వైరల్‌: నల్లపులి, చిరుతల ఫైటింగ్‌! | Viral Video: Exciting Encounter Between A black Panther And Leopard In Kabini | Sakshi
Sakshi News home page

వైరల్‌: నల్లపులి, చిరుతల ఫైటింగ్‌!

Published Tue, Mar 9 2021 3:54 PM | Last Updated on Tue, Mar 9 2021 5:10 PM

Viral Video: Exciting Encounter Between A black Panther And Leopard In Kabini - Sakshi

బెంగళురు: సాధారణంగా అడవిలో ఒక జంతువు ఆవాసంలోకి కొత్త జంతువు రావడానికి ఇష్టపడదు. అయితే ఒకవేళ వస్తే.. రెండు జంతువులు ఒకదాన్ని ఒకటి బెదిరించుకుంటూ గొడవకు దిగుతాయి. అలాంటి ఓ ఘటన కర్నాటకలోని కబిని వైల్డ్‌లైఫ్‌ సాంక్చూవరీలో చోటుచేసుకొంది. సాధారణంగా క్రూర మృగాలు అడవిలో చెట్టుపై భాగంలో ఎక్కి కూర్చొని, వేరే జంతువులు చెట్టు కిందకి రాగానే ఒక్కసారిగా వాటిపై దూకి దాడి చేస్తాయి. అయితే, ఓ చిరుతపులి చెట్టుపై ఎక్కి వేట కోసం ఎదురుచూస్తొంది.

ఓ బ్లాక్‌ పాంథర్‌ అదే చెట్టుని చేరుకొని చెట్టుపైకి ఎక్కుతుంది. దీంతో రెండు అరుస్తూ ఒక దానితో మరొకటి గొడవకు దిగి, నువ్వా.. నేనా.. అన్నట్లు గాండ్రించుకున్నాయి . నా పంజా రుచి చూస్తావా అన్నట్లు ఆగ్రహించాయి. కాగా, నల్ల చిరుతే చివరకు కాస్త వెనక్కు తగ్గి వెళ్ళిపోయింది. ఈ వీడియోను ఇన్సోసిస్‌ సహవ్యస్థపకులు నందన్‌ నిలేకని సోషల్‌ మీడియాలో షేర్‌ చేయగా.. తాజాగా ఈ వీడియో వైరల్‌గా మారింది.

చదవండి: భర్త చీటింగ్‌.. పోస్టర్లతో భార్య నిరసన!

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement