స‍్వచ‍్ఛభారత్‌లో పాల్గొన‍్న జవదేకర్
Published Sat, Apr 8 2017 1:12 PM | Last Updated on Tue, Sep 5 2017 8:17 AM
యాదాద్రి: యాదాద్రిలోని ఆర్టీసీ బస్టాండ్‌లో శనివారం ఉదయం జరిగిన స‍్వచ‍్ఛభారత్ కార‍్యక్రమంలో కేంద్ర మంత్రి ప్రకాశ్ జవదేకర్ పాల్గొన‍్నారు. ఈ సందర‍్భంగా ఆయన బస్డాండ్‌లో చెత్తాచెదారాన్ని తొలగించారు. ఈ సందర‍్బంగా ఆయన మాట్లాడుతూ స‍్వచ‍్ఛభారత్ కార‍్యక్రమంలో అందరూ భాగస్వాములు కావాలని విజ‍్ఞప్తి చేశారు. కేంద్ర ప్రభుత‍్వం ప్రవేశపెడుతున‍్న సంక్షేమ పథకాలను ఉపయోగించుకుని లబ్ధిపొందాలని ఆయన కోరారు.
యాదాద్రిలో జవదేకర్ ప్రత్యేక పూజలు
యాదాద్రిలో కేంద్రమంత్రి ప్రకాశ్ జావదేకర్ శనివారం ఉదయం ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఆలయ అభివృద్ధి పనులను పరిశీలించారు. రాష్ట్ర ప్రభుత్వం యాదాద్రిని గొప్పగా అభివృద్ధి చేస్తోందన్నారు. ఈ పర్యటనలో ఆయనతో పాటు భాజపా నేత లక్ష్మణ్ కూడా పాల్గొన్నారు
Advertisement
Advertisement