
జింకను వేటాడాలంటే పులి ఎంత ఓపిగ్గా ఉంటది...అట్టాంటిది పులినే వేటాడాలంటే మనమింకెంత ఓపిగ్గా ఉండాలి...ఇది సినిమా డైలాగ్ అని అందరికి తెలిసిందే. ఇలా జంతువులు వేటాడుకోవడం మనం కళ్లారా చూడకపోయినా...నేషనల్ బయోగ్రఫి చానెల్‌లో ఇలాంటివే చూస్తుంటాం. అయితే వాటిని తమ కెమెరాలో బంధించడానికి వారు ఎంతో ఓపిగ్గా ప్రయత్నిస్తుంటారు.
వైల్డ్‌లైఫ్ ఫోటోగ్రఫి చేయడం మాములు విషయం కాదు. జంతుప్రేమికులు మాత్రమే ఇలాంటివి చేయగలరు. ఇప్పుడు అలాంటి వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. మనం పాములను చూస్తేనే ఆమడ దూరం పరిగెత్తుతాం. అందులోనూ విషపూరితమైనవైతే ఇక చెప్పనక్కర్లేదు. కానీ ఈ వీడియోలో ఉన్న నారింజ రంగు పాము ఏమాత్రం చప్పుడు చేయకుండా నీళ్లు తాగుతున్న తీరు చూస్తే.. ఎవరికైనా ముచ్చటేస్తుంది. గప్‌చుప్‌గా నీళ్లు తాగుతున్న ఈ పాము వీడియోను చూసి నెటిజన్లు ఫిదా అయిపోతున్నారు. నేను చూసిన పాముల్లోకెల్లా ఇదే అందమైన పాము అని కామెంట్ కూడా చేస్తున్నారు. ఇప్పుడు ఈ వీడియో లైక్స్, షేర్‌లతో సోషల్‌మీడియాలో హల్‌చల్‌గా మారింది.
Comments
Please login to add a commentAdd a comment