన కలిగిస్తోంది. జిల్లాలో అసలే విద్యార్థులు లేని పాఠశాలలు 103 ఉండడం పరిస్థితి తీవ్రకు నిదర్శనం. 10వరకు విద్యార్థులున్న పాఠశాలలు 231 ఉన్నాయి. 20వరకు విద్యార్థులున్న పాఠశాలలు 542 ఉండగా, 30మంది విద్యార్థులున్న పాఠశాలలు 1175 ఉన్నాయి. 75 మంది విద్యార్థులున్న ఉన్నత పాఠశాలలు 22 వరకు ఉన్నాయి. ఏకోపాధ్యాయ పాఠశాలలు 292 ఉన్నాయి. కొన్నిచోట్ల విద్యార్థులున్నా టీచర్లు లేరు.
 
అసంపూర్తిగా అదనపు గదులు
జిల్లాలో సర్వశిక్షా అభియన్ ద్వారా 2014-2015లో 269 అదనపు తరగతి గదులు మంజూరు కాగా అందులో 12 గదులే పూర్తయ్యూరుు. 105 గదులు అసంపూర్తిగా ఉన్నారుు. 152 గదుల పనులు ఇంకా ప్రారంభించనే లేదు. నిధులు ఆలస్యంగా మంజూరు కావడం దీనికి కారణం. 2013-2014లో జిల్లాకు కేవలం 27 తరగతి గదులు మంజూరయ్యూరుు.  అందులో 15 పూర్తికాగా 12 వివిధ దశల్లో ఉన్నారుు. రాష్ట్రీయ మాధ్యమిక శిక్షా అభియాన్ ఆధ్వర్యంలో హైస్కూళ్లలో మూడో దశలో145 అదనపు తరగతి గదుల నిర్మాణాలకు నిధులు మంజూరైనా పనులు ఊపందుకోలేదు. ఇప్పటివరకు 121 గ దుల నిర్మాణాలు ప్రారంభించగా రెండే పూర్తయ్యూరుు.  
 
సబ్జెక్టు టీచర్ల కొరత
జిల్లాలోని ప్రభుత్వ, జెడ్పీఎస్‌ఎస్ హైస్కూళ్లలో సబ్జెక్టుల టీచర్ల కొరత ఉంది. సక్సెస్ హైస్కూళ్లులో 6వ తరగతి నుంచి పదో తరగతి వరకు ఇంగ్లిష్, తెలుగు మీడియంలు కొనసాగుతున్నాయి. ఎక్కువ శాతం హైస్కూళ్లలో అటెండర్లు, స్వీపర్లు, రికార్డు అసిస్టెంట్లు పోస్టులు భ ర్తీ చేయటం లేదు. హైస్కూళ్లలో చోరీలు కూడా జరిగాయి. కంప్యూటర్ విద్యకు ఇన్‌స్ట్రక్టర్లను నియమించటంలేదు. కంప్యూటర్లు నిరుపయోగంగా మారారుు.
 
 త్వరలో బదిలీలు, పదోన్నతులు
 త్వరలోనే ఉపాధ్యాయులకు రేషనలైజేషన్, బదిలీలు, పదోన్నతులు ప్రక్రియను చేపట్టబోతున్నారు. వేసవి సెలవుల్లో చేపట్టాలని ఉపాధ్యాయ సంఘాలు కోరినా ప్రభుత్వం జాప్యం చేసింది. జూన్ -జులైలో ఈ ప్రక్రియ చేపట్టబోతున్నారు.
 
 వంటకు తిప్పలు
 జిల్లాలో మరో 2,313 ప్రభుత్వ పాఠశాలల్లో కిచెన్‌షెడ్లకోసం జిల్లా విద్యాశాఖ ఇటీవల ప్రతిపాదనలు పంపింది. 2012లో జిల్లాలో 1166 కిచెన్‌షెడ్ల నిర్మాణాలకు నిధులు మంజూరు కాగా, నేటికి 486 కిచెన్‌షెడ్లు మాత్రమే పూర్తయ్యాయి. 387 వివిధ దశల్లో ఉన్నాయి. మిగితా నిర్మాణాలు పారంభించలేదు. ఒక్కో కిచెన్‌షెడ్‌కు రూ. 75వేలు మాత్రమే మంజూరవడంతో పనులకు ఎవరూ ముందుకు రాలేదు. ఇకపై 30 నుంచి 50 వరకు విద్యార్థులున్న పాఠశాలల కిచెన్‌షెడ్ల నిర్మాణాలకు రూ లక్ష, ఆపైన విద్యార్థులుంటే రూ 2.50 లక్షలు మంజూరు చేయనున్నారు. షెడ్లు లేక వర్షంలో వంట చేయడం ఇబ్బందే.
 
 మధ్యాహ్న భోజనం రేట్ల పెంపు
 ప్రభుత్వ పాఠశాలల్లో మధ్యాహ్న భోజనం వంట ఏజెన్సీలకు రేట్లు పెంచారు. పీఎస్‌లకు 25పైసలు, యూపీఎస్‌లు, హైస్కూళ్లకు 38పైసలు పెంచారు. పీఎస్‌లకు ఇకనుంచి రూ 4.60, యూపీఎస్, హైస్కూళ్లకు రూ 6.38 పైసలు ఇవ్వనున్నారు. జూన్ నెలకు 347 మెట్రిక్ టన్నుల సన్నబియ్యం కేటారుుంచారు.  
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement