Wild Life
-
అత్యంత అరుదైన పెంగ్విన్..!
ఫొటోలో కనిపిస్తున్నది ప్రపంచంలోనే చాలా అరుదుగా కనిపించే పెంగ్విన్. పూర్తి నలుపు రంగులో కనిపించే ఇలాంటి పెంగ్విన్స్‌ను ‘మెలనిస్టిక్ పెంగ్విన్స్’ అని, ‘ఆల్ బ్లాక్ పెంగ్విన్స్’ అని అంటారు. బెల్జియన్ వైల్డ్ లైఫ్ ఫొటోగ్రాఫర్ వైవ్స్ ఆడమ్స్, దక్షిణ జార్జియా ద్వీపంలోని సెయింట్ ఆండ్రూస్ బే వద్ద ఈ అరుదైన పెంగ్విన్ ఫొటో తీశాడు. సాధారణంగా పెంగ్విన్లు నలుపు, తెలుపు రంగుల్లో ఉంటాయి. కౌంటర్ షేడింగ్ అనే మభ్యపెట్టే పద్ధతిలో భాగంగా పెంగ్విన్లకు ఈ రంగులు సహజంగా ఉంటాయి. పెంగ్విన్లు ఈత కొడుతున్నప్పుడు, తెలుపు భాగం ప్రకాశవంతమైన నీటితో కలసిపోయి, ఇతర జంతువుల నుంచి రక్షించుకునేందుకు సహాయపడుతుంది. అయితే, పూర్తి నల్లటి ఈకలతో కప్పబడి ఉండే ఈ రకం పరిస్థితిని మెలనిజం అని పిలుస్తారు. శరీరం మెలనిన్‌ను ఎక్కువగా ఉత్పత్తి చేసినప్పుడు, చర్మం లేదా వెంట్రుకలు నల్లగా ఉంటాయి. ‘నేను పూర్తి మెలనిస్టిక్ పెంగ్విన్‌ను చూసి చాలా సంతోషించాను. దూరం నుంచి చాలా నల్లగా ఉంటుంది, కాని దగ్గరగా వచ్చినప్పుడు దాని మెడ, బొడ్డుపై కొన్ని గుర్తులు ముదురాకుపచ్చగా ఉన్నాయి’ అని ఆడమ్స్ చెప్పాడు. నిజానికి ఆడమ్స్ వింతగా కనిపించే పెంగ్విన్ ఫొటో తీయటం ఇది రెండోసారి. 2021లో, ఇదే ప్రాంతంలో మునుపెన్నడూ చూడని పసుపు రంగు పెంగ్విన్ ఫొటో తీశాడు ఆడమ్స్. (చదవండి: ఆ జత జాడీలతో ఓ కుటుంబం రాత్రికి రాత్రే కోట్లకు పడగలెత్తింది..!) -
అంతరించిపోతున్న వన్యప్రాణులు
వరల్డ్ వైల్డ్ లైఫ్ ఫౌండేషన్ విడుదల చేసిన లివింగ్ ప్లానెట్ ఇండెక్స్–2024లో అర్ధ శతాబ్దంలో భారీ సంఖ్యలో వన్యప్రాణుల జాతులు కనుమరుగైనట్లు పేర్కొంది. అడవుల నరికివేత, జంతువుల అక్రమ రవాణా, మానవ కార్యకలాపాలతో వన్యప్రాణులు అంతరించిపోతున్నాయని వెల్లడించింది.అడవుల నరికివేత, జంతువుల అక్రమ రవాణా, మానవ కార్యకలాపాలతో వన్యప్రాణులు అంతరించిపోతున్నాయి. వరల్డ్ వైల్డ్‌లైఫ్ ఫౌండేషన్ (డబ్ల్యూడబ్ల్యూఎఫ్) విడుదల చేసిన లివింగ్ ప్లానెట్ ఇండెక్స్–2024లో అర్ధ శతాబ్దంలో భారీ సంఖ్యలో వన్యప్రాణుల జాతులు కనుమరుగైనట్టు పేర్కొంది. 1970 నుంచి 2020 మధ్య కాలంలో సగటు జాతుల్లో 73శాతం తగ్గుదలను గుర్తించింది. అత్యధికంగా మంచి నీటిలో జీవించే జాతులు ఎక్కువ ప్రమాదానికి (85శాతం) అంతరించిపోయినట్టు స్పష్టం చేసింది. భూ సంబంధ జాతుల్లో 69శాతం, సముద్ర జాతుల్లో 56 శాతంగా ఉంది. ఇలా వన్యప్రాణులు అంతరించపోవడం 022(69శాతం)తో పోలిస్తే ఈ ఏడాది నాలుగు శాతం పెరగడం గమనార్హం. ఈ క్రమంలోనే జూలాజికల్ సొసైటీ ఆఫ్ లండన్ అందించిన లివింగ్ ప్లానెట్ ఇండెక్స్‌లో 1970–2020 నుంచి 35వేలకుపైగా వన్యప్రాణుల జాతులు, 5,495 జాతుల ఉభయ చరాలు, పక్షులు, చేపలు, క్షీరదాలు, సరీసృపాలు అంతరించిపోయాయి. – సాక్షి, అమరావతిఅమెజాన్ రెయిన్ ఫారెస్ట్‌లోనే ఎక్కువరెండువేల చెట్లు, 800 జంతుజాతులకు నిలయమైన అమెజాన్ రెయిన్‌ఫారెస్ట్‌లో వన్యప్రాణులు అంతరించిపోతున్నాయి. వేట కారణంగా పెద్ద పండ్లను తినే జంతువులను కోల్పోవడంతో, పెద్ద విత్తనాల వ్యాప్తి గణనీయంగా తగ్గిపోయింది. పగడపు దిబ్బల వంటి అత్యంత విలువైన పర్యావరణ వ్యవస్థల్లో కొన్నింటిని కోల్పోవడం ప్రపంచాన్ని ప్రమాదంలోకి నెడుతోందని డబ్ల్యూడబ్ల్యూఎఫ్ ఆందోళన వ్యక్తం చేసింది. సముద్ర జీవ వైవిధ్యం, తీర ప్రాంత రక్షణలకు పగడపు దిబ్బలు అవసరమని అభిప్రాయపడింది. గ్రీన్ ల్యాండ్, వెస్ట్ అంటార్కిటిక్‌లో మంచు పలకలు కరగడంతో పెద్ద ఎత్తున మీథేన్, కార్బన్ ఉద్గారాలు పెరిగేందుకు కారణమవుతోందని తెలిపింది.భారత్‌లో రాబందులు భారతదేశంలో మూడు రాబందు జాతులు అంతరించపోవడం నివేదిక ప్రమాదంగా భావిస్తోంది. గడిచిన రెండు దశాబ్దాల్లోనే వైట్–రంప్డ్ వల్చర్ (తెల్ల రాబందు) 67శాతం, ఇండియన్ రాబందు 48శాతం, స్లెండర్–బిల్డ్ రాబందు (హిమాలయన్ రాబందు) 89 శాతం అంతరించినట్టు నివేదిక పేర్కొంది. వీటిని రక్షించడానికి, పర్యావరణ సమతుల్యతను కాపాడుకోవడానికి పరిరక్షణ చర్యలు చేపట్టాలని హెచ్చరిస్తోంది. దేశంలో వన్యప్రాణులు అంతరించిపోతున్నా, కొన్ని ప్రాంతాల్లోని జీవజాతులను రక్షించడం, పునరుద్ధరించడంలో ప్రభుత్వ కార్యక్రమాలు చురుగ్గా ఉన్నట్టు నివేదిక చెబుతోంది.అడవి పులులకు నిలయంగా భారత్ భారత్ ప్రపంచ వ్యాప్తంగా అడవి పులుల అత్యధిక జనాభాకు నిలయంగా ఉంది. ఆల్–ఇండియా టైగర్ ఎస్టిమేషన్ 2022 అంచనా ప్రకారం 3,682 పులులు ఉన్నట్టు తే ల్చింది. అలాగే మొట్టమొదటి మంచు చిరుత జనాభా అంచనానూ ప్రారంభించింది. ప్రస్తుతం దేశంలో 718 మంచు చిరుతలను గుర్తించింది. ఆహార భద్రత ముప్పు జీవవైవిధ్య నష్టం, వాతావరణ సవాళ్ల కారణంగా 73.5 కోట్ల మంది ప్రజలు ప్రతి రాత్రి ఆకలితో పడుకుంటున్నారు. 90 శాతానికి పైగా పంట రకాలు కనుమరుగయ్యాయి. కేవలం 10 పంటలు (బార్లీ, సరుగుడు, మొక్కజొన్న, ఆయిల్ పామ్, వరి, జొన్న, సోయాబీన్, చెరకు, గోధుమలు, రాప్సీడ్) ప్రపంచ వ్యాప్తంగా దాదాపు 83శాతం ఆహారాన్ని అందిస్తున్నాయి. మత్స్య సంపద నుంచి సంవత్సరానికి సుమారు 9 కోట్ల టన్నుల సీఫుడ్ అందుతోంది. ఇది 300 కోట్ల మందికి పైగా ప్రజలకు అవసరం. అయితే 37.7శాతం అధికంగా చేపలు పట్టడం వల్ల చేపల జనాభా క్షీణత, పగడపు దిబ్బలు దెబ్బతింటున్నాయి. ప్రపంచవ్యాప్తంగా 1970–2020 వరకు వివిధ దేశాల్లో అంతరించిన వన్యప్రాణులు, ఉభయచరాలు, పక్షులు, చేపలు, క్షీరదాల జాబితా..» లాటిన్ అమెరికా, కరేబియన్ దీవుల్లో95%» ఆఫ్రికాలో 76%» ఆసియా–పసిఫిక్ ప్రాంతంలో60%» యూరప్‌లో మధ్యస్తంగా మధ్య ఆసియాలో 35%» ఉత్తర అమెరికాలో39% -
పులితో పెట్టుకున్న కోతి.. మరి ఏది గెలిచింది?
సోషల్ మీడియాలో వన్యప్రాణులకు సంబంధించిన వీడియోలు తెగ అలరిస్తుంటాయి. ఇలాంటి కొన్ని వీడియోలు మనకు ఒకపట్టాన నమ్మశక్యం కాదు. తాజాగా ఇటువంటి వింత వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఇది చూసిన తర్వాత ‘ఇదేందిది’ అనకుండా ఉండలేరు. అలాగే నవ్వకుండానూ ఉండలేరు. మరి.. అంత వినోదం ఉంది ఈ వీడియోలో.. మనం కోతులకు సంబంధించిన వీడియోలను చూసేవుంటాం. అయితే ఇప్పుడు మనం చూడబోతున్న వీడియోలో ఈ కోతి చేష్టలు తారాస్థాయికి చేరాయనిపిస్తుంది. ఈ వీడియోను చూసిన చాలా మంది.. కోతులకు నిజంగా ఇంత ధైర్యం ఎక్కడినుంచి వచ్చిందని ప్రశ్నిస్తున్నారు. ఈ వైరల్ వీడియోలో ముందుగా పులులు అడవిలో విశ్రాంతి తీసుకుంటున్న దృశ్యం కనిపిస్తుంది. అయితే అక్కడే చెట్టుపై నుంచి వేలాడున్న ఒక కోతి కిందినున్న పులిని తెగ ఆటపట్టిస్తుంటుంది. ఆ కోతి ఒకసారి పులి తోకను , మరోమారు దాని చెవిని పట్టుకుని లాగుతుంది. ఈ చేష్టలను పులి అడ్డుకునే ప్రయత్నం చేస్తుంది. అయినా ఫలితం లేకపోతుంది. ఈ కోతి చేష్టలు ఆ పులిని తెగ చికాకు పెడతాయి. ఈ వీడియోను సోషల్ మీడియా ప్లాట్ఫారం ‘ఎక్స్’లో షేర్ చేశారు. ఆ వీడియోను చూసిన యూజర్స్ పలు రకాలుగా కామెంట్లు చేస్తున్నారు. ఒక యూజర్ ఆ కోతి నిజంగానే పులితో ఒక ఆట ఆడుకున్నదని, ఇకపై ఆ పులులు కోతికి దూరంగా ఉంటాయంటూ కామెంట్ చేశారు. ఇది కూడా చదవండి: ‘టీమిండియా గెలిచేవరకూ మెతుకు ముట్టం’ Gibbons like to live dangerously pic.twitter.com/kNHbYI0TDd — Nature is Amazing ☘️ (@AMAZlNGNATURE) November 16, 2023 -
బిజీ లైఫ్ నుంచి రిలీఫ్ పొందాలనుకుంటున్నారా..? చలో పోచారం..
ఎటుచూసినా భవనాలు... రోడ్లు.. వాహనాల రణగొణ ధ్వనులు.. ఉక్కిరిబిక్కిరి చేసే వాయుకాలుష్యం... ఉరుకుల పరుగుల జీవనం.. ఇదీ నేటి కాంక్రీట్ జంగిల్లా మారిన పట్టణ, నగరవాసుల దయనీయ పరిస్థితి. దీన్నుంచి కాస్త ఉపశమనం పొందాలనుకుంటున్నారా? ఎటుచూసినా పచ్చటి చెట్లు.. పక్షుల కిలకిలారావాలు... అక్కడక్కడా కనిపిస్తూ కనువిందు చేసే వన్యప్రాణులు, స్వచ్ఛమైన పిల్లగాలులు, ప్రకృతి సోయగాల నడుమ సూర్యోదయ, అస్తమయాలను కుటుంబ సభ్యులు, స్నేహితులతో కలసి ఆస్వాదించాలనుకుంటున్నారా? అయితే ఇంకెందుకు ఆలస్యం.. చలో నర్సాపూర్, పోచారం. సాక్షి, హైదరాబాద్: ప్రకృతి ఒడిలో నగరవాసులు కాసేపు సేదతీరేందుకు వీలుగా మెదక్ అటవీ శాఖ, యునైటెడ్ స్టేట్స్ ఏజెన్సీ ఫర్ ఇంటర్నేషనల్ డెవలప్మెంట్ (యూఎస్ఏఐడీ) సంయుక్తంగా ‘కమ్యూనిటీ బేస్డ్ ఎకో టూరిజం’నేచర్ క్యాంప్‌లను అందుబాటులోకి తెచ్చాయి. నర్సాపూర్ అటవీ ప్రాంతం, పోచారం వైల్డ్‌లైఫ్ శాంక్చురీ, జీప్ సఫారీ, ట్రెక్కింగ్ తదితరాలతో రెండు పగళ్లు, ఒక రాత్రి కలిపి మొత్తం 36 గంటలపాటు అడవిలో గడుపుతూ మధుర అనుభూతులను సొంతం చేసుకొనేలా ప్యాకేజీని సిద్ధం చేశాయి. పర్యాటకులు అడవుల్లోని చెట్లు, జంతువుల రకాలు, పర్యావరణ వ్యవస్థలు, స్థానిక ఆహారపు అలవాట్లు, గిరిజనుల సాంస్కృతిక జీవనం, వ్యవసాయ పద్ధతుల వంటి వాటిని ప్రత్యక్షంగా తెలుసుకోవడాన్ని ఇందులో అంతర్భాగం చేశాయి. స్థానికంగా తయారు చేసిన వస్తువులకు గిరాకీ కలి్పంచడం ద్వారా స్వయం ఉపాధి అవకాశాల పెంపుతోపాటు పర్యావరణ పరిరక్షణ ప్రాధాన్యత గురించి అవగాహన కల్పించనున్నాయి. నేచర్ క్యాంప్ టూర్ ఇలా.. ♦ ఉదయం 6 గంటలకు నర్సాపూర్ అర్బన్ ఫారెస్ట్ పార్కు నుంచి ప్రారంభం ♦ ఈ పార్కులో ట్రెక్కింగ్, బర్డింగ్, బట్టర్ఫ్లై వాక్, వెట్‌ల్యాండ్ విజిట్ ♦ వాచ్‌టవర్ వద్ద అల్పాహారం. అక్కడే ఈ టూర్‌కు సంబంధించిన ఇంటరాక్షన్ ♦ నర్సాపూర్ పార్క్‌కు ఎదురుగానున్న అటవీప్రాంతం సందర్శన, అక్కడ నుంచి నర్సాపూర్ పట్టణానికి పయనం. ♦ మెదక్ పట్టణానికి ప్రయాణ మార్గమధ్యంలో ఫారెస్ట్, ప్రైవేట్ నర్సరీల విజిట్. మెదక్ చర్చి సందర్శన, ఆ తర్వాత సమీపంలోనే లంచ్ ♦ అక్కడి నుంచి పోచారం వైల్డ్‌లైఫ్ శాంక్చురీకి.. ♦ స్థానిక పర్యావరణ వ్యవస్థలపై అవగాహన పెంచుకునేందుకు సిద్ధం చేసిన ఎని్వరాన్‌మెంట్ ఎడ్యుకేషన్ సెంటర్ (ఈఈసీ) విజిట్ ♦ వైల్డ్‌లైఫ్ సఫారీ, పోచారం డ్యామ్, నిజాం హెరిటేజ్ బిల్డింగ్స్ సందర్శన, సూర్యాస్తమయ వీక్షణ. ♦ ఈఈసీ సెంటర్ వద్ద సమావేశం. అక్కడే స్థానిక వంటకాలు, రుచులతో బార్బిక్యూ డిన్నర్, హోమ్‌స్టే లేదా టెంట్లలో రాత్రి నిద్ర. ♦ మరుసటి రోజు ఉదయం 6 గంటలకు పోచారం లేక్ వద్ద సూర్యోదయ వీక్షణ ♦ అల్పాహారం తర్వాత పోచారం వైల్డ్‌లైఫ్ ♦ శాంక్చురీలో బర్డ్ వాచింగ్, బట్టర్ఫ్లై వాక్ ♦ ఉదయం 11 గంటలకు దంతేపల్లి లేదా మరోచోట గిరిజన గ్రామ సందర్శన ♦ మధ్యాహ్నం దంతేపల్లిలో ‘ఫామ్ లంచ్’ ♦ అనంతరం హైదరాబాద్‌కు తిరుగు ప్రయాణం పోచారం వైల్డ్‌లైఫ్ శాంక్చురీ ప్రత్యేకతలివే... హైదరాబాద్‌కు 115 కి.మీ. దూరంలోని పోచారం వైల్డ్‌లైఫ్ శాంక్చురీ 130 చ.కి.మీ. విస్తీర్ణంలో మెదక్, కామారెడ్డి జిల్లాల పరిధిలో విస్తరించింది. ఇది పోచారం లేక్ వెంట విస్తరించి ఉండటం విశేషం. ఇక్కడ వివిధ రకాల జింకలు, చిరుతలు, ఎలుగుబంట్లు కూడా కనిపిస్తుంటాయి. పలు రకాల అరుదైన పక్షులకు సైతం ఇది కేంద్రంగా ఉంది. ఫారెస్ట్ ప్లస్ 2.0 అంటే... కేంద్ర అటవీ, పర్యావరణశాఖల సహకారంతో యూఎస్ఏఐడీ సంస్థ ప్రకృతిసిద్ధ పరిష్కారాల అభివృద్ధి ద్వారా అడవులపై ఆధారపడిన స్థానిక గిరిజనులకు ఉపాధి అవకాశాలు పెంపొందించడంతోపాటు కమ్యూనిటీల పరంగా బలోపేతం కావడానికి వివిధ కార్యక్రమాలు చేపడుతోంది. దీనికి ఫారెస్ట్ ప్లస్ 2.0గా నామకరణం చేసింది. ఇందులో భాగంగా తిరువనంతపురం (కేరళ), గయ (బిహార్), మెదక్ (తెలంగాణ)లో కమ్యూనిటీ బేస్డ్ ఎకో టూరిజం నేచర్ క్యాంపులకు శ్రీకారం చుట్టింది. కనీసం 20 మంది.. సొంత వాహనాల్లో వస్తేనే.. పర్యాటకులకు ప్రత్యక్షంగా ప్రకృతిని, వైల్డ్ లైఫ్‌ను అనుభవంలోకి తీసుకొచ్చేందుకు ఈ ప్రోగ్రామ్‌ను రూపొందించాం. ప్రజలకు అడవులు, పర్యావరణ పరిరక్షణ ఆవశ్యకతను తెలియజేసేందుకు ఈ క్యాంప్‌లకు ప్రాధాన్యతనిచ్చాం. నేచర్ క్యాంప్‌ల ద్వారా వివిధ అంశాలపై అవగాహన కల్పిస్తున్నాం. కనీసం 20 మందితో కూడిన పర్యాటక బృందం ఈ క్యాంప్‌కు రావాల్సి ఉంటుంది. సొంత వాహనాల్లోనే వారు మొత్తం టూర్లో పాల్గొనాల్సి ఉంటుంది. పిల్లలకు (పదేళ్లు పైబడిన వారే) రూ. 1,500, పెద్దలకు రూ. 2 వేలు చొప్పున చార్జీగా ఖరారు చేశాం. ఆహారం, ఎంట్రీ ఫీజు, సఫారీ తదితరాలన్నీ ఈ ప్యాకేజీలో ఉంటాయి. – జి. సాయిలు, రీజినల్ డైరెక్టర్, ఫారెస్ట్–ప్లస్ 2.0 చదవండి: తెలంగాణ పంచాయతీలకు అవార్డుల పంట -
కొత్త కొత్తగా.. టైగర్ సఫారీ
సాక్షి, హైదరాబాద్: నూతన సంవత్సరంలో కొత్త హంగులు, ఆకర్షణలతో ప్రజలకు మరోసారి ‘వైల్డ్ లైఫ్ టూరిజం’.. అందులో భాగంగా ‘టైగర్ సఫారీ’ అందుబాటులోకి రానున్నాయి. రాష్ట్రంలో అమ్రాబాద్ టైగర్ రిజర్వ్ (ఏటీఆర్) పచ్చటి అడవితో పాటు జీవవైవిధ్యానికి ప్రతీకగా పెద్ద పులుల ఆవాసం, విభిన్నరకాల పువ్వులు, ఔషధమొక్కలు, వాగులు, వంకలకు కేంద్రమై ఉంది. పెద్దపులుల అభయారణ్యంగా పేరుగాంచిన ఏటీఆర్ పరిధిలో ఈ నెల 20వ తేదీన టైగర్ సఫారీని అటవీ, పర్యావరణశాఖ మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి లాంఛనంగా ప్రారంభించనున్నారు. పర్యాటకులకు ఎప్పుడు అందుబాటులోకి తీసుకువస్తారనేది త్వరలోనే వెల్లడిస్తారు. 2021 నవంబర్‌లో ఏటీఆర్‌లోని ఫరాహాబాద్‌లో తొలిసారిగా దీనిని అందుబాటులోకి తీసుకువచ్చారు. ఈ టైగర్ సఫారీని ఏడాదికొకసారి నిర్వహించాలని నిర్ణయించారు. అయితే అప్పట్లో కోవిడ్ రెండో దశ ఉధృతమవడంతో 2022లో ఈ సఫారీ నిర్వహణ వాయిదా పడింది. ఆ తర్వాత మళ్లీ ఇప్పుడు ప్రారంభించాలని అటవీశాఖ నిర్ణయించింది. ఏమిటీ ‘వైల్డ్ లైఫ్ టూరిజం’ ? వైల్డ్‌లైఫ్ టూరిజంలో టైగర్ సఫారీ, ట్రెక్కింగ్, ఫారెస్ట్ స్టడీటూర్, ఆదివాసీ, గిరిపుత్రులను కలుసుకుని వారి జీవనశైలి, అనుభవాలు తెలుసుకోవడం వంటి వాటితో పాటు మరిన్ని ఆకర్షణలను జతచేస్తున్నారు. దాదాపు 24 గంటల పాటు అడవిలో ప్రకృతి రమణీయత, వన్యప్రాణుల మధ్య సేదదీరేలా ఏర్పాట్లు చేస్తున్నారు. రాత్రి పూట అడవిలోనే కాటేజీలు, మట్టి ఇళ్లలో బసతో కొత్త అనుభూతిని కలిగించే అవకాశం కల్పిస్తారు. మధ్యాహ్నం నుంచి మొదలయ్యే ఈ యాత్రలో ముందుగా అడవులు, జంతువుల పరిరక్షణ, పచ్చదనం కాపాడేందుకు అటవీశాఖ నిర్వహిస్తున్న కార్యక్రమాలను లఘుచిత్రాల ద్వారా తెలియజేస్తారు. అడవిలోనే ఏర్పాటు చేసిన ప్లాస్టిక్, ఇతర వ్యర్థాల రీసైక్లింగ్ సెంటర్‌ను, వన్యప్రాణులకు సంబంధించిన ల్యాబ్‌లకు తీసుకెళ్తారు. అనంతరం అడవిలో ట్రెక్కింగ్‌కు తీసుకెళతారు. సాయంత్రానికి క్యాంప్‌నకు తిరిగొచ్చాక రాత్రి కాటేజీల్లో బస ఉంటుంది. మరుసటిరోజు పొద్దునే సందర్శకులను టైగర్ సఫారీకి తీసుకెళ్ళడంతో టూర్ ముగుస్తుంది. ఈ టూర్లకు స్థానికంగా ఉండే చెంచులు, ఆదివాసీలే టూరిస్ట్ గైడ్లుగా వ్యవహరించనున్నారు. ►గతంలో 2 పాత వాహనాలను టైగర్ సఫారీకి ఉపయోగించారు. ఇప్పుడు 8 కొత్త వాహనాలను అందుబాటులోకి తెస్తున్నారు. గతంలో 12 మందికి వసతి అవకాశం కల్పించగా ఇప్పుడు 24 మందికి వసతి ఏర్పాట్లు ఇస్తున్నారు. ►అతిథుల కోసం ఆధునిక వసతులు, సౌకర్యాలతో కొత్తగా 6 మట్టి కాటేజీలు నిర్మించారు. కొత్తగా ఏవి అందుబాటులోకి వచ్చాయంటే ? ►‘ట్రీహౌజ్’–చెట్టుపై నిర్మించిన ఇళ్లు కొత్తగా అందుబాటులోకి.. ‘ట్రీహౌజ్’ నుంచి రాత్రిపూట సమీపంలో పర్క్యులేషన్ ట్యాంక్‌లో నీటిని తాగడానికి వచ్చే వన్యప్రాణుల వీక్షణ ►అందుకోసం నైట్‌విజన్ బైనాక్యులర్స్ ఏర్పాటు ►కొత్తగా ఎయిరోకాన్ హౌజ్ తదితరాల ఏర్పాటు ►గతంలో పైనుంచి ఒకరూట్లోనే సఫారీ నిర్వహించారు. ఇప్పుడు కిందనున్న చెరువు దాకా (ఉమామహేశ్వరం గుడి) వెళ్లాలని అనుకునే వారికి అదనపు చార్జీలతో మరో కొత్తరూట్ ఏర్పాటు ►ఈ ప్యాకేజీ టూర్లను అటవీశాఖ రూపొందించిన ఓ వెబ్సైట్ ద్వారా బుక్ చేసుకునే వీలు కల్పిస్తారు. ►2023 జనవరి 4వ వారం నుంచి జూన్ 30 వరకు (ప్రతీరోజు 24 మంది చొప్పున) ఈ ప్యాకేజీని ఉపయోగించుకునే వీలుంది. ►ఒక్కరికి, ఇద్దరికి లేదా ఒక గ్రూపునకు సంబంధించి టికెట్ ధరలు ఎంత ఉంటాయనే దానిపై ఇంకా అటవీశాఖ నుంచి అధికారిక ప్రకటన వెలువడలేదు. గతంలో వైల్డ్‌లైఫ్ టూరిజం/ సఫారీ ప్యాకేజీలో భాగంగా ఇద్దరికి రూ.4,600, ఆరుగురికి రూ.9,600గా ధరలు నిర్ణయించారు. ఈసారి ఇంకా కొంగొత్తగా.. గతేడాదితో పోల్చితే ఈ ఏడాది అటవీ, జంతుప్రేమికులకు మరింత ఆహ్లాదం పంచే విధంగా చర్యలు చేపట్టాం. ఏటీఆర్‌లో కెమెరా ట్రాప్‌లకు చిక్కిన పులుల ఫొటోలతో రూపొందించిన ‘టైగర్ బుక్ ఆఫ్ ఏటీఆర్’ పుస్తక ఆవిష్కరణ, ‘ఫ్రెండ్స్ ఆఫ్ ఏటీఆర్’ పేరిట పర్యావరణ పరిరక్షణకు కృషిచేస్తున్న చెంచుగైడ్స్కు బహుమతులు వంటి కార్యక్రమాలు చేపడుతున్నాం. గతేడాది టైగర్ సఫారీని మొదలుపెట్టినపుడు 8 సందర్భాల్లో సందర్శకులకు పులులు కనిపించాయి. ఇప్పుడు పులుల సంఖ్య గణనీయంగా పెరిగినందున సైటింగ్స్ మరింత పెరగవచ్చు. –ఐఎఫ్ఎస్ అధికారి రోహిత్ గొప్పిడి, అమ్రాబాద్ డీఎఫ్ఓ -
వన్యప్రాణులకు అభయం.. మొదటి ఫ్లైఓవర్ ఎక్కడో తెలుసా?
పర్యావరణ పరిరక్షణ. ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా వినిపిస్తున్న మంత్రమిదే. వన్యప్రాణుల సంఖ్య తగ్గిపోతూ ఉండడంతో జీవ వైవిధ్యాన్ని కోల్పోతున్నాం. అభివృద్ధి కార్యకలాపాల్లో ముందడుగు వేస్తూనే వన్యప్రాణుల్ని కాపాడడం కోసం అటవీ ప్రాంతాల నుంచి వెళ్లే ఎక్స్‌ప్రెస్‌వేలను ఎకో వంతెనలతో తీర్చిదిద్దుతున్నారు. ఆ వంతెనల కథాకమామిషు చూద్దాం.. మహారాష్ట్రలో నాగపూర్, ముంబై మధ్య ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆదివారం ప్రారంభించిన బాలాసాహెబ్ ఠాక్రే సమృద్ధి మహా మార్గ్ (ఎక్స్‌ప్రెస్‌వే) మొదటి దశ ఎన్నో ప్రత్యేకతలతో నిండి ఉంది. మన దేశంలో నిర్మించిన పూర్తి స్థాయి తొలి ఎకో వంతెన ఇది. రోడ్లపై వెళ్లే వాహనాలకు అడ్డంగా వచ్చే వన్యప్రాణులకి ఎలాంటి హాని కలగకుండా ఈ ఎక్స్‌ప్రెస్ వే మార్గం పచ్చగా, పర్యావరణ పరిరక్షణ కోసం పాటుపడేలా నిర్మించారు. దారిన పోయే జంతువులు, వన్యప్రాణులు నిర్భయంగా సంచరించడానికి తొమ్మిది గ్రీన్ వంతెనలు (ప్లై ఓవర్ తరహా నిర్మాణాలు), మరో 17 అండర్ పాపెస్ నిర్మించారు. మొత్తం 701 కి.మీ. పొడవైన ఈ ఎక్స్‌ప్రెస్ తొలిదశలో 520 కి.మీ. పూర్తి చేసుకుంది. ఈ వంతెనతో ప్రయాణికులు వన్యమృగాల భయం లేకుండా ప్రజలు సురక్షితంగా ప్రయాణించవచ్చు. మరో వైపు అవి తిరగడానికి కూడా ఎలాంటి ఇబ్బంది ఉండదు. ఇక ఈ ఎక్స్‌ప్రెస్ వే పొడవున సంచరించే చిరుత పులులు రహదారులపైకి రాకుండా ఫెన్సింగ్ నిర్మిస్తారు. మహారాష్ట్రలో 10 జిల్లాల మీదుగా సాగే ఈ వంతెన నిర్మాణం రెండో దశ కూడా పూర్తయితే నాగపూర్, ముంబైల మధ్య 16 గంటలు పట్టే ప్రయాణ సమయం 8 గంటలు పడుతుంది. ఏమిటీ వన్యప్రాణుల వంతెనలు? ఒక ప్రాంతం నుంచి మరో ప్రాంతానికి వన్యప్రాణుల రాకపోకలు సాగించడమే లక్ష్యంగా నిర్మించే వంతెనల్ని ఎకో వంతెనలు, వన్యప్రాణుల వంతెనలు అని పిలుస్తారు. అటవీ ప్రాంతాల్లో నిర్మించే హైవేలపై వాహనాలకు అడ్డంగా పడి జంతువులు ప్రాణాలు పోకుండా ఉండడం కోసం కూడా ఈ వంతెనల్ని నిర్మిస్తున్నారు. టైగర్ రిజర్వ్ ప్రాంతాల్లో వివిధ దేశాల్లో ఎకో వంతెనల నిర్మాణం సాగుతోంది. ఎకో వంతెనలు ఎన్ని రకాలు ? ఈ ఎకో వంతెనలు మూడు రకాలున్నాయి. చిన్న చిన్న పాలిచ్చే జంతువుల్ని కాపాడడం కోసం ఉద్దేశించిన కల్వర్టులు. వీటికే ఆంఫిబియాన్ వంతెనలని పిలుస్తారు. ఇక రెండో రకం కానోపి బ్రిడ్జెస్. కోతులు, ఉడతలు వంటి చెట్లపై నివసించే వాటిని రక్షించడానికి సులభంగా రాకపోకలు సాగించడానికి చెక్కలతో ఈ వంతెనల్ని నిర్మిస్తారు. ఇక కాంక్రీట్‌తో నిర్మించే అండర్‌పాసెస్, ఓవర్ పాస్ టన్నెల్స్. పులులు, ఏనుగులు వంటి పెద్ద పెద్ద జంతువులు ఒక ప్రాంతం నుంచి మరో ప్రాంతానికి సంచరించడం కోసం వీటిని నిర్మిస్తారు. ఈ ఎకో వంతెనల నిర్మాణం సాగించడానికి ముందు ఆయా దేశాలకు చెందిన పర్యావరణ పరిరక్షకులు వాటిని నిర్మించే ప్రాంతం, సైజుని అధ్యయనం చేస్తారు. ప్రభుత్వం పర్యావరణ అనుమతులు ఇచ్చిన తర్వాతే వీటి నిర్మాణం సాగుతుంది. మొదటి వంతెన ఎక్కడ ? ఫ్రాన్స్‌లో 1950 సంవత్సరంలో ఈ ఎకో వంతెనల నిర్మాణం మొదలైంది. ఆ తర్వాత స్కాట్‌ల్యాండ్, బ్రిటన్ వంటి దేశాలు వీటి నిర్మాణంపై మక్కువ చూపించాయి. మొత్తమ్మీద యూరప్ దేశాల్లో ఈ ఎకో బ్రిడ్జీల నిర్మాణం ఎక్కువగా జరుగుతోంది. వాహనాల కింద పడి ప్రమాదవశాత్తూ జంతువులు మరణిస్తూ ఉండడంతో మన దేశంలో ఉత్తరాఖండ్‌లోని కలాధుంగి–నైనిటాల్ హైవే మధ్య రామ్‌నగర్ ఫారెస్ట్ డివిజన్లో చెట్లపై తిరుగాడే జంతువుల కోసం 90 అడుగుల పొడవైన వంతెన నిర్మించారు. – సాక్షి, నేషనల్ డెస్క్ -
నంద్యాల డివిజన్ అటవీ శాఖ స్థాయి పెంపు
కొత్త జిల్లాలవారీగా అటవీ శాఖను ప్రభుత్వం పునర్వ్యవస్థీకరించింది. నంద్యాల జిల్లా పరిధిలోకి వచ్చే నల్లమల అటవీ ప్రాంతాన్ని పూర్తిగా తమ ఆధీనంలోకి తీసుకునేందుకు జిల్లా అటవీ శాఖ ప్రత్యేక దృష్టి సారించింది. నంద్యాల జిల్లా అటవీ శాఖ పరిధిలో 1.90 లక్షల హెక్టార్ల అటవీ ప్రాంతం ఉంది. కర్నూలు, ప్రకాశం, వైఎస్సార్, మహబూబ్‌నగర్ జిల్లాల సరిహద్దులతో వెలసిన నల్లమలో పెద్ద పులులు, చిరుతలు, ఎలుగుబంట్లు, జింకలు, అడవి పందులు, దుప్పులు, కర్తెలు, అడవి కుక్కలు, ఇతర వన్యప్రాణులు సంచరిస్తుంటాయి. వాటిని అనుక్షణం కాపాడేందుకు అటవీ ప్రాంతం చుట్టూ పటిష్టమైన రక్షణ వ్యవస్థను ఏర్పాటు చేస్తున్నారు. ఆళ్లగడ్డ: బ్రిటీష్ కాలం నుంచి కర్నూలు జిల్లా పరిధిలో కర్నూలు, ఆత్మకూరు, నంద్యాల అటవీ డివిజన్లుగా ఉండేవి. జిల్లాల పునర్వ్యవస్థీకరణ నేపథ్యంలో నంద్యాల జిల్లా అటవీ శాఖగా ప్రభుత్వం గుర్తించింది. ఇంతవరకు ఉన్న నంద్యాల డివిజన్ కార్యాలయాన్ని జిల్లా అటవీ కార్యాలయంగా మార్చారు. కర్నూలు డివిజన్ పరిధిలోని డోన్ అటవీ రేంజ్‌ను నంద్యాల జిల్లా పరిధిలో కలిపారు. కొత్తగా రెండు రేంజ్‌లు ఇప్పటి వరకు నంద్యాల పరిధిలో రుద్రవరం, చలిమ, నంద్యాల, బండిఆత్మకూరు, ఆత్మకూరు రేంజ్‌లు ఉండగా కర్నూలు డివిజన్ నుంచి డోన్ రేంజ్‌ను నంద్యాల జిల్లాలో చేర్చడంతో మొత్తం ఆరు రేంజ్‌లు అయ్యాయి. పరిపాలన సౌలభ్యం కోసం పాణ్యం, బనగానపల్లె సెక్షన్లను అటవీ రేంజ్‌లుగా స్థాయి పెంచారు. దీంతో ఇప్పుడు జిల్లా పరిధిలో రేంజ్‌ల సంఖ్య 8 పెరిగింది. ఒకే పరిపాలన కిందకు టెరిటోరియల్, లాగింగ్ గతంలో టెరిటోరియల్ ఫారెస్ట్, సోషల్ ఫారెస్ట్ డివిజన్లు విడివిడిగా ఉండేవి. కొత్త డివిజన్లు చిన్నవి కావడంతో ఈ రెండింటిని కలిపి ఒకటిగా చేశారు. దీంతో రుద్రవరం, గాజులపల్లె, పచ్చర్ల లాగింగ్ డివిజన్లు రద్దయ్యాయి. డివిజన్ల పరిధి, కలప తగ్గడంతో వీటిని మూసివేశారు. తెలుగు గంగ ప్రాజెక్ట్ నిర్మాణ పనులు ప్రారంభమైనప్పటి నుంచి దానికి పరిహారంగా అడవిని పెంచడానికి ఏర్పాటైన టీజీపీ డివిజన్‌ను కూడా రద్దు చేశారు. వైల్డ్‌లైఫ్ విభాగాలు ప్రత్యేకం వన్యప్రాణి విభాగం (వైల్డ్ లైఫ్) డివిజన్లను గతంలో మాదిరిగా ప్రత్యేకంగా ఉంచారు. నాగార్జున సాగర్ – శ్రీశైలం టైగర్ రిజర్వ్డ్ పరిధిలోని కర్నూలు, ఆత్మకూరు, గిద్దలూరు, డివిజన్లను అలాగే ఉంచారు. వీటికి టెరిటోరియల్, వైల్డ్ లైఫ్ పరిధి రెండూ ఉంటాయి. నల్లమలలో 73 పెద్ద పులులు దేశంలోనే అతిపెద్ద అభయారణ్యమైన నల్లమల టైగర్ రిజర్వ్ ఫారెస్టులో 73 పెద్ద పులులు ఉన్నట్లు పులుల గణనలో తేలింది. 2018లో 47, 2020లో 63 ఉన్న పులుల సంఖ్య ప్రస్తుతానికి 73కు పెరగడానికి అటవీ శాఖ అధికారులు తీసుకున్న ప్రత్యేక చర్యలే కారణం. ఎక్కడికక్కడ చెక్‌పోస్టులు, బేస్ క్యాంపులు ఏర్పాటు చేయడంతో గడ్డి పొదలు ఏర్పడి దుప్పులు, జింకలు పెరిగాయి. దీంతో పులులకు సమృద్ధిగా ఆహారం లభిస్తుండటంతో పులుల సంఖ్య పెరిగింది. ప్రస్తుతం నల్లమల అటవీ 300 చిరుతలు, 400 ఎలుగుబంట్లు, వేల సంఖ్యలో జింకలు, దుప్పులు సంచరిస్తున్నట్లు అటవీ శాఖ గుర్తించింది. పెరిగిన సిబ్బంది నంద్యాల జిల్లా అటవీ శాఖ పరిధిలో సిబ్బంది సంఖ్య పెరిగింది. జిల్లా పరిధిలో కొత్తగా 9 సెక్షన్లు ఏర్పాటు చేయడంతో ఇప్పుడు సెక్షన్ల సంఖ్య 25 పెరిగింది. 45 బేస్ క్యాంపులు ఉన్నాయి. 25 మంది సెక్షన్ అధికారులతో పాటు ఒక్కో బేస్ క్యాంపులో ఐదుగురు చొప్పున మొత్తం 225 మంది సిబ్బంది ఉన్నారు. పులులు, వన్యప్రాణుల సంఖ్య పెరగడంతో మరో 100 మందిని నియమించనున్నారు. పులుల సంరక్షణపై ప్రత్యేక దృష్టి ఒకవైపు వన్యప్రాణులను, మరో వైపు విలువైన అటవీ సంపదను వేటగాళ్ల బారినుంచి కాపాడేందుకు పటిష్టమైన రక్షణ వ్యవస్థను ఏర్పాటు చేయనుంది. పెద్ద పులులు, చిరుతల సంరక్షణకు సుశిక్షితులైన సిబ్బందిని తయారు చేసేదుకు ప్రత్యేక చర్యలు తీసుకుంటోంది. ఇందు కోసం సబ్ డీఎఫ్ఓ, రేంజర్, డీఆర్వో, బీట్ అఫీసర్ తదితర స్థాయిలో ఉన్న సుమారు 50 మంది అధికారులకు, సిబ్బందికి షార్ట్ వెపన్లు అయిన ఫిస్టల్, రివాల్వర్లు అందించనున్నారు. త్వరలో వీరికి తిరుపతి పోలీస్ ట్రైనింగ్ కేంద్రంలో గన్ షూటింగ్‌పై శిక్షణ ఇచ్చేందుకు ఏర్పాటు చేస్తున్నారు. పూర్తి స్థాయిలో శిక్షణ పొందిన వీరిని పెద్దపులు, చిరుతలు సంచరించే బేస్‌క్యాంపుల్లో నియమించనున్నారు. పర్యవేక్షణ సులభం జిల్లా కేంద్రంలో నూతనంగా జిల్లా అటవీ శాఖ కార్యాలయం ఏర్పాటు కావడంతో పర్యవేక్షణ సులభంగా ఉంటుంది. వన్యప్రాణుల సంరక్షణ, అటవీ భూముల అన్యాక్రాంతం కాకుండా పర్యవేక్షణ పెరుగుతుంది. జిల్లా ప్రజలకు అందుబాటులో ఉంటూ సేవలు అందిస్తాం. – వినీత్‌కుమార్, జిల్లా అటవీ అధికారి అడవులతోనే సమృద్ధిగా వర్షాలు అడవులు విస్తారంగా పెరిగితేనే వర్షాలు సమృద్ధిగా కురుస్తాయి. ప్రభుత్వం అడవుల సంరక్షణ కోసం ప్రత్యేక చర్యలు తీసుకోవడంతో మూడేళ్లుగా అడవులు విస్తారంగా పెరిగాయి. అందులో వన్యప్రాణుల సంఖ్య బాగా పెరిగింది. దీంతో వర్షాలు సమృద్ధిగా కురుస్తున్నాయి. – విశ్వనాథరెడ్డి, ఓబులంపల్లె అటవీ సంరక్షణ అందరి బాధ్యత అడవుల సంరక్షణతో వాతావరణ సమతుల్యత సాధ్యమవుతుంది. అన్నిరకాల వృక్షాలు, వన్యప్రాణులు ఉంటేనే అడవులు అంతరించి పోకుండా ఉంటాయి. అడవులు అంతరించిపోకుండా ఉంటేనే పర్యావరణ సాధ్యమవుతుంది. అడవులను సంరక్షించాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉంది. – బోరు రమణ, చాగలమర్రి -
‘వైల్డ్ లైఫ్ టూరిజం’కి న్యూ లుక్!
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో కొంగొత్త హంగులతో ‘వైల్డ్ లైఫ్ టూరిజం’సిద్ధమవుతోంది. తెలంగాణలో పెద్దపులుల అభయారణ్యంగా పేరుగాంచిన అమ్రాబాద్ టైగర్ రిజర్వ్ (ఏటీఆర్)లో వచ్చేనెల రెండోవారంలో మొదలు కానుంది. ఏటీఆర్‌లోని ఫరాహాబాద్‌లో టైగర్ సఫారీని ఏడాదికొకసారి నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. ఈ మేరకు ‘వైల్డ్‌లైఫ్ టూరిజం ప్యాకేజీ టూర్’లను అందుబాటులోకి తెచ్చి గతేడాది నవంబర్ 14న ప్రయోగాత్మకంగా ప్రారంభించారు. ఈ ప్యాకేజీ టూర్లను అటవీశాఖ రూపొందించిన ఓ వెబ్సైట్ ద్వారా బుక్ చేసుకునే వీలుకల్పించారు. గతేడాది ప్రారంభించిన ఈ టైగర్ సఫారీని ఈసారి మరిన్ని సౌకర్యాలతో మరింత ఆహ్లాదాన్ని పంచేలా జంతుప్రేమికులను అలరించేలా అటవీశాఖ చర్యలు చేపట్టింది. రాత్రి అడవిలో ప్రకృతి ఒడిలో సేదతీరేలా...: టైగర్ సఫారీ, ట్రెక్కింగ్, ఫారెస్ట్ స్టడీటూర్, ఆదివాసీలను కలు సుకుని వారి జీవనశైలిని తెలుసుకోవడం వంటి వాటితో పాటు మరిన్ని అదనపు ఆకర్షణలను జతచేస్తున్నారు. దా దాపు 24 గంటల పాటు అడవిలో ప్రకృతి రమణీయత, వన్యప్రాణుల మధ్య సేదతీ రేలా దీనిని రూపొందించారు. ఇందులో భాగంగా రాత్రి పూట అడవిలోనే కాటేజీలు, మట్టిఇళ్లలో బసతో కొత్త అనుభూతిని సొంతం చేసుకునే అవకాశం కల్పిస్తారు. మధ్యాహ్నం నుంచి ప్రారంభమ య్యే ఈ యాత్రలో ముందుగా అడవులు, జంతువుల పరి రక్షణ, పచ్చదనం కాపాడేందు కు అటవీశాఖ నిర్వహిస్తు న్న కార్యక్రమాలను లఘుచిత్రాల ద్వారా తెలియజేస్తారు. అడవిలోనే ఏర్పాటు చేసిన ప్లాస్టిక్, ఇతర వ్యర్థాల రీసైక్లింగ్ సెంటర్‌ను, వన్యప్రాణులకు సంబంధించిన ల్యాబ్‌లను చూపిస్తారు. అనంతరం అడవిలో ట్రెక్కింగ్‌కు తీసుకెళతారు. సాయంత్రానికి క్యాంప్‌కు తిరిగొచ్చాక రాత్రి కాటేజీల్లో బస ఉంటుంది. మరుసటిరోజు పొద్దునే సందర్శకులను టైగర్ సఫారీకి తీసుకెళ్లడంతో టూర్ ముగుస్తుంది. ఈ టూర్లకు స్థానికంగా ఉండే చెంచులు, ఆదివాసీలే టూరిస్ట్‌గైడ్‌లుగా వ్యవహరించనున్నారు. ఈసారి అంతా కొత్త కొత్తగా.. గత ఏడాదితో పోల్చితే కొత్త కాటేజీలు సిద్ధం చేయడంతో పాటు, టైగర్ సఫారీకి అనువైన 8 కొత్త వాహనాలను కొంటున్నాం. అట వీ, జంతుప్రేమికులకు ఆహ్లాదం పంచడంతోపాటు, ఇక్కడ గడిపే సమయం మధురానుభూతులను నింపేందుకు దోహ దపడే చర్యలు చేపడుతున్నాం. నూతనంగా అందుబాటులోకి తెస్తున్న కాటేజీలతో పాటు మట్టి ఇళ్లు, ఒక ట్రీ హౌస్, ఎయిరోకాన్ హౌస్ కొత్తగా ఏర్పాటు చేస్తున్నాం. గతేడాది టైగర్ సఫారీని మొదలుపెట్టినపుడు 8 సందర్భాల్లో సందర్శకులకు పులులు కనిపించాయి. ఈ ఏడాది సఫారీ ఏరియాలో కాకుండా అమ్రాబాద్ టైగర్ రిజర్వ్ పరిధిలో తరచుగా పులులు తారసపడుతుండటాన్ని బట్టి సంఖ్య పెరిగినట్టుగా అంచనా వేస్తున్నాం. చెంచుల జీవనోపాధి మెరుగుపరిచేందుకు పుట్టగొడుగులు, తేనేటీగల పెంపకంలో శిక్షణనిస్తున్నాం. – ఐఎఫ్ఎస్ అధికారి రోహిత్ గొప్పిడి, అమ్రాబాద్ డీఎఫ్ఓ -
చీకట్లో నల్ల చిరుత.. అలా బంధించే హక్కు ఎవడిచ్చాడు?
వైరల్: నల్ల చిరుత.. చాలా అరుదుగా కనిపించే ప్రాణి. అలాంటి ప్రాణి వేటాడే దృశ్యాలు ఇంకా అరుదుగా కనిపించే దృశ్యమనే చెప్పాలి. అయితే అలాంటి అరుదైన సందర్భాన్ని బంధించే క్రమంలో.. ఓ వీడియోగ్రాఫర్ వ్యవహరించిన తీరుపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఓ నల్ల చిరుత.. ఓ జింకను వేటాడి దాని కళేబరాన్ని నోట కరుచుకుని వెళ్లబోతోంది. అయితే ఆ సమయంలో ఓ వీడియోగ్రాఫర్ దాన్ని చిత్రీకరించే యత్నం చేశాడు. అక్కడిదాకా బాగానే ఉన్నా.. ఫోకస్ లైట్ వేసి మరీ వాహనం శబ్దం చేయడంతో అది ఉలిక్కిపడి అక్కడి నుంచి పరుగులు తీసింది. ఇంతలో.. అక్కడే ఉన్న సాధారణ చిరుత ఆ కళేబరాన్ని నోట కరుచుకుని అక్కడి నుంచి పరారైంది. పర్ఫెక్ట్ క్యాప్చర్ అంటూనే.. స్పాట్ లైట్ యొక్క పూర్తి కాంతిలో ప్రకృతి యొక్క ఈ అరుదైన క్షణాలను సంగ్రహించే హక్కు ఎవడిచ్చాడు అంటూ ఐఎఫ్ఎస్(ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్) అధికారి సుశాంత్ నంద ఆ వీడియోను పోస్ట్ చేశారు. A perfect capture. Both by the leopard & the videographer😞😞 But who gave the right to capture these rare moments of nature in full glare of spot light? WA fwd. pic.twitter.com/ZITOBOpO92 — Susanta Nanda (@susantananda3) October 8, 2022 ఎక్కడ, ఎప్పుడు జరిగిదో తెలియదు. ఎవరి ఆ క్షణాల్ని బంధించారో తెలియదు. కానీ, ఆ వీడియోగ్రాఫర్ చేష్టలపై సర్వత్రా ఇప్పుడు విమర్శలు వినిపిస్తున్నాయి. -
వెంటాడే దృశ్యం
హేమంతం! చుట్టూరా ఎత్తైన కొండలు.. మధ్యలో పచ్చటి లోయ.. ఆకు పచ్చటి కొండల మీద తెల్లటి మంచు దుప్పటి కప్పినట్లు ఆలోయ కనిపిస్తోంది.. నేను తెల్లవారి బయలుదేరి ఆ లోయకి చేరుకున్నాను. నాతోపాటు నా స్నేహితుడు జగదీష్ కూడా వచ్చాడు.ఇలా ఈ లోయకి రావడానికి కారణం.. వారం రోజుల క్రితం నేను ఏనిమల్ ప్లానెట్ చానెల్లో చూసిన ఓ గగుర్పాటు కలిగించిన దృశ్యం. అది ఇంకా నన్ను వెంటాడుతోంది.‘ఒక లోయలో ఓ గద్ద ఆకాశంలోంచి వాయువేగంతో ఎగురుతూ వచ్చి మేకపిల్లను ఎత్తుకు పోయే దశ్యం’ అది. ఆ దృశ్యం చూసి స్థాణువయ్యాను... నమ్మలేకపోయాను. గద్దలు సాధారణంగా కోడిపిల్లలను, పాముల్ని నోటకరచుకొని పోవడం నేను చూశాను. కానీ దానికన్నా ఆకారంలో, బరువులో పెద్దదైన ఓ మేక పిల్లను గద్ద కాళ్ళతో ఎత్తుకుపోవడం నాకు ఆశ్చర్యాన్ని కలిగించింది. అప్పట్నుంచీ నాలో ఆందోళన మొదలైంది. ఆ దృశ్యాన్ని కెమెరాలో బంధించిన ఫొటోగ్రాఫర్‌ను మెచ్చుకోకుండా ఉండలేకపోయాను. ఆ మర్నాడు గ్రంథాలయానికి వెళ్ళి ఆ ఫొటోని తీసిన ఫొటోగ్రాఫర్ గురించి పేపర్లలో చదివాను. ఆ ఫొటోని ఏనిమల్ ప్లానెట్ చానెల్ కోసం ప్రపంచంలోని అతి గొప్ప ఫొటోగ్రాఫర్ స్టీవ్ మెకర్రీ తన డిజిటల్ కెమెరాతో తీశాడు. అందుకోసం అతను లోయలోకి వెళ్ళి చాలా పెద్ద సాహసమే చేశాడు. ఆ ఫొటోని చూసిన తరువాత నాక్కూడా అటువంటి ఫొటోని నా కెమెరాలో బంధించాలన్న కోరిక కలిగింది. అందుకే ఈరోజు ఈ లోయకి వచ్చాం. దేశంలోని అతి గొప్ప కెమేరా అయిన నికోన్ డిజిటల్‌ని నాతో తెచ్చాను. ఈ లోయకే ప్రత్యేకంగా రావడానికి ఓ ముఖ్యకారణం ఉంది. నా స్నేహితుడు జగదీష్ తండ్రి ప్రముఖ ఫొటోగ్రాఫర్... నేను చెప్పిన ఫొటో గురించి వినీ అతను ఒక ఆశ్చర్యకరమైన విషయాన్ని చెప్పాడు. ‘గద్ద మేకపిల్లని ఎత్తుకుపోతున్న దృశ్యాన్ని మెకర్రీ మనదేశంలో అందునా మన రాష్ట్రంలోని తూర్పు కనుమల్లో గాలికొండ లోయలో తీశాడనీ చెప్పడంతో ఆ లోయని చూడటానికి ఈ రోజు వచ్చాం. సూర్యుడు తూర్పు దిక్కు నుదుటన సిందూర తిలకంలా మెరిసిపోతున్నాడు. రాను రాను నీహారికా బిందుసమూహాలు కరిగి లోయంతా హరిత వర్ణంగా పరావర్తనం చెందుతున్న దృశ్యం మనోహరంగా కనిపిస్తోంది. నేను, జగదీశ్ ఇద్దరం లోయలోకి దిగాం. చుట్టూ ఎల్తైన సిల్వర్ ఓక్ వృక్షాలు, వాటి మీద పక్షుల కిలకిలారావాలు సంగీతాన్ని ఆలపిస్తున్నాయి. ఎక్కడి నుంచో కోకిల కలకూజితం లోయలో ప్రతిధ్వనిస్తోంది. సూర్యుడు వెలుగు రేఖలు లోయలో పరుచుకుంటున్నాయి. ఆ సమయంలో నేనూ జగదీశ్ లోయలోకి దిగి ఓ చెట్టు కింద నిలబడ్డాం. ఇప్పుడా లోయని చూస్తుంటే ఆ రోజు నేను చూసిన ఫొటో గుర్తుకు వచ్చింది. ఆకాశం నీలంగా స్వచ్ఛగా ఉంది. లోయలో తెల్లటి కొంగలు ఎగురుతూ మల్లెదండని గుర్తుకు తెస్తున్నాయి. ఇప్పుడు నా చూపులన్నీ ఆకాశం వైపు గద్దల కోసం ఆశగా చూస్తున్నాయి. జగదీశ్ కెమెరాని బయిటకు తీసి నాకు అందించాడు. ‘వంశీ! మొన్న నువ్వు చూపించిన గద్ద మేక పిల్లని ఎత్తుకుపోతున్న ఫొటో లాంటి వాటిని మన వాళ్ళు తీయ్యలేరా?’ అని అడిగాడు. ‘ఎందుకు తియ్యలేరు? మనదేశంలో కూడా అద్భుతమైన ఫొటోగ్రాఫర్లున్నారు! ఉదాహరణకు సుధీర్ శివరాం, రఘునా«థ్ చౌదరి లాంటి గొప్ప ఫొటోగ్రాఫర్లున్నారు! వాళ్ళు ఎన్నో అద్భుతమైన ఫొటోలు తీసి ఎన్నో అంతర్జాతీయి బహుమతులు గెల్చుకున్నారు’ అని చెప్పాను. అప్పటికి సమయం 7 గంటలైంది. చలి కాస్త తగ్గుముఖం పట్టింది. జగదీశ్ ఫ్లాస్క్‌లో తెచ్చుకున్న టీని నాకిచ్చాడు. అది తాగిన తరువాత శరీరం కాస్త వేడెక్కి ఉత్సాహం వచ్చింది. సమయం గడిచిపోతున్నా ఆకాశంలో గద్దలు కనిపించటం లేదు. ఫొటోగ్రఫీలో ఈ సమస్యలు తప్పవు. మంచి ఫొటో కోసం నిరీక్షించక తప్పదు. ఒక మంచి అద్భుతమైన ఫొటో కోసం ఎంతో నిరీక్షణ అవసరం. రెండు గంటలు గడిచాయి. ఎండ తీక్షణ ఎక్కువైంది. నేను మాత్రం నిరాశ చెందకుండా ఆకాశం వైపు చూస్తునే ఉన్నాను. సరిగ్గా తొమ్మిదిన్నర సమయానికి ఆకాశంలో ఒక అద్భుతం జరిగింది. ఒక విమానం చిన్నగా కదులుతూ వస్తోంది. నేను ఆశ్చర్యంతో దాని వైపే చూస్తున్నాను. క్రమక్రమంగా అది దగ్గర కాసాగింది. అదే విమానం అయితే లోయంతా దాని ‘ధ్వనితో ప్రతి ధ్వనించేది. కానీ ఏవిధమైనా శబ్దమూ వినిపించటం లేదు. రానురాను అది కిందకు దిగుతోంది. నాలో ఉత్కంఠ పెరిగింది. నేను జగదీశ్ వైపు తిరిగి దానివైపు చూపించాను. అతను కూడా ఉద్విగ్నతతో ఆకాశంలోకి చూడసాగాడు. కొద్ది నిమిషాల తరువాత ఆ దిగుతున్న దేమిటో నాకు స్పష్టత వచ్చింది. అది విమానం అయితే కాదు. విమానం అలా ఓ లోయలో కిందకు దిగదు. అది ఎత్తులో సమాంతరంగా ప్రయాణిస్తుంది. కచ్చితంగా అది గద్దపక్షే అయి ఉంటుందనీ నా సిక్త్‌సెన్స్ చెప్పింది. ‘జగదీశ్! ఆ కిందకు దిగుతున్నదేమిటో పోల్చుకున్నావా?’ అది గద్ద. ఆ పక్షి తప్ప అంత ఎత్తున ఏ పక్షీ ఎగురలేదు’ అని వాడికి చెప్పి కెమెరాని మెడలో నుంచి తీశాను. అది హై మేగ్నిఫైడ్ లెన్స్ జపాన్ తయారీ కెమెరా. కిలోమీటరు దాకా జూవ్ు చేసి స్పష్టమైన ఫొటో తియ్యవచ్చు. ‘వంశీ! ఎంత గద్దపక్షి అయితే మాత్రం అంత ఎత్తు నుంచి కింద లోయలో ఏ జంతువుందో చూడగలదా? అసలే దాని కళ్ళు చిన్నవి’ అన్నాడు జగదీశ్. జగదీశ్ ప్రశ్నలు నాలో అసహనాన్ని కలిగించాయి. ‘గద్ద అంటే ఏమనుకున్నావ్? దాని చూపు చాలా తీక్షణమైనది. కిలో మీటరు ఎత్తు నుంచి అది భూమి మీద చిన్న కోడిపిల్లను కూడా స్పష్టంగా చూడగలదు. అంతటి మహత్తర చూపు గల కళ్ళు దానివి. దేవుడు దాని కళ్ళకు అంతటి తీ„è ణతని వరంగా ఇచ్చాడు. అందుకే ఎక్కడ నుంచి వస్తుందో తెలియకుండా వేగంగా వచ్చి కోళ్ళను, పాముల్ని నోట కరుచుకొని వెళ్ళిపోగలదు. దాని రెక్కల్ని టెలాన్స్ అంటారు. దాని రెక్కల్లో గొప్ప శక్తి ఉంటుంది. అందువల్ల వాయు వేగంతో కిందకు దిగి వాటిని నోట కరుచుకొని మళ్ళీ ఎగిరిపోగలదు’ అంటూ వాడికి చెప్పాను. కొద్ది నిమిషాల తరువాత అది మాకు స్పష్టంగా కనిపించేటంతటి ఎత్తుకు దిగింది. ఇప్పుడది మాకు స్పష్టంగా కనిపిస్తోంది. నిశ్చయంగా అది గద్దపక్షే. అది లోయలోకి దిగుతుంటే మా ఇద్దరిలో చెప్పలేని ఉత్కంఠత. మేము లోయకి ఒక వైపున ఉండటం వల్ల లోయ పూర్తిగా కనిపించటం లేదు. రానురాను అది కిందకు దిగి పోతోంది... నేను కెమెరాని చేతిలోకి తీసుకొని ఫొటో కోసం ఎదురు చూస్తున్నాను. గద్దపక్షి లోయలోకి దిగుతోందంటే అది ఏ జంతువునో చూసి ఉంటుంది. అది జంతువో లేక కోడి పిల్లో కావచ్చు. సమయం గడుస్తోంది. లోయంతా నిశ్శబ్దంగా ఉంది. గద్దపక్షి కిందకు దిగుతూ కనిపించకుండా పోయింది. కొద్దిసేపటి దాకా ఏ జరుగుతోందో తెలియటం లేదు. ఇంతలో ఎగురుతూ వస్తున్న గద్దపక్షి కనిపించింది. నా దగ్గర ఉన్న బైనాక్యులర్‌తో ఆ దృశ్యాన్ని చూశాను. మొదట్లో అస్పష్టంగా, కొన్ని క్షణాల తరువాత స్పష్టంగా కనిపిస్తోంది అది. వాయువేగంతో ఎగురుతూ అది మావైపే వస్తోంది. దాని రెండు కాళ్ళ మధ్య గిలగిలా కొట్టుకుంటూ చిరుత పులి పిల్ల! ఆ దృశ్యాన్ని చూడగానే ఆశ్చర్యంతో పాటు అనుమానం కలిగింది నాకు! అంత పెద్ద చిరుత పిల్లను ఒక చిన్న గద్దపక్షి.. అంత ఎత్తుకి తీసికెళ్ళడమా? అది సాధ్యమా? అన్న సందేహం వచ్చింది. వెంటనే ఆ దృశ్యాన్ని కెమెరాలో బంధించాలని కెమెరా తీశాను. రానురాను ఆ గద్దపక్షి మా వైపే వస్తూ ఇప్పుడు స్పష్టంగా కనిపిస్తోంది. ఇంతలో గగుర్పాటు కలిగించే ఒక సంఘటన జరిగింది. గద్దపక్షి కాళ్ళ మధ్య కొట్టుకుంటున్న చిరుత పిల్ల తప్పించుకొని కిందకు జారిపోసాగింది. గద్దపక్షి కాళ్ళ పట్టు తప్పడం వల్ల అలా జరిగి ఉంటుంది. గాల్లో ఎగురుతున్న ఆ పక్షి లోయలోకి జారిపోతున్న చిరుతపిల్ల. ఆ దృశ్యం కనిపిస్తోంది. అంతలోనే గద్దపక్షి తేరుకుంది. ఒక్కసారిగా రెక్కలను టపటపలాడిస్తూ కిందకు దిగడం మొదలు పెట్టింది. వెంటనే నేను కెమెరాని క్లిక్ మనిపించాను. ఒకటి కాదు.. రెండు కాదు.. పదిసార్లు క్లిక్ మనిపించాను. అలా నేననుకున్న ఫొటో తీయగలిగాను. వారం రోజుల తరువాత స్టూడియో నుంచి ప్రింట్లు వచ్చాయి. కేబినెట్ సైజులో ఆ ఫొటోలు అద్భుతంగా కనిపిస్తున్నాయి. గాల్లో ఎగురుతున్న గద్దపక్షి.. దాని కింద లోయలోకి జారిపోతున్న చిరుత పిల్ల. ‘సార్! ఎక్కడ తీశారు ఈ ఫొటోల్ని. అద్భుతంగా, గగుర్పాటు కలిగించేటట్లున్నాయి’ అన్నాడు ఆ ఫొటోలను తెచ్చిన స్టూడియో కుర్రాడు. అతనికి ఏం చెప్పాలో తెలియక ఓ నవ్వు నవ్వి ఊరుకున్నాను. వారం రోజుల తరువాత ఆ ఫొటోలు అన్ని దిన, వార, పత్రికల్లోనూ వచ్చాయి. వాటికి అద్భుతమైన రెస్పాన్స్ పాఠకుల నుంచి వచ్చింది. ఆ రెస్పాన్స్ చూసి నాకు చాలా ఆనందం కలిగింది. ఈ ఫొటోతో నా చిరకాల వాంఛ తీరిందనిపించింది. అద్భుతమైన ఫొటోలను ఎక్కడ చూసినా నేనూ ఇలాంటి వాటిని తియ్యాలనీ కలలు కనేవాడిని. ఆ కల ఈ రూపంలో తీరింది. నెల రోజుల తరువాత ఢిల్లీలోని ‘బర్డ్స్ ఆఫ్ ఇండియా’ సంస్థ వారు ఒక పోటీని ప్రకటించి అద్భుతమైన నమ్మలేని ఫొటోలను పంపాలనీ కోరారు. ప్రథమ బహుమతి 10 లక్షలు. నేను ఆ పోటీకి నా ఫొటోని పంపాను. ఇంకా ఫలితాలు ప్రకటించలేదు. నెల రోజుల తరువాత ఓ అనుకోని సంఘటన జరిగింది. ఒక రోజు నేను మా వూళ్ళోనే ఉంటున్న మా అక్కను చూద్దామని బయలుదేరాను. ఈ మధ్యన అక్కకు ఒంట్లో బాగుండటం లేదు. వీధికి కొద్ది దూరంలో అక్క రెండేళ్ళ కూతురు మృదుల ఇంటి ముందర ఆడుకుంటోంది. నేను నడక వేగం పెంచాను. ఇంతలో ఆకాశంలో ఏదో అలజడి. నా దృష్టి ఆకాశంవైపు మళ్ళింది. ఆకాశంలో ఒక పెద్ద గద్దపక్షి ఒకటి వాయువేగంతో కిందకు దిగుతోంది. ఆ వేగానికి గాల్లో శబ్దం కలుగుతోంది. నేను దాన్ని గమనిస్తూ నిలబడ్డాను. కొద్ది క్షణాల తరువాత అది మా అక్క కూతురు మృదుల వైపు దిగడం కనిపించింది. నాకు వెంటనే నేను తీసిన ఫొటో ఆ ఘటన గుర్తుకు వచ్చింది. ఆ లోయలో చూసిన ఆ బీభత్స దృశ్యం నా కళ్ళ ముందు కదలాడి ఒక్కసారిగా పరుగు మొదలెట్టాను. రెండు క్షణాల్లో ఒక అద్భుతం జరిగింది. నేను అక్కడకు చేరి బృదులను ఎత్తుకొని ఇంట్లోకి పరిగెత్తడం, ఆ గద్దపక్షి భూమి మీదకు దిగడం ఒకేసారి జరిగాయి. నేను మృదులను ఇంట్లోకి తీసికెళ్ళి తలుపేసి వీధిలోకి వచ్చాను. గద్దపక్షి నిరాశతో మళ్ళీ ఎగిరిపోతూ కనిపించింది. అది ఇప్పుడు గట్టిగా అరవడం వినిపించింది. నాకు ఆ దృశ్యం చాలా ఆనందం కలిగించింది. నేనే గాని ఆ లోయకి ఫొటో కోసం వెళ్ళకపోయి ఉంటే ఈ రోజు మృదుల ఆ గద్దపక్షికి బలైపోయి ఉండేది. ఆ విషయం తలపునకు రాగానే నా ఒంట్లో వణుకు మొదలైంది. పెళ్ళైన పదేళ్ళకు పుట్టిన మృదులకు ఏం జరిగినా అక్క తట్టుకోలేదు. ఇంక నా ఫొటోకి పోటీలో బహుమతి రాకపోయినా నేను బాధపడను. కానీ మృదులను కాపడినందుకు నాకెంతో ఆనందంగా ఉంది. మృదులను కాపాడిన దృశ్యం పదేపదే నా కళ్ళముందు కదలాడసాగింది. -గన్నవరపు నరసింహమూర్తి -
విమానంలోంచి గుట్టలు గుట్టలుగా చేపలు...వీడియో వైరల్
ఇంతవరకు ఎన్నో రకాల వైరల్ వీడియోలు చూశాం. వాటిని చూసి అబ్బురపడ్డాం. కానీ వాటన్నింటికంటే భిన్నమైన వైరల్ వీడియో ఇది. ఈ వీడియో చూస్తే ఇది నిజమేనా! అనిపిస్తుంది. కళ్లముందు సాక్ష్యంగా వైరల్ వీడియో కనిసిస్తున్న నమ్మశక్యంగా అనిపించదు. ఇంతకీ ఏంటా వీడియో? ఏముందంటే... వివరాల్లోకెళ్తే....సరస్సుల పునరుద్ధరణలో భాగంగా ఓ విమానం చేపలను సరస్సులో పడేస్తోంది. చిన్న చిన్న చేపలను నీటితో సహా ఒక్కసారిగా నీటిలో చల్లుకుంటూ వెళ్తోంది. ఇలా చేపలు లేని సరస్సుల్లో వేస్తుంటారు. ఈ ఘటన వాసచ్ పర్వత ప్రాంతంలోని సిల్వర్ లేక్ ఫ్లాట్ రిజర్యాయర్లో చోటు చేసుకుంది. ఇలా వైమానిక పద్ధతిలో చేపలను సరస్సులో వదలడం 1956 నుంచి మొదలైంది. ఇది అక్కడ స్థానిక సరస్సులోని చేపలను ఏ మాత్రం ప్రభావితం చేయదని అంటున్నారు అధికారులు. ఇలా ఎక్కువగా చేపల పునరుత్పత్తి లేని సరస్సులోనే చేస్తామని వివరించారు. అంతేకాదండోయ్! 1950 దశకానికి ముందు దూర ప్రాంతాలకు చేపలను తరలించాలంటే గుర్రం పాలను సేకరించి వాటిలో వేసి తీసుకువెళ్లేవారంట. ఐతే ఇలా వైమానిక పద్ధతిలో చేపలను తరలించడం కొంచెం ఖర్చుతో కూడిన పని అయినప్పటికీ చాలా త్వరిత గతిన అయిపోతుందంటున్నారు అధికారులు. ఈ వీడియోని ఉటా డివిజన్‌కి చెందిన వైల్డ్ లైఫ్ రీసోర్స్ సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. (చదవండి: విమానాశ్రయంలో ఏకంగా 109 జంతువులు కలకలం...షాక్‌లో అధికారులు) -
ప్రాణాన్ని బలిగొన్న ‘ఉచ్చు’
మారేడుమిల్లి: వన్యప్రాణులకోసం విద్యుత్ తీగలతో ఏర్పాటుచేసిన ఉచ్చు ఒకరిని బలిగొంది. మరొకరిని తీవ్ర గాయాల పాల్జేసింది. ఎస్ రాము, బంధువుల కథనం మేరకు వివరాలిలావున్నాయి. మండలంలోని చట్లవాడ పంచాయతీ పరిధిలోని బొజ్జలగండి గ్రామానికి చెందిన కొండ్ల శ్యాముల్ రెడ్డి (26), పల్లాల రమేష్ రెడ్డితో కలిసి గ్రామ సమీపంలోని అటవీ ప్రాంతంలో కర్రల నిమిత్తం శనివారం రాత్రి వెళ్లారు. వాటిని నరికి అటవీ ప్రాంతం నుంచి రహదారి వద్దకు తీసుకువస్తున్నారు. అదేమార్గంలో కొందరు వేటగాళ్లు వన్యప్రాణుల కోసం ఉచ్చు ఏర్పాటుచేశారు. దానికి విద్యుత్ తీగలు అమర్చారు. శ్యాములరెడ్డి, సురేష్ రెడ్డి తెస్తున్న కర్రల చివర్లు విద్యుత్ తీగలకు తగలడంతో ఇరువురు షాక్‌కు గురయ్యారు. దీంతో శ్యాముల్రెడ్డి సంఘటన స్థలంలోనే మృతి చెందాడు. అతని వెనుక వస్తున్న రమేష్ రెడ్డి కాళ్లకు తీవ్ర గాయాలయ్యాయి. గాయపడిన రమేష్‌రెడ్డిని అదే ప్రాంతంలో ఉన్న స్థానికులు బోదులూరు పీహెచ్‌సీకి తరలించారు. అక్కడి నుంచి మెరుగైన వైద్య సేవలు నిమిత్తం రంపచోడవరం ఏరియా ఆస్పత్రికి తీసుకువెళ్లారు. పోలీసులకు బంధువులు సమాచారం ఇవ్వడంతో ఎస్ఐ రాము సంఘటన స్థలానికి చేరుకొని వివరాలు సేకరించారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని ఆయన తెలిపారు. (చదవండి: చెత్తకు కొత్త రూపుం...వేస్ట్ క్రాఫ్ట్) -
పాపికొండల్లో పెద్ద పులులు
బుట్టాయగూడెం: ఉభయగోదావరి జిల్లాల్లో విస్తరించిన పాపికొండల అభయారణ్యంలో పెద్ద పులి జాడలు కనిపించాయి. చిరుతల సందడిని గుర్తించారు. సుమారు 90 రోజులపాటు తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాల పరిధిలో వైల్డ్‌లైఫ్ అధికారులు పులుల గణన నిర్వహించారు. ఎక్కడెక్కడ ఏ జంతువులు ఉన్నాయనే సమాచారాన్ని రాబట్టారు. ఈ అభయారణ్యం పరిధిలో పెద్దపులి జాడలు కనిపించడం ఈసారి సాధించిన విజయం. ఈ సారి గణనలో అత్యంత విషపూరితమైన 30 అడుగుల గిరినాగు కూడా కంటపడింది. ఈ అభయారణ్యంలో కొండగొర్రెలు, పాంథర్, కొండచిలువలు, దుప్పులు, సాంబాలు, నక్కలు, ముళ్ల పందులు, ముంగిసలు, ఎలుగుబంట్లు, నక్కలు, తోడేళ్లు, అడవికుక్కలు, కుందేళ్లు, లేళ్లు, కనుజులు, అడవిపందులు తిరుగుతున్నట్లు గుర్తించారు. తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాల్లో 1012.858 చదరపు కిలోమీటర్ల పరిధిలో విస్తరించి ఉన్న అటవీప్రాంతాన్ని 2008లో కేంద్ర ప్రభుత్వం పాపికొండల అభయారణ్యంగా ప్రకటించింది. అప్పటి నుంచి అటవీప్రాంతంలోని జంతు సంరక్షణ కోసం అధికారులు ప్రత్యేక కృషి చేస్తున్నారు. ప్రతీ నాలుగేళ్లకు ఒకసారి జాతీయ పులుల సంరక్షణ విభాగం ఆధ్వర్యంలో గణన కార్యక్రమాన్ని నిర్వహిస్తారు. ఇప్పటికే రెండుసార్లు పాపికొండల అభయారణ్యంలో పులుల గణన కార్యక్రమాన్ని వైల్డ్‌లైఫ్ అధికారులు నిర్వహించారు. మొదట్లో నిర్వహించిన సర్వేలో పులులు ఉన్నప్పటికీ కెమెరాకు చిక్కలేదు. ఈ సారి నిర్వహించిన సర్వేలో పులులు ట్రాప్ కెమెరాకు చిక్కాయి. రెండు దశల్లో సర్వే పాపికొండల అభయారణ్యంలో పులుల గణనకు సంబంధించిన సర్వేను వైల్డ్‌లైఫ్ అధికారులు రెండు దశల్లో నిర్వహించారు. ఉభయగోదావరి జిల్లాల్లో 90 రోజుల పాటు నిర్వహించిన ఈ సర్వేలో సుమారు 232 పైగా ట్రాప్ కెమెరాలు ఏర్పాటు చేసి జంతువుల్ని గుర్తించారు. మొదటి దశలో తూర్పుగోదావరి జిల్లా పరిధిలో ఉన్న అటవీప్రాంతంలోని 71 చోట్ల 142 కెమెరాలను ఏర్పాటు చేసి 45 రోజుల పాటు సర్వే నిర్వహించారు. పశ్చిమగోదావరి జిల్లాలో 45 ప్రాంతాల్లో 90 కెమెరాలు ఏర్పాటు చేసి 45 రోజుల పాటు సర్వే నిర్వహించారు. ట్రాప్ కెమెరాలో పులుల జాడ 2018లో నిర్వహించిన పులుల గణన సర్వేలో ఈ ప్రాంతంలో పులులు ఉన్నా ట్రాప్ కెమెరాకు చిక్కలేదు. ఈ ఏడాది నిర్వహించిన సర్వేలో పులుల జాడ స్పష్టంగా కెమెరాకు చిక్కాయి. పూర్తి స్థాయిలో పులుల గణన వివరాలు జులై 29న వెల్లడించే అవకాశముంది. ప్రస్తుతం పాపికొండల అభయారణ్యంలో జరిగిన గణన వివరాల నివేదికను జాతీయ పులుల సంరక్షణ విభాగం(ఎన్టీసీఏ) కేంద్ర ప్రభుత్వానికి సమర్పించనుంది. ఆ వివరాలను ప్రపంచ పులుల దినోత్సవం రోజైన జులై 29న పూర్తి స్థాయిలో ప్రకటిస్తారని వైల్డ్‌లైఫ్ అధికారులు చెబుతున్నారు. 230 పక్షుల రకాల్ని గుర్తించాం పాపికొండల అభయారణ్యంలో పులుల గణన పూర్తయ్యింది. సుమారు 90 రోజుల పాటు నిర్వహించిన ఈ సర్వేలో పులులు, చిరుతలతో పాటు 230 రకాల పక్షులు, 14 రకాల జాతుల ఉభయచర జీవులు ఉన్నట్లు ట్రాప్ కెమెరాలు గుర్తించాయి. ఇక్కడ నిర్వహించిన సర్వే నివేదికను జాతీయ పులుల సంరక్షణ విభాగానికి పంపిస్తాం. – సి.సెల్వమ్, డివిజనల్ ఫారెస్ట్ ఆఫీసర్ 116 ప్రాంతాల్లో సర్వే పాపికొండల అభయారణ్యం ప్రాంతంలో సుమారు 116 ప్రాంతాల్లో 232 ట్రాప్ కెమెరాలు ఏర్పాటు చేశాం. ఈ సర్వేలో ఏనుగు, సింహం తప్ప అన్ని రకాల జంతువులు, పక్షులు, ఉభయచర జీవులను గుర్తించాం. జంతువుల పరిరక్షణ కోసం ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నాం. – ఎస్ఎస్ఆర్ వరప్రసాద్, వైల్డ్‌లైఫ్ మేనేజ్మెంట్ అధికారి. పాపికొండలు -
ఏం పాపం చేశాం.. మాకు బతకాలని ఉంటుంది.. దగ్గరకు రాకండి ప్లీజ్!
ఆరిలోవ(విశాఖ తూర్పు): పచ్చని అరణ్యాలు పలుచపడుతున్నాయి. కొండలు జనావాసాలుగా రూపాంతరం చెందాయి. దీంతో అరణ్యంలో ఉండాల్సిన వన్య ప్రాణులు జనారణ్యంలోకి ప్రవేశించి ప్రాణాలు కోల్పోతున్నాయి. కొన్ని జంతు జాతులు పూర్తిగా కనుమరుగవుతున్నాయి. అందుకే వన్యప్రాణుల సంరక్షణ బాధ్యత అందరిపై ఉందని అటవీ శాఖాధికారులు, జంతు సంరక్షకులు అభిప్రాయపడుతున్నారు. ఈ నెల 4(శనివారం)న ప్రపంచ వన్య ప్రాణుల సంరక్షణ దినోత్సవం సందర్భంగా ప్రత్యేక కథనం. విశాఖ నగరంలో జనసాంద్రత విపరీతంగా పెరిగింది. భారీగా నివాసాల కొరత ఏర్పంది. స్థలాల ధర చుక్కలను తాకుతోంది. దీంతో పేద జనం అడవులు, కొండలను ఆక్రమించి నివాసాలు ఏర్పరుచుకుంటున్నారు. విశాఖ నగరాన్ని ఆనుకొని ఉన్న కొండలు జనావాసాలతో కిక్కిరిసిపోయాయి. కంబాలకొండ, సీతకొండ, ఎర్రకొండ, ఎండాడ కొండలు, అమనాం ప్రాంతాల్లో దట్టమైన రిజర్వ్డు ఫారెస్టుకు చెందిన కొండలున్నాయి. వీటిలో కంబాల కొండలో 17,600 ఎకరాలు, సీతకొండలో 800, ఎర్రకొండలో 800, అమనాం ప్రాంతంలో 920 ఎకరాల విస్తార్ణంలో అడువులుండేవి. కొన్నేళ్లుగా ఆ అడవులు ఆక్రమణకు గురై విస్తీర్ణం తరిగిపోయింది. ఒకప్పుడు సుమారు 1,000 ఎకరాల్లో రుషికొండ ప్రాంతంలో కొండలుండేవి. వీటిలో ప్రస్తుతం పలు ఐటీ కంపెనీలు, ఫిల్మ్‌సిటీ వెలిశాయి. దీంతో అక్కడ అటవీ ప్రాంతమంతా కనుమరుగైంది. ఈ కొండలన్నింటిలోను సుమారు 8 చిరుతలు సంచరిస్తున్నట్లు అటవీ అధికారులు అప్పట్లో గుర్తించారు. ఎండాడ కొండల్లో నాలుగు చిరుతలు సంచరించేవని, ఇక్కడ నిర్మాణాలు జరగడంతో వాటి జాడ కనిపించలేదు. చిరుతలకు ఆహారమైన జింకలు, కనుజులు, నక్కల సంఖ్య కూడా తగ్గతుందని అటవీశాఖ అధికారులు నిర్ధారించారు. దీంతో ఆహారం కోసం చిరుతలు జనారణ్యంలోకి చొరబడుతున్న సందర్భాలు ఉన్నాయి. చిరుతలు అడవుల్లో సుమారు 25 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో సంచరిస్తాయి. సీతకొండ, ఎర్రకొండ, అమనాం ప్రాంతాలు తక్కువ విస్తీర్ణంలో ఉన్నాయి. దీంతో రాత్రివేల ఆహారం కోసం చిరుతలు తిరుగుతూ అడవులు సమీపంలోని నివాసాలలోకి చొరబడుతున్నాయి. గతంలో అమనాం, ఎంవీపీ కాలనీ, గోపాలపట్నం, అక్కయ్యపాలెం, మధురవాడ ప్రాంతాల్లో చిరుతలు ఆహారం కోసం జనారణ్యంలోకి వచ్చి ఇళ్లలోకి చొరబడిన సంఘటనలు తెలిసిందే. 2013 నుంచి వన్యప్రాణుల సంరక్షణ దినోత్సవం వన్యప్రాణులను సంరక్షించాలనే ఆలోచనతో ప్రపంచ వ్యాప్తంగా సీఐటీఈఎస్ అనే సంస్థ 2013 నుంచి వన్యప్రాణుల సంరక్షణ దినోత్సవం నిర్వహిస్తోంది. అన్ని రాష్ట్రాల్లోను అటవీశాఖ అధికారులు ప్రత్యేక కార్యక్రమాలు చేపట్టి వన్యప్రాణులపై ప్రజలకు అవగాహన కల్పిస్తారు. జంతువుల ఆవాసాలను రక్షించడం, వన్యప్రాణులను వేటాడం చేయకుండా చూడడం ఈ సంస్థ లక్ష్యంగా పెట్టుకొంది. ఇందిరాగాంధీ జూలో వరుసగా రెండేళ్లు ఎలాంటి కార్యక్రమాలు చేయలేకపోయింది. 2020లో కరోనా కారణంగా నిర్వహించలేకపోయింది. ప్రస్తుతం తుపాన్ కారణంగా జూలో అధికారులు వన్యప్రాణులపై అవగాహన కార్యక్రమం ఏర్పాటు చేయలేకపోయారు. విశాఖ జూలో వన్యప్రాణులు నగరంలో 625 ఎకరాల అటవీ విస్తీ్తర్ణంలో ఉన్న ఇందిరాగాంధీ జూ పార్కులో అనేక రకాల వన్యప్రాణులున్నాయి. ఇక్కడ వివిధ రకాలకు చెందిన సుమారు 830 వన్యప్రాణులు కనువిందు చేస్తున్నాయి. రామచిలుకలు, ఆఫ్రికన్ చిలుకలు, మైనాలు, ఆస్ట్రిచ్‌లు, ఈమూలు, రంగురంగుల పిట్టలతో పాటు పులులు, సింహాలు, ఏనుగులు, నీటి ఏనుగులు, ఖడ్గమృగం, జిరాఫీలు, జీబ్రాలు, చింపాంజీలు, కనుజులు, జింకలు, కొండగొర్రెలు, అడవి కుక్కలు, హైనాలు తదితర వన్యప్రాణులను ఇక్కడ సంరక్షిస్తున్నారు. వన్యప్రాణుల రక్షణ అందరి బాధ్యత వన్యప్రాణులను రక్షించాల్సిన బాధ్యత అందరిపైనా ఉంది. జూకి వచ్చిన సందర్శకులు సరదాగా వినోదం కోసం మాత్రమే వన్యప్రాణులను చూడాలనుకోకూడదు. వాటి జీవన విధానం, పర్యావరణంలో వాటి ఆవశ్యకత గరించి తెలుసుకోవాలి. ప్రతి ఏడాది జూలో వన్యప్రాణి సంరక్షణ దినోత్సవం నిర్వహిస్తుంటాం. అయితే ఈ ఏడాది తుపాను కారణంగా జూకి సెలవు ప్రకటించడంతో జరుపుకోలేకపోతున్నాం. అందరూ వన్యప్రాణులను సంరక్షించడానికి కృషి చేయాలి. వాటిపై ప్రేమ చూపాలి. వాటి ఆవాసాలలోకి చొరబడకుండా ఉండాలి. ప్రస్తుం మన దేశంలో చీతాలు అంతరించిపోయాయి. మిగిలిన జంతు జాతి అంతరించిపోకుంగా చూడాలి. –నందని సలారియా, జూ క్యూరేటర్. -
African Wild Dogs: దయచేసి ఒక్కసారి తుమ్మి మా పార్టీని గెలిపించండి..!!
ఓటింగ్, మెజారిటీ, ప్రజాస్వామ్యం.. ఇవన్నీ మనషులకు మాత్రమే అనుకుంటే పొరబడినట్లే. ఈ పద్ధతిని ఆఫ్రిక అడవుల్లోని శునకాలూ పాటిస్తుంటాయి. మద్దతు, ఏకాభిప్రాయం గురించి మాట్లాడుకుంటాయట. ఆశ్చర్యంగా ఉంది కదూ? కానీ అది నిజం. తుమ్ములతో ఏకాభిప్రాయానికి వచ్చి, శునకస్వామ్యాన్ని నిలబెట్టుకుంటాయి. తుమ్ములే వీటి భాష. వేటకు వెళ్లే ముందు అవన్నీ సమావేశమవుతాయి. అందులో పది కుక్కలు తుమ్మితే చాలు, అన్నీ మూకుమ్మడిగా వేట ప్రారంభిస్తాయి. అయితే అన్ని కుక్కల తుమ్ములకు ఒకే ప్రాధాన్యం ఉండదు. నాయకత్వం వహించే కుక్కలు తక్కువ సార్లు తుమ్మినా వేట ప్రారంభించాల్సిందే. సమావేశంలో కనీస హాజరు(కోరం) ఉండేలా చూసుకుంటాయట. పరిశోధకుల అధ్యయనంలో వెల్లడైన విషయాలు అవి. చదవండి: World's Smallest Revolver: బొమ్మ రివాల్వర్ అనుకునేరు.. నిజమైనదే! -
Mad Hatterpillar: ఈ గొంగళి పురుగుకు ఐదు తలలు..!
రావణుడికి ఎన్ని తలలు? పది. బ్రహ్మకు? నాలుగు.. మరి, గొంగళి పురుగుకు..? ఒకటి..! ఇక్కడే పప్పులో కాలు వేశారు. అందరూ అనుకున్నట్లు గొంగళి పురుగుకు ఒక తల కాదు, ఐదు తలలు ఉంటాయి. కానీ, కొన్ని మాత్రమే వాటిని ఉంచుకుంటాయి. చాలావరకు వదిలేస్తుంటాయి. కారణం, అవి చచ్చిన తలలు కాబట్టి. గొంగళి పురుగు రూపాంతరం చెంది సీతాకోక చిలుకగా మారుతుందనే విషయం తెలిసిందే. అలా రూపాంతరం చెందే ముందు మరో పదమూడు రూపాంతరాలు చెందుతుందట. ఇలా ఈ రూపాంతరం చెందే ప్రతిసారి వాటి పాత చర్మాన్ని వదిలి.. కొత్త చర్మాన్ని ధరిస్తాయి. ఈ క్రమంలోనే వాటి తల భాగం కూడా మారుతుంది. మారే తలను కొన్ని గొంగళి పురుగులు ఓ టోపీలా వాటి తలపైనే పెట్టుకుంటే, కొన్ని వదిలేస్తుంటాయి. అలా సుమారు ఐదు తలల వరకు ధరించగలవు. ఎక్కువగా ఆస్ట్రేలియా, న్యూజిలాండ్‌కు చెందిన ఉరాబా లూజెన్స్ జాతికి చెందిన గొంగళి పురుగులు ఇలా చేస్తాయి. వీటికి ‘మ్యాడ్ హాటర్పిల్లర్’ అని పేరు. ఇతర జీవుల నుంచి తమని తాము పెద్దదిగా చూపిస్తూ, భయపెట్టడానికి కొన్ని ఈ తలల టోపీని ధరిస్తాయని శాస్త్రవేత్తలు చెప్పారు. అయితే, ఇవి ఎక్కువ కాలం నిలువవని, విరిగిపోతాయని, వాటిని జాగ్రత్తగా చూసుకోవడం చాలా కష్టమని వారు అంటున్నారు. ఏది ఏమైనా, ఈ హ్యాటర్ పిల్లర్‌గా భలే బాగుంది కదూ! చదవండి: ఈ వ్యాయామం క్రమంతప్పకుండా చేస్తే ఆయుష్షు పెరుగుతుందట! -
Viral: సింహాన్ని పరుగులు పెట్టించిన భౌభౌ!!
సింహాన్ని చూస్తే ఎవరికైనా హడల్ పుట్టాల్సిందే! కానీ దీని దెబ్బకి సింహమే బెదిరి సైడిచ్చుకుంది. ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఈ వీడియోవైపు మీరు కూడా ఓ లుక్కెయ్యండి. ఈ వీడియోలో ఓ కుక్క అరుస్తూ సింహం వెంట పడటం కనిపిస్తుంది. అంతేకాకుండా సింహంపై దాడి చేస్తుంది కూడా. ఐతే కారణం ఏమిటో తెలియదు కానీ.. సింహం మాత్రం సదరు కుక్క నుంచి తప్పించుకోవడానికి ప్రయత్నిస్తుంది. దీనిని చూసిన నెటిజన్లు మాత్రం ఆశ్యర్యంతో తలమునకలైపోతున్నారు. ఇది నిజమేనా.. అసలేం జరుగుతుందని సరదాగా కామెంట్ చేస్తున్నారు. కాగా ఈ ఫన్నీ వీడియోను ఐఎఫ్ఎస్ అధికారి సుశాంత నంద ట్విటర్లో పోస్ట్ చేశాడు. ఈ అధికారి అడవి జంతువులకు సంబంధించిన వీడియోలను తరచూ పోస్ట్ చేస్తుంటాడు. అతని ఫాలోవర్లు ఈ వీడియోలను అమితంగా ఇష్టపడటమేకాకుండా ఇతర సోషల్ మీడియాల్లో షేర్ కూడా చేస్తారట. చదవండి: ఐదేళ్లుగా వెతుకులాట.. దొరికిన గోల్డ్ ఐలాండ్.. లక్షల కోట్ల సంపద! What’s happening?? pic.twitter.com/QMESBRVZ6f — Susanta Nanda IFS (@susantananda3) October 28, 2021 -
పదేళ్ల బాలుడికి అంతర్జాతీయ యంగ్ వైల్డ్ లైఫ్ ఫొటోగ్రాఫర్ అవార్డు..!!
బెంగళూరుకు చెందిన 10 యేళ్ల విద్యున్ ఆర్ హెబ్బర్ అనే బాలుడు 2021 సంవత్సరానికి గాను ప్రతిష్టాత్మక ‘యంగ్ వైల్డ్ లైఫ్ ఫొటోగ్రాఫర్ ఆఫ్ ది ఇయర్ అవార్డు’ అందుకున్నాడు. ఈ బాలుడు తీసిన తలకిందులుగా ఉన్న సాలెగూడు ఫొటోకు గాను ఈ ప్రతిష్టాత్మక అవార్డు దక్కింది. ఈ ఫొటో బ్యాక్ గ్రౌండ్లో ప్రకృతి రంగులు అందంగా అద్దినట్టు అద్భుతంగా తీశాడు. దీనిని డోమ్ హోమ్ అని అంటారు. తన ఇంటి సమీపంలో ఉన్న వీధుల్లో, పార్కుల్లో నివసించే జీవులను ఫోటో తీయడం ఇష్టమని, ఎనిమిదేళ్ల వయసులో ఈ పోటీలో మొదటిసారి పాల్గొన్నానని హెబ్బర్ మీడియాకు తెలిపాడు. కాగా లండన్‌కి చెందిన మ్యూజియం ఆఫ్ న్యాచురల్ హిస్టరీ 1965 నుంచి ఈ కాంపిటీషన్‌ను నిర్వహిస్తోంది. దీనిని ప్రపంచంలోనే అత్యంత ప్రతిష్టాత్మకమైన నేచర్ ఫొటోగ్రఫీ కాంపిటీషన్‌గా పేర్కొంటారు. ఈ ఈవెంట్‌కి 95 దేశాల నుంచి దాదాపుగా 50,000ల ఎంట్రీలు అందాయి. 19 కేటగిరీల్లో నిర్వహించిన పోటీలో విజేతల ఫలితాలను మంగళవారం ప్రకటించారు. విజేతల్లో మన దేశం తరపున విద్యున్ ఆర్ హెబ్బర్ అవార్డు అందుకోవడం దేశానికే గర్వకారణం. చదవండి: Helath Tips: కాఫీ తాగే అలవాటుందా? నిద్రలేమి, యాంగ్జైటీ, చిరాకు.. -
మెడలో 16 కిలోల బరువు.. రెండేళ్లుగా ‘దుప్పి’ తిప్పలు.. నాలుగుసార్లు మిస్
కొలరాడో: మెడలో టైర్‌తో పరుగెడుతున్న ఈ దుప్పిని పట్టుకోవడానికి కొలరాడో వన్యప్రాణి సంరక్షణ అధికారులకు చుక్కలు కనబడ్డాయి. కొండల ప్రాంతంలో తిరిగే ఆ దుప్పి మెడలోకి టైర్ ఎలా వచ్చిందో తెలియదు గానీ రెండేళ్లుగా అధికారులు దాని కోసం వెతుకుతున్నారు. ఎట్టకేలకు వారి ప్రయత్నాలు ఫలించి దుప్పిని గత శనివారం పట్టుకుని టైర్‌ని తొలగించారు. నాలుగున్నర ఏళ్ల వయసు.. 270 కిలోల బరువున్న ఆ దుప్పి గత వారం రోజుల్లో నాలుగుసార్లు చిక్కినట్టే చిక్కి తప్పించుకుపోయిందని పార్క్ అధికారి స్కాట్ ముర్దోచ్ తెలిపారు. తొలుత దుప్పిని పట్టుకుని టైర్‌ని కట్ చేద్దామని అనుకున్నప్పటికీ సాధ్య పడలేదని పేర్కొన్నారు. పక్కా సమాచారంతో ఐదోసారి దుప్పిని టైర్ మోత నుంచి రక్షించామని అన్నారు. (చదవండి: కూతురు ఆనందం: హే.. నాన్న కూడా నాతో పాటే..!) మట్టి, రాళ్లతో నిండిన ఆ టైర్ బరువు సుమారు 16 కిలోల వరకు ఉంటుందని, దాని వల్ల దుప్పి ఆరోగ్యంపై ప్రభావం పడేదని వెల్లడించారు. అయితే, రెండేళ్లుగా అంత బరువు మోసినా దుప్పి మెడ ఎప్పటిలా మామూలుగా ఉండటం మంచి విషయమని పేర్కొన్నారు. మెడపై చిన్న గాయం మాత్రం ఉందని తెలిపారు. Here is some video of this bull elk over the past two years. pic.twitter.com/R6t9nNPOyb — CPW NE Region (@CPW_NE) October 11, 2021 (చదవండి: వైరల్: అరటి గెల మీద పడటంతో కోర్టుకు.. ఐదేళ్లు పోరాడి విజయం.. రూ.4 కోట్ల నష్ట పరిహారం) -
జనావాసాల్లోకి వన్యమృగాలు
-
అడవి 'పులి'కిస్తోంది
సాక్షి, అమరావతి/బుట్టాయగూడెం: పెరుగుతున్న పులి గాండ్రిపులతో అడవి పులకిస్తోంది. జీవ వైవిధ్యం పరిమళిస్తోంది. నడకలో రాజసం.. వేటలో గాంభీర్యంతో అడవికి రారాజుగా వెలుగొందే పెద్ద పులుల సంఖ్య రాష్ట్రంలో పెరుగుతోంది. ప్రభుత్వాలు తీసుకుంటున్న కఠిన చర్యలు, ప్రజల్లో పెరిగిన అవగాహన వెరసి పెద్ద పులులు ఊపిరి తీసుకుంటూ సంతానాన్ని పెంచుకుంటున్నాయి. నల్లమల అటవీ ప్రాంతంలో పులల సంఖ్య గణనీయంగా పెరుగుతుండగా.. పశ్చిమ గోదావరి జిల్లా పాపికొండలు అభయారణ్యం పరిధిలోనూ వాటి కదలికలు మెరుగుపడ్డాయి. వరల్డ్ వైల్డ్ లైఫ్ ఫండ్ నివేదిక ప్రకారం ప్రపంచ వ్యాప్తంగా 3,900 పులులు మాత్రమే మిగిలి ఉండగా.. మన దేశంలో 2,967 పులులు ఉన్నాయి. అంటే ప్రపంచంలోని 80 శాతం పులులు మన దేశంలోనే ఉన్నాయి. వాటి సంఖ్య మన రాష్ట్రంలో క్రమంగా పెరుగుతుండటం విశేషం. నల్లమలలో రెట్టింపైన వ్యాఘ్రాలు మన రాష్ట్రంలో ఉన్న నాగార్జున సాగర్–శ్రీశైలం టైగర్ రిజర్వ్ ఫారెస్ట్ దేశంలోనే అతి పెద్దది. ప్రస్తుతం ఇక్కడ 63 పులులను కెమెరా ట్రాప్ ద్వారా గుర్తించారు. దీనిని బట్టి వీటి సంఖ్య 80 వరకూ ఉండవచ్చని అంచనా వేస్తున్నారు. 2014లో కేవలం 40 పులులు మాత్రమే ఉండగా.. ఏడేళ్లలో ఈ సంఖ్య రెట్టింపైంది. నల్లమల అడవుల నుంచి శేషాచలం అడవుల వరకు పులులు విస్తరించాయి. అదేవిధంగా ఉభయ గోదావరి జిల్లాలతోపాటు భద్రాచలం వరకు విస్తరించి ఉన్న పాపికొండలు అభయారణ్యం పరిధిలోనూ పులుల సంఖ్య పెరుగుతోంది. ఈ ప్రాంతంలో నాలుగు పులులు, ఐదు చిరుత పులులను అధికారులు గుర్తించారు. రక్షణ చర్యలు పెరగడంతో.. కేంద్ర ప్రభుత్వం 1973 నుంచి ‘ప్రాజెక్ట్ టైగర్’ పేరుతో వాటి సంరక్షణ బాధ్యతను చేపట్టింది. ఫలితంగానే దేశంలో అత్యధిక సంఖ్యలో పులులు ఉన్నాయి. జీవ వైవిధ్యానికి ప్రతీకగా నిలుస్తున్న పులులకు మన రాష్ట్రంలోని పాపికొండల అభయారణ్యం ఆవాసంగా మారింది. అభయారణ్యం పరిధిలోని ఉభయ గోదావరి, ఉమ్మడి ఖమ్మం జిల్లాల పరిధిలో 1,012.86 చదరపు కిలోమీటర్ల మేర విస్తరించి ఉన్న 1,01,200 హెక్టార్ల అటవీ ప్రాంతాన్ని అభయారణ్యంగా 2008లో ప్రకటించిన కేంద్ర ప్రభుత్వం ఈ ప్రాంతంలో జాతీయ పార్కు ఏర్పాటు చేయాలని సంకల్పించింది. మరోవైపు వన్యప్రాణుల సంరక్షణపై అటవీ అధికారులు ప్రత్యేక దృష్టి సారించారు. బుట్టాయగూడెం మండలం గుబ్బల మంగమ్మ గుడి ప్రాంతంలోని గోగులపూడి, పోలవరం మండలం టేకూరు ప్రాంతాల్లో బేస్ క్యాంపులు ఏర్పాటయ్యాయి. అభయారణ్యం సంరక్షణ, జంతువుల జాడ కోసం ట్రాప్ కెమెరాలను ఏర్పాటు చేశారు. అవగాహన పెంచుకోవాలి పులుల సంరక్షణ అందరి బాధ్యత. పర్యావరణానికి అవి ఎంతో మేలు చేస్తాయి. వాటిపై అవగాహన పెంచుకుని పరిరక్షణకు నడుం బిగించాలి. మన రాష్ట్రంలో పులుల సంఖ్య బాగా పెరుగుతోంది. శ్రీశైలం టైగర్ రిజర్వ్ ఫారెస్ట్ వాటికి బాగా అనుకూలంగా ఉంది. అందుకే పులుల ఆవాసాలు అక్కడ ఎక్కువ ఉన్నాయి. – రాహుల్ పాండే, చీఫ్ కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్ (వైల్డ్ లైఫ్) పులులను రక్షించాలి పర్యావరణ పిరమిడ్‌లో అగ్రసూచిగా ఉండేది పెద్ద పులి. ఆ తర్వాత చిరుత పులులు వంటి టాప్ కార్నివోర్స్ జీవ వైవిధ్యాన్ని కాపాడే గురుతర బాధ్యతతో ఉంటాయి. వాటి సంరక్షణ పర్యావరణ పరిరక్షణలో కీలకం. వన్య ప్రాణులు కనిపిస్తే అటవీ శాఖ దృష్టికి తీసుకు రావాలి. పులులను కాపాడుకోవాల్సిన బాధ్యత అందరిపై ఉంది. – సి.సెల్వమ్, వైల్డ్ లైఫ్ డివిజనల్ ఫారెస్ట్ ఆఫీసర్, రాజమండ్రి ట్రాప్ కెమెరాల్లో పులుల జాడ పాపికొండల అభయారణ్యంలో పులుల సంచారం బాగుంది. మేం గ్రామాల్లో పర్యటించిన సమయంలో గోదావరి పరీవాహక ప్రాంతాల ప్రజలు పులుల గాండ్రింపులు విన్నట్టు చెబుతున్నారు. ఆయా ప్రాంతాల్లో ట్రాప్ కెమెరాలు ఏర్పాటు చేశాం. గత నెల, ఈ నెలలో చిరుత పులులు, ఇతర జంతువుల జాడ కెమెరాకు చిక్కింది. – ఎస్ఎస్ఆర్ వరప్రసాద్, పాపికొండలు వైల్డ్‌లైఫ్ మేనేజ్మెంట్ అధికారి -
అమూర్ డేగ జంట అద్భుత ప్రయాణం..
సాక్షి, అమరావతి: వలస పక్షుల సుదీర్ఘ ప్రయాణాలు సాధారణ విషయమే. కానీ రెండు అమూర్ డేగలు (అమూర్ ఫాల్కన్స్) ఏకంగా రెండు మహా సముద్రాలను దాటి, పదికిపైగా దేశాలను చుట్టి 29 వేల కిలోమీటర్లు ప్రయాణించి రికార్డు సృష్టించాయి. వాటికి అమర్చిన శాటిలైట్ రేడియో ట్రాన్స్మీటర్ల ద్వారా పరిశోధకులు ఆ పక్షుల రూట్, ప్రయాణించిన దూరాన్ని తెలుసుకున్నారు. ఆర్కిటిక్ టెర్న్ తర్వాత ప్రపంచంలోనే ఎక్కువ దూరం ప్రయాణించిన పక్షులుగా ఇవి ఇప్పుడు గుర్తింపు పొందినట్లు చెబుతున్నారు. అమూర్ డేగల వలస మార్గం, ప్రయాణం గురించి అధ్యయనం చేయడానికి సైబీరియాలోని అమూర్ నుంచి మణిపూర్ వచ్చిన ఐదు పక్షులకు గతేడాది నవంబర్ 2న వైల్డ్ లైఫ్ సొసైటీ ఆఫ్ ఇండియా, మణిపూర్ ఫారెస్ట్ శాఖ సంయుక్తంగా శాటిలైట్ రేడియో ట్రాన్స్మీటర్లు అమర్చింది. వాటికి చ్యులాన్, ఇరాంగ్, బారక్, ఫలాంగ్, పుచింగ్ అని పేర్లు పెట్టారు. బారక్, ఫలాంగ్, ఫుచింగ్‌ల నుంచి సిగ్నల్ రావడం చాలా కాలం క్రితమే ఆగిపోవడంతో అవి చనిపోయినట్లు భావించారు. కానీ చ్యులాన్, ఇరాంగ్ నుంచి నిరంతరం సిగ్నల్స్ వచ్చాయి. ఆడ పక్షి చ్యులాన్ 29 వేల కి.మీ. ప్రయాణించి తన వలస మార్గాన్ని (361 రోజుల్లో) పూర్తిచేసి ఇటీవలే మణిపూర్‌లో తన తాత్కాలిక స్థావరానికి చేరుకుంది. మగ పక్షి ఇరాంగ్ 33 వేల కి.మీ. ప్రయాణించి తర్వాత అక్కడకు చేరింది. (చదవండి: వాలిబాల్ ఆడుతున్న పక్షలు.. గెలుపెవరిది?) డేగల రూట్ ఇదే.. ⇒ చైనా నుంచి బయలుదేరి థాయ్‌లాండ్, మయన్మార్ మీదుగా మన దేశంలోని మణిపూర్‌లోకి వచ్చాక వాటికి జియో ట్యాగ్లు అమర్చారు. వాటి సిగ్నల్ ఆధారంగా బంగాళాఖాతం తీరంలో మన దేశంలోని ఏపీ, కర్ణాటక పలు ప్రాంతాల నుంచి అరేబియా సముద్రం దాటి ఆఫ్రికా ఖండంలోని సోమాలియా, కెన్యా, టాంజానియా, జాంబియా, జింబాబ్వే, బొట్స్వానా మీదుగా దక్షిణాఫ్రికా వెళ్లి అక్కడ శీతాకాల విడిది చేశాయి. మళ్లీ తిరిగి ఇదే రూట్లో మణిపూర్ చేరుకున్నాయి. తర్వాత ఇవి చైనా, రష్యా ప్రాంతానికి వెళ్లిపోయాయి. ⇒ అమూర్ డేగలు నాగాలాండ్ ప్రాంతానికి లక్షల్లో వలస వస్తాయి. శీతాకాలంలో ఆ ప్రాంతంలోని అడవులు, పంటల్లో చెదలు, క్రిమి కీటకాలను ఇవి తినేవి. అయితే స్థానికులు పెద్దఎత్తున వేటాడడంతో వాటి రాక తగ్గిపోయింది. దీనివల్ల పంటలు, అడవులు క్రిమి కీటకాలతో నాశనమవుతున్నట్లు గుర్తించి వేటాడడం నిలిపివేశారు. ⇒ అప్పటి నుంచి మళ్లీ అమూర్ డేగలు వస్తుండటంతో వారికి క్రిమిసం హారక మందులు వాడాల్సిన అవసరం ఉండటంలేదంటున్నారు. నాగాలాండ్‌కు అమూర్ డేగలు వచ్చే సమయంలో పండుగ నిర్వ హిస్తున్నారు.వాటిని చూడ్డానికి పెద్దఎత్తున పర్యాటకులు వస్తున్నారు. ► 6.2 సంవత్సరాల జీవిత కాలం ► 160200 గ్రాముల బరువు ► 2831 సెంటీమీటర్ల పొడవు ► అరుపు.. కివ్.. కివ్.. కివ్.. ► ఆహారం... పంటలను ఆశించే క్రిమి, కీటకాలు, అడవుల్లో చెదలు మగ డేగ ముదురు బూడిద, ఎరుపు రంగులో ఉంటుంది. రెక్కల వెనుక భాగం తెల్లగా ఉంటుంది. తొడల భాగం గోధుమ వర్ణంలో ఉంటుంది. కడుపు భాగంలో నల్లటి మచ్చలు ఉంటాయి. ఆడ డేగ పై భాగం లేత బూడిద రంగులో ఉంటుంది. నుదుటి భాగం క్రీమ్ కలర్లో ఉంటుంది. ఛాతీ భాగంలో తెలుపు, బూడిద రంగులో పెద్ద మచ్చలు ఉంటాయి. తోక, ఈకలు కొంచెం నలుపు రంగులో ఉంటాయి. (చదవండి: రోడ్డుపై సింహాలు, గుజరాతీలో మాట్లాడిన వ్యక్తి) ఇతర విశేషాలు కంటి పాచ్ నల్లగా ఉంటుంది. కంటి చుట్టూ ఆరెంజ్ రంగు వలయం ఆకర్షణీయంగా ఉంటుంది. గుండ్రని వంపు గల రెక్కలు ఉంటాయి. అత్యంత స్నేహశీలి. సంధ్యా సమయంలో చాలా చురుగ్గా ఉంటుంది. కాళ్లు, పాదాలు.. ఎరుపు, ఆరెంజ్ రంగుల మేళవింపుతో ఉంటాయి. చిన్నపాటి తోక కలిగి ఉంటాయి. మధ్య, తూర్పు హిమాలయాల్లో.. దక్షిణ అస్సాం కొండలు, శ్రీలంక, భారతదేశంలోని సముద్రతీరం, మాల్దీవులు, ఈశాన్య ఆసియా, ఆగ్నేయ ఆఫ్రికా, దక్షిణాఫ్రికా ప్రాంతాల్లో ఎక్కువగా కనిపిస్తాయి. గుంపులుగా కలిసి వలస వెళ్తాయి. ఒక్కో సారి ఇతర జాతుల పక్షులతో కలిసి కూడా ప్రయాణిస్తాయి. చెట్ల పొదలను ఇష్టపడతాయి. గడ్డిభూములు, చిత్తడి నేలలు, బహిరంగ ప్రదేశాల్లో ఎక్కువగా ఆవాసాలు ఏర్పరచుకుంటాయి. చెట్ల రంధ్రాలు, పాత గూళ్లలో విశ్రాంతి తీసుకుంటాయి. ఎరుపు రంగును చూస్తే ఆందోళనకు గురవుతాయి. పర్యావరణానికి ఎంతో మేలు చేస్తాయి అమూర్ డేగలు పర్యావరణానికి ఎంతో మేలు చేస్తాయి. క్రిములను తిని బతికే పక్షుల్లో అత్యధిక దూరం ప్రయాణించేవి ఇవే. ఆగకుండా నాలుగైదు వేల కిలోమీటర్లు ప్రయాణిస్తాయి. మన రాష్ట్రం ఈ పక్షుల వలస మార్గం. తిరుపతి, విశాఖలో గతంలో కనిపించాయి. మచిలీపట్నంలోనూ దీన్ని గుర్తించారు. నైరుతి రుతు పవనాలు, సముద్రంలో ఏర్పడే అల్ప పీడనాలను ఉపయోగించుకుని ఇవి ప్రయాణిస్తున్నట్లు ప్రాథమికంగా తేలింది. వీటిపై ఇంకా పరిశోధనలు చేయాల్సి ఉంది. – రాజశేఖర్ బండి, సిటిజన్ సైన్స్ కో–ఆర్డినేటర్, ఐఐఎస్ఈఆర్ -
రోడ్డుపై సింహాలు, గుజరాతీలో మాట్లాడిన వ్యక్తి
అహ్మదాబాద్: దేశమంతా ప్రస్తుతం వైల్డ్‌లైఫ్ వారోత్సవాలు జరుపుకుంటున్న సంగతి తెలిసిందే. అయితే ఈ సమయంలోనే గుజరాత్ గిర్ ఫారెస్ట్‌లో ఒక అద్భుతమైన ఘటన జరిగింది. 32 సెకన్ల నిడివి గల ఈ వీడియోను చూస్తే మీరు కూడా ఆశ్చర్యపోతారు. గిర్ ఫారెస్ట్‌లో పనిచేసే ఒక వ్యక్తి తన పనులు ముగించుకొని ఇంటికి బయలుదేరాడు. అయితే అతను వెళ్లే మార్గ మధ్యలో కొన్ని సింహాలు కూర్చొని ఉన్నాయి. అయితే అతను ఆ సింహాలతో గుజరాతీలో మాట్లాడాడు. తాను తన పనిని ముగించుకున్నానని, ఇక ఇంటికి వెళ్లాల్సిన సమయం వచ్చిందని వాటితో చెప్పాడు. A Gir Forest employee finds a lion on road. He tries to explain in Gujarati, the lion that he has been working whole day and requests to now kindly let him go home.And,the King of Jungle obliges... A beautiful example of harmonious co-existence#wildlifeweek2020 pic.twitter.com/QptdL4bMla — Prakash Javadekar (@PrakashJavdekar) October 7, 2020 తాను పని చేసి అలిసిపోయానని, తనకు వెళ్లడానికి దారినివ్వాలని వాటిని కోరాడు. అయితే ఆ తరువాత ఆ సింహాలు ఏం చేశారో చూస్తే మీరు అవాక్ అవ్వక తప్పదు. ఎందుకంటే మనుషులను చూడగానే పైకి వచ్చి చంపేసే సింహాలు అతనికి దారి నిచ్చి ఆ మార్గం నుంచి తప్పుకున్నాయి. ఇందుకు సంబంధించిన వీడియోను కేంద్ర పర్యావరణ శాఖ మంత్రి ప్రకాశ్ జవదేకర్ తన ట్విట్టర్ అకౌంట్ ద్వారా పంచుకున్నారు. ‘సామరస్యపూర్వక సహజీవనానికి అందమైన ఉదాహరణ’ ఆయన ట్వీట్ చేశారు. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. చదవండి: అందాల పోటీలో ఆంధ్రా సీతాకోకచిలుకలు -
జాతీయ మృగం జాడేది?
సాక్షి, పాల్వంచ: ఉమ్మడి జిల్లాలోని అటవీప్రాంతంలో పులుల జాడ కరువైంది. చిరుతల సంచారం కూడా లేదు. దట్టమైన అటవీప్రాంతం తగ్గిపోతుండటంతో అలికిడిలేని ప్రాంతంలో నివసించే మాంసాహార జంతువులు ఇతర ప్రాంతాలకు వలస పోతున్నాయి. ఇతర వన్యప్రాణులు వేటగాళ్ల ఉచ్చులకు బలవుతున్నాయి. కిన్నెరసాని అభయారణ్యంలోనే 20 వేల హెక్టార్లకు పైగా అటవీ ప్రాంతం ఆక్రమణకు గురైనట్లు తెలుస్తోంది. నేడు ప్రపంచ వన్యప్రాణుల దినోత్సవం. ఈ సందర్భంగా జిల్లాలో ఏయే రకాల అటవీ జంతువులు, ఎన్నెన్ని ఉన్నాయో తెలుసుకుందాం. భద్రాద్రి జిల్లాలో అటవీ ప్రాంతం 4,27,725 హెక్టార్లలో విస్తరించి ఉంది. ఖమ్మం జిల్లాలో 62,000 హెక్టార్లలో విస్తరించి ఉంది. 2017లో జాతీయ పులుల గణన జరిగింది. ఉభయ జిల్లాలో ఒక్క పులి ఆనవాళ్లు కూడా లభించలేదు. కాగా 2015లో మాత్రం కిన్నెరసాని అభయారణ్యంలోని పడిగాపురం బీట్‌లో పులి సంచారాన్ని గుర్తించారు. మూడేళ్ల క్రితం ఉమ్మడి జిల్లాలో జంతువుల గణన జరిగింది. భద్రాద్రి జిల్లాలోని 6 డివిజన్లు, 24 రేంజ్‌లు, 492 బీట్లు, ఖమ్మం జిల్లాలోని రెండు డివిజన్లు, 81 బీట్ల పరిధిలో ఈ కార్యక్రమం చేపట్టారు. పులులు, చిరుతల జాడ కన్పించలేదు. గతేడాది కూడా హైదరాబాద్ టైగర్ కన్జర్వేషన్ సొసైటీ, వైల్డ్‌లైఫ్ కన్జర్వేషన్ సొసైటీ సంయుక్త ఆధ్వర్యంలో ఎన్జీఓ బృందం వన్యప్రాణుల ఆక్యూపెన్సీ సర్వే నిర్వహించారు. అప్పుడు కూడా పులులు, చిరుతల జాడ కన్పించలేదు. అడవి దున్నలు, ఎలుగుబంట్లు, చుక్కల దుప్పులు, కణుజులు, నెమళ్లు, కుందేళ్లు, కొండముచ్చులు తదితర జంతువులు, పక్షులు అధికంగా ఉన్నట్లు గుర్తించారు. కిన్నెరసాని రిజర్వాయర్‌లో వందల సంఖ్యలో మోరేజాతి మొసళ్లు ఉన్నాయి. జంతువుల సంరక్షణకు వైల్డ్‌లైఫ్–1972 వంటి చట్టాలు ఉన్నా వేటగాళ్లు మాత్రం భయపడటంలేదు. నిత్యం వేటాడి వధిస్తున్నారు. ఈ ఏడాది జిల్లాలో అటవీ జంతువులను వధించిన కేసులు 25 నమోదయ్యాయి. ఆరు డివిజన్ల పరిధిలో 35 జంతువులు వివిధ కారణాలతో మృత్యువాత పడ్డాయి. సామాజిక బాధ్యతగా గుర్తించాలి జిల్లాలో అటవీ జంతువుల సంరక్షణపై అవగాహన కార్యక్రమాలను నిర్వహిస్తున్నాం. వన్య ప్రాణుల సంరక్షణ బాధ్యత ఒక్క అటవీశాఖది మాత్రమేకాదు. ప్రజలు కూడా సామాజిక బాధ్యతగా గుర్తించాలి. –లక్ష్మణ్ రంజిత్ నాయక్, భద్రాద్రి జిల్లా అటవీశాఖాధికారి సంరక్షణ చర్యలు తీసుకుంటున్నాం 2017లో అభయారణ్యంలో జాతీయ పులుల గణన జరిగింది. పులులు, చిరుతల జాడ కన్పించలేదు. వన్యప్రాణులకు వేసవిలో కృత్రిమ తాగునీటి సౌకర్యాలను కల్పిస్తున్నాం. ఇతర సంరక్షణ చర్యలు కూడా తీసుకుంటున్నాం. –కె.దామోదర్‌రెడ్డి, వైల్డ్‌లైఫ్ ఎఫ్డీఓ, పాల్వంచ -
బ్లాక్ పాంథర్-చిరుత ఫొటోలు వైరల్
సాక్షి, కర్ణాటక: గత కొద్ది రోజులుగా కర్ణాటక అడవుల్లో బ్లాక్ పాంథర్(నల్ల చిరుత) సంచరిస్తున్న వార్త సోషల్ మీడియా హల్చల్ చేసింది. దాని ఫొటోలు కూడా విపరీతంగా వైరల్ అవ్వడంతో అందరూ సినిమాల్లోని కల్పిత జంతువు బ్లాక్ పాంథర్లు నిజంగా కూడా ఉన్నాయంటూ ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. తాజాగా బ్లాక్ పాంథర్, చిరుత పులి జతకట్టిన ఫొటోలు నెట్టింటా వైరల్ అవుతున్నాయి. వీటిని వైల్డ్ లైఫ్ ఫొటోగ్రాఫర్ మిథున్ హెచ్ తన కెమెరాలో బంధించి షేర్ చేశాడు. మూడు రోజుల క్రితం షేర్ చేసిన ఈ ఫొటోల క్రెడిట్‌కు సంబంధించి వివాదానికి దారితీసింది. కానీ ఈ వివాదం త్వరగానే పరిష్కారించబడింది.ఈ ఫొటోలను గత ఏడాది మిథున్ హెచ్ కర్ణాటకలోని కబిని ఫారెస్ట్‌లో చిత్రీకరించాడు. కర్నాటకలో అంత్యంత ప్రాచుర్యం పొందిన వన్యప్రాణుల అడవుల్లో ఇది ఒకటి, ఇది నాగరహైల్ నేషన్ పార్క్‌కు ఆగ్నేయంలో ఉంది. (చదవండి: వైరల్ : నల్ల చిరుతను చూశారా?) ‘ది ఎటర్నల్ కపుల్.. సాయా(బ్లాక్ పాంథర్), క్లియోపాత్ర(చిరుత పులి) చూడండి’ అనే క్యాప్షన్‌తో మిథున్ షేర్ చేశాడు. దీంతో ఈ పోస్టుకు వేలల్లో లైక్‌లు, వందల్లో కామెంట్స్ వచ్చాయి. ఈ అరుదైనా దృశ్యాన్ని మిథున్ ఇలా వివరించాడు. ‘‘సయా, క్లియోపాత్రా 4 సంవత్సరాల నుండి ఈ అడవిలో కలిసి నివసిస్తున్నాయి. కల్పిత రాజ్యంలో వారు అనాలోచితంగా వ్యవహరించడంతో అడవి సజీవంగా ఉంటుంది. సాధారణంగా ఇలాంటి జంటలలో మగవాడు బాధ్యత వహిస్తూ తన స్త్రీని అనుసరిస్తాడు. కానీ ఇక్కడ క్లియో బాధ్యత వహిస్తే పాంథర్ తనని అనుసరిస్తాడు’’ అంటూ రాసుకొచ్చాడు. ఓ ఇంటర్యూలో మిథున్ మాట్లాడుతూ “నాకు చాలా సంతోషంగా ఉంది. ఆన్లైన్లో ఈ చిత్రాలకు విశేష స్పందన వచ్చింది. నేను ఇది ఊహించలేదు. అలాగే దీనిపై వచ్చిన విమర్శలను కూడా నేను ఊహించలేదు. పాంథర్-చిరుతల ఫొటోలు తీసేందుకు నాకు 6 రోజుల సమయంలో పట్టింది’’ అని వెల్లడించాడు. View this post on Instagram The Eternal Couple . Saaya and Cleopatra have been courting since 4 years now and whenever they are together it’s a sight to behold. The forest comes alive as they trot nonchalantly in his fabled kingdom. Usually in the courting pairs generally it is the Male who takes charge and moves around with the female following close behind. But with this couple it was definitely Cleo who was in charge while the Panther followed. . This was shot on a surreal winter morning when a single Deer alarm led me to this breathtaking sight. . #kabini #love #leopard #nikon #wild #Natgeo #mithunhphotography #instagood #instadaily #jungle #bigcat #forest #wildlifephotography #nature #wildlife #blackpanther #melanistic #therealblackpanther #thebisonresort A post shared by Mithun H (@mithunhphotography) on Jul 19, 2020 at 7:52am PDT