సాక్షి, హైదరాబాద్: ఎండ తీవ్రత పెరుగుతున్న క్రమంలో మార్చి15 నుంచి ఒంటి పూట బడులు నిర్వహించాలని తెలంగాణ విద్యాశాఖ నిర్ణయించింది. ఈ మేరకు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం 12.30 గంటలకు పాఠశాలల వేళలు నిర్ణయించింది.
రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ, ప్రైవేట్, ఎయిడెడ్ స్కూళ్లు ఒంటిపూట బడులు నిర్వహించాలని విద్యాశాఖ ఆదేశాలు జారీ చేసింది. అయితే పదో తరగతి పరీక్షలు జరిగే పాఠశాలలో మాత్రం మధ్యాహ్నం 1 నుంచి సాయంత్రం 5 గంటల వరకు క్లాసులు నిర్వహించాలని ప్రభుత్వం పేర్కొంది. 10వ తరగతి పరీక్షలు ముగిసిన తర్వాత మళ్లీ ఉదయం పూటే ఆయా బడులు నడుస్తాయి.
Comments
Please login to add a commentAdd a comment