అహ్మదాబాద్: దేశమంతా ప్రస్తుతం వైల్డ్‌లైఫ్ వారోత్సవాలు జరుపుకుంటున్న సంగతి తెలిసిందే. అయితే ఈ సమయంలోనే గుజరాత్ గిర్ ఫారెస్ట్‌లో ఒక అద్భుతమైన ఘటన జరిగింది. 32 సెకన్ల నిడివి గల ఈ వీడియోను చూస్తే మీరు కూడా ఆశ్చర్యపోతారు. గిర్ ఫారెస్ట్‌లో పనిచేసే ఒక వ్యక్తి తన పనులు ముగించుకొని ఇంటికి బయలుదేరాడు. అయితే అతను వెళ్లే మార్గ మధ్యలో కొన్ని సింహాలు కూర్చొని ఉన్నాయి.
అయితే అతను ఆ సింహాలతో గుజరాతీలో మాట్లాడాడు. తాను తన పనిని ముగించుకున్నానని, ఇక ఇంటికి వెళ్లాల్సిన సమయం వచ్చిందని వాటితో చెప్పాడు.
A Gir Forest employee finds a lion on road. He tries to explain in Gujarati, the lion that he has been working whole day and requests to now kindly let him go home.And,the King of Jungle obliges...
— Prakash Javadekar (@PrakashJavdekar) October 7, 2020
A beautiful example of harmonious co-existence#wildlifeweek2020 pic.twitter.com/QptdL4bMla
తాను పని చేసి అలిసిపోయానని, తనకు వెళ్లడానికి దారినివ్వాలని వాటిని కోరాడు. అయితే ఆ తరువాత ఆ సింహాలు ఏం చేశారో చూస్తే మీరు అవాక్ అవ్వక తప్పదు. ఎందుకంటే మనుషులను చూడగానే పైకి వచ్చి చంపేసే సింహాలు అతనికి దారి నిచ్చి ఆ మార్గం నుంచి తప్పుకున్నాయి. ఇందుకు సంబంధించిన వీడియోను కేంద్ర పర్యావరణ శాఖ మంత్రి ప్రకాశ్ జవదేకర్ తన ట్విట్టర్ అకౌంట్ ద్వారా పంచుకున్నారు. ‘సామరస్యపూర్వక సహజీవనానికి అందమైన ఉదాహరణ’ ఆయన ట్వీట్ చేశారు. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
Comments
Please login to add a commentAdd a comment