prakas javadekhar
-
2021 డిజిటల్ క్యాలెండర్ ను లాంచ్ చేసిన కేంద్రం
న్యూఢిల్లీ: నేడు సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ 2021కి సంబందించిన డిజిటల్ క్యాలెండర్, డైరీని లాంచ్ చేసింది. ఢిల్లీలోని నేషనల్ మీడియా సెంటర్లో జరిగిన లాంచ్ ఈవెంట్ లో కేంద్ర మంత్రి ప్రకాష్ జవదేకర్ బటన్ క్లిక్ ద్వారా 2021డిజిటల్ క్యాలెండర్, డైరీని లాంచ్ చేసారు. గతంలో ముద్రించిన క్యాలెండర్, డైరీలను విడుదల చేసేది కేంద్ర ప్రభుత్వం. "ప్రతి సంవత్సరం 11 లక్షల క్యాలెండర్లు, 90,000 డైరీలను ముద్రించడానికి రూ.7కోట్లు ఖర్చు అయ్యేది, ప్రస్తుతం తీసుకొచ్చిన డిజిటల్ క్యాలెండర్, డైరీ యాప్ కోసం రూ.2కోట్లు ఖర్చు అయింది"అని ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో చీఫ్ కె.ఎస్ పేర్కొన్నారు.(చదవండి: సుశాంత్ ముఖం చూస్తేనే తెలిసిపోతుంది: హైకోర్టు) 2021డిజిటల్ క్యాలెండర్, డైరీ లాంచ్ సందర్భంగా జవదేకర్ మాట్లాడుతూ.. గతంలో గోడలను అలంకరించిన ప్రభుత్వ క్యాలెండర్ ఇప్పుడు మొబైల్ ఫోన్లను అలంకరిస్తుందని సంతోషం వ్యక్తం చేశారు. 'జీఓఐ క్యాలెండర్' పేరుతో ఆండ్రాయిడ్, ఆపిల్ యాప్ స్టోర్ లలో 11 భాషలలో ఉచితంగా లభిస్తుందని పేర్కొన్నారు. "ఈ యాప్ కొత్త సంవత్సరం క్యాలెండర్ యొక్క అవసరాన్ని తొలగిస్తుంది. ప్రతి నెల కొత్త థీమ్ తో పాటు ఒక సందేశాన్ని కలిగి ఉంటుంది. డైరీ ఫీచర్ కారణంగా ఈ క్యాలెండర్ ఇతర డిజిటల్ క్యాలెండర్ యాప్ లతో పోలిస్తే ఉత్తమమైనది"అని మంత్రి పేర్కొన్నారు. ఈ యాప్ బ్యూరో ఆఫ్ ఔట్ రిచ్ అండ్ కమ్యూనికేషన్, ఇన్ఫర్మేషన్ మీనిస్ట్రీచే రూపొందించబడింది. ఇది ప్రస్తుతం హిందీ మరియు ఆంగ్ల భాషలలో అందుబాటులో ఉంది. త్వరలో 11 ఇతర భారతీయ ప్రాంతీయ భాషలలో అందుబాటులో ఉండనున్నట్లు సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ తెలిపింది. -
రోడ్డుపై సింహాలు, గుజరాతీలో మాట్లాడిన వ్యక్తి
అహ్మదాబాద్: దేశమంతా ప్రస్తుతం వైల్డ్‌లైఫ్ వారోత్సవాలు జరుపుకుంటున్న సంగతి తెలిసిందే. అయితే ఈ సమయంలోనే గుజరాత్ గిర్ ఫారెస్ట్‌లో ఒక అద్భుతమైన ఘటన జరిగింది. 32 సెకన్ల నిడివి గల ఈ వీడియోను చూస్తే మీరు కూడా ఆశ్చర్యపోతారు. గిర్ ఫారెస్ట్‌లో పనిచేసే ఒక వ్యక్తి తన పనులు ముగించుకొని ఇంటికి బయలుదేరాడు. అయితే అతను వెళ్లే మార్గ మధ్యలో కొన్ని సింహాలు కూర్చొని ఉన్నాయి. అయితే అతను ఆ సింహాలతో గుజరాతీలో మాట్లాడాడు. తాను తన పనిని ముగించుకున్నానని, ఇక ఇంటికి వెళ్లాల్సిన సమయం వచ్చిందని వాటితో చెప్పాడు. A Gir Forest employee finds a lion on road. He tries to explain in Gujarati, the lion that he has been working whole day and requests to now kindly let him go home.And,the King of Jungle obliges... A beautiful example of harmonious co-existence#wildlifeweek2020 pic.twitter.com/QptdL4bMla — Prakash Javadekar (@PrakashJavdekar) October 7, 2020 తాను పని చేసి అలిసిపోయానని, తనకు వెళ్లడానికి దారినివ్వాలని వాటిని కోరాడు. అయితే ఆ తరువాత ఆ సింహాలు ఏం చేశారో చూస్తే మీరు అవాక్ అవ్వక తప్పదు. ఎందుకంటే మనుషులను చూడగానే పైకి వచ్చి చంపేసే సింహాలు అతనికి దారి నిచ్చి ఆ మార్గం నుంచి తప్పుకున్నాయి. ఇందుకు సంబంధించిన వీడియోను కేంద్ర పర్యావరణ శాఖ మంత్రి ప్రకాశ్ జవదేకర్ తన ట్విట్టర్ అకౌంట్ ద్వారా పంచుకున్నారు. ‘సామరస్యపూర్వక సహజీవనానికి అందమైన ఉదాహరణ’ ఆయన ట్వీట్ చేశారు. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. చదవండి: అందాల పోటీలో ఆంధ్రా సీతాకోకచిలుకలు -
ఐఐటీ, ఐఐఎంలతో త్వరగా అక్రిడేషన్
న్యూఢిల్లీ: ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ(ఐఐటీ), ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్(ఐఐఎం)ల సాయంతో దేశంలోని ఉన్నత విద్యాసంస్థల అక్రిడేషన్ ప్రక్రియను త్వరగా చేపడతామని మానవ వనరుల అభివృద్ధిశాఖ మంత్రి ప్రకాశ్ జవదేకర్ తెలిపారు. అక్రిడేషన్ కోసం ఏర్పాటు చేసే కొత్త కమిటీలో చేరేందుకు ముందుకురావాలని ఐఐటీ, ఐఐఎంలను కోరామన్నారు. ఇంతకాలం 15 శాతం ఉన్నత విద్యాసంస్థల్లోనే అక్రిడేషన్‌ను చేశామని ఆయన చెప్పారు. ఈ ప్రక్రియను వేగవంతం చేసేందుకు జాతీయ మదింపు, గుర్తింపు మండలి(న్యాక్), జాతీయ గుర్తింపు మండలి(ఎన్బీఏ)లను విస్తరిస్తామన్నారు. పాఠశాల విద్యార్థులు నిరక్షరాస్యులకు చదువు చెప్పేలా కొత్త పథకాన్ని తెస్తామని జవదేకర్ చెప్పారు. -
ప్రభుత్వం దృష్టికి కొత్త సమస్య
సాక్షి, ఢిల్లీ: సమగ్ర శిక్షా అభియాన్ అనే కొత్త కేంద్ర ప్రభుత్వ పథకంపై గురువారం రాజ్యసభ ప్రశ్నోత్తరాల సమయంలో అడిగిన స్టార్ ప్రశ్నకు మంత్రి ప్రకాష్ జవదేకర్ జవాబిచ్చారు. సర్వశిక్షా అభియాన్ విలీనం అంశంపై వైఎస్సార్సీపీ ఎంపీ వి.విజయసాయి రెడ్డి మాట్లాడుతూ.. సర్వశిక్షా అభియాన్, రాష్ట్రీయ మాధ్యమిక శిక్షా అభియాన్, కేంద్ర ప్రభుత్వ ఆర్థిక సాయంతో నిర్వహిస్తున్న టీచర్ ట్రైనింగ్ కార్యక్రమాలను వీలీనం చేస్తూ ప్రభుత్వం సమగ్ర శిక్షా అభియాన్ అనే కొత్త పథకాన్ని ప్రారంభించాలని నిర్ణయించుకున్నందున.. ఇప్పటి వరకు ఈ మూడు పథకాల కింద కాంట్రాక్ట్ పద్ధతిలో పని చేస్తున్న వారి భవిష్యత్తు గురించి ప్రభుత్వం ఏదైనా ప్రత్యామ్నాయం ఆలోచించిందా? వీలీనం వల్ల వారంతా ఉపాధి కోల్పోయి నిరుద్యోగులుగా మిగిలిపోకుండా ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకుంటోంది? అని ప్రశ్నించారు. దీనికి మానవ వనరుల అభివృద్ధి శాఖ మంత్రి ప్రకాష్ జవదేకర్ జవాబిస్తూ, విజయసాయి రెడ్డి కొత్త సమస్యను ప్రభుత్వం దృష్టికి తీసుకువచ్చారని, దీనిపై ప్రభుత్వం ఆలోచిస్తుందని జవాబిచ్చారు. మంత్రికి మరో ప్రశ్న వేస్తూ.. ‘కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెడుతున్న సమగ్ర శిక్షా అభియాన్ పథకం కింద ఖర్చు చేసే నిధులలో కేంద్ర ప్రభుత్వ వాటా 60 శాతం, రాష్ట్ర ప్రభుత్వ వాటా 40 శాతంగా నిర్ణయించారు. అయితే ఆంధ్రప్రదేశ్‌ను ప్రత్యేక దృష్టితో చూస్తామని, అందులో వివిధ పథకాల అమలుకోసం కేంద్రం రాష్ట్రానికి చేసే సాయంలో 90 శాతం కేంద్రం భరిస్తే, 10 శాతం మాత్రమే రాష్ట్రం భరించాల్సి ఉంటుందని ప్రధానమంత్రి, ఆర్థిక మంత్రి, హోం మంత్రి వరకు అందరూ సభలో ప్రకటించినందున సమగ్రశిక్షా అభియాన్ పథకం కింద కూడా మిగిలిన రాష్ట్రాల మాదిరలా కాకుండా ఆంధ్రప్రదేశ్‌కు 90:10 నిష్పత్తిలోనే ఆర్థిక సహాయం అందిస్తుందా’ అని విజయసాయి రెడ్డి ప్రశ్నించారు. దీనికి మంత్రి జవదేకర్ సూటిగా సమాధానం చెప్పకుండా గతంలో ఏవిధంగా ఈ పథకానికి కేంద్రం సాయం చేస్తున్నదో అలాగే కొనసాగుతుందని చెప్పారు. -
స్వచ్ఛభారత్‌లో పాల్గొన్న జవదేకర్
యాదాద్రి: యాదాద్రిలోని ఆర్టీసీ బస్టాండ్‌లో శనివారం ఉదయం జరిగిన స్వచ్ఛభారత్ కార్యక్రమంలో కేంద్ర మంత్రి ప్రకాశ్ జవదేకర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన బస్డాండ్‌లో చెత్తాచెదారాన్ని తొలగించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ స్వచ్ఛభారత్ కార్యక్రమంలో అందరూ భాగస్వాములు కావాలని విజ్ఞప్తి చేశారు. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెడుతున్న సంక్షేమ పథకాలను ఉపయోగించుకుని లబ్ధిపొందాలని ఆయన కోరారు. యాదాద్రిలో జవదేకర్ ప్రత్యేక పూజలు యాదాద్రిలో కేంద్రమంత్రి ప్రకాశ్ జావదేకర్ శనివారం ఉదయం ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఆలయ అభివృద్ధి పనులను పరిశీలించారు. రాష్ట్ర ప్రభుత్వం యాదాద్రిని గొప్పగా అభివృద్ధి చేస్తోందన్నారు. ఈ పర్యటనలో ఆయనతో పాటు భాజపా నేత లక్ష్మణ్ కూడా పాల్గొన్నారు