World Wild Life Day: వన్యప్రాణులతోనే మానవ మనుగడ | World Wildlife day Celebrated Every Year on March 3 | Sakshi
Sakshi News home page

World Wild Life Day: వన్యప్రాణులతోనే మానవ మనుగడ

Mar 3 2025 8:12 AM | Updated on Mar 3 2025 8:13 AM

World Wildlife day Celebrated Every Year on March 3

అంతరించిపోతున్న వన్యప్రాణులను సంరక్షించే ఉద్దేశంతో ప్రతి ఏటా మార్చి 3న ప్రపంచ వన్యప్రాణి దినోత్సవాన్ని జరుపుకుంటారు. ఈ దినోత్సవాన్ని జరుపుకోవడం వెనుక ఉద్దేశ్యం ఏమిటంటే.. సహజ వనరుల ప్రాముఖ్యతను అర్థం చేసుకోవడం, వాటి  పరిరక్షణకు పాటు పడాలనే భావనను పెంపొందించుకోవడం.

ప్రపంచ వన్యప్రాణి దినోత్సవం(World Wild Life Day) అనేది సమైక్యంగా వన్యప్రాణుల సంరక్షణ కోసం పాటుపడటాన్ని ప్రోత్సహిస్తుంది. గతంలో అంతర్జాతీయ వన్యప్రాణుల వాణిజ్యాన్ని నిషేధించే ప్రతిపాదనను ఐక్యరాజ్యసమితి సర్వసభ్య సమావేశం తీసుకువచ్చింది. తద్వారా అంతరించిపోతున్న జాతులను రక్షించేందుకు చర్యలకు ఉపక్రమించింది. 2013, డిసెంబర్ 20న ఐక్యరాజ్యసమితి తన జనరల్ అసెంబ్లీలో ప్రతి  ఏటా మార్చి 3న ప్రపంచ వన్యప్రాణి దినోత్సవాన్ని నిర్వహించాలని నిర్ణయించింది.

అంతర్జాతీయ వన్యప్రాణుల వ్యాపారాన్ని నిషేధించే ప్రతిపాదనపై ఐక్యరాజ్యసమితి జనరల్ అసెంబ్లీ(United Nations General Assembly) 1973 మార్చి 3న సంతకం చేసింది. దీనికి గుర్తుగా అదేరోజున ప్రపంచ వన్యప్రాణి దినోత్సవాన్ని జరుపుకుంటున్నాం. ఈ దినోత్సవం నిర్వహణ ద్వారా  అంతరించిపోతున్న జంతువులు, మొక్కలను సంరక్షించేందుకు ప్రేరణ కలుగుతుంది. ఈ  దినోత్సవాన్ని మొదటిసారిగా2014,  మార్చి 3న జరుపుకున్నారు.

ప్రాముఖ్యత
వన్యప్రాణులు అంతరించిపోవడం అనేది పర్యావరణ సమతుల్యతను మాత్రమే కాకుండా అభివృద్ధిని కూడా ప్రభావితం చేస్తుంది. అటవీ జంతువులు, మొక్కలు, వృక్షాల సంరక్షణ తప్పనిసరి. వాటిని సంరక్షించడం ద్వారా, మనిషి భూమిపై జీవితాన్ని సక్రమంగా కొనసాగించగులుగుతాడు. ఈ అంశాలను గుర్తించేందుకే వన్యప్రాణి దినోత్సవాన్ని నిర్వహిస్తున్నారు. వన్యప్రాణుల సంరక్షణలో ఐక్యరాజ్యసమితి లక్ష్యాల దిశగా మనమంతా ముందుకు సాగాలి. వన్యప్రాణుల సంరక్షణకు పరిష్కారాలను కనుగొనాలి. అంతరించిపోతున్న జాతుల పరిరక్షణపై దృష్టి సారించాలి. వన్యప్రాణుల సంరక్షణకు వివిధ దేశాలు ఉమ్మడి ప్రయత్నాలు సాగించాలి. 

ఇది కూడా చదవండి: సోమనాథుని సన్నిధిలో ప్రధాని మోదీ పూజలు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement