సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని పాఠశాలలకు ఒంటిపూట బడులను మార్చి మొదటి వారం నుంచే ప్రారంభించాలని విద్యాశాఖ భావిస్తోంది. వేసవి ఎండల తీవ్రత దృష్ట్యా ప్రభుత్వంతో చర్చించి నిర్ణయం తీసుకోవాలనుకుంటోంది. గతేడాది మార్చి రెండో వారంలో ఒంటిపూట బడులను ప్రారంభించిన విద్యాశాఖ ఈసారి ఎండల తీవ్రత పెరుగుతున్న నేపథ్యంలో వారం ముందే ఈ దిశగా కసరత్తు చేస్తోంది. మరోవైపు అకడమిక్ కేలండర్‌లో నిర్ణయించిన ప్రకారం ఏప్రిల్ 12వ తేదీని పాఠశాలలకు చివరి పనిదినంగా అమలు చేయనుంది. ఏప్రిల్ 13 నుంచి మే 31 వరకు పాఠశాలలకు వేసవి సెలవులుగా ప్రకటించింది. జూన్ 1 (కొత్త విద్యా సంవత్సరం) నుంచి తిరిగి పాఠశాలలు ప్రారంభం కానున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment