
సాక్షి అమరావతి: రాష్ట్రంలో పాఠశాలల ఒంటిపూట పనిదినాలు మరో వారం రోజులు పొడిగించారు. వేసవి ఉష్ణోగ్రతల తీవ్రత వల్ల వేడి గాలులు ఇంకా వీస్తుండటంతో ఒంటిపూట బడులను ఈ నెల 22 వరకు పొడిగిస్తున్నట్లు పాఠశాల విద్యాశాఖ ఉత్తర్వులు జారీ చేసింది.
ఈనెల 12 నుంచి పాఠశాలలు తెరిచినప్పటికీ ఎండ తీవ్రత కారణంగా 15వ తేదీ వరకు ఒంటిపూట బడులు పెట్టిన సంగతి తెలిసిందే. అయితే ఉష్ణోగ్రతల తీవ్రత ఇంకా కొనసాగుతున్న నేపథ్యంలో ఒంటిపూట బడులను 22వ తేదీవరకు పొడిగిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసింది.