జైలులో నటుడు దర్శన్‌కు వీఐపీ సేవలు.. వీడియో లీక్‌ | Kannada Actor Darshan Video Call Talking In Jail | Sakshi
Sakshi News home page

జైలులో నటుడు దర్శన్‌కు వీఐపీ సేవలు.. వీడియో లీక్‌

Published Mon, Aug 26 2024 9:37 AM | Last Updated on Mon, Aug 26 2024 1:37 PM

Kannada Actor Darshan Video Call Talking In Jail

సాక్షి, బెంగళూరు: కర్ణాటకలో నటుడు దర్శన్‌ వ్యవహారం మరోసారి చర్చనీయాంశంగా మారింది. రేణుకాస్వామి హత్య కేసులో ఖైదీగా ఉన్న దర్శన్‌కు జైలులో సకల మర్యాదలు జరుగుతున్నట్టు ఫొటోలు, వీడియోలు బయటకు వస్తున్నాయి. తాజాగా ఆయన తన స్నేహితుడితో వీడియో కాల్‌ మాట్లాడిన వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది.

కాగా, తన అభిమాని రేణుకాస్వామి హత్య కేసులో నటుడు దర్శన్‌ బెంగళూరులోని పరప్పన అగ్రహార  జైలులో విచారణ ఖైదీగా ఉన్నారు. ఈ క్రమంలో జైలులులో ఆయనకు వీఐపీ సేవలు అందిస్తున్నట్టు సమాచారం. ఇక, తాజాగా వీటికి బలం చేకూరుస్తూ ఓ వీడియో కూడా బయటకు రావడం గమనార్హం. అందులో ఆయన తన స్నేహితుడితో వీడియో కాల్‌ మాట్లాడినట్లుగా ఉంది. వీడియో కాల్‌లో ఓ వ్యక్తి అవతలి వైపు మరో వ్యక్తితో మాట్లాడాడు. మధ్యలో దర్శన్‌ చేతికి ఫోన్‌ ఇచ్చి పక్కకు జరిగినట్లు వీడియోలో కనిపిస్తోంది. ఇద్దరూ ఒకరికొకరు హాయ్‌ చెప్పుకుంటూ పలకరించుకున్నారు. దర్శన్‌ గదిలో కూర్చొని మాట్లాడుతున్నట్లుగా వీడియోలో ఉంది.

 

ఇదిలా ఉండగా.. అంతకుముందు కూడా జైలు బ్యారక్‌ నుంచి బయటకు వచ్చి స్నేహితులతో కూర్చొని కాఫీ, సిగరెట్‌ తాగుతున్న ఫొటో ఒకటి కూడా బయటకు వచ్చింది. దీంతో, జైల్లో నిందితుడు దర్శన్‌కు వీఐపీ మర్యాదలు చేస్తున్నారని తెలుస్తోంది. ఈ క్రమంలో జైలు అధికారులపై అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇక, ఈ వ్యవహారంపై పోలీసు ఉన్నతాధికారులు రంగంలోకి దిగి.. విచారణకు ఆదేశించారు.

 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement