రోడ్లపై చిరుత కలకలం..భయంగుప్పెట్లో బెంగళూరు | Leopard Spotted Panic In Karnataka Capitals Outer Bengaluru | Sakshi
Sakshi News home page

రోడ్లపై చిరుత కలకలం..భయంగుప్పెట్లో బెంగళూరు

Published Fri, Dec 2 2022 6:43 PM | Last Updated on Fri, Dec 2 2022 6:50 PM

Leopard Spotted Panic In  Karnataka Capitals Outer Bengaluru  - Sakshi

బెంగళూరు: కర్ణాటక రాజధాని బెంగళూరు ఔటర్‌లో చిరుతపులి కనిపించడంతో పరిసర ప్రాంతాల్లో భయాందోళనలు నెలకొన్నాయి. చిరుతపులి జింకను వేటాడటంతో అటవీశాఖ అధికారులు ఆ చిరుతను పట్టుకునేందుకు తీవ్రంగా గాలిస్తున్నార. ఈ క్రమంలోనే గత రెండురోజులుగా కెంగేరిప్రాంతంలోని తురహళ్లి సమీపంలో చిరుత హల్‌చల్‌ చేయడం జరిగింది.

ఈమేరకు  బెంగళూరు సిటీ డిప్యూటీ కన్జర్వేటర్‌ ఆఫ్‌ ఫారెస్ట్‌ ఎస్‌ఎస్‌ రవిశంకర్‌ మాట్లాడుతూ.. డిపార్ట్‌మెంట్‌ ఎప్పటికప్పుడూ అప్రమత్తంగా ఉంది. వాస్తవానికి ఈ ప్రాంతంలో నాలుగు చిరుతలు కనిపించాయని ఎవరో ప్రచారం చేయడంతో పరిసర ప్రాంతాల్లో తీవ్ర భయాందోళనులు నెలకొన్నాయి. ఈ తురహళ్లి స్టేట్‌ ఫారెస్ట్‌ 519 ఎకరాల్లో విస్తరించి ఉంది. అలాగే దాదాపు అదే పరిమాణంలో తురహళ్లి అటవీ కారిడార్‌కి ఆరు కిలోమీటర్ల దూరంలో బన్నెరఘట్ట నేషనల్‌ పార్క్‌ ఉంది. అందువల్ల ఇక్కడ తరుచుగా వన్యప్రాణులు కనిపిస్తాయని అన్నారు. 

(చదవండి: ఏనుగుల బ్రేక్‌ ఫాస్ట్‌ ఎలా ఉంటుందో తెలుసా!)


 

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement