
విద్యార్థులతో సమావేశమైన వన్యప్రాణుల ఫొటోగ్రఫీ బెస్ట్ అవార్డు గ్రహీత మలైకవాజ్
తూర్పుగోదావరి, బాలాజీచెరువు (కాకినాడ సిటీ): మహిళలు అన్ని రంగాల్లో రాణించాలని వన్యప్రాణుల ఫొటోగ్రఫీ బెస్ట్ అవార్డు గ్రహీత మలైకవాజ్ పేర్కొన్నారు. ఆదిత్య మహిళా డిగ్రీ కళాశాలలో మంగళవారం వన్యప్రాణుల చిత్రీకరణలో సాధించిన ప్రగతి, అనుభవాలు విద్యార్థినులతో పంచుకున్నారు. విద్యతో పాటు అన్ని రంగాల్లో ముందుకెళ్లే స్వభావం ప్రతి మహిళకు కావాలని, ఏ రంగంలోనైనా తలచుకుంటే సాధించలేనిది ఏమీ లేదన్నారు. అతి చిన్న వయస్సులో అంటార్కిటిక్ ఖండాన్ని సందర్శించిన మహిళగా లిమ్కాబుక్‌లో రికార్డు సాధించిన మలైకవాజ్‌ను ఆదర్శంగా తీసుకోవాలని ఆదిత్య కళాశాలల కార్యదర్శి ఎన్.సుగుణారెడ్డి సూచించారు. కళాశాల ప్రిన్సిపాల్ కర్రి కరుణ మాట్లాడుతూ మాట్లాడుతూ క్రియ సంస్థ ద్వారా నిరక్షరాస్యత నిర్మూలన, స్త్రీ సాధికారిత వంటి కార్యక్రమాలు నిర్వహించడం ఆమె సామాజిక సేవకు నిదర్శనమన్నారు. ఈ కార్యక్రమంలో కళాశాల వైస్ ప్రిన్సిపాల్ నాగశ్రీకాంత్, ఎం.సింహాద్రి పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment