చిరుతకు వెరైటీ ట్రీట్‌మెంట్.. కర్రకు మంటపెట్టి.. వీడియో వైరల్.. | Leopard Fell Into Deep Well In Karnataka | Sakshi
Sakshi News home page

బావిలో పడిన చిరుతకు వెరైటీ ట్రీట్‌మెంట్.. కర్రకు మంటపెట్టి.. వీడియో వైరల్..

Published Sun, Jun 25 2023 7:09 PM | Last Updated on Sun, Jun 25 2023 7:20 PM

Leopard Fell Into Deep Well In Karnataka - Sakshi

కర్ణాటక: కర్ణాటకాలో దారితప్పి బావిలో పడిపోయిన ఓ చిరుతను అధికారులు రక్షించారు. అడవి నుంచి బయటకు వచ్చిన ఓ చిరుత జనావాసాల్లోకి వచ్చింది. దారితప్పి అనుకోకుండా ఓ బావిలో పడిపోయింది. అనంతరం అరవడం ప్రారంభించింది. దీనిని గమనించిన గ్రామస్థులు అధికారులకు సమాచారం అందించారు. 

రంగంలోకి దిగిన అధికారులు.. చిరుతను బావి నుంచి బయటకు తీసే ప్రయత్నం చేశారు. చిరుత పైకి ఎక్కడానికి బావిలోకి ఓ నిచ‍్చెనను వేశారు అధికారులు. కానీ మనుషులను చూసిన చిరుత.. భయపడి బయటకు రాకుండా బావిలోనే ఉండిపోయింది. దీంతో గ్రామస్థుల సహకారంతో ఓ పెద్ద కర్రకు మంటను అంటించి బావిలోని చిరుతను ఓ వైపు నుంచి బెదిరించారు. దీంతో చిరుత నిచ్చెన ద్వారా బావి పైకి ఎక్కింది.

ఈ వీడియోను ఓ అధికారి సామాజిక మాధ్యమాల్లో మూడు రోజుల క్రితం పోస్టు చేశారు. అయితే.. జంతువులను రక్షించే క్రమంలో ఒక్కో సారి విభిన్నమైన ప్రయత్నాలు చేయాల్సి వస్తుందని వెల్లడించారు. ఈ వీడియో నెట్టింట తెగ వైరల్ అయింది. కేవలం మూడు రోజుల్లోనే లక్ష వ్యూస్ వచ్చాయి. వీడియోపై నెటిజన్లు విభిన్నంగా స్పందించారు. చిరుతను రక్షించినందుకు అధికారులకు ధన్యవాదాలు తెలిపారు.  

ఇదీ చదవండి: సూపర్ పోలీస్.. రాకాసి అలల్లో పిల్లలను కాపాడి.. వీడియో వైరల్‌...

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement