Revitalization
-
ఆయకట్టు రైతులందరికీ ‘తోటపల్లి’ ఫలాలు
సాక్షి, అమరావతి: తోటపల్లి ప్రాజెక్టులో మిగిలిన పనులను శరవేగంగా పూర్తిచేసి మొత్తం ఆయకట్టుకు నీళ్లందించడం ద్వారా ఉత్తరాంధ్రను సస్యశ్యామలం చేసే దిశగా రాష్ట్ర ప్రభుత్వం వేగంగా అడుగులు వేస్తోంది. ఇప్పటికే పూర్తయిన పనుల ద్వారా గతంలో ఎన్నడూలేని రీతిలో జూన్ 12నే ఖరీఫ్ పంటల సాగు నిమిత్తం 85 వేల ఎకరాలకు నీటిని విడుదల చేసింది. కుడి ప్రధాన కాలువ, డిస్ట్రిబ్యూటరీల్లో మిగిలిన పనులను పూర్తిచేయడం.. రివిట్మెంట్ పూర్తిచేసి, 2,151 మంది నిర్వాసితులకు పునరావాసం కల్పించి బ్యారేజ్‌లో పూర్తి సామర్థ్యం మేర 2.51 టీఎంసీలను నిల్వచేయడం ద్వారా మిగిలిపోయిన 85,765 ఎకరాల ఆయకట్టుకు నీళ్లందించే దిశగా చర్యలు చేపట్టింది. కుడి ప్రధాన కాలువలో అంతర్భాగంగా చేపట్టిన గజపతినగరం బ్రాంచ్ కెనాల్‌ను పూర్తిచేసి మరో 15 వేల ఎకరాలకు నీళ్లందించి ఉత్తరాంధ్రలోని శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం మన్యం జిల్లాలను సస్యశ్యామలం చేయాలని లక్ష్యంగా నిర్దేశించుకుంది. పార్వతీపురం మన్యం జిల్లా గరుగుబిల్లి మండలం తోటపల్లి వద్ద 1908లో బ్రిటిష్ సర్కార్ తోటపల్లి వద్ద నాగావళి నదిపై రెగ్యులేటర్ ద్వారా 64 వేల ఎకరాలకు నీళ్లందించేది. ఇది శిథిలావస్థకు చేరడంతో ఆయకట్టుకు నీళ్లందించడం సవాల్‌గా మారింది. ఈ నేపథ్యంలో.. రెగ్యులేటర్‌కు ఎగువన 2.51 టీఎంసీల సామర్థ్యంతో బ్యారేజ్‌ను నిరి్మంచి.. అదనంగా 1,06,765 ఎకరాలకు, తోటపల్లి కుడి కాలువలో అంతర్భాగంగా తవ్వే గజపతినగరం బ్రాంచ్ కెనాల్ కింద మరో 15 వేల ఎకరాలకు నీళ్లందించే పనులకు జలయజ్ఞంలో భాగంగా మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి శ్రీకారం చుట్టారు. ప్రాధాన్యతగా తోటపల్లి.. జలయజ్ఞం ప్రాజెక్టులను ప్రాధాన్యతగా చేపట్టిన సీఎం వైఎస్ జగన్.. వాటిని ప్రణాళికాబద్ధంగా పూర్తిచేస్తున్నారు. ఇప్పటికే పెన్నా డెల్టాకు జీవనాడులైన సంగం, నెల్లూరు బ్యారేజ్‌లు పూర్తిచేసిన ముఖ్యమంత్రి.. తోటపల్లిలో మిగిలిన పనులను పూర్తిచేసే దిశగా అడుగులు వేస్తున్నారు. కుడి ప్రధాన కాలువలో మిగిలిన పనులను దాదాపుగా పూర్తిచేశారు. ఇక జూన్ 12న పూర్తయిన పనుల ద్వారా పాత, కొత్త కలిపి 85 వేల ఎకరాలకు నీటిని విడుదల చేశారు. కుడి ప్రధాన కాలువలో ప్యాకేజ్–1లో 5.70 లక్షల క్యూబిక్ మీటర్ల మట్టిపని, 37 వేల క్యూబిక్ మీటర్ల కాంక్రీట్ పని.. ప్యాకేజ్–2లో 8.84 లక్షల క్యూబిక్ మీటర్ల మట్టి పని, 47 వేల క్యూబిక్ మీటర్ల కాంక్రీట్ పని మాత్రమే మిగిలింది. ఖరీఫ్ పంటలకు నీటిని విడుదల చేసిన నేపథ్యంలో.. కోతలు పూర్తయ్యేదాకా అంటే డిసెంబర్ దాకా కాలువల పనులు చేయడానికి వీలుకాదు. సీఎం జగన్ ఆదేశాల మేరకు పంట కోతలు పూర్తయ్యాక కుడి కాలువలో మిగిలిన పనులను యుద్ధప్రాతిపదికన పూర్తిచేయడానికి అధికారులు చర్యలు చేపట్టారు. కుడి కాలువలో అంతర్భాగంగా తవ్వుతున్న గజపతినగరం బ్రాంచ్ కెనాల్ పనుల్లో 2.75 లక్షల క్యూబిక్ మీటర్ల మట్టి పని, 27 వేల క్యూబిక్ మీటర్ల కాంక్రీట్ పని మాత్రమే మిగిలింది. ఈ పనుల పూర్తికి అధికారులు చర్యలు చేపట్టారు. గరిష్ఠ సామర్థ్యం మేరకు నిల్వ.. తోటపల్లి బ్యారేజ్ గరిష్ఠ నీటినిల్వ 2.51 టీఎంసీలు. బ్యారేజ్‌లో ముంపునకు గురయ్యే 20 గ్రామాల్లోని 5,629 నిర్వాసిత కుటుంబాలకుగాను 3,478 కుటుంబాలకు పునరావాసం కల్పించారు. కానీ, బ్యారేజ్ మట్టికట్టకు రివిట్మెంట్ పనులు పూర్తికాలేదు. దీంతో బ్యారేజ్‌లో రెండు టీఎంసీలను మాత్రమే నిల్వ చేయగలుగుతున్నారు. ఈ పనులు పూర్తిచేసి.. మిగతా 2,151 నిర్వాసిత కుటుంబాలకు పునరావాసం కల్పించడం ద్వారా వచ్చే ఏడాదికి బ్యారేజ్‌లో 2.51 టీఎంసీలను నిల్వచేయాలని సీఎం వైఎస్ జగన్ ఆదేశించారు. బ్యారేజ్‌లో పూర్తిస్థాయిలో నీటిని నిల్వచేయడం ద్వారా తోటపల్లి ఆయకట్టు రైతులందరికీ జలయజ్ఞం ఫలాలు అందించే దిశగా అడుగులు వేస్తున్నారు. -
సమస్యలు.. సైడ్ ట్రాక్
సాక్షి,తాడేపల్లిగూడెం : ఎర్ర కాలువపై ఉన్న పాత అక్విడెక్ట్ తొలగించినా...గట్లు ఎత్తు పెంచి ఆధునీకరించినా, ముంపు సమస్య నివారణకు శాశ్వత పరిష్కారం లభించలేదు. ఆధునీకరణలో భాగంగా గట్లు ఎత్తు పెంచారు. అయితే, గట్లను రివిట్మెంట్ చేయకపోవడంతో చిన్నపాటి వర్షానికే గత ఏడాది జూలైలో గట్లు జారిపోయాయి. దీనికి తోడు అదే ఏడాది ఆగస్టులో కురిసిన వర్షాలకు మారంపల్లి వద్ద రైల్వే ట్రాక్‌ను ఆనుకుని గట్లు పూర్తి స్థాయిలో అనుసంధానించకపోవడమే ముంపునకు ప్రధాన కారణంగా తెలుస్తోంది. దీంతో నందమూరు, మారంపల్లి, ఆరుళ్ల గ్రామాల వైపు, జగన్నాథపురం, మాధవరం గ్రామాల వైపు వేలాది ఎకరాలు ముంపునకు గురవుతున్నాయి. దీంతో రైతాంగం అపార నష్టం చవి చూసింది. పలు చోట్ల చేలలో ఇసుక మేటలు వేసింది. ఈ ముంపునకు సంబంధించి రైతాంగానికి ప్రభుత్వం నుంచి రావలసిన పరిహారం అందని పరిస్థితి. మరో మూడు నెలలు గడిస్తే ముంపునకు ఏడాది పూర్తి కావస్తుంది. మళ్లీ వర్షాకాలం వచ్చింది. గట్లు జారిన చోట పటిష్ట చర్యలు చేపట్టిన దాఖలాలు లేవు. ఈ నేపథ్యంలో మళ్లీ రైతాంగం ఆందోళన వ్యక్తం చేస్తోంది. రైల్వే ట్రాక్ భద్రత కోసమే...! ఎర్ర కాలువ నిర్మాణం జరిగిన సమయంలోనే మారంపల్లి వద్ద రైల్వే ట్రాక్ సమీపం వరకు గట్లు వేయలేదని తెలుస్తోంది. ట్రాక్ అతి దగ్గరగా గట్లు వేయడం వల్ల పై నుంచి వరద నీరు ఉధృతంగా వస్తే ట్రాక్ భద్రత ఇబ్బందుల్లో పడుతుందని రైల్వే శాఖ భావిస్తోంది. దీంతో ట్రాక్‌కు చేరువగా గట్లు వేయడానికి అనుమతి నిరాకరిస్తున్నట్టు స్పష్టమవుతోంది. అయితే దీనికి ప్రత్యామ్నాయంగా ట్రాక్‌కు ఆనుకుని వరద నీరు పోయేలా కాలువలను తవ్వింది. ఆ కాలువలు కాలక్రమంలో ఆక్రమణలకు గురై పూడుకుపోవడంతో వరద నీరంతా మారంపల్లి రైల్వే ట్రాక్ సమీపం నుంచి చేలను ముంచెత్తుతుంది. దీన్ని గుర్తించని రైతులు పాత అక్విడెక్ట్‌ను పట్టుబట్టి తొలగించారు. అయితే, ముంపును నివారించాలంటే మారంపల్లి వద్ద రైల్వే ట్రాక్ కానాలను పెంచడం, గట్లను ట్రాక్ వరకు పొడిగించడం చేయవలసి ఉంది. ఇది జరిగితేనే ఎర్ర కాలువ ముంపు సమస్యకు పరిష్కారం లభిస్తుంది. గట్లు పొడిగిస్తే ముంపు నివారణ మారంపల్లి రైల్వే ట్రాక్‌కు రెండు వైపులా ఉన్న ఖాళీ ప్రాంతాన్ని గట్లు వేసి పూడ్చడం వల్ల ముంపును నివారించవచ్చు. ఈ విషయాన్ని గుర్తించిన ఎంపీపీ గన్నమని దొరబాబు ఈ మేరకు రైల్వే అధికారులను తీసుకొచ్చి ముంపు ప్రాంతాన్ని చూపించినా ప్రయోజనం లేకపోయింది. జంగారెడ్డిగూడెం వద్ద కొంగువారిగూడెం ప్రాజెక్టు నుంచి వదిలిన వరద నీరు ఎర్ర కాలువకు చేరుతుంది. ఇలా వస్తున్న వరద నీరు నందమూరు అక్విడెక్ట్ వద్ద లాగకపోవడం ముంపునకు మరో కారణంగా కనిపిస్తోంది. దీంతో వేలాది ఎకరాలు ముంపునకు గురవుతూ వచ్చాయి. మారంపల్లి వద్ద ట్రాక్ కానాలు పెంచడంతో పాటు దువ్వ వద్ద వెంకయ్య – వయ్యేరు కాలువ కానాలను పెంచితేనే గానే పూర్తి స్థాయిలో వరద నీరు లాగే పరిస్థితి లేదని రైతులు చెబుతున్నారు. -
నేటి నుంచి పాఠశాలలు పునఃప్రారంభం
ప్రభుత్వ బడుల్లో సమస్యల స్వాగతం ఒంటిపూట బడులకు టాటా ఇక ఆరు నెలలు, వార్షిక పరీక్షలే.. వేసవి సెలవులు ఆనందంగా గడిపిన విద్యార్థులు మళ్లీ బడిబాట పట్టనున్నారు. శుక్రవారం నుంచి పాఠశాలలు పునఃప్రారంభం కానున్నారుు. బడిగంటలు గణ గణ గణ.. అంటూ మోగనున్నారుు. ప్రతీ ఏడాది మాదిరిగానే ప్రభుత్వ పాఠశాలలు విద్యార్థులకు సమస్యలతో స్వాగతం పలుకనున్నారుు. పాఠ్యపుస్తకాలు, యూనిఫామ్స్, అదనపు గదులు, మధ్యాహ్న భోజన వసతులు, మరుగుదొడ్లు, ఉపాధ్యాయులు, వలంటీర్ల కొరత వంటివి సవాళ్లుగా మారనున్నారుు. బడి గంట నేడు మోగనుంది. పాఠశాలల్లో వసతుల కల్పన గతంలో కన్నా కాస్త మెరుగైంది. కానీ ఈసారీ విద్యార్థులకు ఇంకా సమస్యలే స్వాగతం పలుకుతున్నారుు. ఎస్సెస్సీ ఫలితాల్లో సర్కారీ విద్యార్థులు మెరిసిన నేపథ్యంలో వసతులు కల్పనపై మరింత దృష్టిసారించాల్సిన అవసరం ఉంది. 88 శాతం పాఠ్యపుస్తకాల రాక జిల్లాకు గురువారం వరకు 88శాతం పాఠ్య పుస్తకాలు వచ్చాయి. 17 లక్షల16వేల 99 పాఠ్య పుస్తకాలకు జిల్లా విద్యాశాఖ ప్రతిపాదించగా 15 లక్షల 27వేల 50 పాఠ్య పుస్తకాలు జిల్లా కేంద్రానికి చేరుకున్నారుు. ఆయూ మండలాలకు 12,54,617 పాఠ్యపుస్తకాలు చేరుకున్నాయి. అక్కడ నుంచి స్కూల్ పాయింట్‌కు తీసుకెళ్తున్నారు. కొన్నిరకాల టైటిల్ పాఠ్య పుస్తకాలు స్కూల్ పాయింట్లకు చేరాల్సి ఉంది. రెండో విడతగా ఎంఈవోలు పాఠ్య పుస్తకాలు జిల్లా కేంద్రంలోని డిపో నుంచి తీసుకెళ్లాల్సి ఉంది. పాఠశాల తెరిచి రోజే గతేడాది పాఠ్యపుస్తకాలు అందించారు. కేజీబీవీ భవన నిర్మాణాల్లో పురోగతి జిల్లాలో 36 కొత్త కస్తూరిభా గాంధీ బాలికల విద్యాలయాలు( కేజీబీవీ)ల నిర్మాణాలల్లో ఎట్టకేలకు 33 భవనాలు నిర్మించారు. మరో మూడు భవనాలు అసంపూర్తిగా ఉన్నాయి. 45 కేజీబీవీలకు ప్రహరీల నిర్మాణాలకు నిధులు మంజూరు కాగా అందులో 29 పూర్తయ్యూరుు. మూడింటి పనులు ఇంకా ప్రారంభించనే లేదు. ఊరూరా టీచర్ల ప్రచారం ఈసారి బడిబాట కార్యక్రమంపై రాష్ట్ర విద్యాశాఖ నుంచి ఆదేశాలు రాలేదు. కాని ఊరూరా ఉపాధ్యాయులు ప్రచారం ముమ్మరం చేశారు. కరపత్రాలతో ప్రైవేటుకు దీటుగా ప్రచారం చేస్తున్నారు. హసన్‌పర్తి మండలం భీమారంలో డీఈవో వై. చంద్రమోహన్ సైతం అక్కడ హెచ్ఎం, ఉపాధ్యాయులతో కలిసి ఇంటింటి ప్రచారం చేపట్టారు. సర్కారీ సూళ్లలో చదివితే కల్పించే వసతులేంటో వివరిస్తున్నారు. ఎస్సెస్సీలో ఇటీవల వచ్చిన మెరుగైన ఫలితాలను ప్రస్తావిస్తున్నారు. ఇంగ్లిష్ మీడియంలోనూ బోధిస్తున్నామని చెబుతున్నారు. తగ్గిపోతున్న విద్యార్థుల సంఖ్య జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్య తగ్గిపోతుండగం ఆందోళన కలిగిస్తోంది. జిల్లాలో అసలే విద్యార్థులు లేని పాఠశాలలు 103 ఉండడం పరిస్థితి తీవ్రకు నిదర్శనం. 10వరకు విద్యార్థులున్న పాఠశాలలు 231 ఉన్నాయి. 20వరకు విద్యార్థులున్న పాఠశాలలు 542 ఉండగా, 30మంది విద్యార్థులున్న పాఠశాలలు 1175 ఉన్నాయి. 75 మంది విద్యార్థులున్న ఉన్నత పాఠశాలలు 22 వరకు ఉన్నాయి. ఏకోపాధ్యాయ పాఠశాలలు 292 ఉన్నాయి. కొన్నిచోట్ల విద్యార్థులున్నా టీచర్లు లేరు. అసంపూర్తిగా అదనపు గదులు జిల్లాలో సర్వశిక్షా అభియన్ ద్వారా 2014-2015లో 269 అదనపు తరగతి గదులు మంజూరు కాగా అందులో 12 గదులే పూర్తయ్యూరుు. 105 గదులు అసంపూర్తిగా ఉన్నారుు. 152 గదుల పనులు ఇంకా ప్రారంభించనే లేదు. నిధులు ఆలస్యంగా మంజూరు కావడం దీనికి కారణం. 2013-2014లో జిల్లాకు కేవలం 27 తరగతి గదులు మంజూరయ్యూరుు. అందులో 15 పూర్తికాగా 12 వివిధ దశల్లో ఉన్నారుు. రాష్ట్రీయ మాధ్యమిక శిక్షా అభియాన్ ఆధ్వర్యంలో హైస్కూళ్లలో మూడో దశలో145 అదనపు తరగతి గదుల నిర్మాణాలకు నిధులు మంజూరైనా పనులు ఊపందుకోలేదు. ఇప్పటివరకు 121 గ దుల నిర్మాణాలు ప్రారంభించగా రెండే పూర్తయ్యూరుు. సబ్జెక్టు టీచర్ల కొరత జిల్లాలోని ప్రభుత్వ, జెడ్పీఎస్ఎస్ హైస్కూళ్లలో సబ్జెక్టుల టీచర్ల కొరత ఉంది. సక్సెస్ హైస్కూళ్లులో 6వ తరగతి నుంచి పదో తరగతి వరకు ఇంగ్లిష్, తెలుగు మీడియంలు కొనసాగుతున్నాయి. ఎక్కువ శాతం హైస్కూళ్లలో అటెండర్లు, స్వీపర్లు, రికార్డు అసిస్టెంట్లు పోస్టులు భ ర్తీ చేయటం లేదు. హైస్కూళ్లలో చోరీలు కూడా జరిగాయి. కంప్యూటర్ విద్యకు ఇన్స్ట్రక్టర్లను నియమించటంలేదు. కంప్యూటర్లు నిరుపయోగంగా మారారుు. త్వరలో బదిలీలు, పదోన్నతులు త్వరలోనే ఉపాధ్యాయులకు రేషనలైజేషన్, బదిలీలు, పదోన్నతులు ప్రక్రియను చేపట్టబోతున్నారు. వేసవి సెలవుల్లో చేపట్టాలని ఉపాధ్యాయ సంఘాలు కోరినా ప్రభుత్వం జాప్యం చేసింది. జూన్ -జులైలో ఈ ప్రక్రియ చేపట్టబోతున్నారు. వంటకు తిప్పలు జిల్లాలో మరో 2,313 ప్రభుత్వ పాఠశాలల్లో కిచెన్షెడ్లకోసం జిల్లా విద్యాశాఖ ఇటీవల ప్రతిపాదనలు పంపింది. 2012లో జిల్లాలో 1166 కిచెన్‌షెడ్ల నిర్మాణాలకు నిధులు మంజూరు కాగా, నేటికి 486 కిచెన్షెడ్లు మాత్రమే పూర్తయ్యాయి. 387 వివిధ దశల్లో ఉన్నాయి. మిగితా నిర్మాణాలు పారంభించలేదు. ఒక్కో కిచెన్‌షెడ్‌కు రూ. 75వేలు మాత్రమే మంజూరవడంతో పనులకు ఎవరూ ముందుకు రాలేదు. ఇకపై 30 నుంచి 50 వరకు విద్యార్థులున్న పాఠశాలల కిచెన్‌షెడ్ల నిర్మాణాలకు రూ లక్ష, ఆపైన విద్యార్థులుంటే రూ 2.50 లక్షలు మంజూరు చేయనున్నారు. షెడ్లు లేక వర్షంలో వంట చేయడం ఇబ్బందే. మధ్యాహ్న భోజనం రేట్ల పెంపు ప్రభుత్వ పాఠశాలల్లో మధ్యాహ్న భోజనం వంట ఏజెన్సీలకు రేట్లు పెంచారు. పీఎస్‌లకు 25పైసలు, యూపీఎస్‌లు, హైస్కూళ్లకు 38పైసలు పెంచారు. పీఎస్‌లకు ఇకనుంచి రూ 4.60, యూపీఎస్, హైస్కూళ్లకు రూ 6.38 పైసలు ఇవ్వనున్నారు. జూన్ నెలకు 347 మెట్రిక్ టన్నుల సన్నబియ్యం కేటారుుంచారు.