రాష్ట్రంలో ఎండల తీవ్రత రోజురోజుకూ పెరుగుతున్న నేపథ్యంలో అన్ని ప్రభుత్వ, ప్రైవేటు, ఎయిడెడ్ పాఠశాలలకు శనివారం (16వ తేదీ) నుంచి జూన్ 12 వరకు వేసవి సెలవులుగా ప్రభుత్వం ప్రకటించింది.
ఎండల తీవ్రత దృష్ట్యా తెలంగాణ సర్కార్ నిర్ణయం
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో ఎండల తీవ్రత రోజురోజుకూ పెరుగుతున్న నేపథ్యంలో అన్ని ప్రభుత్వ, ప్రైవేటు, ఎయిడెడ్ పాఠశాలలకు శనివారం (16వ తేదీ) నుంచి జూన్ 12 వరకు వేసవి సెలవులుగా ప్రభుత్వం ప్రకటించింది. ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి అధ్యక్షతన గురువారం సాయంత్రం జరిగిన సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు.
షెడ్యూల్ ప్రకారం ఈనెల 24 నుంచి సెలవులు ప్రారంభం కావాల్సి ఉన్నా ఎండల తీవ్రత వల్ల ముందే సెలవులివ్వాలని నిర్ణయించినట్లు కడియం తెలిపారు. జూన్ 13న తిరిగి పాఠశాలలు ప్రారంభమవుతాయని వివరించారు. సెలవులు పాటించని పాఠశాలలపై కఠిన చర్యలు చేపడతామని కడియం హెచ్చరించారు.