వన్యప్రాణుల సంరక్షణకు చర్యలు
Published Thu, Oct 13 2016 11:59 PM | Last Updated on Mon, Sep 4 2017 5:05 PM
మిడుతూరు: వన్యప్రాణుల సంరక్షణకు చర్యలు తీసుకున్నట్లు టైగర్ ప్రాజెక్టు ఫీల్డ్ డైరెక్టర్ శరవణన్ అన్నారు. గురువారం ఆయన రోళ్లపాడు అభయారణ్యాన్ని తనిఖీ చేశారు. అనంతరం విలేకరులతో మాట్లాడుతూ అడవిలో సంచరించే కృష్ణజింకలు, తోడేలు, గుంటనక్కలు, వివిధ రకాల పక్షులు వాటి సంరక్షణకు పరిసర ప్రాంతాల ప్రజలు సహకరించాలన్నారు. బట్టమేక పక్షి అభయారణ్య పరిధిలో కాకుండా గ్రామాల పరిసర ప్రాంతాల్లో సంచరిస్తుందా అనే విషయంపై ఆరా తీయాలని డీఆర్వో రంగన్నను ఆదేశించారు. అభయారణ్యం విశిష్టతపై పరిసర ప్రాంత ప్రజలకు అవగాహన కల్పించాల్సిన అవసరం ఽఉందన్నారు. ఆయన వెంట ఐఎఫ్‌ఎస్ ట్రైనీ కల్పన, ఎఫ్‌బీవో జహరున్నీసా బేగం, బర్డ్ వాచర్స్ గపూర్, ఆదిశేషయ్య, వాసు పాల్గొన్నారు.
Advertisement
Advertisement