తెలంగాణలో రేపటి నుంచి ఒంటిపూట బడులు | Half Day Schools in Telangana from 15th March | Sakshi
Sakshi News home page

తెలంగాణలో రేపటి నుంచి ఒంటిపూట బడులు

Published Thu, Mar 14 2024 12:19 PM | Last Updated on Thu, Mar 14 2024 3:12 PM

Half Day Schools in Telangana from 15th March - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్రంలోని అన్ని పాఠశాలలు ఈ నెల 15 నుంచి ఒంటిపూట తరగతులు నిర్వహించాలని పాఠశాల విద్యాశాఖ ఆదేశించింది. ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం 12.30 వరకు తరగతులు నిర్వహించాలని చెప్పింది. ప్రభుత్వ పాఠశాలలతోపాటు ఎయిడెడ్, ప్రైవేటు యాజమాన్యాలన్నీ ఈ నిబంధనలు తప్పకుండా పాటించాలని స్పష్టం చేసింది.

ప్రభుత్వ పాఠశాలల్లో మధ్యాహ్న భోజన పథకాన్ని 12.30 గంటల నుంచి అమలు చేయాలని, పిల్లలకు మధ్యాహ్న భోజనాన్ని అందించిన తర్వాతే ఇంటికి పంపించాలని నిర్దే శించింది. పదోతరగతి పరీక్షలు ఈ నెల 18 నుంచి ప్రారంభం కానుండటంతో పరీక్షా కేంద్రాలుగా ఉన్న స్కూళ్లను మధ్యాహ్నం ఒంటి గంట నుంచి 5 గంటల వరకు నిర్వహించాలని చెప్పింది.

2023–24 విద్యా సంవత్సరానికి ఏప్రిల్‌ 23వ తేదీ పాఠశాలలకు చివరి పని దినంగా విద్యాశాఖ నిర్దేశించింది. దీంతో అప్పటివరకు ఒంటిపూట బడులే నిర్వహిస్తారు. రాష్ట్రంలోని అన్ని యాజమాన్యాల పాఠశాలలకు ఈ సమాచారాన్ని పంపాలని పాఠశాల విద్యాశాఖ కమిషనర్‌ దేవసేన జిల్లా విద్యాశాఖ అధికారులను ఆదేశించారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement