గరీభ్‌రథ్‌ రైలులో పాము.. ప్రయాణీకులు పరుగు.. | Snake In Jabalpur To Mumbai Garib Rath Express Train AC Coach, Watch Video Goes Viral On Social Media | Sakshi
Sakshi News home page

Snake In Garib Rath Train: గరీభ్‌రథ్‌ రైలులో పాము.. ప్రయాణీకులు పరుగు..

Published Mon, Sep 23 2024 7:55 AM | Last Updated on Mon, Sep 23 2024 10:29 AM

Snake In Jabalpur-Mumbai Garib Rath Express train AC Coach

సాక్షి, ముంబై: ప్రయాణంలో రైలులో పాము ప్రత్యక్షం కావడం ప్రయాణీకులకు భయాందోళనకు గురిచేసింది. గరీభ్‌రథ్‌ ఎక్స్‌‍ప్రెస్‌ రైలులో పాము కనిపించడంతో ప్రయాణీకులు పరుగులు తీశారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్‌ మీడియాలో చక్కర్లు కొడుతోంది.

వివరాల ప్రకారం.. మధ్యప్రదేశ్‌లోని జబల్‌పూర్‌ నుంచి గరీభ్‌రథ్‌ ఎక్స్‌‍ప్రెస్‌(12187) రైలు ముంబైకి బయలుదేరింది. రైలు నడుస్తుండగానే మార్గ మద్యంలో కాసర రైల్వే స్టేషన్‌ వద్ద ఏసీ కోచ్‌ జీ-17లో పాము కనిపించింది. రైలు కోచ్‌లో అప్పర్‌ బెర్త్‌ హ్యాండిల్‌కు చుట్టుకొని కాసేపు అలాగే ఉంది. ఒక్కసారిగా పామును చూసి భయపడిన ప్రయాణీకులు వేరే కోచ్‌లోకి పరుగులు తీశారు. ఈ క్రమంలో కోచ్‌ డోర్లు మూసివేశారు.

కాసర రైల్వే స్టేషన్‌కు రైలు చేరుకోగానే.. ప్రయాణీకులు రైల్వే అధికారులకు సమాచారం అందించారు. అనంతరం, స్నేక్‌ క్యాచర్స్‌ టీమ్‌ వచ్చి పామును పట్టుకున్నారు. ఈ ఘటనలో ఎవరికీ ఏ ప్రమాదం జరగకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. ఇక, దీనికి సంబంధించిన వీడియో సోషల్‌ మీడియాలో చక్కర్లు కొడుతోంది. 

 ఇది కూడా చదవండి: పని ఒత్తిడితో సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగి ఆత్మహత్య!

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement