Half day schools
-
కులగణన నేపథ్యంలో ప్రభుత్వం కీలక నిర్ణయం.. ఒక్క పూటే బడులు
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలను బుధవారం నుంచి ఒంటిపూట మాత్రమే నిర్వహిస్తారు. కులగణన నేపథ్యంలో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. ఎస్జీటీల సేవలను సర్వేకు ఉపయోగిస్తున్నందున, మధ్యాహ్నం నుంచి పాఠ శాలలను మూడు వారాల పాటు మధ్యాహ్నం ఒంటిగంట వరకూ నడపాలని పాఠశాల విద్య డైరెక్టరేట్ ఆదేశించింది. మధ్యాహ్న భోజనం తర్వాత విద్యార్థులను ఇళ్లకు పంపుతారు.టెట్ బులెటిన్ విడుదల రేపు సాక్షి, హైదరాబాద్: ఉపాధ్యాయ అర్హత పరీక్షకు సంబంధించిన ఇన్ఫర్మేషన్ బులెటిన్‌ను ఈ నెల 7వ తేదీన విడుదల చేయనున్నట్టు పాఠశాల విద్య డైరెక్టరేట్ ఒక ప్రకటనలో తెలిపింది. వాస్తవానికి ఈ బులెటిన్‌ను మంగళవా రం విడుదల చేయాల్సి ఉంది. సాంకేతిక కారణాల వల్ల సాధ్యం కాలేదని పేర్కొంది.ఎంబీఏ సాయంకాలపు కోర్సుల ప్రవేశ పరీక్ష 17కు వాయిదా ఉస్మానియా యూనివర్సిటీ: ఈ నెల 9న జరగాల్సిన ఓయూ ఎంబీఏ సాయంకాలపు కోర్సుల ప్రవేశ పరీక్షను నవంబర్ 17కు వాయిదా వేశారు. వర్సిటీ క్యాంపస్‌లోని కామర్స్ అండ్ బిజినెస్ మేనేజ్మెంట్ కళాశాలలో సాయంకాలపు కోర్సులైన ఎంబీఏ, ఎంబీఏ టెక్నాలజీ మేనేజ్మెంట్ (టీఎం) ప్రవేశ పరీక్షలకు హాజరయ్యే అభ్యర్థులు ఈ నెల 14 వరకు రూ.500 అపరాధ రుసముతో దరఖాస్తు చేసుకోవచ్చని పీజీ అడ్మిషన్స్ డైరెక్టర్ ప్రొఫెసర్ పాండురంగారెడ్డి తెలిపారు.ముగిసిన వివిధ సెట్ల కౌన్సెలింగ్ ఉస్మానియా యూనివర్సిటీ: ఈ విద్యా సంవత్సరానికి వివిధ సెట్ల కౌన్సెలింగ్ పక్రియ ముగిసిందని కన్వీనర్ ప్రొఫెసర్ రమేశ్‌బాబు మంగళవారం తెలిపారు. పీజీ లాసెట్, లాసెట్–2024, పీజీఈసెట్–2024, ఎడ్‌సెట్– 2024, పీఈసెట్–2024 తదితర సెట్ల కౌన్సెలింగ్ ద్వారా సీట్లు భర్తీ చేసిన్నట్లు చెప్పారు. -
AP: రేపటి నుంచి ఒంటిపూట బడులు
శ్రీకాకుళం న్యూకాలనీ: జిల్లా వ్యాప్తంగా సోమ వారం నుంచి ఒంటిపూట బడులు మొదలుకానున్నాయి. ప్రభుత్వ ఆదేశాల మేరకు ఒకటో తరగతి నుంచి నుంచి 9వ తరగతి వరకు చదువుతున్న విద్యార్థులకు ఉదయం 7.45 నుంచి మధ్యాహ్నం 12.30 వరకు ఒక్కపూట తరగతులను నిర్వహించనున్నారు. జిల్లాలో ప్రభుత్వ, జిల్లా పరిషత్, మున్సి పల్, మోడల్‌స్కూల్స్, ఎయిడెడ్, ప్రైవేట్ పాఠశాలలు, గుర్తింపు పొందిన అన్ఎయిడెడ్ పాఠశాలల మేనేజ్మెంట్లలో ఒంటి పూట బడులు పక్కాగా అమలు కావాల్సిందేనని అధికారులు స్పష్టం చేస్తున్నారు. ఈనెల 18వ తేదీ నుంచి ఈ విద్యా సంవత్సరం ఆఖరి పనిదినం అనగా ఏప్రిల్ 23వ తేదీ వరకు ఒంటిపూట బడులు వర్తిస్తాయని ప్రభుత్వం పేర్కొంది. అయితే పదో తరగతి పరీక్ష కేంద్రాలుగా ఉన్న పాఠశాలల్లో పరీక్షలు జరిగే ఏడు రోజులపా టు 1 నుంచి 9 తరగతుల విద్యార్థులకు మధ్యా హ్నం ఒంటి గంట నుంచి సాయంత్రం 5 గంటల వరకు క్లాసులు నిర్వహించాల్సి ఉంటుంది. ప్రభుత్వ ఆదేశాల ప్రకారం ఒంటిపూట బడులను నిర్వహించాల్సిందేనని జిల్లా విద్యాశాఖాధికారి కె.వెంకటేశ్వరరావు సూచిస్తున్నారు. విద్యాశాఖ నిర్దేశించిన పలు ఆదేశాలు/సూచనలను ఆయన పాఠశాలలకు చేరవేశారు. గోరుముద్ద తిన్నాకే.. పిల్లలు ఇంటికి ప్రభుత్వ పాఠశాలల్లో మధ్యాహ్నం భోజనం ‘జనగన్న గోరుముద్ద’ అందజేయనున్నారు. ఈ విషయాన్ని ప్రభుత్వం సీనియస్‌గా తీసుకుంది. బడుల్లో భోజనం చేసిన తర్వాతే విద్యార్థులను వారి ఇళ్లకు పంపిస్తారు. ఒంటిపూట బడుల సమయంలోనూ నిర్దేశించిన మెనూ ప్రకారమే భోజనాలు అందించాలని అధికారులు స్పష్టం చేస్తున్నారు. ఈ సూచనలు తప్పనిసరి ► పాఠశాలలో బహిరంగ ప్రదేశాల్లో/ చెట్ల కింద తరగతులు నిర్వహించరాదు. ► అన్ని పాఠశాలల్లో తగినంత తాగునీరు అందుబాటులో ఉంచాలి. ► ఎండల నేపధ్యంలో విద్యార్థుల ఉపయోగం కోసం ప్రతి పాఠశాలలో కొన్ని ఓరల్ రీ–హైడ్రేషన్ సొల్యూషన్ (ఓఆర్ఎస్) ప్యాకెట్లను అందుబాటులో ఉంచాలి. ► బడుల్లో సన్/హీట్ స్ట్రోక్ బారిన పడితే, వైద్య–ఆరోగ్య శాఖ సమన్వయంతో పనిచేయాలి. ఓఆర్ఎస్ ప్యాకెట్లను ఉపయోగించాలి. ► మధ్యాహ్న భోజన సమయంలో స్థానికుల సమన్వయంతో మజ్జిగ అందించాలి. ► ఎస్ఏ–2 పరీక్షల షెడ్యూల్లో ఎలాంటి మార్పులు లేవని పాఠశాల విద్యాశాఖ పేర్కొంది. -
ఏపీలో ఒంటిపూట బడులు...డేట్ ఫిక్స్
-
తెలంగాణలో రేపటి నుంచి ఒంటిపూట బడులు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని అన్ని పాఠశాలలు ఈ నెల 15 నుంచి ఒంటిపూట తరగతులు నిర్వహించాలని పాఠశాల విద్యాశాఖ ఆదేశించింది. ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం 12.30 వరకు తరగతులు నిర్వహించాలని చెప్పింది. ప్రభుత్వ పాఠశాలలతోపాటు ఎయిడెడ్, ప్రైవేటు యాజమాన్యాలన్నీ ఈ నిబంధనలు తప్పకుండా పాటించాలని స్పష్టం చేసింది. ప్రభుత్వ పాఠశాలల్లో మధ్యాహ్న భోజన పథకాన్ని 12.30 గంటల నుంచి అమలు చేయాలని, పిల్లలకు మధ్యాహ్న భోజనాన్ని అందించిన తర్వాతే ఇంటికి పంపించాలని నిర్దే శించింది. పదోతరగతి పరీక్షలు ఈ నెల 18 నుంచి ప్రారంభం కానుండటంతో పరీక్షా కేంద్రాలుగా ఉన్న స్కూళ్లను మధ్యాహ్నం ఒంటి గంట నుంచి 5 గంటల వరకు నిర్వహించాలని చెప్పింది. 2023–24 విద్యా సంవత్సరానికి ఏప్రిల్ 23వ తేదీ పాఠశాలలకు చివరి పని దినంగా విద్యాశాఖ నిర్దేశించింది. దీంతో అప్పటివరకు ఒంటిపూట బడులే నిర్వహిస్తారు. రాష్ట్రంలోని అన్ని యాజమాన్యాల పాఠశాలలకు ఈ సమాచారాన్ని పంపాలని పాఠశాల విద్యాశాఖ కమిషనర్ దేవసేన జిల్లా విద్యాశాఖ అధికారులను ఆదేశించారు. -
15 నుంచి తెలంగాణలో ఒంటిపూట బడులు
సాక్షి, హైదరాబాద్: ఎండ తీవ్రత పెరుగుతున్న క్రమంలో మార్చి15 నుంచి ఒంటి పూట బడులు నిర్వహించాలని తెలంగాణ విద్యాశాఖ నిర్ణయించింది. ఈ మేరకు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం 12.30 గంటలకు పాఠశాలల వేళలు నిర్ణయించింది. రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ, ప్రైవేట్, ఎయిడెడ్ స్కూళ్లు ఒంటిపూట బడులు నిర్వహించాలని విద్యాశాఖ ఆదేశాలు జారీ చేసింది. అయితే పదో తరగతి పరీక్షలు జరిగే పాఠశాలలో మాత్రం మధ్యాహ్నం 1 నుంచి సాయంత్రం 5 గంటల వరకు క్లాసులు నిర్వహించాలని ప్రభుత్వం పేర్కొంది. 10వ తరగతి పరీక్షలు ముగిసిన తర్వాత మళ్లీ ఉదయం పూటే ఆయా బడులు నడుస్తాయి. -
AP: విద్యార్థులకు గమనిక.. ఒంటి పూట బడులు పొడిగింపు
సాక్షి, అమరావతి: ఏపీలో ఎండల తీవ్రత దృష్ట్యా విద్యాశాఖ కీలక నిర్ణయం తీసుకుంది. ఈనెల 24 వరకు ఒంటి పూట బడులు పొడిగిస్తున్నట్టు ఆదివారం ఓ ప్రకటనలో పేర్కొంది. ఈ నేపథ్యంలో ఉదయం 7.30 గంటల నుంచి 11.30 గంటల వరకు బోధన సమయం, ఉదయం 8.30 నుంచి 9 గంటల వరకు రాగిజావా పంపిణీ, ఉదయం 11.30 గంటల నుంచి 12 గంటల వరకు మధ్యాహ్న భోజనం ఉంటుందని స్పష్టం చేసింది. ఇది కూడా చదవండి: ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి సీఎం జగన్ హామీ ఇచ్చారు: బొప్పరాజు -
ఏపీలో రేపటి నుంచి స్కూళ్లు.. జూన్ 17 వరకు ఒంటి పూటే..
సాక్షి, విజయవాడ: ఏపీలో రేపటి నుంచి పాఠశాలలు పున: ప్రారంభం కానున్నాయి. ఎండల తీవ్రత దృష్ట్యా జూన్ 17 వరకు ఒంటి పూట బడులు నిర్వహించడానికి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఉదయం 7.30 గంటల నుంచి 11.30 వరకు తరగతులు నిర్వహించనున్నారు. ఉదయం 8.30 గంటల నుంచి 9 గంటల మధ్యలో రాగి జావ, 11.30 నుంచి 12 గంటల వరకు జగనన్న గోరుముద్ద అందించనున్నారు. ఈ మేరకు పాఠశాల విద్యా శాఖ కమిషనర్ సురేష్ కుమార్ ఉత్తర్వులు జారీ చేశారు. చదవండి: విద్యాశాఖలో ఏపీ సర్కార్ మరో కీలక నిర్ణయం -
AP: రేపటి నుంచి ఒంటి పూట బడులు
సాక్షి, అమరావతి: రాష్ట్ర వ్యాప్తంగా ఈ నెల 3వ తేదీ నుంచి ఒంటి పూట బడులు నిర్వహిస్తున్నామని విద్యా శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ తెలిపారు. ఈ మేరకు అన్ని జిల్లాలకు ఆదేశాలు ఇచ్చామని చెప్పారు. ప్రభుత్వ పాఠశాలలతో పాటు ప్రైవేటు పాఠశాలలు కూడా ఒంటి పూట బడులు నిర్వహించాలని స్పష్టం చేశారు. నిబంధనలు పాటించని వారిపై చర్యలు తప్పవని హెచ్చరించారు. శనివారం ఆయన విజయవాడలో మీడియాతో మాట్లాడుతూ.. ఒంటి పూట బడులు ఉదయం 7.45 నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకు నిర్వహించాలని, మధ్యాహ్న భోజనం తర్వాత పిల్లలు నేరుగా ఇళ్లకు వెళ్లాలని తెలిపారు. పదవ తరగతి పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేసిన స్కూళ్లకు పూర్తిగా సెలవులు ఇచ్చామన్నారు. రాష్ట్రంలో ఈ నెల 3వ తేదీ నుంచి 18 వరకు ప్రశాంత వాతావరణంలో పదవ తరగతి పరీక్షలు నిర్వహించేందుకు ఏర్పాట్లు పూర్తయ్యాయని తెలిపారు. ఉదయం 9.30 గంటల నుంచి మధ్యాహ్నం 12.45 వరకు పరీక్షలు నిర్వహిస్తారన్నారు. విద్యార్థులు ఉదయం 8.45 నుంచి 9.30 లోపు పరీక్ష కేంద్రం వద్దకు చేరుకోవాలని సూచించారు. 9.30 గంటల తర్వాత పరీక్ష కేంద్రంలోకి అనుమతించేది లేదన్నారు. ఈ ఏడాది 6 సబ్జెక్టులకు 6 రోజులు పరీక్షలు నిర్వహిస్తున్నామని.. ప్రభుత్వ, ప్రైవేట్, ఎయిడెడ్ పాఠశాలల్లో ఏర్పాటు చేసిన పరీక్ష కేంద్రాల్లో కేవలం ప్రభుత్వ ఉపాధ్యాయులు మాత్రమే ఇన్విజిలేషన్ విధులు నిర్వహిస్తారని తెలిపారు. ప్రైవేట్ స్కూళ్ల కేంద్రాల్లో ఇతర సిబ్బంది కూడా ప్రభుత్వ ఉద్యోగులే ఉంటారన్నారు. మొత్తంగా 3,349 కేంద్రాల్లో 6,64,152 మంది విద్యార్థులు పరీక్షలు రాయనున్నారని తెలిపారు. విద్యా కానుకలో నాణ్యతకు పెద్దపీట రాబోయే విద్యా సంవత్సరంలో జగనన్న విద్యా కానుకలో భాగంగా అందించే స్కూల్ బ్యాగ్, బూట్లు, యూనిఫాం తదితర వస్తువులకు సంబంధించి నాణ్యతకు పెద్దపీట వేశామని మంత్రి బొత్స తెలిపారు. ‘గతంలో మా దృష్టికి వచ్చిన సమస్యలను పరిష్కరించి విద్యార్థులకు నాణ్యమైన వస్తువులను అందిస్తున్నాం. పాఠశాలలు పునఃప్రారంభం అయ్యే నాటికి ప్రతి విద్యార్థికి జగనన్న విద్యా కానుక అందిస్తాం. జగనన్న గోరుముద్ద పథకం దేశంలోనే ప్రత్యేకం. బాలికల్లో రక్తహీనత నివారణకు వారానికి మూడు రోజులు రాగి జావ, మూడు రోజులు చిక్కి అందిస్తున్నాం. వచ్చే విద్యా సంవత్సరం నుంచి 1000 స్కూళ్లలో సీబీఎస్ఈ సిలబస్ ప్రవేశ పెడుతున్నాం. టీచర్ల ఖాళీలు ఎన్ని ఉన్నాయో లెక్క తేల్చాక డీఎస్సీ నిర్వహిస్తాం. ప్రైవేటు పాఠశాలల్లో ఫీజుల నియంత్రణ అంశం కోర్టు పరిధిలో ఉన్నందున తీర్పు వచ్చాక అమలు చేస్తాం’ అని చెప్పారు. ఈ సమావేశంలో పాఠశాల విద్యా శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ ప్రవీణ్ ప్రకాష్, పాఠశాల విద్యా కమిషనర్, సమగ్ర శిక్షా ఎస్పీడీ ఎస్ సురేష్ కుమార్, సమగ్ర శిక్షా ఎస్ఏపీడీ బి.శ్రీనివాసరావు, ప్రభుత్వ పరీక్షల విభాగం సంచాలకులు డి.దేవానందరెడ్డి, సమగ్ర శిక్షా ఏఎస్పీడీ, ఏపీ ఓపెన్ స్కూల్ సొసైటీ డైరక్టర్ డా.కెవీ శ్రీనివాసులు రెడ్డి, జాయింట్ డైరెక్టర్ (సర్వీసులు) మువ్వా రామలింగం తదితరులు పాల్గొన్నారు. నిఘా కట్టుదిట్టం ► సమస్యాత్మక కేంద్రాల్లో డీఈవోలు అవసరమైన చోట సిట్టింగ్ స్క్వాడ్లను ఏర్పాటు చేసుకోవాలి. ► ఇప్పటికే అమర్చిన వాటితో పాటు ఈ ఏడాది నూతనంగా 104 పరీక్షా కేంద్రాల్లో సీసీ టీవీ కెమెరాల ఏర్పాటు. ► ఎలక్ట్రానిక్స్ పరికరాలను పరీక్షా కేంద్రాల్లోకి తీసుకెళ్లకూడదు. సూపరింటెండెంట్‌తో సహా ఇన్విజిలేటర్లు, సిబ్బంది మొబైల్ ఫోన్ తీసుకెళ్లరాదు. పరీక్షా కేంద్రాల్లో అక్రమాలకు పాల్పడితే కఠిన చర్యలు. ► ప్రశ్నాపత్రం బయటకు వెళితే అది ఏ కేంద్రం, ఏ విద్యార్థి, ఏ ఇన్విజిలేటర్ నుంచి వెళ్లిందో కనుక్కునే ఏర్పాట్లు చేశాం. ► విద్యార్థులు ఇంటి నుంచి పరీక్ష కేంద్రానికి రానూపోను హాల్ టికెట్ చూసి ఆర్టీసీలో ఉచితంగా ప్రయాణించవచ్చు. ► దేశంలోనే తొలిసారిగా అంధ విద్యార్థుల కోసం వారే స్వయంగా కంప్యూటర్ పై పరీక్ష రాసేలా ఏర్పాట్లు. ► పరీక్షా కేంద్రాల వద్ద నాడు–నేడు అభివృద్ధి పనులు మధ్యాహ్నం తర్వాతే. ► గతంలో అక్రమాలకు పాల్పడ్డ 75 మంది ఉపాధ్యాయులు ఆయా ఎమ్మార్వో ఆఫీసుల్లో ఉండేలా సర్క్యులర్ ఇచ్చినా, ఉపాధ్యాయ సంఘాల అభ్యర్థన మేరకు ఉపసంహరణ. -
3 నుంచి ఏపీలో ఒంటిపూట బడులు
-
Telangana: విద్యార్థులకు అలర్ట్.. ఒంటిపూట బడులు ఎప్పటినుంచంటే..
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో మార్చి 15 నుంచి ఒంటి పూట బడులు ప్రారంభం కానున్నాయి. ఏప్రిల్ 25నుండి పాఠశాలలకు వేసవి సెలవులు ఇవ్వనున్నారు. ఈ మేరకు విద్యాశాఖ అధికారులు నిర్ణయం తీసుకున్నారు. ఉదయం 7.45 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు క్లాసులు నిర్వహించనున్నారు. ఒంటిపూట బడి సమయాల్లో అన్ని పాఠశాలల్లో స్వచ్ఛమైన తాగునీరు అందేలా చూడాలని విద్యాశాఖ ఆదేశించింది. చదవండి: ఈడీని ధైర్యంగా ఎదుర్కొంటా: ఎమ్మెల్సీ కవిత -
ఏప్రిల్ నుంచి ఒంటిపూట బడులు
సాక్షి, అమరావతి: రాష్ట్రంలోని పాఠశాలల్లో వచ్చే నెల మొదటి వారం నుంచి ఒంటిపూట తరగతులు నిర్వహించనున్నారు. ఈ విద్యా సంవత్సరంలో పాఠశాలల పని దినాలు తక్కువగా ఉన్నందున విద్యాశాఖ ఈ నిర్ణయానికి వచ్చినట్లు అధికార వర్గాలు తెలిపాయి. ఏటా జూన్ 12 నుంచి పాఠశాలలను తిరిగి తెరుస్తుండగా.. 2021–22 విద్యాసంవత్సరంలో కరోనా వల్ల ఆగస్ట్ మూడో వారం నుంచి ప్రారంభమైన విషయం తెలిసిందే. దీంతో పని దినాలు తగ్గాయి. ఈ పరిస్థితుల్లో కొన్ని సెలవు దినాల్లోనూ పాఠశాలలు పనిచేసేలా, కనీసం 180 పని దినాలు ఉండేలా క్యాలెండర్‌ను సర్దుబాటు చేసింది. అయితే, సిలబస్ ఇంకా పూర్తి కానందున ఒంటిపూట బడులను ఈ నెల నుంచి కాకుండా వచ్చే నెల మొదటి వారం నుంచి ప్రారంభించాలని విద్యాశాఖ భావిస్తోంది. మే నుంచి జూన్ వరకు వేసవి సెలవులు కాగా, పాఠశాలలను ఏప్రిల్ చివరి వరకు కొనసాగించి.. మే మొదటి వారం నుంచి వేసవి సెలవులు ప్రకటించనున్నారు. మేలో పదో తరగతి పరీక్షలు జరగనున్నందున ఉపాధ్యాయులు, సిబ్బంది ఆ విధులకు హాజరు కావాల్సి ఉంటుంది. పరీక్షలు ఆలస్యమవ్వనున్నందున సెలవులను జూన్ చివరి వరకు పొడిగించాలని అధికారులు భావిస్తున్నారు. జూన్ 12 నుంచి పాఠశాలలు ప్రారంభం కావలసి ఉన్నా ఈ విద్యా సంవత్సరంలో పాఠశాలలను జూలై మొదటి వారం నుంచి ప్రారంభించే అవకాశాలున్నాయని అధికారులు పేర్కొంటున్నారు. -
ఏప్రిల్ 1 నుంచి ఒంటిపూట బడులు
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో ఏప్రిల్ ఒకటో తేదీ నుంచి ఒంటిపూట బడులు నిర్వహించనున్నారు. ఈమేరకు రాష్ట్ర విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ సోమవారం ఒక ప్రకటన విడుదల చేశారు. రాష్ట్రంలోని అన్ని యాజమాన్య పాఠశాలల్లో 1వ తరగతి నుంచి 10వ తరగతి వరకు విద్యార్థులకు ఒక్కపూట మాత్రమే తరగతులు నిర్వహించనున్నామని మంత్రి పేర్కొన్నారు. ఉదయం 7.45 గంటల నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకు మాత్రమే బడి ఉంటుంది. మే 31వ తేదీ వరకు తరగతులు నిర్వహించనున్నారు. పదో తరగతి విద్యార్థులకు పబ్లిక్ పరీక్షలు జూన్‌లో ప్రకటించిన షెడ్యూల్ ప్రకారమే జరుగుతాయి. పెరుగుతున్న ఎండలు, కరోనా కేసుల కారణంగా తరగతులు ముగిసిన తరువాత పాఠశాల నుంచి విద్యార్థులను క్షేమంగా ఇళ్లకు చేర్చటంపై ఉపాధ్యాయులు శ్రద్ధ తీసుకోవాలని మంత్రి సురేష్ సూచించారు. సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశాల మేరకు పాఠశాలల్లో కూడా కోవిడ్ నిబంధనలు అమలుకు ప్రత్యేక చర్యలు తీసుకునేలా అధికారులకు ఆదేశాలు జారీచేశామని చెప్పారు. విద్యార్థులకు కోవిడ్ పరీక్షలు నిర్వహణ, మాస్క్ లు ధరించడం, శానిటైజర్ వినియోగం, భౌతిక దూరం పాటించేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించామన్నారు. పాఠశాలల్లో కోవిడ్ నియంత్రణకు తీసుకుంటున్న చర్యలపై ప్రతి జిల్లా నుంచి నివేదికలు కోరుతున్నామని, ఎక్కడా ఇబ్బంది రాకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకుంటున్నామని వివరించారు. -
మొదటి నెల రోజులు హాఫ్ డే స్కూళ్లు
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో స్కూళ్లను నవంబర్ 2 నుంచి ప్రారంభించనుండడంతో విద్యార్థుల చదువులతోపాటు వారి ఆరోగ్య పరిరక్షణపై ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని సీఎం వైఎస్ జగన్ ఆదేశించారని విద్యా శాఖ మంత్రి ఆదిమూలపు సురేశ్ చెప్పారు. ఆయన గురువారం విజయవాడలో మీడియాతో మాట్లాడుతూ నవంబర్ 2న స్కూళ్లు తెరిచాక నెలపాటు హాఫ్ డే స్కూళ్లు నిర్వహిస్తామని తెలిపారు. కోవిడ్ నుంచి రక్షణకు చర్యలు, ఆరోగ్య పరిరక్షణపై విద్యార్థులకు రోజూ 15 నిమిషాలపాటు టీచర్లు బోధిస్తారని వెల్లడించారు. స్కూళ్లను శానిటైజ్ చేయించడంతోపాటు శానిటైజర్లను అందుబాటులో ఉంచుతామని వివరించారు. సంక్రాంతి, వేసవికి సెలవు రోజులను తగ్గించి స్కూళ్లు నిర్వహిస్తామని చెప్పారు. సెలవు రోజుల్లో విద్యార్థులకు లెర్నింగ్ హవర్స్‌ను కేటాయించి వారు ఇంటి దగ్గరే ఉండి నేర్చుకునేలా పలు రకాల చర్యలు తీసుకుంటామన్నారు. చదవండి: గ్రామ సచివాలయ వ్యవస్థ సూపర్ డిసెంబర్ ఒకటి నుంచి ఇంజనీరింగ్ తదితర యూజీ కోర్సుల ఫస్టియర్ తరగతులు, నవంబర్ 2 నుంచి ఇతర ఏడాదుల్లోని విద్యార్థులకు తరగతులు నిర్వహిస్తామన్నారు. కాగా, ‘మన బడి: నాడు–నేడు’ పనులను త్వరగా పూర్తి చేయాలని ఆదేశించారు. గురువారం సమగ్ర శిక్ష రాష్ట్ర కార్యాలయంలో ‘మన బడి: నాడు– నేడు’పై ఆయన సమీక్ష నిర్వహించారు. 9, 10 తరగతుల్లో విద్యార్థుల సౌకర్యార్థం డ్యూయెల్ డెస్కులను మరింత పెద్దవి ఏర్పాటు చేయాలని సీఎం ఆదేశించారని తెలిపారు. డ్యూయెల్ డెస్కులు, గ్రీన్ చాక్ బోర్డులు, ఇతర ఫర్నీచర్ వస్తువులు త్వరగా పాఠశాలలకు చేరేలా చర్యలు తీసుకోవాలన్నారు. సమావేశంలో పాఠశాల విద్య ముఖ్య కార్యదర్శి బుడితి రాజశేఖర్, పాఠశాల విద్య సలహాదారు ఎ.మురళి తదితరులు పాల్గొన్నారు. అనంతరం జిల్లాల అధికారులతో మంత్రి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. చదవండి: ‘కోవాక్సీన్’ బిహార్ కోసమేనట! -
15 నుంచి ఒంటిపూట బడులు
సాక్షి, అమరావతి: రాష్ట్రంలోని అన్ని యాజమాన్యాల్లోని పాఠశాలల్లో ఈనెల 15వ తేదీ నుంచి ‘ఒంటి పూట బడులు’ ప్రారంభం కానున్నాయి. ఏప్రిల్ 23 వరకు ఒంటిపూట బడులు కొనసాగుతాయని రాష్ట్ర పాఠశాల విద్యా కమిషనర్ వి.చినవీరభద్రుడు బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు. ఒంటిపూట బడుల సమయంలో అనుసరించాల్సిన విధులను అందులో పేర్కొన్నారు. - ఒంటిపూట బడులపై సమయ పట్టికను తప్పనిసరిగా అన్ని పాఠశాలలు అమలు చేయాలి. - ఏప్రిల్ రెండో శనివారం సెలవు ఉండదు. - వేసవి ఎండల దృష్ట్యా పాఠశాలల్లో మంచినీటిని అందుబాటులో ఉంచాలి. - ఎట్టి పరిస్థితుల్లోనూ తరగతులను ఆరుబయట, చెట్లకింద నిర్వహించరాదు. - విద్యార్థులకు వడదెబ్బ తగలకుండా స్కూళ్లలో ఓరల్ రీ–హైడ్రేషన్ సొల్యూషన్ (ఓఆర్ఎస్) ప్యాకెట్లను సిద్ధంగా ఉంచాలి. - మధ్యాహ్న భోజనాన్ని ఒంటిపూట బడి సమయం ముగిసేలోగా తయారు చేయించి విద్యార్థులకు అందించాలి. - ప్రాథమిక పాఠశాలలు ఉదయం 7–45 గంటల నుంచి మధ్యాహ్నం 12.30 వరకు 6 పీరియడ్లు పనిచేయాలి. - ప్రాథమికోన్నత, ఉన్నత పాఠశా లలు ఉదయం 7–45 గంటల నుంచి మధ్యాహ్నం 12.30 వరకు 6 పీరియడ్లు జరపాలి. 16 నుంచి బ్రిడ్జికోర్సులు ఎలిమెంటరీ విద్యార్థులకు ఈనెల 16 నుంచి నిర్వహించే బ్రిడ్జి కోర్సులకు సంబంధించిన కొన్ని విధివిధానాలను విద్యాశాఖ అధికారులకు సూచించింది. ఇందుకు సంబంధించి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించింది. ఆడుతూ పాడుతూ ఆయా అంశాలను నేర్చుకోవడం ద్వారా పిల్లల్లో చదువుపై మరింత అభిరుచిని కలిగించేందుకు ప్రభుత్వం ఈ బ్రిడ్జికోర్సును ఏర్పాటు చేసింది. - పిల్లల్లోని సామర్థ్యాలను తెలుసుకోవడానికి ఈనెల 16న విద్యార్థులకు బేస్‌లైన్ టెస్టు ఉంటుంది. పరీక్ష మొత్తం 50 మార్కులకు నిర్వహిస్తారు. - బేస్‌లైన్ టెస్టులో సున్నా వచ్చినా టీచర్లకు, విద్యార్థులకూ ఎటువంటి ఇబ్బంది ఉండదు. బేస్‌లైన్ టెస్టు విద్యార్థులు ఏ లెవెల్లో ఉన్నారో తెలుసుకోవడానికి మాత్రమే. - బ్రిడ్జి కోర్సు జరిగే 30 రోజుల తర్వాత విద్యార్థుల్లో ఎంత మార్పు వచ్చిందో చూడాలి. ఇందుకు ఏప్రిల్ 22న ఎండ్‌లైన్ పరీక్ష జరుగుతుంది. - సింగిల్ టీచర్ ఉన్న చోట కూడా ఈ బ్రిడ్జికోర్సు కొనసాగించాలి. - ఒకటి రెండు తరగతులకు ఈవీఎస్ ఉండదు. - బ్రిడ్జి కోర్సు సమయంలో విద్యార్థులకు నోట్‌బుక్‌లతో అవసరం లేదు. వర్కుబుక్స్‌ను, టీచర్లకు హ్యాండ్ బుక్స్‌ను విద్యాశాఖ అందిస్తుంది. - ఏప్రిల్ 23న పేరెంట్స్ యాజమాన్య కమిటీ (పీఎంసీ) సమావేశం ఏర్పాటు చేసి విద్యార్థుల ప్రగతిని తల్లిదం డ్రులకు తెలియజేయాలి. -
మరో వారం ఒంటిపూట బడులు
సాక్షి అమరావతి: రాష్ట్రంలో పాఠశాలల ఒంటిపూట పనిదినాలు మరో వారం రోజులు పొడిగించారు. వేసవి ఉష్ణోగ్రతల తీవ్రత వల్ల వేడి గాలులు ఇంకా వీస్తుండటంతో ఒంటిపూట బడులను ఈ నెల 22 వరకు పొడిగిస్తున్నట్లు పాఠశాల విద్యాశాఖ ఉత్తర్వులు జారీ చేసింది. ఈనెల 12 నుంచి పాఠశాలలు తెరిచినప్పటికీ ఎండ తీవ్రత కారణంగా 15వ తేదీ వరకు ఒంటిపూట బడులు పెట్టిన సంగతి తెలిసిందే. అయితే ఉష్ణోగ్రతల తీవ్రత ఇంకా కొనసాగుతున్న నేపథ్యంలో ఒంటిపూట బడులను 22వ తేదీవరకు పొడిగిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసింది. -
ఈనెల 15 నుంచి ఒంటిపూట బడులు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రం లోని పాఠశాలల కు ఈనెల 15వ తేదీ నుంచి ఒంటిపూట బడులను అమలు చేయాలని ఆర్జేడీలు, డీఈవోలను పాఠశాల విద్యా డైరెక్టర్ విజయ్‌కుమార్ ఆదేశించారు. అన్ని యాజమాన్యాల పరిధిలోని ప్రాథమిక, ప్రాథమికోన్నత, ఉన్నత పాఠశాలలను ఉదయం 8 గంటల నుంచి మ«ధ్యాహ్నం 12:30 గంటల వరకు నిర్వహించాలని పేర్కొన్నారు. మధ్యాహ్న భోజనాన్ని విద్యార్థులకు మధ్యాహ్నం 12:30 గంటలకు అందించాలని స్పష్టం చేశారు. అలాగే హైస్కూళ్లకు ఆప్షనల్ హాలిడేస్ అమలు చేయాలని పేర్కొన్నారు. ఒంటిపూట బడులను పాఠశాలలకు చివరి పనిదినం అయిన ఏప్రిల్ 12 వరకు కొనసాగించాలని, ఆ తరువాత వేసవి సెలవులు వర్తిస్తాయని వివరించారు. దీంతో తిరిగి పాఠశాలలు జూన్ 1న ప్రారంభం కానున్నాయి. -
ఒంటిపూట బడులు మార్చి తొలివారం నుంచే
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని పాఠశాలలకు ఒంటిపూట బడులను మార్చి మొదటి వారం నుంచే ప్రారంభించాలని విద్యాశాఖ భావిస్తోంది. వేసవి ఎండల తీవ్రత దృష్ట్యా ప్రభుత్వంతో చర్చించి నిర్ణయం తీసుకోవాలనుకుంటోంది. గతేడాది మార్చి రెండో వారంలో ఒంటిపూట బడులను ప్రారంభించిన విద్యాశాఖ ఈసారి ఎండల తీవ్రత పెరుగుతున్న నేపథ్యంలో వారం ముందే ఈ దిశగా కసరత్తు చేస్తోంది. మరోవైపు అకడమిక్ కేలండర్లో నిర్ణయించిన ప్రకారం ఏప్రిల్ 12వ తేదీని పాఠశాలలకు చివరి పనిదినంగా అమలు చేయనుంది. ఏప్రిల్ 13 నుంచి మే 31 వరకు పాఠశాలలకు వేసవి సెలవులుగా ప్రకటించింది. జూన్ 1 (కొత్త విద్యా సంవత్సరం) నుంచి తిరిగి పాఠశాలలు ప్రారంభం కానున్నాయి. -
ఇక ఒంటిపూట
నారాయణఖేడ్: వేసవిలో ఎండలు మండుతున్నందున ఇక అంగన్వాడీ కేంద్రాలను సైతం ఒంటిపూట నిర్వహించనున్నారు. ఈ మేరకు మహిళా, శిశుసంక్షేమశాఖ ఉత్తర్వులు జారీచేసింది. ఇకపై అంగన్వాడీ కేంద్రాలు ఈ నెల 13 నుంచి మే 31వ తేదీవరకు ఒంటిపూట కొనసాగనున్నాయి. ప్రస్తుతం అంగన్వాడీ కేంద్రాలు ఉదయం 9 నుంచి సాయంత్రం 4 గంటల వరకు కొనసాగుతున్నాయి. ఒంటిపూట నిర్వహణకు ఉత్తర్వులు జారీ కావడంతో ఉదయం 7 నుంచి మధ్యాహ్నం 12గంటల వరకు నిర్వహించనున్నారు. 12 గంటల తర్వాత కేంద్రాన్ని మూసివేస్తారు. అంగన్వాడీ కేంద్రాలకు వచ్చేది ఐదేళ్లలోపు చిన్నారులు. ఎండలు మండిపోతుండడంతో చిన్నారులు సాయంత్రం వరకు కేంద్రాల్లో ఉండేందుకు ఇబ్బందులు పడుతున్నారు. చాలామంది తల్లిదండ్రులు తమ పిల్లలను మధ్యాహ్నం నుంచే ఇళ్లకు తీసుకెళ్తున్నారు. ఈ నేపథ్యంలో తెలంగాణ అంగన్వాడీ టీచర్స్, హెల్పర్స్ యూనియన్, తెలంగాణ మినీ అంగన్వాడీ టీచర్స్ అసోసియేషన్ విజ్ఞప్తుల మేరకు ఒంటిపూట నిర్వహణ ఉత్తర్వులు జారీ చేసినట్లు శిశుసంక్షేమ శాఖ డైరెక్టర్ తెలిపారు. ఒంటిపూట అంగన్వాడీల నిర్వహణకు సంబంధించి జిల్లాలోని అన్ని సీడీపీఓ కార్యాలయాలకు ఉత్తర్వులు పంపించారు. జిల్లా మొత్తం 1,504 అంగన్వాడీలు కొనసాగుతున్నాయి. ఇందులో ప్రధాన కేంద్రాలు 1,344 కాగా, మినీ సెంటర్లు 160 ఉన్నాయి. ఈ కేంద్రాల్లో 0– 5ఏళ్లలోపు చిన్నారులు 1,13,296 మంది, బాలింతలు 12,259 మంది, గర్భిణులు 11,173 మంది ఉన్నారు. ఒంటి పూట కేంద్రం నిర్వహణ అనంతరం మధ్యాహ్నం 12 తర్వాత ఆయా అంగన్వాడీ కేంద్రాల నిర్వాహకులు ఇంటింటి సర్వే చేపట్టాల్సి ఉంటుంది. ప్రీస్కూల్ పిల్లల రీ అడ్మిషన్, బడిమానేసిన పిల్లలను గుర్తించడం, ఆరునెలల నుంచి ఆరేళ్లలోపు పిల్లలను గుర్తించే కార్యక్రమాన్ని చేపట్టాల్సి ఉంది. వేసవి సెలవులు ప్రకటించాలి సంగారెడ్డి రూరల్: వేసవిలో పెరుగుతున్న ఎండలను దృష్టిలో ఉంచుకుని అంగన్వాడీ కేంద్రాలకు సెలవులు ప్రకటించాలని సీఐటీయూ జిల్లా ఉపాధ్యక్షుడు సాయిలు డిమాండ్ చేశారు. బుధవారం సంగారెడ్డి సీఐటీయూ మండల కమిటీ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలలకు సెలవులు ప్రకటించిన మాదిరిగానే ప్రభుత్వం అంగన్వాడీ కేంద్రాలకు సెలవులు ఇవ్వాలని కోరారు. ప్రస్తుతం ఎండకాలం కావడంతో చిన్న పిల్లలు కేంద్రాలకు వెళ్లేందుకు ఇబ్బందులు పడుతున్నారన్నారు. ఎండలు ఎక్కువ ఉండటం వల్ల పిల్లలకు వ్యాధి నిరోధక శక్తి తగ్గి డీహ్రైడేషన్‌కు గురయ్యే ప్రమాదం ఉందన్నారు. ప్రభుత్వం వెంటనే స్పందించి అంగన్వాడీ కేంద్రాలకు సెలవులు ప్రకటించాలని డిమాండ్ చేశారు. సమావేశంలో సీఐటీయూ నాయకులు శ్రీనివాస్, దినకర్, ఎల్లయ్య, ప్రసాద్, బాలమణి, నరేందర్, నాగేష్ , నర్సింలు పాల్గొన్నారు. సెలవులు ఇవ్వాలి సంగారెడ్డి టౌన్: ప్రభుత్వపాఠశాలలతో సమానంగా అంగన్వాడీ కేంద్రాలకు సెలవులు ప్రకటించాలని తెలంగాణ అంగ¯Œన్వాడీ టీచర్స్ హెల్పర్స్ యూనియన్ జిల్లా అధ్యక్షురాలు ఏసుమణి , కార్యదర్శి మంగమ్మ డిమాండ్ చేశారు. యూనియన్ ఆధ్వర్యంలో అనేక పోరాటాలు చేశామన్నారు. వాటి ఫలితంగానే అంగన్వాడీ కేంద్రాలకు ఈ నెల 13 నుంచి ప్రభుత్వం ఒక పూట సెలవు ప్రకటించిందన్నారు. ఎండలు ఎక్కువగా ఉండటం వల్ల పిల్లలు ఇబ్బందులు పడుతున్నారన్నారు. దీంతో తల్లిదండ్రులు పిల్లలను కేంద్రాలకు పంపేందుకు నిరాకరిస్తున్నారన్నారు. ప్రభుత్వం ఈ విషయాన్ని దృష్టిలో ఉంచుకుని సెలవు ప్రకటించాలని, లేని పక్షంలో మళ్లీ పోరాటాలు చేస్తామని హెచ్చరించారు. -
ఒంటి పూట బడి.. జర జాగ్రత్త..!
నిడమర్రు: వేసవి కాలం వచ్చిందంటే.. పిల్లల్లో చెప్పలేని ఉత్సాహం. ఒంటి పూట బడుల కారణంగా సమయం ముగిసిందంటే మధ్యాహ్నం ఆటపాటల్లో విద్యార్థులంతా సరదాగా గడిపేందుకే ఉత్సాహం చూపిస్తుంటారు. ఇక గ్రామీణ ప్రాంతాల్లో పిల్లలు చెరువులు, కాలువలు, వ్యవసాయ బావుల్లో ఈత కొడుతూ ఎండ వేడిమి నుంచి ఉపసమయం పొందుతుంటారు. ఆటలు, ఈత శారీరక వ్యాయామంగా మంచిదే అయినప్పటికీ ఏమాత్రం అజాగ్రత్తగా ఉన్నా సరదామాటున ప్రమాదాలు పొంచి ఉంటాయని తల్లిదండ్రులు గుర్తించాలని నిపుణులు సూచిస్తున్నారు. ఉష్ణతాపం ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపుతుందని పిల్లలకు అవగాహన కల్పించాలని వైద్యులు చెపుతున్నారు. ఒంటి పూట బడులు వచ్చే నెల 23వ తేదీ వరకూ కొనసాగుతాయి. ఈ నేపథ్యంలో చిన్నారుల సంరక్షణలో తల్లిదండ్రులు తీసుకోవాల్సిన జాగ్రత్తలు తెలుసుకుందాం.. మధ్యాహ్నం సూర్యరశ్మికిరణాలతో ప్రమాదం ఉదయం 11 నుంచి సాయంత్రం 4 గంటల వరకు సూర్య కిరణాలు నిటారుగా భూమిపై పడతాయి. ఆసమయంలో ఎక్కువగా బయట తిరిగితే అతినీలలోహిత కిరణాలు నేరుగా చర్మంపై పడి చర్మాన్ని దెబ్బతీస్తాయి. మరో వైపు అంతర్గతంగా కూడా ఈ కిరణాల ప్రభావం ఉంటుందని వైద్యులు చెపుతున్నారు. ఒంటి పూట బడి అవగానే ఇంటికి వచ్చిన పిల్లలను తప్పనిసరిగా అయితే తప్ప ఎండపూట బయటకు వెళ్లనివ్వకూడదు. చిన్నారుల విషయంలో ఇలా ♦ చిన్నపిల్లలను పాఠశాల నుంచి ఇంటికి తీసుకువచ్చే సమయంలో గొడుగు వాడాలి. ♦ ప్రయాణాల సమయంలో ద్విచక్ర వాహనంపై పిల్లలను మధ్యాహ్నం పూట ముందు భాగంలో కూర్చోపెట్టుకుంటే వడ గాలులు నేరుగా తగిలి వడదెబ్బ తగిలే ప్రమాదం ఉంది. వారిని వెనుక కూర్చోబెట్టుకోవాలి ♦ పిల్లలు తప్పనిసరి పరిస్థితుల్లో బయటకు వెళ్లాల్సివస్తే టోపీ పెట్టుకునేలా ప్రోత్సహించాలి. తల, ముఖభాగం పూర్తిగా కప్పి ఉంచేలా వస్త్రం కట్టుకుంటే ఇంకా మంచిది. బోర్ ఫీలవకుండా ఇంట్లో ఖాళీగా ఉంటే పిల్లలు బోర్‌గా ఫీలయ్యే అవకాశం ఉన్నందున వారికి కొత్త ఆటలు గాని విజ్ఞానాన్ని పంచే అంశాలపై దృష్టి సారించేలా చూడాలి. వీలైనంత మేర తల్లిదండ్రులు తమ పిల్లలతో గడిపేందుకు ప్రయత్నించాలి. పాఠశాలల్లో ఇచ్చిన హోమ్‌వర్క్ మధ్యాహ్నం చేసుకునేలా విద్యార్థులను ప్రోత్సహించాలి. దీని ద్వారా సాయంత్రం ఎండ తగ్గిన తర్వాత అడుకునే వెసులుబాటు కలుగుతుంది. వేసవి తాపం కారణంగా పిల్లలు తొందరగా అలిసిపోయే అవకాశం ఉన్నందున మధ్యాహ్నం కొంత సమయం విశ్రాంతి తీసుకునేలా చూడాలి. స్నేహితుల విషయంలో ఒంటి పూట బడుల కారణంగా బడికి వెళ్లే పిల్లలు మధ్యాహ్నం ఖాళీగా ఉండటం ఇష్టం లేక వీలైనంద వరకు తోటి స్నేహితులతో సరదాగా కాలం గడపాలని చూస్తారు. పిల్లలకు వేసవిలో కలిగే ఇబ్బందులను దృష్టిలో ఉంచుకునే ప్రభుత్వం ఒంటిపూట బడులు నిర్వహిస్తుందని గమనించాలి. నిర్లక్ష్యం చేస్తే తెలిసీ తెలియని వయస్సులో ఉన్న పిల్లల ఆరోగ్యంతోపాటు వారి ప్రాణాలపై ప్రభావం పడుతుందనే విషయం తల్లిదండ్రులు గమనించాలి. వేసవిలో సేదతీరేందుకు వేసవి తాపాన్ని తట్టుకోవడం కోసం మధ్యాహ్నం పూట పిల్లలు చెరువులు, పంట కాలువలు, వ్యవసాయ బోరు బావుల్లో ఈతకని వెళ్లి ప్రమాదాలు బారిన పడిన విషాధకర సంఘటనలు ఏటా ఎన్నో జరుగుతున్నాయి. ఈత నేర్చుకకోవడం మంచిదే అయినప్పటికీ పెద్దలు, అనుభవజ్ఞుల సమక్షంలో చేసే ఫలితం ఉంటుందని తల్లిదండ్రులు గమనించాలి. పెద్దల సమక్షంలో శిక్షణ సైకిల్ తొక్కడం, ద్విచక్రవాహనాలు నడపడం నేర్చుకోవాలన్న కోరిక పిల్లల్లో సహజంగానే ఉంటుంది. వారి వయస్సు ఆధారంగా సైకిల్గాని, ద్విచక్రవాహనం నడిపేందుకు శిక్షణ తోటి మిత్రుల ఆధ్వర్యంలో కాకుండా పెద్దలు సమక్షంలో జనం సంచారం లేని చోట జరిగేలా చిన్నారులకు కౌన్సిలింగ్ ఇవ్వాలి. సెలవుల్లో కొత్త స్నేహాలకు అవకాశం ఎక్కువగా ఉంటుంది. పి ల్లల స్నేహితులు ఎవరో, వారు ఎక్కడికి వెళ్తున్నారో ఎప్పటికప్పుడు గమనించాలి. వారు ఎక్కడికి ఎందుకు వెళుతున్నారో పక్కా సమాచారం తల్లిదండ్రుల వద్ద ఉండేలా బాధ్యత వహించాలి. ఆరోగ్యంపై ఉష్ణోగ్రతల ప్రభావం వేసవిలో సాధ్యమైనంత వరకు పిల్లలను మధ్యాహ్నం పూట ఎండలోకి వెళ్లకుండా తల్లిదుండ్రులు చర్యలు తీసుకోవాలి. తప్పనిసరి పరిస్థితుల్లో వెళ్లాల్సివస్తే తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. వడదెబ్బ తగలకుండా బయటకు వెళ్లే సమయంలో ఎక్కువ నీరు తాగాలి. శీతల పానియాల బదులు కొబ్బరి బొండాం, పండ్ల రసాలు తీసుకోవాలి. వడ దెబ్బతగిలితే ఓఆర్ఎస్ తాగించాలి. దగ్గరలో ఉన్న పీహెచ్‌సీకి తీసుకు వెళ్లి వైద్యం అందించాలి.– డాక్టర్ కె. శంకరరావు పిల్లల వైద్యనిపుణుడు, జిల్లా అసుపత్రుల సమన్వయ అధికారి -
మార్చి 8 నుంచి ఒంటిపూట బడులు
హైదరాబాద్: రాష్ట్రంలో వేసవి తీవ్రత ఒక్కసారిగా పెరగడంతో విద్యాశాఖ ఒంటిపూట బడుల షెడ్యూల్‌ను వారం రోజులు ముందుకు జరిపింది. ఈనెల 16వ తేదీ నుంచి ఒంటిపూట బడులు ఉంటాయని ఇంతకు ముందు అకడమిక్ షెడ్యూల్లో పెట్టారు. అయితే ఎండలు రోజురోజుకూ ఎక్కువవుతుండడంతో పాఠశాలలకు వెళ్లే విద్యార్ధులు, టీచర్ల ఆరోగ్యంపై విపరీత ప్రభావం పడుతోంది. దీంతో ఈ ఒంటిపూట బడుల షెడ్యూల్‌ను మార్చి 16వ తేదీకి బదులు మార్చి 8వ తేదీ నుంచే ప్రారంభమయ్యేలా పాఠశాల విద్యాశాఖ కమిషనర్ సంధ్యారాణి షెడ్యూల్‌ను విడుదల చేశారు. ఈ మేరకు మంగళవారం ఉత్తర్వులు జారీచేశారు. రీజనల్ జాయింట్ డైరెక్టర్లు, డీఈఓలు తగు చర్యలు తీసుకోవాలని సూచించారు.