మార్చి 8 నుంచి ఒంటిపూట బడులు | Half day schools start from March 8 | Sakshi
Sakshi News home page

మార్చి 8 నుంచి ఒంటిపూట బడులు

Published Tue, Mar 1 2016 8:16 PM | Last Updated on Mon, Oct 8 2018 7:36 PM

Half day schools start from March 8

హైదరాబాద్: రాష్ట్రంలో వేసవి తీవ్రత ఒక్కసారిగా పెరగడంతో విద్యాశాఖ ఒంటిపూట బడుల షెడ్యూల్‌ను వారం రోజులు ముందుకు జరిపింది. ఈనెల 16వ తేదీ నుంచి ఒంటిపూట బడులు ఉంటాయని ఇంతకు ముందు అకడమిక్ షెడ్యూల్‌లో పెట్టారు. అయితే ఎండలు రోజురోజుకూ ఎక్కువవుతుండడంతో పాఠశాలలకు వెళ్లే విద్యార్ధులు, టీచర్ల ఆరోగ్యంపై విపరీత ప్రభావం పడుతోంది. దీంతో ఈ ఒంటిపూట బడుల షెడ్యూల్‌ను మార్చి 16వ తేదీకి బదులు మార్చి 8వ తేదీ నుంచే ప్రారంభమయ్యేలా పాఠశాల విద్యాశాఖ కమిషనర్ సంధ్యారాణి షెడ్యూల్‌ను విడుదల చేశారు. ఈ మేరకు మంగళవారం ఉత్తర్వులు జారీచేశారు. రీజనల్ జాయింట్ డైరెక్టర్లు, డీఈఓలు తగు చర్యలు తీసుకోవాలని సూచించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement