సాక్షి, కర్ణాటక: గత కొద్ది రోజులుగా కర్ణాటక అడవుల్లో బ్లాక్ పాంథర్(నల్ల చిరుత) సంచరిస్తున్న వార్త సోషల్ మీడియా హల్‌చల్ చేసింది. దాని ఫొటోలు కూడా విపరీతంగా వైరల్ అవ్వడంతో అందరూ సినిమాల్లోని కల్పిత జంతువు బ్లాక్ పాంథర్‌లు నిజంగా కూడా ఉన్నాయంటూ ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. తాజాగా బ్లాక్ పాంథర్, చిరుత పులి జతకట్టిన ఫొటోలు నెట్టింటా వైరల్ అవుతున్నాయి. వీటిని వైల్డ్ లైఫ్ ఫొటోగ్రాఫర్ మిథున్ హెచ్ తన కెమెరాలో బంధించి షేర్ చేశాడు. మూడు రోజుల క్రితం షేర్ చేసిన ఈ ఫొటోల క్రెడిట్‌కు సంబంధించి వివాదానికి దారితీసింది. కానీ ఈ వివాదం త్వరగానే పరిష్కారించబడింది.ఈ ఫొటోలను గత ఏడాది మిథున్ హెచ్ కర్ణాటకలోని కబిని ఫారెస్ట్‌లో చిత్రీకరించాడు. కర్నాటకలో అంత్యంత ప్రాచుర్యం పొందిన వన్యప్రాణుల అడవుల్లో ఇది ఒకటి, ఇది నాగరహైల్ నేషన్ పార్క్‌కు ఆగ్నేయంలో ఉంది. (చదవండి: వైరల్ : నల్ల చిరుతను చూశారా?)
‘ది ఎటర్నల్ కపుల్.. సాయా(బ్లాక్ పాంథర్), క్లియోపాత్ర(చిరుత పులి) చూడండి’ అనే క్యాప్షన్‌తో మిథున్ షేర్ చేశాడు. దీంతో ఈ పోస్టుకు వేలల్లో లైక్‌లు, వందల్లో కామెంట్స్ వచ్చాయి. ఈ అరుదైనా దృశ్యాన్ని మిథున్ ఇలా వివరించాడు. ‘‘సయా, క్లియోపాత్రా 4 సంవత్సరాల నుండి ఈ అడవిలో కలిసి నివసిస్తున్నాయి. కల్పిత రాజ్యంలో వారు అనాలోచితంగా వ్యవహరించడంతో అడవి సజీవంగా ఉంటుంది. సాధారణంగా ఇలాంటి జంటలలో మగవాడు బాధ్యత వహిస్తూ తన స్త్రీని అనుసరిస్తాడు. కానీ ఇక్కడ క్లియో బాధ్యత వహిస్తే పాంథర్ తనని అనుసరిస్తాడు’’ అంటూ రాసుకొచ్చాడు. ఓ ఇంటర్యూలో మిథున్ మాట్లాడుతూ “నాకు చాలా సంతోషంగా ఉంది. ఆన్‌లైన్‌లో ఈ చిత్రాలకు విశేష స్పందన వచ్చింది. నేను ఇది ఊహించలేదు. అలాగే దీనిపై వచ్చిన విమర్శలను కూడా నేను ఊహించలేదు. పాంథర్-చిరుతల ఫొటోలు తీసేందుకు నాకు 6 రోజుల సమయంలో పట్టింది’’ అని వెల్లడించాడు.
Comments
Please login to add a commentAdd a comment