Dog Escapes From Leopard Clutches In Karnataka, Watch Viral Video - Sakshi
Sakshi News home page

హాయిగా నిద్రపోతుంటే చిరుతపులి పట్టుకుంది.. ఆపై..

Published Mon, Jul 5 2021 4:22 PM | Last Updated on Mon, Jul 5 2021 7:21 PM

Dog Escaped From Leopard Jaw In Karnataka - Sakshi

సీసీటీవీ దృశ్యాలు

బెంగళూరు : చిరుతపులి నోటికి చిక్కిన ఓ కుక్క అదృష్టం బాగుండి ప్రాణాలతో బయటపడింది. ఈ సంఘటన కర్ణాటకలోని మంగళూరులో ఆసల్యంగా వెలుగుచూసింది. వివరాల్లోకి వెళితే.. కర్ణాటకలోని మంగళూరు, పదుకొంజేకు చెందిన సతీష్‌ అనే వ్యక్తి ముద్‌బిద్రీ అటవీ ప్రాంత పరిధిలో నివాసం ఉంటున్నాడు. ఇతడు టామీ అనే కుక్కను పెంచుకుంటున్నాడు. గత గురువారం అర్థరాత్రి అడవిలోనుంచి ఓ చిరుతపులి సతీష్‌ ఇంటి దగ్గరకు వచ్చింది. ఇంటి బయట హాయిగా నిద్రపోతున్న టామీ గొంతు పట్టుకుని అడవిలోకి లాక్కెళ్లిపోయింది.

అయితే టామీ అదృష్టం బాగుండి చిరుతపులి నోటినుంచి తప్పించుకుంది. బతుకుజీవుడా అనుకుంటూ ఇంటికి పరిగెత్తుకుంటూ వచ్చింది. చిరుతపులి దాని వెంట పరిగెత్తకుండా అక్కడే ఉండి పోయింది. దీంతో కుక్క ప్రాణాలతో బయటపడింది. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన సీసీటీవీ ఫొటేజీ వీడియో ఒకటి సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement