సాక్షి, అమరావతి: రాష్ట్రంలోని పాఠశాలల్లో వచ్చే నెల మొదటి వారం నుంచి ఒంటిపూట తరగతులు నిర్వహించనున్నారు. ఈ విద్యా సంవత్సరంలో పాఠశాలల పని దినాలు తక్కువగా ఉన్నందున విద్యాశాఖ ఈ నిర్ణయానికి వచ్చినట్లు అధికార వర్గాలు తెలిపాయి. ఏటా జూన్ 12 నుంచి పాఠశాలలను తిరిగి తెరుస్తుండగా.. 2021–22 విద్యాసంవత్సరంలో కరోనా వల్ల ఆగస్ట్ మూడో వారం నుంచి ప్రారంభమైన విషయం తెలిసిందే. దీంతో పని దినాలు తగ్గాయి. ఈ పరిస్థితుల్లో కొన్ని సెలవు దినాల్లోనూ పాఠశాలలు పనిచేసేలా, కనీసం 180 పని దినాలు ఉండేలా క్యాలెండర్‌ను సర్దుబాటు చేసింది. అయితే, సిలబస్ ఇంకా పూర్తి కానందున ఒంటిపూట బడులను ఈ నెల నుంచి కాకుండా వచ్చే నెల మొదటి వారం నుంచి ప్రారంభించాలని విద్యాశాఖ భావిస్తోంది.
మే నుంచి జూన్ వరకు వేసవి సెలవులు
కాగా, పాఠశాలలను ఏప్రిల్ చివరి వరకు కొనసాగించి.. మే మొదటి వారం నుంచి వేసవి సెలవులు ప్రకటించనున్నారు. మేలో పదో తరగతి పరీక్షలు జరగనున్నందున ఉపాధ్యాయులు, సిబ్బంది ఆ విధులకు హాజరు కావాల్సి ఉంటుంది. పరీక్షలు ఆలస్యమవ్వనున్నందున సెలవులను జూన్ చివరి వరకు పొడిగించాలని అధికారులు భావిస్తున్నారు. జూన్ 12 నుంచి పాఠశాలలు ప్రారంభం కావలసి ఉన్నా ఈ విద్యా సంవత్సరంలో పాఠశాలలను జూలై మొదటి వారం నుంచి ప్రారంభించే అవకాశాలున్నాయని అధికారులు పేర్కొంటున్నారు.
AP Half Day Schools 2022: ఏప్రిల్ నుంచి ఒంటిపూట బడులు
Published Wed, Mar 16 2022 5:31 AM | Last Updated on Wed, Mar 16 2022 3:05 PM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment